ట్రిపుల్ ఐటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల ధర్నా
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలకు మినిమం టైం పే స్కేల్ అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సోమవారం కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని అకడమిక్ బ్లాక్ వద్ద గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు ధర్నా చేశారు. ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ ధర్నా జరిగే ప్రాంతానికి చేరుకుని ధర్నా విరమించాలని ఉద్యోగులను కోరారు. అలాగే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్‌లు కూడా అకడమిక్ బ్లాక్ వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకుండా భీష్మించుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 110 ని ఆర్జీయూకేటీ అధికారులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గౌరవించకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు ఆర్జీయూకేటీ అధికారులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2018లో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులుగా ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44 మంది పని చేస్తున్నారని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక రూపాయి కూడా జీతం పెంచలేదన్నారు. తప్పుడు సమాచారం తీసుకుని తమ వెనుక వచ్చిన ఉద్యోగులకు జీతాలు పెంచారన్నారు. అనంతరం ఆర్కే వ్యాలీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షు డు నజీర్ బాషా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment