ఇంగ్లిష్ పరీక్షలకు 743 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 18267 మంది విద్యార్థులకుగాను 17524 మంది హాజరుకాగా 743 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో జనరల్‌కు సంబంధించి 626 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 117 మంది గైర్హాజరయ్యారు.
ఆర్టీపీపీలో జాతీయ భద్రత ర్యాలీ
ఎర్రగుంట్ల: జాతీయ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డాక్టరు ఎంవీఆర్ ఆర్టీపీపీలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఆర్టీపీపీ సీఈ గౌరీపతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీపీపీలోని అగ్నిమాపక కేంద్రం నుంచి పరిపాలన విభాగం భవనం నుంచి నినాదాలతో సాగింది. ఈ సందర్భంగా ఆర్టీపీపీ సీఈ గౌరీపతి మాట్లాడుతు ఆర్టీపీపీ ఉద్యోగులు భద్రత, ఆరోగ్యం వాతావరణ తదితరం అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్మికులు పనులలో కచ్చితంగా హెల్మెంట్ ధరించాలన్నా రు. ఎస్‌ఈలు, ఈఈలు, ఫ్యాక్టరీ మేనేజర్ సిద్ధయ్య, అసిస్టెంట్ సెక్రటరీ బాష, అసిస్టెండ్ కమాండ్ కృష్ణయ్య, ఆర్‌ఐ రమేష్, విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment