జనసేన, టీడీపీకి రాంరాం | Sakshi
Sakshi News home page

జనసేన, టీడీపీకి రాంరాం

Published Wed, May 8 2024 4:45 AM

జనసేన

వైఎస్సార్‌ సీపీలో చేరిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు

పెనుగొండ : ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన శెట్టిబలిజ నాయకులు మంగళవారం తూర్పుపాలెంలోని కార్యాలయంలో ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో టీడీపీకి చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి సీఎం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కంచి భాస్కరరావు, కంచి మాచిరాజు, కడలి రామారావు, కంది కొండయ్య, బొర్రా వెంకటేశ్వర్లు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జనసేన, టీడీపీ నాయకుల చేరిక

యలమంచిలి : నారినమెరక గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకుడు ఆరేపల్లి జగదీష్‌ (రాఖీ) ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు గుణ్ణం నాగబాబు వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన నచ్చడం వలనే అనేక మంది తెలుగుదేశం, జనసేన నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారంతా పాలకొల్లు ఎమ్మెల్యేగా గుడాల శ్రీహరి గోపాలరావు, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇసుకపల్లి శ్రీధర్‌వర్మ, పార్టీ నాయకులు వలవల బాలాజీ, వలవల సత్యధర్మారావు, వడ్డి వసంతం తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇర్రింకి గెద్దయ్య, రాచమళ్ల నాగేశ్వరరావు, తాడి సురేష్‌, దీపాటి భాను, లింగాల వెంకటరమణ, దిడ్ల సూర్యతేజ, వల్లూరి సన్నిబాబు, తరపట్ల వేణు, పంతకాని వరప్రసాద్‌, బొడ్డుపల్లి నితిన్‌, బందుల ప్రవీణ్‌ (కన్న), తరపట్ల చిట్టిబాబు, పెదపాటి ప్రవీణ్‌, వడ్డి బాలాజీ, బొర్రా రవి, వడ్డి బాబ్జి ఉన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన

30 కుటుంబాలు

నూజివీడు : ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని ఎమ్మెల్యే, నూజివీడు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) కోరారు. మండలంలోని అన్నవరానికి చెందిన యాదవ సామాజిక వర్గం యువతతో పాటు 30 కుటుంబాలు చంటినాయన ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికి చంటినాయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమన్నారు. 30కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం చేయడమే కాకుండా రాష్ట్రం 30ఏళ్లు వెనక్కు వెళ్తుందన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గుర్తుగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదన్నారు. ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడం, తన వర్గం వారికి దోచిపెట్టడమే చంద్రబాబు పాలన సాగుతుందన్నారు. గతంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఇప్పుడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. చంద్రబాబు చెప్పేవి సూపర్‌సిక్స్‌ కాదని, ఆరు మోసాలని వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.2లక్షల కోట్లు అవసరమని, కాబట్టి చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయరన్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అఽభ్యర్థులైన మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌లను గెలిపించాలని కోరారు.

జనసేన, టీడీపీకి రాంరాం
1/1

జనసేన, టీడీపీకి రాంరాం

Advertisement
 
Advertisement
 
Advertisement