కాజీపేట రూరల్ : కాజీపేట ప్రజల చిరకాల స్వప్నమైన బస్టాండ్ నిర్మాణానికి అధికారికంగా స్థలం కేటాయించగానే శంకుస్థాపన చేయనున్నారు. ఏప్రిల్‌లో ఫాతిమానగర్ బ్రిడ్జి ప్రారంభంతోపాటు కాజీపేట బస్టాండ్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీఓ రమేశ్ రాథోడ్, సికింద్రాబాద్ రైల్వే ఏడీఆర్ఎం గోపాల్, తహసీల్దార్ భావుసింగ్ ఇతర విభాగాల అధికారులతో కలిసి కాజీపేట జంక్షన్ ఎదుట కలియతిరిగారు. నిరుపయోగంగా ఉన్న రైల్వే మిక్స్డ్ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించి అక్కడే బస్టాండ్ స్థలాన్ని నిర్ణయించారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ను రెండో రాజధానిగా చేసేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కోచ్‌ప్యాక్టరీ, అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద అభివృద్ధి జరుగుతుందని వివరించారు.
ఎంపీ కడియం కావ్య,
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment