రెవెన్యూ శాఖలో అత్యధికం
కడప సెవెన్‌రోడ్స్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ప్రతి సోమవారం ‘స్పందన’ పేరిట మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో క్రమం తప్పకుండా ఓ కార్యక్రమం నిర్వహించేది. అర్జీల స్వీకరణ, పరిష్కారం జరిగేది. ఈ కార్యక్రమానికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు సమర్పించే అర్జీలు మరింత నాణ్యంగా, వేగంగా పరిష్కారం కావాలన్న ఉద్దేశ్యంతో ‘జగనన్నకు చెబుదాం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించిందంటే అర్జీల పరిష్కారానికి గత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘స్పందన’ పేరు తొలగించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)గా మార్పు చేసింది. పేరు మార్పుపై ఉన్న శ్రద్ధ అర్జీల పరిష్కారంపై మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో కొత్త నాటకానికి తెర తీసింది.
● గ్రీవెన్‌సెల్‌లో అర్జీలను పరిశీలిస్తే అత్యధికంగా రెవెన్యూ, సర్వే విభాగాల్లోనే ఉన్నాయి. రెవెన్యూలో 18,363 ఫిర్యాదులు అందాయి. ఇందులో రికార్డు ఆఫ్ రైట్స్‌కు సంబంధించి మ్యూటేషన్స్ ఫిర్యాదులు 5074 రాగా, 4724 పరిష్కారం కాగా, 350 పెండింగ్‌లో ఉన్నాయి.
● రెవెన్యూ రికార్డులలో పేర్లు, రిలేషన్, ఆధార్, మొబైల్ నంబరు తదితర ఎంట్రీస్‌లో సవరణ కోసం వచ్చిన ఫిర్యాదులు 4623 కాగా, 4141 పరిష్కారం అయ్యాయి.
● సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధించి రీ సర్వేలో 3694 ఫిర్యాదులు రాగా, 2797 పరిష్కారం కాగా, 897 పెండింగ్‌లో ఉన్నాయి.
● రీ సర్వేలో భూమి విస్తీర్ణాలలో వచ్చిన తేడాలు సరిదిద్దడం కోసం 2381 ఫిర్యాదులు రాగా, 1712 పరిష్కారం కాగా, 669 పెండింగ్‌లో ఉన్నాయి.
● ఆస్తుల వివాదాలు, క్రిమినల్ ట్రెస్పాస్, సివిల్ వివాదాలు, మనీ మ్యాటర్స్‌కు సంబంధించి 1308 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1194 పరిష్కారం కాగా, 114 పెండింగ్‌లో ఉన్నాయి.
● ఆర్‌ఓఆర్ డేటాలో సవరణలపై 1038 అర్జీలు వచ్చాయి. ఇందులో 975 పరిష్కరించగా, 63 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన క్రమబద్ధీకరణ కోసం 1011 అర్జీలు వచ్చాయి. ఇందులో 846 పరిష్కారం కాగా, 165 పెండింగ్‌లో ఉన్నాయి.
● పట్టాదారు పాసుపుస్తకాల జారీ కోసం 809 అర్జీలు వచ్చాయి. ఇందులో 723 పరిష్కారం కాగా, 86 పెండింగ్‌లో ఉన్నాయి.
● ఎఫ్ లైన్స్ (బౌండరీ డిమార్కేషన్)కు సంబంధించి 778 ఫిర్యాదులు రాగా, ఇందులో 678 పరిష్కరించగా, 100 పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా రెవెన్యూకు సంబంధించి 15,620 అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇంకా 2743 పెండింగ్‌లో ఉన్నాయి.
● సర్వే సెటిల్‌మెంట్ అండ్‌ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో 9301 అర్జీలకు 7096 పరిష్కారమై, 2205 పెండింగ్‌లో ఉన్నాయి.
● పోలీసుశాఖకు సంబంధించి 3267 ఫిర్యాదులు రాగా, 270 పెండింగ్‌లో ఉన్నాయి.
● మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 1127 అర్జీలు రాగా, 59 పెండింగ్‌లో ఉన్నాయి.
● పంచాయతీరాజ్ శాఖలో 385 అర్జీలు రాగా, 39 పెండింగ్, ఏపీఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించి 263 అర్జీలు రాగా, 25 పెండింగ్‌లో ఉన్నాయి.
● పౌరసరఫరాల శాఖలో 244 అర్జీలు రాగా, 19 పెండింగ్‌లో ఉన్నాయి.
● రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌లో 233 అర్జీలు రాగా, 15 పెండింగ్‌లో ఉన్నాయి.
● గృహ నిర్మాణశాఖలో 189 అర్జీలు రాగా, 4 పెండింగ్‌లో ఉన్నాయి.
● పాఠశాల విద్యకు సంబంధించి 130 అర్జీలు రాగా, 9 పెండింగ్‌లో ఉన్నాయి.
● ఇక మిగతా అన్ని డిపార్టుమెంట్లలో మొత్తం 1495 అర్జీలు వచ్చాయి. ఇందులో 1360 పరిష్కారం కాగా, 135 పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మారిన ‘స్పందన’
గ్రీవెన్స్‌సెల్ ఫిర్యాదులువేలాదిగా పెండింగ్
కూటమి పాలనలో వచ్చినవి 34,997
టాప్ టెన్ శాఖల్లోనివి 33,502
రెవెన్యూలో అత్యధికంగా 27,664
పరిష్కరించినవి 29,474
పెండింగ్ ఫిర్యాదులు 5,523
రెవెన్యూ శాఖలో అత్యధికం
Comments
Please login to add a commentAdd a comment