టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. తాను గంట ముందే వచ్చినా....ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని జేసీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. అలాంటిది ఏం జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయివుంటుందని అది పరిశీలించిన తర్వాతే ఎవరిది తప్పో తేలిపోతుందన్నారు. తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదని అశోక్ గజపతి రాజు అన్నారు.
Published Fri, Jun 16 2017 4:26 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
Advertisement