ఉగాది పురస్కారం పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఉగాది పురస్కారం పోస్టర్‌ ఆవిష్కరణ

Published Wed, Mar 5 2025 1:50 AM | Last Updated on Wed, Mar 5 2025 1:45 AM

ఉగాది పురస్కారం పోస్టర్‌ ఆవిష్కరణ

ఉగాది పురస్కారం పోస్టర్‌ ఆవిష్కరణ

కడప కార్పొరేషన్‌: శ్రీ నవ్య కళానికేతన్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఉగాది పురస్కారం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు సాయి హుస్సేన్‌ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఉగాది పురస్కారాలు అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌, కో ఆప్షన్‌ సభ్యులు జహీర్‌, సౌత్‌ జోన్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్‌ రెడ్డి, కె. మాధవరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement