charminar
-
చార్మినార్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు.. తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు. చార్మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.హైదరాబాద్‌లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. -
హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)
-
చార్మినార్‌కు వెళుతున్నారా.. పార్కింగ్ ప్రాంతాలు ఇవే..
చార్మినార్: రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ముందస్తు చర్యలు చేపట్టారు. మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చార్మినార్ (Charminar) యునానీ ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరం నుంచే కాకుండా శివారు జిల్లాల ప్రజలు కూడా పాతబస్తీలోని మార్కెట్లకు వస్తుండడంతో క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతోంది.వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు చార్మినార్ పరిసరాల్లో వాహనదారులకు పార్కింగ్ (Parking) సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు మక్కా మసీదులో నమాజ్‌లకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాలు పార్క్ చేసేందుకు పంచమొహల్లాలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. అలాగే కూలగొట్టిన చార్మినార్ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు రంజాన్ నేపథ్యంలో పాతబస్తీకి సందర్శకులతో పాటు వినియోగదారుల సందడి అధికంగా ఉంటోంది. దీంతో వాహనదారుల సౌకర్యార్థ్యం పంచమొహాల్లాలో అతి పెద్ద ఖాళీ స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేశాం. అలాగే ఖిల్వత్ గ్రౌండ్, కుడా స్టేడియం, చౌక్‌మైదాన్ ఖాన్‌లోని ముఫిదుల్లా నాం ఖాళీ స్థలాలతో పాటు యునానీ ఆసుపత్రి ప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా అక్రమంగా పార్కింగ్‌ల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఆర్.వెంకటేశ్వర్లు, నగర ట్రాఫిక్ డీసీపీ–3చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఫుల్ లిస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త పాలసీని తెచ్చిన ప్రభుత్వం.. కొన్ని కీలక విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ టూరిజం ఏరియా (ఎస్టీఏ)లను గుర్తించి వాటి ప్రత్యేకతల ఆధారంగా ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చేలా ప్రత్యేక పర్యాటక షెడ్యూల్ రూపొందించనున్నట్టు పేర్కొంది. తొలిదశలో అలాంటి 27 కేంద్రాలను గుర్తించారు. వీటిల్లో ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో–వెల్నెస్, హస్తకళలు, జలపాతాలు, బుద్ధిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి.. అదే సమయంలో అవసరమైన మౌలిక సదుపాయాలనూ నిర్ధారించింది.స్పెషల్ టూరిజం ఏరియాలు.. యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట దేవాలయం, భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం. భద్రాచలం: భద్రచాలం ఆలయం, పర్ణశాల, కిన్నెరసాని డ్యాం, అభయారణ్యం, కనకగిరి హిల్స్. బాసర: జ్ఞాన సరస్వతి దేవాలయం, వ్యాస మహర్షి దేవాలయం, పరిసర ప్రాంతాలు వేములవాడ: వేములవాడ దేవాలయం, కొండగట్టు దేవాలయం, కోటిలింగాల, ధర్మపురి అలంపూర్– సోమశిల: అలంపూర్ శక్తిపీఠం, బీచుపల్లి, జటప్రోలు, కొల్లాపూర్, సోమశిల రామప్ప: రామప్ప దేవాలయం, చెరువు, లక్నవరం సరస్సు, మేడారం, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవుల గుట్ట, ఘన్పూర్ దేవాలయ సమూహం. కాళేశ్వరం: కాళేశ్వరం దేవాలయం, గాంధారి కోట, శివరామ్ అభయారణ్యం మెదక్: మెదక్ చర్చి, కోట, పోచారం రిజర్వాయర్, వైల్డ్‌లైఫ్, ఏడుపాయల దేవాలయం, నర్సాపూర్ అటవీ ప్రాంతం, మంజీరా అభయారణ్యం, సింగూరు డ్యాం. వరంగల్: వరంగల్ కోట, పరిసరాల్లోని దేవాలయాలు, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం. నల్లగొండ: పానగల్ దేవాలయ సమూహం, దేవరకొండ కోట పాలకుర్తి: పాలకుర్తి దేవాలయం, బమ్మెర పోతన గ్రామం, పెంబర్తి హస్తకళలు, చేర్యాల పెయింటింగ్స్, వల్మిడి, జఫర్గడ్ కరీంనగర్: ఎలగందుల కోట, ఫిలిగ్రి, మంథని దేవాలయాలు, రామగిరి కోట. చార్మినార్ క్లస్టర్: చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ – రంగారెడ్డి – మేడ్చల్ క్లస్టర్: గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులు, తారామతి బారాదరి, కీసరగుట్ట, నెట్ జీరో సిటీ–ఎకోపార్కు, షామీర్పేట సరస్సు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు సిద్దిపేట: రంగనాయకసాగర్, గొల్లభామ హస్తకళలు, వర్గల్ రాక్ ఆర్ట్స్, అన్నపూర్ణ రిజర్వాయర్ నల్లమల సర్క్యూట్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఫర్హాబాద్, సలేశ్వరం, మల్లెల తీర్థం, మన్ననూరు, ఉమామహేశ్వరం, మాధవస్వామి ఆలయం, బేడి ఆంజనేయ ఆలయం. శ్రీరాంసాగర్: శ్రీరాంసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతం. జన్నారం: కడెం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, సప్తగుండాల జలపాతం. ట్రైబల్ క్లస్టర్: జోడేఘాట్, ఉట్నూరు, కాగజ్‌నగర్ టైగర్ రిజర్వ్. నాగార్జునసాగర్: బుద్ధిస్ట్ హెరిటేజ్, బ్యాక్‌వాటర్ ప్రాంతం. వికారాబాద్: వికారాబాద్, అనంతగిరి హిల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోట్‌పల్లి, పరిగి దామగుండం. మహబూబ్‌నగర్: కోయిల్‌సాగర్, పిల్లలమర్రి, మన్యంకొండ. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల్ కొత్తకోట వస్త్ర పరిశ్రమ. కోరటికల్, కుంతాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు. కొండాపూర్, ధూళికట్ట, కోరుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాలు.టూరిజం మౌలిక వసతులు ఇలా.. → శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం ఒకటి–రెండు గంటల్లో చేరుకునేలా ప్రత్యేక పర్యాటక గమ్యాలను ఏర్పాటు చేయాలి. → బిజినెస్ టూరిజం అభివృద్ధి చెందాలంటే.. రీజినల్ రింగురోడ్డు చుట్టూ డ్రైపోర్టులు ఏర్పాటు చేయాలి. బందరు పోర్టుతో అనుసంధానించే ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌తో వీటిని అనుసంధానించాలి. తద్వారా కావాల్సిన సరుకును సముద్రయానం ద్వారా సులభంగా తరలించే ఏర్పాటు ఉందన్న నమ్మకం పెట్టుబడిదారుల్లో కల్పించాలి. → రీజినల్ రింగురోడ్డు చుట్టూ ప్రపంచస్థాయి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలి. → ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెగా రిటైల్మాల్స్ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. → గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటక పురోగతికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. రివర్ ఫెస్టివల్స్, బోట్ ఫెస్టివల్, హౌస్‌బోట్స్, వాటర్ స్పోర్ట్స్, జెట్టీలు, లాంచ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. → పట్టణాల్లో జలాశయాల వద్ద పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలి. → హెలిప్యాడ్లను అందుబాటులోకి తెచ్చి ప్రధాన పర్యాటక ప్రాంతాలను వాయు మార్గాలతో అనుసంధానించాలి. → గోల్ఫ్ టూరిజంను విస్తృతం చేయాలి. → బుద్ధవనం, నాగార్జున సాగర్లను ఆసరా చేసుకుని వెల్నెస్, మెడిటేషన్ కేంద్రాల ఏర్పాటుతో బౌద్ధ పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపట్టాలి. → కార్పొరేట్ సంస్థలు కొన్ని పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవటం ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగేలా చూడాలి. → పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్లు, కేఫ్‌లు, కియోస్క్‌లు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, వేసైడ్ ఎమినిటీస్ ఉండాలి. →దివ్యాంగులకు అనుకూల ఏర్పాట్లు ఉండాలి. →స్పెషల్ టూరిజం ఏరియా(ఎస్టీఏ)ల పరిధిలో కనీసం 5 వేల గదులు అందుబాటులో ఉండాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కనీసం 10 వేల గదులు పర్యాటకులకు అందుబాటులో ఉండాలి.పెట్టుబడులను బట్టి ప్రాజెక్టుల కేటగిరీ ఇలా.. ప్రత్యేక ప్రాజెక్టులు: రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి, 2 వేల మంది కంటే ఎక్కువ మందికి ప్రత్యక్ష ఉపాధి మెగా ప్రాజెక్టులు: రూ.100 కోట్లు– రూ.500 కోట్లు మధ్య పెట్టుబడి, 500 నుంచి రెండు వేల మంది వరకు ప్రత్యక్ష ఉపాధి పెద్ద ప్రాజెక్టులు: రూ.50 కోట్లు– రూ.100 కోట్లు మధ్య పెట్టుబడి మధ్యస్థ ప్రాజెక్టులు: రూ.10 కోట్లు– రూ.50 కోట్ల మధ్య పెట్టుబడి సూక్ష్మ,చిన్న ప్రాజెక్టులు: రూ.10 కోట్ల వరకు పెట్టుబడి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్: హైదరాబాద్ నగరం–ఔటర్ రింగురోడ్డు మధ్య పరిధి తెలంగాణ సెమీ అర్బన్ రీజియన్: ఔటర్ రింగురోడ్డు–రీజినల్ రింగురోడ్డు మధ్య ప్రాంతం గ్రామీణ తెలంగాణ రీజియన్: ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతం -
హైదరాబాద్ : చార్మినార్‌కు రంజాన్ శోభ (ఫొటోలు)
-
షంషేర్.. చార్మినార్..
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) స్మారక చిహ్నాల జాబితా టాప్ 10లో నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం చార్మినార్ చోటు దక్కించుకుంది. అంతేకాదు అత్యధిక సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకట్టుకుని వార్షిక పెరుగుదలలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అన్నింటికన్నా మిన్నగా.. గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకుల సంఖ్య 2022–23లో 9.29లక్షలు కాగా, గత ఏడాది 2023–24 కల్లా 12.9లక్షలకు పెరిగింది. సందర్శకుల సంఖ్యలో పెరుగుదల 38 శాతానికి పైగా ఉండడంతో అన్ని ఏఎస్ఐ స్మారక చిహా్నల్లో కలిపి 10.8 శాతంగా ఉన్న మొత్తం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏఎస్ఐ స్మారక చిహా్నల్లో మొత్తం దేశీయ పర్యాటకుల సంఖ్య 479.01 లక్షలు కాగా ఇది 2023–24లో 530.9 లక్షలకు పెరిగింది. గోల్కొండ కోటకూ.. చారి్మనార్‌తో పాటు, నగరంలోని గోల్కొండ కోట కూడా అత్యధిక భారతీయ సందర్శకులను సాధించిన స్మారక చిహ్నాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చారిత్రక స్మారక చిహ్నాన్ని 2022–23లో 15.27 లక్షల మంది సందర్శించగా, 2023–24లో 5 శాతానికి పైగా పెరిగి 16.08 లక్షల మంది సందర్శించారు. ఇక అత్యధిక భారతీయ సందర్శకులను ఆకట్టుకున్న టాప్ 10 స్మారక చిహ్నాల జాబితాలో తాజ్ మహల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది 20 శాతానికి పైగా సందర్శకుల సంఖ్యను పెంచుకుంది. అయితే ఇది చార్మినార్ పెరుగుదలతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. -
పర్యాటకంలో సత్తా చాటుతున్న భాగ్యనగరం
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ తదితర ల్యాండ్ మార్కుల ద్వారా అందివచి్చన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయంగా ప్రపంచ వేడుకలకు చిరునామాగా మారిన ఆధునిక తత్వం వెరసి ప్రపంచ పర్యాటకులకు నగరాన్ని గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా భారీ సినిమాల తయారీ కేంద్రంగా కళలు, ప్రసిద్ధ వంటకాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన పర్యాటక పాలసీ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్యాటకాభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో నగర పర్యాటక రంగ వృద్ధి విశేషాలపై ఓ విశ్లేషణ. నగర పర్యాటక అభివృద్ధిలో బిజినెస్ టూరిజమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడుల రాకతో ప్రపంచ స్థాయి వాణిజ్య సదస్సులు, సమావేశాలకు వేదికగా, వ్యాపార పర్యాటకానికి నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చాయి. అదే విధంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్య వసతులు, కార్పొరేట్ ఆస్పత్రులు విదేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉన్న వైద్య సేవల వ్యయం నగరాన్ని ఆరోగ్య పర్యాటకానికి రాజధానిగా మారుస్తున్నాయి. మెట్రో టు.. ఎయిర్ ట్రా‘వెల్’.. నగర పర్యాటక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 72 దేశీయ, 18 అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. గత 2023–24లో నగరం నుంచి సుమారు 20లక్షల మంది అమెరికా, యుకేలకు ప్రయాణించారు. ఇందులో గణనీయమైన భాగం విద్యార్థులు, నిపుణులు ఉన్నారు. ప్రయాణికుల సంఖ్య 2021లో 8 లక్షల నుంచి 2022లో 12.4 లక్షలకు, 2023లో దాదాపు 21 లక్షలకు, 2024లో దాదాపు 25 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 45.6% సమీకృత వార్షిక వృద్ధి రేటుగా సూచిస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024 వరకూ చూస్తే.. దేశంలోని టాప్ 5 మెట్రో నగరాల్లో ప్రయాణికుల రద్దీ పరంగా సిటీ అత్యధిక వృద్ధి సాధించింది. నగరం 11.7% పెరుగుదలను సాధించగా బెంగళూరు (10.1%) ముంబై (4%), కోల్‌కతా 9.7%, చెన్నై 3.3 శాతంతో వెనుకబడ్డాయి. ఫుల్.. హోటల్స్.. ప్రస్తుతం, రాష్ట్రంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ పరంగా చూస్తే.. 7,500 గదులు అందుబాటులో ఉన్నాయని అంచనా. వీటిలో మన హైదరాబాద్ నగరంలోనే 5,000 వరకూ ఉన్నాయి. రాజధాని నగరంలో అడుగుపెట్టిన వారి సంఖ్య ఏడాదిలో 16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌లోని హోటళ్లు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి చెబుతున్నారు. దేశీయ పర్యాటకులు 2021–22లో 3.2 లక్షల మంది, 2022–23లో 6.07 లక్షల మంది తెలంగాణను సందర్శించారని, 89.84 శాతం పెరుగుదల నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో విదేశీ పర్యాటకులు 5,917 నుంచి 68,401 (10–56.01 శాతం)కి పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధిలో సింహభాగం నగరానికే దక్కుతుందనేది తెలిసిందే.రానున్నాయ్ ఆకర్షణలెన్నో.. ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను నెలకొల్పే ముందు వరకూ కూడా భారీ స్థాయి సమావేశాలకు నగరంలోని హెచ్ఐసీసీ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది. అయితే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో 10,000 సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఎమ్ఐసీఎఫ్ సెగ్మెంట్లో నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో ఉంచుతుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. దుబాయ్ తరహా షాపింగ్ మాల్స్ సహా ఇంకా మరెన్నో ఆకర్షణలు నగర పర్యాటకానికి మరింత ఊపు తేనున్నాయి.నగరం వెలుపల కూడా.. నగరంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, లాడ్ బజార్ వంటివి హిస్టారికల్ టూరిజం వృద్ధికి దోహదం చేసే విశేషాలుగా నిలుస్తున్నాయి. ఇక నగరానికి కాస్త దూరంలోనే ఉన్న యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం.. వంటి చోట్ల స్పిరిట్యువల్ టూరిజం వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి. అలాగే పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట్ వంటివి సంప్రదాయ హస్తకళల పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. -
పాతబస్తీ కుర్రాడు సైక్లింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్..!
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్‌లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్‌లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్‌కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా.. పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్‌ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్‌లో ప్రతిభ కనబర్చాడు. మెల్బోర్న్లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్‌లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్‌లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారారోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్‌లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్‌లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38వ జాతీయ ఆటల పోటీలలో..ఉత్తరాఖాండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనాసాధించిన మెడల్స్..2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం 2021లో జైపూర్‌లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి, కాంస్య పతకాలు 2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు 2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో మెల్బోర్న్లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్‌లో కాంస్యం 2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు. (చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!) -
నిజాయతీకి ఫిదా!
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వస్తే చిరు వ్యాపారులు అధిక ధరలు చెబుతారనేది అందరి అభిప్రాయం. మనం వేరే రాష్ట్రాలు లేదా దేశానికి వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవం ఒకటి రెండుసార్లు మనకు కూడా బహుశా ఎదురయ్యే ఉంటుంది! అయితే.. మన హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి భిన్న అనుభవం ఎదురైంది. చారి్మనార్‌ను చూసేందుకు స్కాట్లాండ్కు చెందిన హ్యూ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ కలియదిరుగుతూ నగర ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆభరణాలు, మట్టి గాజుల గురించి ఆరా తీస్తూ వస్తున్నాడు. అప్పుడే ఓ చిరు వ్యాపారి ముత్యాల హారాలను అమ్ముతూ కనిపిస్తే వాటి ధర ఎంతో అడిగాడు. అయితే.. అందరిలా అవి ఒరిజినల్ ముత్యాలంటూ మభ్య పెట్టకుండా ప్లాస్టిక్ ముత్యాలని నిజాయతీగా చెప్పాడు. అలాగే.. లైటర్‌తో కాల్చి ఇవి, ఒరిజినల్ కాదని పేర్కొన్నాడు. పైగా ధర కూడా రూ.150 అనడంతో చాలా నిజాయతీపరుడివి అంటూ కితాబిచ్చాడు. తిరిగి పర్యాటకుడి వివరాలను ఆరా తీశాడు. స్కాట్లాండ్ అని సమాధానం చెప్పాడు. వెంటనే పర్యాటకుడిని ఆ చిరు వ్యాపారి ఫ్రెంచ్‌లో పలకరించాడు. ఓ..ఫ్రెంచ్ కూడా వస్తుందా అని అడిగి షాక్ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పైగా హైదరాబాద్ పరువు కాపాడావంటూ నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు. -
తాజ్‌మహల్, చార్మినార్‌నూ కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు. ‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.భాగవత్ మాటా బీజేపీ వినదా?‘‘2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్‌షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు. -
Hyderabad: నడిరోడ్డుపై హంగామా
చార్మినార్ : చార్మినార్ ఆర్టీసి బస్టాప్ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు. కనిపించని పోలీసులు... ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్ ఆర్టీసి బస్టాండ్ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్ కేఫ్ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనమైన పూజలు (ఫోటోలు)
-
ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్!
స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. ఎంత రాత్రి అయినా సరే చార్మినార్ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ లాగించేయొచ్చు. మొఘల్ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. పత్తర్ కా ఘోష్ చాలా ఫేమస్. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలని అనుకుంటారు. హైదరాబాద్ కా ఫేమస్ హలీమ్, షావర్మా, కోవా జిలేబీ, కోవా గులాబ్‌జామ్, షాదూద్ మలాయ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్ మరగ్, సీక్ కబాబ్, ఫిర్నీ, హోటల్ షాబాద్‌లో నాస్టా, ఖట్టి కిచిడీ, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్ ఇలా చెప్పుకొంటూ పోతే జాబితాకు ముగింపే ఉండదు. తెల్లవారుజాము వరకూ ఇక్కడి ఫుడ్ స్టాల్స్ కిటకిటలాడుతుంటాయి. నైట్ లైఫ్‌కి ఐకాన్..నైట్ లైఫ్‌కు హైదరాబాద్ ఐకాన్‌గా మారుతోంది. చాలా ప్రాంతాల్లో లేట్ నైట్ వరకూ ఫుడ్ స్టాళ్లకు అనుమతులు ఇస్తుండటంతో యూత్ కూడా వీకెండ్స్‌లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి బైక్‌లు, కార్లలో నగరాన్ని రాత్రి వేళల్లో చుట్టేస్తున్నారు. ఉదయం సమయంలో ట్రాఫిక్‌తో విసిగిపోయిన వారు.. అర్ధరాత్రి ప్రశాంతమైన నగరాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్, ఉప్పల్ భగా యత్.. నైట్‌లైఫ్‌కు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ లైఫ్‌టైం మెమరీస్ దాచిపెట్టుకుంటున్నారు.ఫుడ్ హబ్‌గా సచివాలయం.. స్ట్రీట్ ఫుడ్ అనగానే ఇప్పటికీ చారి్మనార్ పేరే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్ట్రీట్ ఫుడ్ హబ్‌గా మారాయి. రాత్రి పొద్దుపోయే వరకూ ఇక్కడ ఫుడ్ లవర్స్ రోడ్డు పక్కన దొరికే తినుబండారాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో.. విద్యుత్ కాంతుల్లోని సచివాలయం, అమరవీరుల జ్యోతి చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శకులతో రద్దీగా మారతాయి. చాట్ నుంచి చాక్లెట్ కేక్ వరకూ.. వెనీలా, చాక్లెట్ కప్ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్ ఆమ్లెట్, కారం, ఉప్పు చల్లిన మామిడి, స్వీట్ కార్న్, మసాలా కార్న్, ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్ మోమూస్, స్టీమ్ మోమూస్, చైనీస్ ఫుడ్ ఇలా ఒక్కటేంటి.. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మైలీ, ఎగ్ దోశ, ఎగ్ ఆమ్లెట్ షావర్మా, చికెన్ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ, కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. హుస్సేన్ సాగర్ అందాలను చూసుకుంటూ ఎంచక్కా ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.అదిరే ఫుడ్ నెక్లెస్ రోడ్..! నెక్లెస్ రోడ్డులో అలా కారులో, బైక్‌పై వెళ్తుంటే అక్కడక్కడా వచ్చే సువాసనలు చూస్తుంటేనే ఆ ఫుడ్ లాగించేయాలని అనిపిస్తుంది. ఎంచక్కా కారు లేదా బైక్ ఆపి చక్కగా ఆర్డర్ చేసుకుని, తింటుంటే ఆ మజానే వేరు. ఇక, నెక్లెస్ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ ఫుడ్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ దొరకని ఫుడ్ అంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఫుడ్‌తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు, మంచి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటుంది.హైటెక్ సిటీ–మాదాపూర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల అడ్డా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్‌లో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ విపరీ తంగా పెరిగిపోయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు ఉంటాయి. అర్ధరాత్రి ఆకలిగా అనిపించినా.. కాస్త బోర్ కొట్టినా కొలీగ్స్‌తో కలిసి ఎంచక్కా స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ టిఫిన్లయిన ఇడ్లీ, దోశతో పాటు స్నాక్ ఐటెమ్స్ అయిన సమోసా, మిర్చీ, కట్లెట్, పానీపూరీ ఆహారం ఏదైనా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. హైదరాబాద్ యువతకు మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్‌గా మారాయి. -
Nimrah Cafe: సిటీ స్పాట్స్.. సెల్ఫీ షాట్స్
మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్ సిటీ సెల్ఫీ స్పాట్స్‌గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్‌మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్‌గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్‌కు హాట్‌స్పాట్స్‌గా మారాయి..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్‌ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్‌ను చూడాలనే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్‌తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా చార్మినార్ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్‌తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్‌సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్ ఒకటి. ఓల్డ్‌సిటీ షాపింగ్ అంటే లక్షల క్లిక్కులే.. ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్మంటుంటాయి. చింత చెట్టు కింద సెల్ఫీ.. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు. ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్లు కూడా సెల్ఫీ స్పాట్లుగా మారాయి. మిడ్ నైట్ స్పాట్.. నిమ్హ్రా చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా ది బెస్ట్ సెల్ఫీ స్పాట్‌గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్‌కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇదే కేఫ్‌లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్పోర్ట్ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ట్రెండ్. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్ తదితర ఫుడ్ స్పాట్లు సెల్ఫీ స్పాట్లుగా మారాయి.మొదటి ‘సెల్ఫీ’.. సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్ వెబ్సైట్లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. -
Hyderabad: మొఘల్‌పురాలో.. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్!
నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17 వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లు అందుబాటులో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించ వచ్చు.. అలాగే తమకు నచి్చనవి కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు ఉన్నాయి.ఇప్పటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్(అల్యూమినియం)తో తయారైన ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి నుంచి ఐదు వరకూ.. మధ్యలో నాలుగో పైసా ఉండదనే విషయం కూడా తెలిసి ఉండదు. తూటు పైసతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో పురాతన నాణేలు, కరెన్సీతో పాటు పురాతన వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంది. అల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను బీఎస్ఎన్ఎల్ మాజీ సీటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. – చార్మినార్తూటు పైసా నుంచి ఏక్ అణా వరకూ..ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏక్ అణా, దో అణా.. నయా పైసా, తూటు పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్‌తో తయారైన కుళాయిలు, దీపాంతలు..ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకూ ఉర్డూ ఘర్ వేదికైంది.సేకరణకు చక్కటి వేదిక..నగరంతో పాటు గుంటూరు, ముంబయి, ఢిల్లీ, అకోలా, బెంగళూర్, నాగ్‌పూర్, ఓడిస్సా, బీహార్, చెన్నై, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక.నాటి కరెన్సీతోనే.. నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా దాన, ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి వెయ్యి రూపాయలకు రూ.5 లక్షల వరకూ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టి ఖరీదు చేశాడని.. తిరిగి తమకు విక్రయిస్తే.. రూ.5లక్షల 50వేలు ఇస్తామంటున్నా.. ఇవ్వడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇది అప్పట్లో లండన్‌లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు.ఏడాదికోసారి..ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ చర్రితను తెలుపుతుంది. దీని ద్వారా పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. పురాతన వస్తువుల సేవకరణ చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ విక్రయించడానికి వచ్చాను. ఏడాదికోసారైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉండాలి. – మహ్మద్ తాహెర్, హసన్నగర్చరిత్రను తెలిపేందుకు.. నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో ఇటువంటి అరుదైన చారిత్రక సంపదను ఎగ్జిబిషన్లో ఉంచుతున్నాం.. ప్రజలకు చరిత్రను తెలపడంతోపాటు, పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాం. ఇది దేశ సంపద. – సిరాజుద్దీన్, ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ -
చారిత్రక ఆనవాలుగా చార్మినార్ గడియారం
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్‌కి వచి్చంది. వాచ్‌లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే... నిజాం కాలంలో... నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్‌యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో... 1942 నుంచి లాడ్‌బజార్‌లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్బాజర్లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.పావురాలు తిష్ట వేయడంతో..విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్‌తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్‌కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్‌తో ఏర్పాటు చేశారు. లోపల సిరామిక్ మెటల్‌తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్‌తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్‌కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.48 గంటలకోసారి... నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.నిరంతర పర్యవేక్షణలో...ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం. – గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని -
రాజకీయ కుట్రతో చారిత్రక చిహ్నాల తొలగింపు
చార్మినార్ (హైదరాబాద్): తెలంగాణ రాజముద్ర లోని చారిత్రక చిహ్నాలను రాజకీయ కుట్రతోనే మార్చాలనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జాక్‌పాట్ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.అనంతరం గుల్జార్‌హౌజ్ నుంచి చార్మినార్ వరకు కాలినడకన వచ్చిన ఆయన చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడారు. చేతనైతే గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి తప్ప.. కేసీఆర్‌పై కక్షతో ఆయన చేసిన అభివృద్ధిని కాలరాయొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. చారిత్రక గుర్తింపును విస్మరించారు..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్న వారసత్వ కట్టడాల చిహ్నాలను రాజ ముద్ర నుంచి తొలగించాలని చూడటం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కేటీ ఆర్ చెప్పారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ కట్టడాలకు చారిత్రక గుర్తింపు ఉందన్న విషయా లను సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించడం దురదృష్టకరమ న్నారు. లేని వాటిని చేర్చితే మంచిదే గానీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన చిహ్నాలను ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు.చార్మినార్ చిహ్నాన్ని తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానించినట్లేనన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వీరందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రులు రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, చార్మినార్ బీఆర్ఎస్ ఇంచార్జి మహ్మద్ సలావుద్దీన్ లోధీ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు
-
TG: రాష్ట్ర చిహ్నం మార్పు.. చార్మినార్ ముందు కేటీఆర్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuriesWhen one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024 -
నేడు చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
-
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
KTR | హైదరాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ అనేవి రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..ఇదేం రెండునాల్కల వైఖరి..!ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్పగోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”అధికారిక గీతంలో కీర్తించి..!!అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!మీ కాంగ్రెస్ పాలిస్తున్న... కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించంపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’ అని పేర్కొన్నారు. -
రంజాన్ స్పెషల్ : విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్న చార్మినార్ (ఫొటోలు)
-
చార్మినార్‌లో కనీస సౌకర్యాలు కరువు
హైదరాబాద్: చార్మినార్ చూసేందుకు వచ్చన సందర్శకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో పర్యాటకులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి తాగునీటితో పాటు బ్యాగులు ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు క్లాక్‌రూంలు అందుబాటులో లేవు. భద్రతాచర్యల దృష్ట్యా చార్మినార్‌కట్టడంలోని బ్యాగ్‌లతో పాటు ఇతర వస్తువులను అనుమతించరు. దీంతో తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ► రోజూ సందర్శకుల ద్వారా వస్తున్న ఆదాయం రోజురోజుకు పెరుగుతున్నా.. సందర్శకులకు ఆశించిన స్థాయిలో సౌకర్యాలు లభించడం లేదనే విమర్శలున్నాయి. ► వీకెండ్లలో పర్యాటకుల సంఖ్య రోజుకు 5 వేల నుంచి 6 వేలకు పైగా ఉంటుండటంతో వారి ద్వారా ఏఎస్ఐకు దాదాపు రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. రోజుకు లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని ప్రశ్నిస్తున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ... దేశ విదేశాల నుంచి చార్మినార్ కట్టడాన్ని సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపట్టడానికి పురాతత్వశాఖ (ఏఎస్ఐ– ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి చూపడం లేదని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాల ఏర్పాటులో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినార్ల కెమికల్ ట్రీట్మెంట్ పనులు.. మినార్లకు కేవలం కెమికల్ ట్రీట్మెంట్ పనులు మాత్రమే చేపడుతున్నారని సందర్శకులకు అవసరమైన సౌకర్యాల పట్ల ఏమాత్రం దృష్టి సారించడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారి్మనార్ కట్టడంలో సందర్శకులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా అందుబాటులో లేదు. కట్టడంలో ఏర్పాటు చేసిన ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని పలువురు వాపోతున్నారు. రిమోట్ ప్రెసెంస్ కియోస్కీని ఏర్పాటు చేయాలి.. చారి్మనార్ కట్టడంలో గతంలో ఏర్పాటు చేసిన రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ ప్రస్తుతం కనుమరుగైంది. మక్కా మసీదు, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, యునాని, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్ తదితర పురాత న కట్టడాలను దగ్గరగా కనులారా తిలకించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2002 జూన్ 8న చార్మినార్ కట్టడంలోని ఒక చోట చార్మినార్ రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. రూ.28 లక్షల వ్యయంతో.. దాదాపు రూ. 28 లక్షల రూపాయల వ్యయంతో పురాతన కట్టడాలను దూరంగా ఉన్నవాటిని దగ్గరగా చూసేందుకు చార్మినార్ కట్టడంలో రిమోట్ ప్రెసెంస్ క్రియోస్కిని ఏర్పాటు చేశారు. దీనికోసం చారి్మనార్ పైభాగంలో నాలుగు కెమెరాలను అమర్చారు. కొన్నేళ్ల పాటు రెండు కెమెరాలు పనిచేయకుండా పోయాయి. మిగిలిన రెండు కెమెరాల ద్వారా సందర్శకులు చార్మినార్, మక్కామసీద్, ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లను తిలకిస్తున్నారు. ప్రస్తుతం అవి కూడా పనిచేయడం లేదని సమాచారం. టచ్ స్క్రీన్ ఆనవాళ్లు కూడా చారి్మనార్ కట్టడంలో కనిపించకుండా పోయాయి. పనిచేయని రిమోట్ ప్రెసెంస్ కియోస్కీ టచ్ర్‌స్కీన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. -
చార్మినార్ లో బీజేపీ ముందంజ
-
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్‌కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్‌లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్‌గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023 -
మజ్లిస్ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ పారీ్టకి చారి్మనార్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ పోటీ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో మజ్లిస్ కార్పొరేటర్లు.. ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్‌గట్టి, మొఘల్‌పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఘాన్సీబజార్ నుంచి .. నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్ డివిజన్ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్ డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్‌లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. -
ప్రధాన పార్టీలోల్లో క్షణ క్షణం.. నిరీక్షణం
హైదరాబాద్: నామినేషన్లు దాఖలు చేయడానికి ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల నుంచి టికెట్లను ఆశిస్తున్న వారు ఆందోళనలో ఉన్నారు. బీఫాం చేతికొచ్చేంత వరకు ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నాలుగు ప్రధాన పారీ్టల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికార బీఆర్ఎస్ ఆగస్టులోనే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. నేటికీ వాటికి అభ్యర్థులనే ప్రకటించలేదు. టికెట్లు ప్రకటించిన వారిలో బీఫాంల పంపిణీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ, పాతబస్తీ పరిధిలోని చారి్మనార్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్ అభ్యర్థులకు ఇంతవరకు బీఫారాలను జారీ చేయలేదు. దాంతో బీఫాం చేతికందేంత వరకు ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులున్నారు. ఇక గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడలేదు. అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం తేల్చకపోవడంతో ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి. ఎంఐఎంలో మూడు పెండింగ్ నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, బహదూర్‌పురా, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌లకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారుకు మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌లోనూ రెండు కాంగ్రెస్ పార్టీ సైతం పాతబస్తీలోని చార్మినార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో కలిసి ఉన్న పటాన్చెరు నియోజకవర్గానికి అభ్యర్థని వెల్లడించలేదు. బీజేపీకి జనసేనతో కిరికిరి ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సైతం నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆపార్టీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో దానికి ఏయే సీట్లు కేటాయిస్తారోనన్న టెన్షన్‌తో బీజేపీ ఆశావహులున్నారు. అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్‌తోపాటు కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ∙జనసేన శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాలను కోరుతున్నట్లు తెలిసి బీజేపీ శ్రేణులు గందరగోళంలో మునిగాయి. ఎట్టకేలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్‌ను జనసేనకు వెళ్లకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపులు ఫలించినట్లు సమాచారం. వివిధ కారణాలతో నగరంలోని నాలుగు ప్రధాన పారీ్టలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయోననే చర్చ జరుగుతోంది. -
మజ్లిస్ పార్టీ కంచు కోటను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ స్థానాలపై దృష్టి సారించింది. ఆ పార్టీ కంచు కోట అయిన పాతబస్తీలో దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. అధికార బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనారిటీ ఓట్లను గండికొట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హలత్–ఏ–హజరా పేరుతో మజ్లిస్ సభలకు శ్రీకారం చుట్డడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే మజ్లిస్ తీరుపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహానికి సిద్ధమైంది. మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో గట్టి పోటీతో ఉక్కిరిబిక్కిరి చేసి అగ్రనేతలు పాతబస్తీ దాటకుండా కట్టడి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అన్ని స్థానాలపై కాకుండా కొన్నింటిపై మాత్రమే దృష్టి సారించింది. వాస్తవంగా పాతబస్తీలో తలపడేందుకు అధికార పక్షంతో పాటు మిగతా పక్షాలు సైతం మొక్కుబడిగా అభ్యర్థులను బరిలో దింపడం ఆనవాయితీ. అయితే.. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చార్మినార్ మినహా అభ్యర్థులను ప్రకటించింది. మూడింటిపైనే ఆశలు.. కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో పూర్వ వైభవం కోసం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను దింపుతోంది. ఇప్పటికే నాంపల్లి, మలక్‌పేట స్థానాలకు అభ్యర్ధులకు ప్రకటించగా. చార్మినార్ సెగ్మెంట్‌కు ప్రకటించాల్సి ఉంది. నాంపల్లి స్థానం నుంచి వరుసగా మూడుసార్లు మజ్లిస్ అభ్యర్థులతో నువ్వా నేనా అనే విధంగా తలపడి పరాజయం పాలైన ఫిరోజ్ ఖాన్‌ను ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుతో పాటు సానుభూతి కూడా కలిసి వచ్చి బయటపడే అవకాశం ఉందని భావిస్తోంది. మజ్లిస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను యాకుత్‌పురా స్థానానికి మార్చి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిత్వం ప్రకటించలేదు. పాతబస్తీలో ముస్లిం సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న అలీ మస్కతి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చార్మినార్ స్థానం నుంచి అలీ మస్కతిని పోటీ చేయాలని కోరామని వెల్లడించారు. మరోవైపు మజ్లిస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌కు తిరిగి సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో ఆయనతో సంప్రదింపులు ప్రారంభించింది. అవసరమైతే కాంగ్రెస్ పక్షాన ఆయనను బరిలో దింపాలని ఒక ఆప్షన్‌గా పెట్టుకొని వేచి చూస్తోంది. మలక్‌పేట స్థానంపై సైతం గట్టి పోటీకి సిద్ధమైంది. అక్కడి నుంచి స్థిరాస్తి వ్యాపారి షేక్ అక్బర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు అక్కడి నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి మజ్లిస్‌కు గట్టి పోటి ఇచి్చన మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీ ఖాన్ని పారీ్టలో చేర్చుకుంది. కాంగ్రెస్ పక్షాన ఒకసారి పోటీ చేసి పారీ్టకి దూరమైన మందడి విజయ సింహారెడ్డిని సైతం పార్టీ కండువా కప్పింది. చాప కింద నీరులా పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి పార్టీ జాతీయ మైనారిటీ నేతలను సైతం రంగంలో దింపాలని యోచిస్తోంది. -
మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు రాజేస్తోంది. మరోమారు పార్టీ అంతర్గత సంక్షోభం పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను వయోభారం దృష్ట్యా ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తగా యువతకు అవకాశం కల్పించాలన్న నిర్ణయం మజ్లిస్‌కు తలనొప్పిగా తయారైంది. అధిష్టానం ప్రతిపాదనల మేరకు ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అందులో ఒకరు మాత్రం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న మెలిక పెట్టడం పార్టీని చిక్కుల్లో పడేసినట్లయింది. అవకాశం ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్న అల్టిమేటం తిరుగుబాటు సంకేతాన్ని సూచించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాల క్రితం మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడిన విభేదాలతో సీనియర్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఏకంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి మజ్లిస్ బచావో తెహరిక్ను స్థాపించారు. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ను ఓడించి కేవలం చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేసి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి అమానుల్లాఖాన్ సహచరుడైన సీనియర్ ఎమ్మెల్యే తాజాగా చార్మినార్కి అల్టిమేటం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సంప్రదింపుల్లో కాంగ్రెస్ .. మజ్లిస్ పార్టీని పాతబస్తీలో దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మజ్లిస్ తమను ప్రధాన శత్రువు పక్షంగా పరిగణించి వ్యతిరేక ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు మింగుడు పడని అంశంగా తయారైంది. ఇప్పటికే చార్మినార్ నుంచి బలమైన ముస్లిం అఅభ్యర్థని రంగంలోని దింపేందుకు అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో సంప్రదింపుల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కాంగ్రెస్ పక్షాన చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూడాలనే యోచనలో ముంతాజ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమెరుగని ముంతాజ్ ఖాన్‌కు చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. దానిని అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల మార్పు, వయోభారం దృష్ట్యా సీనియర్ ఎమ్మెల్యేను పోటీ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న మజ్లిస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీలకు బదులుగా కొత్తవారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి స్థానంలో రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాన్ని ఈసారి యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చు చేసి, నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ లేదా కూతురు ఫాతిమాను రాజకీయ అరంగ్రేటం చేయించాలని మజ్లిస్ భావిస్తోంది. రంగంలోకి అక్బరుద్దీన్ ► అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ ప్రతిపాదనలపై వారితో చర్చించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో అక్బరుద్దీన్ ఓవైసీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపినా ఫలప్రదం కానట్లు తెలుస్తోంది. ►వయోభారం దృష్ట్యా యువతకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా, స్వచ్ఛందంగానే తప్పుకునేందుకు ముంతాజ్ ఖాన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే గత ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్‌కు అవకాశం కల్పించాలని విజ్ఙప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఎంబీటీ నుంచి ఎంఐఎంలోకి తిరిగి వచ్చేందుకు ‘జీవితకాలం సీటు ఖాయం’ అన్న అప్పటి పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీ ఇచ్చిన నోటి మాట కూడా ఈ సందర్భంగా ముంతాజ్ అహ్మద్ ఖాన్.. అక్బరుద్దీన్ ఒవైసీకి గుర్తు చేసినట్లు సమాచారం. ఒకవేళ కుమారుడికి సీటు ఇవ్వకుంటే చార్మినార్, యాకుత్పురాల నుంచి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ అల్టిమేటం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా తయారైంది. -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
HYD: 21 కిలోల గణేషుడి లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. ఈనెల 18న వినాయక చవితితో మొదలైన నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం గణేషుడిని 28న నిమజ్జనం చేయనున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఝాన్సీ బజార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నుంచి కొంతమంది విద్యార్థులు లడ్డూను దొంగలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లారు. అనంతరం ఆ లడ్డూని పంచుకొని తినేశారు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు శ్యామ్ అగ్రర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సీసీ ఫుటేజీ దృశ్యాలు పరీక్షించగా.. మైనర్ విద్యార్థులు చోరికి పాల్పడినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసిన స్టూడెంట్స్ pic.twitter.com/0Q4jYIQ6Q1 — Telugu Scribe (@TeluguScribe) September 24, 2023 -
WC 2023: చార్మినార్ ముంగిట వన్డే వరల్డ్‌కప్..
ICC ODI World Cup 2023: ప్రపంచకప్ ట్రోఫీ గెలవడం ప్రతీ క్రికెటర్ కల.. కెరీర్లో ఎన్నో అద్భుత రికార్డులు, అరుదైన ఘనతలు సాధించినా.. కనీసం ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ఆటగాళ్లు.. ఆ కప్పును అందుకోగానే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్.. మరి అభిమానులకు నేరుగా మ్యాచ్‌లు వీక్షించడం కంటే సంతోషం మరొకటి ఉండదు.. ముఖ్యంగా ఫైనల్లో ట్రోఫీ ప్రదానోత్సవం ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే అనడంలో సందేహం లేదు.. ఆటగాళ్ల భావోద్వేగాలకు ఒక్కోసారి వీరాభిమానుల కళ్లు కూడా చెమర్చుతాయి.. భాగ్యనగరానికి వచ్చేసిన ట్రోఫీ ఆ కప్పును తామే అందుకున్నంత సంబరం కూడా! మరి ఆ ట్రోఫీని కళ్లారా.. అది కూడా అతి దగ్గరగా చూసే అవకాశం వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదా! హైదరాబాద్ వాసులకు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది.. అంతరిక్షం మొదలు.. ప్రపంచ దేశాలను చుట్టి వస్తున్న వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది. చార్మినార్ ముంగిట వన్డే వరల్డ్‌కప్ వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్ ముందు గురువారం ఈ ట్రోఫీని ప్రదర్శించారు. దీంతో ఎప్పుడోగానీ లభించే ఈ సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు సందర్శకులు అక్కడికి చేరుకోకుండా ఉంటారా?! కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ట్రోఫీ టూర్ ఇక్కడే మొదలై.. ఇప్పుడిలా.. జూన్ 27న ఇండియాలో వరల్డ్‌కప్ ట్రోఫీ టూర్ ఆరంభం కాగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండియా, యూఎస్ఏ, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, మలేషియా, ఉగాండా, నైజీరియా, సౌతాఫ్రికా.. మళ్లీ ఇప్పుడు.. సెప్టెంబరు 4న ఇండియాకు చేరుకుంది. తాజాగా హైదరాబాద్‌కు వచ్చేసింది. చార్మినార్‌తో పాటు ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనూ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచనున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా అక్టోబరులో ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక.. అంతకు ముందు తాజ్‌మహల్ ముంగిట కూడా ట్రోఫీని ప్రదర్శించిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు #icc #CricketWorldCupTrophy put on display at #charminar #Hyderabad @cricketworldcup @ICC @arvindkumar_ias @BCCI @HiHyderabad @swachhhyd @KTRBRS @ntdailyonline pic.twitter.com/zXbODLgCuD — ℙ𝕖𝕠𝕡𝕝𝕖 𝕠𝕗 ℍ𝕪𝕕𝕖𝕣𝕒𝕓𝕒𝕕 (@PeopleHyderabad) September 21, 2023 -
చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
దూద్‌బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్ నగరంలో నేషనల్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్‌లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైటెక్ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్ హైదరాబాద్‌లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్‌ను ప్రారంభించనున్నామన్నారు. తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జాన్వీ శర్మతో పాటు వినయ్ కుమార్ మిశ్రా, చంద్రకాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు (ఫొటోలు)
] -
Ramadan 2023: పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్ అల్ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మక్కా మసీదులో జరిగే ప్రార్థనల కారణంగా ఆ సమయంలో చార్మినార్–మదీనా, చార్మినార్–ముర్గీ చౌక్, చార్మినార్–రాజేష్ మెడికల్ హాల్ (శాలిబండ) మధ్య రోడ్లు పూర్తిగా మూసి ఉంటాయి. ఈ మార్గాల్లోకి ఎలాంటి వాహనాలు అనుమతించరు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, సర్దార్ మహల్ సహా ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని సుభాష్ రోడ్ కూడా మూసేస్తారు. వాహనాలను ప్రత్యా మ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. ఈ ఆంక్షలు, మళ్లింపులు ఆర్టీసీ బçస్సులకు వర్తిస్తాయని, సహాయ సహకారాలు అవసరమైన వాళ్లు 9010203626 నంబర్లో సంప్రదించాలని సుధీర్‌బాబు సూచించారు. చదవండి: Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు -
Jr Ntr-Pranathi: చార్మినార్‌లో ఎన్టీఆర్ భార్య ప్రణతి షాపింగ్.. ఫోటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాపులర్ అయిన తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సినిమా ఈవెంట్స్‌లో పెద్దగా కనిపించదు. స్టార్ హీరో భార్య అయినప్పటికీ లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న దాఖలాలు లేవు. అటు ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీకి సంబంధించిన మూమెంట్స్‌ను చాలా అరుదుగా షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే రంజాన్ సీజన్ కావడంతో హైదరాబాద్ వాసులు చార్మినార్‌లో నైట్ బజార్‌కి క్యూ కడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా నైట్ బజార్లో షాపింగ్ చేస్తూ సందడి చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో లీక్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ పిక్‌ని షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. స్టార్ స్టేటస్ ఉండి కూడా ప్రణతి ఇలా సింపుల్‌గా కనిపిస్తుండటంతో ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
చార్మినార్‌లో గెలిచి చూపిస్తా: రఘునందన్‌రావు
నల్లగొండ టూటౌన్: సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్.. 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను చార్మినార్‌లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు. తండ్రి కేసీఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరేచోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్‌రావు మాట్లాడారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది: జేపీ నడ్డా -
చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ పోలీసులకు ఫోన్
-
చార్మినార్ వద్ద బాంబు కలకలం.. పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం చెలరేగింది. ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ వ్యాఖ్యలు చేశారు. బాంబు ఫోన్ కాల్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో చార్మినార్ వద్దకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బాంబు ఫోన్ కాల్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే, నిజంగానే బాంబు అమర్చారా? లేక ఎవరైనా పోకిరీ ఇలా ఫోన్ చేశాడా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
తెలుగు మాల్గుడి
డెబ్బై ఏళ్ల క్రితం సంగతి. చిన్నారి లోకేశ్వర్‌కు పుట్టు వెంట్రుకలు తీయాలి. ఇంటి ఇలవేల్పు చిల్పూరు ‘బుగులు వెంకటేశ్వర స్వామి’. ఈ చిల్పూరు స్టేషన్ ఘన్పూర్ నుంచి పదీ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్‌లోని షాలిబండలో ఉండే ఆ దిగువ మధ్యతరగతి కుటుంబం ఆ కార్యక్రమం కోసం తెల్లవారుజామున లేచి నాంపల్లి స్టేషన్ చేరుకుని, వరంగల్ చేరి, అక్కడ నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని చిల్పూరు చేరడం కథ. మరి మలుపు ఏమిటి? తిరుగు ప్రయాణంలో బండి తోలేవాడితో సహా అందరూ నిద్రపోతే కారుచీకట్లో ఎద్దులు గుడ్డెత్తుగా వెళ్లి సరాసరి దిగుడుబావి అంచున ఆగిపోవడం. అవి అడుగు ముందుకేస్తే అంతే సంగతులు. రచయిత అంటాడు– ఇలా బుగులు పుట్టించి మళ్లీ కాపాడటమే బుగులు వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత... ఇలా భక్తులతో పరాచికం ఆడుతాడు కాబట్టే అందరూ ఆయనను బుగులెంకటేశ్వర్లు అంటారు. ఈ కథ చదివినవారు ఈ మొత్తం ప్రయాణంలోని ప్రతి తావునూ గుర్తు పెట్టుకుంటారు. బుగులెంకటేశ్వర్లును కూడా! ‘వేసవి కాలం. నిండుపున్నమి కాలం. మా గల్లీలో ప్రతి ఇంటి ముందు జాజురంగుతో పెద్ద పెద్ద అరుగులు. అందరూ అన్నాలు తినంగనే ఇండ్లల్ల గ్యాసు దీపాలు ఆర్పేసి నులక మంచాలు, నవారు మంచాలు, చినిగిన ఈత చాపలు, అతుకుల బొంతల పక్కబట్టలు, షత్రంజీలు తీసుకుని మరచెంబులలో మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు గావించుకుని మా గల్లీల జమయ్యేవారు. పిల్లలం అరుగుల మీద పెద్దలు ముసలోళ్లు మంచాలల్ల, ఎవరింటి ముందు వారు కాళ్లు చాపుకుని, నడుం వాల్చి సెటిల్ అయ్యేవారు’... చదివితే ఏమనిపిస్తుంది? ఆ కాలానికి ఆ తావుకూ వెళ్లాలనిపించదూ? ‘బండ అంటే శాలిబండ. చార్మినార్ నుండి ఆలియాబాద్‌కు పొయ్యే తొవ్వల మొగల్పుర దాటంగనే నట్టనడుమల నిటారుగ ఉండేదే శాలిబండ. ఇది చాలా ఎత్తు కావున బండ అని ఈ ప్రాంతాన్ని అంటారు. పాత నగరంల చాలా బస్తీల పేర్లు బండతో ముడిపడి ఉన్నవి. గాజీ బండ, పిసల్ బండ, రాంబక్షి బండ, మేకల బండ లాంటివి. వీటి దగ్గరికి పొయ్యేటప్పుడు అంతా చడావ్. వచ్చేటప్పుడు అంతా ఉతార్. జీవితంలోని ఎత్తుపల్లాల్లాగ’! ఎంత బాగుంది. ఈ ఎత్తుపల్లాల చోటుకి వెళ్లి ఆ మనుషుల కథల్లో తల దూర్చాలనిపించదూ? తెలుగులో ‘క్షేత్ర కథానికల’ పరంపర ఉంది. ఆ పరంపరలో వచ్చిన తాజా పుస్తకం ‘చార్మినార్ కథలు’లోని ఉటంకింపులివి. రాసింది పరవస్తు లోకేశ్వర్. డెబ్బయి ఏళ్ల క్రితంనాటి జీవితం ఇప్పుడు ఎందుకు రాసినట్టు? డెబ్బయి ఏళ్ల క్రితం జ్ఞాపకాలు ఈ తరానికి ఎలా వర్తమానమైనట్టు? ఎలా అంటే మట్టి ఎప్పటికీ అదే. మనుషులు ఎప్పటికీ వారే. నడుమ ప్రయాణంలో నేర్చుకోవలిసిన పాఠాలను గతం నుంచి పునశ్చరణ చేసుకోవడానికే ఇలాంటి కథల అవసరం. శ్రేష్టమైన సాహిత్యం స్థల, కాలాల నిర్దిష్టత పాటిస్తుంది. ఏ కాలంలో ఏ చోటులో ఏ కథ నడుస్తున్నదో తెలియడం పాఠకుడికి అవసరం. కథ పాదాలు ఊనుకుంటే పాఠకుడి పాదాలు కూడా ఊనుకుంటాయి. తెలుగులో కృష్ణ ఒడ్డు కథలను ప్రభావవంతంగా చిత్రించినవాడు సత్యం శంకరమంచి ‘అమరావతి కథల్లో’. ప్రవహించి ఆరిపోయే పెన్న ఒడ్డు ఆశ నిరాశలకు సిరా చుక్కలు పోసినవాడు పి.రామకృష్ణారెడ్డి ‘పెన్నేటి కథల్లో’. తిరుపతి దాపున ‘మిట్టూరు’ను క్షేత్రంగా చేసుకుని ‘పచ్చనాకు సాక్షిగా’, ‘మిట్టూరు కతలు’ రాశాడు నామిని. ఆలమండ ప్రాంతాన్ని రంగస్థలం చేసుకుని ‘వీరబొబ్బిలి’, ‘గోపాత్రుడు’, ‘పిలకతిరుగుడు పువ్వు’ మహా కావ్యాలు సృష్టించాడు పతంజలి. నెల్లూరు జిల్లా కావలిని క్షేత్రంగా చేసుకుని ‘దర్గామిట్ట కతలు’ రాశాడు ఖదీర్‌బాబు. సరస్సు జీవితం మొదటిసారి ‘ప్రళయ కావేరి కతలు’గా మలిచాడు స.వెం.రమేశ్. నక్కా విజయరామరాజు ‘భట్టిప్రోలు కథలు’ ఆ ఊరికి గొడుగు పట్టాయి. గుంటూరు జిల్లాలోని చిన్న ఊళ్ల మాలపల్లెల్నే క్షేత్రంగా తీసుకుని ‘కటికపూలు’ రాశాడు ఇండస్ మార్టిన్. అమలాపురంలోని ఒకనాటి బ్రాహ్మణ అగ్రహారపు అటక జాడీలను నేలకు దించాడు ముక్కామల చక్రధర్ ‘కేరాఫ్ కూచిమంచి’ కథల్లో. ఇప్పుడు ‘చార్మినార్ కథలు’. నిజానికి నాలుగు వందల ఏళ్ల చార్మినార్ చుట్టూ ఎన్ని వేల కథలు దాగి ఉండాలి. ఎన్ని అనుభవాలు ఉడికి ఉండాలి. ఎన్ని అశ్రువులు మరిగి ఉండాలి. ఎన్ని జీవన సౌందర్యాలు అత్తరు బుడ్డీలకు మల్లే ఎగజిమ్మి ఉండాలి. ఈ క్షేత్రం నుంచి వెలువడిన తెలుగు కథలు తక్కువ. ఇప్పుడైనా ఇవి వచ్చాయంటే ‘నా జిమ్మేదారి’ అని రచయిత భావించడమే! ఈ పుస్తకం నిండా మనుషులూ స్థలాలూ స్థలాలలో జీవించిన మనుషులూ. ఇటీవలే శాలిబండలోని ‘ఆశా టాకీసు’ను కూల్చివేస్తే రచయిత అక్కడకు వెళ్లి చూసి చేసే తలపోతలతో ఒక కథ ఉంటుంది. కూల్చితే ఏదైనా కూలిపోతుంది. కథ రాస్తే నిలిచి ఉంటుంది. మరి ఈ కథల్లో పాన్‌సుపారీలా కలగలసిన తెలుగు–ఉర్దూల భాష సుందర ‘చార్మినార్ మాండలికం’. పాఠకుడా... నీవున్న క్షేత్రం నుంచి ఒక రచయిత వచ్చి గత కాలాన్ని నమోదు చేశాడా? నీ తావులోని ఆనవాళ్ల ఊసులు చెప్పాడా? పదిలమైన అమాయకత్వాన్ని మూటగట్టాడా? నీ క్షేత్రాన్ని తిరిగి నీకు చూపించాడా? ఈ మోటార్లు, వాహనాలు, మిద్దెలు, మేడలకు పూర్వం మనుషులు చిన్న చిర్నవ్వుల ఐశ్వర్యంతో ఎలా జీవించారో బోధపరిచాడా? ఈ బాహాబాహీ కాలంలో కలిసి బతకడం అంటే ఏమిటో అరుగు మీద కూచోబెట్టి ముద్ద కలిపి రుచి చూపించాడా? క్షేత్ర కథానికలు చదువు! రచయితా... క్షేత్ర కథానికలు రాయి! దేశమంటే మనుషులూ వారికి సంస్కారం నేర్పే మట్టేననే ఎరుకకు మరో మార్గం లేదు. -
సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్‌లో తొలి కట్టడం ఏంటో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఒకనాడు కుగ్రామం.. నేడు మహానగరం. 1591 అక్టోబర్ 9న పునాదిరాయి పడ్డ ఈ గడ్డ ఇప్పుడు విశ్వనగరంగా రూపాంతరం చెందింది. ‘హే దేవుడా..! చేపలతో సరస్సును నింపినట్టుగా, నా నగరాన్ని ప్రజలతో నింపు’.. అని ప్రార్థించిన నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్‌షా కలలు దాదాపుగా ఫలించాయి. కోటి మందికిపైగా ఉన్న మహానగరంగా ఖ్యాతికెక్కింది. చదువు పూర్తి చేసిన యువత.. ఉద్యోగ అన్వేషణలో వచ్చిన నిరుద్యోగి.. పొట్టచేత పట్టుకొని ఎవరొచ్చినా ప్రేమతో అక్కున చేర్చుకునే భాగ్యనగరిగా వర్ధిల్లుతోంది. సామాన్యులకు అనువైన నగరంగా విరాజిల్లుతోంది. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు ఆలవాలంగా నిలుస్తోంది. మూసీ, ఈసీ తెహజీబ్‌గా భిన్నసంస్కృతుల సమ్మిళితంగా ప్రసిద్ధికెక్కింది. మినీ భారత్‌గా పేరు పొందింది. ఒకసారి ఈ నేలపై అడుగుపెట్టిన వారెవరైనా, హైదరాబాద్‌పై మనసు పారేసుకోకుండా ఉండలేరనేది నిర్వివాదాంశం. 1591 వరకు చంచలం (చిన్న గ్రామం)గా ఉన్న ఈ ఊరు మహ్మద్ కులీ కుతుబ్‌షా ఆలోచనలు.. ఇరానీ ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్ సృజన కారణంగా హైదరాబాద్‌గా అవతరించింది. తొలి కట్టడం పురానాపూల్.. హైదరాబాద్ నగరంగా ఆవిర్భవించకముందే, ఈ నేలపై నిర్మితమైన తొలి కట్టడం పురానాపూల్ వంతెన. ఇది 1578లో దీన్ని నిర్మించారు. దక్షిణ భారతంలో తొలి వారధి కూడా ఇదే. భాగ్యనగర నిర్మాణం మాత్రం చార్మినార్ స్మారక చిహ్నంతో ప్రారంభమైందని.. మహ్మద్ కులీ చేతుల మీదుగా 1591 అక్టోబర్ 9న పునాది పడిందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలున్నాయని దక్కన్ హెరిటెజ్ నిర్వాహకుడు సఫీవుల్లా చెప్పారు. అందుకు ఆనాటి ఒక ఫర్మానాలో పొందుపరిచిన విషయాలే రుజువులని ఆయన గుర్తు చేశారు. ఇస్లామియా హిజ్రీ కేలండర్ వెయ్యి ఏళ్లు పూర్తయిన వేళ ఖగోళ శాస్త్ర నిపుణులు అక్టోబరు తొమ్మిదిగా నగర అవతరణను లెక్కించినట్లు ఆయన చెబుతున్నారు. ఈ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చరిత్ర అధ్యయనకారులూ లేకపోలేదు. నయా పోకడలతో వర్షాకాలంలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరినట్లు.. విశ్వస్థాయికి ఎదుగుతున్న భాగ్యనగరంలో పాతవి కనుమరుగవుతూ.. నయా పోకడలు, కొత్త పంథాలు జోష్ నింపుతున్నాయి. ఏళ్ల తరబడి అలవాటుగా మారిన కొన్ని సంస్కృతులకు దూరం కావాల్సి రావడం బాధనిపించినా.. అనివార్యంగా కొత్తవాటి వైపు మారక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించిన పురాతన కట్టడాలు.. శిథిలం పేరుతో నేలకూల్చక తప్పడం లేదు.హైదరాబాద్ అంటే ఒకప్పుడు మూసీ అవతల కేంద్రంగా పాతబస్తీ ఉండేది. మూసీ ఇవతల కొత్త నగరం విస్తరించి దినదినాభివృద్ధి చెందుతోంది. జయహో భాగ్యనగరం. చదవండి: కోచింగ్ పూర్తాయె.. కొలువు రాదాయె! -
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అస్సోం సీఎం
చార్మినార్: తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..ఇది సరైన పద్ధతి కాదని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా అన్నారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక హారతిలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు బాగుపడితేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని....ఇది సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. -
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో, ముజ్లిస్ నేతలు.. తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు. భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. -
సరదాగా సండే (ఫొటోలు)
-
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్
చార్మినార్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దయిన ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమం ఈ నెల 21 (నేటి) నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే ప్రారంభమైంది. ఈ ఆదివారంతో ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని కులీకుతుబ్‌షా నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి తెలిపారు. స్టాల్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల స్టాల్స్ కొనసాగిస్తామని.. వినోదాత్మక కార్యక్రమాలు ప్రస్తుతానికి ఉండవని ఆయన తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. శనివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. చార్మినార్ కట్టడంతో పాటు హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలో సందర్శకుల సందడి కనిపించింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ
సాక్షి, హైదరాబాద్: ‘అతిథి దేవోభవ’ అంటూ భాగ్యనగరం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్ వంటి శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు యథావిధిగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వివిధ దేశాల నుంచి ప్రతిరోజు 5000 మంది, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 10 వేల మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య సాధారణ రోజుల్లో 3000 వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 7500 వరకు ఉంటుంది. మరో 2000 నుంచి 2500 మంది విదేశీ పర్యాటకులు నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కోవిడ్ కారణంగా ఈ రాకపోకల్లో స్తబ్దత నెలకొంది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి మొదలైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే విదేశీ రాకపోకలు కూడా పెరిగాయి. యూరోప్ దేశాల నుంచి నగరానికి ఎక్కువ మంది వస్తున్నట్లు జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వేచి చూసే ధోరణి వల్ల ప్రయాణం వాయిదా వేసుకున్నారని, రెండు నెలలుగా రాకపోకలు తిరిగి ఊపందుకున్నాయని పేర్కొన్నారు. ఇది ‘రివెంజ్ టూరిజం’... ఏడాదికోసారి ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి సేదతీరడం సాధారణమైన అంశం. అలాగే పర్యాటక ప్రియులు సైతం దేశవిదేశాలను సందర్శించి తమ అభిరుచిని చాటుకుంటారు. కానీ కోవిడ్ కారణంగా ఈ పర్యటనలు నిలిచిపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో గట్టు తెగిన ప్రవాహంలా జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల తాకిడిని ట్రావెల్స్ సంస్థలు ‘రివెంజ్ టూరిజం’గా అభివర్ణిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలోనే భారతదేశ సందర్శన కోసం తరలి వస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన వాళ్లు దక్షిణాదిలో హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, తదితర ప్రాంతాలతో పాటు రామప్ప ఆలయాన్ని సైతం ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కోవిడ్‌కు ముందు ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే గత మే నెలలో 93 శాతం మంది జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86 శాతం వరకు ఉండడం గనార్హం. జూన్ 10వ తేదీన ఒక్క రోజే 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మే నెలలో 15 లక్షలకు పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరారు. నగరం నుంచి ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్లకు సర్వీసులు నడుస్తున్నాయి. హాంకాంగ్ మినహా, అంతకుముందున్న అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇప్పుడు విమాన సర్వీసులు ఉన్నాయి.కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులను జోడించారు. (క్లిక్: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..) -
చార్మినార్ వద్ద మల్టీలెవల్ కారు పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద త్వరలో మల్టీలెవల్ కారు పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో తెలిపారు. ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఓ స్థలంలో ఘన వ్యర్థాలను పడవేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోందని పేర్కొంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో ఆయన ఈ జవాబిచ్చారు. ఈ పనులు చేపట్టేందుకు డిజైన్లు రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రతినిధుల బృందం ఇటీవల కోయంబత్తూర్ని సందర్శించి మల్టీ లెవల్ కారు పార్క్ విధానాన్ని అధ్యయనం చేసిందని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి) -
భాగ్యలక్ష్మి అమ్మవారికి యోగి ప్రత్యేక పూజలు
చార్మినార్(హైదరాబాద్): ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని యోగి స్వయంగా హారతి అందజేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం ఉదయం 7.50 గంటలకు యోగి చార్మినార్‌కు చేరుకోగానే అప్పటికే అక్కడ వేచివున్న పార్టీ శ్రేణులు ‘‘యోగీ జిందాబాద్..బుల్డోజర్ బాబా జిందాబాద్’’అంటూ నినాదాలు చేశారు. దేవాలయంలో 15 నిముషాలు గడిపి అక్కడినుంచి వెనుదిరిగారు. యోగి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు టి.ఉమామహేంద్ర తదితరులున్నారు. -
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి.. ఆదివారం ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. సీఎం యోగి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. #WATCH | Telangana: Uttar Pradesh Chief Minister and BJP leader Yogi Adityanath offers prayers at Shri BhagyaLaxmi Mandir, Charminar in Hyderabad. pic.twitter.com/VskBaSBRYE — ANI (@ANI) July 3, 2022 -
సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. కాగా, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా మరికొందరు నేతలు భాగ్య నగరానికి రానున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం యూపీ సీఎం యోగి.. నేడు(శనివారం) చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల కారణంగా యోగి ఆదిత్యానాథ్.. రేపు(ఆదివారం) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోకున్నారు. ఇది కూడా చదవండి: కమలోత్సాహం! భాగ్యనగరం కాషాయమయం.. -
చార్మినార్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుల్జార్‌హౌజ్ ఫౌంటెన్ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై వెదజల్లిన నోట్ల కరెన్సీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న (శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు) మదీనా వైపు నుంచి గుల్జార్‌హౌజ్ వైపు వచ్చిన నాలుగైదు కార్లలో యువకులు కార్లను రోడ్డుపై నిలిపి ఫౌంటెయిన్ వద్దకు వచ్చి రూ.20 నోట్లను వెదజల్లారు. అక్కడే విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పడిన కరెన్సీ నోట్లను ఎగబడి అందుకున్నారు. కొద్దిసేపు గుల్జార్‌హౌజ్ ఫౌంటెయిన్ వద్ద హంగామా సృష్టించి యువకులు అనంతరం కాలికమాన్ వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పెళ్లి బరాత్ ముగించుకొని వస్తుండగా.. దారి మధ్యలో ఈ సంఘటనకు పాల్పడినట్లు చార్మినార్ ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు ఆయా పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. యువకులు ఎగరవేసిన నోట్లు నకిలీవా...? ఆసలైనా నోట్లా...? అని పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
చార్మినార్ చేరుకున్న టీ. కాంగ్రెస్ నేతలు
-
Hyderabad: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్‌లో నమాజ్ కోసం సంతకాల సేకరణపై రాజకీయ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ నేత రషీద్‌ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాంటూ సవాల్ విసిరారు ఎంపీ బండి సంజయ్. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు ఆయన. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఇదిలా ఉంటే.. సంతకాల సేకరణను ముస్లి సమాజం సైతం హర్షించదని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పుటప్ ప్రోగ్రాం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ కోరారు. ఇలాగైతే.. మసీద్ వద్ద మేము కూడా సంతకాల సేకరణ చేయాలా? అని ప్రశ్నించారు. కానీ, తామూ అలా చేస్తే రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటుందని రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని, అసలు రషీద్ ఖాన్‌కు సిగ్గుందా అని మండిపడ్డారు రాజా సింగ్. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని గుర్తు చేస్తున్నారు ఆయన. -
చౌమహల్లా ప్యాలెస్.. చూద్దాం పదండి
సాక్షి, హైదరాబాద్: యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. అసఫ్ జాహీల పాలనకు నిలువుటద్దం పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్. రెండో నిజాం కాలంలో చార్మినార్– లాడ్‌బజార్‌కు అతి సమీపంలో నిర్మించిన చారిత్రక ప్యాలెస్ ఇది. 2020 జూన్ 27న ఖిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ పైభాగంలోని కిటికీ దిమ్మె కూలి కింద పడింది. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన మరమ్మతు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. (క్లిక్: చౌమహల్లా ప్యాలెస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు) ప్రస్తుతం ఈ ప్యాలెస్ అందంగా ముస్తాబై పర్యాటకులను ఆకట్టుకుంటోంది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో మరింత శోభాయమానంగా మారింది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ప్యాలెస్ ఒకప్పుడు నిజాంల నివాస గృహం. ప్రస్తుతం విద్యుద్దీపాలతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభ తెస్తున్నాయి. (క్లిక్: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ) -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా...5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు...రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. రూ.లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. (చదవండి: పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం) -
గాజుల గలగలలకు నెలవు లాడ్‌బజార్
చార్మినార్: మట్టి గాజులు మొదలు మెటల్ గాజుల దాకా... 5 రూపాయల నుంచి 10 వేల రూపాయల బ్యాంగిల్స్ వరకు... రకరకాల డిజైన్లు, రంగురంగుల గాజులు ఒకేచోట లభించే ప్రాంతం భాగ్యనగరంలోని ప్రఖ్యాత లాడ్‌బజార్. పాతబస్తీలో షాపింగ్ అంటే అతివలకు ఠక్కున గుర్తొచ్చే దుకాణ సముదాయం ఇదే. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఇక్కడి దుకాణాలు రంజాన్ షాపింగ్ నేపథ్యంలో లభించే ప్రత్యేక ఆఫర్లతో మరింతగా కిటకిటలాడుతున్నాయి. నైట్ బజార్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో దుకాణాలు వెలిగిపోతున్నాయి. ఎన్నో రకాలు... లాడ్ బజార్లో మట్టి గాజులతోపాటు గోట్లు, మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర ఫ్యాషన్ గాజులు లభిస్తాయి. రోజువారీ వాడకానికి, పార్టీవేర్ కోసం ధరించేందుకు రకరకాల గాజులు దొరుకుతాయి. అయితే ఎన్ని రకాలు ఉన్నా ఎక్కువ మంది మనసును దోచేవి, ఖ్యాతి గడించినవి మాత్రం రాళ్ల గాజులే. లాడ్‌బజార్ అంటే.... లాడ్లా అంటే గారాబం. ప్రేమ. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకను కొని బహూకరిస్తుండటంతో దీనికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. మహ్మద్ కులీకుతుబ్ షా తన ప్రేయసి భాగమతికి లాడ్‌బజార్‌లోని గాజులనే బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. అప్పట్లో చార్మినార్ నుంచి గోల్కొండకు పురానాపూల్ మీదుగా వెళ్లాల్సి రావడం, పురానాపూల్‌కు వెళ్లడానికి లాడ్‌బజార్ ప్రధాన రహదారి కావడంతో ఈ బజార్‌కు ప్రచారం ఏర్పడి మంచి గుర్తింపు లభించింది. లక్షల్లో వ్యాపారం.... ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కిపైగా దుకాణాలు లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. రంజాన్ మాసం సందర్భంగా రోజుకు సగటున ఒక్కో దుకాణంలో రూ. 50 వేల నుంచి రూ. లక్షకుపైగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. అంటే అన్ని దుకాణాలలో జరిగే వ్యాపారం కలిపితే రూ. 2 కోట్లు ఉంటుందంటున్నారు. -
అర్థరాత్రి చార్మినార్‌లో సందడి చేసిన రాజమౌళి.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్ చార్మినార్‌లో సందడి చేశారు. కొడుకు కార్తికేయతో కలిసి అర్థరాత్రి చార్మినార్‌ను సందర్శించాడు. సాధారణ వ్యక్తిలా వెళ్లి నైట్ నైట్ బజార్ అందాలను తిలకించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో బిర్యానీ తిని వెళ్లిపోతుండగా కొందరు వ్యక్తులు గుర్తుపట్టి రాజమౌళితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయ్యిండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా రంజాన్ మాసంలో అర్థరాత్రి దాటాక కూడా చార్మినార్‌లో షాపింగ్ హడావిడి కొనసాగుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యంగా రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఇటీవలె ఆర్ఆర్ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న రాజమౌళి మహేశ్ బాబుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. -
చార్మినార్ వద్ద బయట పడ్డ భూగర్భ మెట్లు
చార్మినార్: చార్మినార్ కట్టడం ప్రాంగణంలోని వెనుక వైపు పురావస్తు శాఖ విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మంగళవారం చేపట్టిన తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. చార్మినార్ కింద భూగర్భ మెట్లు ఉన్నట్లు వెలుగులోకి రావడంతో పత్తర్‌గట్టి కార్పొరేటర్ మూసా సోహేల్ ఖాద్రీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చార్మినార్ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ మరమ్మతు పనులను నిలిపివేయాలని పురావస్తు శాఖ అధికారులను కోరారు. దీనిపై సమాచారం అందడంతో పురావస్తు శాఖ హైదరాబాద్ సూపరింటెండెంట్‌తో పాటు ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తవ్వకాల్లో బయటపడ్డ భూగర్భ మెట్లను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం విద్యుత్ మరమ్మతు పనులు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చార్మినార్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Charminar: ‘లాడ్‌బజార్’.. తళుక్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే
సాక్షి, చార్మినార్(హైదరాబాద్): నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత గుర్తింపు ఉందో పక్కనే ఉన్న లాడ్బజార్కూ అంతే గుర్తింపు ఉంది. ఎక్కడేక్కడి నుంచో వచ్చి చార్మినార్‌ను సందర్శిచిన తర్వాత లాడ్బజార్లోకి అడుగు పెడతారు. వందలు, వేలల్లో ఉండే అందమైన డిజైన్ల గాజులను కొనుగోలు చేస్తుంటారు. ఏ పండగొచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలైనా మొదట గుర్తుకు వచ్చేది లాడ్ బజారే.. వందల సంఖ్యలో ఉన్న షాపులను నిత్యం వేలాది మంది సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి గాజులు ఎగుమతి అవుతుంటాయి. అందమైన గాజులు తక్కువ ధరలకే లభ్యమవుతుండటంతో ఇక్కడి గాజులకు డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. నిత్యం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే విదేశీయులు సైతం గాజులను కొనుగోలు చేసి వారి దేశాలకు తీసుకెళ్తుంటారు. రాత్రిపూట లాడ్బజార్లోకి వెళ్తే జిగేల్మంటూ మెరిసే గాజుల అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇంతటి పేరుగాంచిన లాడ్‌బజార్‌ను నైట్ బజార్‌గా మార్చాలని 1999లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానిక గాజుల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు గానీ.. ఇటు సంబంధిత అధికారులు గానీ.. నైట్ బజార్ విషయాన్ని పట్టించుకోవడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నైట్ బజార్‌గా మారిస్తే పాతబస్తీకి మరింత వన్నె తెచ్చినట్లవుతుందని అంటున్నారు. ఏళ్లుగా గాజుల విక్రయాలతోనే జీవనం సాగిస్తున్న వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ► దూరప్రాంతాల నుంచి షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి విముక్తి లభిస్తుంది. పార్కింగ్‌కు సౌకర్యం కల్పిస్తేనే వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుంది. ► పరిసరాల రోడ్లన్నీంటినీ వెడల్పు చేయాలి. చార్మినార్ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లను పూర్తిగా అందుబాటులోకి తేవాలి. లాడ్‌బజార్‌లో వ్యాపారాభివృద్ధి కోసం ఇక్కడి దుకాణాలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పించాలి. ఆ పేరెలా వచ్చిందంటే.. ►లాడ్లా అంటే గారాబం.. ప్రేమ.. అనురాగం. ఉర్దూ భాషలో తమకు ఇష్టమైన వారిని, ముఖ్యంగా చిన్నారులను లాడ్లా అని సంబోధిస్తుంటారు. తమ ప్రేమ, అభిమానానికి గుర్తుగా ఇక్కడ నుంచి కానుకలను కొని బహుకరిస్తుండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. ► మహ్మద్ కూలీ కుతుబ్‌షా కూడా తాను ప్రేమించిన భాగమతికి ఇక్కడి లాడ్‌బజార్‌లోని గాజుల్నే బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు నిత్యం తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. -
చార్మినార్ వద్ద వెంకటేశ్, వరుణ్ తేజ్ సందడి
చార్మినార్ దగ్గర వెంకటేశ్, వరుణ్ తేజ్ చిందులేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చదవండి: బన్నీ ఇండస్ట్రీకి దొరికిన ఓ బహుమతి: రాజమౌళి 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎఫ్ 3’ మూవీ ప్రస్తుతం హైదారాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ పాట చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది. -
ట్యాంక్‌బండ్‌పై సందర్శకుల హడావిడీ, సందడిగా చార్మినార్
-
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఫొటోలు
-
" సండే'' సరదాగా.. సందడిగా..
-
చార్మినార్ వద్ద సండే సందడి
-
బతుకు చిత్రం : మేమూ ఉన్నాం
-
ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సాక్షి, చార్మినార్: చారిత్రక చార్మినార్ కొత్త శోభను సంతరించుకోనుంది. నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యాంక్‌బండ్ తరహాలోనే నో ట్రాఫిక్ జోన్‌గా మారనుంది. సందర్శకులకు మాత్రమే అనుమతించనున్నారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ కార్యక్రమానికి ఈ ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లోకి వాహనాల అనుమతించబోమని శనివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు, సందర్శకుల పార్కింగ్ వివరాలను ఆయన వెల్లడించారు. వాహనచోదకులు, సందర్శకులు సహకరించాలని కొత్వాల్ సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్ వైపు పంపిస్తారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ధన్కా మాస్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్ చౌక్ వైపు పంపిస్తారు. ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్ రోడ్లోకి పంపుతారు. పార్కింగ్ ప్రాంతాలివీ.. అఫ్జల్‌గంజ్, నయాపూల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్ మహల్‌లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్ ఉల్ ఆనం బాయ్స్ హై స్కూల్లో పార్క్ చేసుకోవాలి. ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్స్, చార్మినార్ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్క్ చేసుకోవాలి. మదీనా, పురానాపూల్, గోషామహల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్ చేసుకోవాలి. -
చార్మినార్ చెంతా ‘సండే– ఫన్డే’ సందడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారంలా నిలిచిన చార్మినార్‌ను సిటిజన్లకు మరింత చేరువ చేసేందుకు మున్సిపల్ పరిపాలన శాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఆదివారం ‘సండే– ఫన్డే’లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తరహాలోనే.. చార్మినార్ పరిసరాలు కూడా సిద్ధమవుతున్నాయి. వాహనాల రణగొణ ధ్వనులు లేని వాతావరణంలో పాదచారులు చార్మినార్ చుట్టూ తిరుగుతూ.. చారిత్రక నిర్మాణాన్ని అమూలాగ్రం పరిశీలించే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నగర కొత్వాల్ అంజనీకుమార్‌లతో కలిసి మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. చారిత్రక కట్టడాలపై భవిష్యత్ తరాలకు కళ్లకు కట్టినట్లు వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ పేరుతో ఈనెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ‘సండే– ఫన్డే’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ట్విటర్ ద్వారా అర్వింద్‌కుమార్ వెల్లడించారు. సందర్శకుల కోసం లాడ్ బజార్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుందన్నారు. పోలీసు బ్యాండ్ మ్యూజిక్, ముషాయిరాలతో పాటు పిల్లల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మొక్కల ఉచిత పంపిణీ కూడా ఉంటుందని చెప్పారు. చదవండి: 18 నుంచి హైదరాబాద్ మెట్రో సువర్ణ ఆఫర్ -
చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్ సూచన
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం ‘సండే.. ఫన్ డే’ కొనసాగిస్తున్నట్లుగానే పాతబస్తీలోని చార్మినార్ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందనే విషయాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా సూచించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ సోమవారం తన ట్విటర్ ద్వారా రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం టాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిస్తున్న నో వెహికిల్ జోన్ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద కూడా చేపడితే.. నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్లవుతుందని అర్వింద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పాతబస్తీ ప్రజలతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు చార్మినార్‌కు చేరుకుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదాగా.. సంతోషంగా గడిపే అవకాశం ఉంది. చదవండి: ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్; సజ్జనార్‌పై కమిషన్ ప్రశ్నల వర్షం -
సంజయ్ పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి షురూ
-
భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు
సాక్షి, చార్మినార్( హైదరాబాద్): పాతబస్తీలోని హెరిటేజ్ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. ► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. ►అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. ► అలాగే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం చార్మినార్‌లోని సర్దార్ మహాల్ భవనంలో నివాసముండేది. ► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ► శాలిబండలోని క్లాక్ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ►శాలిబండ క్లాక్ టవర్‌ను అనుకొని ప్రైవేట్ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్.... యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్‌లోగతేడాది జూన్ 27న కిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు. నిజాం ప్రభువుల నివాస గృహం.. నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. ► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ► ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. ► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ►ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. ►1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. ► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్య మిచ్చేవారు. శిథిలావస్థకు చేరిన సర్దార్ మహల్... జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ (సర్దార్ మహల్) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. -
Photo Feature: టీకానే రక్షణ.. బస్సు కోసం నిరీక్షణ!
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా రాష్ట్రాలు విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఆంక్షలు సడలించగా, మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు దేశమంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. -
Photo Feature: అవతరణ సందడి.. అవగాహన తప్పదు మరి
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయింది. మరోవైపు లాక్డౌన్ సడలింపు సమయంలో హైదరాబాద్ నగర రోడ్లపై వాహనాలు పోటెత్తుతున్నాయి. కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రను మరోసారి భారీ వర్షం వణికించింది. -
Photo Feature: కరోనా కష్టాలు ఎన్నాళ్లు?
కరోనా కష్టాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. కోవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క తమ ఇళ్ల దగ్గరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా కట్టడికి తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. -
హైదరాబాద్: లాక్డౌన్ ఆంక్షలతో నిర్మానుష్యంగా చార్మినార్ ప్రాంతం
-
రంజాన్ సందర్బంగా సామూహిక ప్రార్థనలు వద్దని విజ్ఞప్తి
-
Photo Feature: షాపింగ్, పరేషాన్
లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ నగర రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. కొనుగోళ్లతో పాటు ఇతర అవసరాల కోసం నగర ప్రజలు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో చార్మినార్ వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున షాపింగ్ చేయడం కనిపించింది. -
రాష్ట్ర వ్యాప్తంగా రోజు 20 గంటలపాటు లాక్ డౌన్
-
కరోనా ఎఫెక్ట్ తో బోసిపోయిన చార్మినార్
-
400 ఏళ్ల చరిత్ర.. ముట్టుకుంటే ఊడిపోతోంది
సాక్షి, హైదరాబాద్: బాగా పాతబడిపోవటం, వాహన కాలుష్య ప్రభావం.. వెరసి చార్మినార్ కట్టడం పైపూత అత్యంత బలహీనంగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడంలోని చాలా ప్రాంతాల్లో ముట్టుకుంటే చాలు పొరలుపొరలుగా మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా పెరిగిపోయింది. దాదాపు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర కట్టడంపైనున్న డంగు సున్నం పూత అత్యంత బలహీనంగా మారినట్టు కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం గుర్తించింది. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించింది. కట్టడంలో ఏయే ప్రాంతాల్లో డంగుసున్నం పొరలు బలహీనంగా మారాయో గుర్తించి అంతమేర దాన్ని తొలగించి సంప్రదాయ డంగుసున్నం మిశ్రమాన్ని మెత్తే పని ప్రారంభించారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పై పొర తొలగించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ భానుప్రకాశ్ వర్మ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ఆరు నెలలపాటు పనులు.. చార్మినార్ పరిరక్షణ చర్యలు తరచూ జరిగేవే. అయితే ఒకేసారి కావాల్సినన్ని నిధులు ఇవ్వకపోవడంతో మధ్యమధ్య విరామం ఇస్తూ పనులు చేస్తున్నారు. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. రెండేళ్లక్రితం మరమ్మతు పనులు నిర్వహించారు. అప్పట్లో రెండు దఫాల్లో రూ.35 లక్షలు రావటంతో వాటితో పనులు చేసి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం కొన్ని నిధులు ఇవ్వటంతో వాటితో అత్యవసరంగా పనులు ప్రారంభించారు. విరామం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నర కాలంలో మొత్తం పనులు పూర్తవుతాయి. రెండేళ్ల క్రితం మొదటి అంతస్తు నుంచి మినార్ల వరకు పరిరక్షణ చర్యలు పూర్తి చేశారు. ఇప్పుడు దిగువ భాగంలో పనులు ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు చేసిన చోట కూడా మట్టి రాలిపోతోంది. అప్పట్లో లేపనంలాగా అద్దిన పైపూత పటిష్టంగానే ఉన్నా... దానిలోపలి సున్నం మిశ్రమం బలహీనంగా మారటంతో పై పూత ఊడిపోతోంది. ఎందుకీ సమస్య.. కులీకుతుబ్‌షా 1591లో దీన్ని నిర్మాణం చేపట్టారు. 430 ఏళ్లు గడుస్తున్నందున స్వతహాగా కట్టడం మట్టి భాగం బలహీనపడింది. అయినప్పటికీ అది లోపలి రాతి నిర్మాణాలు పట్టుకుని నిలిచిఉంటుంది. కానీ.. దశాబ్దాలుగా కట్టడానికి అతి చేరువగా వాహనాలు తిరుగుతుండటంతో కాలుష్యం కాటేస్తోంది. వానాకాలంలో తడితో కలిసి రసాయన చర్య ఏర్పడి క్రమంగా గోడల డంగు సున్నం పొరలు బలహీనపడిపోయాయి. దీంతో పటుత్వం కోల్పోయి మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో సమస్య బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో పై పూతను తొలగించి కొత్త మిశ్రమాన్ని పూసి, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన నగిషీలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. సోమవారం నుంచి ఆ పనులు మొదలు కానున్నాయి. తొలుత లాడ్‌బజార్ వైపు భాగానికి పనులు చేపట్టనున్నట్టు సమాచారం. -
పవన్ సినిమాలో భారీ చార్మినార్ సెట్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. భారీ ఎత్తున 17వ శతాబ్దపు చార్మినార్ సెట్‌ను రూపొందించే పనిలో దర్శకుడు క్రిష్ అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. కథలో భాగంగా ఆనాటి చార్మినార్ పరిస్థితులను, దాని పరిసర ప్రాంతాలపై సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. దీంతో చార్మినార్ సెట్ రూపకల్పన చేస్తోంది టీమ్. ఈ సెట్లో వచ్చే నెలలో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈ సెట్ నిర్మాణం సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా కానుందని తెలుస్తోంది. దీనిని సైరా నర్సింహరెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఈ సెట్‌కు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు హరహర మహాదేవ, హరిహర వీరమల్లు, విరూపాక్ష అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదని, త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
అమ్మ మీద ఆన.. బీజేపీ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : ‘అమ్మవారి ఆశీర్వాదంతో గెలుపొందాం. అమ్మ మీద ఆన.. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి, నీతి, నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. బీజేపీ సిద్ధాంతాలకు, జాతీయ సమగ్రతకు కట్టుబడి ఉంటాం’అని ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన 48 మంది బీజేపీ కార్పొరేటర్లు శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేశారు. తమతోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, సహా పలువురు ముఖ్య నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. దేశం కోసం, భాగ్యనగర అభివృద్ధి కోసం పాటుపడుతామని వారంతా ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. పొర్లు దండాలు పెట్టినా జైలు ఖాయం... ‘సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, చేతగానితనం, మూర్ఖత్వం వల్ల పాతబస్తీ నేడు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. పాతబస్తీ మాది. పేదలు ఎక్కువగా నివసించే ఈ బస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. భాగ్యలక్ష్మి అమ్మవారి వల్లే నగరానికి భాగ్యనగరం అనే పేరొచ్చింది. మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోలేక పోయినా.. అమ్మ ఆశీర్వాదంతో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబం భారీ అవినీతికి పాల్పడింది. కేంద్రం అన్ని లెక్కలూ తీస్తోంది. ఢిల్లీకి వెళ్లి ఎన్ని పొర్లుదండాలు పెట్టినా.. ఆయన జైలుకెళ్లడం ఖాయం’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు జరుగుతాయని టీఆర్ఎస్, ఎంఐఎం విషప్రచారం చేస్తున్నామని బండి సంజయ్ మండిపడ్డారు. -
2021.. ఓ మువ్వన్నెల పండుగ!
భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్‌సాగర్ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.. సరికొత్త హైదరాబాద్‌గా మారేందుకు అడుగులేస్తోంది.. అలాంటి మన హైదరాబాద్ మహానగరం త్వరలోనే ఓ అద్భుతమైన మైలు రాయిని దాటనుంది. అదేంటంటే.. 2021 నాటికి.. గోల్కొండ రాజధానిగా అవతరించి 525 ఏళ్లు కానుంది. భాగ్యనగరం రూపుదిద్దుకుని 430 ఏళ్లు పూర్తవుతుంది. సికింద్రాబాద్ ఏర్పడి 215 ఏళ్లు అవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఘన చరిత్రను గుర్తు చేసుకునేందుకు, ఈ నగరాన్ని భావితరాలకు చెక్కు చెదరకుండా అందించేందుకు ‘హైదరాబాద్ హెరిటేజ్ ఫెస్ట్’పేరిట హైదరాబాద్ ట్రేల్స్, వసామహ ఆర్కిటెక్ట్, హెరిటేజ్ ఫ్యూచర్స్ వంటి పలు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు, ప్రజలకు నగరంపై అవగాహన కలిగించేందుకు ఏడాది పొడవునా పలుకార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తొలి అడుగు పడిందక్కడ.. 1496: గోల్కొండ రాజధాని నగరంగా ఏర్పాటుకు తొలి అడుగు.. కాకతీయుల హయాంలో సైనిక పోస్టు, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ.. రాజధానిగా ఎదిగేందుకు 1496లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం.. సుల్తాన్ కులీని సుబేదారు (గవర్నర్)గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్‌షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. సరికొత్త పరిజ్ఞానం గోల్కొండ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు.. నాటి ఆధునికతను వాడుకుంటూ ముందుకు సాగారు. నీటి వనరుల కోసం గురుత్వాకర్షణ శక్తితో అందేలా ఎత్తయిన ప్రాంతంలో దుర్గం చెరువును తవ్వించారు. అక్కడి నుంచి ప్రత్యేక చానెళ్ల ద్వారా నీటిని తరలించి కోటలో నిల్వచేసేందుకు కటోరా హౌస్‌ను నిర్మించారు. ఆ నీళ్లు కోట భాగానికి చేరేందుకు ఈజిప్షియన్ వాటర్ వీల్ పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంటే మనం చూసే జెయింట్ వీల్ తరహాలో ఉండే ఏర్పాటన్న మాట. అది తిరిగే కొద్దీ కింది నీళ్లు పైకి చేరతాయి. అలా రెండు, మూడు యంత్రాలతో పూర్తి పైకి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా దిగువకు పంపుతారు. అలాగే కింద అలికిడి అయితే పై వరకు వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఏర్పాట్లు చేయించారు. ఇక గానా బజానాలు, కుస్తీ పోటీలు, వేడుకలతో నిత్యం కోట కళకళలాడుతుండేది. 1591 భాగ్యనగరానికి పునాది.. ‘చెరువులో చేపల్లాగా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి’.. మహ్మద్ కులీ కుతుబ్‌షా దైవ ప్రార్థన ఇదీ. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30 వేల జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత.. మూసీకి ఆవల కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోట గోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్‌ను నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలుచెరగులా విస్తరించింది. నిజాం(గవర్నర్)గా నియమితుడైన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్.. అసఫ్‌జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. తొలుత ఆయన ఔరంగాబాద్ నుంచే పాలన సాగించారు. కానీ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో మళ్లీ నగర విస్తరణ పెరిగింది. మలుపు తిప్పిన ఆరో నిజాం ముస్లిమేతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పరమత సహనానికి ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ.. హైదరాబాద్ నిర్మాణం విషయంలో అసఫ్జాహీలు ప్రత్యేకత చాటుకున్నారు. హిందూ సంస్కృతిపై దౌర్జన్యాల అప ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఆధునిక హైదరాబాద్‌కు బీజం పడింది. అప్పటికే రైల్వే లాంటి అరుదైన ప్రయాణ వసతి భాగ్యనగరాన్ని చేరింది. నూతన హైదరాబాద్ శిల్పిగా ఖ్యాతికెక్కిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు పిలిపించింది ఆరో నిజామే. అప్పుడే విరుచుకుపడ్డ వరదలు హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయటంతో మోక్షగుండం వచ్చి అద్భుత డ్రైనేజీ వ్యవస్థ, వరదకు అడ్డుకట్ట పడేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే. ఆరో నిజాం హయాంలో అందుకు ప్రణాళికలు రచించగా.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో అమలైంది. ఇక ప్రపంచ కుబేరుడిగా చరిత్రలో నిలిచిన ఏడో నిజాం.. హైదరాబాద్‌కు పూర్తి ఆధునిక రూపునిచ్చాడు. భారతదేశంలో భాగంగా ఉండాలన్న కోరిక లేక పాకిస్తాన్‌కు అనుకూల వైఖరి ప్రదర్శించిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ప్రస్తుత హైదరాబాద్‌లో ఈ మాత్రం వసతులు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం మాత్రం ఆయనే. 1806 జంట నగరం వెలసిందప్పుడే ప్రపంచ జంటనగరాల జాబితాలో హైదరాబాద్–సికింద్రాబాద్లు ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 215 ఏళ్లు అవుతోంది. మూడో నిజాం హయాంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్‌లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందనీ నమ్మబలికింది. 5 వేల బ్రిటిష్ సైన్యంతో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన కంటోన్మెంట్ ఏర్పడింది. క్రమంగా బ్రిటిష్ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్ రెసిడెన్సీ థామస్ సైడన్‌హామ్.. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్ అని నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉండటంతో శరవేగంగా ఆ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధి చెంది జనరల్ బజార్ లాంటివి విస్తరించాయి. విద్యాసంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, సాధారణ క్లబ్‌లు, చర్చిలు, తమిళ, కన్నడ, మరాఠీ, పార్సీ వారి విస్తరణ.. కొత్త దేవాలయాలు.. ఒకటేమిటి సికింద్రాబాద్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కన్నా ప్రణాళికా బద్ధంగా, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పరిశుభ్రత.. విదేశీ ప్రాంతం తరహాలో పురోగమించింది. కుతుబ్‌షాహీల హయాంలో నగరానికి పునాది పడినా.. అభివృద్ధి మాత్రం అసఫ్‌జాహీల కాలంలోనే ఊపందుకుంది. ఇక సికింద్రాబాద్ అభివృద్ధి బ్రిటిష్ వారి పాలనలో జరిగిందని చెప్పుకోవచ్చు. -
హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన
-
భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్న బండి సంజయ్
-
భాగ్యలక్ష్మీ ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చు
-
శ్వేత సౌధం.. చౌమహల్లా ప్యాలెస్
సాక్షి, చార్మినార్: చౌమహల్లా ప్యాలెస్ సందర్శన తిరిగి ప్రారంభం కానుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్ డైరెక్టర్ కిషన్‌రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసే కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడానికి సిద్ధగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఆరు నెలలుగా చౌమహాల్లా ప్యాలెస్ సందర్శనను ట్రస్ట్ నిలిపి వేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సందర్శకుల అందుబాటులోకి వస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిజాం కాలంలో వినియోగించిన ఫర్నిచర్, మంచాలు, దుస్తులు, తల్వార్లు, ఫొటోలు తదితర విలువైన పురాతన వస్తువులన్నింటిని చౌమహల్లా ప్యాలెస్‌లోని నాలుగు ప్యాలెస్‌లలో భద్రపరిచారు. ప్రస్తుతం నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలో చౌమహల్లా ప్యాలెస్ కొనసాగుతోంది. అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతనగరంలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. రెండో నిజాం కాలంలో చార్మినార్–లాడ్‌బజార్‌కు అతి సమీపంలో ఈ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. చార్మినార్ కట్టడం నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్న ఈ చౌమహల్లా ప్యాలెస్ యూరోపియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌధం. ఇది నాలుగు ప్యాలెస్‌ల సముదాయం. ఏకాంతం (ఖిల్వత్)గా నిర్మించిన ఈ ప్యాలెస్‌లో పలు నిర్మాణాలు జరిగాయి. 5వ నిజాం అప్జల్–ఉద్–దౌలా–బహదూర్ పాలనా (1857–69) కాలంలో ఖిల్వత్ ప్యాలెస్‌లో నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం జరిగింది. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్లో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మఫ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అప్జల్ మహల్ల నిర్మాణం జరిగింది. 1912లో ఏడో నిజాం ప్యాలెస్‌కు చేయించిన మరమ్మతులతో ప్యాలెస్ మరింత శోభాయమానంగా మారింది. ఇది నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పొగరాని కొవ్వొత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. సందర్శన వేళలు, మార్గం ఎలా వెళ్లాలి: చార్మినార్ కట్టడం నుంచి లాడ్‌బజార్,ఖిల్వత్ చౌరస్తా ద్వారా ముందుకెళితే ఖిల్వత్ వస్తుంది. సందర్శించు వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. సెలవు: శుక్రవారం. టికెట్ ధరలు: చిన్నారులకు రూ. 20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.200 రవాణా సౌకర్యం: నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసి బస్సు సౌకర్యం కలదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆర్టీసి బస్సులు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్: ప్యాలెస్ ఆవరణలో చార్జితో కూడిన పార్కింగ్ సౌకర్యం కలదు. -
హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపు
-
గోల్కొండ కోట సందర్శనకు అనుమతి
-
పర్యాటకులు భౌతికదూరం పాటించేలా చర్యలు
-
గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనకు అనుమతి
-
లాక్ డౌన్ ను మరింత పకడ్బంధిగా
-
చార్మినార్, గోల్కొండ మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే జూ పార్కులు, ప్రదర్శనశాలలు, ప్రధాన పార్కు లను రాష్ట్ర ప్రభుత్వం మూసేయగా, తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసేసింది. మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి రద్దు చేసింది. ఇదే విభాగం అధీనంలో ఉన్న వేయిస్తంభాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు మాత్రం స్వల్ప సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇవి దేవాలయాలు కావడంతో వాటిని మూసే పరిస్థితి లేదు. అయితే ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా, క్యూలైన్లలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామనవమి ఉత్సవాలపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాలయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజులు కావటంతో దేవాలయాలకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీంతోపాటు ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ వైరస్ వ్యాపించే విధానం, దాన్ని నియంత్రిం చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 2న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు దృష్టి సారించారు. భద్రాచలంలో ప్రభుత్వ వేడుకగా జరిగే సీతారామ కల్యాణాన్ని పూర్తిగా ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు. అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు ఆలయానికి రాకుండా కట్టడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆన్లైన్ టికెట్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆ టికెట్లు కొన్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లోనూ అర్చకులు దేవేరుల కల్యాణం నిర్వహించటానికే పరిమితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు దేవాలయ నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున, భక్తులే స్వచ్ఛందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఉగాది వేడుకలకూ దూరం! ఉగాది వేడుకలనూ ఆర్భాటాలకు దూరంగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రగతిభవన్‌లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. టీవీల్లో లైవ్ ద్వారా ప్రజలు చూడాలనే సూచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బోసిపోయిన భద్రాద్రి రామాలయం పరిసరాలు -
చార్మినార్‌కు ‘కోవిడ్’ నిబంధనలు వర్తించవా?
చార్మినార్: కోవిడ్–19 వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో పాతబస్తీలోని జూ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియంలను ఈ నెల 21వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. చార్మినార్‌కు మాత్రం సందర్శనకు అనుమతి ఇచ్చారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్ఐ) నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోవడంతో చార్మినార్ కట్టడాన్ని మూసి వేయలేదు. జన సమర్ధం గల సందర్శనా ప్రదేశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలున్నప్పటికీ...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చార్మినార్ కట్టడం సందర్శనకు పర్యాటకులను అనుమతించడం పట్ల స్థానిక ప్రజలు తప్పు పడుతున్నారు. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని...ఇందులో విదేశీ పర్యాటకులు సైతం పదుల సంఖ్యలో ఉంటారని...అన్ని మ్యూజియంలతో పాటు చార్మినార్ కట్టడం సందర్శనను కూడా బంద్ చేయాలని కోరుతున్నారు. ఈ నెల 15న(ఆదివారం) చార్మినార్ కట్టడాన్ని 2800 స్వదేశీ పర్యాటకులు, 13 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని...ఒకవైళ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ ప్రశ్నిస్తున్నారు. జూపార్కు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహాల్లా ప్యాలెస్, హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియంలను మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. సోమవారం పాతబస్తీలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్ తదితర పరిసరాలన్నీ వినియోగదారులు లేక బోసిపోయి కనిపించాయి. తమకు ఉన్నతాధికారుల నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని...అందేంత వరకు చార్మినార్ సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తామని చార్మినార్ కన్జర్వేటివ్ అసిస్టెంట్ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. -
చార్మినార్ వద్దే ఎందుకు?: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చార్మినార్ వద్ద శనివారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో ప్లాగ్‌మార్చ్‌ను నిర్వహించింది. పెద్ద ఎత్తున బలగాలను దింపి పాతబస్తీ వీధుల్లో కవాతు చేపట్టింది. దేశ వ్యాప్తంగా పలు సున్నితమైన ప్రాంతాల్లో ఈ విధంగా బలగాలను అప్రమత్తం చేసింది. అయితే నగరంలో కేవలం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చార్మిచార్ వద్ద మాత్రమే ఎందుకు మార్చ్ నిర్వహించారు. సిక్రింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా కానీ, హైటెక్‌సిటీలో గానీ ఎందుకు చేయట్లేదు’ అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా ఢిల్లీలోని చెలరేగిన హింసతో దేశ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణలో ఇప్పటివరకు 42 మందిమృతి చెందారు. సున్నితమైన అంశం అయినందున దేశ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ అప్రమత్తయింది. దీనిలో భాగంగానే ఉత్తర భారతంలోని పలుముఖ్య పట్టణాలతో పాటు దక్షిణాదిన సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను అలర్ట్ చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకూడదని భరోసా ఇచ్చేందుకు ఈ మార్చ్ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. -
వాట్సాప్ గ్రూప్‌ల్లో వచ్చే పోస్టింగ్‌లను చూస్తారా...?
చార్మినార్: ఎక్కడో జరుగుతున్న సంఘటనలపై నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ సిటీ పూర్తి ప్రశాంతంగా ఉందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన చార్మినార్ ఏసీపీ అంజయ్యతో కలిసి పాతబస్తీలోని చార్మినార్–మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆయన చార్మినార్ నుంచి మక్కా మసీదు వరకు కాలినడకన తిరుగుతూ స్థానిక చిరువ్యాపారులతో ముచ్చటించారు. వారితో కలిసి టీ తాగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వాట్సాప్ గ్రూప్‌ల్లో వచ్చే పోస్టింగ్‌లను చూస్తారా...? అంటూ చిరువ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోసింగ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పుకార్లను నమ్మవద్దన్నారు. కొందరు ఉద్దేశపూర్యకంగా కాపీ పేస్ట్ పద్దతిలో వాట్స్‌ప్‌లో అభ్యంతరకరమైన పోసింగ్‌లు పెడుతున్నారన్నారు. రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం కాలం నుంచి పాతబస్తీలో అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలసి సహజీవనం చేస్తున్నారన్నారు. చిరువ్యాపారులు పాతబస్తీలోని చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో ప్రశాంతంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారన్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఆందోళనకు గురిచేసే అవకాశాలున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజాలు కావని, ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికుల సహకారం అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తాను చార్మినార్ ఏసీపీ అంజయ్యతో కలిసి రాత్రి వేళల్లో పాతబస్తీలో ఆకస్మికంగా పర్యటించి స్థానిక వ్యాపారులు, ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఏదైనా అవసరమైతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. -
పాతబస్తీ నుంచి తరలి వెళుతున్న వ్యాపారం..
చార్మినార్: బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు పాతబస్తీ ప్రధాన వ్యాపార కేంద్రం. నిజానికి నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు ఆభరణాల క్రయవిక్రయాలకు ఆదరణ ఉంది. అయితే కొంత కాలంగా ఇక్కడ వ్యాపారాలు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు 2000 వరకు దుకాణాలున్న పాతబస్తీలో సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఒకప్పటి వ్యాపారాలు ఇప్పుడు కనిపించడం లేదు. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అడ్దదిడ్డమైన ట్రాఫిక్‌కు తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ తమ బ్రాంచీలను నామమాత్రంగా కొనసాగిస్తునే... నగరంలో శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు... హెదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకు వస్తుంది. చార్మినార్‌కు వచ్చే పర్యాటకులకు చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ముందుగా దర్శనమిస్తాయి. పాతబస్తీ సంస్క ృతికి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడి బంగారు, వెండి, ముత్యాల నగల దుకాణాలు ప్రసిద్ధి చెందాయి. నిజాం కాలం నుంచి ఇక్కడ బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కే సరైన పార్కింగ్ లేదని... ఇక కార్లు తదితర వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక వినియోగ దారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటుపడుతున్నాయంటున్నారు. పాతబస్తీలోని చార్మినార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, శాలిబండ, కాలికమాన్, మిట్టికాషేర్, ఘాన్సీబజార్ తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి, ముత్యాల ఆభరణాల షోరూంలున్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో గిరాకీ తగ్గడంతో ఇక్కడి వ్యాపారస్తులు నగరంలోని అబిడ్స్, సిద్ధంబర్‌బజార్, గన్‌ఫౌండ్రి, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, బేగంబజార్, మెహిదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో తమ షోరూంలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంత వెంటనే పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత క్లిష్టతరంగా మారుతాయని ఇMý్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్య రద్దీ... తప్పని ట్రాఫిక్ తిప్పలు.. నగరంలో ప్రథమంగా నగల దుకాణాలు చార్కమాన్లోనే ప్రారంభమయ్యాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 2000కు పైగా ఉన్న ఇక్కడి దుకాణాలు ప్రతిరోజు కస్టమర్లకు తమ సేవలను అందజేస్తున్నాయి. పాతబస్తీని సందర్శించడానికి వచ్చే పర్యాటకులే కాకుండా నగర శివారు జిల్లాల వినియోగదారులు కూడా చార్‌కమాన్‌లోని బంగారు నగల దుకాణాలకు వచ్చి తమకు అవసరమైన ఆభరణాలను ఖరీదు చేస్తుండడంతో ప్రతిరోజూ వినియోగదారులతో ఇక్కడి నగల దుకాణాలు రద్దీగా మారతాయి. ప్రస్తుతం ఇక్కడి వ్యాపార పరిస్థితులు గతంలో కన్నా భిన్నంగా తయారయ్యాయి. వినియోగ దారులు రావడానికి సరైన మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇక్కడ గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాభివృద్దికి అటు ప్రజాప్రతినిధులు గానీ...ఇటు సంబందిత అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ దుకాణాల ముందు వరకు వాహనాల రాకపోకలు అందుబాటులో లేకపోవడంతో పాటు చిరువ్యాపారులను సైతం తమ షో రూంల ముందు అక్రమంగా వ్యాపారాలు కొనసాగించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతించడంతో రోజురోజుకూ తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వలస కార్మికులు బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసిఇవ్వడానికి పని చేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పాతబస్తీలో నివాసం ఉంటున్న వలస కార్మికులు దుకాణాల యజమానుల నుంచి బంగారాన్ని ఆర్డర్లపై తీసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి ఇస్తుంటారు. గ్రాముల వారిగా మేకింగ్ చార్జీలను తీసుకునే వలస కార్మికులకు ఆర్డర్లు కరువయ్యాయి. దీంతో వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. పాతబస్తీకే గుండెకాయగా నిలిచిన నగల వ్యాపారాలు ఎంతో మంది వలస కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఆభరణాలను తయారు చేయడానికి ఎంతో మంది యువకులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆర్డర్లపై నగలను తయారు చేసి ఆయా దుకాణాలలోఅప్పగించి ఉపాధి పొందుతున్నారు. బెంగాళీలు గుల్జార్‌హౌజ్, కోకర్‌వాడీ, మామాజుమ్లా పాటక్, మూసాబౌలి, ఘాన్సీబజార్, జూలా, బండికా అడ్డా తదితర ప్రాంతాలలో చిన్న చిన్న ఖార్ఖానాలను ఏర్పాటుచేసుకొని బంగారు ఆభరణాలనుతయారు చేస్తున్నారు. ఇలా చార్‌కమాన్‌లోని నగల దుకాణాలు ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే... రాబోయే రోజుల్లోపాతబస్తీలో బంగారం, వెండి వ్యాపారాలుకనుమరుగయ్యే పరిస్థితలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి
‘‘కశ్మీరీ హిందువుల మారణహోమం, హత్య లు, వాళ్లపై సాగిన క్రూరత్వం గురించి ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియ జేయాలనుకున్నా’’ అన్నారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ పేరుతో ఆయన ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న లక్ష్మీ దేవి ఆలయాన్ని సందర్శించారు వివేక్. ఆ తర్వాత ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నవారితో సమావేశమయ్యారు. ‘‘దేశంలో ఏం జరుగుతుందో యువత తెలుసుకోవాలి. బయటకు వెల్లడికాని కశ్మీరీ పండిట్ల కథ వాళ్లు తెలుసుకోవాలి. ఈ విషయంపై బాగా పరిశోధన చేశా. అందుకే స్క్రిప్ట్ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. సినిమా పూర్తయ్యాక ఈ సబ్జెక్ట్‌పై పుస్తకం రాయాలనుకుంటున్నాను’’ అన్నారు వివేక్ అగ్నిహోత్రి. నిర్మాతలు అనిల్ సుంకర, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకు మద్దతు తెలిపారు. -
టూరిస్టుల గోల్కొండ
హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే ల్యాండ్‌మార్క్.. చార్మినార్. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతి చెందిన ఈ చారిత్రక కట్టడం పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడుతోంది. దీనిని కాదని గోల్కొండ ఖిల్లా.. స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకుల సందర్శనీయ ప్రాంతాల జాబితాలో గోల్కొండ ప్రథమ స్థానంలో ఉంది. మూడేళ్లుగా ఈ చారిత్రక కట్టడాలను సందర్శిస్తున్న పర్యాటకుల లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. నిర్మాణ చాతుర్యపరంగా చార్మినార్ కట్టిపడేస్తున్నా.. గోల్కొండ కోటలోని వివిధ నిర్మాణాల ఇంజనీరింగ్ నైపుణ్యమే పర్యాటకులను ఎక్కువ ఆకట్టుకుంటోందని తేలింది. పైగా, కోట విశాలంగా ఉండటం, ఆహ్లాదకర వాతావరణం, ఎక్కువసేపు అక్కడ గడిపేందుకు అనువైన పరిస్థితులు ఉండటం వంటివి గోల్కొండకు పెద్దసంఖ్యలో పర్యాటకులను రప్పిస్తోంది. -
మనసులు దోసేశాడు
ఒక్క నిముషం కూడా తీరిక లేకుండా (ఇంటర్వ్యూ చేసే సమయంలో సాక్షితో మాట్లాడేంత సమయం కూడా ఇవ్వలేదు) ఇడ్లీ–దోశల తయారీలో బిజీగా ఉన్నారు గోవింద్. మీ దోసెలో ప్రత్యేకత ఏంటి?’ అని అడిగితే, ‘మీరే తిని చూడండి! అర్థమవుతుంది’ అంటూ నవ్వుతూ తల తిప్పకుండా, అవలీలగా దోసె వేసేసి, దాని మీద పల్చగా ఉండే ఉప్మా వేసి, ఆ పైన, ఉల్లి తరుగు, బటర్ వేస్తారు, చివరగా మసాలా కారం జల్లి. బటర్‌ను బాగా కరిగిస్తూ, ఉప్మా కారం మసాలాలు దోసె అంతా పట్టేలా చేస్తారు. ఆ తరవాత మళ్లీ ఉల్లి తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర చల్లుతాడు. చివరగా చీజ్ వేస్తారు. దానిని కూడా కరిగించి, బాగా కరకరలాడే దోసె తయారుచేసి, వేడివేడిగా అందిస్తారు గోవింద్.ఈ రుచి కోసం ఉదయాన్నే పెద్ద క్యూ సిద్ధమవుతుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌజ్ దగ్గర గత 30 ఏళ్లుగా వినియోగదారులకు వివిధ రకాల రుచులను అందిస్తున్నారు. ప్రధాన రోడ్డులోని చౌరస్తా దగ్గర రోడ్డు పక్కన బండిపై తన కుటుంబ సభ్యులతో కలిసి గోవింద్ ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వాళ్లు గోవింద్‌ను ఆప్యాయంగా భాయ్..భాయ్ అంటూ పలకరిస్తుండడంతో...గోవింద్ కాస్తా...గోవింద్ భాయ్‌గా మారిపోయారు. ఈ ఘుమఘుమల ప్రక్రియ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా సాగుతూనే ఉంటుంది. దోసెలు మాత్రమే కాదు, ఆ పక్కనే తాజాగా ఇడ్లీ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. గోవింద్ వేసే దోసె ఆహారప్రియుల నోరూరిస్తుంది. తన చుట్టూ నిరీక్షిస్తున్న కస్టమర్ల విన్నపాలు వింటూ, వాటికి అనుగుణంగా ఫలహారాలు తయారు చేయడంలో తలమునకలైనా, ఆ ముఖంలో ఒత్తిడి కనపడదు. దోసె, ఇడ్లీ, వడ, ఫ్రైడ్ ఇడ్లీలతోపాటు అక్కడ ప్రత్యేకంగా లభించే చట్నీ కోసం ఎంతసేపైనా వేచి చూస్తారు కస్టమర్లు. అందరికీ గోవింద్ భాయ్ దోసె వేసిన తరవాత, పైన వేసే చీజ్, బటర్, ఉల్లి తరుగు, ఆలుగడ్డ, టొమాటో, రహస్యంగా తయారుచేసుకున్న మసాలాలు, చీజ్... ఇవన్నీ దోసెను కమ్మేస్తుంటే, ఆ దోసెలు రంగురంగుల సీతాకోకచిలుకల్లా ప్లేట్లలోకి ఎగిరి వస్తుంటాయి. కరిగించిన బటర్ వేయడం వల్ల, టొమాటో ముక్కలు మెత్తబడి, రుచికరంగా తయారవుతుంది దోసె. ఇలా తయారైన దోసెను ఆకు మీదకు తీసి, ఆ ఆకును పేపర్ మీద ఉంచి అందిస్తారు. అది నోట్లో పెట్టుకోగానే అమృతం సేవించినట్లు అనుభూతి చెంది ‘జై గోవిందా!’ అనకుండా ఉండలేరు. ఒకేసారి ఎనిమిది దోసెలు వేస్తారు గోవింద్ భాయ్. – పిల్లి రాంచందర్, సాక్షి చార్మినార్, హైదరాబాద్ స్వయం కృషితో.... మా నాన్న పేరు రాఘవులు. మాది పేద కుటుంబం. మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్న నర్సింహం గుల్జార్‌హౌజ్ ఆగ్రా హోటల్ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద బండి పెట్టి, ఇడ్లీ–దోసె తయారు చేయడం ప్రారంభించారు. ఆయన దగ్గర మేమందరం పని చేసాం. ఆయన స్ఫూర్తితో 1990లో సొంతంగా ఇడ్లీ బండి పెట్టి, వ్యాపారం మొదలుపెట్టాను. వెయ్యి రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన నా వ్యాపారం బాగా ఎదిగింది. నాకు మంచి ఆదాయం వస్తుండటంతో, మా పిల్లలను చదివించుకుంటున్నాను. కష్టపడి పని చేస్తే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడితే నలుగురికీ ఆదర్శంగా ఉంటారు. – గోవింద్ భాయ్ -
4 మినార్లు..5 సంవత్సరాలు
"గత మే నెలలో చార్మినార్ నైరుతి భాగంలోని మినార్ నుంచి భారీ పెచ్చు ఊడింది. దాని మరమ్మతుకుగాను సిబ్బంది ఆ భాగం వద్దకు చేరుకుని, కూర్చుని పని చేయటం కోసం స్కఫోల్డింగ్ (ఇనుప రాడ్లు, కర్రలతో ఏర్పాటు చేసే భాగం) ఏర్పాటుకు రూ.3.5 లక్షలు ఖర్చు అయింది. ఇది చార్మినార్ పరిరక్షణ నిధుల్లో కోత పడి అసలు పనుల్లో జాప్యానికి కారణమైంది. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రతినిధి రానున్నాడని తెలిసి గత నెల దాని చుట్టూ పరిసరాలు, సమీపంలోని ఉప ఆలయాల ముస్తాబు, కొత్త రోడ్డు నిర్మాణం, పచ్చిక బయలు...తదితర పనులు చేశారు. ఇందుకు పట్టిన సమయం కేవలం ఒక నెల. వీటికి ఏఎస్ఐ రూ.5 కోట్లను విడుదల చేసింది. యుద్ధప్రాతిపదిక పనులు అంటే ఇవి" సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్. ఓ రకంగా చెప్పాలంటే ఈ నగర సంతకం లాంటిది ఆ నిర్మాణం. మరి అది ప్రమాదంలో పడిందంటే పరిరక్షణ చర్యలు యుద్ధప్రాతిపదికన జరగాల్సిందే. కానీ, ఒక్కోటి 48.7 మీటర్ల చొప్పున ఎత్తు ఉండే నాలుగు మినార్ల పరిరక్షణ పనులు పూర్తి చేసేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ‘పంచవర్ష ప్రణాళిక’నే కొనసాగించారు. 2014, డిసెంబర్లో ప్రారంభమైన పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు దిగువ భాగానికి పరిరక్షణ పనులు ప్రారంభించారు. మరి ఆ భాగం పనులు పూర్తి చేసేందుకు ఎన్నేళ్లు పడతాయో చూడాలి. చివరి మినార్ పని పూర్తయ్యేసరికి, మొదటి మినార్ రంగు మారిందంటే, పనుల్లో జాప్యం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. "ఒక మినార్‌లో చిన్న పని మినహా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడే దిగువ భాగం పని ప్రారంభిస్తున్నాం. మొత్తం కట్టడం పని వీలైనంత తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ పనులు క్లిష్టమైనవే అయినందున కాస్త జాప్యం తప్పదు. అయినా వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం." మిలింద్ కుమార్ చావ్లే, ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు ఎందుకు జాప్యం..? 427 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్ క్రమంగా వాతావరణ ప్రభావం, వాహనాల కాలుష్యంతో దెబ్బ తింటూ వస్తోంది. అంతేకాదు కొందరు పర్యాటకులు కట్టడం గోడలపై లోతుగా పేర్లు చెక్కడం లాంటి పనులతో నిర్మాణం పైపూత దెబ్బతింటోంది. క్రమంగా పగుళ్లు ఏర్పడి వాటిల్లోంచి వాన నీళ్లు, గాలిలోని తేమ లోనికి చొరబడి చార్మినార్‌ను ప్రమాదంలో పడేశాయి. ధవళ వర్ణంతో మెరవాల్సిన గోడలు గోధుమ, పసుపు వర్ణంలోకి మారాయి. జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ కాన్పూర్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), విస్కాన్నిన్ విశ్వవిద్యాలయం నిపుణుల బృందం అధ్యయనం చేసి, వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టకుంటే కట్టడం శిథిలమవడం ఖాయమని తేల్చి నివేదిక అందించారు. దీంతో 2014లో పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఏఎస్ఐ నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. కానీ.. ఏఎస్ఐ తెలంగాణ విభాగానికి సంవత్సరానికి వచ్చే నిధులు సగటున రూ.2 కోట్లకు అటూఇటుగా ఉంటాయి. దీంతో వాటిల్లోంచి చార్మినార్‌కు ఒక్కో సంవత్సరం కొన్ని లక్షలను మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. డంగు సున్నం మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించినందున మళ్లీ అదే మిశ్రమంతో కట్టడం మొత్తం పైపూత వేయటమే ఈ పని. ఏడాదిన్నరలో ఈ పని పూర్తి చేసి, మరో ఏడాదిలో దిగువ భాగాన్ని కూడా సిద్ధం చేయాలని తొలుత భావించారు. కానీ నిధులు సరిపోక, ఆ వచ్చేవి కూడా సకాలంలో విడుదల కాక పనుల్లో ఇంత జాప్యం జరిగింది. -
మణిహారానికి మెరుగులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికే మణిమకుటం. తెలంగాణకే తలమానికం. అదో అపురూపమై కట్టడం. నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర దీని సొంతం. అదే చార్మినార్. హైదరాబాద్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈ అరుదైన నిర్మాణమే. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది చార్మినార్ ప్రాంతం. కాలుష్యం బారిన పడి వన్నె తగ్గడంతో చార్మినార్‌కు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరమ్మతులు చేపట్టింది. మసకబారిన మినార్లతో పాటు అక్కడక్కడ పెచ్చులూడి, పగుళ్లు ఏర్పడటంతో 2016లో మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. గత అక్టోబర్ దాకా ఈ పనులు కొనసాగాయి. మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. రూ.3 కోట్లు మంజూరు కావాల్సి ఉందని.. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు మినార్లకు మరమ్మతు పనులతో పాటు రంగులు వేశారు. వచ్చే ఏడాది మార్చి నెల వరకు పనులు పూర్తి కానున్నాయి. క్రీ.శ.1591–92లో కుతుబ్‌షాహీ వంశంలోని ఐదో పాలకుడు, హైదరాబాద్ నగర వ్యవస్థాపకుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించిన చార్మినార్ కట్టడం గత కొన్నేళ్లుగా కాలుష్యం కారణంగా పూర్తిగా మసకబారడంతో పురావస్తు శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. 2016–17లో ఉత్తరం– పశ్చిమం వైపు పనులు జరిగాయి. 2017–18లో దక్షిణం–పశ్చిమం వైపు, 2018–19లో ఉత్తరం–తూర్పు వైపు, దక్షిణం– తూర్పు వైపు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. రంగులు వేయాల్సి ఉంది. వచ్చే మార్చి వరకు చార్మినార్ కట్టడం బయటి గోడలకు రిపేర్ పూర్తి అవుతుంది. లోపలి గోడలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశిష్టత ఇదీ.. కుతుబ్‌షాహీల కాలంలోని కళానైపుణ్యానికి అద్దం పట్టేలా చార్మినార్ కట్టడం చరిత్ర పుటల్లో నిలుస్తోంది. చార్మినార్‌ను తిలకించడానికి పర్యాటకులు సైతం ఉత్సాహం చూపుతున్నారు. చార్మినార్ ఒక్కో మినార్ నేల నుంచి 56 మీటర్లు ఉండగా.. రెండో అంతస్తు నుంచి 34 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ మినార్లలో కూడా మళ్లీ మూడంతస్తులున్నాయి. ప్రతి మినార్‌లో కింది నుంచి పైకి వెళ్లడానికి సర్పాకారంలో 149 మెట్లున్నాయి. విరిగిపడుతున్న డిజైన్ దిమ్మెలు.. చారిత్రక చార్మినార్ కట్టడంలోని మక్కా మసీదు వైపు ఉన్న మినార్‌పై ఉన్న పూల డిజైన్ ఈ ఏడాది మే 1న రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో ఊడి పడింది. 2002, 2010లలోనూ చార్మినార్ కట్టడం పైఅంతస్తులోని బయటి వైపు ఉన్న పూల డిజైన్ల గచ్చులు ఊడి కింద పడ్డాయి. వెంటనే స్పందించిన పురావస్తు శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అప్పట్లో డంగు సున్నంతో ఏర్పాటు చేసిన డిజైన్ పూల గచ్చు దిమ్మెలకు చార్మినార్ కట్టడంలోని రాళ్లతో అనుసంధానం (బాండింగ్) లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని నిఫుణులు స్పష్టం చేస్తున్నారు. రాళ్లతో కట్టిన చార్మినార్ నలువైపులా గోడలు, మినార్లకు డంగు సున్నంతో డిజైన్లను ఏర్పాటు చేయడంతో పటుత్వం లేకుండాపోతోంది. ప్రస్తుతం జరిగే భారీ కట్టడాలకు స్టీల్, ఐరన్ల సపోర్టు ఇస్తూ నిర్మిస్తుండడంతో పటుత్వం కోల్పోకుండా ఏళ్ల తరబడి ఉంటున్నాయి. సున్నంతో నిర్మించినందున అప్పుడప్పుడు యాసిడ్‌తో కూడిన వర్షాలు పడుతుండడంతో రెండింటికి కెమికల్ రియాక్షన్ జరిగి రాతి కట్టడానికి డంగు సున్నానికి నడుమ గ్యాప్ ఏర్పడుతోంది. ఇలా ఏర్పడిన గ్యాప్‌లో నీరు చేరుతుండడంతో బరువు ఎక్కువై సున్నం పటుత్వాన్ని కోల్పోయి కింద పడుతోంది. జీహెచ్ఎంసీ స్థలం ఇస్తే.. జీహెచ్ఎంసీ అధీనంలోని ఖాళీ స్థలాన్ని తమకు కేటాయిస్తే చార్మినార్ కట్టడాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకులకు పలు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పురావస్తు శాఖ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ డాక్టర్ మిలన్ కుమార్ చావ్లే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. సాధ్యమైనంత వెంటనే తమకు ఖాళీ స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్ధం టాయిలెట్లు, క్లాక్ రూంలు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రస్తుతం చార్మినార్ కట్టడం ప్రాంగణంలో కొనసాగుతున్న టికెట్ కౌంటర్‌ను బయట ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. జీహెచ్ఎంసీ వెంటనే స్పందించి స్థలాన్ని కేటాయిస్తే.. పర్యాటకులకు మరిన్ని వసతుల కల్పనకు ఏఎస్ఐ సంసిద్ధత వ్యక్తంచేస్తోంది. పనులు చకచకా.. చార్మినార్ కట్టడానికి 2016 నుంచి మరమ్మతు పనులు చకచకా జరుగుతున్నాయి. డంగు సున్నంతో పనులు చేస్తుండటంతో అది ఆరడం కోసం సమయం పడుతోంది. గత నెల వరకు పనులు జరిగాయి. ప్రస్తుతం మిగిలిన పనుల కోసం రూ.3 కోట్ల నిధులు అవసరం. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశాం. అప్పుడప్పుడు పూల డిజైన్ల పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. వాటన్నింటికి తిరిగి మరమ్మతులు చేపట్టాం. పటుత్వం కోసం అవసరమైన చోట స్టీల్ రాడ్లతో సపోర్ట్ ఏర్పాటు చేసి మరమ్మతులు చేశాం. బయట పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది లోపల పనులు ప్రారంభిస్తాం. జీహెచ్ఎంసీ ఖాళీ స్థలం కేటాయిస్తే.. పర్యాటకుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి చేస్తాం. – మిలన్ కుమార్ చావ్లే, ఏఎస్ఐ, హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ -
కాంగ్రెస్‌దే అధికారం
దూద్‌బౌలి: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, నాయకులంతా కలసి కట్టుగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి.కుంతియా అన్నారు. చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన స్మారక కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఉగ్రవాదుల నిర్మూలన, శాంతి సామరస్యం కోసం చార్మినార్ సద్భావన యాత్ర ప్రారంభించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్‌గాంధీ అన్నారు.విద్యావేత్త ప్రొఫెసర్ డాక్టర్ గోపాలకృష్ణను ఎమ్మెల్సీ కమలాకర్ చేతుల మీదగా రాజీవ్‌గాంధీ స్మారక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్, మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు డి. శ్రీధర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
చార్మినార్ చుట్టూ అత్తర్ సువాసనలే..
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక అత్తరు దుకాణంలో కూర్చుని ఉన్నాను. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ ఏ భాష మాట్లాడేవారైనా దీన్ని ఓల్డ్ సిటీ అనే అంటారు. హిందీ వాళ్ళు ‘పురానీ శహర్’ అని కానీ, తెలుగు వాళ్ళు ‘పాత నగరం’ అని కానీ, తమిళం మాట్లాడేవాళ్ళు ‘పళైయ నగరమ్’ అని కానీ అనరు. ఉర్దూ మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ తెలియనివారూ కూడా ఓల్డ్ సిటీ అనే పిలుస్తారు. ఆంగ్ల భాషలోని ఈ రెండు పదాలు మనకు అక్కడి చార్మినార్ చుట్టుపక్కల కనిపించే గిజగిజలాడే రోడ్లు, ఇరుకు గల్లీలు, హలీమ్ చేసే ఫుట్‌పాత్ హోటళ్ళు, షేర్వాని కుర్తాలు వేసుకుని కళ్ళకు సుర్మా రాసుకుని మీసాలు తీసేసి ఉత్త గడ్డం పెంచుకుని తిరిగేవారు, నలుపు బుర్ఖాలు, గాజులు ముత్యాలు అమ్మే అంగళ్ళు, తోపుడు బళ్ళలో ఎత్తుగా పోసుకుని అమ్ముకునే రొట్టె బిస్కత్తులు, చాయ్ దుకాన్లు, బిర్యాని షేర్వా సువాసనలు వీటన్నిటినీ కళ్ళకు కనిపించేలా చేసేంతగా ఇతర భాషల పదాలు చేయలేవు. ఇది నిజమో భ్రమో అర్థం కాదు. కానీ కొన్ని పదాలు అంత ప్రభావితం చేస్తాయి. బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నన్ను ప్రమోషన్ పైన హైదరాబాద్ పంపించారు. ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న నా ఆఫీస్‌కు దగ్గరగా గగన్‌మహల్ ఏరియాలో ఒక రెండు బెడ్ రూముల ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నాను. వచ్చి నాలుగేళ్ళయినా ఇంకా ఎవరూ స్నేహితులు ఏర్పడలేదు. కొంతమంది బంధువులున్నా వారితో పెద్ద టచ్ లేదు. కాబట్టి ఆఫీసులో పనయిపోయినాక నేను ఇంట్లోనే భార్యా పిల్లలతో గడిపేవాణ్ణి. ఇలా నీరసంగా రోజులు సాగిపోతున్న సమయంలో ఒక పత్రికలోని ప్రకటన నన్నాకర్షించింది. దాన్ని చూసి ఫోటోగ్రఫీ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 దాకా ఆబిడ్స్ లోని ఒక స్కూల్లో తరగతులు జరిగేవి. దాని కోసం పెంటెక్స్ కెమెరాను కొన్నాను. ఇలా మూడు నెలల ట్రైనింగ్ తర్వాత ఇక్కడి ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్‌లో సభ్యత్వం పొందాను. ఆదివారం తొందరగా లేచి హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైనా స్థలానికి అసోసియేషన్ స్నేహితులతో వెళ్ళి ఫోటోలు తీసుకోవడం అలవాటయ్యింది. కొన్నిసార్లు నేను ఒక్కణ్ణే వెళ్ళేవాణ్ణి. అలాగే ఈ రోజు ఒక్కణ్ణే బయలుదేరిన వాణ్ణి ఏదో కుతూహలం కొద్దీ ఓల్డ్ సిటీకి వచ్చి ఈ అత్తర్ అంగళ్ళో కూర్చుని ఈ అత్తర్ అమ్మేవాడు ఉర్దూలో అత్తర్ గురించి చెప్తూంటే వింటున్నాను. ఇత్తర్ అనే అరబ్బీ పదమే కాలక్రమేణ అత్తర్ అయిందట. దీన్ని కొన్ని రసాయన పదార్థాలతో తయారుచేస్తారట. కానీ పూలు, వేళ్ళు, మసాలా పదార్థాలతో లేదా ఉడికించిన మట్టి, గంధపు నూనెతో తయారైన అత్తర్లే నిజమైన అత్తర్లట. వీటిని నీటిలో ఉడికించి ఆవిరిగా మార్చి వడగట్టినప్పుడు వచ్చే తైలాన్ని సుమారు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాలదాకా సేకరించి తరువాత వాడతారట. వాటి నాణ్యత బట్టి వాటి ధరలుంటాయి అని చెప్పాడు. 10 ఎమ్.ఎల్ అత్తరుకు వంద రుపాయల నుండి లక్ష రుపాయలకు పైగానే ఉంటుందట. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సుమారు 150 కి.మీ దూరం ఉన్న కనౌజ్ అనే ఊరే ఇప్పటిక్కూడా అత్తర్ తయారీకి ప్రసిద్ధి అట. మొగలాయిలకు, నవాబులకు అత్తర్ అంటే చాలా ఇష్టమట. హైదరాబాద్ నవాబులకయితే మల్లెపూల అత్తర్ అంటే చాలా ఇష్టమట. తూర్పు దేశాలలో అత్తర్ ను అతిథులకు బహుమతిగా ఇవ్వడాన్ని గౌరవప్రదంగా భావించే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఈ అత్తర్‌ను అందంగా కనిపించే కట్ గ్లాసుతో చేసిన చిన్న, పెద్ద సీసాలలో నింపి అమ్ముతారు. రంగురంగుల ద్రవాలు నింపుకున్న కట్ గ్లాసు సీసాలపైన పడే కిరణాలు అన్ని వైపులకీ చెదిరిపోయి కలల ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ సీసాలను ఇత్తర్దాన్ అని పిలుస్తారు. సూఫీ సంతులు ధ్యానం చేసేటప్పుడు, సూఫీ నృత్య సమయంలో దర్వేశిలు అత్తర్ వాడడం జరుగుతుంది. కేసరి, మొగలి, మస్క్, గులాబి, హీనా, అణ్బర్, జాస్మిన్ ఇలా ఎన్నో విధాల సువాసనల అత్తర్లున్నాయి. ఈ అత్తర్‌ను కొన్ని గుండెవ్యాధుల మందుల తయారీలో కూడా వాడతారట. ఈ సువాసనల ద్రవ్యాలను ఉపయోగించి ‘అరోమా థెరపీ’ అనే చికిత్సతో కొన్ని రోగాలను నయం చెయ్యచ్చట. ఇలా అతడు అత్తర్ గురించిన అనేక విషయాలను చెప్పసాగాడు. ఉదయం పూట కావడంతో అంగట్లో ఇతర గిరాకీలెవరూ లేదు. అత్తరు గురించిన సంపూర్ణ సమాచారాన్ని నాకు చేరవేయాలని అతని తపన. తన దగ్గరున్న అత్తరు సీసాల నుండి అందులో వేసిన గాజు కడ్డీకి అత్తరును రాసి నా ముంజేతికి రాస్తూ, వాసన చూడమన్నాడు. ఇలా కొన్ని వాసనలన్నీ కలగలిపి అదేదో రకమైన గాఢమైన వాసన నా తలకెక్కింది. ఒక రకమైన మత్తు నా నెత్తిలో చోటు చేసుకుంది. వెళ్ళిపోదాం అనిపించింది. అతడేమో నాకు ఒక్క బాటిలైనా అమ్మాలని పట్టుదల మీద ఉన్నట్టనిపించింది. నన్ను వదిలేటట్టు లేడు అనిపించింది. మొదటి గిరాకీ కదా, బోణీ కొట్టాలి మరి. చివరికి ఆ లఖ్నవి కుర్తా పైజామా తొడుక్కుని తలకు తెల్లదారాలతో నేసిన తఖియా టోపీ పెట్టుకున్న, మీసాలను నున్నగా గొరిగేసి ఉత్త గడ్డం మాత్రం పెంచుకున్న అతడినుండి బయటపడడానికి మల్లెపూల ఘుమఘుమల చిన్న ఇత్తర్దాన్ సీసాను 350 రుపాయలకు బేరమాడి కొనుక్కున్నాను. దాంతో పాటు అతడి చిటికెన వ్రేలంత చిన్న సీసాను కానుకగా ఇస్తూ నవ్వు పులుముకున్న ముఖంతో ‘‘శుక్రియా సాబ్, ఆప్ కే మేమ్ సాబ్‌కో బహుత్ పసంద్ ఆయెగా’’ అన్నాడు. ఎంత బేరమాడినా ఎక్కువే ఇచ్చేసానేమో అనిపించింది నాకు. అతని కొట్టు మెట్లు దిగి నాలుగయిదు అడుగులు వేసానో లేదో కాలికేదో తగిలినట్టనిపించి వంగి చూశాను. క్రింద పాల మీగడ కలర్లోని ఎ4 సైజు కవర్ ఒకటి కనిపించింది. చేతిలోకి తీసుకుని, అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు. కవర్ని ముందూ వెనకా తిప్పి చూశాను. ఎవరికి చేరాలో వారి చిరునామా కానీ, పంపే వారి చిరునామా కాని కనబడలేదు. కవర్ పై భాగంలో ఎడమ మూలలో ఒక చిన్న వృత్తంలో ధను రాశి గుర్తు కనిపించింది. ఆ చిత్రం లోని పై భాగం విల్లెక్కు పెట్టిన మనిషి ఆకారం, క్రింది భాగం గుర్రం నడుం భాగంగా ఉండింది. ఈ కవర్ ఎవరిదో ధను రాశి వారిదయి ఉండాలని అనిపించింది. కవర్ని ఎరుపు రంగు లక్కతో సీల్ చేశారు. దాని పైన కూడా ధనస్సు రాశి గుర్తు కనిపించింది. ముందేమో ఇది ఏ కంపెనీదైనా కవరేమో అనిపించింది. మందమైన హ్యాండ్ మేడ్ పేపర్‌తో చేసిన సుందరమైన కవర్ అది. ధనస్సు రాశి గుర్తు కూడా బంగారు రంగులో ముద్రించి ఉండి ముద్దుగా ఉండింది. ఇవన్నీ చూడగా కవర్ కంపెనీది అయి ఉండదు, ఎవరో రసిక వ్యక్తిదే అయి ఉండాలి అనిపించింది. ఆ కవర్ నుండి కూడా అత్తరు సువాసన వచ్చింది. ముందుగానే ఉండిందా లేక నా చేతి నుండి సోకిందా తెలియలేదు. అప్పుడే కొత్తగా కొన్న కైనెటిక్ హోండా స్కూటర్ ముందు వైపు బాక్స్‌లో ఆ కవర్‌ను ఉంచి మూసేసి ఇంటి వైపు బయలుదేరాను. ఆరోజు ఫోటోలు తీయలేదు. ఇంట్లోకి రాగానే నా వైపు పరుగెత్తుకొచ్చిన నా ఐదు సంవత్సరాల బాబు నా నుండి వస్తున్న అత్తరు వాసన చూసి ముక్కు చిట్లించి ‘‘అమ్మా! నాన్న దగ్గర్నుండి అదో రకమైన వాసన వస్తోందే’’ అనగానే, లోపల్నుండి వచ్చిన నా భార్య నావైపు సంశయంగా చూస్తూ ‘‘ఎక్కడిదండీ ఈ అత్తరు వాసన’’ అని అడిగింది. నేను జరిగిన సంగతంతా చెప్పి ఆమెకు నేను తెచ్చిన అత్తర్ సీసాను ఆమెకిచ్చాను. ఆమె అట్టపెట్టెలో పత్తితో చుట్టి పెట్టిన కట్ సీసాను చూసి ‘‘బాటల్ బావుంది’’ అంది. తరువాత ‘‘అత్తరూ బావుంది’’ అంటూ వంకరగా నవ్వింది. నా రూముకు వెళ్ళి కెమెరాను బీరువాలో పెట్టి, ఆ కవర్ని మళ్ళీ ఒకసారి వెనుకా ముందూ చూసి, తీసి చూడనా అని ఆలోచించి, మళ్ళీ ‘‘ఎందుకులే ఎవరిదో ఏమో, ఏం వ్రాసుకున్నారో ఏమో నాకెందుకు? తరువాత దీని గురించి ఆలోచిద్దాం’’ అనుకుని నా బీరువాలోనే ఉంచుతూ కాంప్లిమెంటుగా అత్తర్ సాయిబు ఇచ్చిన చిటికెన వేలు సీసాను దాంతోపాటే ఉంచాను. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం. భార్యా, బాబు చికెన్ బిరియాని కడుపునిండా తిని,ఆ మత్తులో నిద్ర పోతున్నారు. నేను మాంసాహారం తినను. అన్నం చారూ తిని మధ్యాహ్నం పూట నిద్ర అలవాటు లేని కారణంగా హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. విసుగ్గా ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆన్ చేశాను. ఉన్న ఒక దూరదర్శన్ చానల్లో మొగలే ఆజమ్ చిత్రం వస్తోంది. ప్యార్ కియాతో డర్నా క్యా అనే పాటకు మధుబాల నృత్యం చేస్తోంది. మొత్తం సినిమాని బ్లాక్ అండ్ వైట్‌లో తీసి ఈ పాటను మాత్రం కలర్లో తీసినా అప్పటి టీవీలలో బ్లాక్ అండ్ వైట్‌లోనే వచ్చేది. ఎన్ని సార్లు ఈ సినిమా చూడాలి అనిపించి ఆ పాట అయిపోయేదాకా చూసి తరువాత కట్టేసి, ఏదైనా పుస్తకం చదువుదామని బీరువా తీశాను. తీయగానే అత్తర్ సువాసన. ఆ చిట్టి సీసాతో పాటు ఉన్న పాల మీగడ తెల్ల కవర్ కనిపించింది. చాలా రోజులైంది దాని గురించి మరచిపోయి. దాన్ని తీసుకుని హాల్లోకి వచ్చి విప్పి చూద్దామా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాను. అందులో ఏముందో? బహుశా ఉత్తరమే ఉండొచ్చు. ఎవరిదో ఏమో?ఎవరిదో ఉత్తరాన్ని అలా చదవడం సబబేనా అనే నైతిక సంబధమైన ప్రశ్నల సందిగ్ధానికి లోనై, కొంత సేపు తన్నుకున్నాను. తరువాత ‘‘చూసేద్దాం, అందులో ఎవరికని తెలిస్తే వారికి చేర్చవచ్చు’’ అని మనసుకు ఊరట చెప్పుకుని కవర్‌ను తెరిచాను. పది పన్నెండు ఎ4 సైజు ఐవరి పేపర్లకు ఒక జెమ్ క్లిప్ వేసి కనిపించింది. ఎడమ వైపు భాగంలో బంగారు రంగులో అదే ధనస్సు రాశి బొమ్మ అన్ని పేజీల్లోనూ కనిపించింది. ఎలెక్ట్రానిక్ టైప్ రైటర్లో అందంగా పేజీకి ఒకే వైపున ఇంగ్లీషులో టైపు చేసింది కనిపించింది. మొదటి లైను మాత్రం నల్లటి ఇంకులో ఇటాలిక్ శైలిలో ముద్దుగా చేత్తో రాసిన ఇంగ్లీషు అక్షరాలు కనిపించాయి. ఆ లైనును చదివాను. Ditty My Dear. వెంటనే అర్థమయింది ఇదేదో ప్రేమ పత్రమని. ముందుకు చదవాలా వద్దా అనే మీమాంస సతాయించింది. ఇంకా ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని అలా ఒక్కసారి ఉత్తరాన్నంతా కళ్ళతో చదివాను. చివరగా Loving Regards, Yours, M10th March 1985 అని రాసుంది. మొదటి లైన్ లాగే ఇది కూడా ఇటాలిక్ శైలిలో నల్లటి ఇంకుతో చేత్తో రాసి కనిపించింది. ఇది రాసి పదిహేను రోజులయ్యాయి. పాపం, పోగొట్టుకున్న వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో. ఉత్తరంలో వివరాలేమైనా ఉండుంటే దీన్ని ఎవరికి చేర్చాలో వారికి చేరవేయవచ్చు. ఎందుకని ఈ చిరునామా కూడా వ్రాయలేదు. బహుశా పర్సనల్ గానే ఇవ్వాలనేమో? ఖచ్చితంగా ఇది ప్రేమ పత్రమే. ఎలాంటి అనుమానమూ లేదు. చదవడం మర్యాద కాదు అని అనిపించి అలాగే కవర్ లోపల పెట్టేశాను. మరుసటి రోజు ఆఫీసుకు రాగానే కొంచెం సేపటి తర్వాత, పక్కనే ఉన్న బషీర్‌బాగ్ నాగార్జున హోటల్ పైనున్న డెక్కన్ క్రానికల్ వార్తా పత్రిక ఆఫీసుకు వెళ్ళి ఇంగ్లీషులో ఒక చిన్న ప్రకటన రాసిచ్చి దానికయ్యే రుసుము రూ.50 ఇచ్చాను. ‘‘డిట్టి మై డియర్ అని సంబోధించబడి, 10వ తేదీ మార్చ్ 1985 రోజు వ్రాసి, ‘యం’ అని సంతకం చేసిన ఉత్తరం, దాంతో పాటు ధనస్సు రాశి చిహ్నం ముద్రించిన ఒక కవర్, ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గరి అత్తర్ షాపు ముందు నాకు దొరికింది. పోగొట్టుకున్నవారు ఈ క్రింది ఫోన్ నంబర్ పై సంప్రదించండి.’’ అంటూ నా ఆఫీస్ ఫోన్ నంబర్ ఇచ్చాను. ఆ ప్రకటన మ్యాటర్ చదివిన అక్కడి గుమాస్తా ‘‘ఎంత మంచివారు సార్ మీరు. ఈ రోజుల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలాంటి పని ఎవరు చేస్తారు చెప్పండి.’’ అన్నాడు. నేను పేలవమైన ఒక నవ్వు నవ్వి వచ్చేశాను. నేను పని చేసే ఆఫీసు చిన్నది. ముగ్గురమే మేము. నేను లేనప్పుడు ఫోన్ వస్తే వివరాలు కనుక్కుని ఉంచమని నా జూనియర్స్ ఇద్దరికీ చెప్పి పెట్టాను. వారాలు, నెలలు గడిచినా ఎవ్వరి వద్ద నుండి ఫోన్ రాలేదు. సంబంధించిన వారికి నా ప్రకటన కనిపించిందో లేదోననిపించింది. నా పుస్తకాల బీరువాలో ఒక మూల ఆ కవర్ ను పెట్టి మరచిపోయాను. కానీ, అప్పుడప్పుడు ఏదైనా పుస్తకం తీసేటప్పుడు బీరువా తలుపు తీస్తే అత్తర్ సువాసనా, ఆ తెల్ల కవర్ తొంగి చూసి నాకు జరిగింది గుర్తుకు తెచ్చేవి. కానీ, ఏదో పాపపు ప్రజ్ఞ నన్నా ఉత్తరాన్ని చదవనివ్వలేదు. మూడు సంవత్సరాల తరువాత నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చి బెంగళూర్‌లోని మా హెడ్డాఫీసుకు వచ్చి అప్పుడే ఏడెనిమిది సంవత్సరాలు గడచిపోయాయి. బెంగళూరుకు వచ్చాక కొద్దిమంది సాహితీ మిత్రుల సహవాసంతో నేను కూడా వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడే ఒక ఏడెనిమిది కథలు, కొన్ని కవితలు అక్కడి వార, మాస పత్రికలలో ప్రకటించబడి నా పేరు కూడా రచయితల పట్టీలో నమోదయింది. నేను పుస్తకాల బీరువా తెరచినప్పుడల్లా అత్తరు సువాసన, ఆ కవర్ నన్ను సతాయించేవి. ఇలాగే ఒక రోజు ఏదో పుస్తకం కోసం వెతుకుతూ బీరువా తీసేసరికి మళ్ళీ ఆ కవర్ కనిపించింది. అప్పటికి ఆ కవర్ నా చేతికి వచ్చి సుమారు పన్నెండో,పదిహేనో సంవత్సరాలయ్యాయి అనిపించింది. మెల్లిగా కవర్‌ను దాని అత్తరు సువాసనతో పాటు చేతిలోకి తీసుకున్నాను. ఎందుకో ఈ రోజు ఆ ఉత్తరాన్ని చదివేయాలి అనిపించింది. ఇన్ని రోజులు చదవకుండా ఆపుకున్న నా నైతిక విలువలు సడలిపోయాయి. నా ఫీలింగ్‌కి తర్కం కూడా తోడయ్యింది. ఇన్ని సంవత్సరాలయ్యాయి. చదివితే తప్పేముంది? ఎవరో తెలియదు. వారికైనా ఇది నా దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది? వారు కూడా మరచి పోయుండొచ్చు. ఇంతా చేసి అది ప్రేమ పత్రమే కదా. అందులో ఏ రహస్యమున్నా నేనెవరికి చెప్తాను? ఎవరు నన్నడిగేది? ఈ ఉత్తరం ఎవరికి రాసుందో వాళ్ళకైనా ఎలా తెలుస్తుంది? ఇలా నా పరంగా నేను వాదించుకుని నా బుద్ధిని మనస్సుకు అప్పగించి ఉత్తరం చదవడానికి తయారయ్యాను. నాకు ముందుగా కుతూహలాన్ని రేపింది డిట్టి అనే ఆ పేరు. డిట్టి అనేది అదెంత ముద్దొచ్చే పేరు! ఇది ఇంగ్లీష్ పదం. దీనర్థం ఒక చిన్న పాట అని. పాట కోసమే రాసిన చిట్టి కవిత. ఉత్తరం రాసింది మగవాడే అయ్యుండాలి. చాలా మట్టుకు రసికుడే అయ్యుండాలి. లేకుంటే ఇలాంటి పేరు స్ఫురించడం కష్టమే. అతడు ప్రేయసినే ఇలా ముద్దు పేరుతో పిలుస్తుండాలి. మరి ఈ ‘యం’ అంటే ఏమయ్యుండొచ్చు? అతడి పేరులోని మొదటి అక్షరమయ్యుండొచ్చు. అతడి ఇంటి పేరో ముద్దు పేరో అయ్యుండే ఛాన్సు తక్కువే. మరి తన పేరు పూర్తిగా రాయకుండా ఉత్త M మాత్రమే ఎందుకు రాశాడు ? ఈ అక్షరంతో మొదలయ్యే పేరు ఏమయ్యుంటుంది? మోహన్, మురళి, ముకుంద్.. ఇలా ఏదో ఒక కృష్ణుడి పేరే అయ్యుండాలి. ప్రేమించేవాడి పేరు వేరే ఇంకెలా ఉంటుంది? మనం మోహన్ అనే పిలుచుకుందాం. మోహనంగా ఉంటాడేమో. ధను రాశివారు మంచి ప్రేమికులని విని ఉన్నాను. మరి ఈయన రాశి ధనస్సయితే ఆమెది ఏదయి ఉంటుంది? నా కల్పన ఏవేవో దారులు పట్టింది. ఈ రాశుల గురించి లిండా గుడ్డన్ మొదలయిన వారు రాసిన అనేక వ్యాసాల్ని చదివాను కాబట్టి కొన్ని గుర్తుకొచ్చాయి. ఈ ధను రాశికి అనురూపమైన కొన్ని రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం. వీటిలో ఏదుండొచ్చు? కుంభరాశి అయితే శ్రేష్ఠం. ఆ రాశివారే ధను రాశివారితో అన్నివిధాలా సర్దుకుని పోతారట. నాకు వీటిమీద నమ్మకం లేకపోయినా ఊరకే కుతూహలానికని ఇలా ఆలోచించాను. డిట్టి. ఈ పూర్తి పేరు గురించి మనం బుర్ర చెడుపుకోవద్దు. ఒక చిట్టి కవిత/పాట అనుకుంటేనే బాగుంది. అదే కొనసాగిద్దాం. ఈమెకి సుమారు ఒక ముప్ఫై/ ముఫ్ఫై అయిదేళ్ళు ఉండొచ్చు. విడాకులు తీసుకుంది. ఏదో ఒక జాతీయ బ్యాంకులో పని చేస్తోంది. ఇటీవలే బెంగళూరు నుండి హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఖైరతాబాద్ శాఖలో పని చేస్తోంది. అక్కడే దగ్గర్లో ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటోంది. వచ్చి సుమారు ఒక సంవత్సరం అయ్యింది. ఈమె విడాకులు తీసుకుందని అక్కడ ఎవరికీ తెలియదు ఒక్క ఈ ‘యం’ అని రాసుకున్న మోహన్‌కు తప్ప. అతడు ఇదే బ్యాంకులోని ఓల్డ్ సిటీలోని ఒక శాఖలో పనిచేసే హైదరాబాద్ మనిషి. బ్యాంక్ వాళ్ళ ఒక పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. తరువాత పరిచయం పెరిగింది. మోహన్‌కు సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. పెళ్ళైంది. ఒక అబ్బాయి. మన డిట్టికి తెలుగు రాదు, మోహన్‌కు కన్నడం రాదు. ఇద్దరూ ఇంగ్లీషులోనో, హిందీ లోనో మాట్లాడుకునేవారు. డిట్టిది చామన చాయ, నూనె రాసినట్టు మెరిసే చర్మం, నల్లగా ఒత్తుగా భుజాల దాకా పరచుకున్న కురులు, మెరిసే వజ్రాల్లా ఉన్నా ఎప్పుడూ ఉదాసీనంగా కనిపించే కళ్ళు, నుదుట బొట్టు, చెవుల్లో కమ్మలు, ముక్కుకు ఎడమ వైపు మెరిసే ముక్కుపుడక. ఎప్పుడూ ఆమె కట్టే గంజిపెట్టి ఇస్త్రీ చేసిన గరగరలాడే మగ్గం చీర, సన్నగా పొడుగ్గా ఉన్న ఆమె అందానికి మెరుగులు దిద్దేది. ఆమెను ఒక సారి చూసిన ఏ మగవాడైనా తిరిగి చూడకుండా వెళ్ళిపోవడమన్నది అసాధ్యం. అటువంటి కిల్లర్ బ్యూటీ ఆమె! ఆడ మగ స్నేహం ఎప్పుడు ఎలా ఆకర్షణకు లోనై మోహంగానో, ప్రేమగానో మారుతుందో చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. వీళ్ళ స్నేహం కూడా అంతే. పార్టీలో కలిసిన తరువాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత శనివారాలు బ్యాంకు సగం రోజు కాబట్టి పని ముగించేసి, ఎక్కువ రద్దీ లేని రిట్జ్ హోటల్లో మధ్యాహ్నం భోజనం కానిచ్చి, చాలా సేపు కబుర్లతో కాలం గడిపి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళేముందు ఒక కప్ కాఫీ త్రాగడం అలవాటయింది. ఆ రిట్జ్ హోటల్ బహుశా బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిదై ఉంటుంది. ట్యాంక్ బండ్ పక్కనున్న ఆనంద్ నగర్లో ఒక్క చిన్న మిట్ట పైన ఉన్న కాస్త పెద్ద హోటల్. బయటినుండి పాత కోట లాగా కనిపిస్తుంది. కాని లోపల మంచి వాతావరణం. ఎత్తైన కిటికీలు, వాటికి రంగురంగుల పరదాలు, ఎత్తైన పైకప్పునుండి వేలాడుతున్న ష్యాండలియర్లు, గోడకు అలంకరించిన కత్తి డాలు ఈటె మొదలైనవి, కొన్ని అందమైన తైలవర్ణ చిత్రాలు, శుభ్రమైన తెల్లటి గుడ్డ పరచిన గుండ్రటి టేబుల్స్, వాటి చుట్టూ కుషన్లు వేసిన నాలుగు చెక్క కుర్చీలు, టేబుల్ పైన ఒకే ఒక గులాబి పువ్వున్న ఫ్లవర్ వేజ్, తెల్ల వస్త్రాలతో అటూ ఇటూ తిరిగే వెయిటర్లు, మొగలాయి శైలిలో తయారైన శుచీ రుచీగల వంటకాలు ఇవన్నీ ఆ హోటల్ లోపలికి అడుగు పెట్టిన వారిని ఏదో లోకాలకు తీసుకెళ్ళేవి. వీరిద్దరూ ప్రతి వారం అక్కడికొచ్చి భోజనం చేయడం వలన అక్కడి వెయిటర్లకు బాగానే పరిచయమయ్యారు. వీరికిష్టమైన పదార్థాలేవి అనేది వారందరికీ తెలుసు. వీరు వచ్చి కూర్చోగానే ఆర్డర్ చేయకముందే తెచ్చిపెట్టే పానీయం స్వీట్ అండ్ సాల్ట్ లెమన్ సోడా. తరువాత ఇద్దరికీ ఇష్టమైన రోటీ, ఆలూ పాలక్, గోబీ మసాలా, జీరా రైస్, దాల్ తడ్కా వచ్చేవి. చివరిగా ఆ రోజు డెసర్ట్–కెరామెల్ కస్టర్డ్, కుబానీ కా మీఠా, షాహీ తుక్డా ఏదైనా ఒకటి వచ్చేది. ఇద్దరికీ షాహీ తుక్డా అంటే చాలా ఇష్టం. ఆవు నేతిలో వేయించిన గరగరలాడే త్రికోణాకారపు బ్రెడ్డు ముక్కలను తేనె కలిపిన చక్కెర పాకంలో కొంత సేపు నాన్చి తీసి, యాలకుల పొడి చిలకరించి, పింగాణి ప్లేటులో రెండు ముక్కలను అమర్చి వాటి పైన రబ్డీ పోసి, బాదాం తురుము, జీడిపప్పు, కేసరి చిలకరించి వేడి వేడిగా తెచ్చి పెట్టగానే అక్కడ కూర్చున్న వారిద్దరి నోళ్ళలో నీరూరిపోయేది. వాటిని ముక్కలు చేసి నోట్లో వేసుకుని అది కరగి పోయేటప్పుడు వీరిద్దరి మొహాల్ని చూడాలి. అప్పుడే ముద్దు పెట్టుకుని తడిబారిన పెదవులతో కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎలా ఉంటుందో అంత తాదాత్మ్యత. అప్పుడప్పుడు కొద్దిగా రబ్డీ డిట్టి పెదాల అంచులకు అంటుకోవడం, ఎవరూ చూడకుండా దాన్ని మోహన్ తన చిటికెన వ్రేలితో తీసి నోట్లో వేసుకుంటే ఆమె చామన చాయ మొహానున్న కుంకుమకు మరికొంచెం ఎరుపు రంగు కలిసేది. ఆమె ‘‘థత్.... యే క్యా షరారత్ హై’’ అంటూ ముద్దుగా కసిరితే, అతడి కళ్ళల్లోమరింత మత్తు కనిపించేది. వారిద్దరూ ఇలా కలవడం కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు ఇతడు ఆమెను తీసుకుని గోల్కొండ ఖిల్లా, గండిపేట్ చెరువుకు వెళ్ళేవాడు. అతడి వెనుక స్కూటర్ పైన కూర్చుని వెళ్ళడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఊరు దాటగానే అతడి నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని అతడి భుజంపైన తల ఆనించి తనను తాను మరచిపోవడం ఆమెకెంతో సంతోషాన్నిచ్చే సంగతి. అలా వెళ్ళేటప్పుడు ఆమె కురులు అతడి చెక్కిలిని తాకితే నెమలి ఈక తనను తాకినట్టనిపించేది అతడికి. ఒకసారి అతడు ఆమెకు మల్లెపూల సువాసన కల అత్తర్ ను తెచ్చిచ్చాడు. ‘‘అబ్బా! దీని సుగంధం అచ్చం మా ఊరి మల్లెపూల సుగంధంలా ఉంది’’ అనింది. అలా స్కూటర్ పైన వెళ్ళేటప్పుడు ఆ అత్తర్ సువాసన గాలిలో తేలుతూ అతడి ముక్కుకు సోకేది. అప్పుడు అతడు దానిని దీర్ఘంగా పీల్చేవాడు. ఆమె అతడి నడుముని ఇంకా గట్టిగా పట్టుకునేది. ఆ రోజు ఉగాది. అతడిని తన ఇంటికి భోజనానికి పిలిచింది. చిన్నగా తరిగిన క్యారెట్, బీన్స్, బటాణీలు వేసి అరిటాకులో వడ్డించిన బిసి బేళె భాత్ పైన వేడి నెయ్యి వేసుకుని, వేయించిన వేరుశెనగలతో చేసిన ఆవడలను ఉల్లిపాయల మరియు దోసకాయల రైతతో తింటుంటే వాటి రుచికి మైమరచి పోయాడతడు. ఇది మా వైపు చేసే స్పెషల్ భోజనం అంటూ ఆమె కొసరి కొసరి వడ్డించి తినిపించి, చివరిగా గసాల పాయసం తెచ్చినప్పుడు అతడికి మగతగా అనిపించింది. వారిద్దరూ పరస్పరం ఇచ్చుకున్న గిఫ్ట్‌ల గురించి అందులో రాశాడతడు. ప్రత్యేకంగా అతడు ఆమెకు కుంభ రాశి చిహ్నపు డాలర్‌తో పాటు ఇచ్చిన బంగారు గొలుసు. ఆమె అతడికి ఇచ్చిన చేతి గడియారం. అతడు ఆమెకు తెచ్చిన ఆమెకిష్టమైన మగ్గం చీరలు....ఆమె ఇచ్చిన టీషర్టులు ఇలా. మరుసటి రోజు ఆదివారం. ‘‘ఉండిపొండి’’ అందామె. ఎలాగూ పెళ్ళాం పిల్లలు ఇంట్లో లేరు. పండుగకని ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళారు. రావడం రేపు మధ్యాహ్నమే అనుకుని ‘‘ ఓకే’’ అన్నాడతడు. ప్రేమించుకునేవారు రాత్రి అలా ఆగిపోతే మామూలుగా ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఆమె రాత్రికి ఉండి పొమ్మన్నదీ, అతడు ఒప్పుకున్నదీ దానికే మరి! అక్కడ జరిగింది కూడా అదే! ఆమె చామన చాయలో ఈ మురళీ మోహన ముకుందుడు కరగిపోయాడు. ఆ ముకుందుడి మోహన మురళికి ఆమె కూడా కరగిపోయింది. ఇలా అనేక విషయాలను రాస్తూ తన గురించి కూడా అందులో రాశాడు. ఇంతకు ముందు కూడా అనేక ఉత్తరాలను ఆమెకు రాశాడు అని కూడా అర్థమయ్యింది. మంచి ఇంగ్లీషు భాషలో ఉన్న ఉత్తరం అది. ఆ భాషకి నేనే చిత్తయిపోయాను. ఇక డిట్టీకి ఎలా ఉంటుంది? ప్రేమికుడంటే ఇలా ఉండాలి అనిపించింది. ఆమెకు మళ్ళీ బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయిన సంగతి తెలిసి తన మనస్సులోని బాధను ఆ ఉత్తరంలో రాసుకున్నాడు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి జాగ్రత్తలు తీసుకోమన్నాడు. అబార్షన్ చేసుకోమని అతడు అన్న మాటకు ఆమె కోపగించుకుని నిరాకరించడం గురించి రాస్తూ ముందు ముందు ఎదురించాల్సిన సమస్యల గురించి ఆమెకు వివరించాడు. ఆమె వాటిని ఖాతరు చేసినట్టు కనిపించలేదు. ఆ ఉత్తరంలోని విషయాలతోపాటు నేను ఊహించిన కొన్ని పరిస్థితులని కల్పించి ఒక కథ రాసి పంపించాను. క్రితం వారం ఒక మాసపత్రికలో అది ప్రచురించబడింది. దానితర్వాతి కొన్ని రోజులకు నాకు పత్రిక ఆఫీస్ నుండి ఒక ఫోన్ వచ్చింది. నా అభిమాని ఒకరు అత్తర్ కథను చదివి నన్ను కలుసుకోవాలని అనుకుంటున్నట్టు, నా ఫోన్ నంబర్, ఇంటి చిరునామా కావాలని ఫోన్ చేశారని అన్నారు. నేను ఇవ్వండి అన్నాను. ఇలా అభిమానులు ఫోన్లో మాట్లాడడం, ఇంటికొచ్చి కలవడం అప్పుడప్పుడు జరిగేది. ఆ రోజు కూడా ఆదివారం. వాకింగ్ తరువాత ఇంటికొచ్చి, ఆ రోజు పేపర్ తిరగేస్తూ కాఫీ తాగుతున్నాను. అప్పుడు ఒక ఫోన్. పేరు చెప్పి ‘‘మీ అభిమానిని. మీ కథలు, కవితలు చదివాను. నాకు మీ రచనలంటే ఇష్టం.’’ అన్నాక కొంచెం ఆగి ‘‘మిమ్మల్ని కలవాలి.’’ అన్నది. నేను ‘‘ఈ రోజు ఆదివారం. ఇంట్లోనే ఉంటాను. రండి’’ అన్నాను. ఆ రోజు సుమారు పదకొండు గంటలకు ఆమె వచ్చింది. సుమారు యాభై సంవత్సరాలుండవచ్చు. వచ్చినావిడను ఎప్పుడూ చూడకపోయినా ఎందుకో తెలిసిన మనిషే అనిపించింది. బూడిద రంగు, నల్ల బార్డర్, జరీ బూటాలున్న నలుపు పల్లూ, మగ్గం చీరను గంజి పెట్టి ఇస్త్రీ చేయించి పొందికగా కట్టుకుంది. ఆ యాభై ఏళ్ళ వయస్సులోనూ ఆకర్షణీయంగా కనిపించింది. నా కథ గురించి, ఇతర రచయితల గురించి, సాహిత్యం గురించి ఏమేమో మాట్లాడసాగింది. నా భార్య కాఫీ తెచ్చిచ్చింది. ఆమె కాఫీ తాగుతున్నప్పుడు నేను లేచి, లోపలికి వెళ్ళి హ్యాండ్ మేడ్ తెల్లని ఎ4 సైజు, బంగారు రంగులో ముద్రితమైన ధను రాశి చిహ్నంతో మెరుస్తున్న ఆ కవర్ తీసుకొచ్చి ఆమెకిచ్చాను. మౌనంగా చేతిలోకి తీసుకుని, ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి, దాన్నుండి వస్తున్న మల్లెపూల అత్తర్ సువాసనను పీల్చి, మెరిసే కళ్ళతో చేతులు జోడిస్తూ ‘‘థ్యాంక్సండీ! ఇంట్లో అబ్బాయి వెయిట్ చేస్తుంటాడు. తొందరగా వెళ్ళాలి ‘‘ అని అన్నది. అలా ఆ చిట్టి కవిత అ కవర్ ను తన గుండెలకదుముకుని వెళ్ళిపోయింది. -
నడకతో నగరంపై అవగాహన
శోభన.. ఉద్యోగరీత్యా చెన్నై నుంచి హైదరాబాద్‌కి బదిలీపై వచ్చింది. నగరానికి వచ్చి కొన్ని వారాలు గడిచినా.. పనులు, వసతి ఏర్పాట్లలో తలమునకలైంది. ఆమెకు స్నేహితులు ఎక్కువ మంది లేకపోవటంతో పనులు తెమలక మరింత ఇబ్బంది పడేది. సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తుండగా సిటీలోని ప్రముఖ ప్రాంతంలో వాక్ నిర్వహిస్తున్నారనే సమాచారం కంటపడింది. వెళితే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందనే తలంపుతో అందులో పాల్గొంది. వాక్‌లో నగర పరిచయంతో పాటు తనలాంటి మైండ్‌సెట్ ఉన్న మిత్రులు ఆమెకు పరిచయమయ్యారు. ఇంకేముంది. ఇప్పడు శోభనకి సిటీ అంతా పరిచయమైంది. కొత్త ప్రాంతంగా అనిపించట్లేదు. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, పార్కులు, మార్కెట్లు,ఆలయాలు ఇలా పలు వాక్‌లలో పాలుపంచుకుంది. హైదరాబాద్‌ని తెలుసుకుంటూ, తన సిటీగా ఫీల్ అవుతోంది. కొత్తగా వచ్చిన వారికే కాదు.. నగరవాసులకు సైతం ఈ వాక్‌లు సిటీ ప్రాముఖ్యతనుపరిచయం చేస్తున్నాయి. ఒక రకంగా ఇది ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. నగర చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ఇంతకంటే చక్కటి మార్గం లేదంటున్నారు వాకర్స్. నగరం గురించి కొత్తవారికి తెలియజెప్పడంలో ఆనందం ఉందంటున్నారు వాక్ లీడర్స్.ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రెండ్‌గా మారిన వాక్‌లను ఆయా సంస్థలు, కొంతమంది వ్యక్తిగతంగా కూడా నిర్వహిస్తున్నారు. సంస్థలైనా వ్యక్తులైనా సోషల్ మీడియా వేదికగా తమ ఈవెంట్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో ఈ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫేస్బుక్, మీటప్ పేజీల్లో ఈ సమాచారం లభిస్తోంది. కేవలం ‘వాక్’నే కాదు.. ఇక వాక్ అంటే అలా కాసేపు సరదాగా నడిచి వచ్చేయటం కాదు. హెరిటేజ్ వాక్ అయితే ఆ కట్టడం నిర్మాణ శైలి నుంచి మొదలు నిర్మించిన వ్యక్తి, ఆ కట్టడానికి సంబంధించిన పూర్తి చరిత్ర తెలియచేస్తారు. ఇక బజార్లు, పండగ రోజుల్లో నిర్వహించే వాక్‌లలో ఆ ప్రాంతంలో ఏ వస్తువులు దొరుకుతాయి, ఆ ప్రాంతం ప్రాముఖ్యతలు, ప్రముఖ ఘట్టాలు ఇలా అన్ని వివరిస్తారు. పార్క్‌లు, టూంబ్స్, ప్యాలెస్‌లు, కోటలు, పురాతన భవనాలు, గ్రంథాలయాలు, చర్చిలు, నాటి బజార్లు, నగరానికి దగ్గరలో ఉన్న కొండలు, గుట్టలు, అడవులు, జలాశయాలు ఇలా మన ఆసక్తిని బట్టి ఆయా వాక్‌లను ఎంచుకోవచ్చు. ఎన్నో రకాలు.. చార్మినార్, ట్యాంక్‌బండ్, గోల్గొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్, పురానాపూల్, మొజంజాహీ మార్కెట్, చౌమహల్లా ప్యాలెస్, అమీన్‌పురా చెరువు, వికారాబాద్ ఫారెస్ట్, మౌలాలి గుట్ట, ఇలా నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో అనేక వాక్‌లు నిత్యం నిర్వహిస్తూనే ఉంటారు. దసరా, రంజాన్, క్రిస్మస్ లాంటి పండగ సమయాల్లోనూ వాటికి సంబంధించిన వాక్‌లు నిర్వహిస్తుంటారు. వీటిలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్కెచ్చింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాక్‌లు కూడా ఉంటాయి. ఈ వాక్‌లలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటిలో ఆయా వ్యక్తులు, సంస్థలను బట్టి ఫీజులున్నాయి. వాక్ నిర్వాహకులు ఈ వివరాలను ముందే తెలియజేస్తారు. ఎంతో ఆనందం..నేను హైదరాబాదీని. అధ్యాపక వృత్తిలో ఉన్నాను. నగరానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివాను. దాదాపు నగరంలో ఉన్న అన్ని చారిత్రక కట్టడాలు, ప్రాంతాల గురించి తెలుసు. నగరానికి కొత్తగా వచ్చే అనేక మంది మిత్రులుకు విద్యార్థులకు సిటీ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంటాను. ఆసక్తి ఉన్న వారికి వాటి గురించి తెలియజేయటంలో మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు ఇండియా హెరిటేజ్ వాక్స్ వారి తరఫున సాలార్జంగ్ మ్యూజియం, మొజాంజాహీ మార్కెట్ ఇలా పలు వాక్స్ నిర్వహించాను. – మహమ్మద్ అబ్దుల్ నయీం, వాక్ లీడర్ చాలా విషయాలు తెలుస్తాయి.. నాకు సిటీలో ఉండే డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చెయ్యాలంటే ఇష్టం. నాస్తా ఏ సుబాహ్ అనే ఈవెంట్ గురించి ఫేస్బుక్లో చూశాను. అబిడ్స్‌లో టేస్టీ టిఫిన్ సెంటర్స్‌లో ఫుడ్ టేస్ట్ చేశాను. సెంటర్ ఆఫ్ సిటీలో తక్కువ ధరకు ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని ఈ వాక్ వల్లే తెలిసింది. ఫస్ట్ టైం వెళ్లాను. ఫుడ్ అంటే ఇష్టమున్న వాళ్లని కలుసుకున్నా. – చందనశ్రేయ, వాకర్ -
చార్మినార్ రక్త తర్పణం
-
తళుకులపై మరకలు!
చార్మినార్: కాలిబాట పథకం పనుల్లో (చార్మినార్ పెడస్ట్రీయన్ ప్రాజెక్టు– సీపీపీ) భాగంగా రూ.35 కోట్లతో చేపట్టిన గ్రానైట్ పనులతో చార్మినార్ పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. గుల్జార్‌హౌజ్– చార్మినార్, చార్మినార్– సర్దార్ మహల్ భవనం, మక్కా మసీదు– చార్మినార్,చార్మినార్– లాడ్‌బజార్ వరకు ప్రధాన రహదారులన్నింటినీ గ్రానైట్ పనులతో అందంగా తీర్చిదిద్దారు. చార్మినార్, మక్కా మసీదు రోడ్డులో చేపట్టిన గ్రానైట్ అభివృద్ధి పనులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్రానైట్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన వెంటనేచార్మినార్– మక్కా మసీదు కట్టడాల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు నో ఎంట్రీ విధించారు. చార్మినార్ కట్టడానికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. చార్మినార్ అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును అందుబాటులోకి తేచ్చారు. వాహనదారులు చార్మినార్– మక్కా మసీదు రోడ్డు ద్వారా వెళ్లడం లేదు. అందమైన గ్రానైట్ రోడ్డుతో పాటు వాహనాల రాకపోకలు లేకపోవడంతో చార్మినార్– మక్కా మసీదు రోడ్డులో విశాలంగా ఖాళీ స్థలం ఏర్పడింది. దీంతో దేశ, విదేశాల పర్యాటకులు చార్మినార్– మక్కా మసీదును సందర్శించడానికి వచ్చినప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్ఫీలు దిగితూ సందడి చేస్తున్నారు. సహజత్వం కోల్పోతున్న గ్రానైట్ రోడ్లు.. కొంత కాలంగా ఇక్కడి టిఫిన్ సెంటర్లు, హోటళ్లలోని వ్యర్థాలను గ్రానైట్ రోడ్డుపై వేస్తుండడంతో ఆయా పరిసరాలు అపరిశుభ్రతతో కనిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ లోపం కారణంగా గ్రానైట్ రోడ్ల సహజత్వం దెబ్బతింటోంది. జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి రోజు చార్మినార్–మక్కా మసీదు రోడ్లలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఉత్సవాలు, పండగ వేళల్లో చార్మినార్, చార్‌కమాన్, మక్కా మసీదు, సర్దార్ మహల్ రోడ్డు, లాడ్‌బజార్ రోడ్లను నీటితో శుభ్రంగా కడుగుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు చెత్త చెదారం మాత్రమే తొలగిపోతోంది తప్ప.. హోటల్ వ్యర్థాలతో పాటు మురుగునీటి నిల్వతో గ్రానైట్ రోడ్లు సహజ రంగును కోల్పోతున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రమైన చార్మినార్ వద్ద నిరంతర పర్యవేక్షణ అవసరమని సందర్శకులు కోరుతున్నారు. వాటర్ గన్స్‌తో శుభ్రపరుస్తాం.. కొన్ని వ్యర్థాలను స్థానిక వ్యాపారులు గ్రానైట్ రోడ్డుపై వేస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ కొంత మందికి అవగాహన కల్పించాం. వినిపించుకోని వారికి చలానాలు సైతం విధించాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటర్ గన్స్ ద్వారా గ్రానైట్ రోడ్లను కడిగిస్తాం. ఇప్పటికే అవసరమైన పరికరాలను ఖరీదు చేశా. కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది.– బి.శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ -
కానిస్టేబుల్ దుశ్చర్యపై స్పందించిన ఝా
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి తరలింపుకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థినిపై ఓ పోలీసు కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. సౌత్ జోన్ డీసీసీ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అక్కడ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడని వార్తలు వస్తున్నాయని చెప్పారు. వీడియోలు పరిశీలించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే కానిస్టేబుల్ అది ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక విధి నిర్వహణలో భాగంగా అలా జరిగిందా అనే దానిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆ వీడియోలను టీవీల్లో ప్రసారం చేయకుండా తాత్కాలికంగా నిలపివేయాలని కోరారు. విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చదండి : విద్యార్థినిపై పోలీసు వికృత చర్య.. -
విద్యార్థినిపై పోలీసు వికృత చర్య..
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ తరలింపుకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. యునానీ వారే కావాలని హాస్పిటల్‌ను అక్కడి నుంచి ఎర్రగడ్డకు తరలిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా చార్మినార్ ఎదుట విద్యార్థులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను, లెక్చరర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రెచ్చిపోయిన మానవమృగం.. ధర్నా చేస్తున్న విద్యార్థినిలను మహిళ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా భావించిన ఒక వ్యక్తి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట తాకడమే కాకుండా.. గట్టిగా గిల్లాడు. దీంతో సదురు విద్యార్థిని నొప్పి భరించలేక గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని ఓ పోలీసు కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
నిరసన ఉద్రిక్తం
సాక్షి, సిటీబ్యూరో/వెంగల్రావునగర్: చారిత్రక చార్మినార్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు తరలింపుపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు.. కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఓపీ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స నిమిత్తం దూర ప్రాంతాల నుంచి సోమవారం ఆస్పత్రికి వచ్చిన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోపలికి అనుమతించాలని రోగులు వేడుకున్నా ఆందోళనకారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులు, బాధితులను శాంతింపజేశారు. ఇదీ వివాదం... 1958లో 60 పడకల సామర్థ్యంతో చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 100 పడకలకు పెంచినప్పటికీ.. స్థలాభావంతో 75 పడకతోనే కొనసాగుతోంది. ఆస్పత్రి ఔట్‌పేషెంట్ విభాగానికి గ్రేటర్ నుంచే కాకుండా శివారులోని మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2014లో భవనాన్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించగా... వైద్యుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. మరమ్మతుల పేరుతో ఇటీవల ఈ భవనాన్ని ఖాళీ చేయాలని భావించింది. ఇప్పటికే ఆయా వార్డులను ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం 10 పడకలతో కేవలం ఓపీ సేవలు అందిస్తున్నారు. అయితే ఆయుర్వేద ఆస్పత్రిని ఉద్దేశపూర్వకంగానే తరలిస్తున్నారని... ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పాతబస్తీ ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు, వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తాజాగా తమ ఆందోళనలను ఉధృతం చేశారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఔట్‌పేషెంట్ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఓపీ సేవలు బంద్ చేయడంతో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులు నిరాశేతో వెనుదిరగాల్సి వస్తోంది. రోగుల ఆగ్రహం.. ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో అటు వైద్యులు, ఇటు రోగులు ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు బతిమిలాడినా విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో రోగులు వైద్య విద్యార్థులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు వెనక ద్వారం నుంచి లోపలికెళ్లి ఓపీ చీటీ రాయించుకునేందుకు ప్రయత్నించగా అక్కడ సైతం అడ్డుకున్నారు. ఆందోళనకారులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామకృష్ణ తదితరులు ఆసుపత్రికి వచ్చి విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రిని తరలించడానికి వీల్లేదని.. అలా చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరాశే కొన్ని రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా జ్వరం తగ్గినప్పటికీ... కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఇక్కడ నయం చేస్తారని తెలిసి ఒడిశా నుంచి వచ్చాను. అయితే ఆస్పత్రికి తాళాలు వేసి తర్వాత రమ్మని అంటున్నారు. లోపలికి పంపించాలని వేడుకున్నా వినలేదు. ఎంతో ఆశతో నిరాశే మిగిలింది. – పి.మేఘన, ఒడిశా -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యాకుత్‌పురా: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చార్మినార్ కట్టడం వద్ద యోగాసనాలు వేశారు. కార్యక్రమం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. చార్మినార్ నుంచి మదీనా చౌరస్తా వరకు నిజామియా టిబ్బి కళాశాల వైద్య విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పత్తర్‌గట్టి కార్పొరేటర్ సయ్యద్ సోహేల్ ఖాద్రీ, ఆయూష్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి, నిజామియా టిబ్బి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షహజాదీ సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిరాజ్ ఉల్ హక్, ప్రభుత్వ యునానీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఎ.వకీల్ పాల్గొన్నారు. -
చార్మినార్ వద్ద యోగా దినోత్సవ వేడుకలు
-
చార్మినార్ మరమ్మతులకు ఆలయ స్థపతులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న చార్మినార్ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్ డిజైన్ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది. ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్‌కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్‌కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు చార్మినార్ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ స్కానర్ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగి..!
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకుంటుండగా ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇల్లు కుట్టకునేందుకు బిద్లాన్ ధర్మేందర్‌సింగ్ అనే వ్యక్తి చార్మినార్ సర్కిల్-9లో దరఖాస్తు చేశాడు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అష్రఫ్ అహ్మద్ పర్మిషన్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు విషయం చెప్పడంతో.. అష్రఫ్ లంచం తీసుకుంటుండగా జామా మజీద్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. -
డిజైన్ల చీరలు.. రూ.50 మాత్రమే.!
♦ ఒక చెప్పుల జోడు కేవలం రూ.50 మాత్రమే...!అమ్మకైనా... నాన్నకైనా... కొడుకుకైనా...ఇంట్లో ఎవరికైనా కేవలం యాబై రూపాయలకే ఒక జత. రండి... ఆలస్యమైతే స్టాక్ అయిపోతుందంటూ చార్‌కమాన్ వద్ద మైక్‌లో ఓ చెప్పుల వ్యాపారి.. ♦ బనియన్లు...పదిహేను రూపాయలే. అందరికీ అన్ని సైజులలో..తీసుకోండి...!! అంటూ పత్తర్‌గట్టి వద్ద టేలా బండిపై చిరువ్యాపారి పిలుపు ♦ రంగు రంగుల డిజైన్ల చీరలు..అన్ని వయసుల వారికి రూ.50 మాత్రమే.! అంటూ గుల్జార్‌హౌజ్ వద్ద రోడ్డుపై చీరలు ఉంచి రమ్మంటున్న ఓ చీరెల వ్యాపారి. ♦ రెండు రూపాయలకు ఒకటి...తీసుకోండి..అంటూ చార్మినార్ వద్ద టేలాబండిపై చిన్నచిన్న ప్యాకెట్లలో వంట దినుసులను ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడో టేలాబండి వ్యాపారి. పాతబస్తీలోని రంజాన్ మార్కెట్లో రోజూ కనిపిస్తున్న సందడి ఇది. నాణ్యతతో కూడిన వస్తువులను కూడా అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటంటూ కాదు.. అవసరమైన అన్ని రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చార్మినార్ :రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్–మక్కా మసీదు ప్రధాన రోడ్డులో కొనసాగుతున్న రంజాన్ మార్కెట్ జనం రద్దీతో కళకళలాడుతోంది. రంజాన్ మాసం సందర్బంగా ఫుట్‌పాత్ విక్రయాలు రోడ్డుపైకొచ్చాయి. వినియోగదారులతో దుకాణాలన్నీ బిజీగా మారాయి. పండుగను పురస్కరించుకొని ప్రజలు పండుగ వస్తువులు ఖరీదు చేయడంలో నిమగ్నం కావడంతో పాతబస్తీ ముఖ్య వ్యాపార కేంద్రాలన్నీ సందడిగా కనిపిస్తున్నాయి. మహిళలు పండుగను పురస్కరించుకొని ముచ్చటగొలిపే రంగురంగుల గాజులను ఖరీదు చేస్తుండడంతో లాడ్‌బజార్ గాజుల దుకాణాలు మహిళల రద్ధీతో కిటకిటలాడుతున్నాయి. ముస్లిం మహిళలు రంజాన్ పండుగకు ప్రత్యేకంగా గాజులను ఖరీదు చేసి ముచ్చటగా ధరిస్తారు. పాతబస్తీ ప్రజలే కాకుండా శివారు ప్రాంతాల జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి గాజులను ఖరీదు చేస్తున్నారు. లాడ్‌బజార్, ముర్గీచౌక్, గుల్జార్‌హౌజ్, శాలిబండ తదితర ప్రాంతాలలోని అత్తర్ దుకాణాలు ప్రజల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కిటకిటలాడుతున్న దుస్తుల దుకాణాలు రంజాన్ పండుగకు తప్పనిసరిగా ముస్లింలు నూతన వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా వస్తుండడంతో వాటిని ఖరీదు చేయడానికి అధిక సంఖ్యలో దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పటేల్ మార్కెట్, మదీనా, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టీ, రికాబ్‌గంజ్, గుల్జార్‌హౌజ్ తదితర ప్రాంతాలలోని వస్త్ర వ్యాపార కేంద్రాలు రద్దీగా మారాయి. ఖరీదు చేసిన నూతన వస్త్రాలను వెంటనే కుట్టించుకోవడానికి టైలర్ షాపులను కూడా ఆశ్రయించడంతో పాతబస్తీ టైలర్ షాపులకు కూడా గిరాకీ పెరిగింది. కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తూ ఉపవాస దీక్షలను విరమించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా షాపింగ్ చేయడానికి చాలా కుటుంబాలు సుముఖత చూపిస్తున్నాయి. కళ్లు మిరమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా రంజాన్ మార్కెట్లను సందర్శిస్తున్నారు. వివిధ రకాల గృహోపకర వస్తువులను చూస్తూ.. అవసరమైన చోట ఖరీదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇఫ్తార్ విందుల అనంతరం మహిళలు, పురుషులు, చిన్నారులు పండుగ వస్తువులను ఖరీదు చేయడానికి వ్యాపార కేంద్రాలకు వస్తున్నారు. సంవత్సరానికోసారి రంజాన్‌ను పురస్కరించుకొని కుటుంబ సభ్యులంతా వ్యాపార కేంద్రాలకు వెళ్లడం సరదా, కాలక్షేపంగా ఉంటుందంటున్నారు. దీంతో పాతబస్తీలో ఎటుచూసినా ప్రజల రద్ధీతో ఫుట్‌పాత్‌లు, దుకాణాలు కళకళలాడు తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇక్కడ వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. -
వీకెండ్లో ఓల్డ్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో:రంజాన్ మాసం ప్రారంభమైందంటే పాతబస్తీలో కొత్త సందడి మొదలవుంది. ఇక్కడి మార్కెట్లు కళకళలాడతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో రంజాన్ సందడి ఒకటైతే పాతబస్తీలో మరోవిధంగా ఉంటుంది. విదేశాల్లో ఉండే వారు సైతం ఈ మాసంలో హైదరాబాద్‌కు వస్తారంటే ఇక్కడి రంజాన్ ప్రత్యేకత అర్థ«ం చేసుకోవచ్చు. ఒకవైపు మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి.. మరోవైపు ప్రత్యేక వంటకాలతో హోటళ్లు ఆకర్షిస్తుంటే.. కొత్త ఫ్యాషన్ దుస్తులతో షాపులు నగర ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం ఉపవాస దీక్షలు ప్రారంభం నుంచే పాతబస్తీ మార్కెట్లు షాపింగ్‌కు సిద్ధమయ్యాయి. నోరూరించే మొగలాయి, ఇరానీ, అరేబియన్ వంటకాలు.. అడుగు ముందుకేయనీయని హలీం ఘుమఘుమలు, విద్యద్దీపాలతో జిగేల్ జిగేల్మనిస్తున్న పండ్ల దుకాణాలు పాతబస్తీకి కొత్త శోభను తెచ్చాయి. వీకెండ్లో ఓల్డ్ సిటీ గ్రేటర్ ప్రజలు సాధారణంగా వారాంతల్లో పాతబస్తీకి రావడం ఆనవాయితీ. ఇక రంజాన్ మాసంలో వచ్చే వీకెండ్ అయితే ఇక పండగే అని చెప్పాలి. శని, ఆదివారాలు సీటీ దారులన్నీ ఓల్డ్సిటీకే దారితీశాయి. శివారు ప్రాంతాల నుంచి కూడా రంజాన్ షాన్ చూసేందుకు ప్రజలు పాతబస్తీ బాట పట్టారు. చాలామంది కుటుంబ సమేతంగా రంజాన్ మార్కెట్లో షాపింగ్‌తో పాటు వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. శనివారం వర్షంతో పాటు అదివారం ఎండ కాస్త చల్లబడడంతో నగర ప్రజలు పిక్నిక్ మూడ్‌తో పాతబస్తీలో గడిపారు. దీంతో ఇక్కడి మార్కెట్లు, హోటళ్లలో హలీం రుచులను ఆస్వాదించారు. జనం తాకిడితో ఓల్డ్ సిటీలో హలీం, ఇతర మాంసాహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగాయి. హలీం వ్యాపారం బాగుంది రంజాన్ మాసంలో అత్యధిక మంది నగరవాసులు అరబ్ వంటకాలు, హలీం తినేందుకు ఇక్కడకు వస్తుంటారు. మాములు రోజుల కంటే శని, అదివారాల్లో చాలామంది ప్రాంతాల ప్రజలు పాతబస్తీకి వచ్చి పలు వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రత్యేకంగా హలీంను తినిడానికి కుటుంబ సమేతంగా వస్తారు. తక్కువ మసాలతో చేసే రుచికరమైన హలీంను అన్ని వయసుల వారు ఇష్టపడుతున్నారు.– ఉమర్ ఆదిల్, షాదాబ్ హోటల్ యజమాని (మదీనా సర్కిల్) -
సందడిలో చిరుతిళ్లు
శాలిబండ: సాధారణ రోజుల్లో కంటే రంజాన్ నెలలో చార్మినార్ పరిసరాలు ప్రత్యేంగా ఉంటాయి. వివిధ రకాల వ్యాపారాలతో సందడిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నెలరోజులు చిరు వ్యాపారులకు భలే గిరాకీ ఉంటుంది. ఉపవాస దీక్షలు ముగిశాక ఇఫ్తార్ విందు చేస్తారు. ఇక పిల్లలైతే చార్మినార్, మక్కా మసీద్ చుట్టుపక్కల దొరికే చిరు తిళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తక్కువ ఖరీదుతో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వాటికే సాధారణ ప్రజలు, పిల్లలు మొగ్గుచూపుతున్నారు. ఉపవాస దీక్షల విరమణ అనంతరం మిర్చీ బజ్జీలు, ఆలు బొండా, ఆలు బజ్జీలు, పుణుగులు, కచోరీ, సమోసా, వడలను ఇష్టంగా తింటుంటారు. రోజంతా ఉపవాస దీక్షలో ఉన్న వారందరూ వీటి కోసం ఎగబడతారు. దీంతో పాతబస్తీలో మిర్చీ బండీలతో పాటు పిండి వంటల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. వేసవి ప్రత్యేకం ‘దహీవడ’ ఈసారి రంజాన్ మాసం వేసవిలో మొదలవడంతో చల్లదనానిచ్చే ‘దహీవడ’న అధికమంది ఇష్టపడుతున్నారు. పైగా ఈ వంటకం ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది ఇష్టంగా లాగించేస్తున్నారు. సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను ప్రారంభించిన అనంతరం రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేసే ముస్లింలు మగ్రీబ్ నమాజు అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇఫ్తార్‌లో పిండి వంటలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ ధరలకు లభించే ఈ పిండివంటల పట్ల పేద ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారని, వారి నుంచే తమకు గిరాకీ ఉంటుందని మూసాబౌలికి చెందిన వ్యాపారి తిరుపతి శ్రీనివాసరావు, నర్సింగరావు తెలిపారు. -
స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
రంజాన్...జీవితాన్ని...జీవిత గమనాన్ని పవిత్ర పరిచి మదిలోనే స్వర్గానుభూతిని కలిగించే మాసం. ఆలోచనలు, మాటలు, పనులు, నడతల్లో అల్లాహ్ ఆశించే విశాల మానవత్వం. పవిత్రత గోచరిస్తాయి. నెలవంక తొంగి చూడటంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభంకానున్నాయి. సాక్షి సిటీబ్యూరో/చార్మినార్ : సకల శుభాల మాసం రంజాన్ ప్రారంభమైంది. సోమవారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. అల్లాహ్ నెలవంకను మా కోసం, శాంతి భద్రతల కోసం ఉదయింపజేయి..ఓ దేవుడా నీవు మెచ్చే పనులన్నీ చేసే భాగ్యాన్ని అనుగ్రహించు. ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి ప్రభువు అల్లాహ్ మాత్రమే’ అని ప్రార్థించి ముస్లింలు నెలవంకను వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్ మాసాన్ని ప్రకటించారు. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ సోదరులు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్ పవిత్ర మాసాన్ని ఆహ్వానించారు. ఉపవాస వ్రతాన్ని పాటించేందుకు కావాల్సిన నిత్యవసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఇఫ్తార్, సహర్ కోసం ముస్లింలు పెద్ద ఎత్తున ఖర్జూరం, పండ్లు కొనుగోలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు.. దానధర్మాలు పరమ పవిత్ర రంజాన్ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు.. రోజూ సూర్యోస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం నమాజులు, సత్కార్యాలే కాదు.. విరివిగా దాన, ధర్మాలూ చేస్తారు. ఈ నెలలో చేసే ప్రతిపుణ్య కార్యానికీ, ఆ«రాధనకు డెబ్బై రెట్ల పుణ్యం దక్కుతుందని వారి విశ్వాసం. ఐదుసార్ల నమాజ్‌లతోæపాటు రాత్రి వేళల్లో ™ రావీహ్ ప్రార్థనలుంటాయి. ఆ సమయంలో రోజూ ఖురాన్‌ను పఠించి ధ్యానిస్తారు. ఇది ప్రవక్త సూచించిన సంప్రదాయం. 30 అధ్యాయాలున్న ఖురా¯Œన్ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటిస్తారు. రంజాన్ నెలలో ఎన్నోప్రత్యేకతలు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంధం ఖురాన్...ఈ మాసంలోనే అవతరించింది. ప్రవక్తలపై ఫర్మానాలు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని..నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. స్వర్గాన్ని చేరే అర్హతను సాధించే క్రమంలో... దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ మాసంలో ప్రారంభిస్తారు. అలా వారి జీవితం పవిత్ర ఆరాధన అవుతుంది. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు... రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను చేపడతారు. సూర్యస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులు కొనసాగుతాయి. ఇఫ్తార్ విందులకు హిందువులను సైతం ఆహ్వానించి మతసామరస్యాన్ని చాటుకుంటారు. ఒకవైపు ఉపవాస దీక్షలు కొనసాగుతుండగానే...మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకర వస్తువులను ఖరీదు చేయడానికి షాపింగ్ చేస్తారు. పాతబస్తీలోని అన్ని వ్యాపార సంస్థలు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను డిస్కౌంట్లతో వినియోగదారులకు అందజేయడానికి సిద్ధమయ్యాయి. సహర్‌తో షురూ.. రంజాన్ మాసం మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటలకు సహార్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి చారిత్రాత్మకమైన మక్కా మసీదులో ముస్లిం సోదరులు ఇషా నమాజ్ చేశారు. అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించు కొని రాత్రి షాపింగ్ చేయడంతో పాతబస్తీలోని వ్యాపార సముదాయాలన్ని రద్దీగా మారాయి. మంగళవారం సాయంత్రం 6.43 గంటలకు ఉపవాస దీక్షలు విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. పాతబస్తీలో సందడి చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, చార్‌కమాన్, గుల్జార్‌హౌజ్, పత్తర్‌గట్టి, మదీనా, నయాపూల్, బహదూర్‌పురా, శాలిబండ, శంషీర్‌గంజ్ తదితర ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. సేమియా, ఖర్జూరంతో పాటు ఇతర పండ్లు ఫలాలను ఖరీదు చేయడంలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార సంస్థలన్నింటినీ రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అన్ని రకాల క్రయవిక్రయాలు ప్రారంభమవడంతో పాతబస్తీ సందడిగా మారింది. మక్కామసీదు ముస్తాబు చార్మినార్: రంజాన్ మాసానికి మక్కా మసీదు ముస్తాబైంది. ఇప్పటికే మక్కా మసీదులో అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రంజాన్ మాసం కోసం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రూ.37 లక్షలతో మక్కా మసీదులో అభివృద్ధి పనులు చేశారు. రంజాన్ మాసంలో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడమే కాకుండా ఇఫ్తార్ విందులు, ఖురాన్ పఠనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు మక్కా మసీదులో ప్రతి రోజూ జరుగుతాయి. ఈ నేపథ్యంలో ముస్లింలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా టీఎస్ఎస్పీడీసీఎల్, జలమండలి, జీహెచ్ఎంసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎండ వేడిమి నుంచి కాపాడటానికి ఇప్పటికే మక్కా మసీదు ప్రాంగణంలో తాత్కాలిక షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.6 లక్షలను మంజూరు చేసింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్ ఖాసీం తదితరులు మక్కా మసీదును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రంజాన్ మాసం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్దిఖీని ఆదేశించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలి మక్కా మసీదులో సహజంగా రోజూ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక రంజాన్ మాసం ప్రారంభమైతే మక్కా మసీదులో ప్రతిరోజూ సందడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంతో మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు. మక్కామసీదులో 3 డోర్ ఫ్రేం, 3 హ్యాండ్ ఫ్రేం మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. 25 మంది హోంగార్డులు విధినిర్వహణలో ఉండాల్సి ఉండగా 15 మంది హోంగార్డులు మాత్రమే రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. అందుబాటులో లేని సీసీ టీవీ కంట్రోల్ రూం... గతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటన అనంతరం మక్కా మసీదులో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు 43 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మానిటరింగ్ రూం పని చేయడం లేదు. సీసీ కెమెరాల దృశ్యాలను మానిటరింగ్ చేయడానికి ఇప్పటి వరకు ఆపరేటర్ (టెక్నీషియన్) అందుబాటులో లేకపోవడంతో కంట్రోల్ రూంకు తాళం వేసి ఉంచారు. దీంతో అనుమానితులు, అసాంఘిక శక్తుల కదలికలను కనిపెట్టడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరుపయోగంగా మారాయి. ఎవరు వస్తున్నారో...ఎవరు వెళుతున్నారో అప్పటికప్పుడు తెలుసుకోలేని పరిస్థితులున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాం మక్కా మసీదులో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. రంజాన్ మాసం ప్రారంభానికి ముందే అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నారు. ఎండ తగులకుండా మక్కా మసీదు ప్రాంగణంలో షెడ్ ఏర్పాటు చేసాం. నిరంతరం తనిఖీల కోసం మెటల్ డిటెక్టర్లను అందుబాటులో ఉంచాం. – మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సిద్దిఖీ,మక్కా మసీదు సూపరింటెండెంట్ -
చార్మినార్‌కు స్కానింగ్
సాక్షి, హైదరాబాద్: చారిత్రక చార్మినార్‌కు భారీగా సూక్ష్మపగుళ్లు.. పై‘పెచ్చు’నిర్లక్ష్యం.. వెరసి కాలుష్యం బారి నుంచి ఆ కట్టడానికి రక్షణ కరువైంది. నాలుగు రోజులక్రితం మక్కా మసీదు వైపు ఉన్న మినార్ నుంచి పెద్ద పెచ్చు ఊడి పడేందుకు భారీగా ఏర్పడ్డ సూక్ష్మపగుళ్లే కారణమని నిపుణులు నిర్ధారించారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు సూక్ష్మపగుళ్ల నుంచి నీళ్లు లోనికి చేరి ఆ భాగం ఒక్కసారిగా బరువెక్కి కట్టడం నుంచి ఊడిపోయిందని ప్రాథమికంగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం(ఏఎస్ఐ) నిపుణులు గుర్తించారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం మొదలవుతున్నందున, కట్టడం మిగతా ప్రాంతాల్లో పగుళ్లుంటే వాననీళ్లు లోనికి చేరి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆ పగుళ్ల తీవ్రతను గుర్తించేందుకు చార్మినార్‌ను ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీ పరికరంతో అణువణువూ స్కాన్ చేయాలని ఏఎస్ఐ నిర్ణయించింది. తొలిసారి టాప్ టూ బాటమ్ స్కాన్ చేసి చార్మినార్‌పై ఉన్న పగుళ్లను గుర్తించి వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. థెర్మోగ్రఫీతో పగుళ్ల జాడలు... ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల వయసున్న కట్టడాలకు థెర్మోగ్రఫీ యంత్రంతో స్కాన్ చేసి ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి ధ్వంసం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. మనదేశంలో కేవలం తాజ్‌మహల్ లాంటి కొన్ని కట్టడాలకే దాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పటివరకు చార్మినార్‌ను దానితో స్కాన్ చేయలేదు. వాతావరణ ప్రభావంతో పెద్ద పెచ్చులూడి కిందపడ్డ నేపథ్యంలో ఇక అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయని, ఇది క్రమంగా కట్టడం ప్రధాన నిర్మాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుందని అధికారులంటున్నారు. పెచ్చు ఊడిపడ్డ తర్వాత ఏఎస్ఐ జాయింట్ డైరక్టర్ (కన్జర్వేషన్) జాన్‌విజ్ శర్మ వచ్చి కట్టడాన్ని పరిశీలించారు. పెచ్చు ఊడిపడ్డ ప్రాంతంలో కెమెరాతో ఫొటోలు తీసి పరిశీలించారు. మినార్‌పై గోటితో గట్టిగా గిల్లితే సున్నం ఊడొస్తుందని గుర్తించారు. అదే దిగువ భాగంగా గోటితో ఎంత గట్టిగా గిల్లినా సున్నం రాలటం లేదు. దీంతో పైభాగానికి వెంటనే ప్రత్యేక చర్యలు అవసరమని ఆయన తేల్చి మొత్తం కట్టడాన్ని ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రఫీతో స్కాన్ చేయాలని సిఫారసు చేశారు. ఆ పరికరాన్ని ఢిల్లీ నుంచి తెప్పించి వానాకాలం వచ్చే లోపు స్కాన్ చేసి అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయించారు. పైభాగం ప్రమాదకరం... చార్మినార్ ప్రధాన కట్టడం రాతితో నిర్మించారు. దానిపై 40 సెంటీమీటర్ల మందంతో డంగు సున్నం, కరక్కాయ, రాతిపొడి, నల్లబెల్లం, గుడ్డు సొన తదితర పదార్థాల మిశ్రమంతో పూతపూసి నగిషీలద్దారు. దీనిపై మళ్లీ ప్రత్యేక పూత ఉంటుంది. అది నీటిని పీల్చకుండా కోట్ లాగా ఉపయోగపడుతుంది. చార్మినార్ చుట్టూ కొన్ని దశాబ్దాలుగా వాహనాలు అతి చేరువగా తిరుగుతూ ఆ ప్రాంతంలో విపరీతమైన కలుషితాలను నింపేశాయి. దీంతోపాటు వాతావరణంలో పేరుకుపోయిన ధూళి కణాలు కట్టడంపై తేమతో కలిసి క్రమంగా సన్నటి పొరలాగా పేరుకున్నాయి. వాటి వల్లే కట్టడం పైభాగం లేత గోధుమరంగులోకి మారింది. ఇది కట్టడానికి రక్షణగా ఉన్న పైపూతను క్రమంగా ధ్వంసం చేస్తూ వచ్చింది. వాతావరణానికి ఎక్కువగా ప్రభావితమయ్యే చార్మినార్ పైభాగంలో ఈ నష్టం ఎక్కువగా ఉందని తాజాగా గుర్తించారు. వాహనాలు, సమీపంలో భారీ యంత్రాలతో పని తదితరాల వల్ల వచ్చిన తరంగాలు అక్కడ పగుళ్లకు కారణమయ్యాయని ప్రాథమికంగా తేల్చారు. పైపూత తొలగి సన్నటి పగుళ్లేర్పడటంతో తేమను అతి సులభంగా డంగు సున్నం పీల్చుకుంది. వాన నీటిని ఎక్కువగా పీల్చుకుని ఆ భాగం రెండింతల బరువెక్కింది. మినార్లకు భారీ నగిషీలు కనిపిస్తాయి. ఆ భాగంలో సున్నం బరువెక్కి కట్టడం నుంచి విడిపోయి తాజాగా కిందపడిందని గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రమాదం ఇంకా ఎక్కడెక్కడ పొంచి ఉందనే విషయాన్ని వెంటనే గుర్తించాల్సి ఉంది. వర్షాకాలం ముగిసేవరకు చార్మినార్ చేరువలో భారీ యంత్రాలతో పనులు చేయించకుండా చూడాలని అధికారులు నిర్ణయించి విషయాన్ని జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. -
పెచ్చులూడుతున్న ప్రాభవం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర షాన్.. మన హైదరాబాద్ సంతకం.. ఈ చారిత్రక నగరానికి తలమానికంగా విరాజిల్లుతున్న చార్మినార్ భవితవ్యం ప్రమాదంలో పడింది. 428 ఏళ్ల ఈ కట్టడం నుంచి ఓ భారీ పెచ్చు ఊడి కింద పడింది. మక్కా మసీదు వైపు మినార్‌లో ఉన్న పూల డిజైన్‌లో కొంత భాగం బుధవారం రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో కింద పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు పేలిందేమోననే భయంతో అక్కడున్నవారంతా మక్కా మసీదు వైపు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత వచ్చి, పెచ్చు ఊడి కింద పడిన సంగతి గుర్తించారు. దాదాపు రెండు మూడు క్వింటాళ్ల బరువైన భాగం అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడున్న బండరాయి సైతం పగిలిపోయింది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పెద్ద డ్యామేజీయే...: చార్మినార్ నిర్మించిన 233 ఏళ్ల తర్వాత ఓ వైపు మినార్ కూలిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా ధ్వం సమైన దాఖలాలు లేవు. అయితే, బుధవారం రాత్రి ఊడిపడిన పెచ్చు ఈ 195 ఏళ్లలో జరిగిన పెద్ద డ్యామేజీ అని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఓసారి, దాదాపు 17 ఏళ్ల క్రితం ఓసారి.. చిన్నచిన్న పెచ్చులు ఊడిపడ్డాయి. అవి చాలా చిన్నవి కావడంతో అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఊడిపడిన పెచ్చు భారీగా ఉండటంతో ఈ కట్టడం శిథిలావస్థకు చేరుకుంటోందన్న హెచ్చరికగానే భావించాలని అంటున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్లక్ష్యానికి ఫలితం ఇలా మొదలైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మినార్‌లో పెచ్చులూడిన ప్రదేశం కాలుష్యమే కారకం... కొన్ని దశాబ్దాలుగా వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్‌కు అతి చేరువగా సంచరిస్తుండటం.. ఈ కట్టడం బలహీనపడటానికి కారణమైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, రేగుతున్న ధూళి కణాలు చార్మినార్ కట్టడం పటుత్వం దెబ్బతినేలా చేశాయి. విషవాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్, ధూళికణాలు.. అన్నీ కలిపి కట్టడం గోడలపై పూతలాగా ఏర్పడ్డాయి. వాన నీళ్లు, వాతావరణంలోని తేమను గోడలు పీల్చుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. డంగు సున్నం, కరక్కాయ పొడి, నల్లబెల్లం, రాతి పొడి, గుడ్డు సొన మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించారు. ప్రధాన కట్టడం రాతిదే అయినా, దానిపైన ఈ మిశ్రమాన్ని మందంగా ఏర్పాటు చేశారు. ఇవి తడిని పీల్చుకోవు. కానీ సందర్శకులు వారి పర్యటనకు గుర్తుగా చార్మినార్ గోడలపై లోతుగా పేర్లు చెక్కుతున్నారు. అవి క్రమంగా పగుళ్ల తరహాలో ఏర్పడి తేమను లోనికి పీల్చుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా పై పూతతోపాటు, లోపలి ప్రధాన రాతి కట్టడం కూడా బలహీన పడిందని నిపుణులు గుర్తించారు. అందుకే కొన్నేళ్లుగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ శాఖ(ఏఎస్ఐ) అధికారులు గోడలకు కెమికల్ ట్రీట్మెంట్ చేసి సంప్రదాయ మిశ్రమంతో దెబ్బతిన్న భాగాలను సరి చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం చుట్టుముట్టిన ఫలితంగా కట్టడం బాగా బలహీనపడింది. ధూళి కణాలు (రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్) సాధారణ స్థాయి 80. అది పెరిగేకొద్దీ కట్టడం క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. ప్రస్తుతం అది చార్మినార్ వద్ద 110 నుంచి 140 వరకు ఉందని గుర్తించారు. ఇక నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 60 కాగా, చార్మినార్ వద్ద అది 90 పాయింట్ల వరకు నమోదవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 20 శాతం ఉండాల్సి ఉండగా చార్మినార్ వద్ద 25 శాతాన్ని మించుతోంది. కాపాడే పని.. నష్టం చేసిందా? చార్మినార్‌కు వాహనాల కాలుష్యం ప్రధాన శత్రువుగా గుర్తించి దాన్ని నివారించే ఉద్దేశంతో చార్మినార్ చుట్టూ వాహనాలు రాకుండా చేయాలని చాలాకాలం క్రితమే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు చేపట్టారు. చార్మినార్ వద్దకు నడుస్తూ మాత్రమే వెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇటీవలే ఆ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ చుట్టూ రోడ్డుపై రాళ్లు పరచటంతోపాటు, కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు పనులు చేపట్టారు. కానీ, ఇది పురాతన కట్టడాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నిబంధనల ప్రకారం జరగలేదని ఇప్పటికే అటు పురావస్తుశాఖ అధికారులతోపాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో భాగంగా డోజర్లు, పొక్లెయిన్లు, ఇతర భారీ యంత్రాలను వినియోగించారు. అవి చార్మినార్ కట్టడం పక్కనే రోజుల తరబడి పనులు చేశాయి. వాటి నుంచి ఉత్పన్నమయ్యే తరంగాలు కట్టడం కదిలేలా చేస్తాయని అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు జరిపారు. ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు మరమ్మతు జరగని భాగమది... 428 ఏళ్ల క్రితం 48.7 మీటర్ల ఎత్తుతో అత్యంత పటిష్టంగా నిర్మించిన అందమైన కట్టడం చార్మినార్. అప్పట్లో రూ.లక్ష వ్యయంతో దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. చార్మినార్ నిర్మించాక 233 ఏళ్ల అనంతరం 1824లో నైరుతి వైపు భాగం ఉన్నట్టుండి కుప్పకూలింది. ప్రకృతి విపత్తే దానికి కారణమనే వాదన ఉంది. ఆ వెంటనే దాదాపు రూ.60 వేల వ్యయంతో దాన్ని పునర్నిర్మించారు. దెబ్బతిన్న మిగతా కొన్ని భాగాలకు కూడా మరమ్మతు చేశారు. కానీ ప్రస్తుతం పెచ్చు ఊడిన ప్రాంతానికి ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. అంటే అది నాలుగు శతాబ్దాల క్రితం నాటి నిర్మాణమన్న మాట. దీంతో స్వతహాగానే ఆ భాగం కొంత బలహీనపడి ఉంటుంది. దీనికి అటు కాలుష్యం కాటు, వాతావరణ ప్రభావం, బలమైన యంత్రాలతో అతి సమీపంలో చేపట్టిన పనుల వల్ల ఏర్పడ్డ తరంగాల ప్రభావం.. ఇలా అన్నీ కలిసి భారీ పెచ్చు ఊడిపోవటానికి కారణమై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో పురావస్తు శాఖ అధికారులు ఇతమిత్థమైన కారణం చెప్పనప్పటికీ, కాలుష్యంతో బలహీనపడ్డ విషయంలో ఎలాంటి అనుమానమే లేదని పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో చేపట్టిన పనుల వల్ల సమస్య ఉత్పన్నమై ఉంటుందని, ఇటీవలి అకాల భారీ వర్షాలకు ఆ భాగం కొంత దెబ్బతిని పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. గురువారం రాత్రి ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలింద్ తదితరులు ఈ కట్టడాన్ని పరిశీలించారు. శుక్రవారం ప్రత్యేక నిపుణులు వచ్చి పరిశీలించనున్నారు. కాగా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా గురువారం చార్మినార్‌ను సందర్శించారు. పెచ్చు ఊడిపడటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
చార్మినార్ అపశ్రుతి: కూలిన మినార్‌లోని ఆర్చి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడం చార్మినార్ సుందీకరణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. ఒక మీనార్ పైన వున్న ఆర్చిలోని ఒక భాగం నేల కూలింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో పాతబస్తీ ఉలిక్కిపడింది. అది కూలిన సమయంలో కింద ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణహానీ జరుగలేదు. కొద్దిరోజులుగా చార్మినార్ సుదరీకరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుందీకరణ పనులు పూర్తయిన మినార్ ఆర్చిలోని కొంతభాగం ఇప్పుడు కూలింది. అయితే ఎండ వేడి వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణమా అన్న విషయమై పురావస్తు శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
చార్మినార్ సుందరీకరణ పనుల్లో అపశ్రుతి
-
చార్మినార్.. నో హాకర్స్ జోన్
సాక్షి,సిటీబ్యూరో: చారిత్రక ప్రాధాన్యం గల చార్మినార్‌కు భద్రతతో పాటు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కట్టడం పరిసరాలు చిరు వ్యాపారులతో నిండిపోయి టూరిస్టులకు ఇబ్బందికరంగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చార్మినార్ చుట్టూ ఎలాంటి వ్యాపారాలు జరగకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా చారిత్రక కట్టడానికి నాలుగు వైపులా 50 అడుగుల వరకు ‘నో హాకర్ జోన్’ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రందేశంలోకి చిరు వ్యాపారులు ప్రవేశించకుండా బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం మార్కింగ్ పనులు ప్రారంభించారు. ఈ పరిధి వరకు సందర్శకులు తప్ప ఇంకెవరూ లోపలకు రాకుండా ఉండేందుకు, చార్మినార్ అందాల్ని వీక్షించేవారికి ఆటంకం కలుగకుండా దాదాపు రెండు అడుగుల ఎత్తు బొల్లార్డ్స్‌ను బిగించనున్నారు. తద్వారా దీన్ని నో హాకర్స్ జోన్‌గా మార్చనున్నారు. చార్మినార్ కట్టడం నుంచి నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, మక్కా మసీదు, సర్దార్ మహల్, లాడ్‌బజార్ వైపు ఈ జోన్ ఉంటుంది. ప్రస్తుతం చార్మినార్ వరకు కూడా చిరు వ్యాపారులు తమ వ్యాపారాలురెయిలింగ్స్పై కూడా సామగ్రిని ఉంచుతుండటంతో పర్యాటక ప్రాంతం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. పర్యాటకులకు.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఈ తొక్కిసలాట సంకటంగా మారుతోంది. దీన్ని నిరోధిస్తూ, చార్మినార్ అందాలను ప్రశాంతంగా వీక్షించేలా 50 అడుగుల మేర హాకర్లెవరూ లేకుండా ఈ బొల్లార్డ్స్ ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను అవసరమైన మార్కింగ్ తోపాటు ఒకవైపు తవ్వకం పనులు కూడా చేపట్టారు. ఈ 50 అడుగుల మేర వలయాకారం నుంచి 100 అడుగుల వరకు పర్యాటకులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు.. ఫొటోలు తీసుకునేందుకు ఏర్పాట్లు, అందమైన పూలకుండీలు వంటివి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.80 లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీటితోపాటు సుందరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్ తదితర పనులు చేసే యోచనలో ఉన్నారు. అంతేకాదు.. భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించేవారి కోసం సీటింగ్ ఏర్పాట్లకు కూడా ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా వాహనాలు రాకుండా దాదాపు రూ.3.5 కోట్లతో హైడ్రాలిక్ బొల్లార్డ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడు, ఇతర అవసర సందర్భాల్లో మాత్రం ఇవి భూమిలోకి వెళ్లి వాహనాలకు దారిస్తాయి. ఇందుకు అవసరమైన కంట్రోల్‌రూమ్‌ను సమీపంలోని భవనంలో ఏర్పాటు చేయనున్నారు. నో హాకర్స్ జోన్లో మాత్రం కదలికలకు తావులేకుండా శాశ్వత బొల్లార్డ్‌లను ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛ ఐకానిక్ పనుల్లో.. ఇక స్వచ్ఛ ఐకానిక్ చార్మినార్ పనుల్లో భాగంగా చార్మినార్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు రూ.2 కోట్లతో నాలుగు ప్రత్యేక స్వీపింగ్ మెషిన్లు కొనుగోలు చేశారు. వీటిని త్వరలో వినియోగంలోకి తేనున్నట్లు చార్మినార్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, జీహెచ్ఎంసీ డైరెక్టర్(ప్లానింగ్) కె.బి. శ్రీనివాసరావు తెలిపారు. అఫ్జల్‌గంజ్ నుంచి గుల్జార్‌హౌస్ వరకు బ్యాటరీ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది. పాదచారుల పథకంలో భాగంగా తవ్విన డక్ట్‌లలో కేబుళ్ల అమరిక పనులు పూర్తి చేయాల్సి ఉంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అడ్డదిడ్డంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, ఫ్లెక్సీలు వంటివి తొలగించి, ఆయా మార్గాలను సూచించే సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. -
వెలుగుల తళుకులు.. లాడ్‌బజార్ జిలుగులు
శాలిబండ: హైదరాబాద్ నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత పేరు, గర్తింపు ఉన్నాయో.. లాడ్‌బజార్ కూ అలాగే ఉన్నాయి. ఈ రెండింటినీ విడదీసి చూడాలంటే ఎవరికీ మనసు రాదు. చార్మినార్‌ను చూడాలని వచ్చిన ప్రతి ఒక్కరూ లాడ్‌బజార్‌లో గాజులు కొనాల్సిందే. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇక్కడి గాజుల దుకాణాలు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనగోలుదారులతో కిటకిటలాడుపోతున్నాయి. కేవలం నగరవాసులే కాదు.. తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన గాజులను ఖరీదు చేస్తున్నారు. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా మహిళలు తమకు ఇష్టమైన రంగు రంగుల కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ఒక్కసారి లాడ్‌బజార్‌లో అడుగు పెడితే చాలు ఆకలి, దప్పులను కూడా మరిచిపోయి గంటల తరబడి దుకాణాల్లో గడిపేస్తున్నారు. రూ.5 నుంచి 10 వేల ఖరీదైన గాజులు లాడ్‌బజార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లభించే గాజులు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అలాగని ధరలు ఆకాశంలో ఉంటాయనుకోవడం కూడా పొరపాటే. ఇక్కడ రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఖరీదు చేసే గాజులు లభ్యమవుతాయి. పైగా అందరికీ కావాల్సిన డిజైన్లు వేలల్లో ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్లు, యువతులు, పిల్లలు ఇక్కడి గాజులంటే మోజు పెంచుకుంటున్నారు. చార్మినార్ చెంతనే వ్యాపారం చార్మినార్ పడమర వైపు పాదం దగ్గర పుట్టిన ఒక వెలుగుల వీధి లాడ్‌బజార్. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు రోజూ తమ వ్యాపార లావాదేవీలు చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లతో ఇక్కడి వ్యాపారులు వినియోగదారులకు మరింత చేరువయ్యారు. ఆఫర్లకు ఆకర్షితులవుతున్న వినియోగదారులు గాజుల కొనుగోలు కోసం ఉత్సాహం చూపుతున్నారు. సాధారణ రోజుల్లో రద్దీగా ఉండే లాడ్‌బజార్.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో వ్యాపారాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. విద్యుత్ దీపాల కాంతిలో లాడ్‌బజార్ రాత్రి పగలు ఒకేలాగా కనిపిస్తోంది. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగు రంగుల రాళ్ల గాజులు ఛమక్ ఛమక్మంటూ వినియోగదారుల కళ్లను తాకుతున్నాయి. మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్ తదితర వెరైటీ గాజులు చూసే కొద్దీ ఏది తీసుకోవాలో తెలియకుండా చేస్తున్నాయి. పెళ్లంటే ఇక్కడికి రావాల్సిదే.. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు అధికంగానే జరుగుతున్నాయి. ఈ సీజన్లో లాడ్‌బజార్ గాజుల దుకాణాలను సందర్శించకుండా వివాహ వేడుక చేయని వారుండరు. వధువుకు విభిన్న రూపాల్లోని గాజులను ఖరీదు చేసి తీసుకెళుతున్నారు. అంతేకాదు.. పెళ్లి కూతురును చేసే సమయంలో ఆహ్వానితులుగా వచ్చే అతిథులందరికీ గాజులను అందజేయడం సంప్రదాయం. అందుకే మార్కెట్లోని సరుకు వేగంగా అమ్ముడైపోతోంది. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి కూడా జనం లాడ్‌బజార్‌కు వస్తున్నారు. -
ఇక గోల్డెన్ డేస్ చార్మినార్‌కు కొత్తందాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చార్మినార్‌కు వెళ్లినవారికి అక్కడున్న రకరకాల దుకాణాలు..ఇరుకు గల్లీలు..హడావుడి షాపింగ్ దృశ్యాలు కన్పిస్తాయి. చిన్న చిన్న మార్గాల్లో పెద్ద బోర్డులతో గజిబిజి వాతావరణం ఉంటుంది. ఒక్కో దుకాణం ఒక్కో రూపు. ఒక్కో ఆకారం. ఇకపై ఈ పరిస్థితిలో మార్పు రానుంది. ఒక వీధిలో ఒక వరుసలో ఉండే దుకాణాల ముందు భాగాలు(ఫసాడ్) అన్నీ ఒకే తరహా నిర్మాణశైలితో కనపడనున్నాయి. వరుస క్రమంలో తీర్చిదిద్దినట్లుండే దుకాణాలన్నీ బయటినుంచి చూసే వారికి ఒకే నమూనాలో కనిపిస్తాయి. దుకాణాల బోర్డులు కూడా అన్నింటికీ ఒకే సైజులో క్రమపద్ధతిలో అమర్చుతారు. చారిత్రక ప్రాధాన్యతతతో పాటు పలు విశేషాలతో ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అలరారుతున్న చార్మినార్‌ను సందర్శించే టూరిస్టులను మరింతగా ఆకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. చార్మినార్ పాదచారుల పథకం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ చార్మినార్‌ను స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతంగా గుర్తించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్మినార్ పరిసరాలకు మరిన్ని వన్నెలద్దేందుకు దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ అధికారులు అప్పటి మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చారు. అక్కడి దుకాణాలన్నీ ఒకే నమూనాలో ఉండటం, వాహన కాలుష్యం లేకపోవడం, స్వచ్ఛ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతుండటం తదితరమైనవి ఇక్కడా అమలు చేయవచ్చునని భావించారు. అందులో భాగంగా దుకాణాల ముందు భాగాలన్నీ ఒకే నమూనాలో ఏర్పాటు చేసేందుకు అప్పట్నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ.. స్థానిక వ్యాపారులను ఒప్పించడం, తదితరమైన వాటిలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు దుకాణాల ఫసాడ్‌ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. అందుకు స్థానిక వ్యాపారులను ఒప్పించారు. ఫసాడ్‌ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.15 లక్షల అంచనా వ్యయంతో వీటి ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి పూర్తయితే మిగతావారూ ముందుకొస్తారని భావిస్తున్నారు. స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా.. దీంతోపాటు స్వచ్ఛ ఐకాన్‌లో భాగంగా చార్మినార్ పరిసరాలను ప్రత్యేంగా తీర్చిదిద్దనున్నారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ 24 గంటల పాటు çపరిశుభ్రంగా ఉంచుతారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. పర్యాటకుల సదుపాయార్థం స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాల్ని పునరుద్ధరించి ప్రత్యేక వెలుగుల్లో మెరిసేలా విద్యుత్ కాంతులద్దుతారు. ఇలా వివిధ కార్యక్రమాలతో పర్యాటకులు మెచ్చేలా చార్మినార్ పరిసరాల్ని మార్చనున్నారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, తగినన్ని టాయ్లెట్లు.. మహిళలకు ప్రత్యేకంగా షీ టాయ్లెట్లు ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు తగిన రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఇవీ ప్రత్యేకతలు.. ♦ అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతోపాటు గజిబిజి..వాహన, ధ్వని కాలుష్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ♦ పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, చెల్లాచెదురుగా వేలాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు లేకుండా తొలగిస్తారు. ♦ అమృత్‌సర్‌లో ఫసాడ్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగం అధికారులు అక్కడి దుకాణదారులు, వీధి వ్యాపారులతో సహ సంబంధీకులందరితో పలు పర్యాయాలు సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా, వాటినే అందంగా తీర్చిదిద్దారు. ఫుట్‌పాత్‌లకు రంగుల టైల్స్ వేశారు. పరిశుభ్రత పరంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమృత్సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యతలుండటంతో ఇక్కడా అమలుకు ప్రయత్నిస్తున్నారు. -
టేలాబండి వ్యాపారుల ఘర్షణ
చార్మినార్: చార్మినార్ కట్టడం సమీపంలోని ఫరాషా హోటల్ ముందు గల ఫుట్‌పాత్ వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణ దాడికి దారితీసింది. ఈ సంఘటనలో రెచ్చిపోయిన టేలాబండి వ్యాపారులు పక్కనే ఉన్న మరో చిరు వ్యాపారిని చితక బాదారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చార్మినార్ వద్ద బహిరంగంగా అందరూ చూస్తుండగానే కర్రలతో చితకబాదారు. దాడిలో గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం చార్మినార్ ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన సలీం(33) కొంత కాలంగా ఫరాషా హోటల్ ముందు ఫుట్‌పాత్‌పై టేలాబండి వ్యాపారం చేస్తున్నాడు. గతంలో ఇతని వద్ద పనిచేసి వేరే దుకాణం పెట్టుకున్న బార్కాస్‌కు చెందిన మహ్మద్ సయ్యద్(32), సలీం(31), మహమ్మద్(28)లు శనివారం రాత్రి సలీంతో ఘర్షణకు దిగారు. తమ దుకాణానికి అడ్డంగా కాకుండా కొద్దిగా పక్కకు జరగాలని కోరడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం మొదలైంది. దీంతో రెచ్చిపోయిన మహ్మద్ సయ్యద్, సలీం, మహమ్మద్‌లు సలీంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ అంజయ్య తెలిపారు. -
పర్యాటక నగరి!
సాక్షి, సిటీబ్యూరో: నాలుగు శతాబ్దాల వారసత్వ హారం..మన భాగ్యనగరం. ఇక్కడి చరిత్ర, సంస్కతి, చారిత్రక కట్టడాలను చూసి మురిసిపోనివారుండరు. అందుకే సందర్శకులు సైతం బతుకమ్మ ఆటతో మమేకమవుతారు. బోనం నెత్తిన పెట్టుకుని పోతురాజుతో పోటీపడి నృత్యం చేస్తారు. గణపతి రూపాలు చూసి మురిసిపోతారు. రంజాన్ మాసంలో హలీంను లొట్టలేసుకుని ఆరగిస్తారు. ఇలా పురాతన కట్టడాలనే కాకుండా..సంప్రదాయ ఉత్సవాలను ఆస్వాదించేందుకూ ఇక్కడకు వచ్చేవారి సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర పర్యాటక ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనం... చారిత్రక కట్టడాలు ఠి కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల కాలం నాటి చారిత్రక కట్టడాలు నగరానికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చార్మినార్, మక్కామసీదు, గోల్కొండ, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్ నగర చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తున్నాయి. ఠి లుంబినీ పార్క్, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సాలార్జంగ్ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, జీఎస్ఐ వంటి సంగ్రహశాలలు, జూ పార్కు నగర ప్రత్యేకతను చాటుతున్నాయి. ఠి చౌమొహల్లా ప్యాలెస్ శిల్పకళ అద్భుతం. అరణ్యంలో సంచరించే అనుభవం కలిగించే జూపార్కు, నిజాంల రాజప్రసాదం మ్యూజియంలకు సందర్శకులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు. హుస్సేన్ సాగర్‌లో బోటు షికారు... ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ఇలా అంతా మనోహరమే. ఠి నగరానికి వచ్చిన స్వదేశీ, విదేశీ యాత్రికులకు గోల్కొండ కోట చూడందే పర్యాటక దాహం తీరదు. రోజంతా తనివి తీరా చూసి మురిసిపోతారు. గైడ్లు ఇక్కడి అందాలను వివరించిన తీరుకు మంత్రముగ్ధులవుతారు. బోటు షికారు ... టీఎస్‌టీడీసీ ఇటీవల లుంబినీ పార్కులో ప్రవేశపెట్టిన బోట్లు పర్యాటకులను విశేçషంగా ఆకర్షిస్తున్నాయి. వారాంతల్లో బోట్ షికారు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కొత్త బోట్లు వచ్చిన తర్వాత ఆదాయం ఆరవై శాతం పెరిగింది. టీఎస్‌టీడీసీ పరిధిలోని హరిత హోటల్స్ కూడా లాభాల బాటలో పయనిస్తున్నాయి. శోభాయమానంగా దుర్గం చెరువు... చుట్టూ కొండలు, మధ్యలో చెరువు.. ఇదీ దుర్గం చెరువు ప్రత్యేకత. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించి అందంగా తీర్చిదిద్దింది. సుమారు రూ. 20 కోట్లతో దుర్గం చెరువును ఆధునికీకరించారు. త్వరలో చెరువు ఆవరణలో ఆంఫీ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల్లో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఈ స్ఫూర్తితో నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకుల ఆకట్టుకోవడానికి తెలంగాణ పర్యాటక శాఖ ఆవిరళ కృషి చేస్తోంది. ఎంతో ప్రత్యేకంమెదక్ కోట...చర్చి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన మెదక్ కోట కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీక. రాజధాని నగరానికి అత్యంత సమీపంలో గల మెదక్ జిల్లాలలో ఆసియాలోనే అతి పెద్దదైన చర్చి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూర్తికావాల్సినవి ఇవీ.. ఇక కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చేపడుతున్నారు. వీటి పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నగర శివారులోని బుద్వేల్‌లో 30 ఎకరాల విస్తీర్ణంలో జల, క్రీడల పార్కు, గగతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు హెలీ టూరిజం – జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా ఆటకెక్కింది. సీ–ప్లేన్ ప్రాజెక్టు కూడా మూలనపడింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించే ప్రజలు తమ వాహనాలు నిలిపి.. కొన్ని గంటలు సేదదీరేందుకు వీలుగా పర్యాటక విడిది కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలంచింది. జడ్చర్ల కేంద్రంగా జాతీయ రహదారిపై దీన్ని నిర్మించనున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఆ ప్రతిపాదలన గురించి ఇప్పుడు అధికారులను అడిగితే తమకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆటవీ శాఖసరికొత్త ప్యాకేజీలు ... ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఫారెస్ట్ శాఖ వారు నగర ప్రజలను దృష్టిలో పెట్టుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎకో టూరిజం ఈవెంట్స్‌ను ప్రకటించారు. ఆసక్తిగల నగర పర్యాటకులు 73826 19363 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యం టూర్ ఏర్పాటు చేశారు. దీనికి రూ. 2 వేలు, లక్నవరం ఫెస్టివల్‌కు రూ.2 వేలు, పాండవుల గుహలకి రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. -
అబ్దుల్ గఫర్, ప్రతిమ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) వీల్ చెయిర్ టెన్నిస్ టోర్నమెంట్లో కర్ణాటక క్రీడాకారులు అబ్దుల్ గఫర్, ప్రతిమా రావు శుభారంభం చేశారు. హైదరాబాద్ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ తొలిరౌండ్లో విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీని అగ్రశ్రేణి కథానాయిక అక్కినేని సమంత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బుధవారం జరిగిన పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌లో అబ్దుల్ గఫర్ 9–2తో దేవేంద్ర (కర్ణాటక)పై గెలుపొందగా. మహిళల విభాగంలో ప్రతిమా రావు 9–0తో సుధ (కర్ణాటక)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శిల్ప 9–6తో నళిని కుమారిపై, వీరాస్వామి శేఖర్ (కర్ణాటక) 9–0తో కుందరాగి బసవరాజు (కర్ణాటక)పై గెలుపొందారు. ఇతర పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో అంజినప్ప (కర్ణాటక) 9–5తో కేదార్ మండల్ (ఢిల్లీ)పై, శరవణన్ (కర్ణాటక) 9–3తో ఇందుధర బీఎస్ (కర్ణాటక)పై, దేవ గౌడ (కర్ణాటక) 7–5తో కేశవన్ (కర్ణాటక)పై, మౌలాలి (కర్ణాటక) 9–4తో హనుమంతప్ప (కర్ణాటక)పై నెగ్గారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్‌బాబు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఇండియన్ వీల్‌చెయిర్ టెన్నిస్ టూర్ (ఐడబ్ల్యూటీటీ) చైర్మన్ సునీల్ జైన్, భారత టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ-కేసీఆర్-మజ్లీస్‌లు ఒక్కటే
-
‘జీవించటానికి హిందుస్థాన్ అయితే చాలు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ-మజ్లిస్ల ఆలోచనా ధోరణి ఒక్కటేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్రలో పాల్గొన్న ఆయన ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడ్డారు. ప్రసుతం దేశంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా.. అక్కడి ప్రజల్లో ఆందోళన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల గురించి ప్రజలు ప్రశ్నించుకునే స్థితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు బయటకి రావడానికి భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ-కేసీఆర్-మజ్లీస్‌లు ఒక్కటే ప్రధాని మోదీ దేశాన్ని విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మజ్లీస్ సిద్దాంతం కూడా అదే కాబట్టి మోదీకి మజ్లీస్ మద్దతు ఇస్తుందన్నారు. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఎంఐఎం మద్దతిచ్చిందని ఆరోపించారు. నోట్ల రద్దు అన్ని వర్గాల ప్రజలకు బాధించిందని పేర్కొన్నారు. ప్రజలందరూ లైన్లలో పడిగాపులు గాశారని, ఆ లైన్లలో నీరవ్ మోదీ కానీ విజయ్ మాల్యాకానీ కనిపించాడా అంటూ ప్రశ్నించారు. దేశంలోని అవినీతిపరుల నల్లధనాన్ని మోదీ తెల్లగా మార్చేశారని ఎద్దేవ చేశారు. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని దేశమంతా చెప్పిందని, అయినప్పటికీ మోదీకి కేసీఆర్ మద్దతు ప్రకటించాడని గుర్తు చేశారు. మోదీకి పార్లమెంటులో మద్దతు తెలిపేది కేవలం కేసీఆరేనని, ఇక్కడ కేసీఆర్‌కు ఎంఐఎం పార్టీ మద్దతుందని తెలిపారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలది కుమ్మక్కు రాజకీయాలని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేవలం ఒకే ఒక కుటుంబం రాజకీయాలను శాసిస్తోందని, వారిని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడే వారు ముందుండాలి ‘స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంగ్లేయులపై పోరాడిన కాంగ్రెస్ నేతలంతా జైలుకు వెళ్లారు. దేశం కోసం నిలబడేవాడు ముందు ఉండాలి. ప్రస్తుతం దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అందరూ సమానమే ఏ జాతి, ఏ మతం, ఏ ప్రాంతం అయినా ఇక్కడ శాంతిగా జీవించే హక్కు ఉంది. రాజ్యాంగ పరంగా కేవలం హిందుస్తాన్ అయితే చాలు’అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీకి ఓవైసీ స్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, కామారెడ్డిలలో భారీ బహిరంగ సభలలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ.. చార్మినార్‌కు వస్తున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘చార్మినార్‌కు వస్తున్నందుకు రాహుల్ గాంధీకి స్వాగతం. మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు(రాహుల్ గాంధీ), బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారు. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. -
పెద్దపల్లి టాప్.. వరంగల్, చార్మినార్‌లకు కూడా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ కేంద్రంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఇందులో భాగంగా కేంద్ర పారిశుద్ధ్య శాఖా మంత్రి ఉమాభారతి స్వచ్చ్ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 అవార్డులను ప్రదానం చేశారు. పారిశుద్ద్యం పాటించడంలో అత్యంత శ్రద్ధ కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాల వారీగా వివిధ విభాగాల్లో అవార్డులు అందజేశారు. సాఫ్, స్వచ్ఛతా పక్వాడ, స్వచ్ఛ్ ఐకానిక్ ప్లేసెస్ వంటి విభాగాల్లో తెలంగాణ నాలుగు అవార్డులు దక్కించుకుంది. పెద్దపల్లి టాప్.. వరంగల్, చార్మినార్‌లకు దక్కిన అవార్డులు దక్షిణాది స్వచ్ఛతా ర్యాంకింగ్స్‌లో 81.48 పాయింట్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇందుకు గాను పంచాయతీ ఉమా భారతి చేతుల మీదుగా పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ (SSBMG ప్రాజెక్ట్ డైరెక్టర్) నీతూ కుమారీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. అదే విధంగా స్వచ్చతాలో 97.45 పాయింట్లతో దేశంలో మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దపల్లికి మొదటి స్థానం దక్కగా.. కలెక్టర్ శ్రీదేవసేన ఈ అవార్డును అందుకున్నారు. అలాగే దక్షిణాది జిల్లాల స్వచ్ఛతాలో 95.59 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన వరంగల్ అవార్డును ఆమ్రపాలి అందుకున్నారు. ఇక స్వచ్ఛతా ఐకాన్ విభాగంలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన చార్మినార్ అవార్డును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషారఫ్, జీహెచ్ఎంసీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ స్వీకరించారు. -
ఇరానీ చాయ్.. లాడ్‌బజార్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాతబస్తీలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించారు. ముందుగా చార్మినార్ కట్టడాన్ని తిలకించిన గవర్నర్, భవన అందాలకు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ట్రస్టీ శశికళ సన్మానించారు. అనంతరం లాడ్‌బజార్‌లో గాజుల దుకాణాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడి నుంచి సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించి అం దులోని చారిత్రాత్మక వస్తువులను తిలకించారు. అనం తరం చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు. గవర్నర్ రాకతో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
చార్మినార్ చుట్టూ ట్రామ్వే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో ఆకర్షణ వచ్చి చేరనుంది. హైదరాబాద్‌కు ప్రతీక అయిన చారిత్రక చార్మినార్ ప్రాంతానికి న్యూ జనరేషన్ ట్రామ్వే ఏర్పాటు దిశగా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వివిధ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా ప్రజా రవాణావైపు ప్రజానీకాన్ని మళ్లించేందుకు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరంతో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పట్టణ ప్రాంత పునరుద్ధరణ కింద అక్కడ విజయవంతంగా నడుస్తున్న ట్రామ్‌వేను హైదరాబాద్‌లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డో మెట్రోపోలిస్ ప్రతినిధి విక్టర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో పాటు చార్మినార్ పథకం ప్రాజెక్టు డైరెక్టర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషార్రఫ్ ఫారుఖీని కలిశారు. సమగ్ర అధ్యయనం చేపట్టాక ట్రామ్వే మార్గాన్ని ఎంపిక చేయనున్నారు. సుందరీకరణ పనులు దాదాపు పూర్తి... స్వచ్ఛ భారత్ పథకంలో భాగమైన స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల ప్రాజెక్టు కింద చార్మినార్ ఎంపికవడంతో దాని పరిసరాల్లో చేపట్టిన సుందరీకరణ పనులు (చార్మినార్ పాదచారుల పథకం) ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పరిసరాల్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువశాతం చార్మినార్‌ను సందర్శించకుండా వెనుదిరగరు. ఈ నేపథ్యంలో పర్యాటక ఆకర్షణగా, పర్యావరణపరంగానూ ట్రామ్వే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతా మినహా మిగిలిన నగరాల్లో చతికిల... దేశంలో చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ముంబై, నాసిక్, పట్నా తదితర ప్రాంతాల్లో వందేళ్ల క్రితమే ట్రామ్‌వేలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కొనసాగలేక మూతపడ్డాయి. అయితే ఒక్క కోల్‌కతాలో మాత్రమే ప్రజల అభిమానాన్ని చూరగొనడంతో అక్కడ ట్రామ్వే సేవలు కొనసాగుతున్నాయి. చార్మినార్ కేంద్రంగా పాతబస్తీకి... ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రోరైలు త్వరలో ఎంజే మార్కెట్ మీదుగా పరుగులు తీయనుంది. అక్కడి నుంచి చార్మినార్ లేదా గుల్జార్‌హౌస్ వరకు ట్రామ్వే ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితమే అధికారులు భావించారు. చార్మినార్ వద్ద ఉన్న చిరువ్యాపారులను అక్కడి నుంచి తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద స్కైవే నిర్మాణానికి ఇటీవల సిద్ధమయ్యారు. దీంతోపాటు పార్కింగ్ సదుపాయాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకొని అన్నివిధాలా అనుకూలమైన మార్గంలో చార్మినార్ వైపు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, బోర్డో సిటీ మధ్య కుదిరిన సిస్టర్సిటీ ఒప్పందంలో భాగంగా ట్రామ్‌వేకు బోర్డో మెట్రోపోలిస్ సాంకేతిక సహకారం అందిస్తోంది. మరికొన్ని మార్గాల్లోనూ ట్రామ్‌వేపై వచ్చిన అభిప్రాయాలివీ చార్మినార్ ఔటర్ రింగ్‌రోడ్ మీదుగా..అఫ్జల్‌గంజ్–సాలార్జంగ్ మ్యూజియం–మీరాలం మండి–శాలిబండ–ముర్గీచౌక్–ఖిల్వత్ ప్యాలెస్–సిటీ కాలేజ్–హైకోర్టు–అఫ్జల్‌గంజ్.చార్మినార్ ఇన్నర్ రింగ్‌రోడ్ మీదుగా..గుల్జార్‌హౌస్–మిట్టికాషేర్–రాయల్ ఫంక్షన్ హాల్–మీర్‌మొమిన్ దర్గా–మొఘల్‌పురా–పారిస్ కార్నర్–పంచ్‌మొహల్లా–మిట్టికాషేర్– గుల్జార్‌హౌస్. ఇతర మార్గాలు మదీనా– గుల్జార్ హౌస్– ఖిల్వత్–హుస్సేనీ ఆలం–గోల్కొండ గోల్కొండ– కుతుబ్‌షాహీ టూంబ్స్ ఎంజే మార్కెట్–అబిడ్స్–నాంపల్లి– స్నో వరల్డ్–ట్యాంక్‌బండ్ ఏడాదిన్నర క్రితం చేసిన ప్రాథమిక అధ్యయనం మేరకు.. పైలట్ ప్రాజెక్టుగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్వే 2.3 కి.మీ. ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ. కోట్లలో) 250 ఆదాయం అంచనా(రూ. కోట్లలో) 75 నిర్వహణ ఖర్చులు (రూ. కోట్లలో) 45 సగటు వేగం గంటకు 20 కిలోమీటర్లు ఒక్కో వాహనంలో ప్రయాణికుల సామర్థ్యం 650 మెట్రోరైలు కంటే ప్రయాణ చార్జీ తక్కువ. భూసేకరణ అవసరం ఉండదు. ఉన్నా చాలా స్వల్పం పట్టాల మధ్య నుంచే విద్యుత్ సరఫరా.దీన్నే న్యూ జనరేషన్ ట్రామ్‌వేగా వ్యవహరిస్తారు. -
చార్మినార్ సమీపంలో డ్రోన్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక చార్మినార్ సమీపంలో అర్దరాత్రి డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డ్రోన్ ఆపరేట్ చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీసులు తెలిపారు. వివరాలు.. గురువారం అర్ధరాత్రి సమయంలో చార్మినార్ పరిసర ప్రాంతంలో డ్రోన్ చక్కర్లు కొడుతున్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుపర్ణ నాథ్ అనే 26 ఏళ్ల యువతి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆమె నుంచి డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని కెమెరా, రిమోట్ కంట్రోల్‌ను సీజ్ చేశారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు చార్మినార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా ఉగ్రవాద దాడుల ప్రమాదం పొంచి ఉందన్న ఇంటిలెజిన్స్ ఏజెన్సీల హెచ్చరికల మేరకు గత ఏప్రిల్ నుంచి హైదరాబాద్ పోలీసులు అనుమతి లేకుండా డ్రోన్లు ప్రయోగించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఏరియల్ వెహికల్ ఆపరేషన్స్, ఏరియల్ సర్వే నిర్వహించాలనుకునే ప్రభుత్వ సంస్థలు, ఏవియేషన్ అథారిటీస్ ముందుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ సిటీ సీపీ, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటిఫికేషన్ జారీ చేశారు. -
చార్మినార్ వద్ద డ్రోన్ కెమరాతో యువతి హల్చల్
-
ఆ దరికొస్తావా.. ఈ దరికొస్తావా?
బిర్లా మందిర్కిరా కలిసి గుడికెళ్దాం. ప్యారడైస్కి వస్తే హైదరాబాదీ బిర్యానీ తిందాం. గోల్కొండలో షికారు కొడదాం అంటూ ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్లు వస్తున్నాయి హీరోయిన్ కియారా అద్వానీకి. సడెన్‌గా ఎందుకీ ఆహ్వానాలు? అసలు ఎవరినుంచి వస్తున్నాయి? అంటే.. నెటిజన్ల నుంచి. ‘భరత్ అనే నేను’తో ఆకట్టుకున్న కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సోమవారం కియారాకు షూటింగ్ లేదట. సో.. హైదరాబాద్‌ని సందర్శించదలిచారు. ఈ బాలీవుడ్ భామకి ఏయే ప్లేస్‌లు తిరగాలో తెలియక ట్వీటర్లో నెటిజన్లను సలహా అడిగారు. చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌బండ్.. అంటూ కొందరు చక్కగా సలహాలు ఇచ్చినప్పటికీ కొందరు ఆకతాయిలు మాత్రం చార్మినార్ దగ్గరకు రండి చాయ్ తాగిస్తా, కోటిలో షాపింగ్‌కి తీసుకెళ్తాను అంటూ కొంటెగా రిప్లైలు ఇచ్చారు. హీరోయిన్ అంటే ఎంత ప్రేమో.. ఆ దరికొస్తావా? ఈ దరికొస్తావా అని ఇన్వైట్ చేశారు. కానీ కియారా ఈ ఆహ్వానాలు స్వీకరించకుండా ఒంటరిగానే చార్మినార్ వెళ్లి షాపింగ్ చేస్తూ తన హాలిడేను ఎంజాయ్ చేశారు. -
దేశంలోనే అగ్రగామిగా రాష్ట్ర టూరిజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దనున్నామని టీఎస్‌టీడీసీ చైర్మన్ పి.భూపతిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి టూరిజమే ప్రధాన ఆదాయ వనరు అయ్యేందుకు కృషి చేస్తానని చెప్పారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌టీడీసీ భవన్లో తొలిసారిగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్, థాయ్ లాండ్ దేశాలు ప్రపంచంలో టూరిజంలో అగ్రస్థానంలో ఉన్నాయని.. ఆ దేశాల స్ఫూర్తితో రాష్ట్రాన్నీ దేశంలోనే టూరిజంలో నంబర్‌వన్‌గా నిలుపుతానన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హరిత హోటళ్లు, రెస్టారెంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు టూరిజం బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయలో భాగం గా ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌బండ్‌లలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని చెరువుల వద్ద బోటింగ్, కొండ ప్రాంతాల్లో రోప్ వేలు ఏర్పాటు చేసి, ప్రసిద్ధ స్థలాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలో బ్యాటరీ వాహనాలు.. టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. నిర్మల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు హోటళ్ల నిర్మాణానికి స్థలం ఇస్తామన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని టూరి జం ప్లాజా వద్ద పర్మినెంట్ ఫుడ్‌స్టాల్ ఏర్పా టుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలోనే బ్యాటరీ వాహనాలను సాలార్జంగ్ మ్యూజి యం నుంచి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, నిజాం మ్యూజియం మీదుగా తిప్పనున్నట్లు తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలానికి 100 కి.మీ. మేర బోటు నడుపుతామన్నారు. జోగుళాంబ ఆలయ ప్రాంతంలో రూ.50 నుంచి రూ.80 కోట్లు ఖర్చు చేస్తామ న్నారు. సిరిసిల్లలో బడ్జెట్ హోటల్‌కు 13న శంకుస్థాపన చేస్తామన్నారు. అల్లీసాగర్ ప్రాజె క్టు వద్ద కాటేజీలు నిర్మిస్తామని అనంతగిరిని ఊటీ తరహాలో తీర్చిదిద్దుతామని తెలిపారు. -
చార్మినార్ కట్టడంలో చిదంబర రహస్యం !
కుతుబ్ షాహి వంశానికి చెందిన అయిదో పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించిన చార్మినార్ నగరం నడిబొడ్డులో ఒక వారసత్వ కట్టడంగా ఠీవీగా వెలిగిపోతోంది. దీని నిర్మాణమే చాలా ప్రత్యేకం. నాలుగు మీనార్లపై నిర్మితమై, చుట్టూ బాల్కనీలతో చూడగానే ఆకట్టుకునే డిజైన్‌తో అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎన్నో పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటే చార్మినార్ మాత్రం అంత పటిష్టంగా ఎలా ఉంది ? ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఇన్నేళ్లు ఎలా పదిలంగా ఉంది ? ఈ ప్రశ్నలు ఎవరికైనా సహజంగా వస్తాయి. తమిళనాడుకి చెందిన వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) పరిశోధకులకూ ఈ ప్రశ్నలు విపరీతమైన కుతూహలాన్ని పెంచాయి. చార్మినార్ నిర్మాణంలో రహస్యాలను ఛేదించడానికి వీఐటీ పరిశోధకులు పురావస్తు శాఖ సహకారంతో కొన్ని పరిశోధనలు చేశారు. చార్మినార్‌కు పైపూతగా వినియోగించిన సున్నపురాయి వల్లే ఆ కట్టడం సుదీర్ఘకాలం పటిష్టంగా ఉందని తేల్చారు. ఆ సున్నపురాయిని ఏ నిష్పత్తిలో వాడారు ? దానికి ఏయే పదార్థాలు కలిపారు అన్న దానిపై కూడా వీఐటీ శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేశారు. సున్నపురాయిని ఎలా వినియోగించారంటే ? చార్మినార్ నిర్మాణంలో సున్నపురాయిని చాలా ప్రత్యేకమైన పద్ధతిలో వాడారని వీఐటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సున్నపురాయితో పాటు, అందులో ఇసుక, కంకర, తగినన్ని నీళ్లతో కలిపారు. ప్రధానంగా మొక్కల నుంచి సేకరించిన పదార్థాన్ని నీళ్లతో కలిపి పులియబెట్టి, దాంట్లో సున్నపు రాయిని కలిపారు. ఇలా చేయడం వల్ల ఎన్ని విపత్తులు ఎదురైనా కట్టడం దృఢంగా ఉందని వారి పరిశోధనలో తేలింది. వాతావరణంలోని కార్బన్‌డైయాక్సైడ్ ప్రభావంతో సున్నపురాయి కాల్షియం కార్బొనేట్‌గా మారుతుంది. దీన్నే కార్బొనేషన్ అంటారు. సముద్రతీరాల్లో లభించే ఆల్చిప్పలు, నత్తగుల్లల పెంకులు కూడా కాల్షియం కార్బొనేట్తోనే తయారవుతాయి. మొక్కల నుంచి సేకరించిన పదార్థాలను పులియబెట్టి, దానికి సున్నపురాయిని కలపడం వల్ల కార్బొనేషన్ చాలా నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. దీని వల్ల కట్టడం ఎక్కువ కాలం పటిష్టంగా ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు కరక్కాయ వంటి మొక్కల నుంచి సేకరించిన పదార్థాల్లో ఉన్న కార్బొహైడ్రేట్లు సున్నపురాయితో కలవడం వల్ల వాటి బంధం మరింత దృఢంగా మారిందని వీఐటీ పరిశోధనలో పాల్గొన్న వీఐటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. తిరుమాలిని వెల్లడించారు. భారత్‌లో కొన్ని పురాతన కట్టడాల నిర్మాణాల్లో ఇలా మొక్కల నుంచి సేకరించిన కార్పొహైడ్రేట్లు, లేదంటే బెల్లం వాడేవారని ఆమె చెబుతున్నారు. అంతేకాదు దక్కన్ పీఠభూమిలో లభించే సున్నపురాళ్లలో సహజసిద్ధంగా ఉండే మాగ్నేషియం ఆక్సైడ్ కూడా చార్మినార్ చెక్కు చెదరకుండా ఉండడానికి కారణమేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మొక్కల నుంచి సేకరించిన కార్పొహైడ్రేట్లు, సున్నపురాయి ఏ నిష్పత్తిలో వాడాలో కొన్ని వందల ఏళ్ల క్రితమే బిల్డర్లు గ్రహించారని ప్రొఫెసర్ తిరుమాలిని వెల్లడించారు. సున్నపురాయి, ఇసుక 1:3 నిష్పత్తిలో వాడితే సున్నపురాయి మిశ్రమంలో ఖాళీలు చాలా తక్కువగా, చిన్నగా ఉంటాయని... ఫలితంగా నీరు చొరబడేందుకు వీల్లేకుండా పోతుందని అంచనా. చార్మినార్ నిర్మాణంలో అచ్చం ఇదే మోతాదు మిశ్రమం వాడినట్లు వీఐటీ అధ్యయనంలో వెల్లడైందని ఆమె వివరించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కాలిబాటలో కదిలే స్తంభాలు
సాక్షి, సిటీబ్యూరో : చార్మినార్ పరిసరాలను ముస్తాబు చేస్తున్న జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మాదిరిగా ఇక్కడ పాదచారులు తప్ప వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా ‘బొల్లార్డ్స్’(కదిలే స్తంభాలు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వివిధ మార్గాల నుంచి వచ్చి చార్మినార్‌కు చేరుకునే మార్గాల్లో వాహన నిషేధిత పాదచారుల జోన్లో వాహనాలు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా స్థిరంగా ఉండేవి.. కదిలేవి(హైడ్రాలిక్)కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు వంటి వాహనాలు ప్రయాణించేందుకు, వీవీఐపీలు వచ్చేందుకు అనువుగా భూమిలోకి వెళ్లిపోయేలా వీటిని బిగిస్తారు. స్థిరంగా ఉండే వాటితోపాటు హైడ్రాలిక్ బొల్లార్డ్స్ ఏర్పాటుకు రూ. 2.38 కోట్లు ఖర్చు కానుంది. ఇందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పాదచారుల పథకంలో భాగంగా చార్మినార్ నాలుగువైపులా వాహనాల్ని నిషేధిస్తూ పాదచారుల జోన్‌ను గ్రానైట్ కాబుల్స్తో ప్రత్యేకంగా రూపొందించడం తెలిసిందే. వాహనాల నిరోధంతో పాటు వాయు కాలుష్యం లేకుండా చేసేందుకు బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కొంతకాలం క్రితం చార్మినార్‌ను సందర్శించిన మున్సిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద బొల్లార్డ్‌లను ఏర్పాటు చేసిన అహ్మదాబాద్ కంపెనీని సంప్రదించారు. దాని కొటేషన్ల మేరకు రూ.2.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.47.10 కోట్లతో ఆర్ఓబీ.. ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా మరో ఆర్ఓబీని నిర్మించేందుకు రూ.47.10 కోట్ల ప్రతిపాదనలకు సైతం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్– ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ మార్గంలో ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీ అక్కడి రద్దీకి సరిపోవడం లేదు. దాంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఎంతోకాలంగా కోరుతున్నారు. అందుకు స్టాండింగ్ కమటీ ఆమోదం తెలిపింది. త్వరలో పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని సర్కిల్ కమిషనర్లుగా రీ–డిజిగ్నేట్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఆమోదం తెలిపారు. మూడో సారీ అతడు.. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సమావేశం గడువు ముగిసిపోవడంతో పాటు కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికను నామినేషన్ల గడువు కూడా గురువారంతో ముగిసింది. ఎప్పటిలాగే తొమ్మిది మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. గడచిన రెండు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న రామ్‌నగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి మూడో స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేసినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడనే విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సమావేశానికి మేయర్ రామ్మోహన్ అధ్యక్షత వహించగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జోనల్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త అల్లుడు హజ్రత్ ఆలీ అలైహీ సలాం వర్ధంతిని పురస్కరించుకొని పాతబస్తీలో మంగళవారం నిర్వహించిననున్న సంస్మరణ ర్యాలీ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ చార్కమన్, గుల్జార్ హౌస్, పతర్ గట్టి, మదీనా, టిప్సు ఖానా, చత్తా బజార్, లక్కడ్ కొటే, సలామా స్కూల్ పురానా హవేలి, నుంచి ఏపీఎట్ క్రాస్ రోడ్స్ నుంచి నుంచి కుడివైపునకు మళ్లి దారుషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, అబిద్ ఆలీఖాన్ ఐ హాస్పిటల్, మసీద్ ఇ ఇమామియా నుంచి కలికాబర్ ఎంజీబీఎస్ వద్ద ముగియనుంది. ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా ఇతర మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. మళ్లింపులు ఇలా ఈతబర్ చౌక్ నుంచి గుల్జార్ హౌస్‌కు వచ్చే వాహనాలను ఇరానీ గల్లీలోని అర్మన్ కేఫ్ మీదుగా మళ్లించి కోట్ల ఆలీజా/హఫీజ్ దంక మసీదు వైపునకు అనుమతించనున్నారు. గాన్సి బజార్, మిట్టి కి షేర్ నుంచి వచ్చే వాహనాలను మిట్టి కా షేర్ జంక్షన్ వద్ద మళ్లించి గాన్సిబజార్, హైకోర్టు రోడ్డువైపు అనుమతించనున్నారు. చత్తాబజార్ వరకు సంస్మరణ ర్యాలీ వచ్చే వరకు నయాపూల్ వద్ద వాహనాలను నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఏపీఎట్ జంక్షన్ వెళ్లేవరకు చత్తాబజార్‌లో ట్రాఫిక్ ఆపనున్నారు. పురానా హవేలి నుంచి చత్తా బజార్ వెళ్లేవాహనాలను పీలిగేట్, బైతుల్ కయ్యంలోని ఏపీఎట్, మండి మీర్ ఆలం వద్ద మళ్లించనున్నారు. సంస్మరణ ర్యాలీ లక్కడ్ కొటేకు చేరుకోగానే సలామా స్కూల్ వైపునకు వెళుతున్న క్రమంలో ఏపీఏటీ నుంచి చత్తాబజార్ వెళ్లే వాహనాలను ఎస్జే రోటరీ, మండీ మీర్ఆలం, ప్రిన్సెస్ దురేశ్వర్ హాస్పిటల్ వద్ద మళ్లించనున్నారు. ఎస్జే రోటరీ నుంచి ఏపీఏటీ జంక్షన్ వెళ్లే వాహనాలను శివాజీ బ్రిఇడ్జ్, సలార్ జంగ్ మ్యూజియం, నూర్కాన్ బజార్ల మీదుగా అనుమతించనున్నారు. సంస్మరణ ర్యాలీ దారుషిఫా మైదానానికి చేరుకోగానే చాదర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద మళ్లించి విక్టోరియా ప్లే గ్రౌండ్ జంక్షన్ వైపు అనుమతించనున్నారు. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
నగల తయారీ కేంద్రంలో బంగారం దోపీడి
-
చార్మినార్‌కు నో ఎంట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ పరిసరాల్లో పాదచారుల పథకంలో భాగంగా సోమవారం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న రోడ్లను బ్లాక్ చేశారు. కేవలం పాదచారులను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే చార్మినార్ చుట్టూ తోపుడు బండ్లపై పండ్ల విక్రయాలను, స్ట్రీట్ వెండర్లను, దుకాణాలను ఎత్తివేశారు. దీంతో విసిగిపోయిన స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. -
ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద సండే మార్కెట్లో ఖరీదు చేసిన రాయి అది.. సాధారణంగా కోటు గుండీల్లో పొదగడానికి వినియోగిస్తుంటారు.. దీన్ని ఓ చోర ద్వయం రూ.4.5 కోట్ల విలువైన వజ్రంగా నమ్మించింది.. మార్కెట్లో ఖరీదు చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారంటూ పరిచయస్తుడికే ఎర వేసి.. ఆ గుండీని రూ.1.2 కోట్లకు అమ్మేసింది.. విషయం టాస్క్‌ఫోర్స్ వద్దకు చేరడంతో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.1.15 కోట్ల నగదు, నకిలీ వజ్రం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అథర్ సిద్ధిఖీ, ఆర్సీపురం వాసి మహ్మద్ సల్మాన్‌ఖాన్ ముత్యాలు, రత్నాల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీటి నుంచి గట్టెక్కడానికి భారీ స్కెచ్ వేశారు. రత్నాల వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో వజ్రం పేరుతో ఎవరినైనా మోసం చేద్దామని భావించారు. సల్మాన్ గతంలో నాంపల్లిలోని మహ్మద్ ఖాన్ జ్యువెలర్స్‌లో సేల్స్ మెన్‌గా పని చేశాడు. ఆ సమయంలో అతడితో కలసి పనిచేసిన సనత్‌నగర్ వాసి షేక్ హాజీ అలియాస్ ఇలియాస్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. వజ్రం విక్రయం పేరుతో అతడిని మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు. రూ.3,500కు స్టోన్ ఖరీదు చేసి.. ఈ నెల 14న ఖాన్, అథర్ చార్మినార్ వద్ద సండే మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ అమ్ముతున్న కోటు బటన్‌కు ఏర్పాటు చేసే భారీ స్టోన్ వీరిని ఆకర్షించింది. దాన్ని రూ.3,500కు ఖరీదు చేసి.. ఓ బాక్సులో పెట్టి 25 క్యారెట్ల వజ్ర మంటూ ప్రచారం చేశారు. హాజీని సంప్రదించిన ఖాన్ తనకు తెలిసిన వ్యక్తి వద్ద రూ.4.5 కోట్ల విలువ చేసే మేలైన వజ్రం ఉందని, మార్కె ట్లో ఖరీదు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారని చెప్పి నమ్మించాడు. సదరు వ్యక్తికి అత్యవస రంగా డబ్బు అవసరమై రూ.1.2 కోట్లకే అమ్ముతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఖరీదు చేస్తే.. వారంలోనే రూ.4.5 కోట్లకు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ చెప్పాడు. దీంతో అప్పులు చేసిన హాజీ తన దగ్గర ఉన్న డబ్బు కలిపి రూ.1.2 కోట్లు సిద్ధం చేశాడు. లాడ్జికి రప్పించి మోసం.. ఈ నెల 18న హాజీని నాంపల్లిలోని ఓ లాడ్జికి రప్పించిన ఖాన్.. ‘వజ్రం’తోపాటు అథర్‌నూ అక్కడకు తీసుకువచ్చాడు. హాజీ ఎదురుగా వివిధ ‘పరీక్షలు’ చేసినట్లు నటించిన అథర్ అది అత్యంత విలువైన వజ్రమంటూ షో చేశాడు. దీంతో పూర్తిగా నమ్మిన హాజీ ఆ మొత్తం వారికి ఇచ్చి స్టోన్ తీసుకెళ్లాడు. వారం రోజులు వేచి చూసినా ‘వజ్రాన్ని’ ఖరీదు చేసే పార్టీలను తీసుకురాక పోవడం, తనకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో హాజీ స్వయంగా రంగంలోకి దిగాడు. మార్కెట్లో సదరు స్టోన్‌ను విక్రయిం చడానికి ప్రయత్నం చేశాడు. సదరు ‘వజ్రాన్ని’ పరిశీలించిన వ్యాపారులు అది కోటుకు వినియోగించే గుండీ స్టోన్‌గా తేల్చారు. దీంతో మోసపోయానని గుర్తించిన హాజీ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం ఖాన్, అథర్‌లను పట్టుకుని రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకుంది. కేసును అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్చల్
చార్మినార్ : ఓల్డ్‌సిటీలో 'మోదీ' హల్చల్ చేస్తున్నారు. ఆయన ఫోటోతో ఉన్న పంతగులు పాతబస్తీ వాసులను, పర్యాటకులను అలరిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కొందరు ప్రధాని మోదీ ఫోటోతో కూడిన పతంగులను పంచిపెట్టారు. వారిలో ముస్లింలే అధికులు కావడం విశేషం. ''అన్ని పండుగలు హిందూ, ముస్లింలు కలిసి జరుపుకోవడం ఇక్కడే కాదు, దేశమంతటా ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. హిందూ-ముస్లిం ఐక్యతను చాటే ఈ పండుగలో మేము పాలుపంచుకున్నాం'' అని బీజేపీ అధికార ప్రతినిధి మిర్ ఫిరసత్ అలీ చెప్పారు. సంక్రాంతి, పతంగుల పండుగల సందర్భంగా బీజేపీ తెలంగాణ మైనారిటీ మోర్చ వైస్ ప్రెసిడెంట్ కవి అబ్బాసితో కలిసి, ఫిరసత్ అలీ, ప్రధాని నరేంద్రమోదీ ఫోటోతో కూడిన 300 పతంగులను చార్మినార్ వద్ద పర్యాటకులకు, స్థానికులకు పంచారు. పాత బస్తీ ప్రజల సంక్షేమాన్ని బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుందనే సందేశాన్ని ప్రజలకి అందిస్తున్నామని ఫిరసత్ అలీ చెప్పారు. -
ఇదర్ దేఖో.. మోదీ సాబ్!
శనివారం ఉదయం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతం. చాలా నిర్మలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. జనమంతా చార్మినార్ వైపు ఆసక్తిగా చూశారు. అయితే చార్మినార్ వైపు కాదు. అక్కడికొచ్చిన ‘మోదీ’ని చూసేందుకు. అదేంటి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే కనీసం ఏ హంగూ ఆర్భాటం లేదేంటి అనుకుంటున్నారా..? కనీసం ముందు రోజు చిన్న వార్త కూడా లేదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. అక్కడికి వచ్చింది ప్రధాని మోదీ కాదు.. అచ్చు మోదీని పోలిన 59 ఏళ్ల సదానంద్ నాయక్. కర్ణాటకలోని ఉడిపి జిల్లా హిరియాడ్క గ్రామానికి చెందిన సదానంద్ జూనియర్ మోదీగా బాగా ఫేమస్. ఉడిపి జిల్లాలోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో వంట మనిషిగా పనిచేస్తూ గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందాడు. అనుకోకుండా గడ్డం పెంచడంతో తోటి ఉద్యోగులు, మిత్రులు మోదీలాగా ఉన్నావని చెప్పడంతో.. వేషధారణ కూడా అలాగే చేసుకోవడం ప్రారంభించినట్లు చెప్పాడు. పేదరికం కారణంగా 5వ తరగతి వరకే చదువుకుని 12 ఏళ్ల వయసులో ఓ హోటల్లో పనికి కుదిరానని పేర్కొన్నాడు. నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించినట్లు చెప్పాడు. –చార్మినార్ -
టిక్.. టిక్.. టిక్ అలుపన్నది లేదు!
చార్మినార్. హైదరాబాద్ మహానగరానికి మణిహారం. చార్మినార్ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. తొలుత కుతుబ్‌షాహీ, అనంతరం అసఫ్‌జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలకులు వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు. గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. గంట గంటకూ గడియారం చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్య ప్రారంభించి ముగించేవారు. బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాతోపాటు పలు నగరాల్లో క్లాక్ టవర్లు నిర్మించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి 1865లో బ్రిటిష్ రెసిడెన్సీ ఆస్పత్రి ప్రాంగణం(ఇప్పుడు సుల్తాన్‌బజార్)లో నగరంలోనే తొలి క్లాక్‌టవర్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ ప్రజల సౌకర్యార్థం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేయించారు. ఒకప్పుడు హైదరాబాద్ దర్పానికి ప్రతీకలుగా నిలిచిన ఈ క్లాక్ టవర్లు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రజల చూపునకు నోచుకోక.. సరైన నిర్వహణ లేక ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. చార్మినార్‌పై ఉన్న నాలుగు గడియారాలు మాత్రం 128 ఏళ్లుగా క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి. నగరంలోని క్లాక్ టవర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. క్లాక్ టవర్లు.. బ్రిటిష్ అనుసరణ 1865లో సుల్తాన్‌బజార్ క్లాక్ టవర్‌ను బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి నిర్మించారు. దానికి పోటీగా.. అప్పటి పాలకుల మన్ననలు పొందడానికి సంస్థాన ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు నగరంలోని ఇతర ప్రదేశాల్లో క్లాక్ టవర్లు నిర్మించి నిజాం పాలకులకు బహూకరించారు. నగరంలో ఉన్న అన్ని గడియారాలు లం డన్లో తయారు చేసినవే. వాటిని ఓడల ద్వారా ముంబైకి.. అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చార్మినార్ ఉత్తర దిశలో ఉన్న గడియారం విలువ అప్పట్లోనే రూ.60 వేలు. మిగతా మూడు గడియారాలు ఒక్కొక్కటీ రూ.30 వేలు. ఇక నగరంలోని మిగతా గడియారాల విలువ రూ.50–60 వేల వరకూ ఉంది. ఫతేమైదాన్ క్లాక్ టవర్.. ఆరో నిజాం సంస్థానంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిం చిన నవాబ్ జఫర్ జంగ్ బహదూర్ ఫతేమైదాన్ క్లాక్ టవర్‌ను 1903లో నిర్మించి ఆరో నిజాంకు బహూకరించారు. ఇది బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ చివరలో ఉంది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ కనుమరుగయ్యే స్థితిలోకి జారుకుంటోంది. ఇక నగరంలోని మొజంజాహీ మార్కెట్ నిర్మాణం అనంతరం 1935లో గడియారం ఏర్పాటు చేశారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిర్మించింది. మిగతా గడియారాలన్నీ ఇతరులు నిర్మించినవే. నగరంలో తొలి క్లాక్ టవర్... కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ పనులు పూర్తయ్యాక రెసిడెంట్ అధికారి 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ నిర్మించారు. ఈ టవర్ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ క్లాక్ ప్రస్తుతం పనిచేయడం లేదు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితిలోకి జారుకుంటోంది. మహబూబ్ చౌక్ క్లాక్ టవర్.. ఈ టవర్‌ను నవాబ్ సర్ ఆస్మాన్‌జా బహదూర్ 1890లో నిర్మించారు. సాలార్జంగ్ చొరవ వల్ల ఈ క్లాక్ టవర్ 1892లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇండోనేíసియా శైలిలో దీనిని నిర్మించారు. చార్మినార్ పశ్చిమ దిశలో లాడ్ బజార్‌కు ముందు మహబూబ్ చికెన్ మార్కెట్(ముర్గీ చౌక్) పక్కన ఇది ఉంది. ఈ క్లాక్ టవర్‌కు 2008లో ఇంటాక్ హెరిటేజ్ అవార్డు లభించింది. చార్మినార్ గడియారం.. చార్మినార్‌ను 1591లో నిర్మించారు. అయితే 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చార్మినార్ మొదటి అంతస్తు మధ్యలో నాలుగు వైపులా గడియారాలు అమర్చారు. ఆ రోజుల్లో పాతబస్తీ ప్రజలు ఈ గడియారం చూసి తమ దినచర్య ప్రారంభించే వారు ముగించే వారు. చార్మినార్‌లో ఉన్న మూడు గడియారాలు ఒకలా ఉంటే.. ఉత్తర దిశలో ఉన్న గడియారం భిన్నంగా ఉంటుంది. ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది. మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ. చార్మినార్ గడియారం గొప్పతనం ఏమిటంటే ఏ రోజు దానిని ప్రతిష్టించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆగకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గడియారాలన్నీ నిలిచిపోయాయి. కానీ చార్మినార్‌పై ఉన్న గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు గడియారంలో సమయాన్ని చూసే భాగ్యం కల్పిస్తోంది. బోసిపోయిన సికింద్రాబాద్ క్లాక్ టవర్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న క్లాక్ టవర్ ప్రస్తుతం పనిచేయడం లేదు. బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1896లో దీనిని నిర్మించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దేశంలోని ఎల్తైన క్లాక్ టవర్లలో మూడోది. దీని ఎత్తు 37 మీటర్లు(120 అడుగులు). 1896లో పది ఎకరాల విశాల స్థలంలో క్లాక్ టవర్ నిర్మించారు. సర్ ట్రెవర్ జాన్ సిచెల్ ప్లోడన్ 1897 ఫిబ్రవరి 1న క్లాక్ టవర్‌ను ప్రారంభించారు. గడి యారాన్ని దివాన్ బహదూర్ సేట్ లక్ష్మి నారాయణ రాంగోపాల్ బహూకరించారు. దీనికి 2005లో హెరిటేజ్ అవార్డు కూడా దక్కింది. 128 ఏళ్లుగా ఎప్పుడూ ఆగలేదు.. నేను 1962 నుంచి చార్మినార్ గడియారం నిర్వహణ చేస్తున్నాను. రోజుకు ఒక్కసారి గడియారానికి ‘కీ’ఇస్తున్నాం. చార్మినార్ గడియారం ఏర్పాటు చేసినప్పటి నుంచీ మా తాత, బాబాయిలు, మా నాన్న రసూల్ ఖాన్‌కు నిజాం ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. చార్మినార్ గడియారం బరువు 25 కేజీలు ఉంటుంది. ఇంగ్లండ్‌లో తయారు చేసిన మెకానికల్ గడియారం ఇది. 128 ఏళ్లుగా గడియారం ఎప్పుడూ ఆగలేదు. – సికందర్ఖాన్ ఆగినా పట్టించుకోని అధికారులు సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్(రాంగోపాల్ పేట్) పోలీస్ స్టేషన్‌పై ఉన్న క్లాక్ టవర్‌ను ఆ రోజుల్లో ప్రముఖ సంఘ సేవకుడు సేట్ రాంగోపాల్ 1900వ సంవత్సరంలో నిర్మించారు. ఈ క్లాక్ టవర్ నిర్మాణం పూర్తిగా యూరోపియన్ శైలితో సాగింది. ఈ క్లాక్ టవర్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా హయాంలో ఈ క్లాక్ టవర్ నిర్మాణం జరిగింది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ పనిచేయడం లేదు. -
స్వర్ణదేవాలయం తరహాలో..
చారిత్రక పాతబస్తీ సరికొత్త అందాలను సంతరించుకోనుంది. మహానగరానికే గుర్తింపు చిహ్నమైన చార్మినార్ పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. చార్మినార్ కట్టడాన్ని ‘స్వచ్ఛ ఐకానిక్’ ప్రదేశంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించేందుకు సీఎస్సార్ కింద ఎన్టీపీసీని ఎంపిక చేసింది. సంవత్సర కాలంలో కట్టడం పరిసరాల్ని అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ముసాయిదాను సైతం రూపొందించారు. ఇప్పటి దాకా సీపీపీ కోసం ఖర్చు చేసిన రూ.20 కోట్లతో సహా మరో రూ.104 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. అందులో రూ.25 కోట్ల పనులకు సహకరించాల్సిందిగా ఎన్టీపీసీకి ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులన్నీ పూర్తయితే భాగ్యనగర చిహ్నమైన చార్మినార్, దాని పరిసరాలు.. ఇప్పటికే స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తింపు పొందిన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం పరిసరాల్లా మారనున్నాయి. ఏం చేస్తారంటే.. ♦ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 24 గంటలూ స్వీపింగ్ యంత్రాలు ♦ పచ్చదనంతో ఆహ్లాదకర వాతారణం ♦ పరిసర చారిత్రక భవనాలకు విద్యుత్ కాంతులు, మ్యూజియంగా సర్దార్‌మహల్ ♦ పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, స్త్రీ, పురుషులకు ప్రత్యేక టాయ్లెట్లు ♦ పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాలు ♦ చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్ ఏర్పాటు.. అందులోకి వాహనాలు రాకుండా చర్యలు ♦ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం ♦ అన్ని దుకాణాలూ ఒకేరీతిలో.. ♦ వేలాడుతున్న విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లు భూగర్భంలో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ స్వచ్ఛ ఐకాన్‌గా ఎంపిక కావడంతో చేపట్టబోయే పనులతో ఆ ప్రాంత పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. దీంతో దాదాపు దశాబ్దకాలంగా సాగుతున్న చార్మినార్ పాదచారుల పథకం(సీపీపీ)పనుల్లో వేంగం పుంజుకోనుంది. చారిత్రకకట్టడం పరిసరాలను 24 గంటలూ పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకుంటారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాలను కూడా పునరుద్ధరించి విద్యుత్ వెలుగులతో నింపనున్నారు. సకల సదుపాయాల కల్పన.. అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా, యూజర్ ఫ్రెండ్లీ రవాణా, తదితర సదుపాయాలు కల్పిస్తారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, టాయ్లెట్లు.. ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. చార్మినార్ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులు సైతం నిర్మిస్తారు. స్వర్ణ దేవాలయం తరహాలో మార్పు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చిన అధికారులు.. అదే తరహాలో చార్మినార్ పరిసరాల్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతో పాటు గజిబిజి.. వాహన, ధ్వని కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, గాల్లో వేల్లాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు తొలగించనున్నారు. అమృత్‌సర్‌లో చేశారు..? స్వర్ణదేవాలయం సరిసరాల్లో ఇరుకుగా ఉన్న రహదారులను, ఫుట్‌పాత్‌లను విస్తరించారు. గందరగోళంగా ఉన్న విద్యుత్, కేబుల్ వైర్లను తొలగించారు. పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. దుకాణాలపై ఉన్న పెద్దపెద్ద బోర్డులను, రోడ్డువైపున్న పెద్ద హోర్డింగుల్ని తీసేశారు. రోడ్లపై రద్దీతో ఉండే మార్కెట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆలయానికి చుట్టూ వీధుల్ని ఆధునీకరించారు. వీధుల్లోని షాçపులన్నింటి ముందు భాగం ఒకే తీరుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా అధికారులతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా అందంగా తీర్చిదిద్దారు. అమృత్సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యత ఉండటంతో ఇక్కడా ఆ తరహాలోనే అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇక్కడేం చేయవచ్చు.. చార్మినార్ వద్దగల వీధి వ్యాపారులను దాదాపు కిలోమీటర్ మేర తరలించేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ముందుగా రాజకీయ నేతలతో సంప్రదించి, వారి ద్వారా వ్యాపారులకు తగిన అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా కేబుళ్లు , విద్యుత్ వైర్లు పైకి కనిపించకుండా భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వర్ణ దేవాలయానికి సమీపంలోని టౌన్హాల్లో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేసి అందులో చరిత్రకు సంబంధించిన వివిధ కళాఖండాలు, ఫొటోలు, దస్త్రాలు భద్రపరిచారు. చార్మినార్‌కు సమీపంలోని సర్దార్‌మహల్‌ను పునరుద్ధరించి అందులో హైదరాబాద్ చరిత్ర, విశేషాలు తెలిపే మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. చార్మినార్‌కు నాలుగుదిక్కులా ఉన్న కమాన్లను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే మచిలీకమాన్ పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధి పనులపై అధికారుల సమావేశం.. చార్మినార్ వద్ద ఏయే పనులు చేయాలనే అంశంపై చర్చించేందుకు గురువారం మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కోసం రెండు కాంప్లెక్సులు నిర్మించేందుకు ఆస్కి సహకారంతో టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ఖిల్వత్ వద్ద వీటిని నిర్మించనున్నారు. ఖిల్వత్ వద్ద కూల్చేసిన పెన్షన్ ఆఫీసు డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైతం స్థలాన్ని ఖాళీ చేసి పార్కింగ్‌కు అనువుగా మార్చనున్నారు. విద్యుత్ వైర్లు డక్ట్‌లో ఏర్పాటు చేయాలని, పోల్స్ అధునాతనమైనవి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలన్నింటి ముందు భాగం ఒకేలా ఉండేందుకు తొలుత లాడ్బజార్వైపు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు తగిన డిజైన్ రూపొందించాల్సిందిగా సూచించారు. -
హమారా.. హైదరాబాద్
ఐటీలో మేటి.. ఫార్మాలో ప్రపంచ ఖ్యాతి.. వీటన్నింటికీ తోడు ఇప్పుడు మెట్రో సొబగులు.. వెరసి వడివడిగా విశ్వనగరం దిశగా అడుగులు.. ఇది నేటి హైదరాబాద్! మరి వందల ఏళ్ల కిందట నగరం ఎలా ఉండేది? ఈ మహానగర నిర్మాణానికి ప్లానింగ్ ఎలా చేశారు? సిటీలో మొట్టమొదట దేన్ని నిర్మించారు? భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ఆనాడే ఎలా రూపకల్పన చేశారు? ఈనాడు కాదు.. వీటన్నింటికీ ఐదు వందల ఏళ్ల కిందటే బీజం పడింది. అదే ఇప్పుడు మహా వృక్షమై, మహానగరమై వెలుగుతోంది. శతాబ్దాల నగర నిర్మాణ ప్రస్థానంపై ఈ వారం ఫోకస్.. – ముహ్మద్ మంజూర్ కుతుబ్ షాహీల పాలనలో.. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ సంస్థాన స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా తుర్క్మనిస్తాన్ నుంచి కుటుంబ సమేతంగా భారత్ వచ్చారు. తొలుత ఢిల్లీ వెళ్లిన కులీ కుతుబ్ షా ఆ తర్వాత బీదర్ వచ్చి బహమనీ సంస్థానంలోని సైన్యంలో చేరాడు. ఈ క్రమంలో గోల్కొండ పాలకుడిగా ఉన్న మహమూద్ బహమనీ నమ్మకాన్ని పొందాడు. దీంతో మహమూద్ బహమనీ కులీ కుతుబ్ షాకు గోల్కొండ కోట సుబేదారుగా బాధ్యతలు అప్పగించి గోల్కొండకు పంపాడు. అనంతరం బహమనీల పతనం ప్రారంభం కావడంతో 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను తన అధీనంలోకి తీసుకుని పరిపాలన ప్రారంభించాడు. 1543లో జంషీద్ చేతిలోనే కులీ కుతుబ్ షా హత్యకు గురయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా ఏడేళ్లు.. అతడి కుమారుడు సుభాన్ కులీ కొన్ని నెలలు సంస్థానాన్ని పాలించారు. అయితే సుభాన్ చిన్న వయసు వాడు కావడంతో ప్రజలు, సంస్థాన పాలకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయనగరంలో ఉన్న సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను సంస్థాన బాధ్యతలు స్వీకరించాలని కోరారు. దీంతో 1550లో ఇబ్రహీం కులీ గోల్కొండ సంస్థానానికి రాజయ్యాడు. కొత్త నగరానికి శ్రీకారం.. ఇబ్రహీం తండ్రి హయాంలో దేవరకొండ సుబేదార్‌గా విధులు నిర్వహించాడు. అనంతరం విజయనగరం వెళ్లి పరిపాలనా నైపుణ్యంతో పాటు వివిధ సంస్థానాల పాలనను అధ్యయనం చేశాడు. గోల్కొండకు రాజయ్యాక.. కోటతోపాటు సంస్థానంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టాడు. గోల్కొండ కోటలో అప్పటికే జనాభా విపరీతంగా పెరిగింది. కోట లోపల ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. వెయ్యేళ్ల క్రితం అప్పటి అవసరాలకు, జనాభాకు సరిపడేలా మట్టితో గోల్కొండ కోటను కట్టారు. దీంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కోట బయట ఓ కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించాడు. నూతన నగరం ఏర్పాటుకు అనువైన ప్రదేశం అన్వేషించాలని సంస్థానం అధికారులకు సూచించాడు. మూసీ దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఆయనకు నివేదిక ఇచ్చారు. తొలుత మూసీ నదిపై వంతెన నిర్మించాలని అధికారులు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను కోరారు. దీంతో 1578లో మూసీ నదిపై పురానాపూల్ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. నగర మాస్టర్‌ప్లాన్ రూపకర్త మీర్ మొమిన్ చార్మినార్‌తో పాటు నూతన నగర నిర్మాణానికి ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ కోసం పలు సంస్థానాలు, దేశాల్లో ఆరా తీశారు. ఇరాన్‌లోని ఇస్తారాబాద్లో ఉండే ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యావేత్త, ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్‌ను సంప్రదించారు. చార్మినార్‌తోపాటు నగర నిర్మాణానికి తన సేవలు అందిస్తానని ఆయన ఒప్పుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా గోల్కొండకు వచ్చి మహ్మద్ కులీని కలిశారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన మహ్మద్ కులీ ప్రధానమంత్రిగా నియమించారు. చార్మినార్, నగర నిర్మాణ బా«ధ్యతలు సైతం అప్పగించారు. దీంతో మీర్ మొమిన్ మూడేళ్లు శ్రమించి చార్మినార్ నిర్మాణానికి పలు డిజైన్లు రూపొందించి రాజుకు చూపించాడు. వాటిని పరిశీలించిన రాజు ఎన్నో మార్పులు సూచించారు. అంతే కాదు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉన్న అన్ని సౌకర్యాలు ఉండేలా నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో ఇరాక్‌లో ఉన్న ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగా నాలుగు మీనార్లు ఉండేలా చార్మినార్, ఇరాన్‌లోని ఇస్వాహాన్ మాదిరిగా నగరం నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. చార్మినార్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే సుస్థిరంగా ఉంటుందో తెలుసుకునేందుకు పలు భూగర్భ పరీక్షలు చేశారు. మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలను తవ్వి అక్కడి నేలనూ పరీక్షించారు. గోల్కొండ నుంచి ముసొలి పట్నం(మచిలీపట్నం) వెళ్లే మార్గంలో తూర్పు నుంచి పడమరకు 90 డిగ్రీల యాంగిల్లో ఉత్తరం దక్షిణాన్ని కలిపేలా చార్మినార్ నిర్మించాలని నిర్ణయించారు. చార్మినార్‌కు నాలుగు వైపులా వెడల్పైన రోడ్డు ఉండేలా ప్రణాళికలు చేశారు. చార్మినార్‌కు పడమర వైపు బజార్ ఏర్పాటు చేయాలని, ఉత్తర దిశలో 100 మీటర్ల ముందు చార్సూహౌస్(నేడు గుల్జార్‌హౌస్) నిర్మించాలని నిర్ణయించారు. దానికి నాలుగు వైపులా కమాన్లు నిర్మించాలని ప్లాన్ వేశారు. ఈ నాలుగు కమాన్ల నుంచి నాలుగు రోడ్లు నాలుగు దిక్కులా నగరంలోకి వెళ్లేలా మార్గాలు వేయాలని, కమాన్ల పడమర వైపు రాజమహల్ నిర్మించాలని, తూర్పు వైపు ప్రజల కోసం ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. చార్మినార్‌ను కేంద్రంగా చేస్తూ నగరం అంతా ఐదు మైళ్లు ఉండేలా నాలుగు వైపులా రోడ్డు ఏర్పాటు చేయాలని, నగర ప్రధాన రోడ్లు 100–120 అడుగులు, అంతర్గత రోడ్లు 50–60 అడుగులు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతి ఇంటి ముందు, వెనుక ఖాళీ ప్రదేశం ఉండేలా ఇళ్ల నిర్మాణం.. నీటి అవసరాలకు బావి ఉండాలని ప్రణాళిక వేశారు. తొలి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ గోల్కొండ కోటకు దుర్గం చెరువు నుంచి నీటి సరఫరా వ్యవస్థ ఉంది. చార్మినార్‌పై ఓ పెద్ద హౌస్ ఉండేది. జల్పల్లి చెరువు నుంచి భూగర్భ పైప్‌లైన్ ద్వారా టొపోగ్రఫీ పద్ధతిలో చార్మినార్‌పై ఉన్న హౌస్‌లో నీళ్లు వచ్చేవి. చార్మినార్ పైకి వెళ్లే వారికి అక్కడ నీటి అవసరాల కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నేటికీ చార్మినార్ పైన చూస్తే నాటి పైప్లైన్ల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక ప్రతి ఇంట్లో బావులు ఉండేవి. నగర ప్రజలందరు బావి నీరే తాగే వారు. ఆ రోజుల్లో ధనవంతులు పుణ్యకార్యంగా భావించి ప్రజల సౌకర్యార్థం బావులు తవ్వించే వారు. బావులు లేని ప్రజలు వీటిని ఉపయోగించే వారు. నీటి సమస్య ఉంటే ఆ ప్రదేశాల్లో ప్రభుత్వమే బావులు తవ్వించింది. నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాటసారుల సౌకర్యార్థం కార్వన్ సరాయితో పాటు మసీదులు, దేవాలయాల్లో విశ్రాంతి గదులు నిర్మించారు. మూసీ పక్కనే ఎందుకు.. మూసీ నది పక్కనే నగరం నిర్మించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. నది ఓడ్డున ఎత్తైన, గట్టి భూమి ఉండటం ఒక కారణమైతే.. నగరంలో భూగర్భ నీటి మట్టం ఎక్కువగా ఉండాలని భావించడం మరో కారణం. నగర ప్రజలు ఇళ్లలో బావులు తవ్వితే తక్కువ లోతులోనే నీళ్లు అందుబాటులోకి రావాలని, మట్టం తక్కువగా ఉండాలని మూసీ పక్కనే నగర నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అలాగే నది పక్కన ఉంటే కాలుష్య రహితంగా నగర వాతావరణం ఉంటుందని ఈ దిశగా నగర నిర్మాణం చేపట్టారు. నాటి గొల్లకొండే..నేటి గోల్కొండ.. గోల్కొండ కోట చరిత్ర వెయ్యేళ్ల కంటే ఎక్కువే. ఈ కోట నుంచే కాకతీయుల పాలన సాగింది. అనంతరం తుగ్లక్ వంశం ఢిల్లీ నుంచి పాలించింది. ఆ తర్వాత బహమనీ సుల్తాన్ పరిపాలనలోకి వచ్చింది. కాకతీయుల కాలం నుంచి ఈ కోట మట్టి కోటగానే ఉంది. మొదట్లో ఈ కోటను గొల్లకొండ అనే వారు. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా.. సారవంతమైన నేలతో ఎటుచూసినా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేది. ఈ ప్రదేశంలో ఎక్కువగా గొల్లవారు నివసించేవారు. కోట చుట్టూ ఉన్న ప్రాంతంలో కాపరులు పశువులను మేత కోసం ఇక్కడికే తీసుకొచ్చేవారు. దీంతో గొల్లకొండగా పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా గోల్కొండగా మారింది. నగర ఏర్పాటు నుంచే మురికి నీటికి భూగర్భ వ్యవస్థ ఇరాన్‌లోని ఇస్వాహాన్ నమూనాలో నగర ఏర్పాటుకు ప్రణాళికలు వేశారు. అక్కడి మాదిరే నగరంలో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటి కోసం అంతర్గత మోరీలు నిర్మించారు. నగరంలోని మట్టి రోడ్లపై దుమ్మూధూళీ రేగకుండా రోజుకు ఒకసారి నీళ్లు చల్లాలని.. రాజమహల్ నుంచి వచ్చే నీరు భూఅంతర్భాగం నుంచి వెళ్లేలా మట్టి పైపులు అమర్చాలని ప్లాన్ చేశారు. పాలకులు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులకు మాత్రమే రెండు, మూడు అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఉండేవి. నగర ప్రజల అవసరాల కోసం మూసీ నది ఓడ్డున విశాలమైన ప్రదేశంలో దారుషిఫా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. మసీదులు, దేవాలయాల్లో విద్యాబోధన, ప్రతి వీధిలో మలుపు వద్ద ఎత్తయిన స్తంభాలు ఏర్పాటు చేసి వాటిపై రాత్రి పూట కాగడాలు అమర్చాలని నిర్ణయించారు. నగర ఐదు మైళ్ల సరిహద్దులో దాదాపు 1,200 మహళ్లు, 14,000 ఇళ్లు, దుకాణాలు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పటికీ నగర రోడ్లు, వీధులు ఉండటం గమనార్హం. నగర నిర్మాణానికి ముందే 5 వేల మొక్కలు మీర్ మొమిన్ నగర ప్లాన్‌లో భాగంగా ఏ ప్రదేశాల్లోనైతే రోడ్లు, విశాలమైన ప్రదేశాలు ఉంచాలని నిర్ణయించారో ఆ ప్రదేశాలతో పాటు చార్మినార్, గుల్జార్ హౌస్ నుంచి నాలుగు వైపులా వెళ్లే అన్ని మార్గాల ఇరు పక్కలా చెట్లు నాటారు. మహల్, భవనాల ముందు వెనుక, ఇళ్ల ముందు వెనుక, ప్రతి మసీదు, దేవాలయం, సరాయి లోపలా బయటా చెట్లు నాటారు. నగరంలో సారవంతమైన(మొక్కలు ఎదగడానికి దోహదపడే) భూమిని ఎంపిక చేసి అందులో ప్రజల అవసరాల కోసం ఐదు వేల ఔషధ మొక్కలను పెంచారు. మూసీ ఒడ్డున పచ్చదనం కోసం పెద్ద పెద్ద చెట్ల మొక్కలను నాటారు. నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరు పక్కలా నిడనిచ్చే పెద్ద చెట్ల మొక్కలను నాటారు. దీంతో నగరం ఏర్పాటుతోనే గ్రీన్ సిటీగా పిలిచేవారు. నగరంలో ఆ రోజుల్లో దాదాపు 10 వరకు పార్కులు ఉండేవి. తొలి మాస్టర్ ప్లాన్.. పురానాపూల్ పురానాపూల్ వంతెన పురానాపూల్ వంతెన నిర్మాణాన్ని హైదరాబాద్ ఏర్పాటులో తొలి మాస్టర్ ప్లాన్‌గా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే పురానాపూల్ నిర్మాణంతోనే గోల్కొండ కోట నుంచి మూసీ నది దాటి వేరే ప్రదేశానికి వచ్చే మార్గం ఏర్పాటైంది. పారిస్‌లోని సైనీ నది మీద నిర్మించిన పాంట్ మేరీ వంతెన మాదిరిగా పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురానాపూల్ వంతెనను ఆర్చ్‌లతో నిర్మించారు. పురానాపూల్ నిర్మాణం అనంతరం కోట నుంచి పలువురు సంస్థాన ఉన్నతాధికారులు తమ నివాసాలను మూసీ దక్షిణ భాగంలో కొత్త నగర నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతానికి మార్చారు. రాజు అనుమతి తీసుకుని మూడు, నాలుగు భవంతులను ఆ ప్రాంతంలో నిర్మించారు. 1580లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణించాడు. అనంతరం ఆయన కుమారుడు మహ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సంస్థాన పాలకుడిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే అప్పటికి గోల్కొండ కోట జనంతో ఇరుకైపోయింది. జనాభా విపరీతంగా పెరగడంతో రోగాలు విజృంభించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తండ్రి కోరిక మేరకు మూసీ దక్షిణాన నగరం నిర్మించాలని మహ్మద్ కులీ అధికారులను ఆదేశించాడు. చార్మినార్‌కు పడమర వైపు రాజమహళ్లు నగరాభివృద్ధికి ముందు చార్మినార్ ప్రాంతం చార్మినార్ ముందు గుల్జార్‌హౌస్‌కు పడమర వైపు రాజుతో పాటు సంస్థాన ఉన్నతాధికారుల కోసం దాద్ మహల్, కుదాదాద్ మహల్, సాజన్ మహల్, లాఖా మహల్, నాది మహల్ ఇలా రాజమహళ్లు నిర్మించారు. కుదాదాద్ మహల్ ఏడు అంతస్తులతో నిర్మించారు. ఆ రోజుల్లో అదే అతి ఎౖతయిన మహల్. మీర్ మొమిన్ ఇరాన్ దేశస్తుడు. ఆ రోజుల్లో ఇరాన్ ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా చలామణి అయింది. అక్కడి భవన నిర్మాణ శైలి ఆ రోజుల్లోనే అధునాతన శైలి. అందువల్ల హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని మహళ్లు, భవనాలు, మసీదులు ఇరాన్ స్టైల్లో నిర్మించారు. తొలి పర్యాటక ప్రదేశం చార్మినార్ నుంచి దక్షిణం వైపు వెళ్లే మార్గంలో 4 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన కొండ కొహెతూర్ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఈ కొండపై రెండు విశాలమైన సారవంతమైన చబుత్రా మాదిరి ప్రదేశాలు ఉండేవి. ఇక్కడ మొక్కలు, చెట్లను నాటడంతో ఈ కొండ మొత్తం ఒక ఉద్యాన వనంగా మారింది. ఆ కొండే ఇప్పటి ఫలక్‌నుమా ప్యాలెస్. ఈ కొండపైకి రాజుతోపాటు ఉన్నతాధికారులు వెళ్లేవారు. గోల్కొండ కోట నుంచి ఈ కొండ నుంచి నగరం అంతా ఏరియల్ వ్యూ మాదిరిగా కనిపించేది. ఇప్పటికీ అదే మాస్టర్ ప్లాన్.. 1887లో హైదరాబాద్ విస్తీర్ణం, 1959లో హైదరాబాద్ విస్తీర్ణం నగర ఏర్పాటు సమయంలో చేసిన మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ప్రధాన రోడ్లు, వీధులతో పాటు భవన నిర్మాణ శైలి ఉండేది. కుతుబ్ షాహీల పాలనతో పాటు ఆసిఫ్ జాహీ పాలనా కాలం రెండో నిజాం పాలనా కాలం వరకు అదే కొనసాగింది. కుతుబ్ షాహీలు ఏర్పాటు చేసిన నగర పరిధిని 5 మైళ్ల నుంచి 10 మైళ్ల వరకు రెండో నిజాం అలీఖాన్ హయాంలో పెంచారు. నగరం చుట్టూ 12 దర్వాజాలు(తలుపులు), 12 కిటికీలు ఏర్పాటు చేశారు. మళ్లీ నగర మాస్టర్ ప్లాన్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో ప్రారంభమైంది. కానీ ఆయన కొద్ది రోజుల్లోనే మరణించారు. అనంతరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ హయాంలో హైదరాబాద్ నగర పునర్ నిర్మాణం జరిగింది. ఇలా నగర ఏర్పాటు సమయంలో సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్ ఏడో నిజాం హయాం వరకు కొనసాగింది. -
బ్రదర్స్ బాడీ బిల్డర్స్
బాడీ బిల్డింగ్ అంటే ఆ అన్నదమ్ములకు ఎంతో ఇష్టం. ఇంటి సమీపంలోని ఫిట్నెస్ క్లబ్‌ను చిన్నప్పటి నుంచి దైవంగా భావించేవారు. ఇప్పుడు అక్కడే శిక్షకులుగా మారారు. ఓవైపు చదువుకుంటూ.. మరోవైపు బాడీ బిల్డింగ్‌లో రాణిస్తున్నారు. వారే ముస్తఫా మెహసిన్, ముర్తుజా మెహసిన్. వీరి చిన్నాన్న మోతేశం అలీఖాన్ 2008లో మిస్టర్ వరల్డ్ పోటీలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరు పనిచేస్తున్నది.. రాటుదేలుతున్నది ఆయన ఫిట్నెస్ క్లబ్‌లోనే. మోతేశం పర్యవేక్షణలోనే వీరు శిక్షణ పొందుతున్నారు. కాలం ఎంతో విలువైనదని భావించే వీరు ఓవైపు డిగ్రీ చేస్తూనే.. మరోవైపు లక్ష్య సాధనకు శ్రమిస్తున్నారు. పొద్దంతా విద్యాభ్యాసం, సాయంత్రం నుంచి రాత్రి వరకు జిమ్‌లో ప్రాక్టీస్.. ఇదే వీరి జీవనం ఇప్పుడు. బంగారం, వెండి.. మనదేనండి ముస్తఫా డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ముర్తుజా మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం. ముస్తపా ఇప్పటికే ‘మిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ’ పోటీలో సిల్వర్ మెడల్, మిస్టర్ తెలంగాణ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. ముర్తుజా మిస్టర్ తెలంగాణ పోటీల్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. నవంబర్‌లో బెంగళూర్‌లో జరిగిన ‘మిస్టర్ మజిల్ మేనియా’ బాడీ బిల్డింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్ చాంపియన్‌షిప్–2017లో పాల్గొని సత్తా చాటారు. దేశం నలుమూలల నుంచి 300 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్న ఈ పోటీల్లో... ముర్తుజా బంగారు పతకం సాధించగా, ముస్తఫా సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ప్రోత్సాహం అవసరం నేను 2008లో అమెరికాలో జరిగిన ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నన్ను బాగా ప్రోత్సహించారు. ఆయన కొన్ని ప్రోత్సాçహకాలు ప్రకటించారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇతర క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లుగానే మాకూ సాయం చేయాలి. – మీర్ మోతేశం అలీఖాన్, ప్రపంచ బాడీ బిల్డర్ చిన్నాన్న మోతేశంతో అన్నదమ్ములు