మహిళలు సున్నితమైన వారు.కష్టమైన పనులు చేయలేరు...అన్నది ఇంతవరకు ప్రజల్లో ఉన్న నమ్మకం. కానీ ఇటీవలి కాలంలో ఆ అభిప్రాయం చెల్లాచెదురై పోయింది. ఇంటి నుంచి మింటి వరకు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నింటా తానై దూసుకుపోతోంది మగువ. అబ్బురపరిచే విజయాలతో అందరి అభినందనలు అందుకుంటోంది వనిత. అనిర్వచనీయ పాత్రలో అంతులేని ఆత్మవిశ్వాసంతో తనకు తానే సాటిగా..పోటీగా మందుకు సాగుతోంది నేటి మహిళ. భూమిని చీల్చి పంటలు పండించడం నుంచి ఆకాశంలో రివ్వుమని విమానాలు నడపడంలో కూడా ప్రతిభ చూపుతున్నారు. కొలిమి పనులు, ఖాకీ దుస్తుల ఉద్యోగాల నుంచి రైలు పైలెట్లుగా, ఆర్టీసీ కండక్టర్లుగా రాణిస్తున్నారు. కొన్నిచోట్ల తమకు మాత్రమే గల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. దేంట్లో అయినా తగ్గేదేలా అంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
–కడప కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment