
రోడ్డు ప్రమాదంలో తాత, మనవడు దుర్మరణం
దువ్వూరు : దువ్వూరు వద్ద ఉన్న కడప – కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తాతా మనవళ్లు దుర్మరణం చెందారు. బంధువుల కథనం మేరకు.. మండలంలోని పెద్దజొన్నవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (60), చాపాడు మండలం చీపాడుకు చెందిన నరసింహులు (36) తాత, మనవడు. వీరు దువ్వూరుకు పనిమీద బైక్‌పై బయల్దేరారు. దువ్వూరు సమీపంలోని ఆనకట్ట వద్ద కడప– కర్నూలు జాతీయ రహదారిపై వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఇరువురు దుర్మరణం చెందారు. ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కావడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న దువ్వూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment