సిద్దవటం : కన్న తండ్రిపైనే కొడుకు బండరాయితో దాడి చేయడంతో తండ్రి ఖాదర్‌హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సిద్దవటం మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన ఖాదర్‌హుస్సేన్ తన సొంత గృహాన్ని అద్దెకు ఇచ్చేందుకు బోర్డును ఏర్పాటు చేశాడు. అతని కుమారుడు బాబా ఫకృద్దీన్ ఆ బోర్డును తొలగించి తండ్రిపై బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న బండరాయితో తలపై కొటడ్డంతో తీవ్ర గాయాలతో కుప్ప కూలిపోయాడు. స్థానికులు, బంధువులు ఖాదర్‌హుసేన్స్‌ను ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఆస్తి కోసం కన్న తండ్రిపైనే కొడుకు దాడి చేయడం అన్యాయమన్నారు. సిద్దవటం ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్ జరిగిన ఘటనపై విచారిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment