Kartik Aaryan
-
మా సినిమాకు జిమ్మిక్కులు అక్కర్లేదు: బాలీవుడ్ హీరో
ఈ మధ్య హారర్ సినిమాలకు గిరాకీ పెరిగిపోయింది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో 'భూల్ భులయ్యా 3' రానుంది. ఈ ఫ్రాంచైజీలో మొదటిసారిగా 2007లో అక్షయ్ కుమార్ హీరోగా భుల్ భులయ్యా తెరకెక్కింది. ఈ సినిమా హిట్ కావడంతో 2022లో సీక్వెల్ తీసుకొచ్చారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. సింగం అగైన్ Vs భూల్ భులయ్యా 3ఈ చిత్రానికి విశేష స్పందన రావడంతో మూడో భాగం ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఈ మూడో పార్ట్‌లోనూ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. తృప్తి డిమ్రి, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా అజయ్ దేవ్‌గణ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ వంటి బడా స్టార్లు నటించిన 'సింగం అగైన్' రిలీజవుతోంది. జిమ్మిక్కులు అవసరం లేదుదీంతో ఈ దీపావళి వార్‌లో ఎవరు గెలుస్తారనేది బాలీవుడ్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హీరో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. భూల్ భులయ్యా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా మూవీకి ఎలాంటి జిమ్మిక్కులు అవసరం లేదు. కథపై, సినిమాపై మాకు పూర్తి నమ్మకముంది అని పేర్కొన్నాడు.చదవండి: ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా -
స్టార్ హీరోకు క్యూట్ ప్రపోజ్.. మహిళ అభిమానానికి ఫిదా!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురి దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఏకంగా ఆయనకు ప్రపోజ్ చేసింది. కార్తీక్ ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరు కాగా.. ఉహించని విధంగా ఓ అభిమాని సాంగ్ పాడి మరీ అతనికి ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన కార్తీక్.. తన మొత్తం ఫిల్మోగ్రఫీని ఒక్క కవితలో ఆలోచనాత్మకంగా చేప్పినందుకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
థర్డ్ హ్యాండ్ పాత కారు కొన్న స్టార్ హీరో.. ఎందుకు?
సెలబ్రిటీలు చాలామందికి కార్ల, బైక్ పిచ్చి ఉంటుంది. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం లేటు కొనేస్తుంటారు. తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి ఏమైనా కొంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఎప్పటికప్పుడు హై ఎండ్ లగ్జరీ కార్లు కొనే బాలీవుడ్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ ఒకడు. ప్రస్తుతం ఇతడి దగ్గర టాప్ ఇంటర్నేషన్ బ్రాండ్ కార్స్ ఉన్నాయి. అలానే గతంలో ఓసారి థర్డ్ హ్యాండ్ కారు కొన్నాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)'ఓ టైంలో నా దగ్గర ఎలాంటి కారు లేదు. దీంతో ఎలాగైనా సరే కొనలాని అనుకున్నా. రూ.35 వేలు ఖర్చు పెట్టి థర్డ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కష్టం ఎంతైనా సరే జీవితంలో బాగా సెటిలై, ఖరీదైన కార్లు కొనాలని అప్పుడే ఫిక్సయ్యాను. అలా అప్పట్లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలా ఉపయోగించాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను కొన్న తొలి లగ్జరీ కారు లంబోర్గిని. ప్రస్తుతం నా గ్యారేజీలో రేంజ్ రోవర్, మినీ కూపర్, మెక్ లారెన్ లాంటి కార్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి కార్ల విషయంలో నేను ఫుల్ హ్యాపీ. భవిష్యత్తులో ఇంకెన్ని కొంటానో తెలియదు' అని కార్తిక్ ఆర్యన్ చెప్పుకొచ్చాడు.2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన కార్తిక్ ఆర్యన్.. కామెడీ, వైవిధ్య చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో ఇతడు హీరోగా చేసిన 'చందు ఛాంపియన్' హిట్ అయింది. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!) -
ఆత్మల కాన్సెప్ట్‌తో వస్తోన్న హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన భూల్ భూలయ్యా-3. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలో కనిపించనుంది. హారర్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.తాజాగా భూల్ భూలయ్యా -3 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ మంజూలిక పాత్రల్లో నటించారు. దాదాపు మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ హారర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్‌లోని హారర్ సీన్స్ మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ చిత్రంలో రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, అశ్విని కల్సేకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న దీపావళి కానుకగా విడుదల కానుంది. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న సింగం ఎగైన్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్‌కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్‌లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
సినిమా కావాలంటే తనను మర్చిపోమంది.. హీరో బ్రేకప్ స్టోరీ..
పరిచయాలు లేకపోతే పనయ్యేలా లేదు. ఎక్కడైనా ఇదే పరిస్థితి! సినిమా ఇండస్ట్రీలోనూ ఇంతే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎవరితోనూ పరిచయాలు లేకుండా సినిమాల్లోకి రావాలంటే ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకోవాల్సిందే! బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ అందరిలాగే ఇబ్బందులు పడ్డాడు. సినిమాలకు పనిరాడని ముఖం మీదే అన్నారు.బ్రేకప్అయినా పట్టుదలతో ప్రయత్నించి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకున్నాడు. తాజాగా అతడు బి ఎ మ్యాన్, యార్ అనే పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యాడు. ఈ పాడ్‌కాస్ట్‌లో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. కాలేజీలో ఓ అమ్మాయిని చూసి స్మైల్ ఇచ్చేవాడిని. నా ఫీలింగ్స్ నేరుగా చెప్పేంత ధైర్యం లేకపోయేది. తర్వాత కొన్నాళ్లకు ఎలాగోలా మేము కలిసిపోయాం. కానీ ఒకరోజు ఆమె బ్రేకప్ చెప్పింది. నీకు యాక్టింగే కావాలంటే నన్ను మర్చిపో. ఒక నటుడి జీవితాన్ని నేను హ్యాండిల్ చేయలేను అని ముఖం మీదే చెప్పేసింది.రిజెక్ట్ చేశారుచాలా బాధపడ్డాను. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కూడా ఎన్నోసార్లు రిజెక్ట్ చేశారు. ఎందుకు బతికున్నానా? అనిపించేది. ఫ్రస్టేషన్ వచ్చేది. కానీ నెమ్మదిగా కెరీర్లో ముందుకు వెళ్లాను. నాకంటూ అభిమానుల్ని సంపాదించుకున్నాను. వాళ్లే నా ఒంటరితనాన్ని పోగొట్టారు. అవుట్‌సైడర్‌గా మాత్రం కష్టాలు పడ్డాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ -
రూ.1 కోటి నుంచి రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి.. హీరో ఏమన్నాడంటే?
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2011లో 'ప్యార్ కా పంచనామా' సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు. ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. కేవలం ఐదేళ్లలోనే రూ.1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఫస్ట్ సినిమాకు ఎంతంటే?తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన కార్తీక్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ.. నా ఫస్ట్ మూవీ ప్యార్ కా పంచనామాకు నేను కోటి రూపాయలు తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం రూ.70 వేలు మాత్రమే. పైగా అందులో టీడీఎస్ కట్ చేసుకుని రూ.63,000 ఇచ్చారు అని బదులిచ్చాడు. ఆ సినిమా తర్వాతే..పోనీ.. 2018లో వచ్చిన సోనూకీ టిటు కి స్వీటీ సినిమాకు రూ.1 కోటి అందుకున్నావా? అని యాంకర్ రాజ్ శమానీ అడగ్గా.. ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. సోనూ.. సినిమా తర్వాతే కాస్త ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాను. కానీ ఈ ట్యాక్స్‌లు నాకు రావాల్సిన డబ్బును కొంత హరిస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ చేతిలో చందూ చాంపియన్, భూల్ భులయ్యా 3 సినిమాలున్నాయి.చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్ -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ లో కొత్త దోస్తీ కహానీ త్వరలో షురూ కానుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా ‘దోస్తానా 2’ అనే చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా ముఖ్య తార లుగా 2008లో వచ్చిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. కోలిన్ డుకున్హా దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాలో జాన్వీ, కార్తీక్‌లతో పాటు మరో కొత్త హీరో నటించనున్నారు. అతను ఎవరు? అనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ‘రుహ్ అప్జా, ‘కార్గిళ్ గాళ్’ (వీరవనిత గుంజన్ సక్సెనా బయోపిక్) సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ కపూర్. -
‘ముద్దు సీన్ చూసి మా అమ్మ ఏడ్చింది’
ప్రజెంట్ బాలీవుడ్ సెన్సేషన్‌గా నిలిచాడు హీరో కార్తిక్ ఆర్యన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తిక్ తాజాగా ‘లుకా చుప్పా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు కార్తిక్. అదేంటంటే.. తొలిసారి స్క్రీన్ మీద తాను హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి కార్తిక్ తల్లి ఏడ్చేశారట. ఈ విషయం గురించి కార్తిక్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ, అమ్మమ్మ ఆన్‌స్ర్కీన్ మీద నా ప్రవర్తన చూసి చాలా బాధపడ్డారు. అయ్యో వీడు చదువును గాలికొదిలేసి పనికిమాలిన వేశాలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్క్రీన్ మీద హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి మా అమ్మ ఏడ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు. కార్తిక్ నటించిన ‘సోను కే టిటూ కీ స్వీటి’ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాక రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే కార్తిక్ ఇంతియాజ్ అలీ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.