నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం శిక్షణ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, కొవ్వొత్తుల తయారీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు శిక్షణలో ప్రాధాన్యతనిస్తామన్నారు. అభ్యర్థులు 18–45 ఏళ్లలోపుకలిగి ఉండాలని, ఈనెల 8వ తేదిలోగా తమను సంప్రదించాలని పేర్కొన్నారు. వివరాలకు 94409 05478, 99856 06866 నెంబరల్లో సంప్రదించాలని సూచించారు.
10న జోన్–4 సమావేశం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ పీటీడీ జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న కడప జోన్–4 సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి కిరణ్, బుజ్జి వెల్లడించారు. మంగళవారం కడప నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ పైడి చంద్రశేఖర్‌రావును కలిసి ఈ మేరకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, సమావేశానికి ఈడీని, డీపీటీఓను, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆహ్వానించామన్నారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుధాకర్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నారు.
రేపు కడపలో జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు తమ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇన్‌ఛార్జి డోనప్ప తెలిపారు. కలెక్టరేట్‌లోని ఓ బ్లాక్‌లో ఉన్న జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు టెక్నో డోమ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఛానల్ ప్లే లిమిటెడ్ సంస్థలు హాజరవుతాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీలో అసెంబ్లీ లైన్ ఆపరేటర్, సేల్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర ఉద్యోగాలకు 5వ తరగతి, టెన్త్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివినవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ. 10–32 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
లైన్‌మెన్ల సేవలు ఎనలేనివి
పులివెందుల రూరల్: విధి నిర్వహణలో లైన్‌మెన్ల సేవలు మరువలేనివని విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమణ పేర్కొన్నారు. జాతీయ లైన్‌మెన్ దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని స్థానిక విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సంస్థకు అత్యున్నత సేవలు అందించిన పులివెందుల వెస్ట్, టౌన్‌లో పనిచేస్తున్న లైన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, లైన్‌మెన్ అంజిలకు ఉత్తమ ప్రతిభా అవార్డులను అందజేశారు.డివిజన్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డి, ఏడీఈలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
లింగాల: లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సత్యవతమ్మ తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యాలయాల్లో ప్రత్యేకంగా పేద, నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను తమ విద్యాలయంలో చేర్పించాలన్నారు. ఇతర వివరాలకు దగ్గరలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో సంప్రదించాలని సూచించారు.
ఏపీ గురుకుల మైనార్టీ బాలుర పాఠశాలలో...
కడప ఎడ్యుకేషన్: కడపలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలుర)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సి పాల్ పేతకంశెట్టి సోమ సత్యశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత ప్రవేశం పొందవచ్చని తెలిపారు. మైనార్టీ బాలురతోపాటు ఎస్సీ, ఎస్టీ బాలురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా https://aprs.apcffss.inద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. వివరాలకు 7780179446, 9059500193 నెంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment