సమస్య పరిష్కారం కానిదే ప్రజాభిప్రాయ సేకరణ వద్దు
మైలవరం : దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల సమస్యలను పరిష్కారం చేయకుండానే యాజమాన్యం విస్తరణ పనులకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం సరైంది కాదని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దుగ్గన పల్లి గ్రామంలో మిర్చి రైతు ఛీపాటి మోషే ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు మృతదేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గ్రామస్థులందరూ మోషే మరణానికి పంట దిగుబడే కాకుండా తమ గ్రామాలకు పక్కనే ఉన్న దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న ధూమ్ము ధూళీతోపాటు బూడిద పంటలపై పడటం, కాంపౌండ్ ప్రహరీ నిర్మాణం వల్ల వర్షకాలంలో పొలాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్సీ ముందు వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమస్యలున్న గ్రామాలల్లో వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా ఆగమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం ఎమిటని ప్రశ్నించారు. 4.6 మెట్రిక్ టన్నుల నుంచి 12.6 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగితే ప్రస్తుతం వస్తున్న నష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. వర్షపు నీరు వంకల్లో ప్రవహించకుండా దాల్మియా యాజమాన్యం వంకలను పూర్తిగా ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేశారు. నేను కూడా సివిల్ ఇంజినీర్‌నేనని, నీటి ప్రవాహం ఏ మేరక ప్రవహిస్తుందో ఆర్థం చేసుకోగలనన్నారు. కొంత మంది అధికారులు తప్పుడు రిపోర్టులతో పరిసర గ్రామస్థులను మరింత నష్టపరిచేలా చేస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ చోరవ తీసుకుని గ్రామాలల్లో పర్యటించి సమస్యను పరిష్కరం చేయాలన్నారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, శివగుర్విరెడ్డి, ఆంజనేయులు, వినయ్‌రెడ్డి, మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి,పోరెడ్డి మహేశ్వరరెడ్డి విశ్వనాథ్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment