
గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మిరప, పప్పుశనగ, కందులను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ కోరారు. సోమవారం నగరంలోని హోచిమన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండుమిరప, పప్పు శనగ, కందులు పండించిన రైతులు కల్తీ, నకిలీ విత్తనాల వలన, చీడ, పీడల వలన సరైన దిగుబడులు రాక, చేతికొచ్చిన అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిరప క్వింటాల్ రూ. 11వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని, దిగుబడులు తగ్గిపోవడం వలన క్వింటాల్ రూ. 20వేలకు తక్కువ కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి, నాయకుడు పకీరప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment