చంద్రబాబు వల్లే అన్యాయం | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వల్లే అన్యాయం

Published Wed, May 8 2024 4:45 AM

చంద్రబాబు వల్లే అన్యాయం

ఇరగవరం: సజావుగా అందుతున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు దుర్మార్గంతో అడ్డుకోవడంతో అవ్వాతాతలకు అన్యాయం జరిగిందని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రేలంగిలో మంగళవారం జోరు వర్షంలోనూ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్‌ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతంరం ఇరగవరం, అర్జునుడుపాలెం, ఓగిడి గ్రామాల్లో పలు సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ ప్రజలకు నష్టం తప్ప మంచి చేద్దాం అనే ఉద్దేశం లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏనాడు మంచి చేసింది లేదని, చంద్రబాబు చెప్పాడంటే చేయడని, అదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పాడంటే చేస్తాడని, చెప్పనివి కూడా చేసే మంచి గుణం వైఎస్‌ జగన్‌ది అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ ఓటు బ్యాలెట్‌లో 1లో, ఏమ్మెల్యేగా తనది బ్యాలెట్‌లో 4వ నంబర్‌లో ఉంటుందని, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యులు పంపన అంజిబాబు, ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, డీసీఎంఏస్‌ డైరెక్టర్‌ పెన్మెత్స సుబ్బరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గా ప్రసాద్‌, నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, చోడే జోషి, కొత్తపాడు, కె.ఇల్లిందలపర్రు, సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స రామభద్రరాజు, మల్లిరెడ్డి నాగార్జున, మహిళ అధ్యక్షురాలు మెట్ల కిరణ్మయి, నాయకులు పులుపు అనిల్‌, పులుపు సునీల్‌, వడ్డే మార్కండేయులు, చేబ్రోలు పెద్దిరాజు, ఘంటా అప్పారావు పాల్గొన్నారు.

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

Advertisement
 
Advertisement
 
Advertisement