
జాతీయ లోక్ అదాలత్‌తో 6053 కేసులు పరిష్కారం
కడప అర్బన్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా జాతీయలోక్ అదాలత్ నిర్వహించి 6053 కేసులు పరిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 16 బెంచీలు ఏర్పాటు చేశారు. కడపలో 5, ప్రొద్దుటూరు 3, రాజంపేటలో 3, రాయచోటిలో 2, బద్వేల్‌లో 2, జమ్మలమడుగు ఒక బెంచీని ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టు ఆవరణంలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి ఆధ్వర్యంలో సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్‌లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎల్. వెంకటేశ్వరరావు, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి దీనబాబు, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్, సివిల్ జడ్జి కం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె. ప్రత్యూషకుమారి, సివిల్ జిసి ఆసిఫా సుల్తానా, ఎకై ్సజ్ కోర్టు జె హేమస్రవంతి, మొబైల్‌కోర్టు మెజిస్ట్రేట్ ఎం. ఆశాప్రియ, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.. గుర్రప్ప, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు, బ్యాంక్ అధికారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.
● జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 6053 కేసులను పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారంతో రూ.15,58,91,342 (రూ.15 కోట్లు 58 లక్షలు,91 వేలు, 342) కక్షిదారులకు నష్టపరిహారంగా లభించింది.
● మొదటి అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో వున్న ఎంవిఓపి నెంబర్: 98/2017 కేసులో రూ. 23 లక్షలు మొత్తాన్ని వాది అయిన సయ్యద్ నీలోఫర్, ఇతరులు, ప్రతివాది అయిన హెచ్‌డిఎఫ్‌సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ అయ్యారు.. ఈ కేసులో వాది తరపున న్యాయవాది వై.. ప్రసాద్, ప్రతి వాది తరపున న్యాయవాది డి. రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి వారి వారి కేసులను పరిష్కరించుకున్నారు.
లోక్ అదాలత్‌లో ఒకటైన భార్యభర్తలు
ప్రొద్దుటూరు క్రైం : మనస్పర్థలతో ఏడాది నుంచి విడిగా ఉన్న భార్యభర్తలు జడ్జి సత్యకుమారి సూచనతో లోక్ అదాలత్‌లో ఒకటయ్యారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివారెడ్డి, వీణ అనే దంపతులు మనస్పర్థలతో ఏడాదిగా విడిగా ఉంటున్నారు. ఇరువురి కులాలు వేరైనా ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి సంసారంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయి. భర్త దూరం కావడంతో భార్య శనివారం ప్రొద్దుటూరులోని కోర్టు హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. రెండవ జిల్లా అదనపు న్యాయమూర్తి సత్యకుమారి ఇరువురిని పిలిపించారు. తల్లిదండ్రులు విడిగా ఉండటం వల్ల ఏడాది వయసున్న చిన్నారిపై భవిష్యత్తులో ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. ప్రేమించుకున్నప్పుడు కులాలు లేవని ప్రస్తుతం వాటిని అధికమించి అన్యోన్యంగా జీవించాలని ఇరువురిని కోరారు. న్యాయమూర్తి సూచనతో సాంబశివారెడ్డి తన సతీమణితో కలిసి జీవిస్తానని అంగీకరించారు. భార్యభర్తలు ఇరువురు కలుసుకోవడంతో జడ్జితోపాటు ఇతర లోక్ అదాలత్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెషన్స్ కర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాది బందెల ఓబులేసు, లోక్ అదాలత్ సభ్యుడు శ్రీనివాసులు, న్యాయవాదులు విజయలక్ష్మి, పద్మజ, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్,
ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి

జాతీయ లోక్ అదాలత్‌తో 6053 కేసులు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment