చట్టాలపై అవగాహన ఉండాలి
కమలాపూర్ : చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే సూచించారు. కమలాపూర్‌లోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో జాతీయ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ న్యాయ సేవల యూనిట్ అవగాహన కార్యక్రమంలో క్షమా దేశ్‌పాండే మాట్లాడారు. ఈ సందర్భంగా చట్టపరమైన హక్కులు, వివిధ చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి.సౌజన్య, ఉపాధ్యాయులు, పీటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే
Comments
Please login to add a commentAdd a comment