వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం

Published Wed, May 8 2024 4:45 AM

వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం

పెనుగొండ: ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయమని, రోజురోజుకూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో అభిమానం పెరుగుతుందని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం పెనుగొండ డాక్టర్‌ వైఎస్సార్‌ కూడలి నుంచి, కంచికామాక్షీ ఆలయం, గాంధీ బొమ్మల సెంటర్‌, రాజీవ్‌ సెంటర్‌, బీసీ కమ్యూనిటీ హాల్‌, సిద్ధాంతం రోడ్డు, దుర్గమ్మ ఆలయం కోటిపల్లి వారి వీఽధి, శ్రీరామ్‌ నగర్‌, జవ్వాది వారి వీధి, వేండ్రవారివీఽధిలో ఎన్నికల శంఖారావం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు విజయానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు వరకూ సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంకగా మారిపోతుందంటూ చంద్రబాబు, వారి దత్తపుత్రుడు ప్రచారం చేశారని, అయితే నేడు వారి మేనిఫెస్టోలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే కొత్త పథకాలుగా ప్రకటించి మరింత మెరుగ్గా చేస్తామనడం ప్రజల మభ్యపెట్టడమేనని ప్రజలు గ్రహించారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగింపునకు సీఎం వైఎస్‌ జగన్‌కు అండగా ఉండడానికి రెండు ఓట్లూ ఫ్యాన్‌ గుర్తుపైనే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పెనుగొండలో జోరు వర్షంలో ప్రచారం నిర్వహించగా, ప్రజలు శ్రీరంగనాథరాజుకు పూలవర్షం కురిపించారు. వర్షంలోనే నాయకులు, కార్యకర్తలు ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరక్టరు కూనపరెడ్డి లక్ష్మయ్యనాయుడు (నానాజీ), ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), జెడ్పీటీసీ పోడూరి గోవర్దన రామయ్య, ఉప సర్పంచ్‌ ఆకిశెట్టి వరలక్ష్మీ చంటి, ఎంపీటీసీలు మద్దింశెట్టి లక్ష్మీ, తాడి సుబ్బిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎన్నికల పరిశీలకుడు దిరిశాల శ్రీనివాస్‌, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, పలివెల శ్రీను, బాలం సత్తిరాజు, సుంకర నాగబాబులు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తానేటి మల్లి, పార్టీ నాయకులు నూలి తాతాజీ, గ్రంధి లక్ష్మీనారాయణ, నౌడు దుర్గారావు, తానేటి రాంబాబు, చెవ్వేటి రాజు, తిక్కిరెడ్డి పవన్‌, పాలసత్తిరామిరెడ్డి, చరణ్‌ రెడ్డి, మేడపాటి వీర్రేడ్డి, కుడిపూడి సత్యనారాయణ, నరేంద్ర, బోణం సుబ్రమ్మణ్యం, కాపిశెట్టి మణికంఠ, రాజేష్‌ నాయుడు, నాగిశెట్టి నరసింహరావు పాల్గొన్నారు.

పెనుగొండ ప్రచారంలో ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

Advertisement
 
Advertisement
 
Advertisement