బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
కడప సెవెన్‌రోడ్స్ : బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరమని, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశం దూరం చేస్తాయని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడారు. అనంతరం జేసీ బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ శ్రీలక్ష్మి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్
Comments
Please login to add a commentAdd a comment