కొనసాగుతున్న పశువైద్య విద్యార్థుల నిరసన
ప్రొద్దుటూరు రూరల్ : మండల పరిధి గోపవరం గ్రామ సమీపంలోని పశువైద్య కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన దీక్షలు 28 రోజుకు చేరాయి. వారు ఆదివారం మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు స్టైఫండ్ పెంచాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు దీక్షలను ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న రూ.7 వేల స్టైఫండ్ ప్రస్తుతం పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ పెంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment