మాసూమ్ రోజేదార్.!
మదనపల్లె సిటీ : రంజాన్ మాసం ముస్లింలకు పరమ పవిత్ర మాసం. ఇస్లాం కాలమానంలోని 9వ నెల రంజాన్. ఈ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు ఎంతో నిష్టతో ఉపవాసదీక్షలు చేపడతారు. ఇందులో భాగంగా వేకువ జామున 4 గంటల సమయంలో అల్పాహారాన్ని స్వీకరిస్తారు. దీనిని ‘సహరీ’ అంటారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 వరకు ఎలాంటి ఆహార పానీయాలు సేవించకుండా ఉపవాసదీక్షను చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు ఖర్జూరంతో ఉపవాసదీక్షలు విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు. పెద్దలపై మాత్రమే ఉపవాసదీక్షలు విధిగా ఉండాలన్న నిబంధన ఉంది. మదనపల్లె పట్టణంలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలోపు చిన్నారులు కూడా ఉపవాసదీక్షను చేపడుతున్నారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ వారి దైవభక్తిని మెచ్చుకొని ‘మాసూమ్ రోజేదార్’(ఉపవాసం ఉన్న అమాయక బాలలు) అని అంటున్నారు. ఇలాంటి పలువురు చిన్నారులు ‘సాక్షి’కి కనిపించారు. వారిని పలకరిస్తే ఉపవాసదీక్షలను పాటించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఉపవాసదీక్ష చేపడుతున్న చిన్నారులు
మాసూమ్ రోజేదార్.!
Comments
Please login to add a commentAdd a comment