● బ్రహ్మంసాగర్
కడప సెవెన్‌రోడ్స్: గ్రామీణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని ఐదు ప్రధాన జలాశయాల నుంచి తాగునీటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. ఈ మల్టీ విలేజెస్ స్కీమ్‌కు సంబంధించి సవరించిన డిటైల్డ్ ప్రొజెక్టు రిపోర్టును ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జల జీవన్ మిషన్ కింద గ్రాంటు మంజూరై పనులు పూర్తయితే గ్రామీణ తాగునీటి కష్టాలు తప్పినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
● ఏటా వేసవిలో గ్రామీణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సీపీడబ్ల్యూఎస్ లాంటి పలు పథకాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లోనే సమస్యలు తప్పడం లేదు. ఇక వర్షాలు లేక తీవ్ర కరువులు జిల్లాను చుట్టుముట్టిన సందర్భాల్లో పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు,పశువులు అలమటించాల్సిన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం, బోర్ల డీపెనింగ్, మరమ్మతులు, వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టడం సర్వసాధారణంగా ఉంటోంది. మండల, జిల్లా పరిషత్, జిల్లా సమీక్షా కమిటీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భాలు లేకపోలేదు.
వైఎస్ జగన్ హయాంలోనే..
కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భావించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అటకెక్కిన వాటర్ గ్రిడ్ దుమ్ముదులిపి గ్రామీణ ప్రజలకు శుద్ధి జలం అందించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సైతం ఆయన సమావేశమై నిధుల సమీకరణకు కృషి చేశారు. తాజాగా ఆ పథకం కార్యరూపం దాల్చనుంది. ఈ పథకం పూర్తిగా విజయవంతమైతే జిల్లాలో గ్రామీణ తాగునీటి సమస్య దాదాపు పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు.
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు..
జిల్లాలోని 1587 గ్రామాల్లో ఉన్న 10,27,048 మంది జనాభాకు 0.9453 టీఎంసీల తాగునీటిని సరఫరా చేసేందుకు 2785 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా ఈ మల్టీ విలేజ్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద గ్రాంటు విడుదల చేయాలని అధికార యంత్రాంగం తమ ప్రతిపాదనల్లో కోరింది.
● మండలాలు: కాశినాయన, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు,
● గ్రామాలు: 470
● ప్రజలు: 2,60,076 మంది
● గ్రాస్ కెపాసిటీ: 17.74 టీఎంసీ
● సరఫరా చేయాల్సింది: 0.2961 టీఎంసీ
● నిధులు: రూ.661 కోట్లు
● సోమశిల
● మైలవరం
● మండలాలు: పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, ప్రొద్దుటూరు, రాజుపాలెం
● గ్రామాలు: 173
● ప్రజలు: 2,42,438 మంది
● గ్రాస్ కెపాసిటీ: 9.98 టీఎంసీ
● సరఫరా చేయాల్సింది: 0.1756 టీఎంసీ
● నిధులు: రూ.381 కోట్లు
● మండలాలు: గోపవరం, బద్వేలు, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట
● గ్రామాలు: 347
● ప్రజలు: 1,20,330 మంది
● గ్రాస్ కెపాసిటీ: 78 టీఎంసీ
● సరఫరా చేయాల్సింది: 0.0761 టీఎంసీ
● నిధులు: రూ.755 కోట్లు
● మండలాలు: దువ్వూరు, చాపాడు, ప్రొద్దుటూరు, రాజుపాలెం
● గ్రామాలు: 107
● ప్రజలు: 95,300 మంది
● గ్రాస్ కెపాసిటీ: 2.13 టీఎంసీ
● సరఫరా చేయాల్సింది: 0.0892 టీఎంసీ
● నిధులు: రూ.245 కోట్లు
గండికోట రిజర్వాయర్
టీజీ సబ్సిడరీ రిజర్వాయర్
వాటర్‌గ్రిడ్‌తో నీటి కష్టాలకు చెక్
ప్రధాన జలాశయాల ద్వారా నీటి సరఫరా
1587 గ్రామాలకు రక్షిత నీరు
జేజేఎం గ్రాంటు కింద రూ. 2785 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు
● బ్రహ్మంసాగర్
● బ్రహ్మంసాగర్
● బ్రహ్మంసాగర్
● బ్రహ్మంసాగర్
● బ్రహ్మంసాగర్
● బ్రహ్మంసాగర్
Comments
Please login to add a commentAdd a comment