● ఖరీదైన వ్యాధికి ఆరోగ్యశ్రీలో రూ.80 వేలే
ఇది ఖరీదైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారికి గ్లోబులిన్ ఇంజెక్షన్‌లు మోతాదు ప్రకారం వాడాలి. ఒక గ్రాము ధర రూ.12 వేల వరకు ఉంటుంది. ఒక రోజుకు 4–5 గ్రాముల ఇంజెక్షన్ ఇవ్వా ల్సి వుంటుంది. అత్యవసరమైన వారికి ప్లాస్మాపెరోసిస్ చికిత్సను అందించాలి. ఈ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది. కాగా ఆరోగ్యశ్రీలో మాత్రం ఈ వ్యాధికి రూ.80 వేల వరకు మాత్రమే ప్యాకేజీ ఉంది. పేదలు ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స పొందాలంటే కష్టతరం అవుతుంది. గత పాలనలో కరోనాను ఆరోగ్యశ్రీ కిందికి చేర్చి ఉచితంగా వైద్య చికిత్సను అందించా రు. తాజాగా ఈ ‘జీబీఎస్’ వ్యాధికి ఆరో గ్యశ్రీ కింద ప్యాకేజీని పెంచాల్సిన అవ సరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment