ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ రూపొందించిన పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ డిజైన్‌ను జలవనరుల శాఖ తిరస్కరించింది. డిజైన్‌లో లోపాల్ని ఎత్తిచూపి.. వాటిని సరిదిద్దుతూ సరికొత్త డిజైన్‌ను రూపొందించాలని ఆదేశించింది. ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, గేట్ల తయారీ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కాఫర్ డ్యామ్ డిజైన్‌ను ప్రధాన కాంట్రాక్టు సంస్థ సీఎంకు అందించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు భారీ లోపాలున్నట్లు గుర్తించారు.
Published Sat, Feb 11 2017 6:43 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement