అసెంబ్లీలోనూ అబద్ధాలా..?
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని ఇళ్ల నిర్మాణానికి మొత్తం 476.06 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిని అధికారులు సేకరించారు. ఇందు కోసం ప్రైవేట్ వ్యక్తుల భూమి కొనుగోలుకు సంబంధించి రూ.162,53,46,033.60 చెల్లించారు. పలు మార్లు అప్పటి రెవెన్యూ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి భూమిని కొనుగోలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూముల కొనుగోలుకు సంబంధించిన మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. కాగా ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.700–800 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడటం చర్చాంశనీయంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోపూర్వం ప్రతి ఏటా పే దలకు 500 లోపుగానే ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి ఉండేది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ఇంటి నిర్మాణానికి కూడా భూ సేకరణ జరగలేదు. త ద్వారా పేదలు తీవ్రంగా నష్టపోయారు. టిడ్కో ఇళ్ల ని ర్మాణం మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విడతల వారిగా కాకుండా ఎంత మందికి అర్హత ఉంటే అంత మందికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో..
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన 476.06 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో రా మేశ్వరం జగనన్న కాలనీకి సంబంధించి ఎకరా రూ. 27,63,750 ప్రకారం 70.34 ఎకరాలకు రూ.34,73, 20,462.50 చెల్లించారు. బొల్లవరం జగనన్న కాలనీకి సంబంధించి ఎకరా రూ.40,26,667 ప్రకారం 213.30 ఎకరాలకు రూ.85,88,88,071.10 చెల్లించారు. మీనాపురం జగనన్న కాలనీకి సంబంధించి ఎక రా రూ.40లక్షల ప్రకారం 104.73 ఎకరాలు భూమికి రూ.41,89,00,000 చెల్లించారు. ఇవి కాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని సేకరించి 894 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ప్రొద్దుటూరు మండలంలోని మూడు జగనన్న కాలనీలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని 41 వార్డులతోపాటు కొత్తప ల్లె, గోపవరం, బొల్లవరం సోములవారిపల్లె, దొరసానిపల్లె, చౌటపల్లె గ్రామాలను కలపడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 15,825, గ్రామాలకు సంబంధించి 5,763 కలిపి మొత్తం 21,588 ఇళ్ల పట్టాలను తొలి విడతగా మంజూరు చేశారు. వచ్చిన దరఖాస్తులను బట్టి జగనన్న కాలనీల్లో అదనంగా ఇంటి పట్టాలు మంజూరు చేశారు.
నిర్మాణంలో ఆలస్యం
చాలా కాలం తర్వాత ఒకే మారు ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరించడంతో పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు మంజూరయ్యాయి. ఎలాగైనా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలు మార్లు సమీక్షలు నిర్వహించి అధికారులపై ఒత్తిడి చేశారు. ఇప్పటికీ చాలా మంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే వరద మాట్లాడటం హాస్యాస్పందంగా ఉంది.
విజిలెన్స్ విచారణ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇళ్ల నిర్మాణంపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంకు ఫిర్యాదు చేశారు. పలు మార్లువిజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. విచారణ తమకు అనుకూలంగా జరగలేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారిని కూడా విమర్శించారు.
జగనన్న కాలనీల నిర్మాణాలపై రూ.700–800 కోట్ల అవినీతా?
ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి విలువ రూ.162.53 కోట్లు మాత్రమే
రైతుల పేర్లతోనే బ్యాంకుల్లో డబ్బు జమ
Comments
Please login to add a commentAdd a comment