
అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు
కడప అర్బన్ : ఓ వ్యక్తి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరి, అక్కడి నుంచి పరారైన రెండు నెలలకు శవమై కనిపించాడు. ఈ సంఘటనపై కడప రిమ్స్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ కలమల్లలోని ఆర్‌టీపీపీలో ఉద్యోగం చేస్తున్న బాలాంజనేయులు (54) తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని కుమారుడు రాజశేఖర్, తన కుటుంబ సభ్యులతో కలిసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ జనవరి 6న భోజనానికి వెళ్లి వస్తానని చెప్పి పరాయ్యాడు. అన్ని చోట్ల వెతికిన కుమారుడు, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న రిమ్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. జ్యోతి కెమికల్స్ సమీపంలోని ఓ గుంతలో గుర్తు తెలియని శవం ఉందని స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలాంజనేయులు ధరించిన దుస్తులను గమనించి ఆయన తన తండ్రేనని కుమారుడు రాజశేఖర్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించనున్నారు.
రిటర్న్ మస్టర్ ఎత్తివేయాలి
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్న రిటర్న్ మస్టర్ విధానాన్ని ఎత్తివేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షుడు కె. తిరుపాల్ మాట్లడుతూ కడప నగరంలో మున్సిపల్ కార్మికులు ఉదయం 5గంటలకే మస్టర్‌కు రావాలనే నిబంధన విధించారన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే కార్మికులు తెల్లవారుజామున 3గంటలకు నిద్రలేచి రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. మహిళలు కాలువలో తీసిన పూడిక తడిగా ఉన్నప్పుడే ఎత్తాలంటే సాధ్యం కావడం లేదన్నారు. రిటర్న్ మస్టర్ విధానం రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోగానీ, కార్పొరేషన్లలోగానీ లేదన్నారు. ఈమేరకు వారు కమిషనర్ మనోజ్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. శ్రీరామ్, నగర సహాయ కార్యదర్శి ఇ. ప్రకాష్ , డ్రైవర్ల కమిటీ కార్యదర్శి ఎస్. కిరణ్, నాగరాజు, పెంచలమ్మ ఆరోగ్యమ్మ, హేమలత, రమాదేవి, ఆదాము పాల్గొన్నారు.
వక్ఫ్ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2024 వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, ఆప్‌కీ వాజ్ రాష్ట్ర కార్యదర్శి మగ్బూల్ బాషా డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ఇందిరమ్మ సర్కిల్‌లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ గౌస్ పీర్ చేపట్టిన 36 గంటల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. వక్ఫ్ ఆస్తులను ఉపయోగిస్తున్న వారి విషయంలో జోక్యం చేసుకోకూడదనడం ఆక్రమణదారులకు రక్షణ కల్పించడమే తప్ప మరొకటి కాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష నాయకులు పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు

అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు
Comments
Please login to add a commentAdd a comment