ఎంఎస్‌ఎంఈలతో అభివృద్ధి సాధ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్ : సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈల) సాధికారతతో దేశ సామాజిక, ఆర్థిక పరిపుష్టి సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కడప–పులివెందుల రోడ్డులోని మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో యూనియన్ బ్యాంకు వారు ఏర్పాటు చేసిన ‘మెగా ఎంఎస్‌ఎంఈ ఔట్ రీచ్ క్యాంపు’ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్ బ్యాంకు ఎంఎస్‌ఎంఈ జీఎం జి.కె.సుధాకర్, కడప రీజినల్ మేనేజర్ లక్ష్మీతులసి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడప యూనియన్ బ్యాంకు సంస్థ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యాపార, పెట్టుబడి ధోరణిలో పారిశ్రామిక రంగం వైపు అవగాహన పెంచడం అభినందనీయం అన్నారు. పరిశ్రమలలో ఒక భాగంగా ఉన్న ఎంఎస్‌ఎంఈ విభాగాన్ని ఒక ప్రత్యేక పారిశ్రామిక రంగంగా ఒక పాలసీని తీసుకురావడం, అందుకు సంబంధించి ‘ఉద్యం’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల రాయితీలను పొందాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిపుచ్చుకుని పారిశ్రామికవేత్తగా రాణించాలన్నారు. ఎంఎస్‌ఎంఈ జీఎం జి.కె.సుధాకర్ మాట్లాడుతూ... ఎంఎస్‌ఎంఈ లబ్ధిదారులకు సెక్యూరిటీ లేకుండా సుమారు ఐదు కోట్ల రుణాలను యూనియన్ బ్యాంకు సంస్థ అందిస్తోందన్నారు. యూనియన్ బ్యాంకు కడప రీజినల్ మేనేజర్ లక్ష్మి తులసి మాట్లాడుతూ కడప రీజియన్ పరిధిలో 600 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలను అందివ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో 400 మంది ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మంజూరైన రూ.20 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 200 గ్రూపులకు చెందిన రూ.12 కోట్ల రుణాలకు సంబంధించి మెగా చెక్కులను మహిళా సంఘాలకు, చేనేత సంఘాలకు మంజూరు చేసిన కోటి రూపాయలు, బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.6.12 కోట్లను లబ్ధిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే ఉమెన్ ఎంపర్‌మెంట్ కింద ఎంపికై న పలువురు మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యకక్రమంలో డీఆర్‌డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు ఆనంద్‌నాయక్, కిరణ్‌కుమార్, శ్రీలక్ష్మి, చేనేత జౌళిశాఖ ఏడీ పిచ్చయేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహా, యూనియన్ బ్యాంకు అన్నిశాఖలు బీఎంలు, బ్యాంకు ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment