markets
-
రైతు బజార్లలో సబ్జి కూలర్లు
కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగాయలతోపాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్ లేదా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. – సాక్షి, అమరావతిమూడు మోడల్స్‌లో సబ్జి కూలర్లుఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసింది.వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.కుప్పంలో 50 మంది రైతులకు...కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్ ఆర్గజనైషన్స్(వీవో) భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. -
టమోటా రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
-
బక్రీద్ వేడుక: మేకలు, గొర్రెలతో మార్కెట్లలో నెలకొన్న సందడి
-
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎం అండ్ ఎం, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సియెట్, ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓరియెంట్ హోటల్స్, యాత్రా ఆన్లైన్ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. -
‘సమీకృతం’... మార్కెట్లు నిర్మాణంలో జాప్యం!
భైంసాటౌన్(ముధోల్): పట్టణాల్లో కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు... ఇలా అన్ని మార్కెట్లు ఒకేచోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో సమీకృత మార్కెట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెండెకరాల స్థలంలో వెజ్, నాన్‌వెజ్, పూలు, పండ్ల దుకాణాలు ఒకే ఆవరణలో ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భైంసా, ఖానాపూర్‌లో ఏడాదిన్నరగా పనులు కొనసా...గుతుండగా, నిర్మల్‌లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక పనుల్లో జాప్యం నెలకొందనే విమర్శలున్నాయి. ఎప్పటికి పూర్తయ్యేనో? జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల సమీకృత మార్కెట్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను పబ్లిక్‌హెల్త్ శాఖకు అప్పగించింది. వారు టెండర్లు పిలిచి, గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. 2021లోనే స్థలాలు పరిశీలించగా నిర్మల్ మినహా భైంసా, ఖానాపూర్‌లలో స్థలాలు ఎంపిక చేసి పనులు సైతం ప్రారంభించారు. నిర్మల్‌లో ఆర్టీసీ స్థలం పరిశీలించినా సంస్థ స్థలం ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో మరోచోట పరిశీలించారు. భైంసా, ఖానాపూర్‌లో పనులు ప్రారంభించినా ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నాయి. దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు కొనసాగే దశలోనే ఉన్నాయి. అఽధికారులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ● నిర్మల్‌లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సంస్థ స్థలం పరిశీలించగా వారు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పాత తహసీల్దార్ కార్యాలయం స్థలంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. రెండు, మూడురోజుల్లో పాత భవనం కూల్చివేసి పనులు ప్రారంభించనున్నట్లు అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రూ.7.20 కోట్లతో దాదాపు 140 దుకాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ● భైంసా పట్టణంలోని మిర్చి మార్కెట్ యార్డులో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. రూ.7.20 కోట్ల నిధులతో 90 (26నాన్‌వెజ్, 64వెజ్) దుకాణాలతో సముదాయం నిర్మిస్తున్నారు. ఇక్కడ వెజ్ బ్లాక్ పనులు స్లాబ్ లెవల్ వరకు కాగా నాన్‌వెజ్ బ్లాక్ రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ● ఖానాపూర్‌లో రూ.3.90 కోట్లతో మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టగా దాదాపు 40 శాతానికిపైగా పూర్తయ్యాయి. 20 వెజ్, 20 నాన్‌వెజ్ దుకాణాలు నిర్మిస్తుండగా రెండు రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు వరకు వినియోగంలోకి... భైంసా, ఖానాపూర్‌లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నా.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తయ్యేలా చూస్తాం. నిర్మల్‌లో పాత తహసీల్దార్ కార్యాలయం స్థలం పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – హరిభువన్గౌడ్, పబ్లిక్ హెల్త్ ఏఈ -
రియల్మీ దూసుకొస్తోంది..దిగ్గజాలకు గట్టి షాకిస్తుందా?
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ కూడా త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించ నున్నది. ఈ విషయాన్ని రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. తద్వారా ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో ఆకట్టు కుంటున్న శాంసంగ్, హువావే వివో, ఒప్పో, టెక్నో, మోటరోలా, షావోమీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సీఈవో మాధవ్ సేథ్ తమ ఫోల్డబుల్ ఫోన్ గురించి ట్వీట్ చేశారు రియల్మీఫోల్డ్, రియల్మీ ఫ్లిప్ ఈ రెండింటిలో ఏది కావాలి అని ప్రశ్నించారు. తద్వారా రియల్మీ ఫోల్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై కీలక సంకేతాలిచ్చారు. మరోవైపు 2022 నవంబరులోనే రియల్మీ చైనా వైస్ ప్రెసిడెంట్ జుక్వి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఎఫర్డబుల్ ఫోల్డబుల్‌పై పనిచేస్తోందని హింటిచ్చారు. ప్రతీ ఏడాది రెండు GT నియో-బ్రాండెడ్ ఫోన్లు, నంబర్ సిరీస్ ఫోన్లు రెండు, ఒక GT సిరీస్ మోడల్‌ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ , Z ఫ్లిప్ తోపాటు, షావోమీ మిక్స్ ఫోల్డ్2, మోటరోలా రేజర్, ఒప్పో ఫైండ్ ఎన్2 ప్లిప్, టెక్నో పాంథమ్ వీ ఫోల్డ్ వంటి ఆప్షన్లతో ఫోల్డబుల్ ఫోన్లు స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే వన్‌ప్లస్, పిక్సెల్ ఫోల్డబుల్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ఇకపై రియల్మీ కూడా చేరనుంది. What do you want next… #realmeFlip or #realmeFold? — Madhav Sheth (@MadhavSheth1) March 9, 2023 -
భాగ్యనగరంలో దీపావళి పండగ శోభ (ఫొటోలు)
-
పెట్టుబడులు ఆలస్యం అయితే ఏంటి మార్గం?
పెట్టుబడులు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ అస్థిరతలు, జాగ్రత్తలపై నిపుణులు, వాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహాలు ఎవరైనా ఒకరు ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే.. అప్పటి వరకు నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేది ఎలా? నేను 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి నిధిని సిద్ధం చేసుకోవడం ఎలా? – సురేష్ మరీ అంత ఆలస్యం ఏమీ కాలేదు. మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు 20–25 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం సరిపోతుంది. అంతేకాదు, మీరు అనుకున్న 55 ఏళ్లకు రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడుల మొత్తం తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. ఈక్విటీల్లో పెట్టుబడులు కొంత భాగం అలానే కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. కనుక వెంటనే ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు మంచి ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మ్యాజిక్ సాధ్యపడుతుందన్నది ఇన్వెస్టర్లు నమ్మే అంశం. అది జరగాలంటే మరింత పెట్టుబడి పెట్టాలన్నది గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధిగా అది ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే మార్గం. మార్కెట్లు తీవ్ర అస్థిరతలు ఎదుర్కొంటున్నాయి.. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ మార్కెట్లలో ఇప్పుడు అస్థితరలు ఎదుర్కొంటున్నది నిజం. ఇప్పుడనే కాదు గతంలోనూ అస్థిరతలను చూశాం. భవిష్యత్తులో ఈ ఆటుపోట్లు మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్విటీలంటేనే అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకుండా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు నిజంగా సంతోషాన్నివ్వాలి. ఎందుకంటే ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే నానా రకాల సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. -
పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్లు ఉన్నాయి. బుల్లెట్ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!. కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్‌వాలా.. పాకిస్థాన్ గన్మార్కెట్లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తాలిబన్ల ఖండన.. అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్‌ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం లూట్ కా మాల్! అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్‌బేస్‌కు పవర్‌కట్ చేసి గప్‌చుప్‌గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి. చదవండి: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ -
చైనాలో ఆంక్షలు..! వారికి ఆశాదీపంలా ఎయిరిండియా-టాటా డీల్..!
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాను టాటా గ్రూప్ సన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాను బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లకు దక్కించుకుంది. డిసెంబర్ చివరి నాటికి ఎయిరిండియా-టాటా మధ్య డీల్ పూర్తి అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియా డీల్ భారత మార్కెట్లకు సరికొత్త వేగాన్ని అందించింది. చైనాలో ఉక్కుపాదం...! గత కొద్ది రోజులుగా పలు ప్రైవేట్ కంపెనీలపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచంలో అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా తమ సొంత కంపెనీలపై జిన్‌పింగ్ ప్రభుత్వం భారీగా ఆంక్షలను పెడుతుంది. ఇతర దేశాల్లో పెట్టుబడులను నిలిపివేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండ్ సంక్షోభంతో..పలు ప్రైవేట్ కంపెనీలపై చైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఎవర్‌గ్రాండే గ్రూప్, రైడ్, హైలింగ్ దిగ్గజం దీదీ గ్లోబల్ ఇంక్ సంస్థలపై అక్కడి ప్రభుత్వం తనిఖీలను నిర్వహిస్తోంది. బ్యాంకులు, పెట్టుబడి నిధులు, ఫైనాన్షియల్ రెగ్యులేటర్లపై చైనా ఓ కన్నేసింది. ఎయిరిండియా-టాటా డీల్ సానుకూల పవనాలు..! ఎయిరిండియా-టాటా డీల్ భారత మార్కెట్లకు సానుకూల పవనాలు వీచేలా కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను వేగంగా చేస్తోంది. దీంతో ప్రైవేటు సంస్థలు ఆయా పీఎస్యూలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటు పెట్టుబడిదారులను గణనీయంగా ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈక్విటీ మార్కెట్లలో స్థిరమైన వృద్ధి కన్పించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఈక్విటీ ల్యాండ్‌స్కేప్ ప్రైవేటికరణతో మరిన్ని పెట్టుబడి ప్రవాహాలు, స్టాక్స్ భారీ లాభాలను గడిచే అవకాశాలు ఉన్నాయని స్మార్ట్సన్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్ సుమీత్ రోహ్రా పేర్కొన్నారు. చైనాలో కొనసాగుతున్న రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌తో భారత స్టాక్‌మార్కెట్లు, ఇతర ఐపీవో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. రికార్డ్-తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్-ఇన్వెస్టింగ్ బూమ్, టెక్ లిస్టింగ్‌ల కారణంగా, భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది 37శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిరిండియా-టాటా ఒప్పందం దేశంలోని ప్రైవేట్ ఎంటర్ప్రైజ్లకు నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఒక సంకేతం మాత్రమే కాదు, ప్రైవేట్ యజమానులను త్వరగా పొందాలనే అంచనాలపై ప్రభుత్వరంగ సంస్థల స్టాక్స్ విలువలను పెంచుతుందని రోహ్రా చెప్పారు. చదవండి: వారెట్‌బఫెట్ ఆఫ్ ఇండియా లక్కు.. టాటా మోటార్స్‌తో భారీ సంపాదన -
‘కూరలో కరివేపాకు’ అని తీసిపారేయకండి!
సాక్షి, హైదరాబాద్: ‘కూరలో కరివేపాకు’ అని ఇప్పుడు తేలికగా తీసిపారేయకండి. కరివేపాకుకూ ఇప్పుడు డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గి...కొరత ఏర్పడడంతో నగరంలో కరివేపాకు ధరలకు రెక్కలొచ్చాయి. మునుపెన్నడూ లేనివిధంగా హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.120 పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో ఒక కట్ట రూ. 5-10కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కరివేపాకుకు సీజన్ కాకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగాయి. గ్రేటర్ పరిధిలోని హోల్‌సేల్, రిటైల్, రైతుబజార్లకు రోజు దాదాపు 10 టన్నుల వరకు దిగుమతి అవుతుంది. కరోనా కారణంగా గత పది నెలలుగా కరివేపాకు వినియోగం కూడా బాగా పెరిగింది. కరివేపాకులో లభించే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిలో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్, ఇనుము, కాల్షియం, పాస్ఫరస్, పీచు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుదల పరిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుందని గ్రేటర్ జనం కరివేపాకును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరల్లో వాడడమే కాకుండా కరివేపాకు పొడిని ప్రత్యేకంగా తయారు చేసి కూడా అన్నంతోపాటు తీసుకుంటున్నారు. మూడింతలైన ధర గ్రేటర్లో కరివేపాకుకు డిమాండ్ పెరిగిందని మీరాలం మండి ఆకుకూరల వ్యాపారి బి.లలిత చెప్పారు. గతంలో కేజీ రూ. 40 ఉండగా ప్రస్తుతం రూ.120 ఉందన్నారు. శివారు జిల్లాల నుంచి నగరానికి కరివేపాకు దిగుమతి అవుతున్నా ప్రస్తుతం డిమాండ్‌కు సరిపోవడం లేదన్నారు. దీంతో విజయవాడ నుంచి కూడా కరివేపాకు దిగుమతి చేసుకుంటున్నారు. చదవండి: ఆక్సిజన్ ఉండేది 100 కోట్ల ఏళ్లే.. 5 అడుగుల విషనాగు.. ఒంటి చేత్తో పట్టుకొంది! -
బంగారం మరింత దిగొస్తుందా?
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం 1,815 డాలర్ల వద్ద ముగిసింది. అంతక్రితం వారం (జనవరి 29) ముగింపుతో పోల్చితే దాదాపు 70 డాలర్లు పతనమైంది. వారం ట్రేడింగ్ ఒక దశలో 100 డాలర్ల మేర పతనమైంది. ఇప్పుడు బంగారం పయనంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మార్కెట్ నిపుణులు క్రిస్టోఫర్ లివీస్ అంచనాల ప్రకారం.. పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో 1,750 డాలర్ల దిగువకు పడిపోతే మరింత పతనం వేగంగా జరిగే అవకాశం ఉంది. 50 వారాల ఈఎంఏ (ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్) 1,786 డాలర్లకు గతవారం చివరిరోజు పసిడి తాకినప్పటికీ, ఆ స్థాయిలో మద్దతు తీసుకుని పైకి ఎగసింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి అమెరికా గణాంకాలు పేలవంగా ఉండడం దీనికి కారణం. 1,750 డాలర్ల వద్ద తక్షణ మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని బంగారం నిలబెట్టుకోగలిగితే, 1,850 డాలర్ల స్థాయికి తిరిగి పసిడి ఎగసే అవకాశాలు ఉన్నాయి. వడ్డీరేట్లు, డాలర్ కీలకం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్ కదలికల (5వ తేదీ డాలర్ ఇండెక్స్ ముగింపు 90.96), కరోనా వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వడ్డీరేట్లు పెరిగితే అది పసిడికి ప్రతికూల వార్తగా మారే అవకాశం ఉంది. వడ్డీరేట్ల పెరుగుదల డాలర్ బలోపేతం కావడానికి దారితీస్తుంది. ఈ అంశం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది. దేశీయంగా రూపాయి కీలకం దేశీయంగా పసిడి ధరలు డాలర్ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి బలోపేతం అయ్యే వీలుంది. అయితే తీవ్ర స్థాయిలో రూపాయి ప్రస్తుతం బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ. 5వ తేదీతో ముగిసిన వారంలో రూపాయి విలువ 72.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). భారత్ రూపాయి పటిష్టానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉందని వాట్ స్ట్రీట్ బ్రోకరేజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇటీవలి తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక విడుదల సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్టులు ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్తా గోద్వానీ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 మార్చి) జనవరి వరకూ ఆర్బీఐ తన ‘ఫారెక్స్ ఇంటర్వెన్షన్’ ద్వారా రూపాయి బలోపేతానికి 73.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉంది. ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే మినహా’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా. -
ఫండ్స్‌లో వరుసగా ఆరో నెలా అమ్మకాలే
న్యూఢిల్లీ: మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వరుసగా ఆరో నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో (ఎంఎఫ్) అమ్మకాలు కొనసాగాయి. నవంబర్‌లో ఈక్విటీల నుంచి 30,760 కోట్ల పెట్టుబడులను ఫండ్స్ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెబీ గణాంకాల ప్రకారం జూన్ నుంచి ఇప్పటిదాకా రూ. 68,400 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ జరిగింది. అయితే, ఇతరత్రా వచ్చిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తొలి 11 నెలల్లో (జనవరి–నవంబర్) నికరంగా రూ. 28,000 కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. ఇదే వ్యవధిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 1.08 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలు ఎలా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐల ఊతంతో మార్కెట్లు గత కొద్ది నెలలుగా పెరుగుతూనే వచ్చాయి. ‘మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరడం, నిఫ్టీ వేల్యుయేషన్ 36 రెట్ల స్థాయికి చేరడం వంటి అంశాల కారణంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. సెప్టెంబర్–అక్టోబర్‌తో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా పెరగడం ఇందుకు నిదర్శనం‘ అని ప్రైమ్‌ఇన్వెస్టర్‌డాట్‌ఇన్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. ఈక్విటీ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చే దాకా ఈ ధోరణి కొనసాగవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లు కరెక్షన్కు లోనైనా, దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపించినా ఫండ్లు మళ్లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టొచ్చని మార్నింగ్‌స్టార్ ఇండియా డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ తెలిపారు. -
కీలక నిర్ణయం : సంతల్లో షావోమి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ విక్రయాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షావోమి ట్రావెలింగ్ స్టోర్ ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుందన్నమాట. ఇందులో స్మార్ట్ఫోన్లతోపాటు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇయర్ ఫోన్లు, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంకులు ఇలా పలు ఉత్పత్తులను విక్రయించనున్నట్లు షావోమి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "ఎంఐస్టోర్-ఆన్-వీల్స్" ను ప్రారంభించడం సంతోషంగా ఉందని షావోమి ఇండియా సీఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. మూవింగ్ స్టోర్ ద్వారా రీటైల్ అనుభవాన్ని గ్రామీణులకు చేరువ చేస్తున్నామని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన తమ ఆఫ్‌లైన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని మరో ట్వీట్ లో జైన్ వెల్లడించారు. అన్ని ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇ్ండియా, మేక్ ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్ అంటూ ట్వీట్ చేశారు. తమ స్టోర్-ఆన్-వీల్స్ అవుట్లెట్లు ప్రస్తుత కరోనా సమయంలో పూర్తిగా సురక్షితంగా ఉంటాయని ఎంఐ ఇండియా సీఓఓ మురళీకృష్ణన్ తెలిపారు. అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్వర్క్ ఉన్న తాము ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోనున్నామని చెప్పారు. కాగా కరోనా సంక్షోభం, లాక్ డౌన్, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, చైనా ఉత్పత్తులపై నిషేధం డిమాండ్ లాంటి ఎదురుదెబ్బల మధ్య కూడా షావోమి జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. "Mi"les to go before we sleep! Excited to launch "#MiStore-on-wheels", an innovative concept that brings #retail experience to the heart of #India, connecting villages through a moving store. So proud of our #offline #team who completed this project in just 40 days. I ❤️ Mi pic.twitter.com/7OECCNnlgb — Manu Kumar Jain (@manukumarjain) September 21, 2020 -
11,500 పైకి నిఫ్టీ
చివరి గంటలో కొనుగోళ్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయినా 3 పైసల లాభంతో 74.30 వద్ద ముగియడం.... కలసి వచ్చాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైకి, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో నెలలో ముగియనుండటంతో సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 39,074 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,550 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ ఎగిశాయి. 2020 జనవరి తర్వాత ఈ సూచీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. యూరప్ మార్కెట్ల జోష్..! సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ. నష్టాల మధ్య దోబూచులాడాయి. జర్మనీ, ఫ్రా¯Œ ్సల్లో అదనంగా మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చన్న అంచనాలతో యూరప్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లో చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో 79 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 268 పాయింట్లు ఎగసింది. రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ♦ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 6 శాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ♦రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.2,137 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంలో దాదాపు సగం వాటా ఈ షేర్‌దే. ♦టూవీలర్లపై జీఎస్టీని తగ్గిస్తారన్న అంచనాలతో టూవీలర్ కంపెనీ ∙షేర్లు లాభపడ్డాయి. హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో షేర్లు 2–6 శాతం రేంజ్లో పెరిగాయి. ♦టాటా మోటార్స్ షేర్ లాభాలు కొనసాగాయి. 8 శాతం లాభంతో రూ.137 వద్ద ముగిసింది. మూడేళ్లలో రుణ భారాన్ని పూర్తిగా తగ్గించుకుంటామని ఈ కంపెనీ మంగళవారం పేర్కొంది. ♦దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వాబ్కో ఇండియా, హీరో మోటోకార్ప్, ఆఫిల్ ఇండియా, అదానీ గ్యాస్, ఇమామి, తాన్లా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ♦దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. డిష్ టీవీ, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనా¯Œ ్స, రెప్కో హోమ్ ఫైనా¯Œ ్స, వెల్స్ప¯Œ ఇండియా, సుబెక్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 11,850కు నిఫ్టీ...! నిఫ్టీ 11,500 పాయింట్ల కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో నేడు(గురువారం) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగవచ్చని చార్ట్‌వ్యూఇండియాడాట్ ఇన్ ఎనలిస్ట్ మజ్హర్ మహ్మద్ అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సమీప భవిష్యత్తులో 11,850కు చేరవచ్చన్నారు. కాగా దాదాపు అన్ని కీలక నిరోధాలను నిఫ్టీ అధిగమించిందని కొందరు టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ 11,400 ఎగువన కొనసాగినంత కాలం ఇదే జోరు ఉంటుందని, ఈ స్థాయి కంటే దిగువకు వస్తే, తదుపరి మద్దతు 11.250 పాయింట్లని వారంటున్నారు. -
పట్టణాల్లో ‘పాదచారుల మార్కెట్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇక ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లు రానున్నాయి. అంటే పాదచారులకు మాత్రమే అనుమతిస్తూ కొన్ని మార్కెట్లను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. వీటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆమోదించిన పులివెందుల మోడల్ సిటీ ప్రణాళికలోనే ఈ ప్రతిపాదనను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ఏర్పాటు చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత పెరగడంతో ప్రత్యేకంగా పాదచారుల మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై రాష్ట్ర పురపాలక శాఖ ఇప్పటికే కార్యాచరణకు ఉపక్రమించింది. ఇదీ విధానం ► జనసాంద్రత, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాల్లో పాదచారులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా కొన్ని మార్కెట్లను గుర్తిస్తారు. ► ఆ మార్కెట్లలోకి ద్విచక్ర వాహనాలతోపాటు ఎలాంటి వాహనాలను అనుమతించరు. నడచుకుంటూనే వెళ్లి షాపింగ్ చేయాలి. ఇవీ లక్ష్యాలు ► ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. ► కొనుగోలుదారులు భౌతికదూరం పాటిస్తూ షాపింగ్ చేయొచ్చు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే ► అన్ని నగరాలు, పట్టణాల్లో పురపాలక శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలి. ► 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో కనీసం మూడు మార్కెట్లను, అంతకంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు పట్టణాల్లో కనీసం ఒక మార్కెట్‌ను ఏర్పాటు చేయలి. ► మార్కెట్లలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, గార్బేజ్ కలెక్షన్ పాయింట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ► ఈ మార్కెట్ల ప్రాథమిక ఎంపిక జూన్ 30కి పూర్తి చేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ప్రణాళిక ఖరారు చేసి నవంబర్ 30నాటికి ప్రారంభించాలి. ► చెన్నై, పూణేల్లోని పాదచారుల మార్కెట్లను మోడల్‌గా తీసుకోవాలి. ప్రభుత్వం ఇలా చేయనుంది... ► అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో మార్కెట్‌ను గుర్తించనున్నారు. హా విజయవాడలో బీసెంట్ రోడ్డును ‘పాదచారుల మార్కెట్’గా చేయాలని నిర్ణయించారు. ► విశాఖపట్నంలో పూర్ణా మార్కెట్‌తోపాటు మరొకటి, తిరుపతిలో కేటీ రోడ్డులో మార్కెట్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ► పులివెందుల మోడల్ సిటీపై రూపొందించిన ప్రణాళికలో ఈ ప్రతిపాదన చేర్చగా సీఎం ఆమోదముద్ర వేశారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు పాదచారుల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం.’ –విజయ్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ -
కరోనా మార్కెట్లా!
రైతు బజార్లన్నీ మైదాన, ఖాళీ ప్రాంతాలకు తరలింపు.. మాస్కు లేనిదే లోపలకు నో ఎంట్రీ.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.. పర్యవేక్షణకు పోలీసులు.. రద్దీని నివారించేందుకు వారాంతపు సంతలు బంద్.. కాలనీలు, అపార్ట్మెంట్ల వద్దకే 200 మొబైల్ రైతు బజార్ల వాహనాల్లో కూరగాయల విక్రయాలు.. – ఇవీ హైదరాబాద్‌లో లాక్డౌన్ మొదట్లో కనిపించిన సన్నివేశాలు రైతు బజార్లలో కానరాని భౌతిక దూరం.. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం.. మాస్కులు ధరించడం తప్పనిసరి కాదన్నట్లుగా వ్యాపారుల్లో నిర్లక్ష్యం.. ప్రజల్లోనూ కొరవడిన లాక్డౌన్ నిబంధనల స్ఫూర్తి.. ఎక్కడా కానరాని పోలీసులు.. సంతల్లో కొనసాగుతున్న రద్దీ.. కాలనీల్లో పెద్దగా కనిపించని మొబైల్ రైతు బజార్ల వాహనాలు.– రాజధానిలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలివి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న కూరగాయలు, పండ్లు, చేపల మార్కెట్లలో మాత్రం ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావట్లేదు. వ్యాపారుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా వినియోగదారుల్లోనూ అప్రమత్తత తగ్గుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా మార్కెట్లలోని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించే వ్యాపారం చేయాలని అధికారులు సూచిస్తున్నా ఎక్కడా ఆ చర్యలు కనిపించట్లేదు. లాక్డౌన్ మొదట్లో భౌతికదూరం నిబంధనను పోలీసులు, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులు పక్కాగా అమలు చేయగా ప్రస్తుతం పూర్తిగా చేతులెత్తేయడంతో వ్యాపారులు ఇష్టారీతిన అమ్మకాలు సాగిస్తున్నారు. లాక్ తెరిచారు.. దూరం మరిచారు రాష్ట్రంలో లాక్డౌన్ మొదట్లో జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో భౌతికదూరం కచ్చితంగా పాటించేలా ప్రభుత్వ విభాగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ మార్కెట్లకు ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని ప్రధాన మార్కెట్ల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా వ్యాపారులు సైతం భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేసి వినియోగదారుల రద్దీని నిలువరించారు. దీన్ని అధికారులు పర్యవేక్షించారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ను కంటైన్మెంట్ ప్రాంతాలకే పరిమితం చేయడం, ప్రభుత్వ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో భౌతికదూరం నిబంధనను అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు విస్మరించారు. రాష్ట్రంలో మొత్తంగా 15 మార్కెట్ యార్డులు, 43 రైతు బజార్లు ఉండగా అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 12 రైతు బజార్లున్నాయి. రైతుబజార్లలో కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటున్నా చింతల్‌బస్తీ, మెహదీపట్నం, గోల్నాక, దిల్సుఖ్నగర్, రామంతపూర్, ఉప్పల్, గడ్డి అన్నారం, కూకట్పల్లి, రాంనగర్ చేపల మార్కెట్, సికింద్రాబాద్ ప్రైవేటు మార్కెట్లలో ఎక్కడా భౌతిక దూరమన్న మాటే కనిపించట్లేదు. ఈ ప్రాంతాలకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఇక మాస్కులు ధరించి విక్రయాలు చేయాలని పదేపదే కొరుతున్నా ఎక్కడా వ్యాపారులు దాన్ని పట్టించుకోవడం లేదు. తగ్గిన మొబైల్ రైతుబజార్లు.. కూరగాయల మార్కెట్లలో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు మార్కెటింగ్ శాఖ కరోనా లాక్డౌన్ మొదట్లో 250 మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసి 400 ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య సత్ఫలితాలిచ్చింది. కాలనీలు, అపార్ట్మెంట్ల వద్దకే కూరగాయల వాహనాలు రావడంతో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి తప్పింది. పైగా మార్కెట్లలోకన్నా కాస్త తక్కువ ధరకే తాజా కూరగాయలు ప్రజలకు లభించాయి. కానీ ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ను సడలించడంతో మొబైల్ వాహనాల సంఖ్యను అధికారులు వందకు తగ్గించారు. దీనికితోడు ప్రధాన మార్కెట్లకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ విస్తృతి పెరుగుతున్నా పట్టించుకోవట్లేదు. తమిళనాడులో కోయంబేడు మార్కెట్లో జరిగిన సామాజిక వ్యాప్తితో కేసులు పెరిగి అవి పొరుగునే ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు సైతం విస్తరించిన ఉదంతం కళ్లెదుటే కనబడుతున్నా అటు వ్యాపారులు.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం సామాన్యులను కలవరపెడుతోంది. -
మార్కెట్లో ఆశావాదమే గెలుస్తుంది: మార్క్ మోబీయస్
స్టాక్ మార్కెట్లో ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలుచుకోవాలని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్ పతనాన్ని తన పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చూసినప్పుడల్లా.., తాను కొనుగోలు చేసేందుకు ఇది అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు మోబీయస్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి, ప్రపంచదేశాల లాక్డౌన్ విధింపుతో స్టాక్‌మార్కెట్ల పతనంపై మోబీయస్ ఒక ప్రసంగంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘సంక్షోభ సమయాల్లో సానుకూల ధృక్పథంతో ఉండాలి. ఈ ప్రపంచం ఆశావాదులకు మాత్రమే సొంతమైంది. నిరాశావాదులు ఇక్కడ విజయాల్ని పొందలేరు. ఇప్పుడు స్టాక్స్ కొనడానికి సమయం వచ్చింది.” అని మోబీయస్ అన్నారు. ఈక్విటీ మార్కెట్లు వెనక్కి రావడంతో గతంలో చేసిన తప్పులు సవరించుకోవడానికి, తాజాగా మరికొన్ని సంస్కరణలు చేపట్టడానికి అవకాశం వచ్చినట్లు ఆయన తెలిపారు. తన పోర్ట్‌ఫోలియోలో చైనా, ఇండియా, టర్కీ, బ్రెజిల్, సౌత్ కొరియా, సౌతాఫ్రికా దేశాలకు చెందిన షేర్లు టాప్‌లో లిస్ట్‌లో ఉంటాయని తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే.. హెల్త్‌కేర్, ఎడ్యూకేషన్, ఇంటర్నెట్ ఆధారిత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మోబీయస్ చెప్పుకొచ్చారు. బేర్ మార్కెట్‌కు కాల పరిమితి చాలా తక్కువ. అయితే బుల్ ర్యాలీ ఎక్కువ రోజులు కొనసాగుతుందన్నారు. బేర్ మార్కెట్లను గరిష్టాల నుంచి కనిష్టాలకు లెక్కించాలి. అంతేకాని ఒక గరిష్టం నుంచి మరో గరిష్టానికి లెక్కించకూడదని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో కరెన్సీ పెరుగుదల కారణంగా మోబియస్ బంగారం పట్ల పాజిటివ్ అవుట్‌లుక్‌ను కలిగి ఉన్నారు. సేవింగ్స్‌లను ఫైనాన్షియల్ మార్కెట్లోకి తీసుకురావడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరమని అయన అన్నారు. ఈ ఏడాది కల్లా భారత్ గాడిలో పడుతుంది ఈ ఏడాది చివరి కల్లా భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ -19 తరువాత భారత్ అద్భుతమైన పనితీరు ఆకట్టుకుంటుంది. వేగంగా కోలుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి కల్లా చాలా వరకు ఆర్థిక వ్యవస్థ బౌన్స్ బ్యాంక్ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి భారత్‌కు అంతా మంచే జరగుతుందనే మోబీయస్ ఆశిస్తున్నారు. ఇప్పటికీ చాలా ఇండియా పేద దేశమని భ్రమపడుతున్నారని, వాస్తవానికి భారత్ సంపన్న దేశమని ఆయన అన్నారు. ఇక్కడ చాలా డబ్బు ఉందని అన్నారు. ఇండియా అవుట్‌లుక్ చాలా ఉన్నతంగా ఉంది. ప్రస్తుత పరస్థితి చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు గొప్ప అవకాశంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థాయి కంపెనీల ఎంపికలో క్యాలిటీ, వృద్ధి అంశాలను తీక్షణంగా పరిశీలించాలన్నారు. అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం భారత్‌కు లాభం అని ఆయన అభిప్రాయడ్డారు. భారత్‌ను సాఫ్ట్వేర్ సేవలకు అవుట్సోర్సింగ్ హబ్‌గా కాకుండా, మొబైల్ ఫోన్లు, ఇతర హార్డ్‌వేర్‌లకు అవుట్‌సోర్సర్‌గా మారాల్సిన అవసరం ఉందని మోబీయస్ అన్నారు. -
కరోనా, క్యూ4 ఫలితాలు కీలకం
న్యూఢిల్లీ: కరోనా కేసులు, కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపే కీలకాంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోందన్న ఆశలు ఉన్నాయి. మరోవైపు నేటి నుంచి లాక్డౌన్ దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా ఆరంభమవుతాయనే అంచనాలు మార్కెట్లో సెంటిమెంట్‌కు జోష్‌నివ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గమనం, ముడి చమురు ధరల కదలికలు, విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. ఈ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, ఏసీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, అలెంబిక్ ఫార్మా, మైండ్‌ట్రీ తదితర కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా, కరోనా వైరస్ ప్రభావం తమ వ్యాపారాలపై ఎలా ఉండనున్నదనే విషయమై కంపెనీలు వెల్లడించే అంచనాలపైననే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. బోర్డ్ మీటింగ్స్ ఇన్ఫోసిస్, టాటా ఎలెక్సీ, ఆదిత్య బిర్లా మనీ, లిండే ఇండియా 2 గంటల్లో సెటిల్ చేయండి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లపై ఐఆర్డీఏఐ ఆదేశం న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో రెండు గంటల్లో నిర్ణయం తీసుకోవాలని బీమా కంపెనీలను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఆదేశించింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా సెటిల్ చేయాలని బీమా సంస్ధలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆథరైజేషన్ రిక్వెస్ట్ అందిన రెండు గంటలలోపు సంబంధిత(నెట్వర్క్) హాస్పిటల్‌కు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు ఆమోదం తెలుపుతూ సమాచారమివ్వాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. -
భారీగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్లు
-
లాక్డౌన్ ఎఫెక్ట్ : మహాపతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి మహా పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, లాక్ డౌన్ ప్రకంపనలతో కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి. సెన్సెక్స్ 2687 పాయింట్లు పతనం కాగా నిఫ్టీ నిఫ్టీ 874 పాయింట్ల నష్టంతో వద్ద ట్రేడింగ్ అరంభించాయి. తద్వారా సెన్సెక్స్ 28వేల స్థాయిని, నిఫ్టీ 8వేల స్థాయిని కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఫార్మ రంగ షేర్ల లాభాలతో సూచీలు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2198 పాయింటు నష్టంతో 27707వద్ద, నిఫ్టీ 628 పాయింట్ల నష్టంతో 8118వద్ద ట్రేడ్ అవుతున్నాయి. -
37,000 దిగువన మరింత పతనం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించినప్పటికీ, కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం.. ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మార్చి6తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 39,090 పాయింట్ల గరిష్టస్థాయికి చేరాక బీఎస్ఈ సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 37,011 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 720 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు పతనక్రమంలో గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయిని శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ కోల్పోయినందున, కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ వారం సెన్సెక్స్ నెగిటివ్‌గా మొదలైతే 37,000 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. దీన్ని కాపాడుకోలేకపోతే వేగంగా 36,720 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 37,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 38,385 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 38,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. నిఫ్టీ 10,830 మద్దతు కోల్పోతే మరింత కరెక్షన్... క్రితంవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ, గత కాలమ్‌లో ప్రస్తావించినట్లే 11,390 పాయింట్ల వరకూ పెరిగాక వేగంగా 10,827కు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 213 పాయింట్ల నష్టంతో 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల దిగువనే ముగిసినందున, రానున్న వారాల్లో 10,670 వరకూ పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక ఈ వారం 10,830 పాయింట్ల స్థాయి తొలి మద్దతు. ఇది పోతే.. వేగంగా 10,670 పాయింట్ల దాకా తగ్గొచ్చు. ఈ లోపున 10,580 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,035 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,250 పాయింట్లు, ఆ తర్వాత క్రమేపీ 11,390 వరకూ పెరగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
రైతువేనా అని అడుగుతుండ్రు.
నాపేరు ఏలేటి లక్ష్మారెడ్డి. ఊరు సారంగాపూర్. ఉన్నభూమిలో కొద్దిపాటి కందిపంట వేశా. పంట పండినాక క్వింటాల్ కందులను అమ్మేందుకు మంగళవారం జగిత్యాల మార్కెట్‌కు తీసుకొచ్చిన. ఇక్కడి అధికారులను కలిస్తే.. వ్యవసాయశాఖ నివేదికలో నీ పేరు లేదు. నీ కందులు కొనుగోలు చేయమని చెప్పిండ్రు. నేను రైతును అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు ఆర్డీవో వచ్చి నిజంగా రైతుఅని ఆధారాలు చూపితే కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. ఇవేం నిబంధనలో అర్థం కావడం లేదు. సాక్షి, జగిత్యాల : ఆరుగాలం కష్టపడి కంది పంట పండించిన రైతుకు రంధి తప్పడం లేదు. లేనిపోని నిబంధనలు, అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం రైతులపాలిట శాపంగా మారింది. జగిత్యాల జిల్లాలోని రెండు మార్కెట్‌యార్డుల్లో కొందిపంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు ఐదురోజులు కావస్తున్నా.. నిబంధనల సాకుతో కొనుగోళ్లకు అధికారులు తిరకాసు పెడుతున్నారు. పంట తీసుకొచి్చన రైతులు యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు. దీంతో రైతు ఐక్యవేదిక నాయకులు సోమవారం మార్కెట్‌యార్డులో అందోళనకు దిగారు. ఎకరానికి రెండున్నర క్వింటాళ్లే రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు ఈ సారి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఎకరంలో ఎంత పంట పండినప్పటికీ కేవలం రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. దీనికి తోడు వ్యవసాయాధికారుల నివేదికలో కంది పంట పండించిన రైతుల పేర్లు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. తమపేర్లు లేకుంటే కందులను ఎలా అమ్ముకునేదని రైతులు మదనపడుతున్నారు. కందులకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800ఉండటం, ఓపెన్ మార్కెట్లో రూ.3– 4వేలు ఉండటంతో, ఈ ని‘బంధనాల’ బాధలు ఎందుకని చాలామంది రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి దాపురించింది. మార్కెట్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమావేశం జగిత్యాల ఆర్డీవో నరేందర్ మంగళవారం జగిత్యాల మార్కెట్‌యార్డును సందర్శించారు. రైతులనుంచి కందుల కొనుగోళ్లకు లేనిపోని నిబంధనలేంటని అధికారులను ప్రశ్నించారు. రైతులు, మార్కెట్, మార్క్‌ఫెడ్, వ్యవసాయాధికారులతో సమావేశం అయ్యారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయశాఖ నివేదికలో రైతుల సమాచారం లేనప్పటికి, ఆ మండల తహసీల్దార్‌కు ఫోన్ చేసి, నిజంగా రైతుకంది పంట పండించారని, అతనికి భూమి ఉందని చెప్పితే, ఆ రైతుల కందులు కొనాలని సూచించారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు మాత్రం ఎకరాకు 2.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. లక్ష్యం చేరేనా..? జిల్లాలో ఈ యేడు 3,420 ఎకరాల్లో రైతులు కందిపంట సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. 25వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఐదురోజుల క్రితం జగిత్యాల, కోరుట్లలోని మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5800గా నిర్ణయించారు. మార్క్‌ఫెడ్ ద్వారా 5వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్ణయించగా.. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మార్కెట్‌కు వచ్చిన కందుల కుప్పలు -
సెన్సెక్స్ 41,700–41,810 శ్రేణిని అధిగమిస్తేనే...
అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై జనవరి 15న సంతకాలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, చైనా కేంద్ర బ్యాంకు పెద్ద ఎత్తున 115 బిలియన్ డాలర్ల నిధుల్ని వ్యవస్థలోకి విడుదల చేయడం వంటి పాజిటివ్ వార్తల నేపథ్యంలో పలు ప్రపంచ దేశాల సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పినా, భారత్ స్టాక్ సూచీలు...కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోయాయి. ఈ లోపున అమెరికా డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో సృష్టించిన సంక్షోభ ఫలితంగా కొత్త ఏడాది తొలివారంలో మన మార్కెట్ నష్టాలతో ముగిసింది. మధ్యప్రాచ్య సంక్షోభ ప్రభావంతో క్రూడ్, బంగారం ధర అమాంతం పెరిగాయి. దీంతో మన వాణిజ్యలోటు పెరగడం, రూపాయి క్షీణించడం వంటి ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. పరిస్థితి తీవ్రతరమైతే ఆ దేశాల నుంచి భారతీయులు పంపించే రెమిటెన్సులు తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రిస్క్‌లను స్టాక్ మార్కెట్ ఎంతవరకు తట్టుకుంటుందో..ఇప్పుడే అంచనా వేయలేము. ఇక స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జనవరి 3తో ముగిసిన ఈ ఏడాది తొలివారంలో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 110 పాయింట్ల స్వల్పనష్టంతో 41,465 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,260 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,130 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 41,000–40,730 పాయింట్ల శ్రేణి మధ్యలో మద్దతు పొందవచ్చు. ఇక మార్కెట్ పెరిగితే 41,700–41,810 ్రÔó ణి వద్ద మరోదఫా గట్టి అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిని దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 12,150... గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ క్రితం వారం మరో రెండు దఫాలు 12,290 సమీపంలో గట్టి అవరోధాన్ని చవిచూసి ముందడుగు వేయలేకపోయింది. అంతక్రితం వారంతో పోలిస్తే 19 పాయింట్ల స్వల్పనష్టాన్ని చవిచూసింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు ఐదు దఫాలు 12,290 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి అవరోధం కలిగింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని దాటేంతవరకూ కన్సాలిడేషన్ లేదా కరెక్షన్ బాటలో నిఫ్టీ కదులుతుంది. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,150 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వెనువెంటనే 12,115 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,070–11,980 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే, మరోదఫా 12,290 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని దాటితే 12,360 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 12,425 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
పందెం కోడికి భలే గిరాకీ
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి పండుగ రానే వస్తుంది. పండుగ మరో 20 రోజులు ఉండగానే సంక్రాంతి సరదాలు మొదలయ్యాయి. ఏ రంగుపై ఏ రంగు కోడిని వదలాలి, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందనే çముచ్చట్లు మండలంలో మొదలయ్యాయి. క్రితం పండక్కి నా రసంగి, కాకిని నేలకరిపించిందిరా బావ అంటే... నీ రసంగి కాకినే కొట్టింది నా నెమలి అయితే రంగుతో పని లేకుండా నాలుగు పందేలే చేసింది రా బావ అంటూ పందెంరాయుళ్లు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మరో 20 రోజుల్లో సంకాంత్రి సందడి మొదలు కానుండటంతో ఎక్కడ చూసినా కోడిపందేలా ముచ్చట్లే వినబడుతున్నాయి. జాతిపుంజుల కోసం జల్లెడ సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెంకోళ్ల కోసం పందెంరాయుళ్లు పరుగులు పెడుతున్నారు. పందెంకోడి కూతపెడితే చాలు చటుక్కున ఆగి బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విసిరేస్తున్నారు. పుంజు నచ్చితే చాలు రేటు గురించి ఆలోచించకుండా చటుక్కున చంకలో పెట్టుకుంటున్నారు. పండుగ మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పందెంకోళ్లను బరుల్లోకి వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లుతో పాటు మరింత ఖరీదైన మేతలతో కోళ్లను పసిపిల్లల్లా సాకుతున్నారు. రంగును బట్టి పందెకోళ్లకు గిరాకీ ఉండటంతో నచ్చిన కోడిని కొనుక్కునేందుకు పందెంరాయుళ్లు వెనుకడుగు వేయటంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, రసంగి, పర్లా, కక్కిరి, మైలా ఇలా రంగులను బట్టి ఒక్కో కోడి రూ.5000 నుంచి రూ.10000 మధ్య పలుకుతుండగా, జాతికోళ్లు అయితే రూ.8000 నుంచి రూ. 15,000 వరకు పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడిపై మోజుపడితే చాలు పందెంరాయుళ్లు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడటంలేదు. సండే మార్కెట్లో సందడి సంక్రాంతి సమీపిస్తుండటంతో సండే మార్కెట్లో సందడి మొదలైంది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా గత రెండు వారాలుగా పందెంపుంజులు మార్కెట్లో కూతలు పెడుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పందెంరాయుళ్లు పందెం పుంజుల కోసం సండే మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో చేరతున్నారు. మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు సండే మార్కెట్లో పందెంకోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారు. కోడి రంగు, పోట్లాట, కోడి సైజును బట్టి బేరసారాలు చేసి నచ్చిన పుంజులను పట్టుకుపోతున్నారు. దీంతో బందరు నియోజకవర్గంలో మూడు వారాల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైనట్లు కనబడుతుంది. -
లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మార్కెట్‌కు శివరాత్రి కళ
సాక్షి సిటీబ్యూరో: ఈ ఏడాది శివరాత్రి పుర్వదినం సందర్భంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పూలు పండ్లు హోల్‌సేల్ విక్రయాలు జరిగాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. మార్కెట్ ఎ ంత మొత్తంలో ఎప్పుడూ పండ్లు రాలేదని, పూలు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని మార్కెట్ ఆధికారులు తెలిపారు. శివరాత్రి రోజున ఎక్కువ శాతం మంది ఉపవాసాలు చేసి పండ్లు ఆరగిస్తారు. మిగితా రోజుల్లో దాదాపు ఎనిమిది 800 టన్నుల పండ్లు దిగుమతి అయితే శివరాత్రి సందర్భంగా 1,800 టన్నుల వివిధ రాకల పండ్లు దిగుమతి కాగా పూలు 10 టన్నుల వరకు దిగు మతి అయ్యాయని మార్కెట్ కార్యదర్శి వివరించా రు. గ్రేటర్ పరిధిలో శివరాత్రి పండగ రోజు దా దా పు 1500 టన్నుల వివిధ రకాల పండ్ల విక్రయాలు జరుగుతాయని మార్కెట్ అధికారుల అం చనా. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ , సం త్రా, మొసాంబి, ద్రాక్ష, దానిమ్మ పండ్లకు దిగుమ తి పెరిగిందని హోల్‌సెల్ వ్యాపారులు తెలిపారు. రికార్డు స్థాయిలో పండ్లు, పూలు గతంతో పోలిస్తే ఈ ఏడాది పూల దిగుమతి మూడొంతులు, పండ్లు రెండింతలు ఎక్కువగా దిగుమతి అయ్యాయి. పూలు 40 టన్నులు, పండ్లు 1500 టన్నులు మార్కెట్‌కు వచ్చాయి. దాదాపు పూల వ్యాపారం రూ.1.50 కోట్లు, పండ్లు రూ.20 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని అంచనా. హోల్‌సేల్ ధరలు యథాతథం ఈ ఏడాది పండ్ల దిగమతి ఎక్కువగా ఉండడంతో ధరలు అంతగా పెరగలేదు. శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గతేడాది ఉన్న ధరలే హోల్‌సేల్ ధరలున్నాయి. పుచ్చకాయ, మొసాంబి, సంత్రా గతేడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గతేడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో పెరిగిన రిటైల్ ధరలు పూలు, పండ్ల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో ఎక్కువగా పెరగలేదు. అయితే బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు వివిధ రకాల పండ్లు భక్తులు తప్పనిసరిగా ఉపవాస ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని రిటేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో పండ్ల ధరలను రెండింతలు పెంచి విక్రయించారు. దీంతో గత్యంతరం లేక ఎక్కువ డబ్బులు చెల్లించి నగర ప్రజలు కొనాల్సి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలోగా అభ్య మైయ్యే వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. విడివిడిగా విక్రయించే వాటిపై కూడా రూ. 5 నుంచి రూ. 10 వరకు ధరలు పెరిగాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేశాం ప్రతి ఏటా శివరాత్రికి ముందు నగరంతో పాటు శివారు జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు పండ్లు కోనుగోలు కోసం పెద్దు ఎత్తున మార్కెట్‌కు వస్తారు. రెండు మూడు రోజుల ముందు నుంచే మార్కెట్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇదే సమయంలో మార్కెట్‌కు మార్కెట్ ఫీజులు ఎప్పటికప్పుడు వసూలు చేసి అదాయం పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. – గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ సొసైటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఇ. వెంకటేశం రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు పలు జిల్లాల నుంచి బంతి, చామంతితో పాటు ఇతర పువ్వులు ఎక్కువ మొత్తం లో మార్కెట్‌కు వచ్చాయి. రోజు కంటే అదివారం మూడింతలు పూలు వచ్చాయి. రైతులకు తా త్కాలిక స్థలాలను కేటాయించాం. రైతులు ధర విషయంలో మోసపోకుండా మద్ధతు ధర నిర్ణయించాం. – కె. శ్రీధర్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ సొసైటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి -
మన మార్కెట్లలోనే అస్థిరతలు తక్కువ
కోల్‌కతా: అంతర్జాతీయ క్యాపిటల్ మార్కెట్లలో ఈ ఏడాది నెలకొన్న అస్థిరతలు మరికొంత కాలం పాటు కొనసాగొచ్చని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల్లో అస్థిరతలు, వాణిజ్య వివాదాలు పెరగడం, ఇరాన్‌పై ఆంక్షలు వంటి అంశాలను అస్థిరతలకు కారణాలుగా త్యాగి ఉదహరించారు. భారత మార్కెట్లు కూడా ఈ అంశాల కారణంగా ప్రభావితం అయ్యాయన్నారు. ఐఐఎం కలకత్తా నిర్వహించిన భారత 8వ ఆర్థిక సదస్సులో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతోను, వర్ధమాన మార్కెట్లతోను పోలిస్తే అస్థిరతలు మన దగ్గరే తక్కువగా ఉన్నట్టు చెప్పారు. భారత ఈక్విటీ మార్కెట్లో డిసెంబర్ మధ్య నాటికి ఆస్థిరతలు 12 శాతం వరకు ఉంటే, ఇదే కాలంలో బ్రిటన్‌లో 12 శాతం, అమెరికాలో 16 శాతం, చైనాలో 19 శాతం, జపాన్‌లో 17 శాతం, దక్షిణ కొరియాలో 14 శాతం, హాంగ్‌కాంగ్‌లో 19 శాతం, బ్రెజిల్లో 21 శాతంగా ఉన్నట్టు త్యాగి తెలిపారు. డౌ జోన్స్ ఈ ఏడాది సున్నా రిటర్నులు ఇస్తే, నిఫ్టీ రాబడులు 5.8 శాతంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు నిధుల లభ్యత సమస్య నెలకొందని, అయితే ఆర్బీఐ చేపట్టిన చర్యలతో ఈ పరిస్థితి మెరుగుపడిందని చెప్పారాయన. -
మార్కెట్ క్రాష్: ఝన్‌ఝన్ వాలా నష్టం ఎంత?
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల పతనం పెట్టుబడుదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా ఇండియన్ వారెన్ బఫెట్, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు భారీ షాక్ తగిలింది. మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం ఆవిరైపోయింది. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా నిలకడగా మిడ్ క్యాప్ షేర్లు ఇటీవల వరుస పతనంతో భారీ నష్టపోయాయి. దీంతో ఆయన పోర్ట్ ఫోలియో వాల్యూ రూ.10,000 కోట్ల దిగువకు చేరింది. దలాల్ స్ట్రీట్ లోని బ్లడ్ బాత్‌తో దిగ్గజ ఇన్వెస్టర్లతో పాటు బడా బాబులకే కోలుకోలేని దెబ్బ తగలగా ఇక సామాన్య ఇన్వెస్టర్ల పరిస్థితి సరేసరి. తాజా గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04 శాతం, 2016లో 8 శాతం, 2017లో 48 శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్‌ను పునర్నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి. సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్‌ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్ ఒక్కసారిగా 75 శాతం పతనమయ్యాయి. పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో కేవలం మూడు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, వీఐపీ ఇండస్ట్రీస్, ల్యూపిన్ స్టాక్స్ తప్ప మిగతా అన్ని స్టాక్స్ 75 శాతం ఢమాల్ అన్నాయి. నష్టపోయిన షేర్లు మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. డీబీ రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం, ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, బిల్ కేర్ 51 శాతం, ఓరియంట్ సిమెంట్స్, టీవీ18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ నష్టపోయారు. -
భలే చౌక
సాక్షి సిటీబ్యూరో: ఈ సీజన్లో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత పది రోజులుగా స్థానిక మార్కెట్లలో ధరలు సగానికి సగం తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సెప్టెంబర్ మొదటి వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఆగస్టు నుంచే శివారు జిల్లాల నుంచి భారీగా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాలు కిలో రూ.35–40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. టమాటా ధర కొన్ని నెలలుగా రూ.10 మాత్రమే ఉండడం గమనార్హం. శివారు జిల్లాల్లో పెరిగిన దిగుబడి సాధారణంగా ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మాసాలను అన్‌సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. అందువల్లే రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి శివారు జిల్లాల్లో కూరగాయల సాగు అధికమై దిగుమతులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్పల్లి, గడిమల్కాపూర్, ఎల్బీనగర్, మెహిదీట్నం, కొత్తపేట తదితర మార్కెట్లకు కూరగాయలు భారీగా తరలిస్తున్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్‌కు ముందు ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.60 పైనే ఉండేవి కానీ. గత పది రోజులుగా పచ్చిమిర్చి, బీన్స్, దొండ, బెండ, ఆలుగడ్డ, టమాటా, వంకాల తదితర కూరగాయలు రూ.40 లోపే లభిస్తున్నాయి. దుర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ. 40 లోపే ఉన్నాయి. -
ఆర్బీఐ నిర్ణయం... మార్కెట్లకు మార్గదర్శకం!
న్యూఢిల్లీ: ఆర్బీఐ పాలసీ కమిటీ సమీక్షా సమావేశం నిర్ణయాలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయి. అలాగే, స్థూల ఆర్థిక అంశాల ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘‘అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్స్, చమురు ధరలు, వాణిజ్య ఘర్షణలపై మార్కెట్ దృష్టి ఉంటుంది. అలాగే, అధిక చమురు ధరల ప్రభావం, ద్రవ్యోల్బణంపై కనీస మద్దతు ధరల ప్రభావం నేపథ్యంలో దేశీయంగా పాలసీ రేట్లపై ఆర్బీఐ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. వరుసగా మూడో ఏడాది సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనాలు ప్రకటించింది. అయితే, సకాలంలో సరైన వర్షపాతం అన్నది కీలకాంశంగా చూడాల్సి ఉంటుంది’’అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాణి తెలిపారు. ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం ఈ నెల 6న వెలువడనుంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో 2017 ఆగస్ట్ నుంచి ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. ఇక, సేవల రంగం పీఎంఐ డేటా కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ‘‘అధిక చమురు ధరల ప్రభావంతో ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఎంపీసీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రేట్ల పెంపు భయాలు ఈ వారం మార్కెట్లను నియంత్రించొచ్చు’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్ మోదీ తెలిపారు. ‘మే’లో ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.29,714 కోట్లను ఉపసంహరించుకెళ్లారు. 18 నెలల్లో ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లిపోవడం మే నెలలోనే జరిగింది. ఏప్రిల్ నెలలోనూ రూ.15,561 కోట్లను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం గమనార్హం. మేనెలలో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ.10,060 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. డెట్ మార్కెట్ నుంచి రూ.19,654 కోట్లను తీసేసుకున్నారు. 2016 నవంబర్‌లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో రూ.39,396 కోట్లను వెనక్కి తీసేసుకున్న తర్వాత మరోసారి గరిష్ట స్థాయి అవుట్‌ఫ్లో ఈ మే నెలలో చోటు చేసుకుంది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.2,100 కోట్లు కాగా, డెట్ మార్కెట్లో రూ.30,000 కోట్లుగా ఉన్నాయి. చమురు ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాఫిట్ బుకింగ్, సెబీ నిబంధనల మేరకు అదనపు పత్రాలను సమర్పించాల్సి రావడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలు అధికంగా ఉపసంహరించుకోవడానికి కారణాలుగా ‘గ్రో’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. -
మళ్లీ ముంచిన కొరియా: భారీ నష్టాలు
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లను మరోసారి నార్త్ కొరియా ముంచింది. నార్త్ కొరియా హెచ్చరికలతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 32,169 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం తన కీలకమార్కు 10,100ను కోల్పోయి, 71.95 పాయింట్ల మేర నష్టపోతూ 10,049 వద్ద కొనసాగుతోంది. పసిఫిక్‌లో అణు ఆయుధాలను పరీక్షించగలమని ఉత్తరకొరియా హెచ్చరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు 0.4 శాతం నుంచి 1 శాతం మేర పడిపోతున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.7 శాతం చొప్పున డౌన్ అయ్యాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రాఫైట్ ఇండియా, జేపీ అసోసియేట్స్, పీటీసీ ఇండియా, మ్యాట్రిమోనీ.కామ్లు 4 శాతం వరకు నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా 82 పైసలు నష్టపోయి 65కి పైన ట్రేడవుతోంది. బంగారం ధరలు కూడా ఎంసీఎక్స్ మార్కెట్లో 216 రూపాయల నష్టంలో 29,558 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సుమారు 90 పాయింట్ల మేర ఎగిసిన సెన్సెక్స్, మళ్లీ ఒడుదుడుకులకు లోనవుతూ స్వల్పంగా 18.22 పాయింట్ల లాభంలో 31,586 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 8.45 లాభంలో 9860 వద్ద కొనసాగుతోంది. విశాల్ సిక్కా రాజీనామా దెబ్బకు భారీగా కుదేలైన ఇన్ఫోసిస్ షేరు కోలుకున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడోరోజు ఈ షేరు లాభాన్ని పండిస్తోంది. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, ఎల్ అండ్ టీ లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో టీసీఎస్ కూడా 1 శాతం మేర లాభపడింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 64.07గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా 64 రూపాయల లాభంలో 29,169 వద్ద కొనసాగుతున్నాయి. -
భారీగా పతనమైన రూపాయి
ముంబై : డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు, ఆసియన్ కరెన్సీ మార్కెట్లలో నష్టాలు, దీనికి తోడు దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి భారీగా పెరుగుతున్న డిమాండ్ రూపాయి విలువను గురువారం ట్రేడింగ్‌లో భారీగా దెబ్బతీసింది. ప్రారంభం ట్రేడింగ్‌లో 26 పైసలు పడిపోయి, మరోసారి 64 స్థాయిలకు క్షీణించింది. ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయిన డాలర్ ప్రస్తుతం రికవరీ అవుతోంది. బ్యాంకర్ల నుంచి డాలర్‌కు డిమాండ్ వెల్లువెత్తుతోంది. దీంతో రూపాయి క్షీణిస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ప్రస్తుతం 14 పైసలు బలహీన పడి 63.97వద్ద ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నష్టాల ధోరణి, షెల్ కంపెనీలపై సెబీ దెబ్బ కూడా రూపాయిపై ప్రభావం చూపుతోంది. కాగ, బుధవారం నాటి ఫారెక్స్ మార్కెట్ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి విలువ 21 పైసలు బలపడి 63.84 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. బెంచ్‌మార్కు సూచీలు కూడా వరుసగా నాలుగో రోజు నష్టాలు పాలవుతున్నాయి. సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 31,657 వద్ద ఉండగా.. నిఫ్టీ ఏకంగా 52 పాయింట్లు నష్టపోతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ 9,900 మార్కు కిందకి ఢమాలమంది. మరోవైపు టాటా మోటార్స్ షేర్లు భారీగా పతనమవుతునన్నాయి. ఈ కంపెనీ అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించకపోవడతో, గురువారం మార్కెట్లో టాటామోటార్స్ షేర్లు 6 శాతం పడిపోయి 16 నెలల కనిష్టానికి దిగజారాయి. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా క్రమంగా పుంజుకుంది. 30 పాయింట్లు ఎగిసి 31,2340 వద్ద, నిఫ్టీ 10పాయింట్లు లాభపడి 9623వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రతమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు అక్కడక్కడే కదులుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు బలహీనంగా, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టాటా పవర్, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, ఐబీ హౌసింగ్ లాభాల్లో ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోతున్నాయి. మార్కెట్దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి మార్కెట్ క్యాపిటల్ లో టాప్‌లో నిలిచింది. వెంకీస్ 4శాతం లాభంతో, బీపీసీఎల్ టాప్ విన్నర్‌గా ఉన్నాయి. -
ఆర్బీఐ ఎఫెక్ట్: రికార్డ్ హైలో బ్యాంక్ నిఫ్టీ
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 81 పాయింట్లు అధిగమించి 31271 వద్ద నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 9663 వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ ప్రకటన తో ప్రభుత్వ, ప్రయివేటుబ్యాంకులతోపాటు, హౌసింగ్ ఫైనాన్సింగ్ సెక్టార్లో లార్జ్ క్యాప్స్‌లో బైయింట్ ఇంట్రరెస్ట్ తో మార్కెట్లలో మంచి ర్యాలీ కనిపించింది. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 23,606ను తాకింది. తొలిసారి నిఫ్టీ 23,500పైన ముగిసింది. ఎస్బీఐ, పీఎన్బీ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులు పుంజుకున్నాయి. యాక్సిస్, ఐసీఐసీబ్యాంక్, కెనరా బ్యాంక్, లాభాలతో ముగిశాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లకు డిమాండ్ పుట్టింది. కేన్‌ఫిన్ హోమ్, పీఎన్బీ హౌసింగ్, జీఐసీ హసింగ్, గృహ్ ఫైనాన్స్, దివాన్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ తదితరాలు లాభడ్డాయి. వీటితోపాటు అరబిందో ఫార్మ, ఆర్ఐఎల్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం వేదాంత లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లింది. ఐటీ ఇండెక్స్ పతనమైంది. అయితే చివరలో కొద్దిగా నష్టాలనుంచి కోలుకుంది. రిలయన్స్ లాస్ట్ మినిట్‌లో లాభాల్లోకి మళ్లి టాప్ విన్నర్‌గా నిలవడం విశేషం. అటు డాలర్ మారకంలో రుపీ 0.07 పైసల లాభంతో రూ.64.36 వద్ద ఉంది. పుత్తడి ఎంసీఎక్స్ మార్కెట్ లో రూ.70 క్షీణించి, పదిగ్రా. రూ.29,497 వద్ద ఉంది. -
మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కిక్
ముంబై: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించిన పాలసీ రివ్యూ ప్రకనట మార్కెట్లకు జోష్ నిచ్చింది. ఆర్బీఐ అనుసరించిన మరోసారి యథాతథ పాలసీ ఉదయం నుంచి వేచి చూసే దోరణితో ఉన్న ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో మిడ్ సెషన్ తరువాత ఫ్లాట్‌గా మారిన మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 82 పాయింట్లు అధిగమించింది. నిఫ్టీ 23 పాయింట్లు బలపడింది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. ముఖ్యంగా పాలసీ సమీక్ష కారణంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బాగా లాభపడుతోంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ స్థాయిని నమోదు చేయగా, పీఎన్బీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకు షేర్లు లాభాలనార్జిస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీగా పుంజుకున్నాయి. డీహెచ్ ఎఫ్‌ల్ పుంజుకుంది. ఫార్మా కూడా 1.5 శాతం లాభాలతో ఉంది. ఇంకా నిఫ్టీ దిగ్గజాలలో అరబిందో, రిలయన్స్, వేదాంతా, ఎంఅండ్ఎం, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్, మారుతీలా భాల్లోకొనసాగుతున్నాయి. అయితే మంగళవారం నాటి ట్రేడింగ్ లో బాగా బలపడిన ఐటీ ఇండెక్స్ నేడు కుదైలేంది. టీసీఎస్, టెక్‌మహీంద్రా, విప్రో, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ భారీగా క్షీణించాయి. -
రికార్డు గరిష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 135.70 పాయింట్ల లాభంలో 31,273.29 వద్ద ముగియగా.. నిఫ్టీ 37.40 పాయింట్ల లాభంతో తొలిసారి 9650 మార్కుకు పైన నిలిచింది. హీరో మోటార్ కార్పొ, సిప్లా రెండు సూచీల్లో లాభాలు పండించగా.. గెయిల్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. ఇంట్రాడేలో హీరో మోటార్ కార్పొ స్టాక్ ధర సరికొత్త రికార్డు స్థాయిలను తాకింది. మే నెలలో విక్రయాల వృద్ధి జోరుగా ఉండటంతో 3 శాతం పైగా లాభపడిన ఈ స్టాక్ ధర రూ.3,849ను తాకింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు, సెన్సెక్స్ 31,333 నిఫ్టీ 9673 వద్ద సరికొత్త రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. ఫార్మా, ఆటో స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో మంచి జోరును కొనసాగించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.45 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 2 రూపాయల నష్టంతో 28,650గా నమోదయ్యాయి. -
జాగేది ?
ధాన్యం కొనుగోళ్లకు స్థలం సమస్య స్టాక్‌ను దించుకోకుండా చేతులెత్తేస్తున్న మిల్లర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఉచితంగా మార్కెట్ గోదాముల కేటాయింపు సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలిస్తుంటే మిల్లర్లు తమ మిల్లుల్లో స్థలం లేదని ధాన్యం లారీల నుంచి స్టాక్‌ను దించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఆరు వేల మెట్రిక్ టన్నులు.. జిల్లాలో ఇప్పటి వరకు 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తోంది. సీజను ప్రారంభంలో రోజుకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది. కాంటాలైన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో ఆరు బయట నిల్వ చేయడానికి మిల్లర్లు జంకుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఉచితంగా మార్కెట్ గోదాములు.. ఒక్కసారిగా స్థలం సమస్య ఏర్పడటంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ధాన్యం నిల్వలను ఉంచేందుకు అవసరమైన గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్‌లో సుమారు 1,800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచాలని నిర్ణయించారు. అలాగే నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోదాముల్లో కూడా ధాన్యం నిల్వ చేయాలని భావిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గోదాములను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సీడబ్ల్యూసీ అధికారులతో మాట్లాడుతున్నాం వర్షాలు ప్రారంభం కావడంతో ఏర్పడిన స్థలం సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. నిజామాబాద్ దుబ్బలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములను వినియోగించుకోవాలని రైస్‌మిల్లులకు సూచిస్తున్నాము. ఇక్కడ 18 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. అలాగే సారంగపూర్‌లోని సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో కూడా ఐదు వేల మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నాము. - హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పది రోజులు దాటుతోంది.. ధాన్యం తెచ్చి పది రోజులు దాటింది. తూకం వేసి కూడా మూడు రోజులవుతోంది. కానీ ధాన్యం తరలించడం లేదు. దీంతో 600 బస్తాలను తడవకుండా కాపాడటం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం తరలించేలా చూడాలి. - బైరి చిన్న గంగాధర్, ఇందల్వాయి -
దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు
దలాల్ స్ట్రీట్ లో మార్కెట్లు దుమ్మురేపాయి. మంచి రుతుపవనాల అంచనాలతో సరికొత్త ఆల్ టైమ్ గరిష్టంలో మార్కెట్లు ముగిశాయి. 314.92 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్, 30,248.17 వద్ద క్లోజైంది. అదేవిధంగా నిఫ్టీ సైతం మొదటిసారి 9400 మార్కును అధిగమించి 9407.30 వద్ద రికార్డైంది. నేటి మార్కెట్లు భారతీ ఎయిర్ టెల్ స్టాక్ ఆఫ్ ది డేగా నిలిచి, 10 శాతం లాభాలు పండించింది. భారతీ ఎయిర్ టెల్ తో పాటు హిందూస్తాన్ యూనిలివర్ కూడా గరిష్ట స్థాయిలను తాకింది. క్లోజింగ్ కు ముందు సెన్సెక్స్ , నిఫ్టీలు నేటి ట్రేడింగ్ లో 30,272 మార్కును, 9414.75 మార్కును తాకాయి. మంగళవారం వెల్లడించిన మంచి రుతుపవనాల అంచనాలు మార్కెట్ల సెంటిమెంట్ ను బలపర్చాయని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు. ఎల్ నిలో భయాందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయని సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ ఆఫీసు చీఫ్ అంచనావేశారు. అటు రుతుపవనాల అంచనాలతో పాటు ఇటు మంగళవారం సెషన్లో 330 కోట్ల విలువైన షేర్లను ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం కూడా మార్కెట్లకు బూస్ట్ నిచ్చింది. మంచి కొనుగోళ్ల పర్వంతో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం పైకి ఎగిశాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 32 పైసలు బలహీనపడి 64.63గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 112 రూపాయల లాభంతో 28,083గా రికార్డయ్యాయి. -
వరుసగా నాలుగో రోజూ నష్టాలే
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వ రుసగా నాలుగో రూజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు చివర్లో ప్రాఫిట్ బుకింగ్కారణంగా నష్టాలతో ముగిశాయి. అటు సాధారణ వర్షపాతం నమోదుకానుందని వాతావరణ శాఖ నివేదించినప్పటికీ దలాల్‌స్ట్రీట్ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 94 పాయింట్లు క్షీణించి 29,319 వద్ద, నిఫ్టీ సైతం 34 పాయింట్లు నష్టపోయి 9,105 వద్ద ముగిసింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,150 దిగువన స్థిరపడింది. అంతేకాకుండా 9,100 సమీపంలో నిలిచింది. అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో దాదాపు 400 పాయింట్లు పతనమైంది. ముఖ్యంగా ఇటీవల మార్కెట్ ఫేవరెట్లుగా నిలుస్తున్న రియల్టీ షేర్లతోపాటు, మెటల్ కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. రియల్టీ 3.3 శాతం, మెటల్ 1.75 శాతం చొప్పున పతనంకాగా.. ఫార్మా, ఆటో 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్, ఇన్ఫ్రాటెల్, అంబుజా, ఐషర్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ డీవీఆర్, ఐబీ హౌసింగ్, సన్ ఫార్మా, ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లోనూ, మరోపక్క అరబిందో, ఎన్టీపీసీ, ఐవోసీ, హిందాల్కో, బీవోబీ, స్టేట్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లోనూ ముగిశాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 0.07 పైసలులాభపడి రూ. రూ64.59 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.90 క్షీణించి రూ.29, 340 వద్ద ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 63.65 పాయింట్ల నష్టంలో 29,579 వద్ద, నిఫ్టీ 22.40 పాయింట్ల నష్టంలో 9181 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, గెయిల్, ఇండియాబుల్స్ హౌసింగ్, అరబిందో ఫార్మా టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టోబ్రో, టాటా మోటార్స్, హిందాల్కో నష్టాలు గడిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.35 శాతం నష్టాల్లో 947.90 వద్ద కంపెనీ షేర్లు నడుస్తున్నాయి. నేడు ప్రకటించిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫీ లాభాలు 3 శాతం పడిపోయి రూ.3603 కోట్లగా నమోదయ్యాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 24 పైసల లాభంతో 64.44 వద్ద ప్రారంభమైంది. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 29398 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 9084 వద్ద ముగిశాయి. రోజు మొత్తం కన్సాలిడేషన్ బాటలో ప్రతికూలంగా సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో పావు శాతం వడ్డీ పెంపు ఉండొచ్చన్న అంచనాలు బలపడిన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్లను పెంచనుందనే అంచనాలనేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో అయిదు రాష్ట్రాల్లో బీజేపీ హవాతో రికార్డ్ స్థాయిలను టచ్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పనష్టాలతో అప్రమత్తంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. దీంతో ఐటీ 1.8శాతం నష్టపోగా, టీసీఎస్,ఇన్ఫోసిస్ 2 శాతం దిగజారాయి. కాగా మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ షేర్లు మంచి ప్రదర్శన కనబర్చాయి. మిగిలిన అన్ని ఇండెక్సులూ లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో లాభపడ్డాయి. ఐడియా 9శాతం, హీరో మోటా కార్ప్, టాటాస్టీల్, ఆర్ ఐఎల్, టాటా మెటార్స్ లాభపడగా, పీవీఆర్ 4శాతం నష్టపోయింది. అలాగే హెచ్‌యుఎల్, విప్రో ఐసీఐసీఐ కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోయిన వాటిల్లోఉన్నాయి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి 16న నెలల గరిష్టాన్ని తాకింది. 0.20పైసలు లాభపడి 65.64 వద్ద రూ. 65ల ఎగువకు చేరింది. అటు ఫెడ్ అంచనాలతో పుత్తడి బలహీనత కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ. 101లు పతనమై రూ. 27,975వద్ద ఉంది. -
మార్కెట్లకు ‘యూపీ’ బీపీ!
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కొత్త రికార్డు స్థాయికి సూచీలు ⇒ ఓడితే సెంటిమెంట్‌కు దెబ్బ... ⇒ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లపై అధిక ప్రభావం ⇒ ఫలితాలపై విశ్లేషకుల అంచనా ముంబై: ఉత్తరప్రదేశ్‌తో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు (శనివారం) ప్రారంభం కానుంది. కీలకమైన యూపీలో మెజార్టీ సీట్లు బీజేపీవేనంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి గెలుపుపై ప్రతికూల అంచనాలతో ఉన్న మార్కెట్ వర్గాలు.. యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కమలనాథులేనని భావిస్తున్నాయి. అదే జరిగితే సంస్కరణలకు గట్టి ఊతం లభిస్తుందని, మార్కెట్లు మరింతగా పరుగులు తీయగలవని ఆశిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 12 బ్రోకింగ్ సంస్థలకు చెందిన విశ్లేషకుల్లో 9 మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. యూపీలో అధికార పార్టీ మళ్లీ పగ్గాలు దక్కించుకుంటే దేశీ ఈక్విటీ మార్కెట్‌కు ప్రతికూలమే కాగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 91 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆసియాలోని ఇతర ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్ మెరుగైన పనితీరు కనపర్చింది. గతేడాది నవంబర్ 9న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పరిణామాలతో వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా మళ్లీ తిరిగొచ్చారు. ఈ ఏడాది తొలి రెండు ¯ð లల కాలంలో బాండ్లు, ఈక్విటీల్లో దాదాపు 2.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 9 శాతం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాల నుంచి కోలుకుంటూ.. గత కొన్నాళ్లుగా ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరువలో తిరుగాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే.. నిఫ్టీ గత రికార్డు స్థాయి 9,119 పాయింట్లను అధిగమించడంతో పాటు మొత్తం మీద దాదాపు 8.7 శాతం మేర ఎగిసేందుకు కావాల్సిన ఊతం దక్కగలదని సర్వేలో పాల్గొన్న మొత్తం 12 మంది అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో కూడా బలం పుంజుకునేందుకు యూపీలో గెలుపు బీజేపీకి తోడ్పడుతుందని వారు విశ్లేషించారు. రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో గతంలో పలు కీలక సంస్కరణల బిల్లులకు చుక్కెదురైన నేపథ్యంలో యూపీలో గెలిస్తే.. అధికార పార్టీ తలపెట్టిన సంస్కరణలకు ఆటం కం ఉండబోదని వారు పేర్కొన్నారు. బీజెపీ గెలుపు, ఓటముల ప్రభావం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంపై అధికంగా వుండగలదని వారు అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ యూపీలో అధికారం చేజిక్కించుకోలేకపోతే, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి, మార్కెట్ క్షీణిస్తుందని వారు అంచనా వేశారు. సాధ్యపడేనా .. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇది ఒకరకంగా డీమోనిటైజేషన్‌పై రెఫరెండంలాంటిదిగా అంతా పరిగణిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కమలనాధులకు తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ మరింత కీలకంగా మారింది. యూపీ జనాభా ఏకంగా 20.4 కోట్ల మేర ఉంటుంది. ఇక్కడి నుంచే రాజ్యసభకు అత్యధిక ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా.. అందులో 31 సీట్లు యూపీవే ఉంటాయి. అందుకే యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 80 సీట్లలో ఏకంగా 71 సీట్లు దక్కించుకుని యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇటీవలి పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలే దక్కించుకుంది. మార్కెట్లను ప్రభావితం చేయబోయే మరిన్ని అంశాలు.. యూపీ ఎన్నికల ప్రభావాలు ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలపై పడగలవని బ్రోకరేజి సంస్థలు భావిస్తున్నాయి. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిశాక.. స్వల్పకాలికంగా చూస్తే మార్చి 14–15 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. -
కళ తప్పింది
నగదు కొరతతో కుదేలైన వస్త్రవ్యాపారం 90 శాతం తగ్గిన క్రిస్మస్ అమ్మకాలు న్యూ ఇయర్, సంక్రాంతికి ఎలా ఉంటుందోనని వ్యాపారుల గుబులు నిర్వహణ ఖర్చులు కూడా రాని వైనం ఖాళీగా కనిపిస్తున్న దుకాణాలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్న వ్యాపారవర్గాలు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది పెద్ద నోట్ల రద్దు వ్యవహారం. నల్లధనం అరికట్టడం, నకిలి కరెన్సీకి అడ్డుకట్ట వేయడం కోసమంటూ గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత జిల్లాలో వస్త్ర వ్యాపారం పూర్తిగా పడిపోయింది. కొనుగోలుదారులు తగినంతగా రాక రెండు నెలలుగా దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఆదాయం మాట దేవుడెరుగు.. కనీసం సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులైనా రాకపోవడంతో వస్త్ర వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలు వరుసగా వస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పండగ సీజ¯ŒSలో మంచి వ్యాపారం జరిగేది. కానీ, పండగ వ్యాపారంపై వ్యాపారులు వేసుకున్న అంచనాలు నగదు కొరతతో తలకిందులవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని వస్త్ర వ్యాపారులు వాపోతున్నారు. కరెన్సీ సంక్షోభంతో తలకిందులు సాధారణంగా ఏడాదంతా జరిగే వ్యాపారం ఒక ఎత్తయితే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సీజ¯ŒS నెల రోజులపాటు జరిగే వ్యాపారం మరో ఎత్తు. ఏడాదిలో 11 నెలల వ్యాపారానికి, ఈ పండగ సీజ¯ŒSలో జరిగే వ్యాపారానికి పూర్తిగా తేడా ఉంటుంది. ఈ ఒక్క నెలలో చేసిన వ్యాపారం 11 నెలలకు సమానం. అలాంటిది ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు, ఆపై నెలకొన్న నగదు కొరత తదితర పరిణామాలు వస్త్ర వ్యాపారాన్ని తలకిందులు చేశాయి. సాధారణ రోజుల్లో జరిగినట్లు కూడా ప్రస్తుతం అమ్మకాలు జరగడంలేదని వస్త్రవ్యాపారులు వాపోతున్నారు. రాత్రి 9 గంటలకే బంద్ సాధారణంగా పండగ సీజ¯ŒSలో దుకాణాలు రాత్రి 11 గంటల వరకూ కొనుగోలుదార్లతో సందడిగా ఉంటాయి. దుకాణం మూసివేసిన తర్వాత సర్దుకోవడానికి మరో గంటన్నర పడుతుంది. అయితే ఈ ఏడాది పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజల వద్ద నగదు లేకపోవడంతో రాత్రి తొమ్మిది గంటలకే దుకాణాలు మూసివేస్తున్న పరిస్థితి నెలకొంది. మాల్స్‌కూ గట్టి దెబ్బ పెద్ద నోట్ల రద్దు దెబ్బ షాపింగ్ మాల్స్‌కూ గట్టిగానే తగిలింది. పండగ సీజ¯ŒSలో ఇప్పటికే కిటకిటలాడే మాల్స్‌లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొనుగోలుదారులకు వస్రా్తలు చూపిస్తూ, వాటిని మడతలు వేసుకునే పనిలో తీరిక లేకుండా గడపాల్సిన సిబ్బంది కూడా ఖాళీగా కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. దీంతో కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఎప్పటిలాగానే షాపింగ్ మాల్స్ ఈ ఏడాది కూడా డిస్కౌంట్లు, వ¯ŒS ప్లస్ వ¯ŒS, టూ ప్లస్ త్రీ వంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరుకు వస్తున్నా.. రిటైల్ దుకాణాలకు అవసరమైన దుస్తులను సూరత్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కంపెనీలు ఉన్నంత వరకూ నగదు, మిగతాది అప్పుగా ఇస్తున్నాయి. వ్యాపారం జరిగేకొద్దీ డబ్బులు ఇవ్వండంటూ సరుకు పంపిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అనుకున్నదానిలో 10 శాతం కూడా వ్యాపారం లేక దుకాణదారులు నిరాశకు గురవుతున్నారు. స్వైపింగ్ యంత్రాలకు కొరత ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది రెండు జతలు కొనే దగ్గర ఒక జతతో ఆగిపోతున్నారు. ఎక్కువమంది పెద్దలు ఈసారి దుస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. తమవద్ద ఉన్న నగదుతో పిల్లలకు మాత్రమే తీసుకుంటున్నారు. దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలుంటే పరిస్థితి కొంతవరకైనా మెరుగ్గా ఉండేది. కానీ, చాలాచోట్ల ఈ యంత్రాలకు కొరత ఉంది. స్వైపింగ్ మెషీన్లు కావాలని బ్యాంకులకు దరఖాస్తు చేసినా ఇప్పటివరకూ రాలేదని వ్యాపారులు వాపోతున్నారు. అటు ఒక్కసారిగా పెరిగిన డిమాండుకు తగినట్టుగా బ్యాంకులు కూడా ఈ యంత్రాలను అందించలేకపోతున్నాయి. పండగ కళ తప్పింది ఉభయ గోదావరి జిల్లాల వస్త్ర వ్యాపారానికి రాజమహేంద్రవరం, ద్వారపూడి కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ రిటైల్, హోల్‌సేల్ అమ్మకాలు జరుగుతూంటాయి. రాజమహేంద్రవరంలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్, ద్వారపూడి మార్కెట్లలో పండగ సీజ¯ŒSలో రోజుకు రూ.55 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. ద్వారపూడి మార్కెట్లో 600 వస్త్ర దుకాణాలున్నాయి. మామూలు రోజుల్లోనే ఇక్కడ రోజుకు రూ.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతూంటుంది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల సీజ¯ŒSలో రోజుకు దాదాపు రూ.50 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుంది. రాజమహేంద్రవరం, ద్వారపూడి మార్కెట్లను మినహాయిస్తే మిగిలిన జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు 10 వేల వస్త్ర దుకాణాలున్నాయి. వీటిద్వారా పండగ సీజ¯ŒSలో సాధారణంగా రోజుకు రూ.6 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేష¯ŒS వైస్ ప్రెసిడెంట్ పోకల సీతయ్య చెప్పారు. ఈ దుకాణాలకు షాపింగ్ మాల్స్ అదనం. పెద్ద నోట్ల రద్దుతో ఈ ఏడాది వీటన్నింటిలోనూ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. అందరికీ బట్టలు తీసుకోలేకపోతున్నాం ఏటా రాజమహేంద్రవరం మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌కు వస్తాం. ఖాతాల్లో నగదు ఉన్నా తీసుకునే పరిస్థితి లేదు. ఏటీఎంల వద్ద నిల్చుంటే రెండు వేలు దొరుకుతున్నాయి. పండగకు అందరికీ బట్టలు తీసుకోలేకపోతున్నాం. పిల్లలకు మాత్రమే తీసుకున్నాం. అదీ పండగ స్థాయిలో తీసుకోలేదు. కిరాణా సరుకులు కూడా అనుకున్నంతగా కొనలేదు. – కళావతి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా 10 శాతం కూడా లేదు నగదు కొరతతో కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. గత ఏడాది క్రిస్మస్ సీజ¯ŒS వ్యాపారంతో పోల్చుకుంటే ఈ ఏడాది 10 శాతం కూడా లేదు. రాత్రి తొమ్మిది గంటలకే దుకాణం మూసేస్తున్నామంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. స్వైపింగ్ మిషన్లున్నా పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. – దాసరి రామచంద్రరావు, శ్రీకనకదుర్గా టెక్స్టైల్, మహాత్మాగాంధీ మార్కెట్, రాజమహేంద్రవరం కోట్లలో నష్టం పండగ సీజనే వస్త్ర వ్యాపారులకు ముఖ్యమైనది. ఏడాదంతా వ్యాపారం లేకపోయినా ఈ ఒక్క నెల రోజుల్లో జరిగే వ్యాపారంతో వారు గట్టెక్కుతారు. అలాంటిది పెద్ద నోట్ల రద్దుతో దుకాణాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి. ముందస్తు చర్యలు తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం అనాలోచిత చర్య. మరో మూడు నాలుగు నెలలు ఇదే పరిస్థితి ఉండొచ్చు. – పోకల సీతయ్య, వైస్ ప్రెసిడెంట్, ఏపీ టెక్స్టైల్ ఫెడరేష¯ŒS, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు పండుగ బేరాలు పేలవంగా ఉన్నాయి వస్త్ర దుకాణాల యజమానులు సీజనల్ అమ్మకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. నోట్లు రద్దయిన గత 45 రోజులుగా వస్త్ర దుకాణాలు బేరాలు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడు ముందు కిస్మస్, తర్వాత సంక్రాంతి పండగలు వస్తున్నాయి. బేరాలు ఊపందుకుంటాయనుకున్నాం. పండగ సీజ¯ŒSలోనూ బేరాలు పేలవంగా ఉన్నాయి. దుకాణంలో పని చేసే సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – నార్కెడిమిల్లి ప్రసాద్, వెంకటేశ్వర సిల్క్ ప్యాలెస్, అమలాపురం బోనస్ ఇస్తారో లేదో? వ్యాపారం అస్సలు లేదు. ఈ సమయంలో మేము క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాం. అలాంటిది ఖాళీగా కూర్చున్నాం. ప్రతి ఏడాది సంక్రాంతికి మాకు బోనస్‌లు ఇస్తారు. ఈసారి వ్యాపారం అస్సలు లేదు. బోనస్‌లు ఇస్తారో లేదో తెలియడంలేదు. పెద్ద నోట్ల రద్దు మా బోనస్‌లకు ఎసరు తెచ్చింది. – ముప్పిడి రాజేష్, గుమస్తా, ప్రగతి ఫ్యాష¯Œ్స, రాజమహేంద్రవరం రిపోర్టింగ్ : పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం -
రైలు షేర్ల దౌడు..
ముంబై: లాభాల్లో డబుల్ సెంచరీ మంగళవారం నాటి మార్కెట్ రైల్ కౌంటర్ కు మాంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా మార్కెట్ జోరుకు మద్దతిస్తున్న ఫైనాన్షియల్, ఆటో, రియల్టీ రంగాలకు తోడు రైల్ షేర్లు కూడా జత కలిశాయి. కొనుగోళ్లతో ఈ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హిందుస్తాన్ రెక్టిఫయర్స్ 7శాతం టిటాగడ్ వేగన్స్ 6 శాతం టెక్స్మాకో రైల్ 6 శాతం లాభపడ్డాయి. అలాగే కాళిందీ రైల్ 6 , టిటాగర్ వేగన్, 6 టెక్స్ రైల్ 6 శాతం, స్టోన్ ఇండియా 5 శాతం, హెర్క్యులస్ హోయిస్ట్ 1.6 లాభాల్లో ట్రేడ్ అవుతుండడం విశేషం. -
టోక్యో , ముంబై, పారిస్ అన్నీ ..
ముంబై : హిల్లరీ క్లింటన్ వర్సెస్ డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ని అనూహ్యమార్పులతో ప్రపంచ మార్కెట్లు కూడా అనూహ్యంగా స్పందిస్తున్నాయి. ఎఫ్‌బీఐ హిల్లరీకి క్లీన్ చిట్‌తో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తమ ట్రెండ్ మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా, యూరప్ మార్కెట్లు జోరును అందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నాలుగు సెషన్ల తర్వాత రీబౌండ్ అయ్యాయి. ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. చివరికి సెన్సెక్స్ 185 పాయింట్లు ఎగసి 27,459 వద్ద , నిఫ్టీ కూడా 63 పాయింట్లు జంప్‌చేసి 8,497 వద్ద ముగిసింది. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల వెల్లువ సాగింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాభాలతోపాటు ఫార్మా, మెటల్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ తదితర అన్ని రంగాలూ లాభపడ్డాయి. లుపిన్ టాప్ విన్నర్ గా నిలవగా, అరబిందో, హిందాల్కో, స్టేట్‌బ్యాంక్, బీవోబీ, ఐటీసీ, ఐసీఐసీఐ, భెల్, టెక్ మహీంద్రా, హీరో మోటో లాభాలతో ముగిశాయి. టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 16.5 శాతం పెరుగుదలతో మార్కెట్ లో ఆకర్షణగా నిలిచింది. వాల్ స్ట్రీట్ వరుసగా తొమ్మిది సెషన్లలో, భారతీయ మార్కెట్లలో గత ఐదు సెషన్లలోనూ నష్టాలను ఎదుర్కొన్నాయి. జపాన్‌లో, నిక్కి చేరింది 1.6 శాతం, వాల్ స్ట్రీట్ డౌ ఫ్యూచర్స్ లో 1.3 శాతం , యూరోపియన్ మార్కెట్లు దాదాపు 1.5 శాతం పెరగడం విశేషం.ప్రాథమికంగా ఒక సెంటిమెంట్ తో బలపడ్డ మార్కెట్ ట్రెండ్ అని గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. సౌరభ్ జైన్ వ్యాఖ్యానించారు. అయితే బంగారం ధరలు మాత్రం వెలవెలబోయాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 330 రూపాయలకు నష్టపోయిన పసిడి 10 గ్రా. రూ. 30,220 వద్ద ఉంది. రూపాయి 0.02 పైసల నష్టంతో 66.73 వద్ద ఉండగా, అటు డాలర్ కూడా బలహీన ట్రెండ్ లో ఉంది. -
హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను విజయం వరిస్తే ల పరిస్థితేమిటా? అనే సందిగ్ధత మార్కెట్లలో నెలకొంది. ఇన్ని రోజులు హిల్లరీ గెలుపు అవకాశాలతో మార్కెట్లు ఆశాజనకంగా స్పందించాయి. కానీ చివరి దశలో అంచనాలు తారుమారు అవుతూ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పీఠం వరించబోతుందా అనగానే, మార్కెట్లలో కలవరం ప్రారంభమైంది. అటు అమెరికా మార్కెట్లే కాదు, ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఎన్నికల నేపథ్యంలోనైనా మార్కెట్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏమిటి? హిల్లరీ విజయం సాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం... స్టాక్ మార్కెట్లు : హిల్లరీ గెలిస్తే... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఇప్పటికే మార్కెట్లు ఓ అంచనాల్లో ఉన్నాయి. కాబట్టి తాను గెలిస్తే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. మూలధన పన్నులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు హిల్లరీ పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రిస్క్‌తో కూడుకున్న ఈక్విటీలపై పడనుందని తెలుస్తోంది. ఫైనాన్స్ , డ్రగ్ కంపెనీలు ఆమె గెలుపు అతిపెద్ద నష్టం. ఇటు బ్యాంకులకు ఇవి అత్యంత కఠినతరమైన ఎన్నికలుగా విశ్లేషకులు చెబుతున్నారు. కఠినతరమైన నిబంధనలు, పన్నుల మార్పులు కంపెనీలను ఎక్కువగా దెబ్బతీయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. క్లింటన్ హయాంలో ఫార్మా స్యూటికల్, బయోటెక్ స్టాక్స్ చాలా ఒత్తిడికి లోనయ్యాయి. డ్రగ్స్ ధరలు విపరీతంగా పెంచడాన్ని ఆమె నియంత్రించారు. అమెరికా ఎన్నికల ఆందోళనతో ఇప్పటికే యూరోపియన్ హెల్డ్ కేర్ ఇండస్ట్రి తమ రేటింగ్‌ను తగ్గించుకుంది. ఎప్పుడైతే హిల్లరీ గెలుపు అవకాశాల్లో పడిపోతుందనగానే, ఈ షేర్లు లాభపడటం ప్రారంభమయ్యాయి. మరోవైపు శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీ ప్రొడ్యూసర్లపై ఆమె ఎక్కువగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇది కూడా ఎనర్జీలో కొన్ని స్టాక్స్‌కు ప్రతికూలం చూపించనున్నట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే... యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులంటున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ 11 నుంచి 13 శాతం పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. జపాన్ ఎగుమతి దారులకు గండికొట్టి యెన్ విలువ దిగజారే అవకాశం ఉందట. అయితే ట్రంప్ నేతృత్వంలో డ్రగ్స్ తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా లాభపడనున్నాయని వెల్లడవుతోంది. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా ట్రంప్‌పై మొగ్గుచూపుతున్నాయని తెలుస్తోంది. సివిల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ ఇండస్ట్రి అతిపెద్ద లాభప్రదాయనిగా నిలువనుందట. క్లింటన్ కంటే ట్రంప్ ఎక్కువగా సివిల్ మౌలికసదుపాయాల రంగంలో ఖర్చు చేయనున్నారని మొదటి నుంచి తెలుస్తోంది. కరెన్సీలపై ఈ ఎన్నికల ప్రభావం.. హిల్లరీ గెలిస్తే.. ఇతర అభివృద్ది మార్కెట్లతో పోలిస్తే అమెరికా డాలర్ ఎక్కువగా లాభపడనుందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వెంటనే డిసెంబర్లో రేట్లపెంపు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రష్యా మినహా ఇతర ఎమర్జింగ్ దేశాల కరెన్సీలు పాజిటివ్‌గానే ట్రేడ్ కానున్నాయంట. క్లింటన్ గెలుపుపై చైనా యువాన్ ఎక్కువగా బలపడనుందని టాక్. ట్రంప్ గెలిస్తే.. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పదవిలోకి వస్తే, ఇతర మేజర్ కరెన్సీలు యెన్, యూరో, పౌండ్లతో పోలిస్తే డాలర్ విలువ బలహీనపడనుందని తెలుస్తోంది. ఫెడ్ ద్రవ్యవిధానపరపతి సమీక్షలో రేట్ల పెంపు మరికొన్ని రోజుల వాయిదా పడనుందని విశ్లేషకులంటున్నారు. అయితే గ్రీన్ బ్యాక్ కరెన్సీ మాత్రం మూడు నుంచి తొమ్మిది నెలల ర్యాలీ జరుపనుందట. కమోడిటీలు ఎలా స్పందించనున్నాయి.. హిల్లరీ గెలిస్తే.. హిల్లరీ మొదటి నుంచి పర్యావరణ విధానాలపై ఎక్కువగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులపై హిల్లరీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నారు. కోల్ వాడకం తగ్గించి సహజవాయువుల ఉపయోగాన్ని పెంచుతానని ఆమె అంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్ అండ్ ఆయిల్ షేర్లు ఒత్తిడి పడి, సహజ వాయువుల మార్కెట్ ఎక్కువగా అభివృద్ధి చెందనుందని విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే.. అయితే ట్రంప్ నేతృత్వంలో కోల్ ఎక్కువగా లాభపడి, సహజవాయువులకు దెబ్బకొట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం. సెప్టెంబర్‌లో బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందట. రిపబ్లికన్ అభ్యర్థి నేతృత్వంలో సహజ వాయువుల డిమాండ్ 11 శాతం క్షీణిస్తుందని, కోల్ వాడకం విపరీతంగా పెరుగుతుందని తెలిసింది. అదేవిధంగా గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా అతిపెద్ద లాభదాయకమైన కమొడిటీలుగా ఉండనున్నాయి. ఎఫ్‌బీఐ, హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ వాడక ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని పునఃవిచారణ చేపడుతుందనగానే, అన్ని విలువైన మెటల్స్ ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వెండి 3.4 శాతం, బంగారం 2 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే డాలర్ క్షీణిస్తూ వచ్చింది. -
దసరా ముగిసింది.. చెత్త మిగిలింది
రోడ్లు, మార్కెట్ల వద్ద పేరుకుపోయిన చెత్త దిబ్బలు బెంగళూరు(బనశంకరి): దసరా.. ఆయుధపూజ, విజయదశమి పండుగ నేపథ్యంలో బీబీఎంపీ పరిధిలో నగరంలోని ప్రముఖ మార్కెట్లు, రోడ్లతో పాటు ప్రముఖ వీధుల్లో చెత్తపేరుకుపోయి రాసులు దర్శనమిస్తున్నాయి. ఆయుధపూజ నేపథ్యంలో రెండు రోజులుగా ప్రజలు నగరంలో ఉన్న ప్రముఖ మార్కెట్లలో గుమ్మడికాయలు, పూలు, అరటిపిలకలు కొనుగోలు చేసి వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని రోడ్లుపై పడేశారు. దీంతో నగరవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయాయి. వీటితో పాటు నగరంలో యశవంతపుర, కేఆర్.మార్కెట్, ఏపీఎంసీ.యార్డు, యలహంక, మల్లేశ్వరం, సదాశివనగర, జయనగర,జేపీ.నగర, బసవనగుడి, బనశంకని, సారక్కి, మడివాళ తదితర మార్కెట్లు వద్ద గుమ్మడికాయలు, అరటిపిలకలు, పూలు, వ్యర్ధాలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో పౌరకార్మికులు పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి నానాపాట్లు పడుతున్నారు. మామూలు రోజుల కంటే అధికంగా చెత్తపేరుపోవడంతో కొన్నిచోట్ల జేసీబీ యంత్రాల సాయంతో చెత్తను తొలగిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో చెత్తలారీలకు పూజలు చేసి నిలిపివేశారు. బుధవారం నుంచి లారీలను బయటకు తీసిన పౌరకార్మికులు చెత్తను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రి నగరంలో వర్షం కురవడంతో చెత్తరాశుల వద్ద నీరు నిలిచిపోయి అధ్వాన్నకరంగా మారిపోయింది. దీంతో నగరవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి పౌరకార్మికులు తీవ్రంగా శ్రమిస్తుండగా పూర్తిస్థాయిలో చెత్తను తొలగించడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. -
ఎగిసే మార్కెట్లలో.. ఆచితూచి పెట్టుబడి
మార్కెట్లు ఒక్కసారిగా ఎగిసేటప్పుడు.. పెట్టుబడి అవకాశాలు కోల్పోతామేమో అన్న ఆందోళనతో తొందరపడొద్దని ఇన్వెస్టర్లకు సూచించారు యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ అజయ్ త్యాగి. షేర్లు కొనుగోలు చేసేందుకు మధ్య మధ్యలో వచ్చే కరెక్షన్లను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్లు కాస్త గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పుడు భారీ మొత్తాలు ఇన్వెస్ట్ చేస్తుంటారని, మార్కెట్లు ఏమాత్రం కరెక్షన్కు లోనైనా ఇన్వెస్ట్ చేయడానికి జంకుతుంటారని త్యాగి తెలిపారు. అయితే ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడైనా సరే ఒక 5-10 శాతం మేర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయన్నది ఇన్వెస్టర్లు గుర్తెరిగి వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇటీవలి ర్యాలీలో కొన్ని షేర్లను చూస్తే.. పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) నిష్పత్తికి దాదాపు ఇరవై రెట్లు అధిక స్థాయికి చేరాయని, మార్కెట్లు ఈ స్థాయిలో పెరిగినప్పుడు అకస్మాత్తుగా కరెక్షన్లకు లోనవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని త్యాగి పేర్కొన్నారు. ఇక, బ్యాంకుల విషయానికొస్తే... మొండిబకాయిలు మొదలైన వాటి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)పై ప్రతికూల ధోరణే ఉందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు నిధులు సమీకరించి.. వృద్ధికి వినియోగించుకోనుండగా.. పీఎస్‌బీలు తాము సమీకరించే నిధులను ఖాతాల ప్రక్షాళనకు ఉపయోగించుకోవాల్సి రావొచ్చని త్యాగి తెలిపారు. -
మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ విధానం
కరీంనగర్‌అగ్రికల్చర్: వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో త్వరలో ఆన్లైన్లో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(నామ్) అనుసం«ధిస్తామని మార్కెటింగ్ శాఖ జేడీ వి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం కరీంనగర్ మార్కెట యార్డులో జాతీయ వ్యవసాయ మార్కెట్ల విధానంపై వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా ఎంపిక చేసిన మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ డాటా ఎంట్రీ (రైతుల వివరాలు) కూడా ప్రారంభిస్తామన్నారు. నామ్ విధానంతో వ్యాపారస్తుల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి పద్మావతి, ఏడీఎం ప్రకాశ్, సూపర్వైజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నేటి టాప్ గెయినర్స్, లూజర్స్ ఇవే
టాప్ గెయినర్స్(ఎన్ఎస్ఈ నిఫ్టీ) కంపెనీ పేరు ప్రస్తుత ధర పర్సంటేజ్ గెయిన్ అరబిందో ఫార్మా 798.05 4.91 కోల్ ఇండియా 329.25 3.23 బీహెచ్ఈఎల్ 144.15 3.11 టాప్ లూజర్స్(ఎన్ఎస్ఈ నిఫ్టీ) కంపెనీ పేరు ప్రస్తుత ధర పర్సంటేజ్ లాస్ విప్రో 538.85 -1.89 హిందాల్కో 135.90 -1.52 యాక్సిస్ బ్యాంకు 558.25 -1.27 -
నేటి టాప్ గెయినర్స్, లూజర్స్ ఇవే
టాప్ గెయినర్స్.... కంపెనీ పేరు ధర శాతంలో మార్పు జిందాల్ కోటెక్స్ 15.70 19.85 నార్త్ ఈస్టర్న్ 41.00 16.48 టాప్ లూజర్స్... కంపెనీ పేరు ధర శాతంలో మార్పు బిర్లా కాట్సిన్ 0.05 -50.00 నకోడా లిమిటెడ్ 0.30 -14.29 -
వేలానికి 'సహారా' ఆస్తులు!
న్యూఢిల్లీః సహారా ఆస్తుల వేలానికి హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్ణయించినట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) తెలిపింది. సహారా గ్రూప్ నకు చెందిన ఆస్తులనుంచి రిజర్వ్ ధర 1,192 కోట్లు వద్ద పదింటిని వేలానికి పెడుతున్నట్లు వెల్లడించింది. డిపాజిట్లు పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిన సహారా గ్రూప్ వ్యవహరంలో ప్రస్తుత ఆస్తుల వేలంతో బాధితులకు త్వరలో న్యాయం జరిగేట్లు కనిపిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్పీఐ క్యాపిటల్ మార్కెట్లు సహారా గ్రూప్ లోని పది ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు సెబి తెలిపింది. హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ, ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్లు అమ్మకాలు ఈ ఆక్షన్ ద్వారా జూలై 4న ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య, తిరిగి జూలై 7న ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య వేలం నిర్వహించనున్నట్లు తెలిపింది. సహారా ఆస్తుల అమ్మకాలను చేపట్టి, బాధితులకు వెంటనే డిపాజిట్లు చెల్లించాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాల మేరకు అమ్మకాలను ప్రారంభించేందుకు హెచ్ డీ ఎఫ్ సీ రియాల్టీ 721,96 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఐదు ప్రాపర్టీలను ఆన్లైన్ లో అమ్మేందుకు నిర్ణయించినట్లు గురువారం ప్రచురించిన ఓ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలుస్తోంది. సహారా గ్రూప్ నకు సంబంధించిన ఆస్తులు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్, ఆంధ్రప్రదేశ్ ల లో ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అమ్మకాలకోసం ఎస్ బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సహారాకు సంబంధించిన ఐదు ప్రాపర్టీలను 470.04 కోట్ల రిజర్వ్ ధర వద్ద ఆన్టైన్ వేలం నిర్వహించనున్నట్లు జూన్ 10న ఓ ప్రత్యేక పబ్లిక్ నోటీసును ప్రచురించనున్నట్లు తెలిపింది. అలాగే గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లోని ఆస్తుల పాటకోసం బిడ్డర్స్ జూన్ 8,9 తేదీలలో ఆన్లైన్ లో పరిశీలించవచ్చని తెలిపింది. -
లాభాల బాటలో మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ మందగమన భయాలతో గతవారం చివరి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో, ఈ వారం మొదటి ట్రేడింగ్ లో(సోమవారం) కొనుగోలు ర్యాలీతో పుంజుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 7800 ట్రేడ్ మార్కును దాటి.. 93.60 పాయింట్ల లాభాల్లో 7827 వద్ద నడుస్తోంది. సెన్సెక్స్ సైతం 318.38 పాయింట్లు రేజ్ అయి 25536.88గా నమోదవుతోంది. ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, హిందాల్కో సెన్సెక్స్ లో లాభాలను పండిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒక్క శాతం నష్టాలను నమోదు చేస్తోంది. థైరోకేర్ టెక్నాలజీ నేటి ట్రేడింగ్ లో దూసుకెళ్తోంది. ఇష్యూ ధర రూ. 446 కంటే 49శాతం ఎక్కువ రేజ్ అయిన థైరోకేర్ ఒక్క షేరు రూ.665గా నమోదవుతోంది. మరోవైపు పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పసిడి రూ.230 నష్టంతో రూ.30,148గా నమోదవుతుండగా.. వెండి రూ.262 నష్టంతో 41,469 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.41గా ఉంది. -
దిగి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : సోమవారం విడుదల చేసిన మార్చి నెల టోకుధరల ద్రవ్యోల్బణం సూచీ శుభసంకేతాలు అందించింది. వరుసగా 17 నెలలుగా నేలచూపులు చూస్తున్న ద్రవ్యోల్బణం ఈ నెలలో కూడా పతనమైంది. క్రమేపీ దిగి వస్తూ మార్చి నెలలో 0.85 శాతంగా నమోదైంది. దీంతో గత కొంతకాలంగా భగ్గుమంటున్న టోకు ధరలు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు ఈనెలలో విడుదల అవుతున్న ఫలితాలన్నీ మార్కెట్ కు సానుకూల సంకేతాలను అందిండంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఓ వైపు టోకుధరల ద్రవ్యోల్బణం క్షీణత, మరోవైపు ఇన్ఫోసిస్ షేర్ల లాభాలు, మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో 162 పాయింట్లకు పైగా లాభపడి జోరుగా ట్రేడ్ అవుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ టోకుధరల ద్రవ్యోల్బణం 0.91శాతంగా ఉంది. ఆయిల్ ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో టోకుధరలు తగ్గినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిందటేడాది మార్చి కంటే క్రూడ్ ధరలు 8.30శాతం పడిపోయాయి. తయారీ ఉత్పత్తులు 0.13 శాతం కిందకు జారాయి. ఈ టోకుధరల ద్రవ్యోల్బణం లెక్కించడంలో వాణిజ్య ఆహారోత్పత్తులతో పాటు క్రూడ్, విద్యుత్, తయారీ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫిబ్రవరిలో 3.35 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరలు మార్చిలో 3.7శాతం కు పెరిగాయి. వాణిజ్య ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉండటంతో, అధిక వేగంతో ధరల తగ్గుదలను (డిఫ్లేషన్) నిరోధిస్తుందని ఐసీఆర్ఏ ఎకనామిస్ట్ అదితీ నాయర్ చెప్పారు. దీనివల్ల రూపాయి విలువ కూడా పెరుగుతుందన్నారు. వినియోగదారుల సూచీలో రిటైల్ ఆహారోత్పత్తులకు ముఖ్య పాత్ర ఉండగా, టోకు ధరల సూచీలో వాణిజ్య ఉత్పత్తులను, కమోడిటీలను ప్రధాన ఉత్ప్తత్తులుగా తీసుకుంటారు. -
మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..
మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియవు. అందుకే అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి బాగున్నా.. బాగోలేకున్నా.. మన ఇన్వెస్ట్మెంట్లను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు ఏమంత ఆశాజనకంగా లేవు. మార్కెట్లు బాగోలేనప్పుడే అందులో పెట్టుబడుల్ని చేయాలి. అప్పుడే అసలు ధర వద్ద స్టాక్స్ లభిస్తాయి. ఎప్పుడూ షేర్ల విలువ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు జరగాలి. ఏడాది ప్రారంభంలో పోర్ట్‌ఫోలియోను ఒకసారి సరిచూసుకొని ఇన్వెస్ట్మెంట్లను రెగ్యులర్‌గా కొనసాగించటానికి ప్రయత్నించాలి. మంచి పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఒక కళ. అంచనాలకు అనుగుణంగా గతేడాది.. గతేడాది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. దేశ ఆర్థిక వృద్ధి మాత్రం మందగించింది. ఆర్బీఐ భావించినట్లుగానే వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ చర్య డెట్ (బాండ్ల) పోర్ట్‌ఫోలియోలకు బాగా అనుకూలించింది. మార్కెట్లు కూడా పర్వాలేదనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు మంచి పనితీరు కనబరచాయి. ఈ ఏడాది సంగతేంటి? ప్రస్తుత ఏడాదిలో చైనా ఆర్థిక మందగమనం, ముడి చమురు ధరల పతనం వంటి అంశాలు అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇన్వెస్టర్లు ప్రస్తుత ఈక్విటీ మార్కెట్ల పనితీరు (అస్థిర త)ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వడ్డీ రేట్లు అనువుగా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉపయుక్తమైనవి. ఇక ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గేంచే అవకాశం ఉంది. ఈక్విటీ ధరలు తగ్గుతున్నాయ్.. ఈక్విటీ షేరుధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ విభాగంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వండి. అలాగే ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే హైబ్రిడ్ ఫండ్స్ ఉత్తమం. ప్రస్తుతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు వాటి షేరువారీ ఆర్జన (ఈపీఎస్)తో పోలిస్తే 20 రెట్లు ధరకు (పీఈ) ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం 16 రెట్లకు ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల లార్జ్ క్యాప్ షేర్లు మంచి విలువకు లభిస్తున్నట్లు లెక్క. రంగాల వారీగా చూస్తే.. ఆటో, ఫైనాన్షియల్, ఐటీ రంగాలు ఆశాజనకంగా లేవు. ఫార్మా రంగ కంపెనీలు పర్వాలేదు. వాటి షేరు ధరలు ఒక స్థాయిలోనే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ విభాగంలో మాత్రం అధిక విలువ ఉంది. స్టాక్స్ ధరలు అనుకూలం మార్కెట్ల పనితీరు దేశంలో వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు పెరిగితేనే మార్కెట్లు మంచి పని తీరును కనబరుస్తాయి. దీనికి సమయం పడుతుంది. కొందరు ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పడే వరకు వేచి ఉంటారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ప్రస్తుత ధరలు పెట్టుబడులకు అనువుగా ఉన్నాయి. సిప్ ఇన్వెస్ట్మెంట్లను పెంచుకునేటప్పుడు హైబ్రిడ్ ఫండ్స్‌కు తగిన ప్రాధాన్యమివ్వండి. అసలు ధరలకు స్టాక్స్ అం దుబాటులో ఉన్నప్పుడు వాటితో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచుకోవాలి. అసెట్స్ పెరిగే కొద్ది వాటి ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. అసెట్స్‌ను పెంచుకోవడానికి ఈ ఏడాది అనుకూలం. - నిమేశ్ షా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో -
పసిడి కళకు మార్కెట్ల ఊతం!
జాగ్రత్త తప్పదంటున్న నిపుణులు న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడికి కలిసి వచ్చింది. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది మొదటి నుంచీ స్థిరంగా ముందుకు కదులుతోంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర కీలక స్థాయి 1,100 డాలర్లను దాటింది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫెడ్ ఫండ్స్ రేటును యథాతథంగా కొనసాగిస్తామని ఇటీవలి తన ప్రకటనలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ప్రకటించడం... మార్కెట్ల పతనాన్ని నివారించలేకపోవడంతో సమీప కాలానికి పసిడిని ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా భావించడమే పసిడి ప్రస్తుత పెరుగుదలకు కారణమని ప్రస్తుతం నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవే అంశాలు ఇకముందూ పసిడిని నడిపిస్తాయని వారి అంచనా. ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఫెడ్ రేటు పెంపు అనంతరం పసిడి ధర క్రమంగా వెయ్యి డాలర్లలోపునకు పడిపోతుందని గత ఏడాది అంచనాలు వినిపించిన సంగతి తెలిసిందే. గడచిన వారాంతానికి పసిడి 1,118 వద్ద ముగియగా, వెండి 14 డాలర్లపైకి చేరింది. దేశీయంగా మూడు నెలల గరిష్టం... అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశీయంగా పసిడి బలోపేతమవుతోంది. తాజాగా ముగిసిన వారంలో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ కాలంలో సహజంగానే పసిడికి డిమాండ్ కొంత ఉంటుందని, అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణి పసిడి ధరకు మరింత బలాన్ని ఇస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరగడం, పెళ్లిళ్లు, పండుగల సీజన్ నేపథ్యంలో ముందస్తు కొనుగోళ్లు వంటి అంశాలు దేశీయంగా పసిడి డిమాండ్‌ను పెంచుతున్నాయి. వరుసగా నాల్గవ వారమూ లాభాల బాటన మెరిసింది. వారంలో పసిడి కదలికలను చూస్తే... పటిష్ట స్థాయిలో ప్రారంభమైన ధర... వారం మధ్యకు వచ్చే సరికి స్టాకిస్టులు, ట్రేడర్ల కొనుగోళ్ల మద్దతుతో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. అయితే అటు తర్వాత కొంత లాభాల స్వీకరణ జరిగింది. ఇదే సమయంలో ఈక్విటీలూ స్వల్పంగా మెరుగుపడ్డం గమనార్హం. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా రూ.320 ఎగసి రూ.26,700 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అంతే మొత్తం ఎగసి రూ.26,550 వద్దకు చేరింది. ఇక వెండి కేజీకి రూ.275 ఎగసి రూ.34,920కి చేరింది. కాగా అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా కేంద్రం గత వారం పసిడి దిగుమతుల టారిఫ్‌ను పెంచింది. -
ఐఎంటి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మార్కెటింగ్ సదస్సు
హైదరాబాద్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ టెక్నాలజీ (ఐఎంటి), హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఈ రోజు ముగిసింది. ఫ్రాన్స్ కు చెందిన ఈకోల్ డి మేనేజిమెంట్ డి నార్మండి మరియు హంగేరికి చెందిన కోర్వినస్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు - మార్కెటింగ్ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో దాదాపు 15 పరిశోధనాత్మక పత్రాలను పలువురు మార్కెట్ నిపుణులు ప్రవేశపెట్టారు. నూతనంగా విస్తరిస్తున్న మార్కెట్లలో సవాళ్ళను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు విద్యావేత్తలు ప్రసంగించారు. ప్రపంచ ఆర్దిక వ్యవస్థలో పెరుగుతున్న మార్కెట్లతొనే ఆర్దిక ప్రగతి సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్భవిస్తున్న ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఉత్పాదకతను పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ ఆర్ధిక వ్యవస్థలనుండి కొత్త ఆర్ధిక విధానానికి దారితీస్తున్న పరిస్థితులను ఆర్ధిక నిపుణులు విశ్లేషించారు. ఐఎంటి డైరక్టర్ డా..సతీష్ ఐలవాడి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడుతున్న మార్కెట్లు భిన్నత్వం, సామాజిక, రాజకీయ పాలన, మౌలికవసతుల లేమి, పారంపర్యంగా ఉన్న వనరుల లోటు, బలహీనమైన సరఫరా వ్యవస్థ వంటి అంశాలు నూతన మార్కెట్లకు సవాళ్లుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు కొత్త మార్కెట్ విధానాలను అవలింభించాలని డా..సతీష్ సూచించారు. -
అనుభవాలకు అక్షర రూపం
రాయవరం : అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతి భావాన్ని, ప్రతి సంఘటననూ, ప్రతి ఆలోచనను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం డైరీ. అందుకే డైరీ మారలేదు. దాని ప్రాధాన్యం తగ్గలేదు. కొన్ని గంటల్లో 2015 గతంలోకి వెళ్లిపోతోంది. కొత్త జ్ఞాపకాలను దాచుకోవడానికి మార్కెట్లో డైరీలు సిద్ధంగా ఉన్నాయి. సరికొత్త రూపాల్లో డైరీలు స్వాగతం పలుకుతున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే డైరీల కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రధాన పట్టణాల్లోని పుస్తక విక్రయశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో డైరీలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో రూ.30 నుంచి వందల రూపాయల విలువ చేసే డైరీలు లభ్యమవుతున్నాయి. వీటిని హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో షాపు యజమాని రూ.30 వేల నుంచి రూ.50 వేల విలువైన డైరీలను సిద్ధంగా ఉంచారు. పర్సనల్ డైరీలు ఓ వ్యక్తికి సంబంధించిన డైరీపై పూర్తి హక్కులు అతడికే ఉంటాయి. నిత్య జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రివేళ నిద్రపోయే ముందు అందులో నిక్షిప్తం చేసుకుంటారు. ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపర్చుకోవచ్చు. ప్రొఫెషనల్ డైరీలు వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమంతప్పకుండా ఉపయోగించేవి ప్రొ ఫెషనల్ డైరీలు. పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ అసిస్టెంట్‌గా సహకరిస్తుంది. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా, సమయానుకూలంగా చేయాల్సిన పనిని గుర్తుచేస్తోంది. ప్రముఖ దినాలు, ప్రయాణాలు పొందుపర్చుకోవచ్చు. -
అంత పన్ను వేస్తే ప్లాంట్లు మూసుకోక తప్పదు..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా 40 శాతం పన్ను పరిధిలోకి చేరిస్తే తాము భారత్‌లో కొన్ని ప్లాంట్లను మూసివేయాల్సి వస్తుందని బెవరేజెస్ సంస్థ కోకా కోలా ఇండియా పేర్కొంది. అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే.. మొత్తం బెవరేజిల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇష్తియాఖ్ అంజాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని ప్లాంట్లను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటని, ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టామని, 2020 నాటికి మరో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొన్నారు. అటు, 40 శాతం పన్ను రేటు చాలా ఎక్కువన్న మరో దిగ్గజ కంపెనీ పెప్సీకో.. పరిశ్రమ పరిస్థితులను బట్టి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నట్లు తెలిపింది. పొగాకు, లగ్జరీ కార్లు తదితర ఉత్పత్తుల కేటగిరీలో ఏరేటెడ్ డ్రింక్స్నూ గరిష్ట పన్ను రేటు 40 శాతం విభాగంలో చేర్చాలనిఅరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. -
లాభాల దిశగా స్టాక్ మార్కెట్లు
ముంబై: బుధవారం నాటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ట్రెండ్ పాజిటివ్ గా ఉండడంతో దాదాపు వంద పాయింట్ల లాభానికి చేరువలో ఉంది. సెన్పెక్స్ 2 పాయింట్ల లాభంతో 27,398 దగ్గర. నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 8,282 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతుస్థాయిలకు పైన నిలబడి స్థిరంగా ట్రేడవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఐటి ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ , బ్యాంకింగ్ షేర్లు లాభాల బాట పట్టాయి. , ఇన్సోఫిస్, టీసీఎస్ పాజిటివ్ గా ట్రేడవుతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో పోలీస్తే రూపాయి 7 పైసల నష్టంతో 65.12 దగ్గర ఉంది. -
మూడోరోజూ తగ్గిన మార్కెట్
67 పాయింట్ల నష్టంతో 26,780కు సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 8,108కు నిఫ్టీ అంతర్జాతీయ సంకేతాలు నిస్తేజంగా ఉండటంతో వరుసగా మూడో రోజు స్టాక్ సూచీలు నష్టాలపాలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 67 పాయింట్లు క్షీణించి 26,780 పాయింట్లు వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,108 పాయింట్ల వద్ద ముగిశాయి. టెక్నాలజీ, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మూడు రోజుల్లో 300 పాయింట్లు డౌన్ చైనా ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండడం, కమోడిటీ ధరలు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతున్నాయని విశ్లేషకులంటున్నారు. బుధవారం 26,760 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాలతో ప్రారంభమైంది. 26,869, 26,713 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 67 పాయింట్ల నష్టంతో 26,780 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయింది. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరగడం, ఈ వారంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడం ప్రభావం చూపాయి. టీసీఎస్ 4.3 శాతం డౌన్.. 30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు నష్టాల్లో ముగిశాయి.మంగళవారం వెల్లడైన టీసీఎస్ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఈ షేర్ 4.3 శాతం నష్టపోయింది. 13% సబ్‌స్క్రైబ్ అయిన కాఫీ డే ఐపీఓ కాఫీ డే ఐపీఓ తొలి రోజు 13% సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారం ప్రారంభమై శుక్రవారం(ఈ నెల16న) ముగిసే ఈ ఐపీఓ ద్వారా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.1,150 కోట్లు సమీకరించనున్నది. మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 3,293 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 14,721 ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్) 1,42,133 నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో) ఎఫ్ఐఐ 122 డీఐఐ -208 26న ఇండిగో ఐపీఓ ! ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజుల పాటు ఉండే (ఈ నెల 28న ముగిసే)ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,500 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: గురువారం నాటి దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీయై ప్రకటనతో జోరుమీదున్న మార్కెట్లు గురువారం కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 228 పాయింట్ల లాభంతో 26,383 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 7,997 దగ్గర ట్రేడవుతున్నాయి. ఒకవైపు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, మరోవైపు ఐటి షేర్లలోలాభాలు మార్కెట్ లీడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎనిమిది వేల మార్కు ను టచ్ చేయడం సెంటిమెంట్‌ను బలపరుస్తోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ లాభాల్లో కొనసాగుతోంది. 9 పైసలు లాభపడి 65.49 దగ్గర ట్రేడవుతోంది. -
21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ సర్వీసెస్ మార్కెట్ 21.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని గార్ట్నర్ పేర్కొంది. ట్యాబ్లెట్స్, నోట్‌బుక్స్ వంటి డేటా-సెంట్రిక్ పరికరాల్లో సెల్యులార్ సేవల వినియోగం పెరగటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మొబైల్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 4 శాతంగా ఉంటుందని అంచనా. డేటా సేవల వినియోగం పెరుగుదలతో మొబైల్ సేవల ఖర్చు 15 శాతం వృద్ధితో 6.5 మిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్‌లో గతేడాది 83 కోట్లుగా ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఈ ఏడాది 5 శాతం వృద్ధితో 88 కోట్లకు చేరుతుందని అంచనా. స్మార్ట్ఫోన్ల వినియోగంలో వృద్ధి వంటి అంశాలూ డేటా సేవల ఖర్చు పెరుగుదలకు దోహదపడనున్నాయి. -
గ్రీస్ సంక్షోభం ఎంతదాకా?
-
ప్రభావం లేని రవాణా సమ్మె
రోజుకంటే అదనంగా తిరిగిన ఆర్టీసీ బస్సులు ఉదయం వరకే పరిమితమైన ఆటోల బంద్ సాయంత్రం తరువాత లారీల లోడింగ్ సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రోడ్డు భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మె తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు మద్దతు ప్రటించినప్పటికీ ఒకటి రెండుచోట్ల మినహా ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల రద్దీ తీవ్రంగా ఉండ డంతో మామూలు రోజులతో పోలిస్తే గురువారం అదనంగా బస్సులు నడపడం విశేషం. దాదాపు వేయికిపైగా బస్సులు అదనపు ట్రిప్పులేశాయి. ఇక అన్ని సంఘాలు సంఘీభావం ప్రకటించినప్పటికీ ఆటోల సమ్మె మధ్యాహ్నం వరకే పరిమితమైంది. హైదరాబాద్‌లో ఓ యూనియన్ నేతలు మాత్రం కొన్నిచోట్ల ఆటోలను అడ్డుకున్నారు. మార్కెట్లపై ప్రభావం... సమ్మె కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 60 శాతం లారీలు నిలిచిపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సరుకుల లోడింగ్, అన్లోడింగ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మార్కెట్లలో పగటివేళ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రం 6 గంటల తరువాత లారీల లోడింగ్ ప్రారంభించారు. శుక్రవారం మేడే ఉండడంతో దగ్గరి ప్రాంతాలకు లోడింగ్ జరగలేదు. దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు మాత్రం లోడింగ్‌తో బయలుదేరాయి. ఆర్టీసీ బస్టాండ్లలో భోజన విరామ సమయంలో కార్మికులు నిరసనలు నిర్వహించారు. రాజధానిలో అదనంగా 350 బస్సులు హైదరాబాద్‌లో ఆటోయూనియన్లు, రవాణా రంగానికి చెందిన కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టాయి. అన్ని రూట్లలో సిటీ బస్సులు యథావిధిగా నడిచాయి. ప్రతిరోజూ తిరిగే 3500 బస్సులకు తోడు మరో 350 బస్సులు అదనంగా నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత అన్నిరకాల రవాణా వాహనాలు రోడ్లపై కనిపించాయి. -
75 రోజులు...‘పుర’ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు
- మున్సిపాలిటీలు ఇక ‘చెత్త’ రహితం - గడపగడపకూ వెళ్లి చెత్త సేకరించాలని సీఎం ఆదేశాలు - జీహెచ్ఎంసీ డిజైన్‌తో మార్కెట్లు, రైతుబజార్లు - జిల్లా కేంద్రంలో వైకుంఠధామం పేరుతో శ్మశానవాటిక - ఎల్ఈడీ లైటింగ్లు, పార్కులుగా డంపింగ్ యార్డులు - ప్రణాళిక అమలుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మెప్మా బాధ్యతలు - రేపు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా అధికారుల సమావేశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘పుర’ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నారు. ఈ 75 రోజుల్లో జిల్లాలోని పట్టణ ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా మార్చాలని, పట్టణాల్లో అనేక మార్పులు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. మున్సిపల్ పరిపాలన శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు గాను ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్‌ను మెప్మా పీడీగా నియమించారు. ఈ ప్రణాళికల అమలుపై చర్చించడంతోపాటు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా కేంద్రంలో కలెక్టర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ‘చెత్త’పైనే దృష్టి తెలంగాణలోని పట్టణాలను చెత్త రహిత నగరాలుగా మార్చాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఇందుకు తగిన ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ప్రతి పట్టణంలో చెత్త సేకరణను ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. గడపగడపకూ వెళ్లి చెత్తను సేకరించే విధానం ఇప్పటికే అమలవుతున్నా, దాన్ని మరింత పక డ్బందీగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఏమిటన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చనున్నారు. మిర్యాలగూడ, భువనగిరి యార్డులను ఇప్పటికే ఆ దిశలో తయారుచేసే పనిలో ఉండగా, మిగిలిన మున్సిపాలిటీల్లోని యార్డులను కూడా పార్కులుగా తయారుచేయనున్నారు. ఇందుకోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే చెట్లను డంపింగ్ యార్డుల్లో కూడా పెట్టనున్నారు. ఏరోమాటిక్ (సువాసన వెదజల్లే), మెడిసినల్ (ఔషధ)మొక్కలను యార్డుల్లో నాటుతామని అధికారులు చెపుతున్నారు. ఏ డంప్ విస్తీర్ణం ఎంత ఉంది? ఎన్ని మొక్కలు అవసరం అవుతాయనే దానిపై కూడా జిల్లా యంత్రాంగం లెక్కలు కడుతోంది. ప్రతి మూడో శనివారం ‘అర్బన్ డే’ చెత్తతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటు, పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. ప్రతి మార్కెట్లో రెండున్నర అడుగుల ప్లాట్‌ఫారాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయితే, ఈ మార్కెట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టాలన్న దానిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు డిజైన్లు తయారుచేస్తున్నారని, ఆ డిజైన్ల మేరకు మన జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్లను అభివృద్ధి పరుస్తామని జిల్లా ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు అన్ని పట్టణాలలో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు కోసం కూడా ఈ ప్రణాళికలో ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే పట్టణ ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అయితే, జిల్లాలోని పట్టణ ప్రాంతాల సమస్యలపై చర్చించేందుకు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘అర్బన్ డే’గా ప్రకటించనున్నట్టు తెలిసింది. -
సెన్సెక్స్ 33 పాయింట్లు అప్
రోజు మొత్తం హెచ్చుతగ్గులకులోనైన మార్కెట్లు చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలైంది. 162 పాయింట్ల వరకూ పెరిగి గరిష్టంగా 27,371ను చేరింది. ఆపై లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా ఒక దశలో 117 పాయింట్లు జారి 27,091 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం ముగింపు 27,209 కాగా, చివరికి 33 పాయింట్ల లాభంతో 27,242 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఒడిదుడుకులను చవిచూసినప్పటికీ ట్రేడింగ్ ముగిసేసరికి 27 పాయింట్లు బలపడి 8,201 వద్ద స్థిరపడింది. ఫలితంగా కొత్త ఏడాదిలో తొలి(జనవరి) సిరీస్ లాభాలతో బోణీ కొట్టింది. వెరసి వరుస నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 493 పాయింట్లు పతనమైన విషయం విదితమే. ఐటీ, మెటల్ ఓకే ప్రధానంగా రియల్టీ, ఐటీ, మెటల్ రంగాలు 0.5%పైగా పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అదే స్థాయిలో డీలాపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, సెసాస్టెరిలైట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందాల్కో, సన్ ఫార్మా, టాటా స్టీల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ 1-0.6% మధ్య లాభపడ్డాయి. మరోపక్క బ్లూచిప్ షేర్లు మారుతీ, బీహెచ్ఈఎల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, సిప్లా 1.3-0.4% మధ్య నష్టపోయాయి. -
యూపీవీసీ కిటికీలు వచ్చేశాయ్!
-
ఫండ్స్‌లో పెట్టుబడులు డీఎల్ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్ఎఫ్కు వీలు చిక్కింది. గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్‌లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌కు సోమవారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్‌లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. డీఎల్‌ఎఫ్‌పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కొనుగోళ్లపై సోయేది...
*ప్రారంభానికి నోచుకోని సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు * ప్రైవేట్ కొనుగోళ్లదే హవా.. * తక్కువ ధరకే అమ్మకం.. తూకాల్లో మోసాలు * మార్కెట్ ఆదాయానికి గండి *రైతులను ముంచుతున్న దళారులు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సాగయ్యే పంట సోయా. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు వస్తున్నా మార్కెట్ యార్డుల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో సోయాబీన్ రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దానికితోడు తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ ప్రైవేటు దందాతో మార్కెట్‌కు సెస్ రూపంలో రావాల్సిన లక్షల ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు ప్రైవేటు కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా తగ్గిన దిగుబడి.. జిల్లాలో ఈ ఏడాది 1,11,367 హెక్టార్లలో సోయాపంట విత్తారు. 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ.. వర్షాభావ పరిస్థితులు, నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. 5 లక్షల క్వింటాళ్ల వరకు రావడం గగనమే. ఒక ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు పడిపోయింది. వర్షాలు లేక విత్తిన పంట మొలకెత్తక భూమిలోనే మురిగిపోయింది. దీంతో రెండుమూడు సార్లు విత్తనాలు వేశారు. దీనికితోడు ప్రభుత్వం రాయితీపై అందించిన విత్తనాలు మొక్కలు పెరిగిన కొన్ని మండలాల్లో కాత లేదు. కొన్ని మండలాల్లో కాత ఉన్నా అందులో గింజలు లేవు. ఉన్నా చిన్నవిగా ఉండి నాణ్యత లోపించింది. కాస్తోకూస్తో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వ్యాపారులు నిర్ణయించిన ధర రూ.2200 నుంచి రూ.2500 వరకే అమ్ముకుంటున్నారు. రూ.2500 వరకు చెల్లించినా తూకంలో మోసం చేస్తున్నారు. ఈ ఏడాది ఇంత వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2560కి తక్కువగా చెల్లిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలతో.. వర్షాలతో రెండు మూడు సార్లు విత్తనాలు విత్తి రైతులు నష్టపోగా.. ప్రభుత్వం 33శాతం రాయితీపై రూ.1570లకు రైతులకు అందించిన విత్తనాలు మరింత ముంచాయి. జిల్లాలో 80 క్వింటాళ్ల వరకు విత్తనాలు అందించగా.. నాణ్యత లేకపోవడంతో తాంసి, జైనథ్, ఆదిలాబాద్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నార్నూర్, మండలాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. పలు మండలాల రైతులు పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తాం.. - కిష్టాగౌడ్, ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శి సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలతో, వ్యాపారులతో చర్చించి రెండ్రోజుల్లో ఏర్పాటు చేయిస్తాం. రైతులు పంటకు మద్దతు ధర రావాలంటే మార్కెట్ యార్డులోనే విక్రయాలు జరపాలి. సోయాలో చెత్త లేకుండా, తేమా తక్కువగా ఉండేలా చూసుకునే తీసుకురావాలి. -
మిశ్రమంగా మార్కెట్లు
సెన్సెక్స్ 22 పాయింట్లు డౌన్ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు వారాంతంలో స్వల్ప వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 22 పాయింట్లు క్షీణించి 27,090 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 8,121 వద్ద స్థిరపడింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు జమ చేసుకోవడం ద్వారా వరుసగా ఆరో వారంలోనూ లాభాలతో ముగిసినట్లయ్యింది. సెన్సెక్స్ ఇలా రెండేళ్ల క్రితం మాత్రమే వరుస లాభాలను ఆర్జించింది. కాగా, గురువారంనాటి జోష్‌తో సెన్సెక్స్ తొలుత 135 పాయింట్ల వరకూ పుంజుకుంది. గరిష్టంగా 27,247 పాయింట్లను తాకింది. ఆపై అమ్మకాలు పెరగడంతో చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 620 పాయింట్లు ఎగసింది. వెలుగులో టాటా గ్రూప్ టాటా గ్రూప్ షేర్లు వెలుగులో నిలిచాయి. గ్రూప్‌లోని కొన్ని కంపెనీల రేటింగ్‌ను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అప్‌గ్రేడ్ చేయడం దీనికి కారణమైంది. -
నెల రోజుల్లో గరిష్ట నష్టాలు
ఇటీవల వరుస లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ నీరసించాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయింది. 27,057 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆయిల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% చొప్పున తిరోగమించాయి. వెరసి నిఫ్టీ సైతం 59 పాయింట్లు క్షీణించి 8,094 వద్ద నిలిచింది. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే వారం జరగనున్న ఫెడ్ సమావేశంపై మారెట్లు దృష్టిపెట్టాయని చెప్పారు. దీనికితోడు ఇటీవల సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61 స్థాయికి బలహీనపడటం కూడా అమ్మకాలకు కారణమైనట్లు తెలిపారు. దిగ్గజాలకు నష్టాలు: సెన్సెక్స్ దిగ్గజాలలో హీరో మోటో, ఐటీసీ, ఇన్ఫీ, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, భెల్, టీసీఎస్ 2.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోపక్క సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% చొప్పు న లాభపడ్డాయి.కాగా, ట్రేడైన షేర్లలో అత్యధికం లాభపడటం విశేషం. 1,741 షేర్లు లా భాలతో పుంజుకోగా, 1,272 నష్టపోయాయి. -
మార్కెట్లకు చమురు జోష్
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు క్షీణించడంతో దేశీ మార్కెట్లకు జోష్ వచ్చింది. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 100 డాలర్ల సమీపానికి చేరగా, నెమైక్స్ ధర 93 డాలర్లకు దిగింది. దీంతో ఆయిల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. హెచ్‌పీసీఎల్, క్యాస్ట్రాల్, ఐవోసీ, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా 4.5-2.5% మధ్య జంప్ చేయగా, ఆర్ఐఎల్ 1% లాభపడింది. ఫలితంగా ఆయిల్ ఇండెక్స్ 1.8% పుంజుకోగా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ రంగాలు సైతం 1.2% చొప్పున లాభపడ్డాయి. చమురు ధరలు క్షీణించడం ద్వారా దిగ్గుమతుల భారం తగ్గుతుందని, దీంతో ద్రవ్య లోటులకు కళ్లెం పడుతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతిమంగా ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లు చేపట్టారని చెప్పారు. వెరసి సెన్సెక్స్ 293 పాయింట్లు జంప్‌చేసి 27,320 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 87 పాయింట్లు ఎగసి 8,174 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,355కు చేరగా, నిఫ్టీ 8,180ను అధిగమించింది. ఇవన్నీ కొత్త రికార్డులే. నాలుగు మాత్రమే... సెన్సెక్స్ దిగ్గజాలలో 4 మాత్రమే నీరసించాయి. ఎన్టీపీసీ 1.6%, ఎంఅండ్ఎం 0.7% చొప్పున నష్టపోగా, హిందాల్కో 3.5% ఎగసింది. మరోవైపు ఎఫ్ఐఐల అండ కొనసాగుతోంది. మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ. 1.25 లక్షల కోట్లు పెరిగింది. రబ్బర్ ధరలు పతనంకావడంతో టైర్ కంపెనీల షేర్లు అపోలో, సియట్, డన్లప్, ఫాల్కన్, గుడ్ఇయర్, జేకే, ఎంఆర్ఎఫ్, టీవీఎస్ శ్రీచక్ర 5-20% మధ్య దూసుకెళ్లాయి. -
మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!
న్యూఢిల్లీ: మార్కెట్లు ఈ వారం భారీ హెచ్చుతగ్గులను చవిచూస్తాయని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. గురువారం(28న) ఆగస్ట్ సిరీస్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌లు ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారని అభిప్రాయపడ్డారు. దీంతో ఒడిదుడుకులకు అధిక అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషించారు. చమురు ధరల తీరూ ట్రెండ్‌కు కీలకమని చెప్పారు. 29న గణేశ్ చతుర్థి సెలవు... గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా శుక్రవారం(29న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)సహా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు, ఇరాక్ సంక్షోభంపై అమెరికా ప్రతిస్పందన వంటి అంతర్జాతీయ వివాదాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. వీటితోపాటు కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య నడుస్తున్న కాల్పుల విరమణ వంటి అంశాలపైనా దృష్టిపెడతారని చెప్పారు. సెంటిమెంట్ సానుకూలం మార్కెట్లు ఈ వారం కొంత సానుకూలంగానే కదులుతాయని సియాన్స్ అనలిటిక్స్ సీఈవో అమన్ చౌధురి అంచనా వేశారు. దేశీయ ఆర్థిక అంశాల విషయానికివస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)కు సంబంధించిన జీడీపీ గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. మార్కెట్లు మెరుగ్గా ఉన్నాయని, ట్రేడ్ పొజిషన్లు, డెరివేటివ్స్ వంటి అంశాలు ప్రోత్సాహకర సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తున్నాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వెరసి ఈ వారం మార్కెట్లు కొత్త రికార్డులవైపు పరుగుతీయొచ్చనేది ఆయన అంచనా. ఫారెక్స్ ఆధారిత షేర్లపై దృష్టి గడచిన వారం మార్కెట్లు 1%పైగా లాభపడి కొత్తరికార్డులు నమోదు చేసిన నేపథ్యంలో ఈ ట్రెండ్ కొనసాగుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు. అయితే ఫారెక్స్ ఆధారిత షేర్లు, పసిడి, వెండి వంటి లోహాలు వెలుగులో నిలుస్తాయని అంచనా వేశారు. ఆగస్ట్ డెరివేటివ్స్ ముగింపు కారణంగా ఈ వారం మార్కెట్లు కొంతమేర ఊగిసలాటకు లోనవుతాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. దీంతో ట్రేడర్లు కొద్దిపాటి కీలకమైన స్టాక్స్‌పైనే దృష్టిపెడతారని తెలిపారు. గత వారం అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ కొత్త రికార్డులను తాకాయి. వారం ముగిసేసరికి 316 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 26,419 వద్ద ముగియగా, 121 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 7,913 వద్ద స్థిరపడింది. గత గురువారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 26,530ను అధిగమించి రికార్డు సృష్టిస్తే, నిఫ్టీ సైతం శుక్రవారం 7,929 పాయింట్ల గరిష్టాన్ని అందుకుంది! -
తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం
► డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యం ►వర్షాలు, క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ►విదేశీ పెట్టుబడులు, ఆయిల్ ధరలూ కీలకమే ►ఈ వారం మార్కెట్లపై స్టాక్ నిపుణుల అంచనా ►రంజాన్ సందర్భంగా ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజాల ఫలితాలు, రుతుపవన కదలికలు ఈ వారం మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు జూలై నెల డెరివేటివ్స్ గురువారం(31న) ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని అంచనా వేశారు. వీటికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల తీరు వంటి అంశాలు సైతం కీలకం కానున్నాయని చెప్పారు. కాగా, ఈదుల్ ఫితర్(రంజాన్) సందర్భంగా మంగళవారం(29న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఆటో రంగంపై చూపు జూలై నెలకు వాహన విక్రయ గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆటో రంగ షేర్లపై దృష్టిపెడతారని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడంతోపాటు, ఎఫ్అండ్ వో ముగింపు కారణంగా ఈ వారం ఇండెక్స్‌లు ఒడిదుడుకులను చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. గురువారం పారిశ్రామిక కార్మిక సంబంధ రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆవైపు చూపు నిలుపుతారని తెలిపారు. వీటితోపాటు జూలై సిమెంట్ అమ్మకాలు, హెచ్ఎస్బీసీ తయారీ రంగ గణాంకాలూ వెల్లడికానున్నాయి. ఫలితాల జాబితాలో బ్లూచిప్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) కాలానికి ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్ కంపెనీల జాబితాలో హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సెసాస్టెరిలైట్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డీఎల్ఎఫ్ తదితరాలున్నాయి. దేశీ కంపెనీల క్యూ1 ఫలితాల వె ల్లడి దాదాపు చివరిస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఐసీఐసీఐ, మారుతీతోపాటు ఐటీసీ, ర్యాన్‌బాక్సీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా వంటి కంపెనీల ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే ఉక్రెయిన్, ఇజ్రాయెల్ సంక్షోభాలనూ మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయన్నారు. ఇలాంటి అంశాలు పసిడి వంటి రక్షణాత్మక పెట్టుబడులవైపునకు దారిచూపిస్తాయని చెప్పారు. మరోపక్క, పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనా ఇన్వెస్టర్లు దృష్టి నిలుపుతారని చెప్పారు. గడిచిన వారం సెన్సెక్స్ 485 పాయింట్లు ఎగసి 26,127 వద్ద ముగియడం తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు.. ఈ నెలలో ఇప్పటివరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ బాటలో జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై 1-25 మధ్య ఈక్విటీలలో 2.2 బిలియన్ డాలర్లను(రూ. 13,166 కోట్లు) ఇన్వెస్ట్‌చేయగా, 3 బిలియన్ డాలర్ల(రూ. 17,829 కోట్లు) విలువైన డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. వెరసి జూలైలో మొత్తం ఎఫ్ఐఐల పెట్టుబడులు నికరంగా 5.2 బిలియన్ డాలర్లను(రూ. 31,000 కోట్లు) తాకాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, తీసుకువస్తున్న సంస్కరణలు వంటి అంశాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు. చిన్న షేర్లే మిన్న... గత కొన్ని నెలలుగా బుల్లిష్ ధోరణిలో కొనసాగుతున్న మార్కెట్లో మధ్య(మిడ్), చిన్న(స్మాల్) తరహా షేర్లు ప్రధాన ఇండెక్స్‌లను మించి పురోగమించాయి. జనవరి నుంచి చూస్తే మార్కెట్ల ప్రామాణిక సూచీ అయిన బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ 23% పుంజుకుంది. అయితే ఇదే సమయంలో మిడ్ క్యాప్ సూచీ దాదాపు 37% దూసుకెళ్లగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 53% జంప్ చేసింది. తద్వారా ఇటీవల మార్కెట్లపట్ల అత్యంత ఆసక్తి చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించాయని నిపుణులు పేర్కొన్నారు. కాగా, గత నాలుగేళ్ల అనిశ్చిత మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ప్రస్తుత ర్యాలీలో ఇవి సహజంగానే జోరు చూపుతున్నాయనేది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
కొత్త గరిష్టాల నుంచి నష్టాల్లోకి
సెన్సెక్స్ 145 పాయింట్లు డౌన్ ► 26,127 వద్ద ముగింపు ► 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ వారాంతం రోజున కూడా ఇటీవల అలవాటైన బాటలో మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే ప్రధాన ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 26,300కు, నిఫ్టీ 7,841కు చేరాయి. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఆపై అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. రోజు మొత్తం ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక దశలో సెన్సెక్స్ 26,007 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరికి 145 పాయింట్ల నష్టంతో 26,127 వద్ద ముగిసింది. ఇదే విధంగా కదలిన నిఫ్టీ సైతం 40 పాయింట్లు క్షీణతతో 7,790 వద్ద స్థిరపడింది. వెరసి 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ కాలంలో సెన్సెక్స్ 1,265 పాయింట్లు లాభపడ్డ సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ 5% డౌన్: ప్రధానంగా రియల్టీ, మెటల్, పవర్, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 3-1.5% మధ్య తిరోగమించగా, ెహ ల్త్‌కేర్ 2% ఎగసింది. హెల్త్‌కేర్ షేర్లలో వొకార్డ్ 14% జంప్‌చేయగా, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, లుపిన్, క్యాడిలా హెల్త్ 7-2% మధ్య పుంజుకున్నాయి. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఊరట హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌పై ఐపీవో స్కాంలో సెబీ విధించిన ఆరు నెలల నిషేధంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేను పొడిగించింది. ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ స్టే కొనసాగుతుంది. అంతకుముందు 2003-2005 ఐపీవోలో జరిగిన అవకతవకలను సెబీ నిర్థారిస్తూ ఆరు నెలల పాటు కొత్త పథకాలను, కొత్త కార్యక్రమాలను చేపట్టకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కొనసాగిన ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు 2014 జూన్‌లో (గత యేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) 10.22 శాతం పెరిగాయి. ఈ విలువ 26.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. అయితే వీటి వృద్ధి రేటు మేతో పోల్చితే (12.4 శాతం) తక్కువ కావడం గమనార్హం. ఇక దిగుమతులు ఇదే నెలలో 8.33 శాతం పెరిగి 38.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 11 నెలల గరిష్ట స్థాయిలో 11.76 బిలియన్ డాలర్లుగా నిలిచింది. జూన్‌లో బంగారం దిగుమతులు పెరగడం కూడా వాణిజ్యలోటు ఎగయడానికి దారితీసింది. బుధవారం ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసింది. రంగాల పరంగా చూస్తే... జౌళి (14.39% పెట్రోలియం ప్రొడక్ట్స్ (38.3%), ఇంజనీరింగ్ (21.57%), తోళ్లు (15%), సముద్ర ఉత్పత్తులు (27.49%), చమురు గింజలు (44.4%), పొగాకు (31%) ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ పెరగడం హర్షణీయం అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయినట్లు ఎగుమతిదారుల సంస్థ ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే వర్థమాన దేశాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఏడాదికన్నా బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 312 బిలియన్ డాలర్లుగా ఉంది. 2014-15లో ఈ విలువ కనీసం 325 బిలియన్ డాలర్లను అధిగమించాలన్నది లక్ష్యం. క్యూ1లో వాణిజ్యలోటు సానుకూలమే జూన్‌లో వాణిజ్యలోటు పెరిగినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో ఈ లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 31 శాతం తగ్గింది. విలువ రూపంలో 33.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఎగుమతులు పెరగడం, బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు నెలల్లో ఎగుమతుల వృద్ధి రేటు 9.3 శాతంగా ఉంది. విలువ 80.11 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 6.92 శాతం వృద్ధితో 113.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
నేటి బడ్జెట్‌పై ఆశలెన్నో
సాక్షి, ముంబై: ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్ ఆయేంగే’ (మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నోకల సమయంలో ముంబై అభివృద్ధికి మోడీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని ముంబైకర్లు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు, రైలు చార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు బేజారవుతున్నాడు. మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో ముంబైకి ఎంతమేర ప్రాధాన్యం ఇస్తారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముంబైలో ప్రతీరోజు 75 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అందే ఆర్థిక వనరుల్లో లోకల్ రైళ్ల వాటా అత్యధికంగా ఉంటుంది. ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ముంబైకర్లకు మొండిచేయి ఎదురవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. తీవ్రజాప్యం వల్ల వీటి వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. నిధులు లేక కొన్ని ప్రాజెక్టులు అర్థంతరంగా నిలిచిపోయాయి. కనీసం ఈ బడ్జెట్లోనైనా నిధులు మంజూరైతే అవి పూర్తవుతాయని నగరవాసులు భావిస్తున్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) ద్వారా మూడు ప్రాజెక్టులు పూర్తిచేయాలని రైల్వే బోర్డు సంకల్పించింది. అందులో మొదటి ప్రాజెక్టు కోసం రూ.3,125 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు పనులు జాప్యం కావడంతో అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు పెరిగింది. ఇందులో తొమ్మిది బొగీలున్న లోకల్ రైళ్లను 12, 15 బోగీలుగా మార్చే ప్రాజెక్టు కూడా ఉంది. రెండో ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు మంజూరు చేశారు. అనేక కారణాలవల్ల ఇవన్నీ పెండింగులోనే ఉన్నాయి. దీంతో ప్రాజెకుల్ట వ్యయం రూ.7,013 కోట్లకు చేరుకున్నా పనులు పూర్తికాలే దు. మూడో ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించినా, ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దీంతో ఠాణే-సీఎస్టీ స్టేషన్ల మధ్య ఐదు, ఆరో రైల్వే లేన్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఈ పనులు సమయానికి పూర్తయినట్లతే లోకల్ రైలు సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలు పడేది. ముంబై రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించడం, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం, రైల్వే ప్రమాదాల నివారణ, ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేదా సబ్వే నిర్మాణం వంటి దీర్ఘకాల డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు. -
ఈ ఏడాది చివరికల్లా 8,650 పాయింట్లకు నిఫ్టీ!
ముంబై: ఈ ఏడాది చివరికల్లా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ 8,650 పాయింట్లకు చేరే అవకాశమున్నదని ఆర్బీఎస్ ప్రైవేట్ వెల్త్ అంచనా వేసింది. ఇందుకు ప్రభుత్వ సంస్కరణలు, వర్థమాన మార్కెట్లలో ఇండియాకున్న సానుకూలతలు దోహదం చేస్తాయని పేర్కొంది. డిసెంబర్‌కల్లా నిఫ్టీ 7,700 పాయింట్లను తాకవచ్చునంటూ ఈ జనవరిలో ఆర్బీఎస్ అంచనా వేసిన విషయం విదితమే. అయితే ఇండియా మార్కెట్లు అత్యంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ తాజాగా అంచనాలను దాదాపు 1,000 పాయింట్ల వరకూ పెంచడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లపట్ల బుల్లిష్‌గా ఉన్నట్లు తెలిపింది. దేశీ స్టాక్స్‌పట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) చూపుతున్న ఆసక్తి కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 10న వెలువడనున్న బడ్జెట్ మార్కెట్లకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. వెరసి డిసెంబర్‌కల్లా నిఫ్టీ 8,650 పాయింట్లను తాకే చాన్స్ ఉన్నదని ఆర్బీఎస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాజేష్ చెరువు చెప్పారు. 2003నాటి పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటులకు చెక్ పడుతుందని రాజేష్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే దేశీ స్టాక్స్ చౌకగానే ట్రేడవుతున్నాయన్నారు. వెరసి 2003 నాటి దీర్ఘకాలిక బుల్‌ట్రెండ్ పరిస్థితులకు అవకాశముందని వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు తీసకొస్తున్న సంస్కరణలు ఇతరత్రా అంశాలతో ఇండియా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
నష్టాలతోనే ముగింపు!
-
ద్రవ్యోల్బణానికి ఇరాక్ సెగ : ముకేశ్
ముంబై: ఇరాక్ సంక్షోభంతో ఇంధన ధరలు పెరుగుతాయనీ, తద్వారా ద్రవ్యోల్బణం పెకైగుస్తుందనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. గురువారం ముంబైలో జరిగిన ఇండియా మర్చెంట్స్ చాంబర్ (ఐఎంసీ) 106వ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇరాక్‌లో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయన్నారు. సంక్షోభం మరింత తీవ్రరూపం దాలిస్తే క్రూడ్ దిగుమతి బిల్లు రెండు వేల కోట్ల డాలర్లమేరకు పెరిగి 20 వేల కోట్ల డాలర్లకు చేరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలిపారు. భారత ఆర్థికాభివృద్ధిని ఎవరూ ఆపలేరనీ, అయితే విద్య, మౌలిక సౌకర్యాల్లో వెనుకంజలో ఉండడం అభివృద్ధికి అవరోధంగా మారిందనీ అంబానీ వ్యాఖ్యానించారు. తానెప్పటికీ ఆశావాదిగానే ఉంటానన్నారు. భారత్ 2020 నాటికి సాధించగలదనుకున్నది 2010 నాటికే సాధించిందని అన్నారు. సమాచార రంగం వచ్చే 5-10 ఏళ్లలో భారతీయుల జీవనాన్ని సంపూర్ణంగా మార్చేస్తుందని జోస్యం చెప్పారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐఎంసీ నూతన అధ్యక్షునిగా ప్రబోధ్ ఠక్కర్, ఉపాధ్యక్షునిగా దిలీప్ పిరమల్‌ను ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు. -
7 వారాల కనిష్టానికి రూపాయి
ఇరాక్ యుద్ధ భయాలతో 36 పైసలు క్షీణత 60.39కి పడిపోయిన మారకం రేటు ముంబై: ఇరాక్‌లో యుద్ధ వాతావరణం భారతీయ రూపాయి మారక విలువపై మరింత ప్రభావం చూపింది. యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు పెరిగి, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 36 పైసలు తగ్గిపోయింది. తద్వారా ఏడు వారాల కనిష్టస్థాయి 60.39కి చేరింది. దేశీయ మార్కెట్లో మూలధన ప్రవాహంతో పాటు ఈక్విటీల ధరలు క్షీణించడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపాయని డీలర్లు చెప్పారు. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగాయి. న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్ఛేంజీలో జూలై డెలివరీ బెంచ్‌మార్క్ క్రూడ్ రేటు 41 సెంట్లు పెరిగి 106.77 డాలర్లకు చేరుకుంది. ఇరాక్‌లోని అతిపెద్ద రిఫైనరీపై మిలిటెంట్లు బుధవారం ఉదయం దాడి చేశారన్న వార్తలతో డాలర్ల కొనుగోలుకు దిగుమతిదారులు, ముఖ్యంగా చమురు రిఫైనర్లు ఎగబడ్డారు. స్థానిక ఫోరెక్స్ మార్కెట్లో ఉదయం 60.28 వద్ద ప్రారంభమైన మారకం విలువ 60.06 - 60.54 శ్రేణిలో చలించింది. చివరికి 36 పైసలు (0.06 శాతం) క్షీణించి 60.39 వద్ద ముగిసింది. గత ఏప్రిల్ 29న రూపాయి మారకం విలువ 60.42గా ఉంది. ఆ తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే ప్రథమం. -
ఉత్పాదకత, ఉన్నత ఆలోచనలు
వీటిపై దృష్టిపెట్టి సాహసోపేతంగావ్యవహరించండి * ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఉద్బోధ * ఇన్ఫీకి మరోసారి గుడ్‌బై బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెగ్గుకురావాలంటే వ్యక్తిగత ఉత్పాదకతపైనా, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్‌పైనా మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రతి ఇన్ఫోసియన్ (ఇన్ఫోసిస్ ఉద్యోగి) గొప్పగా ఆలోచించాలని, సాహసోపేతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కంపెనీ సీఈవో పగ్గాలను విశాల్ సిక్కాకి అప్పగించిన నేపథ్యంలో నారాయణమూర్తి శనివారం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి మరోసారి వైదొలిగారు. 33వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్హోల్డర్లు, ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. గడచిన ఏడాది కాలంగా తాను చేపట్టిన చర్యలతో కంపెనీ వ్యయాలు, రిస్కులు తగ్గగలవని, అమ్మకాలు మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్లు వైదొలగడంపై.. ఇటీవలి కాలంలో సీనియర్ల వలసకు కారణాలపై స్పందిస్తూ.. కొందరు ఉన్నత లక్ష్యాల సాధన కోసం వెళ్లగా, మరికొందరు సమర్థమైన పనితీరు కనపర్చలేక వైదొలిగారని మూర్తి వ్యాఖ్యానించారు. ‘దాగి ఉన్న ఆణిముత్యాలను వెలికితీసి సంస్థను నిలబెట్టే అవకాశాన్ని వారికి కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని వారిని.. వారు ఉండాల్సిన చోటుకి మార్చాలనే లక్ష్యంతో నేను ముందుకు సాగాను’ అని చెప్పారు. యోగ్యులైన వారిని లీడర్లుగా తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ పనితీరు కనపర్చే వారిని ప్రోత్సహించేందుకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ కెరియర్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. రోహన్ మూర్తిపై.. ‘కొత్త ఆలోచనలు గలవారు, యథాతథ స్థితిని అంగీకరించని వారు, తెలివైనవారు నాకు సహాయంగా ఉండాలనుకున్నాను. అందుకే రోహన్‌ను వెంట తెచ్చుకున్నాను. టెక్నాలజీ ఊతంతో మార్కెట్లో ఇన్ఫోసిస్ విభిన్నంగా ఉండగలిగేలా.. చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టే బాధ్యతను అతనికి అప్పగించాను’ అంటూ కుమారుడు రోహన్ మూర్తిపై నారాయణ మూర్తి వివరణ ఇచ్చారు. మూర్తి సహాయకుడిగా రోహన్ మూర్తి పదవీ కాలం కూడా శనివారంతో ముగిసింది. అనుబంధ సంస్థకు ప్రొడక్టుల వ్యాపారం.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్, సొల్యూషన్స్ (పీపీఎస్) వ్యాపారాన్ని దాదాపు రూ. 480 కోట్లకు తమ అనుబంధ సంస్థ ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్‌కి బదలాయించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. అయితే, ఇందులో బ్యాంకింగ్ సర్వీసుల సాఫ్ట్వేర్ పినాకిల్ ఉండదని సంస్థ పేర్కొంది. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఎడ్జ్వెర్వ్ను ఇన్ఫీ ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది. మూడేళ్లలో రెండోసారి వీడ్కోలు.. మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన ఇన్ఫోసిస్ నుంచి మూర్తి 2011 ఆగస్టులో వైదొలిగిన సంగతి తెలిసిందే. 65 ఏళ్లు నిండటంతో కంపెనీ నిబంధనల ప్రకారం ఆయన తప్పుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇన్ఫీ పనితీరు అంతంత మాత్రంగా మారుతుండటంతో కంపెనీ బోర్డు ఒత్తిడి మేరకు గతేడాది జూన్ 1న మూర్తి మరోసారి సంస్థ పగ్గాలు చేపట్టారు. సహకరించేందుకు తన కుమారుడు రోహన్ మూర్తిని కూడా ఆయన వెంట తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. తాజాగా ప్రముఖ టెక్నోక్రాట్ విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవోగా నియమితులైన నేపథ్యంలో కంపెనీ నుంచి వైదొలగాలని మూర్తి నిర్ణయించుకున్నారు. దీంతో మూడేళ్లలో రెండోసారి ఇన్ఫీకి గుడ్‌బై చెప్పినట్లయింది. వాస్తవానికి ఆయన 2013 జూన్ 1 నుంచి అయిదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగాల్సి ఉంది. ‘కొత్త మేనేజ్మెంట్కి బాధ్యతల బదలాయింపు సులభంగా జరిగేందుకు, టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్‌ను దిగ్గజంగా తీర్చిదిద్దే క్రమంలో సిక్కాకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశంతో నేను ముందుగానే వైదొలుగుతున్నాను’ అని ఏజీఎంలో నారాయణ మూర్తి చెప్పారు. అక్టోబర్ 10 దాకా ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నుంచి చైర్మన్ ఎమెరిటస్‌గా కొనసాగుతారు. -
సెన్సెక్స్ రయ్ రయ్....
468 పాయింట్లు జూమ్...; 24,685 పాయింట్లకు చేరిక * ఆర్బీఐ పాలసీపై సానుకూల అంచనాల ప్రభావం * విదేశీ మార్కెట్ల పటిష్టత కూడా... * 133 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ, 7,362 పాయింట్ల వద్ద ముగింపు * ఆకర్షణీయమైన ఫలితాలతో 6.4% ఎగసిన ఎల్అండ్టీ షేరు ముంబై: మార్కెట్లలో మరోసారి ‘బుల్’ రంకేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు... మరోపక్క విదేశీ స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ సూచీలు కదంతొక్కాయి. కన్సూమర్ గూడ్స్, చమురు-గ్యాస్, విద్యుత్, మెటల్స్ రంగాల షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మెరుపులు మెరిపించాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 468 పాయింట్లు దూసుకెళ్లి... 24,685 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడచిన మూడు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే అతిపెద్ద లాభం, వారం రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 133 పాయింట్ల భారీ లాభంతో 7,363 పాయింట్ల వద్ద ముగిసింది. రోజంతా దూకుడే... దేశీ మార్కెట్లు సోమవారం రోజంతా లాభాలతో పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గత ముగింపు 24,217 పాయింట్లతో పోలిస్తే సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 24,369 వద్ద ప్రారంభమైంది. ఆతర్వాత లాభాల జోరును అంతకంతకూ కొనసాగిస్తూ... 24,709 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు 1.83 శాతం లాభంతో పటిష్టస్థాయిలో 24,685 వద్ద స్థిరపడింది. జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగానే(2013-14లో వృద్ధిరేటు 4.7 శాతం) ఉన్న నేపథ్యంలో.. మార్కెట్లలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అయితే, చాలావరకూ బ్యాంకర్లు, నిపుణులు మాత్రం ఆర్బీఐ నేడు చేపట్టనున్న సమీక్షలో పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, మే నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ భారత్ తయారీ రంగ సూచీ(పీఎంఐ)లో పరిశ్రమలు కాస్త పుంజుకున్న సంకేతాలు కనబడటం కూడా మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసిందని బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం... వృద్ధిని తిరిగి గాడిలోపెట్టగల సమర్థ నిర్ణయాలు తీసుకోగలదన్న విశ్వాసం పెరుగుతుండటం కూడా దేశీయ మార్కెట్లో బుల్లిష్ ధోరణిని పెంచుతోందని కోటక్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ఇక చైనా తయారీ రంగం పుంజుకోవడం ఆసియా మార్కెట్లకు టానిక్‌లా పనిచేసింది. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక సెలవు కారణంగా చైనా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లు పనిచేయలేదు. రెండు రంగాలు మినహా... బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ రంగాల సూచీల్లో స్వల్ప నష్టాలు మినహా మిగతా అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే నిలిచాయి. ప్రధానంగా కన్సూమర్ గూడ్స్ సూచీ అత్యధికంగా 4.93 శాతం ఎగబాకింది. ఇక బ్యాంకింగ్ 3.28 శాతం, చమురు-గ్యాస్ సూచీ 2.85 శాతం, విద్యుత్ సూచీ 2.38 శాతం, మెటల్స్ 1.86 శాతం, రియల్టీ 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా అంచనాలకంటే ముందే ఆర్బీఐ రేట్ల కోత ఉండొచ్చని, తాజా పాలసీలో ఈ మేరకు నిర్దిష్ట సంకేతాలు ఉంటాయన్న అభిప్రాయంతో బ్యాంకింగ్, రేట్లతో సంబంధం ఉన్న రంగాల షేర్లు పుంజుకున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ అంచనాలను మించిన ఫలితాలతో బంపర్ లాభాలను ప్రకటించడంతో కంపెనీ షేరు రివ్వున ఎగసింది. 6.23 శాతం జంప్ చేసి రూ.1,645 వద్ద స్థిరపడింది. ప్రాథమిక గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు సోమవారం నికరంగా రూ.234 కోట్ల విలువైనస్టాక్స్ను కొనుగోలు చేసినట్లు అంచనా. భారతీ ఎయిర్టెల్ 5.52%, ఓఎన్‌సీజీ 5.17%, టాటా స్టీల్ 4.42%, ఎస్బీఐ 4.23%, యాక్సిస్ బ్యాంక్ 3.59%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.26%, మారుతీ 3.06%, గెయిల్ 2.86%, హెచ్డీఎఫ్సీ 2.31%, ఇన్ఫోసిస్ 1.92%, రిలయన్స్ 1.84%, టాటా మోటార్స్ 1.58% చొప్పున ఎగబాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 స్టాక్స్‌లో 24 లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో నగదు విభాగంలో టర్నోవర్ రూ.3,619 కోట్లకు పరిమితమైంది. గత శుక్రవారం ఈ మొత్తం రూ.10,538 కోట్లు కావడం విశేషం. ఇక ఎన్ఎస్ఈ క్యాష్ విభాగంలో రూ.17,718 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. -
ఒక్కరితో సరి!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నా ఎన్నికల్లో విజయం కోసం మంత్రివ ర్గ విస్తరణ చేపడుతున్నట్లు హంగామా చేసిన కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. మార్పులు, చేర్పులతో కలిసి కనీసం నలుగురైదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా కేవలం ఒక్కరితో మాత్రమే సరి అనిపించారు. వైద్యవిద్యాశాఖ మంత్రిగా అవ్హాడ్.. వైద్యవిద్యాశాఖ మంత్రిగా కల్వా-ముంబ్రా యువ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్నారాయణన్, అవ్హాడ్తో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. నందుర్బార్ జిల్లాకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ బాట పట్టడంతో ఆయనను పార్టీలోంచి వెలివేయాల్సి వచ్చింది. దీంతో గావిత్ వద్ద ఉన్న వైద్యవిద్యాశాఖమంత్రి పదవి ఖాళీ కావడంతో దానిని అవ్హాడ్‌కు కట్టబెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఫౌజియాఖాన్పై వేటు లేనట్లే... ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగిసింది. దీంతోపాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు సన్నగిల్లినట్టేనని అంతా భావించారు. ఈ పదవిని విజయ్‌కుమార్ గావిత్ సొంత సోదరుడు శరద్ గావిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎలాంటి మార్పులు చేయకూడదని, మంత్రి పదవిలో ఆమెనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగానే కాంగ్రెస్ కోటా.. కాంగ్రెస్ కోటాలోని మూడు పదవులు కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు స్థానాలను ఎవరితోనూ భర్తీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ వాటాలోని మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, వసంత్ పుర్వే తదితరులు ఉన్నారు. నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహాన్ని నింపినట్లే అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
‘రియల్’ లాభాలు కావాలంటే..
భారత్ వంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులపరంగా రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, షాపు, అభివృద్ధి చేయని భూమి... దేని లాభాలు దానికున్నాయి. వీటిని కొనుగోలు చేసే వారు ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ధరకు తిరిగి అమ్మడం ద్వారా లాభం (క్యాపిటల్ గెయిన్స్) పొందడానికి కొంటున్నారా లేక వీటిని అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొందడానికి కొనుగోలు చేస్తున్నారా అనే అంశంలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండాలి. బాండ్లు, ఈక్విటీల వంటి ఆస్తులకు భిన్నమైనది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో అపార్ట్మెంటు లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నపుడు ఆ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయా అనేది పరిశీలించాలి. బిల్డర్ ట్రాక్ రికార్డును తెలుసుకోవాలి. ఇంకా పొందాల్సిన పర్మిట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. సదరు ఆస్తిపై మీ పెట్టుబడిని, ఎంత ఆదాయం వస్తుందన్న అంశాలను గమనించాలి. పోర్టుఫోలియోలో ప్రాధాన్యతలు... భూమిని కొంటున్నట్లయితే నిర్వహణ వ్యయం ఎంతవుతుందో లెక్కించాలి. ఆక్రమణలను నివారిం చడానికి ఆ భూమిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలతోపాటు స్థిరాస్తి కొనదలుచుకున్న ప్రాంతంలో పరిస్థితులను గమనిస్తుండాలి. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలు, బంగారం, సెక్యూరిటీలకు ప్రాధాన్యతను పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుండాలి. ఆదాయ సామర్థ్యం దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం ధనికులకు అత్యంత ఆకర్షణీయమైనది. క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు స్థిరాదాయం కూడా ఇస్తుంది. షేర్లయినా, రియల్ ఎస్టేట్ అయినా అన్ని అంశాలనూ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. నిర్దిష్ట ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. -
రేసు గుర్రాలు చిన్న షేర్లు
స్వల్ప వెనకడుగు తరువాత మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. మోడీ మంత్రివర్గంపై అంచనాలతో బుధవారంనాటి నష్టాలకు విరుద్ధంగా సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. మిడ్ సెషన్‌కల్లా 226 పాయింట్లకుపైగా ఎగసి 24,500ను అధిగమించింది. చివర్లో లాభాల స్వీకరణకు అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 76 పాయింట్ల లాభాన్ని మిగిల్చుకుని 24,374 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్లు బలపడి 7,276 వద్ద నిలిచింది. నిఫ్టీకిది కొత్త గరిష్ట స్థాయి ముగింపు! కాగా, ఇటీవల రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్న చిన్న, మధ్య తరహా షేర్లు మరోసారి దూకుడు ప్రదర్శించాయి. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2.2% చొప్పున ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 2,069 పురోగమిస్తే, కేవలం 774 నష్టపోయాయి. పసిడి షేర్ల మెరుపులు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలించడంతో జ్యువెలరీ షేర్లు లాభాలతో మెరిశాయి. టీబీజెడ్, పీసీ జ్యువెలర్స్ 20% చొప్పున దూసుకెళ్లగా, గీతాంజలి జెమ్స్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, టైటన్, గణేశ్ జ్యువెలర్స్ 12-5% మధ్య జంప్ చేశాయి. వీటితోపాటు బ జాజ్ ఎలక్ట్రికల్స్, వీడియోకాన్, విర్ల్‌పూల్ 11-6% మధ్య పురోగమించడంతో వినియోగ వస్తురంగం 7% ఎగసింది. ఈ బాటలో రియల్టీ 5.5% పుంజుకోగా, పవర్, మెటల్స్ 2% స్థాయిలో లాభపడ్డాయి. రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ 10-4% మధ్య పుంజుకున్నాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో ఎంసీఎక్స్, గుజరాత్ ఆల్కలీస్, సుజ్లాన్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, ఎన్‌హెచ్‌పీసీ, లవబుల్ లింగరీ, బాంబే డయింగ్, త్రివేణీ టర్బయిన్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ 20-11% మధ్య ఎగశాయి. మరోవైపు సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, మారుతీ, సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఆర్ఐఎల్, ఎస్బీఐ 5-2% మధ్య పురోగమించగా, హిందాల్కో, భెల్, భారతీ, హెచ్డీఎఫ్సీ, విప్రో 3-2% మధ్య నష్టపోయాయి. -
మళ్లీ ఐపీవోలవైపు కంపెనీల చూపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళుతున్న నేపథ్యంలో దేశీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు క్యూకట్టే అవకాశముంది. ఎన్డీఏ నేతృత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్న కారణంగా ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు. వెరసి మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 24,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు సమాయత్తంకాగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐపీవోలను నిర్వహించే మర్చంట్ బ్యాంకర్ల సమాచారంమేరకు కనీసం 12 సంస్థలు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రైమ్ డేటాబేస్ నివేదిక ప్రకారం 14 సంస్థలు రూ. 2,796 కోట్ల సమీకరణకు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మార్కెట్లు మందగించడంతో గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించిన విషయం విదితమే. -
ఎయిర్‌టెల్‌లాభం హైజంప్
న్యూఢిల్లీ: కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 89% అధికంగా రూ. 962 కోట్ల నికర లాభాన్ని పొందింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 509 కోట్లను మాత్రమే ఆర్జించింది. కాల్ చార్జీలు పెరగడం, డేటా బిజినెస్ నుంచి ఆదాయం పుంజుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం 93%పైగా ఎగసి రూ. 1,900 కోట్లను తాకడం పనితీరు మెరుగుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం 13%పైగా వృద్ధితో రూ. 22,219 కోట్లకు చేరింది. గతంలో రూ. 19,582 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో వాయిస్ సర్వీసులపై నిమిషానికి 37.07 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. ఇది 2.08 పైసలు అధికంకాగా, నెట్వర్క్ వినియోగం 4.6% పెరిగి 264.8 బిలియన్ నిమిషాలను తాకినట్లు వెల్లడించింది. కాగా, క్యూ4లో అంతర్జాతీయ ఆదాయం(ఆఫ్రికా, దక్షిణాసియా) 3% వృద్ధితో 121 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 7,300 కోట్లు) చేరింది. ఆఫ్రికా కార్యకలాపాలపై 12.4 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1.80 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. పూర్తి ఏడాదికి సైతం... పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ నికర లాభం దాదాపు 22% వృద్ధితో రూ. 2,773 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 2,276 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక ఆదాయం సైతం 11%పైగా పెరిగి రూ. 85,746 కోట్లకు చేరింది. గడిచిన ఏడాదిలో కంపెనీ పనితీరు సంతృప్తినిచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఇతర ముఖ్యాంశాలివీ... ఇండియాలో మొబైల్ డేటా ఆదాయం 89% ఎగసి రూ. 1,325 కోట్లకు చేరింది. మార్చి చివరికి మొబైల్ డేటా కస్టమర్ల సంఖ్య 33.5% పెరిగి 58.1 మిలియన్లకు చేరింది. 3జీ కస్టమర్ల సంఖ్య 10 మిలియన్లుగా నమోదైంది. ఇండియాలో ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 196. క్యూ4లో డేటా ఏఆర్పీయూ 43%పైగా పుంజుకుని రూ. 79కు చేరింది. మార్చి చివరికల్లా కంపెనీ రుణాలు రూ. 60,542 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు 1% నష్టంతో రూ. 335 వద్ద ముగిసింది. -
4 నెలల్లో 10 బిలియన్ డాలర్లు ఇన్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లపట్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వెరసి 2014 తొలి నాలుగు నెలల్లో ఇటు ఈక్విటీలలో 5 బిలియన్ డాలర్లు, అటు రుణ పత్రాల(డెట్ సెక్యూరిటీస్)లో మరో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో జనవరి నుంచీ ఎఫ్ఐఐల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను(రూ. 60,000 కోట్లు) తాకాయి. ఫలితంగా దేశంలోకి ఇప్పటివరకూ ప్రవహించిన ఎఫ్ఐఐల పెట్టుబడుల మొత్తం విలువను 200 బిలియన్ డాలర్లకు చేరింది. సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. అయితే ఏప్రిల్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు ఈక్విటీలలో రూ. 8,500 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, డెట్ మార్కెట్ల నుంచి రూ. 7,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
రూ. 8,400 కోట్ల నష్టపరిహారం రావాల్సిందే: జీఎంఆర్
న్యూఢిల్లీ: విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో తలెత్తిన వివాదంలో మాల్దీవుల ప్రభుత్వం నుంచి తమకు 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,400 కోట్లు) నష్ట పరిహారం రావాల్సిందేనని జీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ‘తమ ప్రభుత్వం భారతీయ కంపెనీకి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. అయితే చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయ సమ్మతమైనంత మొత్తానికి దీనిని కుదిస్తాం’ అంటూ మల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూం చేసిన ప్రకటన నేపథ్యంలో జీఎంఆర్ పై విధంగా స్పందించింది. పరిహారం చెల్లిస్తామని మాల్దీవుల ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించడం విశేషం. మరోవైపు చట్టబద్ద కాంట్రాక్టు రద్దు చేసినందున నష్ట పరిహారం 1.4 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిందేనని జీఎంఆర్ పట్టుబడుతోంది. కోర్టు వెలుపల పరిష్కారం కోసం మాల్దీవుల ప్రభుత్వం యత్నిస్తోందన్న వార్తలను జీఎంఆర్ ఖండించింది. కాగా, మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దు వివాద కేసు సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో నడుస్తోంది. గత వారం ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఇరువాదనలు విని కాంట్రాక్టు చట్టబద్దమా కాదా అన్నది విచారణ తొలిదశలో తేలుస్తారు. మే చివరి కల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఎంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ణయమవుతుంది. -
విప్రో ఫలితాలు ఓకే
బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజం విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో రూ.2,227 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 1,729 కోట్ల లాభంతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 29 శాతం వృద్ధి నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా వార్షికంగా 21.7 శాతం పెరుగుదలతో రూ.11,704 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.9,613 కోట్లుగా ఉంది. పరిశ్రమ విశ్లేషకులు, మార్కెట్ నిపుణులు క్యూ4లో కంపెనీ నికర లాభం రూ.2,106 కోట్లుగా, ఆదాయాన్ని రూ.10,541 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగం ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)ను అంతంతమాత్రంగానే విప్రో ప్రకటించింది. డాలర్ రూపంలో 1.715-1.755 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువన 61.62గా పరిగణించి ఈ గెడైన్స్‌ను ఇచ్చింది. కాగా, క్యూ4లో ఆదాయం డాలర్ రూపంలో 1.72 బిలియన్ డాలర్లుగా నమోదు కావడం గమనార్హం. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం పెరిగింది. యూరప్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, అమెరికాలో పటిష్టమైన వృద్ధి, మెరుగైన వ్యయ నిర్వహణ వంటివి ఫలితాల జోరుకు కారణాలుగా నిలిచాయి. సీక్వెన్షియల్‌గా: గతేడాది డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం రూ.2,015 కోట్లతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్లో లాభం 10.5 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మొత్తం ఆదాయం కూడా 11,327 కోట్ల నుంచి 3.3 శాతం సీక్వెన్షియల్ వృద్ధిని నమోదు చేసుకుంది. పూర్తి ఏడాదికి ఇలా: 2013-14 పూర్తి ఏడాదిలో విప్రో నికర లాభం రూ,7,797 కోట్లకు ఎగబాకింది. 2012-13లో రూ.6,636 కోట్లతో పోలిస్తే 17.5% వృద్ధిచెందింది. మొత్తం ఆదాయం రూ.33,685 కోట్ల నుంచి రూ.43,755 కోట్లకు పెరిగింది. 16% వృద్ధి నమోదైంది. ఉత్పాదకత పెంపునకు అనుసరించిన మెరుగైన వ్యూహాలు, కాంట్రాక్టుల అమలు గడువును తగ్గించుకోవడంపై దృష్టిపెట్టడం ద్వారా పటిష్టమైన ఫలితాలను సాధించగలిగామని విప్రో సీఈఓ టీకే కురియన్ చెప్పారు. ఇతర ముఖ్యాంశాలు.. ఐటీ సేవల విభాగం ఆదాయం క్యూ4లో రూ.10,619 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గా 2.5 శాతం, వార్షిక ప్రాతిపదికన 24% చొప్పున పెరిగింది. పూర్తి ఏడాదికి ఈ విభాగం మొత్తం ఆదాయం 18% వృద్ధితో రూ.39,950 కోట్లకు ఎగసింది. క్యూ4లో కొత్తగా 59 మంది క్లయింట్లు జతయ్యారు. ఇందులో 5 మెగా డీల్స్ కూడా ఉన్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.2 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి ఏడాదికి డివిడెండ్ మొత్తం రూ. 8కి చేరింది. మార్చి చివరినాటికి విప్రో ఐటీ సేవల వ్యాపారంలో సిబ్బంది సంఖ్య 1,46,053 మందిగా నమోదైంది. ఆఫ్‌షోర్ సిబ్బందికి 6-8 శాతం, ఆన్సైట్ ఉద్యోగులకు 2-3 శాతం పెంపుదలకు అవకాశం ఉందని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) సౌరభ్ గోవిల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 2.39 శాతం ఎగబాకి రూ.586 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో టేడింగ్ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. -
రతన్ టాటాకు అరుదైన గౌరవం
బీజింగ్: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. చైనా ప్రభుత్వ మద్దతు కలిగిన, అత్యంత ప్రభావవంతమైన బోవో ఫోరమ్ ఫర్ ఆసియా (బీఎఫ్ఏ) బోర్డులో ఆయనకు సభ్యత్వం లభించింది. భారతీయ పారిశ్రామిక ప్రముఖునికి బీఎఫ్ఏ బోర్డులో చోటు దక్కడం ఇదే ప్రప్రథమం. బోవో (చైనా)లో జరుగుతున్న బీఎఫ్ఏ సదస్సుకు హాజరైన భారతీయ కాన్సుల్ జనరల్ కె.నాగరాజ్ నాయుడు గురువారం ఈ విషయం తెలిపారు. బీఎఫ్ఏ సభ్యత్వంతో టాటా గ్రూప్‌నకు ప్రపంచస్థాయి వాణిజ్య, పారిశ్రామిక గ్రూప్‌గా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. పదిహేను మంది సభ్యులు గల బీఎఫ్ఏ బోర్డులో జపాన్, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్‌ల మాజీ ప్రధానులతో పాటు అమెరికా ట్రెజరీ సెక్రటరీ హెన్రీ పాల్సన్లకు సభ్యత్వం ఉంది. దావోస్ సదస్సుకు అనుగుణంగా 2001లో బీఎఫ్‌ఏను ఏర్పాటు చేశారు. -
సీబీఐది మతిలేని లాజిక్: భవే
ముంబై: తనపై ప్రాథమిక విచారణ(పీఈ)ను మొదలుపెట్టిన సీబీఐది పిచ్చి లాజిక్ అంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ మాజీ చైర్మన్ సీబీ భవే ఎదురుదాడికి దిగారు. ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు 2008లో లెసైన్స్ మంజూరు చేయడంపై సీబీఐ భవేపై పీఈ నమోదు చేసిన నేపథ్యంలో భవే ఇలా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి కొన్నేళ్ల క్రితమే ఆదాయపన్ను(ఐటీ) శాఖ దర్యాప్తును ముగించడంతోపాటు, ఈ కేసులో ఎలాంటి విషయమూ లేదంటూ పేర్కొన్న విషయాన్ని భవే ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నిజాన్ని సీబీఐ విస్మరించడమేకాకుండా మతితప్పి వ్యవహరిస్తున్నదంటూ వ్యాఖ్యానించారు. 1975 బ్యాచ్‌కు చెందిన మాజీ మహారాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ అయిన భవే రుజువులుంటే సీబీఐ తనపై తప్పకుండా విచారణను చేపట్టవచ్చునని చెప్పారు. రుజువులు చూపలేకపోతే తన గౌరవానికి భంగం కలిగించినందుకు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్‌కు లెసైన్స్ మం జూరు చేయడంలో ప్రమోటర్ జిగ్నేష్ షా లబ్దిపొందారన్న అభియోగం అర్థంలేనిదని, నిజానికి ఇందువల్ల ఎక్స్ఛేంజీల మధ్య పోటీకి తెరలేపామని వివరించారు. సీబీఐ విచారణ సరికాదు: పరేఖ్ మరోవైపు భవే లాంటి నిజాయితీ గల అధికారులపై సీబీఐ విచారణ చేపట్టడం సరికాదని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా.. దీని వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని చెప్పారు. -
నిఫ్టీ 7,600 పాయింట్లకు!
ముంబై: భారత్‌పై అంతర్జాతీయ అనిశ్చితి ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టాయని.. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్న సంకేతాలు కనబడుతున్నాయని అమెరికన్ బ్రోకరేజి దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. దీంతో భారత్‌ను ‘ఓవర్‌వెయిట్’(మరింత వృద్ధికి అవకాశం) స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాదు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ ఈ ఏడాది 7,600 పాయిట్లను తాకొచ్చని కూడా అంచనా వేసింది. నిఫ్టీ తాజాగా ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. ‘ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో క్యూ2(ఏప్రిల్-జూన్), ఆ తర్వాత నుంచి వృద్ధి రేటు రికవరీ మెరుగుపడనుంది. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడం(క్యూ3లో 0.9 శాతమే), ఫారెక్స్ నిల్వల పెరుగుదల, డాలరుతో రూపాయి విలువ కొంత స్థిరపడటం వంటి సానుకూలాంశాలు ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనున్నాయి’ అని గోల్డ్‌మన్ శాక్స్ తన రీసెర్చ్ నోట్లో వెల్లడించింది. సాధారణ ఎన్నికలు దేశీ స్టాక్ మార్కెట్‌కు కీలకమైనవని, ఎన్నికల ప్రభావంతో లాభపడేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌పై దృష్టిపెట్టాలని తన క్లయింట్లకు సూచించింది. ‘ఏప్రిల్-మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల పురోగతిపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. గత ఎన్నికల సమయంలో మార్కెట్ కదలికలు, వాల్యుయేషన్(విలువ), పెట్టుబడి ప్రవాహాలను విశ్లేషిస్తే... ప్రస్తుత ఎన్నికల ముందస్తు(ప్రి ఎలక్షన్) ర్యాలీ మరింత జోరందుకోవడానికి ఆస్కారం ఉంది’ అని అభిప్రాయపడింది. ఎన్నికలతో లాభపడే స్టాక్స్‌లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ వంటివి ఉన్నాయని కూడా తెలిపింది. అయితే, ఎన్నికల ఫలితాలు అనిశ్చితికి దారితీస్తే స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోయే రిస్క్‌లు పొంచిఉన్నాయని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఐటీ, ఇంధన రంగాలపై ఓవర్‌వెయిట్ స్థాయిని కొనసాగిస్తున్నామని, ఆటోమొబైల్ రంగాన్ని కూడా ఇప్పుడు దీనిలోకి తీసుకొచ్చినట్లు బ్రోకరేజి దిగ్గజం వెల్లడించింది. బ్యాంకులు, యుటిలిటీ రంగాలను మార్కెట్ వెయిట్; హెల్త్‌కేర్, టెలికం, రియల్టీ రంగాలను అండర్‌వెయిట్ స్థాయిలో ఉంచినట్లు వివరించింది. -
పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కొంచెం ఊరటనిస్తూ... జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిబాటలోకి ప్రవేశిం చింది. మూడు నెలలపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలో ఉన్న ఈ సూచీ 2014 జనవరిలో స్వల్పంగా 0.1% వృద్ధిని (2013 జనవరితో పోల్చితే) నమోదుచేసుకుంది. విద్యుత్, మైనింగ్ రంగాలు ఈ సానుకూల ఫలితానికి కొంత కారణం. కాగా మొత్తం సూచీలో 75% వాటా ఉన్న తయారీ రంగం మాత్రం ఇంకా నీరసంగానే ఉంది. రంగాల వారీగా ... విద్యుత్ ఉత్పత్తి రంగం జనవరిలో 6.5% వృద్ధిని నమోదుచేసుకుంది. 2013 జనవరిలో ఈ రేటు 6.4%. మొత్తం ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం జనవరిలో (-) 1.8% క్షీణబాట నుంచి 0.7% వృద్ధిలోకి మళ్లింది. తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నుంచి 0.7 క్షీణతలోకి జారింది. వినియోగ వస్తువుల రంగం 2.5 శాతం వృద్ధి నుంచి 0.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ రంగంలో క్షీణత మరింత పెరిగింది. ఇది -2.5 శాతం క్షీణత నుంచి - 4.2 క్షీణతలోకి జారింది. ఊహించిన విధంగానే... తాజా గణాంకాలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఐఐపీ తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తయారీ రంగం క్రియాశీలత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. -
స్టీల్ ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: మార్చి నుంచి స్టీల్ ధరలు పెరగనున్నాయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)తో పాటు, ప్రయివేట్ రంగ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ధరల్ని పెంచుతున్నాయి. మార్చి 1 నుంచి స్టీల్ ధరలను టన్నుకి రూ. 1,000 వరకూ పెంచనున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. ఇక జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఇప్పటికే టన్ను ధరపై రూ.750 వరకూ వడ్డించనున్నట్లు తెలిపింది. ముడిఇనుము ధరలతోపాటు, రవాణా చార్జీలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా వైజాగ్ స్టీల్ పేర్కొంది. వెరసి వివిధ రకాల ఉత్పత్తులపై టన్నుకి కనిష్టంగా రూ. 750, గరిష్టంగా రూ. 1,000ను పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ బాటలో ఎస్సార్ స్టీల్ కూడా వచ్చే నెల నుంచి టన్నుకి రూ. 1,000 వరకూ స్టీల్ ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్కు తయారీ వ్యయాలు పెరగడానికితోడు డిసెంబర్ క్వార్టర్లో స్టీల్‌కు కొంత డిమాండ్ పుంజుకోవడం కూడా ధరల పెంపుకు కారణమైనట్లు ఆ వర్గాలు వివరించాయి. మూడోసారి ఈ ఏడాది ఇప్పటివరకూ స్టీల్ ధరలు రెండు సార్లు పెరిగాయి. ప్రస్తుత ప్రతిపాదనల నేపథ్యంలో స్టీల్ ధరలు మూడోసారి హెచ్చనున్నాయి. దేశీయ స్టీల్ తయారీ సంస్థలు ఇప్పటికే జనవరి-ఫిబ్రవరిలో టన్నుకి రూ. 2,500-3,000 స్థాయిలో ధరలను పెంచాయి. ఇందుకు ముడిసరుకుల ధరలు, రవాణా వ్యయాలే కారణమైనప్పటికీ ఇటీవల స్టీల్‌కు డిమాండ్ పుంజుకోవడం కూడా దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విదేశాలకు స్టీల్ ఎగుమతులు వృద్ధి చెందుతుండటంతో దేశీయంగా అధిక సరఫరాకు చెక్ పెట్టేందుకు కంపెనీలకు వీలు చిక్కుతోంది. ఇది మరోవైపు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు కూడా దారి చూపుతోంది. అయితే ధరల పెంపును మార్కెట్లు పూర్తిస్థాయిలో గ్రహించే అవకాశాలు తక్కువేనని పరిశ్రమ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్టీల్ వినియోగం అంత ప్రోత్సాహకరంగా ఏమీలేదని, ఈ నేపథ్యంలో ధరల పెంపు కొనసాగేదీ లేనిదీ చూడాల్సి ఉన్నదని జయంత్ రాయ్ వ్యాఖ్యానించారు. రేటింగ్ దిగ్గజం ఇక్రాకు చెందిన కార్పొరేట్ రంగ విభాగానికి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా జయంత్ పనిచేస్తున్నారు. ఇదీ ధరల తీరు: నిర్మాణ రంగంలో వినియోగించే టీఎంటీ బార్లు, స్ట్రక్చర్లు వంటి లాంగ్ ప్రొడక్ట్‌ల ధరలు ప్రస్తుతం టన్నుకి రూ. 37,000-39,000 స్థాయిలో ఉన్నాయి. ఇక ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు కొనుగోలు చేసే హెచ్ఆర్ క్వాయిల్, సీఆర్ క్వాయిల్ వంటి ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల ధరలైతే టన్నుకి రూ. 39,500-43,500 మధ్య పలుకుతున్నాయి. -
శ్రమించే వాతావరణాన్ని సృష్టించాలి: కొచర్
గాంధీనగర్: భారత్‌ను ఆర్థిక సేవల కేంద్రంగా రూపొందించాలని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ బుధవారం చెప్పారు. దీని కోసం మరింత వృద్ధి సాధిం చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకాకుండా ద్రవ్యలోటు, కరంట్ అకౌంట్ లోటుల్లో స్థిరత్వాన్ని సాధించాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాలని ఆమె సూచించారు. ఆర్థిక సేవలు మరింత వృద్ధి చెందడానికి భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్(గిఫ్ట్) సిటీలో ‘ఆర్థిక సేవలు-ఆర్థిక వృద్ధికి కీలక చోదక శకి’్త అన్న అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆమె మాట్లాడారు. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన శ్రమించే వాతావరణాన్ని సృష్టించాల్సి ఉందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రేక్షకుడిగా పాల్గొన్న ఈ సెమినార్లో ఆమె ఉద్ఘాటించారు. -
ఎయిర్ కోస్టా భారీ ఆర్డర్
సాక్షి, విజయవాడ: దక్షిణ భారత దేశంలో విమానయాన సర్వీసులను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకున్న ‘ఎయిర్ కోస్టా’ మరో 50 ఈ-జెట్స్ విమానాలు కొనేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయిర్ ఎస్ఏ అనే విమానాల తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లో గురువారం జరిగిన ఒక ఎయిర్ షోలో ఎయిర్ కోస్టా ఛైర్మన్ లింగమనేని రమేష్, ఎంబ్రాయిర్ కమర్షియల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో పౌలో సిజర్ సిల్వా మధ్య 2.94 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,300 కోట్లు) ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ190-ఈ2ఎస్, ఈ195-ఈ2ఎస్ మోడల్ విమానాలు 25 చొప్పున 2018 నాటికి ఎయిర్ కోస్టాకు అందుతాయి. ఈ190ఈ2 మోడల్ విమానంలో 98 ద్వితీయశ్రేణి, ఆరు ప్రథమశ్రేణి సీట్లుంటాయి. ఈ195-ఈ2లో 118 సీట్లు, 12 ప్రథమశ్రేణి సీట్లుంటాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలతోపాటు ఉత్తరభారతదేశంలోని అహ్మదాబాద్,ై జెపూర్లతో కొన్ని పట్టణాలకు ఎయిర్ కోస్టా సంస్థ సేవలను అందిస్తోంది. నూతన విమానాలను కొనుగోలు చేయడం ద్వారా వైజాగ్, గోవా, పూనా, మధురై వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని, కొన్ని నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపడంతో పాటు వ్యాపార లావాదేవీలు బాగా జరిగే పట్టణాలకు విమాన సేవలు అందించాలని భావిస్తోంది. ఎయిర్ కోస్టాతో ఒప్పందం ద్వారా భారతదేశంలో తమ సంస్థ అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సిల్వా తెలిపారు. కొత్తగా విమానాలు కోనుగోలు చేయడం ద్వారా భారత దేశమంతంటికీ తమ సంస్థ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఎయిర్ కోస్టా చైర్మన్ లింగమనేని రమేష్ తెలిపారు. -
ఈసారి రికార్డే
నాగపూర్: ఈ ఏడాది 263.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని భారత్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే అధికమని అన్నారు. నగరంలో కృషి వసంత్-2014 జాతీయ వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చేరుకున్న 259 మిలియన్ టన్నుల కంటే ఈసారి నాలుగు మిలియన్ టన్నులు అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు వల్ల గతేడాది 255.36 మిలియన్ టన్నులకు మాత్రమే ఆహార ధాన్య ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈసారి ఆశించినమేర కన్నా అధికంగ వర్షాలు కురవడంతో పాటు ఖరీఫ్, రబీ పంట సేద్యం పెరిగిందని పవార్ అన్నారు. దీనివల్ల ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో భారత్ తొలిస్థానంలో ఉంద ని, గోధుమ, పత్తిలో రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. పాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉందని తెలి పారు. 92 మంది విజయవంతమైన రైతులు ప్రదర్శనను మెచ్చిన పవార్, వీరితో మిగతా రైతు లు కూడా పంటల ఉత్పత్తిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్‌వో) ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ముందస్తు అంచనాల ప్క్రారం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో 4.6 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. ఐదు రోజుల పాటు ప్రదర్శన పారిశ్రామిక విభాగం సీఐఐ సహకారంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కృషి వసంత్ జాతీయ వ్యవసాయ ప్రదర్శనను ఆదివారం నుంచి ఐదు రోజులు పాటు నిర్వహిస్తోంది. గత వందేళ్లలో ఐసీఏఆర్ సాధించిన విజయాలతో పాటు వ్యవసాయ పరిశోధన చరిత్ర ను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనకు సుమారు ఐదు లక్షల మంది రైతులు సందర్శించే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్రి వెబ్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. శిక్షణకు రాని రైతు లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వెలుగులో ఆటో, మెటల్ షేర్లు
కొన్ని ఎంపికచేసిన షేర్లలో దేశీయ సంస్థలు వరుసగా రెండోరోజు కొనుగోళ్లు జరపడంతో బుధవారం స్టాక్ సూచీలు తొలి నష్టాల నుంచి కోలుకుని, స్వల్పలాభాలతో ముగిసాయి. ఎఫ్ఎంసీజీ, రిఫైనరీ షేర్లలో తొలుత అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 20,076 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత ఐటీ, మెటల్, ఆటోమొబైల్ షేర్లు పెరగడంతో సెన్సెక్స్ వేగంగా కోలుకుని, చివరకు 49 పాయింట్ల లాభంతో 20,261 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ 5,963 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యింది. చివరకు 21 పాయింట్లు లాభపడి 6,022 పాయింట్ల వద్ద ముగిసింది. తాజా ఫలితాల్లో తక్కువ నష్టాన్ని ప్రకటించిన ర్యాన్‌బాక్సీ 6 శాతంవరకూ ర్యాలీ జరపగా, మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కో, ఎన్‌ఎండీసీలు 2-5% మధ్య పెరిగాయి. క్రితం రోజు ఫలితాలు వెల్లడించిన టెక్ మహీంద్రా 4% పెరగ్గా, టీసీఎస్, విప్రోలు 1-2.5% మధ్య ఎగిసాయి. ఆటో షేర్లు టాటా మోటార్స్, మహీంద్రా, బజాజ్ ఆటోలు 2-3 శాతం మధ్య పెరిగాయి. ఐటీసీ, రిలయన్స్, బీహెచ్ఈఎల్లు స్వల్పంగా తగ్గాయి. నిఫ్టీ ఆప్షన్లలో పెరిగిన పుట్ బిల్డప్: సోమవారం 6,000 స్ట్రయిక్ వద్ద భారీ పుట్ రైటింగ్ జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు, మంగళ, బుధవారాల్లో ఇంట్రాడేలో 6,000 దిగువకు నిఫ్టీ పడిపోయినా, ఆ స్థాయిని ముగింపులో నిలబెట్టుకోగలిగారు. తద్వారా వారు విక్రయించిన పుట్స్ వల్ల నష్టంరాకుండా చూసుకున్నారు. ఒక రోజు ఐటీసీని, మరో రోజు టీసీఎస్‌ను కొనడం ద్వారా నిఫ్టీని 6,000 స్థాయిపైకి చేర్చగలిగినట్లు క్యాష్, డెరివేటివ్ డేటాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఇదే స్ట్రయిక్ వద్ద పుట్ ఆప్షన్లో మరో 5.83 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 75.75 లక్షల షేర్లకు చేరింది. 5,900 పుట్ ఆప్షన్లో కూడా బిల్డప్ 59.18 లక్షల షేర్లకు పెరిగింది. ఇంకా 6,000 కాల్ ఆప్షన్లో మాత్రం బిల్డప్ 25.45 షేర్ల వద్ద పరిమితంగా వున్నా, 6,100 కాల్ ఆప్షన్లో బిల్డప్ 43.85 లక్షల షేర్లకు చేరింది. సమీపంలో 6,000పైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ 6,100 స్థాయికి చేరచ్చన్నది డేటా సూచన. -
టెక్నాలజీ ‘ఎవరెస్ట్’ పై... తెలుగోడు
బిల్ గేట్స్... స్టీవ్ బామర్... తరవాతి పేరు మన వాడిదే. తెలుగువాడు సత్య నాదెళ్లదే. 39 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈఓగా హైదరాబాదీ సత్య నాదెళ్ల ఎంపికయ్యాడు. మణిపాల్, విస్కాన్సిన్ మీదుగా హైదరాబాద్ నుంచి రెడ్మండ్ చేరిన ఈ సత్య... తన కుమారుడికి బుద్ధిమాంద్యం ఉండటంతో అలాంటి పిల్లల కోసం హైదరాబాద్‌లో ఏకంగా స్కూలే పెట్టారు. ప్రతి భారతీయుడికీ ఆయన ప్రస్థానం స్ఫూర్తినిచ్చేదే. న్యూయార్క్: నిన్న మొన్నటిదాకా ఊహగానాలకి పరిమితమైనది మొత్తానికి వాస్తవరూపం దాల్చింది. మరో అమెరికన్ దిగ్గజానికి మన ఇండియన్ సారథ్యం వహించనున్నారు. 78 బిలియన్ డాలర్ల టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి సీఈవోగా మన తెలుగువాడు సత్య నాదెళ్ల నియమితులయ్యారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. సత్యను సీఈవోగా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. బిల్‌గేట్స్ నెలకొల్పిన మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో మన సత్య నాదెళ్ల (47) ముచ్చటగా మూడో సీఈవో. తనతో పోటీపడిన గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుందర్ పిచ్చయ్యను తోసిరాజని సత్య దీన్ని దక్కించుకున్నారు. క్రికెట్ అంటే ఇష్టపడే సత్య.. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. ప్రస్తుత సీఈవో స్టీవ్ బామర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇండిపెండెంట్ డెరైక్టర్ జాన్ థాంప్సన్ తాజాగా చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బిల్ గేట్స్ ఇకపై టెక్నాలజీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. కంపెనీ ఉత్పత్తులు, టెక్నాలజీల రూపకల్పనకు దిశానిర్దేశం చేయడంపై దృష్టి పెడతారు. ఒకవైపు విండోస్, ఆఫీస్ వ్యాపార విభాగాలు క్షీణిస్తుండటం మరోవైపు.. డివైజ్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొంగొత్త రంగాల్లోకి మైక్రోసాఫ్ట్ విస్తరిస్తున్న తరుణంలో సత్య సీఈవోగా బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 31,400 కోట్ల డాలర్లు. మైక్రోసాఫ్ట్‌కి తగిన సారథి.. కంపెనీ కొత్త మార్పులకు లోనవుతున్న తరుణంలో .. సంస్థను ముందుంచి నడిపేందుకు సత్యను మించి మరొకరు లేరంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, అందర్నీ ఏకతాటిపైకి తేగలిగే సత్తా గల నాయకుడిగా సత్య తన సామర్థ్యాన్ని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నారంటూ గేట్స్ ప్రశంసించారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్‌కి సరైన సారథి సత్య అని స్టీవ్ బామర్ పేర్కొన్నారు. ఆయనతో 20 ఏళ్లకుపైగా కలసి పనిచేశానని, మైక్రోసాఫ్ట్‌కి సరైన సమయంలో సరైన నాయకుడు లభించారన్నారు. అసాధ్యాలను సాధ్యం చేయగలం.. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజున ఉద్యోగులకు రాసిన ఈమెయిల్లో సత్య.. ‘అసాధ్యాలను సాధ్యం చేయగలమని నమ్మాలి.. అసంభవమన్న భ్రమలను తొలగించగలగాలి’ అంటూ ప్రసిద్ధ రచయిత ఆస్కార్ వైల్డ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. సాఫ్ట్వేర్ శక్తిని పూర్తి స్థాయిలో వెలికి తీసుకురాగలగడంతో పాటు డివైజ్‌ల ద్వారా, సర్వీసుల ద్వారా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థా సాధికారత సాధించగలిగేలా చూడగలగడం తమ వల్లే సాధ్యపడుతుందని సత్య పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు మరింత వేగంగా స్పందించడంతో పాటు మరిం తగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సత్య వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో ప్రపంచాన్నే మార్చేసిన అరుదైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌కి సీఈవో బాధ్యతలు చేపట్టడం తనకెంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో సంప్రదాయానికన్నా.. నవకల్పనలకే పెద్దపీట దక్కుతుందని సత్య చెప్పారు. సత్య... మిస్టర్ నైస్ గై పూర్తి పేరు: నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం: అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, బుక్కాపురం పుట్టిన సంవత్సరం: 1967, హైదరాబాద్‌లో వయసు: 47 కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. తండ్రి బీఎన్ యుగంధర్ నాయుడు మాజీ ఐఏఎస్ అధికారి. నివాసం: వాషింగ్టన్లో. చదువు: బేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌తో మొదలు డిగ్రీలు: మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అమెరికా మిల్వాకీలోని విస్కాన్సిన్ వర్సిటీ నుంచి ఎంఎస్. షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ. ఉద్యోగ ప్రస్థానం: తొలుత సన్మైక్రోసిస్టమ్స్లో చేరారు. తరవాత 1992 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో. {పస్తుత స్థానం: క్లౌడ్ కంప్యూటింగ్ హెడ్ వేతనం: 76 లక్షల డాలర్లు (2012-13) కలిసొచ్చినవివే... స్టీవ్ బామర్ కన్నా సత్యకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. విస్తృతమైన ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. 1992లో మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరాక... క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఈయనను ‘క్లౌడ్ గురు’గా పిలుస్తారు మైక్రోసాఫ్ట్‌కు చెందిన 2000 కోట్ల డాలర్ల సర్వర్ అండ్ టూల్స్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్‌కు చెందిన ఆర్ అండ్ డీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రో సాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు. ఆఫీస్ 365 ప్రోగ్రామ్ విజయం వెనక ఆయన కృషి ఎంతో ఉంది. ‘క్లౌడ్ ఓఎస్’ ఘనత సత్యదే.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్నెట్ స్కేల్ క్లౌడ్ సేవలను దీనిమీదే నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల అధునాతన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకూ ఇదే కీలకం అయింది. అంతేగాక మైక్రోసాఫ్ట్‌లో 20 బిలియన్ డాలర్ల వ్యాపారమైన సర్వర్ అండ్ టూల్స్ విభాగానికి అధిపతిగా ఆయన దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఆన్లైన్ సర్వీసెస్ డివిజన్, బిజినెస్ డివిజన్లలో ఆయన గతంలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 38 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌లే ఇంతవరకూ సీఈవోలుగా పనిచేశారు. ఇప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు మూడో సీఈవో. క్రికెట్ ఎన్నో నేర్పింది... కవితలన్నా, క్రికెటన్నా సత్య నాదెళ్లకు చాలా ఇష్టం. క్రికెట్ వల్లే టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని సీఈవోగా తన నియామకం ఖరారైన అనంతరం ఆయన చెప్పారు. అత్యంత సుదీర్ఘంగా సాగే టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ఆసక్తికరమైన మలుపులు తిరిగే మ్యాచ్‌ను చూస్తుంటే.. రష్యన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుందని చెప్పారాయన. కవితలైతే రహస్య సంకేతాల్లా అనిపిస్తాయన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అది చూశాకే ఆ కంపెనీలో చేరానని చెప్పారాయన. ‘నేను నిర్మించడాన్ని, నిరంతరం నేర్చుకోవడాన్ని ఇష్టపడతా. ఇప్పటికీ తరచు బోలెడన్ని ఆన్లైన్ కోర్సులు చేస్తుంటా. అప్పట్లో మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు ప్రతి శుక్రవారం రాత్రి షికాగోకి వెళ్లేవాణ్ణి. శనివారాలు క్లాసులకు హాజరయ్యి.. మళ్లీ సోమవారానికల్లా రెడ్మండ్ (మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉన్న చోటు)కి వచ్చేసేవాణ్ని. దాదాపు రెండున్నరేళ్లు పట్టింది కానీ... మొత్తానికి మాస్టర్స్ డిగ్రీ అలా పూర్తి చేసేశా. కొత్తవి నేర్చుకోవటం ఆపేస్తే మనం ఉపయోగకరమైన పనులు చేయడం మానేసినట్లేనన్నది నా ఉద్దేశం’’ సన్నిహితుల సంతోషం... హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ బాస్‌గా సత్య నాదెళ్ల నియామకం గురించి తెలియటంతో ఆయన కుటుంబం, బంధుమిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన తల్లిదండ్రులుంటున్న నివాసానికి సన్నిహితులు, విలేకరులు వెల్లువెత్తారు. అయితే, సత్య తండ్రి , మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎస్.యుగంధర్ మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన స్పందన కోసం మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపినా స్పందించలేదు. మరోవైపు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌పీఎస్ సొసైటీ కార్యదర్శి ఫయాజ్ ఖాన్ వెల్లడించారు. హెచ్‌పీఎస్‌లో చదివిన సత్యకి.. ఫయాజ్ సహాధ్యాయి. తగిన సమయం చూసుకుని సత్యను స్కూలుకు ఆహ్వానిస్తామని ఖాన్ చెప్పారు. సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త శిఖరాలను అధిరోహించగలదని మరో సహాధ్యాయి, నగరానికి చెందిన టెక్నాలజీ సంస్థ మాజీ సీఈవో అయిన ఎం.చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక భారతీయుడు సీఈవో కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇంజనీరింగ్ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ సీఎండీ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. సత్య నియామకంపై హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థి, అపోలో హాస్పిటల్స్ సీఈవో హరి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
సెన్సెక్స్ 240 పాయింట్లు డౌన్
ద్రవ్యోల్బణం ఒక వినాశకర వ్యాధి అంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఉధృతిని సృష్టించాయి. ఈ నెల 28న చేపట్టనున్న పరపతి సమీక్షలో వడ్డీ రేట్లపై రామన్ ఎలా స్పందిస్తారో అన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యాపించాయి. వెరసి వడ్డీ ప్రభావిత రంగాలు 3% పతనమయ్యాయి. వరుసగా రెండు రోజుల కొత్త గరిష్టాలను తాకుతూ వచ్చిన సెన్సెక్స్ వారాంతంలో ఒక్కసారిగా నీరసించింది. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో 240 పాయింట్లు పతనమై వారం రోజుల కనిష్టమైన 21,133 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఇదే భారీ నష్టంకాగా, ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు రియల్టీ, యంత్రపరికరాలు, వినియోగ వస్తువులు, బ్యాంకింగ్ 3-2% మధ్య దిగజారాయి. వీటితోపాటు ఆటో, మెటల్స్, హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ, పవర్ సూచీలు సైతం 1.5% స్థాయిలో క్షీణించడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 79 పాయింట్లు కోల్పోయి 6,267 వద్ద స్థిరపడింది. పతనానికి పలు కారణాలు ఇటీవల ఆహార సరుకుల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలకు 7.2% నుంచి 6.1%కు ఉపశమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇన్వెస్టర్లలో కొంతమేర ఆశలు నెలకొన్నాయని, అయితే రాజన్ వ్యాఖ్యలు వీటిపై నీళ్లు జల్లాయని మార్కెట్ల పతనంపై విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదిచాలదన్నట్లు పరపతి విధానాలకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆర్బీఐ నిపుణుల కమిటీ సూచించడం ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని చెప్పారు. ఇక మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిందని తెలిపారు. మార్కెట్లు ముగిశాక రూపాయి విలువ ఆరు నెలల కనిష్టాన్ని చవిచూడటం గమనార్హం. కాగా, చైనా తయారీ రంగం మందగించడంతో విదేశీ మార్కెట్లు బలహీనంగా మారడం కూడా అమ్మకాలకు కారణమైందని విశ్లేషకులు వివరించారు. మరిన్ని విశేషాలివీ.. ఇటీవల పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్ఐఐలు తాజాగా రూ. 231 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. పంజాబ్‌లోని తోన్సా ప్లాంట్‌లో తయారయ్యే ఔషధ ఎగుమతులను సైతం యూఎస్ఎఫ్డీఏ తాజాగా నిషేధించడంతో ర్యాన్‌బాక్సీ షేరు ఏకంగా 20% నేలకూలింది. సెన్సెక్స్ దిగ్గజాల్లో ఎన్టీపీసీ, ఆర్ఐఎల్ మాత్రమే నామమాత్ర లాభాలతో నిలదొక్కుకున్నాయి. బ్లూచిప్స్‌లో భెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, సెసా స్టెరిలైట్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, టాటా పవర్, ఐటీసీ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. చిన్న షేర్లకు ప్రాతినిధ్యంవహించే మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% నష్టాలను చవిచూశాయి. నీరసించిన సెంటిమెంట్‌ను పట్టిచూపుతూ ట్రేడైన షేర్లలో 1,759 నష్టపోగా, 890 మాత్రమే లాభపడ్డాయి. -
2013లో డీల్ మార్కెట్ డీలా
ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న బలహీనతలను అద్దం పడుతూ 2013లో డీల్ మార్కెట్ డీలా పడింది. దేశీయ కంపెనీలకు సంబంధించిన దేశ, విదేశీ కొనుగోళ్లు, విలీనాల కార్యకలాపాలు మందగించి 31.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 12% తక్కువకాగా, 2009లో మాత్రమే ఇంతకంటే తక్కువ స్థాయిలో 21.5 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరిగాయి. థామ్సన్ రాయిటర్స్ రూపొందించిన వివరాల ప్రకారం డీల్స్ పరిమాణం సైతం దాదాపు 13% తగ్గింది. 2012లో 1,107 డీల్స్ నమోదుకాగా, 2013లో 967కు పరిమితమయ్యాయి. నాలుగో క్వార్టర్లో జరిగిన డీల్స్ విలువ 7.1 బిలియన్ డాలర్లుకాగా, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 30% తగ్గాయి. అయితే మూడో క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం 29% అధికం. సగటు పరిమాణం ఓకే గతే డాదితో పోలిస్తే డీల్స్ సగటు పరిమాణం 2013లో 7.61 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో ఇది 7.35 డాలర్లుగా నమోదైంది. దేశీయ విలీనాలు, కొనుగోళ్లపై ఆర్థిక మందగమనం భారీ ప్రభావాన్నే చూపింది. దీంతో దేశీయ డీల్స్ 69% క్షీణించి 5.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతంలో 2004లో మాత్రమే ఇంతకంటే తక్కువగా 2 బిలియన్ డాలర్ల డీల్స్ జరిగాయి. వీటిలో అధిక శాతం అంటే 1.5 బిలియన్ డాలర్ల డీల్స్ మెటీరియల్స్ రంగంలో నమోదయ్యాయి. మొత్తం దేశీయ డీల్స్ పరిమాణంలో ఇవి 29.4%కు సమానం. అయితే గతేడాదితో పోలిస్తే ఈ రంగంలో జరిగిన డీల్స్ 75.4% తక్కువ. కాగా, మరోవైపు ఇదే కాలంలో దాదాపు 57% అధికంగా 24.7 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ డీల్స్ జరిగాయి. దేశీయ కంపెనీలకు సంబంధించిన డీల్స్ 49.5% పుంజుకుని 19.4 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాదిలో ఇవి 19.4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇంధనం, విద్యుత్ రంగాల విలీనాలు, కొనుగోళ్లు 173% పెరిగి రూ. 6.7 బిలియన్ డాలర్లకు చేరగా, హెల్త్‌కేర్ కంపెనీల డీల్స్ దాదాపు 25% ఎగసి 5 బిలియన్ డాలర్లను తాకాయి. -
ఇక ఫలితాలే దిక్సూచి..
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లు జోరు చూపుతాయని అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు అంతర్జాతీయ సంకేతాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు వంటివి సహకరిస్తాయని తెలిపారు. వీటికి జనవరి రెండో వారంనుంచీ వె లువడనున్న ‘అక్టోబర్-డిసెంబర్’ త్రైమాసిక ఫలితాల అంచనాలు జత కలుస్తాయని చెప్పారు. ఇక మరోవైపు డిసెంబర్ నెలకు బుధవారం(జనవరి 1న) వెల్లడికానున్న వాహన అమ్మకాల నేపథ్యంలో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని వివరించారు. సమీప కాలానికి మార్కెట్లను త్రైమాసిక ఫలితాలే నడిపిస్తాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. వారం మధ్యలో కొత్త క్యాలండర్ ఏడాది(2014) మొదలుకానున్న కారణంగా ఈ వారం సెంటిమెంట్ బుల్లిష్‌గానే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటుపై దృష్టి: రానున్న రోజుల్లో ద్రవ్యలోటు, తయారీ సంబంధ గణాంకాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు కొంతమేర జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. డిసెంబర్లో ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా వ్యవహరిస్తుండటంతో సెంటిమెంట్ బుల్లిష్‌గా మారిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. వీటన్నిటికితోడు విదేశీ మార్కెట్లు పటిష్టంగా సాగుతుండటంతో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ మరింత పుంజుకునేందుకు అవకాశమేర్పడిందని చెప్పారు. వెరసి నిఫ్టీకి 6,325 పాయింట్ల స్థాయి సాంకేతికంగా కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. ఈ స్థాయిని అధిగమిస్తే మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఎఫ్ఐఐల జోరు: కాగా, దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ నికరంగా... రూ.15,500 కోట్లను(250 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. -
భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్ళలో భారతీయుల వ్యక్తిగత సంపద విలువ రెట్టింపై రూ.411 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారతీయులు వ్యక్తిగత సంపద రూ.202 లక్షల కోట్లుగా ఉన్నట్లు కార్వీ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్- 2013’ పేర్కొంది. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశం ముందుకుపోతున్నా ఇప్పటికీ భారతీయులు ఈక్విటీల కంటే బంగారం, స్థిరాస్తి రంగాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ మొత్తం సంపదలోనే అత్యధికంగా రూ.60.61 లక్షల కోట్లు (30 శాతం) ఒక్క బంగారానికే కేటాయించారంటే భారతీయులు బంగారంపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో స్థిరాదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లలో రూ.35 లక్షల కోట్లు (17%), రియల్ ఎస్టేట్‌లో రూ.31.43 లక్షల కోట్లు (16%) ఇన్వెస్ట్ చేశారంట. వీటన్నింటితో పోలిస్తే భారతీయులు కేవలం రూ.24.31 లక్షల కోట్ల(12%) విలువైన ఈక్విటీ సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఇతర పెట్టుబడి సాధనాలన్నింటికీ కలిపి 54 శాతం కేటాయిస్తే కేవలం బంగారం, స్థిరాస్తి రంగాలకే 46 శాతం కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు, ఫిజికల్ అసెట్స్ పెట్టుబడుల నిష్పత్తి 55:45 వద్ద స్థిరంగానే ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా తెలిపారు. కాని రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటంతో బంగారం నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంపదలో 30 శాతం వాటా ఉన్న బంగారం వాటా 22 శాతానికి పడిపోతుందని ఈ మొత్తం అత్యధికంగా ఈక్విటీల్లోకి వస్తుందన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఫిజికల్ అసెట్స్‌లో బంగారం, స్థిరాస్తి నిష్పత్తి 65:35గా ఉందని, అదే వచ్చే ఐదేళ్ళలో 52:48గా మారుతుందన్నారు. -
ఇకపై సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్
ముంబై: మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌తోపాటు, ఇతర సూచీలలో నూ మార్పులను చేపట్టినట్లు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ) తె లిపింది. దీనిలో భాగంగా ఈ నెల 25 నుంచి సెన్సెక్స్‌లో ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌కు స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘బీఎస్ఈ 100’ ఇండెక్స్‌లో సుజ్లాన్ ఎనర్జీ స్థానంలో ఆదిత్య బిర్లా నువోను చేరుస్తుండగా, సెన్సెక్స్‌లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ చోటు కోల్పోనుంది. ఈ బాటలో బ్యాంకెక్స్ నుంచి యూనియన్ బ్యాంక్‌ను, టెక్ ఇండెక్స్ నుంచి ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఈరోస్ ఇంటర్నేషనల్, నవ్‌నీత్ పబ్లికేషన్స్, ఆన్‌మొబైల్ గ్లోబల్, వక్రంగీ సాఫ్ట్వేర్లను మినహాయిస్తోంది. టెక్ ఇండెక్స్‌లో హెక్సావేర్, జస్ట్ డయల్, పీవీఆర్ తదితరాలను చేర్చనుంది. ఇదే విధంగా మారికో, పీఅండ్‌జీ ైెహ జీన్, బేయర్ క్రాప్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, పేజ్ ఇండస్ట్రీస్, మైండ్‌ట్రీ, సుప్రీం ఇండస్ట్రీస్ తదితరాలను బీఎస్ఈ-200లో చేర్చనుంది. -
మదుపర్లకు తీపి‘మాత్ర’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది. కలిసొచ్చిన అంశాలనేకం ఈ నాలుగేళ్లలో ఫార్మా షేర్ల దూకుడుకు అనేక అంశాలు కలిసొచ్చాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సాధారణంగా మార్కెట్లు పడుతున్నప్పుడు ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ సెక్టార్లయిన ఫార్మా, ఎఫ్ఎంసీజీలకేసి చూస్తారని, అయితే ఇదే సమయంలో రూపాయి పతనం ఈ రంగానికి మరింత కలిసొచ్చిందంటున్నారు. గత నాలుగేళ్లుగా దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో సగటున 20 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. అంతే కాకుండా మన ఫార్మా కంపెనీలు విదేశీ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించడం, అనేక పేటెంట్ కేసుల్లో విజయం సాధించాయి. ఈ నాలుగేళ్ళలో నాట్కో ఫార్మా సాధించిన విజయాలే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించేటట్లు చేసిందంటున్నారు మార్కెట్ నిపుణులు ఈ నాలుగేళ్లలో నాట్కో ఫార్మా రిజాట్రిప్టాన్ బెంజోయేట్ తదితర ఔషధాలను ప్రవేశపెట్టడం, స్లెరోసిస్ చికిత్సలో ఉపయోగపడే కొపాగ్జోన్ ఔషధం పేటెంటు వివాదంలో టెవా ఫార్మాపై విజయం, క్యాన్సర్ ఔషధం నెక్సావర్ జనరిక్ వెర్షన్ విషయంలో కంపల్సరీ లెసైన్సు దక్కించుకోవడం వంటి అంశాలు షేరు పెరుగుదలకు కారణమయ్యయి. ఇక డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఈ కాలంలో అధిక మార్జిన్లు ఉన్న కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. డోన్పెజిల్, డివాల్‌ప్రొయెక్స్ ఈఆర్ వంటి ఔషధాల్లో ఏకైక జనరిక్ సంస్థగా నిలబడటమే కాకుండా పోటీ తక్కువగా ఉండి మార్జిన్లు అధికంగా ఉండే ఔషధాలపై సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఈ షేరు ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. చిన్న ఫార్మా షేర్లే ముద్దు ఇప్పటికే ఫార్మా షేర్లు బాగా పెరగడంతో వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి లాభాలను ఆశించడం కష్టమేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలైతే డిఫెన్సివ్ సెక్టార్ అయిన ఫార్మా నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతారని, కానీ ఇప్పటికీ కొన్ని చిన్న ఫార్మా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. రూపాయి విలువ క్షీణత, ఎగుమతులు వంటి అంశాలు ఫార్మా కంపెనీలకు కలిసొచ్చే అంశాలు కావడంతో ఈ రంగంలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఇండియా ఇన్ఫోలైన్ తెలిపింది. ఈ సమయంలో పెద్ద ఫార్మా షేర్లలో కంటే చిన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటరని, ఎంపిక చేసిన చిన్న ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి సూచిస్తున్నారు. -
హైదరాబాద్ టు బెంగళూరు
రాష్ట్ర రియల్టీ వలస... ఇక్కడి అనిశ్చితే బెంగళూరుకు వరం బెంగళూరులో పెరిగిన ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోళ్లు ప్రవాసాంధ్రుల మొగ్గు బెంగళూరుపైనే అక్కడ ప్రాజెక్టులు ఆరంభిస్తున్న హైదరాబాద్ బిల్డర్లు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన అనిశ్చితి బెంగళూరుకు వరంగా మారుతోంది. విభజన ఆందోళనల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల వారూ పెట్టుబడులకు బెంగళూరే సరైన ప్రాంతమనే నిర్ణయానికి వస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బిల్డర్లు, డెవలపర్లు భూముల కోసం... కొనుగోలుదారులు ఫ్లాట్లు, ప్లాట్ల కోసం వాకబు చేయడం రోజురోజుకు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. విభజన ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా బెంగళూరు రియల్టీలోకి ఇక్కడి నుంచి దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడులు తరలినట్లు రియల్టీ వర్గాల అంచనా. ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో సామాన్యుల నుంచి ఐటీ నిపుణుల వరకు అంద రూ బెంగళూరులోనే నివాసముండేందుకు ఇష్టపడుతున్నారు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లో కొత్తగా ఐటీ ఉద్యోగుల నియామకాలూ పెద్దగా లేవు. అదే బెంగళూరులో అయితే రెండింతలకు పైగానే కొత్త ఉద్యోగులొచ్చి చేరారు. దీనికి తోడు ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో కంటే బెంగళూరులోనే తమ సంస్థలను స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రాజె క్టులు ప్రారంభిస్తే కొనుగోళ్లు బాగుంటాయనే అభిప్రాయానికి బిల్డర్లు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన ఏఆర్కే ఇన్ఫ్రా బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో మూడున్నర ఎకరాల్లో ‘ఆర్క్ సెరిన్ కౌంటీ’ స్టేజ్-2ను శుక్రవారంనాడు ప్రారంభించింది. ఇప్పటికే స్టేజ్-1లో 274 ఫ్లాట్లను నిర్మించామని, ఇందులో 95 మంది కొనుగోలుదారులకు ఇంటి తాళాలు అందజేశామని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ గుమ్మి రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా బెంగళూరులోని సర్జాపూర్ రోడ్లో 3 ఎకరాల్లో నివాస సముదాయాన్ని నిరిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ రవి కుమార్ చెప్పారు. మొత్తం 214 ఫ్లాట్లు వచ్చే ఈ ప్రాజెక్టులో చదరపు అడుగు ధర రూ. 4,000 నుంచి రూ. 5,000ల మధ్య ఉందన్నారు. అన్ని వర్గాల వారూ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీమంతులు బెంగళూరులో భూములు, స్థలాలు, అపార్ట్మెంట్లు, విల్లాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. బెంగళూరు నగరంతో పాటు శివార్లపై కూడా వీరు దృష్టి పెడుతున్నారు. శివార్లలో 50 ఎకరాలు, వంద ఎకరాల చొప్పున భూములను కొనుగోలు చేస్తున్నారని ఆ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అనిశ్చితితో పాటు విభజన జరిగితే అభివృద్ధి మందగించవచ్చన్న ఆందోళనలు కూడా అనేక మంది బెంగళూరు బాట పట్టడానికి కారణమవుతున్నాయి. బిల్డర్లు, డెవలపర్లు ల్యాండ్ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తే, మధ్య తరగతి కుటుంబాలు అపార్ట్‌మెంట్లపైన, ఎన్నారైలు విల్లాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న మధ్యతరగతి వారు తొమ్మిదో దశకం నుంచే బెంగళూరుకు వలసలు రావడం ప్రారంభించినా, ఇటీవల ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆ వలసలు మరింత ఎక్కువయ్యాయని, వీరంతా ప్రధానంగా రూ.35 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య పలికే అపార్ట్మెంట్ల గురించి వాకబు చేస్తున్నారని డె వలపర్లు చెబుతున్నారు. ప్రవాసులూ బెంగళూరు వైపే: విదేశాల్లోని ప్రవాసాంధ్రులు కూడా పెట్టుబడులకు బెంగళూరే అనువైన ప్రాంతమని గట్టిగా విశ్వసిస్తున్నారు. వీరంతా రూ.కోటి నుంచి రూ.5 కోట్లు పలికే లగ్జరీ విల్లాల గురించి వాకబు చేస్తున్నారు. వీరి ఆసక్తిని గమనించిన పలువురు బెంగళూరు బిల్డర్లు ప్రవాసులకు ప్రత్యేక రాయితీలను కూడా ఇస్తున్నారు. ఐటీలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పట్లో బెంగళూరును అధిగమించడం హైదరాబాద్ సహా ఇతర మెట్రోలకు సాధ్యంకాదనేది వారి అభిప్రాయం. పైగా బెంగళూరులో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా బెంగళూరులో స్థిరపడాలంటే సొంతగూడు అవసరమని అందరూ భావిస్తుండటం అక్కడి రియల్‌బూమ్‌కు బాటలు పరుస్తోంది. హైదరాబాద్‌లో ఇదే కరెక్ట్ టైం: హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత కొనుగోలుదారులకు కలిసొస్తోందని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (అప్రెడా) జనరల్ సెక్రటరీ విజయ్‌సాయి చెప్పారు. ‘‘బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫ్లాట్లు, ప్లాట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మరో ఆరేడు నెలల్లో అనిశ్చితి తొలిగి తిరిగి రియల్‌బూమ్ పెరుగుతుంది. రేట్లు పెరగొచ్చు. అందుకే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం’’ అన్నారాయన. -
వెలుగులో ఐటీ, మెటల్ షేర్లు
సోమవారం ట్రేడింగ్ ముగింపు సవుయుంలో ఐటీ, మెటల్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రోజులో కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకున్నారు. ప్రపంచ వూర్కెట్ల బలహీనత కారణంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 268 పాయింట్లు పతనమై 19,648 వద్దకు పడిపోయింది. అటుతర్వాత కొన్ని కౌంటర్లలో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో 19,895 వద్దకు కోలుకుంది. చివరకు 21 పాయింట్ల స్వల్పనష్టంతో వుుగిసింది. ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 5,826 నుంచి తేరుకుని, ఒక పారుుంటు నష్టంతో 5,906 వద్ద క్లోజయ్యింది. ఫార్మా షేరు ర్యాన్‌బాక్సీ 5 శాతం పెరగ్గా, మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కోలు 3-4 శాతం మధ్య ర్యాలీ జరిపారు. ఐటీ దిగ్గజం టీసీఎస్ 3 శాతం పెరుగుదలతో కొత్త రికార్డు గరిష్టస్థాయి 2,090 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ. 4 లక్షల కోట్ల స్థాయిని దాటింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ వుహీంద్రాలు కూడా 2-4 శాతం మధ్య పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయున్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1-2 శాతం మధ్య తగ్గారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో రూ. 494 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. దేశీయు సంస్థలు రూ. 267 కోట్లు వెనక్కుతీసుకున్నారుు. వూర్కెట్ వుుగిసిన తర్వాత రిజర్వుబ్యాంక్ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్)ని అరశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ 60 పాయింట్ల పెరుగుదలతో 5,996 పాయింట్ల వద్ద ముగిసింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ 38 పాయింట్ల ప్రీమియంతో ఎన్ఎస్ఈలో క్లోజయ్యింది. నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్.... 80 పాయింట్లకుపైగా స్పాట్ నిఫ్టీ క్షీణించిన సవుయుంలో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడం మొదలుపెట్టారు. షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 14 లక్షల షేర్లు (8 శాతం) కట్ అయ్యూరుు. దాంతో మొత్తం ఓఐ 1.60 కోట్ల షేర్లకు తగ్గింది. సూచీ ఇంకా పెరగవచ్చన్న అంచనాలతో గతంలో విక్రరుుంచిన ఫ్యూచర్ కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయుడాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. ఫ్యూచర్లో షార్ట్ కవరింగ్ జరిగినా, 6,000 స్ట్రరుుక్ వద్ద వూత్రం తాజా కాల్ బిల్డప్ ఏర్పడింది. ఆ కాల్ ఆప్షన్ ఓఐలో కొత్తగా 4.65 లక్షల షేర్లు యూడ్ కాగా, 5,800 స్ట్రరుుక్ వ ద్ద పుట్ రైటింగ్ ఫలితంగా ఆ పుట్ ఆప్షన్ ఓఐలో 3.64 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ నిరోధ, వుద్దతుస్థారుుల్ని ఈ రైటింగ్ వెల్లడిస్తున్నది. మరోవైపు మెటల్ కౌంటర్లలో వరుసగా రెండోరోజు లాంగ్ బిల్డప్ జరిగింది. హిందాల్కో ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో వురో 9.32 లక్షల షేర్లు (4.23 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 2.30 కోట్ల షేర్లకు చేరింది. టాటా స్టీల్ ఫ్యూచర్ ఓఐలో 4.66 లక్షల షేర్లు (2.82 శాతం) యూడ్‌కాగా, మొత్తం ఓఐ 1.70 కోట్ల షేర్లకు పెరిగింది. సేసా గోవా కౌంటర్లో 1.76 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. మొత్తం ఓఐ 1.58 కోట్ల షేర్లకు పెరిగింది. రానున్న రోజుల్లో షేరు ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో కొనుగోలు చేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషన్గా పరిగణిస్తారు. -
మార్కెట్లపై విశ్లేషణ
-
కొనుగోళ్లు అంతంత మాత్రమే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో విశేషంగా జరిపే గౌరీ, గణేశ పండుగల పట్ల ఈసారి పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. మార్కెట్లలో కొనుగోళ్లు నీరసంగా సాగుతున్నాయి. ఉన్న సరుకును అమ్ముకుంటే చాలనే భావన వ్యాపారుల్లో కనిపిస్తోంది. ఆదివారం గౌరీ, సోమవారం గణేశ పండుగలను ఆచరిస్తారు. ఇప్పటికే మార్కెట్లు కిటకిటలాడడం ఆనవాయితీ కాగా, ఈసారి ఆ ఛాయలే కనిపించడం లేదు. కొనుగోళ్లు 40 శాతం వరకు తగ్గాయని వ్యాపారుల అంచనా. దీనికి వివిధ రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న చాలా మందికి జీతాలు 8 నుంచి 10 తేదీల మధ్య లభించడం, ఒత్తిడి జీవితంతో విసిగిపోయిన ప్రజలు ఉత్సాహాన్ని కోల్పోవడం, అడపా దడపా పడుతున్న వాన....వల్ల పండుగలంటే ప్రజలు ఉత్సాహం చూపించడం లేదని వినవస్తోంది. ఇక ధరల విషయానికొస్తే... అరటి పండ్లు మినహా మిగిలిన పళ్ల ధరలన్నీ సాధారణంగానే ఉన్నాయి. కూరగాయల్లో ఉల్లి మినహా మిగిలిన వాటి ధర ఏమంత భారమనిపించడం లేదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మల్లెలు రూ.400, కనకాంబరాలు రూ.1,500 ధర పలుకగా, ఇప్పుడు మల్లెలు ఉదయం పూట రూ.240, సాయంత్రాల్లో రూ.100 పలుకుతోంది. కనకాంబరాల ధర రూ.500-600 మధ్య ఉంది. విగ్రహాలకు కూడా... నగరంలోని ట్యానరీ రోడ్డు, శివాజీ నగర, బాణసవాడి, హలసూరు, మల్లేశ్వరం, యశవంతపుర తదితర అనేక చోట్ల గౌరీ, గణేశుల విగ్రహాలను తయారు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి విగ్రహాలకు అంతగా డిమాండ్ లేదు. ఇక్కడ విగ్రహాల ధరలు రూ.20 మొదలు రూ.లక్ష వరకు పలుకుతుంటాయి. -
విదేశాల్లో పెట్టుబడికి ఐసీఐసీఐ ఫండ్
మన మార్కెట్లు పడిపోతున్నాయి. విదేశాల్లో అయితే కాస్తంత స్థిరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికోసం విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గ్లోబల్ ఈక్విటీ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని వివిధ దేశాలకు చెందిన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే గ్లోబల్ స్టేబుల్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించారు. ఇది ఓపెన్ ఎండెడ్ పధకం కావడంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. 90 రోజుల్లో వైదొలిగితే 3%, ఆ తర్వాత 540 రోజులలోపైతే 1% అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్తో రైల్వే బుకింగ్: ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్ఎంఎస్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు 139 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే నేరుగా ఖాతా నుంచి నగదు తీసుకొని టికెట్లను జారీ చేయడం జరుగుతుంది. -
మార్కెట్ల జోష్.. మెటల్ షేర్ల భారీ ర్యాలీ
రూపాయి క్షీణిస్తున్నదన్న భయాలతో అదేపనిగా పతనమై కనిష్టధరల్లో లభిస్తున్న బ్లూచిప్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కసారిగా 407 పాయింట్లు ర్యాలీ జరిపింది. దాంతో నాలుగురోజుల మార్కెట్ పతనానికి బ్రేక్‌పడింది. సెన్సెక్స్ ఇంత భారీగా పెరగడం గత రెండు నెలల్లో ఇదే ప్రధమం. రూపాయి మరో కొత్త కనిష్టస్థాయికి తగ్గినా, చలించని ఇన్వెస్టర్లు మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 17,759 పాయింట్ల వద్దకు క్షీణించింది. ఆ సమయంలో వువ్వెత్తున షార్ట్ కవరింగ్, తాజా కొనుగోళ్లు ప్రారంభంకావడంతో ర్యాలీ జరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కనిష్టస్థాయి నుంచి సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగి 18,350 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇండెక్స్ 5,260 పాయింట్ల కనిష్టం నుంచి 5,400 పాయింట్ల ఎగువకు దూసుకెళ్లింది. చివరకు 106 పాయింట్ల లాభంతో 5,408 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్థిక ఉద్దీపన కోసం నిధుల విడుదలను క్రమేపీ తగ్గించాలన్న అభిప్రాయంతో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు ఉన్నట్లు ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ద్వారా తేటతెల్లమయ్యింది. దాంతో రూపాయి క్షీణించగా, బ్యాంకింగ్ షేర్లలో మాత్రం అమ్మకాలు కొనసాగాయి. అయితే లోహాలను భారీగా వినియోగించే చైనా తయారీ రంగం ఆగస్టులో బాగా మెరుగుపడినట్లు తాజా గణాంకాలు వెలువడటంతో మెటల్ షేర్లు గురువారంనాటి ర్యాలీకి శ్రీకారం చుట్టాయి. హిందాల్కో, టాటా స్టీల్, సేసా గోవా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, ఎన్ఎండీసీ తదితర మెటల్ షేర్లు 8-15 శాతం మధ్య పెరిగాయి. ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్లకు కొనుగోలు మద్దతు లభించడంతో అవి 3-16 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. కొద్ది రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్న ఆయిల్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, బీపీసీఎల్‌లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 1277 కోట్ల విలువైన నికర విక్రయాలు జరిపినట్లు సెబి డేటా పేర్కొంది. క్యాష్ మార్కెట్లో కొన్ని బ్యాంకింగ్ షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల జరిపిన అమ్మకాలను ఈ డేటా సూచిస్తోంది. దేశీయ సంస్థలు రూ. 389 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. నిఫ్టీలో షార్ట్ కవరింగ్... కొద్ది రోజుల నుంచి నిఫ్టీ ఫ్యూచర్లలో అదేపనిగా షార్ట్ చేస్తున్న ఇన్వెస్టర్లు గురువారం కనిష్టస్థాయికి సూచీ క్షీణించగానే షార్ట్ కవరింగ్ జరిపారు. ఈ కవరింగ్‌ను సూచిస్తూ నిఫ్టీ ఆగస్టు కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ నుంచి 6.85 లక్షల షేర్లు (2.83 శాతం) కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.35 కోట్ల షేర్లకు దిగింది. అయితే గత 4 రోజులుగా యాడ్ అయిన ఓఐతో పోలిస్తే తాజాగా కట్ అయిన శాతం తక్కువ. రూపాయి పతనం నిలిచిపోయేంతవరకూ ఇన్వెస్టర్లు తగిన మోతాదులో షార్ట్ పొజిషన్లను కొనసాగించవచ్చని విశ్లేషకులు చెప్పారు. 5,300, 5,400 స్ట్రయిక్స్ వద్ద కాల్ కవరింగ్ జరగ్గా, 5,500 స్ట్రయిక్ వద్ద తాజా కాల్ రైటింగ్ జరిగింది. 5,300, 5,400 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. 5,500 స్ట్రయిక్ వద్ద కాల్ బిల్డప్ 71 లక్షల షేర్లకు చేరగా, 5,300 స్ట్రయి క్ పుట్ ఆప్షన్లో బిల్డప్ 83 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 5,500-5,300 శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
మార్కెట్లకు యూపీఏ శాపం!
-
మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరు
ఆసియా మార్కెట్లు ర్యాలీ జరుపుతున్న ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగి 18,946 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో 19,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 19,066 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపినా, ముగింపులో లాభాల స్వీకరణ కారణంగా లాభాల్లో కొంత శాతాన్ని సెన్సెక్స్ కోల్పోయింది. ఇదే బాటలో 5,644 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 47 పాయింట్ల లాభంతో 5,612 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు జోరుగా పెరిగాయి. మెటల్ షేర్లలో షార్ట్ కవరింగ్... కొద్ది వారాల నుంచి అదేపనిగా పతనమై, ఐదేళ్ల కనిష్టస్థాయికి తగ్గిన మెటల్ షేర్లలో సోమవారం పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగింది. లోహాలను అధికంగా వినియోగించే చైనాలో పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతున్నదన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇనుప ఖనిజం, రాగి, అల్యూమినియం, జింక్ తదితర లోహాలు గత వారం నుంచి పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో మెటల్ కౌంటర్స్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను తగ్గించుకున్నారు. దాంతో జిందాల్ స్టీల్, టాటా స్టీల్ షేర్లు 8-9 శాతం మధ్య ఎగిసాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, ఎన్ఎండీసీ, హిందాల్కో, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, సేసా గోవాలు కూడా 3-6 శాతం మధ్య పెరిగాయి. ప్రముఖ మెటల్ కంపెనీలు టాటా స్టీల్, హిందాల్కోలు వాటి ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న నేపథ్యం కూడా ఈ కౌంటర్లలో షార్ట్ కవరింగ్‌కు పురికొల్పినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. టాటా స్టీల్ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 23.52 లక్షల షేర్లు (11 శాతం) కట్ అయ్యాయి. అలాగే రూ. 220, రూ. 230, రూ. 240 స్ట్రయిక్స్ వద్ద కాల్ ఆప్షన్స్ నుంచి ఓఐ గణనీయంగా తగ్గడంతో పాటు రూ. 220, 230 స్ట్రయిక్స్ పుట్ ఆప్షన్లలో ఓఐ భారీగా పెరిగింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యూచర్ ఓఐ నుంచి 2.96 లక్షల షేర్లు (3 శాతం), ఎన్ఎండీసీ ఓఐ నుంచి 12.10 లక్షల షేర్లు (7.5 శాతం), హిందాల్కో ఓఐ నుంచి 8.72 లక్షల షేర్ల (3.4 శాతం) చొప్పున ఓఐ కట్ అయ్యింది. షార్ట్ పొజిషన్ అంటే షేరు క్షీణతను అంచనావేస్తూ ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రయించడం. ధర మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఇటువంటి పొజిషన్ వున్న కాంట్రాక్టును స్క్వేర్‌ఆఫ్ చేయడాన్నే షార్ట్ కవరింగ్‌గా వ్యవహరిస్తారు. విలీన ప్రతిపాదనకు ముంబాయి హై కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నెల్ పొందిన సేసా గోవా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కౌంటర్లలో భిన్నమైన పొజిషన్లు క్రియేట్ అయ్యాయి. సేసా గోవా ఫ్యూచర్ ఓఐ నుంచి 2 శాతం షేర్లు కట్‌కాగా, స్టెరిలైట్ ఫ్యూచర్లో 2 శాతం షేర్లు యాడ్ అయ్యాయి. ఈ విలీన ప్రక్రియలో మరో భాగస్వామ్య కంపెనీ కెయిర్న్ ఇండియా ఓఐ నుంచి 3.5 శాతం షేర్లు కట్ అయ్యాయి. ఈ మూడు షేర్లూ క్యాష్ మార్కెట్లో 2 శాతంపైగా పెరగడం విశేషం. -
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. రియల్టీ హైజంప్ ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం) 10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది. -
సెన్సెక్స్ 450 పాయింట్లు పతనం
ఒక్క రోజు గ్యాప్ తరువాత మళ్లీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అమ్మకాలతో సెన్సెక్స్ 449 పాయింట్లు పతనమైంది. 6 వారాల తరువాత మళ్లీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 18,733 వద్ద ముగిసింది. గత శుక్రవారం వరకూ 8 వరుస రోజుల్లో 1,138 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం నామమాత్రంగా లాభపడ్డ సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా ఇదే విధంగా స్పందిస్తూ 143 పాయింట్లు దిగజారింది. వెరసి నాలుగు నెలల కనిష్టమైన 5,542 వద్ద నిలిచింది. ఇందుకు రూపాయి పతనంతోపాటు, పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపాయి. ఫలితంగా 2009 జూన్ తరువాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడింది! మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 989 బిలియన్ డాలర్ల(రూ. 60,18,504 కోట్లు) వద్ద స్థిరపడింది. కారణాలేంటి? జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లో పాక్ నుంచి చొరబడిన సాయుధులు కొందరు ఐదుగురు భారత సైనికులను హతమార్చడంతో మంగళవారం ఉదయమే మార్కెట్లో టెన్షన్లు పెరిగాయి. ఇదికాకుండా ఇటీవల డాలరుతో మారకంలో బలహీనపడుతున్న రూపాయి ఉన్నట్టుండి 61.80కు పడిపోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయికాగా, ఇది కరెంట్ ఖాతా లోటును మరింత పెంచనుంది. ఇక మరోవైపు వర్ధమాన మార్కెట్ల నుంచి డాలర్ల నిధులు వెనక్కు మళ్లుతాయన్న ఆందోళనలు తాజాగా చెలరేగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ప్రస్తుతం అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే ఎత్తివేయవచ్చునన్న అంచనాలు పెరగడమే దీనికి కారణం. ఇవి చాలవన్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో ఏర్పడ్డ చె ల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ‘ఈ’ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం ప్రభుత్వం నిషేధించడంతో అగ్నికి ఆజ్యం పోసి న ట్లయ్యింది. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అన్ని రంగాలూ డీలా బీఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా వినియోగ వస్తువులు, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ 5.5-2% మధ్య నీర సించాయి. సెన్సెక్స్, నిఫ్టీలలో 3 షేర్లు మాత్రమే లాభపడగా, టాటా పవర్ అత్యధికంగా 15% కుప్పకూలింది. మిగిలిన దిగ్గజాలలో భెల్, హెచ్డీఎఫ్సీ, స్టెరిలైట్, టాటా స్టీల్, భారతీ, బజాజ్ ఆటో, జిందాల్ స్టీల్, ఎల్అండ్టీ 6.6-2.3% మధ్య పతనమయ్యాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 4-2.5% మధ్య తిరోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఓఎన్జీసీ 3.3%, ఆర్ఐఎల్ 2.4% చొప్పున నష్టపోయాయి. మార్కెట్లను మించుతూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6% నీరసించగా, స్మాల్ క్యాప్ 1.8% క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,599 నష్టపోగా, 655 మాత్రమే బలపడ్డాయి. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లు సైతం నిలిచిపోవడంతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 20% కుప్పకూలి రూ. 159 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్ షేరు ఎంసీఎక్స్ సైతం 10% పతనమై రూ. 332 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. -
అవరోధ శ్రేణి 19,337-19,525
అధికశాతం షేర్లు నిలువునా పతనం అవుతున్నా, కొద్ది నెలల నుంచి స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడేందుకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు సహకరిస్తూ వచ్చాయి. క్రితం వారం ఐటీ మినహా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు కూడా కరెక్షన్ బాట పట్టడంతో స్టాక్ సూచీల్లో కూడా పతనవేగం పెరిగింది. రూపాయి క్షీణతను అదుపుచేయడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలేవీ ఫలితాల్ని ఇవ్వకపోవడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. 1998లో ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన కరెన్సీ సంక్షోభ(కరెన్సీ విలువలు నిలువునా పతనంకావడం) ఛాయలు, ప్రస్తుతం భారత కరెన్సీ మార్కెట్లో కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆయా దేశాలతో పాటు మన స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కీలక రంగాలకు చెందిన పెద్ద షేర్లు పెన్నీ(కారు చౌకగా లభించే) షేర్లుగా మారిపోయాయి. అదేతరహాలో ఇప్పటి మార్కెట్ పతనం కొనసాగుతోంది.