ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమికి సాగునీరు అందించి తీరుతామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని చెప్పారు. ఖమ్మంలో గురువారం జరిగిన జనహిత సభలో కేటీఆర్ ప్రసంగించారు. నిజమైన పేదల పక్షపాతి టీఆర్‌ఎస్ పార్టీయేనని, సంక్షేమ పథకాల అమల్లో దేశానికి తెలంగాణ ఆదర్శమని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు. మాటలతో కమ్యూనిస్టులు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
Published Thu, Jun 15 2017 5:42 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement