ప్రజలను బురిడీ కొట్టించిన బడ్జెట్
కమలాపురం : ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన 2025–26 బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, బడ్జెట్‌లో గారడీలు, పేరడీలు చేసి ప్రజలను బురిడీ కొట్టించారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందంటారు? ఇప్పటికే రూ.లక్ష కోట్లు అప్పు చేశారు, ఇది ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు. రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో 25 శాతం ద్రవ్యలోటు అంటే 80వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో రూ.14వేల కోట్లు ప్రజలపై భారం మోపుతామని అసెంబ్లీలోనే మంత్రి చెప్పారని, దీంతో ప్రజలకు వాతలు తప్పవన్నారు. మరో రూ.12వేల కోట్లు ప్రభుత్వ స్థలాల ద్వారా అప్పు తెస్తారంటా? ఇది ఎలా చేస్తారో మరి? అని అన్నారు. మిగిలిన రూ. 54వేల కోట్లు కేంద్రం నుంచి తెస్తామంటున్నారని, కేంద్ర బడ్జెట్ ఎప్పుడో పూర్తి అయిందని, ఆ బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులే లేవన్నారు. ఇదంతా చూస్తుంటే ఈ బడ్జెట్ చాలీ చాలనీ బడ్జెట్ అని, అసంపూర్తి బడ్జెట్ అని, ప్రజలను మోసం చేసేదానికే ఈ బడ్జెట్ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ఉచిత బస్సు ప్రయాణం, 18ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 అన్నారు. ఒక్క పథకానికి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. జగనన్న సంక్షేమాన్ని ఇంట్లో బంధించాడు.. అభివృద్ధిని గుమ్మం బైట ఉంచాడన్నారు. మరి చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం అంధకారమే అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, గంగాధర్ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, మహ్మద్ సాదిక్, ఇస్మాయిల్, చెన్నకేశవరెడ్డి, మోహన్‌రెడ్డి, కొండారెడ్డి,జగన్‌మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి,మోనార్క్,మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
నరేన్ రామాంజులరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment