పులుల జాతిలో ప్రముఖమైనది బెంగాల్ టైగర్. అంతరించిపోత్ను జంతువుల జాబితాలో ఉన్నఈ పులులను కాపాడుకోవడానికి భారత్‌తో పాటు ఇతర దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రియాలోని కెర్నాఫ్ జూ సంరక్షణలో ఉన్న పదమూడేళ్ల ఆడపులి ఒకటి మూడు పులి పిల్లలకు జన్మనిచ్చింది. అవి పుట్టిన నెలన్నర తర్వాత ఇప్పుడు వాటిని సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. దీనిపై జూ అధికారి రేయినర్ ఎడర్ మాట్లాడుతూ పదమూడేళ్ల ముసలి వయసులో ఒక పులి ముగ్గురు పిల్లల్ని కనటం మాకు ఆశ్చర్యంతో పాటు ఆనందంగానూ ఉంది. పుట్టినప్పుడు అవి ఒక్కోటి కిలో బరువు ఉండగా ఇప్పుడు దాదాపు నాలుగు కేజీల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని తన సంతోషాన్నివెలిబుచ్చారు. అంతేకాక, వీటికి హెక్టార్, పాషా, జీయస్ అనే పేర్లు కూడా పెట్టారు. వీటి వల్ల ఇప్పుడా జూ మంచి టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఒక ఏడాది తర్వాత ఈ పిల్లలను వేరే జూకి దత్తత ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అక్కడి అధికారులు. భారతదేశంలో ఎక్కువగా ఉండే ఈ జాతి పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2500కు పడిపోయిందని వరల్డ్ వైల్డ్ లైఫ్ అనే వెబ్‌సైట అంచనా. ఇప్పుడీ సంఘటన పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్ టైగర్‌కు ముగ్గురు పిల్లలు
Published Tue, Jun 25 2019 5:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement