వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in 44 national highway, seven person died | Sakshi
Sakshi News home page

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Feb 21 2018 10:17 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

జిల్లాలోని కొత్త కనిమెట్ట వద్ద జాతీయ రహదారి 44పైన బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న రెండు కార్లు ఒక్కదానినొక్కటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 7మంది మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల్లోనే ఏడుగురి మృతదేహాలు చిక్కుకున్నాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతులు హైదరాబాద్‌ వాసులని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు నంబర్లు, TS 08 EQ 8108, TS 08 UA 3801.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement