
తృటిలో తప్పిన ప్రమాదం
– ఫ్రూట్ జ్యూస్ దుకాణంపై దూసుకెళ్లిన లారీ
ఎర్రగుంట్ల : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని ఏపీజీబీ బ్యాంకు సమీపంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ఫ్‌లైయాస్ లారీ పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ బండిపై దూసుకెళ్లింది. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు . పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలోనే ఓ బ్రాందీ షాపు ఉంది. ఇక్కడ రోడ్డు పక్కనే కొందరు మద్యం సేవిస్తూంటారు. బ్యాంకుకు, ఇక్కడ ఉన్న మూడు ఏటీఎం సెంటర్లకు ఖాతదారులు వస్తుంటారు. మద్యం ప్రియుళ్లుతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మద్యం దుకాణం కిందనే ఓ ఫ్రూట్ జ్యూస్ బండి కూడా ఉంది. శనివారం ముద్దనూరు రోడ్డులో స్కూటీలో ఓ మహిళ వస్తుండుగా ఆటో ఢీకొంది. ఆ మహిళ కింద పడింది. వెనుక నుంచి ఫ్‌లైయాస్ లారీ వస్తున్న సమయంలో డ్రైవర్ గమనించి తప్పించ బోవడంతో పక్కనే ఉన్న ఫ్రూట్ జ్యూస్ దుకాణంపై దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. ఇప్పటికై న మద్యం ప్రియుళ్లును ఇక్కడ నుంచి నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
కడప ఆర్‌సీఎం డయాసిస్‌కు
నూతన బిషప్
– రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్‌ను నియమిస్తూ పోప్ ప్రకటన
కడప కల్చరల్ : కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్‌గా రెవరెండ్ సగినాల పాల్ ప్రకాశ్‌ను నియమించారు. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లో ప్రకటన చేశారు. శనివారం నగరంలోని మరియాపురంలోని క్యాథడ్రల్ చర్చిలో ఇంతవరకు ఈ ప్రాంత బిషప్‌గా వ్యవహారించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి నూతన బిషప్ సమక్షంలో పోప్ ఆదేశాల మేరకు ఆయన పేరు ప్రకటించారు. త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించనున్నారు.
నూతన బిషప్ వివరాలు :
నూతన బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాశ్ సగినాల ప్రస్తుతం హైదరాబాదు సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో బైబిల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన 1961 జూన్ 12న వైఎస్సార్ జిల్లాలోని పలుగురాళ్లపల్లెలో జన్మించారు. హైదరాబాదు ఉస్మానియా నుంచి బీఏ డిగ్రీ, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంనుంచి తెలుగు మాస్టర్స్ డిగ్రీ, డిల్లీ యూనివర్శిటీ నుంచి జర్నలిజం పీజీ డిప్లొమా, రోమ్‌లోని అర్బానియా వర్శిటీ నుంచి బైబిల్ థియాలజీలో పీహెచ్‌డీ చేశారు. కడపలోని ఆరోగ్యమాత క్షేత్రం డైరెక్టర్‌గా కూడా సేవలు అందించారు. శనివారం సాయంత్రం క్యాథడ్రల్ చర్చిలో నూతన బిషప్‌గా ఆయన పేరును వెల్లడించిన బిషప్ గాలి బాలి ఆయనకు దేవుని ఆశీస్సులు సంవృద్దిగా ఉండాలని కోరుతూ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కడప కథోలిక మేత్రాసన వికర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజు, కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ పాల్గొన్నారు.

తృటిలో తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment