
ట్రాప్ కెమెరాల్లో కనిపించని చిరుత జాడలు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఫిబ్రవరి నెలలో చిరుతల అడుగు జాడలు, చిరుతల పిల్లలు కనిపించాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేసిన విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు గతనెల 15వ తేదీ నుంచి నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె, బ్రాహ్మణపల్లె, లింగాల మండలం ఇప్పట్ల, కామసముద్రం, రామాపురం గ్రామాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గోపాలకృష్ణ, శ్రీనివాస నాయుడు, మహబూబ్ బాషాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ట్రాప్ కెమెరాలలో చిరుత అడుగు జాడలు, చిరుత పిల్లలు ఏవైనా కనిపించాయా అని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలలో ఎక్కడే గాని చిరుతలు, వాటి పిల్లల అడుగులు కనిపించడం లేదన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చిరుతలు చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండవచ్చంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment