కడప వైఎస్‌ఆర్ సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమమైన నవోదయం 2.0 పథకం అమలులో భాగంగా రాష్‌ట్రంలో నాటుసారా నిర్మూలనే లక్ష్యమని జిల్లా ప్రొహిబిషన్‌అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ సూపరింటెంటెండ్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్‌లో బెల్లం వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లం వ్యాపారులు తమ వద్ద ఉన్న స్టాక్, అమ్మకాలు తదితర వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకై ్సజ్ స్టేషన్‌కి నివేదించాలన్నారు. అలాగే, బెల్లం అమ్మకాలు నాటుసారా తయారీదారులకు జరపరాదన్నారు. నాటుసారా తయారీకి బెల్లాన్ని సరఫరా చేసినట్టు తేలినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ బి.కృష్ణకుమార్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. నరసింహారావు సిబ్బంది పాల్గొన్నారు.
34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ సి.రామాపురం బీట్‌లోని అటవీప్రాంతంలో అక్రమంగా తరలిచేందుకు సిద్ధంగా ఉన్న 34 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడంతో రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు బంగ్లా ఆవరణలో శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బ్రాహ్మణపల్లె సెక్షన్ రామాపురం అటవీప్రాంతంలో గల ఎద్దులబోడు ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు రాబడిన సమాచారం మేరకు ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ నరేష్ బృందం గురువారం నుండి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలు, ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. వారు టాస్క్‌ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా సమీప అటవీ ప్రాంతంలో దాచి ఉంచిన 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, దుంగల విలువ సుమారు రూ.32 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారని, ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వారు తెలిపారు.
‘బేసిక్ ప్రైమరీ పాఠశాలలను రద్దు చేస్తే ఉద్యమిస్తాం’
కడప ఎడ్యుకేషన్: అసంబద్ధంగా తరగతుల విలీనాన్ని చేస్తూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలను రద్దు చేయాలని చూస్తే ఉద్యమిస్తామని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ బాషా నర్రెడ్డి సంగమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వారు కడపలో విలేకరులతో మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో పాఠశాలల పునర్విజన ప్రక్రియలో భాగంగా మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పరుస్తున్నామని చెబుతూ బేసిక్ ప్రైమరీ పాఠశాలలలోని 3,4,5 తరగతుల విద్యార్థులను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మోడల్ ప్రైమరీలకు విలీనం చేస్తూ మండల స్థాయి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారన్నారు. అలాగే మూడో తరగతి విద్యార్థి తన గ్రామంలో ఉన్న బడిని కాదని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రాథమిక పాఠశాలకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు. ఈ విధానం ప్రాథమిక విద్యావ్యవస్థకు పెను ప్రమాదమని, తక్షణం గ్రామాల్లో బేసిక్ ప్రైమరీ పాఠశాలలను కాపాడుకోవడానికి చైతన్యం తీసుకురావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment