October
-
క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
క్రెడిట్ కార్డులు వినియోగించేవారి సంఖ్య ఒకప్పటి నుంచి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి.. లక్షలు సంపాదించే పెద్ద ఉద్యోగి వరకు అందరూ క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే గత అక్టోబర్ నెలలో 7.8 లక్షల మంది మాత్రమే క్రెడిట్ కార్డులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్య 2023 అక్టోబర్ (16 లక్షలు) నెలతో పోలిస్తే 45 శాతం తగ్గినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి చూస్తే క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా? అనే అనుమానం కూడా వస్తోంది.ఆనంద్ రాతీ నివేదిక ప్రకారం, 2024 మే నెలతో పోలిస్తే.. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డులు జారీ కొంత పెరిగిందని తెలుస్తోంది. అక్టోబర్ 2024లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన మొత్తం ఖర్చు రూ. 1.78 ట్రిలియన్లకు చేరుకుందని, ఇది 13 శాతం వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తుందని సమాచారం. మొత్తం ఖర్చు విలువలో ఈ కామర్స్ వాటా 61 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది.గత ఏడాదితో పోలిస్తే.. ఈ అక్టోబర్ నెలలో జారీ అయిన క్రెడిట్ కార్డుల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. ఖర్చులు మాత్రం గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏది కొనాలన్నా.. ఎక్కడ షాపింగ్ వంటివి చేయాలన్నా క్రెడిట్ కార్డులనే వినియోగిస్తున్నారు. ఈ కారణంగానే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులు పెరుగుతున్నాయి. మొత్తం మీద క్రెడిట్ కార్డుల జారీ తగ్గినా.. వినియోగంలో మాత్రం ఎవ్వరూ తగ్గేదేలే అనేది స్పష్టంగా అర్దమైపోతోంది. -
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
డెట్ ఫండ్స్‌లోకి రూ.1.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ » లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్ నెలలో మొత్తం డెట్ పెట్టుబడుల్లో సగం లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి. » అల్ట్రా షార్ట్ డ్యురేషన్ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి. » లో డ్యురేషన్ ఫండ్స్ రూ.5,600 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.4,644 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్ ఫండ్స్‌కు ఆదరణ లభించింది. » నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. » గిల్ట్ ఫండ్స్ రూ.1,375 కోట్లు, లాంగ్ డ్యురేషన్ బాండ్ ఫండ్స్ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి. -
టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!
ముంబై: టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాలు అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 4.89 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.కిందటేడాది ఇదే నెలలో డీలర్లకు పంపిణీ చేసిన 4.34 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 13% అధికం. మొత్తం ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 14% వృద్ధితో 4,20,610 నుంచి 4,78,159 నుంచి చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 14% 2,30,822 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు 17% పుంజుకొని 1,93,439 యూనిట్లకు చేరాయి.ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 45% పుంజుకొని 20,153 యూనిట్ల నుంచి 29,308 యూనిట్లకు చేరాయి. అయితే త్రిచక్ర వాహన అమ్మకాలు 23% తగ్గి 10,856 యూనిట్లకు దిగివచ్చాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో 14,104 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులు 9% వృద్ధితో 87,952 నుంచి 95,708 యూనిట్లకు చేరాయి. -
పుంజుకున్న పెట్రోల్ విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మద్దతుతో దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు అక్టోబర్ నెలలో 7.3 శాతం పెరిగాయి. కానీ, డీజిల్ అమ్మకాలు మాత్రం 3.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇంధన మార్కెట్లో 90 శాతం వాటా కలిగిన మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ) అక్టోబర్‌లో 3.1 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 2.87 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ విక్రయాలు మాత్రం 3.3 శాతం తక్కువగా 6.7 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. పండుగల సందర్భంగా వ్యక్తిగత వాహనాల (టూవీలర్లు, ప్యాసింజర్ కార్లు) వినియోగం సాధారణంగా పెరుగుతుంది. ఇది పెట్రోల్ విక్రయాల వృద్ధికి దారితీసినట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. సాగు రంగం నుంచి డిమాండ్ తక్కువగా ఉండడం డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపాయి. గడిచిన కొన్ని నెలల నుంచి డీజిల్, పెట్రోల్ అమ్మకాలు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అధిక వర్షాలకుతోడు, సాగు రంగం నుంచి డిమాండ్ తగ్గడం వాహనాల వినియోగాన్ని పరిమితం చేసింది. ఇక సెపె్టంబర్ నెల గణాంకాలతో పోల్చి చూసినా అక్టోబర్‌లో పెట్రోల్ విక్రయాలు 7.8 శాతం పెరిగాయి. డీజిల్ అమ్మకాలు 20 శాతం అధికంగా నమోదయ్యాయి. సెపె్టంబర్ నెలలో పెట్రోల్ వినియోగం 2.86 మిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 5.59 మిలియన్ టన్నుల చొప్పున ఉంది. 40 శాతం వాటాతో డీజిల్ అధిక వినియోగ ఇంధనంగా ఉంటోంది. 70 శాతం డీజిల్‌ను రవాణా రంగమే వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాల కోసం దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. 2.5 శాతం అధికంగా ఏటీఎఫ్ అమ్మకాలు ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విక్రయాలు అక్టోబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 2.5 శాతం పెరిగి 6,47,700 టన్నులుగా ఉన్నాయి. సెపె్టంబర్ నెలలో వినియోగం 6,31,100 టన్నుల కంటే 2.6 శాతం తగ్గింది. వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.82 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో వంటగ్యాస్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. -
జీఎస్టీ వసూళ్ల రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అక్టోబర్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెలలో 9 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోల్చితే) రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఒక నెలలో ఈ స్థాయి వసూళ్లు ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకూ ఆల్‌టైమ్ రికార్డు. దేశీయ అమ్మకాలు, పన్ను పరిధి విస్తృతి తాజా రికార్డుకు కారణమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిఫండ్స్ రూ.19,306 కోట్లుకాగా, మొత్తం అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లలో రూ.19,306 కోట్ల రిఫండ్స్ జరిగాయి. 2023 అక్టోబర్‌తో పోలి్చతే ఇది 18.2 శాతం అధికం. రిఫండ్స్ మినహాయిస్తే, నికర జీఎస్టీ వసూళ్లు 8 శాతం వృద్ధితో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా→ మొత్తం వసూళ్లు రూ. 1,87,346 కోట్లు → సెంట్రల్ జీఎస్టీ రూ.33,821 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.41,864 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.99,111 కోట్లు → సెస్ రూ.12,550 కోట్లు. -
ఢిల్లీవాసుల హాహాకారాలు.. ఒకవైపు వాయు కాలుష్యం.. మరోవైపు నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్‌కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు మరమ్మతు పనులు చేయనుంది.ఈ కారణంగా ఈ ప్లాంట్లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
17న హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.ఇటీవల నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. #WATCH | Union Minister & former Haryana CM Manohar Lal Khattar says, "We have received the nod of the PM that on October 17, in Panchkula, the CM and council of ministers will take oath." pic.twitter.com/SLxvKGPWSq— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’ -
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
దసరాకు రిలీజ్ కానున్న మూవీస్ ఇవే (ఫొటోలు)
-
సైన్సు సినిమా.. అక్టోబర్ స్కై
‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు. పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి. -
31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు
వారణాసి: ఈ ఏడాది దీపావళి తిధిపై ఉన్న సందేహాలను తొలగిస్తూ, కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్‌కు చెందిన పండితులు స్పష్టతనిచ్చారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, పలువురు రెండు తేదీలు సూచిస్తున్నారని అన్నారు. కాశీ పండితులు దీపావళి తేదీపై స్పష్టతనిచ్చారని అన్నారు.అక్టోబరు 31న దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ ఒకటిన సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి అమావాస్య ఉంటుంది.ధర్మసింధు, నిర్మాణ సింధుల ప్రకారం రాత్రి అమావాస్య ఉన్నరోజున అంటే అక్టోబర్ 31 రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజలు చేసుకోవాలి. అలాగే దీపోత్సవాన్ని నిర్వహించుకోవాలి. అక్టోబరు 29న ధన్తేరస్, నరక చతుర్దశిని అక్టోబర్ 30 న చేసుకోవాలని అశోక్ ద్వివేది తెలిపారు. కాశీకి చెందిన అన్ని పంచాంగాల ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న దీపావళి వేడుకలు చేసుకోవాలి.ఇది కూడా చదవండి: ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్! -
రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి
2024 సెప్టెంబర్ నెల ఈ రోజుతో (సోమవారం) ముగుస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ ప్రారంభమవుతుంది. అయితే వచ్చే నెల (అక్టోబర్) నుంచి మ్యూచువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్, టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..👉ఆధార్ నెంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడించడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు.. పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని వెల్లడించాల్సిన అవసరం లేదు.👉సక్రమంగా లేని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) అకౌంట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు 2024 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి.👉కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. జీవిత బీమా పాలసీ, లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ శుభవార్త!.. డిపాజిటర్ల కోసం కొత్త ప్లాన్స్..👉ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)కి వర్తించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) అక్టోబర్ 1 నుంచి పెరగనుంది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో కూడా మార్పులు ఏర్పడతాయి. -
అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
అక్టోబర్‌లో భారత్‌కు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో మొయిజ్జు భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవులు అధికారిక వర్గాలు ప్రకటించించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. జూన్ 9న ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా ముయిజ్జు భారత్‌ను చివరిసారి సందర్శించారు. తాజా ధ్వైపాక్షిక పర్యటనలో అక్టోబర్ 7-9 తేదీల్లో ఆయన భారత్‌కు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోదీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారని సమాచారం. ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇతర విషయాల గురించి ప్రధాని మోదీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి.నవంబర్ 2023లో ముయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడైన తర్వాత భారత్‌తలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్ బలగాలు మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో.. కొందరు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దూరం మరింత పెరిగింది.చదవండి: సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు -
అక్టోబర్‌లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..
పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో కొరియన్ బ్రాండ్, చైనా బ్రాండ్, జర్మనీ బ్రాండ్స్ మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో (అక్టోబర్ 2024) లాంచ్ అయ్యే కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.2024 కియా కార్నివాల్కొత్త తరం కియా కార్నివాల్ 2023 అక్టోబర్ 3న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందనుంది. 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ కలిగి 193 పీఎస్ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానున్నట్లు సమాచారం.కియా ఈవీ9ఎప్పటి నుంచో లాంచ్‌కు సిద్దమవుతున్న కియా ఈవీ9 వచ్చే నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అవుతుందని సమాచారం. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి కావడమనే తెలుస్తోంది.నిస్సాన్ మాగ్నైట్ ఫేస్లిఫ్ట్భారతీయ విఫణిలో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్.. అక్టోబర్ 4న ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అవుతుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. పరిమాణం పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, టెయిల్‌లైట్ మొదలైనవి ఉంటాయి.బీవైడీ ఈమ్యాక్స్7దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనేఅధిక ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్ బీవైడీ అక్టోబర్ 8న ఈమ్యాక్స్7పేరుతో ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొదటి 1000 మంది కస్టమర్లకు రూ. 51000 విలువైన ప్రయోజనాలను అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్: ఇదిగో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు2024 మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీమెర్సిడెస్ బెంజ్ తన 2024 ఈ క్లాస్ ఎల్డబ్ల్యుబీ కారును అక్టోబర్ 9న ఆవిష్కరించనుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఎంపికలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు సమాచారం. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి. ధర, వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్టోబర్‌లో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు అక్టోబర్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె చెప్పారు. శ్రీనగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
నేడు శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. కాగా, అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
అక్టోబర్‌లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్‌వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఆటో పరిశ్రమకు టూవీలర్ల బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రిటైల్‌లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్‌లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి. అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది. త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం. నవరాత్రి కొత్త రికార్డు.. 2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్‌లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్‌యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. విభిన్న పరిస్థితులు.. స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్‌ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్‌ని పెంచుతున్నాయని ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్‌లను పెంచవచ్చు. అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది. -
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► అక్టోబర్‌లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది. -
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్‌లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డ్!
ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్‌సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్‌కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్‌కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్‌కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్‌తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్‌కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్‌షిప్‌లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్‌కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్‌గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్‌సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
మళ్ళీ అదే రెపో రేటు.. ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెండు రోజుల సమీక్ష తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడించారు. ఇందులో భాగంగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశమైన తర్వాత దాస్ ప్రకటన వెలువడింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది నాలుగోసారి. అయితే జూలైలో టొమాటో, ఇతర కూరగాయల ధరల కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది. https://t.co/bjo3MjAYqs — ReserveBankOfIndia (@RBI) October 6, 2023 -
అక్టోబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు
రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. (RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా) అక్టోబర్ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు. (గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ) అక్టోబర్ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ సెలవుల జాబితా ఇది.. అక్టోబర్ 1: ఆదివారం అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 8: ఆదివారం అక్టోబర్ 14: రెండవ శనివారం అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా) అక్టోబర్ 15: ఆదివారం అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా) అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా) అక్టోబర్ 22: ఆదివారం అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం). అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా) అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్) అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా) అక్టోబర్ 28: నాల్గవ శనివారం అక్టోబర్ 29: ఆదివారం అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్) -
అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!
ఆధునిక కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ యాప్ ఆధునిక అవసరాలను అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బహుశా కొన్ని పాత మొబైల్స్‌లో వాట్సాప్ యాప్ పనిచేయక పోవచ్చు. ఈ కథనంలో ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 24 తరువాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1, అంతకంటే అంతకు ముందు వెర్షన్లతో కూడిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఏకంగా 20 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు ఉండటం గమనార్హం. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో శాంసంగ్ గ్యాలక్సీ ఎస్2 శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్ హెచ్‌టీసీ సెన్సేషన్ మోటోరోలా డ్రోయిడ్ రేజర్ (Motorola Droid Razr) సోనీ ఎక్స్‌పీరియా ఎస్2 మోటోరోలా జూమ్ శాంసంగ్ గ్యాలక్సీ టాబ్ 10.1 ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ (Asus Eee Pad Transformer) ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003 శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ హెచ్‌టీసీ డిజైర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ 2ఎక్స్ సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా Arc3 నెక్సస్ 7 (ఆండ్రాయిడ్ 4.2కి అప్‌గ్రేడబుల్) శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 2 హెచ్‌టీసీ వన్ ఇదీ చదవండి: వందే భారత్‌లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం! ఈ జాబితాలోని మొబైల్స్ అన్నీ దాదాపు పాత మోడల్స్. కావున ఇవి చాలా తక్కువమంది వద్ద మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగిస్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టం ఆగిపోతుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ చెక్ చేయడం ఎలా? మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత మొబైల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అబౌట్ ఫోన్ (About Phone) క్లిక్ చేసి అందులో సాఫ్ట్వేర్ వివరాలు చూడవచ్చు. దీన్ని బట్టి మీ మొబైల్ వాట్సాప్ వినియోగానికి ఉపయోగపడుతుందా.. లేదా అనేది తెలిసిపోతుంది. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
అక్టోబరులో 800
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ బయోపిక్‌ను నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని క్రికెట్ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్. -
ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం..
ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహించాలని ప్రకటించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పేర్కొంది. లోక్ సభ సీటు షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్ షేరింగ్ ప్రారంభమైందని, త్వరలో పూర్తి నిర్ణయం తీసుకుంటామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. జాయింట్ పబ్లిక్ ర్యాలీ భోపాల్‌లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | AAP MP Raghav Chadha on INDIA bloc Coordination Committee meeting "It has been decided that member parties will start the process for seat-sharing and take a decision on it soon; a joint public rally will be held in Bhopal. It was also decided that the issue of caste… pic.twitter.com/smktxqoDBA — ANI (@ANI) September 13, 2023 సమన్వయ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీట్ షేరింగ్ విధానం ప్రారంభమైందని చెప్పారు. పార్టీల చర్చలు జరిపి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. #WATCH | On INDIA alliance Coordination Committee meeting, Congress General Secretary KC Venugopal says, "The Coordination Committee has decided to start the process for determining seat-sharing. It was decided that member parties would hold talks and decide at the earliest. The… pic.twitter.com/JnOmapYJ7Z — ANI (@ANI) September 13, 2023 కుల గణన అంశంపై నిర్ణయం.. జేడీయూ, ఆర్జేడీ ప్రతిపాదించిన కుల గణన సర్వే సమస్యను పరిగణలోకి తీసుకుంటామని ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు తీర్మానించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ రోజు 14 మంది సమన్వయ కమిటీ మీటింగ్‌కు 12 మంది హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా టీఎంసీ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీ గౌర్హాజరయ్యారు. కుల గణన అంశాన్ని కూటమి చేపట్టడాన్ని టీఎంసీ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ సభ్యులు మీటింగ్‌కు హాజరు కానప్పటికీ నేడు ఆ అంశాన్ని చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. కుల గణన అంశాన్ని బిహార్‌లోని జేడీయూ, ఆర్జేడీలు ముందుకు తీసుకువచ్చాయి. జులైలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్‌లోనే ఈ అంశంపై పోరాడాలని కూటమికి అభ్యర్థనలు వచ్చాయి. కానీ కూటమిలోని టీఎంసీ దీనిని వ్యతిరేకించింది. అటు.. సీటు షేరింగ్ అంశంలోనూ టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీటు షేరింగ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు. నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమయింది. సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ అక్టోబర్‌లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అక్టోబర్ రెండో వారంలో గ్రూప్–3 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. గతేడాది డిసెంబర్లో గ్రూప్–3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ, ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు. తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టిన కమిషన్.. అక్టోబర్ రెండో వారంలో నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–4 పరీక్షలను పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ, గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్–3 ఉద్యోగాలకు మూడు దశల్లో అర్హత పరీక్షలుంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా ఉంటాయి. ఒక్కో పరీక్షను రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పరీక్షకు గరిష్టంగా 150 మార్కులుంటాయి. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర ఉద్యోగ పరీక్షలకు ఆటంకం లేకుండా గ్రూప్–3 తేదీలను నిర్ణయించే అంశాన్ని కమిషన్ పరిశీలిస్తోంది. ఈ కసరత్తు తర్వాత అతి త్వరలో పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్‌వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
5.62 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రస్తుత 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీ వరకూ 5.62 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య వేదిక– ఏఐఎస్‌టీఏ (ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్) మంగళవారం తెలిపింది. ప్రస్తుత (2022–23) మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి నవంబర్‌లో ప్రభుత్వం అనుమతించింది. ఏఐఎస్‌టీఏ లెక్కల ప్రకారం, చక్కెర మిల్లుల నుండి ఎగుమతుల కోసం పంపిన పరిమాణం 12.19 లక్షల టన్నులు. దీనిలో భౌతిక రవాణా ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం డిసెంబర్ 9 వరకు 5.62 లక్షల టన్నులు. యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)కి గరిష్టంగా చక్కెర ఎగుమతయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండోనేషియా, సోమాలియా, ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి. దాదాపు 5.22 లక్షల టన్నుల చక్కెర లోడింగ్ లేదా లోడింగ్ కోసం సిద్ధంగా ఉంది. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. -
అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.94 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద అక్టోబర్ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు. యువత ఎక్కువ.. నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్‌లో న్యూస్‌పేపర్ పరిశ్రమ, షుగర్, రైస్ మిల్లింగ్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: ఒకవైపు ద్రవ్యోల్బణం శాంతించగా, మరోవైపు పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గి పోయింది. మైనస్ 4 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ప్రధానంగా తయారీ తగ్గడం, మైనింగ్, విద్యుత్ విభాగాల్లో వృద్ధి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ వివరాలను ఎన్ఎస్వో విడుదల చేసింది. మైనింగ్ విభాగం కేవలం 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ విభాగం మైనస్ 5.6 శాతానికి పడిపోయింది. (దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్) విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 2.3 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగం 15 శాతం మేర, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లో 13.4 శాతం క్షీణత నమోదైంది. ఇంటర్ మీడియట్ గూడ్స్ ఉత్పత్తి 2.8 శాతం తగ్గగా, ప్రైమరీ గూడ్స్ 2 శాతం, ఇన్ఫ్రా/కన్స్ట్రక్షన్ గూడ్స్ ఉత్పత్తి 1 శాతం వృద్ధిని చూశాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని చూడగా, 2021 అక్టోబర్ నెలలోనూ 4.2 శాతం వృద్ధి నమోదు కావడాన్ని గమనించొచ్చు. మొత్తం మీద అక్టోబర్‌లో ఐఐపీ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా రావడం గమనార్హం. 2020 ఆగస్ట్ నెలకు నమోదైన మైనస్ 7 తర్వాత, మళ్లీ ఇంత కనిష్టాలకు తయారీ రంగం పనితీరు పడి పోవడం ఇదే మొదటిసారి. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్‌ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. -
గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు,ఈ ఏడాదిలో హైయస్ట్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ నోట్స్) పెట్టుబడులు అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఇవి గరిష్ట స్థాయి పెట్టుబడులు కావడం గమనించాలి. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్స్‌ను జారీ చేస్తుంటారు. ఈ నోట్స్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. (డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే!) సెబీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. సెప్టెంబర్ చివరికి పీనోట్స్ పెట్టుబడులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో కలిపి రూ.88,813 కోట్లుగా ఉంటే, అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. సాధారణంగా ఎఫ్‌పీఐ పెట్టుబడుల ధోరణిని పీ నోట్ల పెట్టుబడులు అనుసరిస్తుంటాయి. అక్టోబర్ నాటికి వచ్చిన పీనోట్ల మొత్తం పెట్టుబడుల్లో రూ.88,490 కోట్లు ఈక్విటీల్లో, రూ.9,105 కోట్లు డెట్‌లో, రూ.190 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి వచ్చాయి. ‘‘ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో అంతటా ఏకాభిప్రాయం ఉంది. (శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూపాయి స్థిరంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
దేశంలో ఈవీల జోరు: ఏకంగా 185 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రిటైల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 2022 అక్టోబర్ నెలలో మొత్తం 1,11,971 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 185 శాతం అధికం కావడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత నెలలో ప్యాసింజర్ ఈవీలు 178 శాతం ఎగసి 3,745 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 19,826 యూనిట్ల నుంచి 269 శాతం వృద్ధితో 73,169 యూనిట్లకు చేరాయి. ఈ-త్రీ వీలర్లు 93 శాతం దూసుకెళ్లి 34,793 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు 125 శాతం పెరిగి 274 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
స్టాక్ మార్కెట్ కంటే రిస్క్ తక్కువ..సిప్‌లోకి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
న్యూఢిల్లీ:ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన రూ.12,976 కోట్లను అధిగమించాయి. సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మార్కెట్ ర్యాలీల్లో, పతనాల్లోనూ పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుంది. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి రిస్క్ తగ్గుతుంది.దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పైగా నెలవారీ సంపాదనకు అనుగుణంగా ప్రణాళిక మేరకు, నిర్దేశిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ సానుకూలతలపై రిటైల్ ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, దీని రూపంలో వచ్చే పెట్టుబడులు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మే నెలలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు చొప్పున వచ్చాయి. ఏప్రిల్ నెలకు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ఏడు నెలల్లో రూ.87,000 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. ‘‘మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక రేట్ల పెంపునకు స్పందిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తులు, ఫోలియోల్లోనూ వృద్ధి ఉన్నట్టు చెప్పారు. అక్టోబర్ నెలలో కొత్తగా 9.52 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే నంబర్‌ను ఫోలియోగా పేర్కొంటారు. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య అక్టోబర్ చివరికి 5.93 కోట్లకు చేరింది. సిప్ రూపంలో స్థిరమైన పెట్టుబడుల రాక మన ఈక్విటీ మార్కెట్లలో కొంత స్థిరత్వానికి సాయపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీల్లోకి రూ.9,390 కోట్లు ఇక అక్టోబర్ నెలకు ఈక్విటీ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా 20వ నెలలోనూ (2021 మార్చి నుంచి) ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్టయింది. కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.14,100 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. మార్కెట్లలో అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్లు వచ్చాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.2,818 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని రకాల విభాగాలు కలిపి చూస్తే ఫండ్స్ పరిశ్రమలోకి అక్టోబర్‌లో రూ.14,047 కోట్లు వచ్చాయి. దీంతో ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.39.5 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ చివరికి ఇది రూ.38.4 కోట్లుగా ఉంది. -
సోనాలిక ట్రాక్టర్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలిక ట్రాక్టర్స్ అక్టోబర్‌లో 20,000 ట్రాక్టర్లను విక్రయించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసిన 7అమ్మకాల వృద్ధిని అధిగమించి ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక నెలలో తమకు ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నందున రైతుల నుంచి తమ బ్రాండ్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుందని రమణ్ అన్నారు. -
అక్టోబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం అక్టోబర్‌లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్‌లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్‌లో 55.1కు ఎగసింది. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదిక సేవల సూచీ వృద్ధి బాటన ఉండడం ఇది వరుసగా 15వ నెల. తమ సర్వే ప్రకారం అక్టోబర్‌లో వరుసగా ఐదవనెల సేవల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గడచిన మూడు సంవత్సరాల్లో సేవల రంగం ఈ స్థాయి స్పీడ్ ఇది రెండవసారని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అక్టోబర్‌లో సేవల రంగం పురోగతికి దేశీయ మార్కెట్ ప్రధాన వనరని కూడా లిమా తెలిపారు. ఇక విదేశీ అమ్మకాలు మాత్రం వరుసగా మూడవ త్రైమాసికంలో దిగువబాటన నడిచాయని అన్నారు. -
పండుగ జోష్: టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
ముంబై: పండుగ సీజన్ కలిసిరావడంతో అక్టోబర్‌లో ఆటో అమ్మకాలు పెరిగాయి. ఎస్యూవీ, మిడ్ సిగ్మెంట్, ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ పెరగడంతో పాసింజర్ వాహన విక్రయాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా-మహీంద్రా, కియా మోటార్స్, హోండా కార్స్ ఇండియా చెప్పుకొదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే ఇదే నెలలో ద్విచక్ర విక్రయాలు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటోసైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, టీవీఎస్ మోటార్ విక్రయాలు నిరాశపరిచాయి. ♦ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు అక్టోబర్‌లో 1,67,520కు చేరాయి. గతేడాది అక్టోబర్ అమ్మకాలు 1,38,335తో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 43,556 నుంచి 33% వృద్ధితో 58,006 యూనిట్లకు చేరాయి. ♦ టాటా మోటార్స్ అమ్మకాలు 15 శాతం వృద్దిని సాధించి 78,335 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే ఆగస్టులో 67,829 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
Hyderabad: అక్టోబర్‌లోనూ నగరాన్ని ముంచుతోన్న వానలు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ముగిసి.. అక్టోబరు మాసంలోకి ప్రవేశించినా.. కుండపోత వానలు హైదరాబాద్ నగర వాసుల గుండెను చెరువు చేస్తున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కురుస్తున్న వానలు మహానగరాన్ని నిండా ముంచుతున్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటి నుంచి అక్టోబరు 14 వరకు నగరవ్యాప్తంగా సరాసరిన.. సాధారణం కంటే 40 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అక్టోబరులో పదేళ్ల వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే 2020 అక్టోబరు 14న అత్యధికంగా సిటీలో 19.1 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. విశ్వవ్యాప్తంగా వాతావరణ మార్పుల పరంగా లానినాగా పిలిచే ప్రభావంతో ఈ ఏడాది డిసెంబరు వరకు తరచూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అంచనాలు సిటీజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తుపానులు, అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు, కింది స్థాయి గాలులు, క్యుములోనింబస్ మేఘాలు.. ఇలా ప్రభావమైదేనా గత కొన్ని నెలలుగా నగరంలో వానలు దంచికొడుతున్నాయి. రాత్రి వేళ కురుస్తున్న వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు వందలాది బస్తీల వాసులు నానా అవస్థలు పడుతున్నారు. జడివానలకు చెట్లు, కొమ్మలు విరిగిపడుతున్నాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. రహదారులపై పోటెత్తిన వరద నీరు తొలగించడం బల్దియా, జలమండలి అత్యవసర విభాగాలకు కత్తిమీద సాములా మారింది. ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. వాన కష్టాలతో గత కొన్నిరోజులుగా నగరంలో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. పలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునేవారికి నిత్యం కురుస్తున్న జడివానలు కష్టాలు మిగులుస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారిని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యం కురుస్తున్న వర్షాలకు కారణాలపై వాతావరణ శాఖను ‘సాక్షి’ సంప్రదించగా..లానినా ప్రభావంతో విశ్వవ్యాప్తంగా వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు తెలిపారు. ఈ పరిణామం నగరానికే మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. (క్లిక్: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ) భారీ వర్ష సూచన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నగరంలో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు బండ్లగూడ, వెస్ట్‌మారేడ్‌పల్లి, కాప్రా తదితర ప్రాంతాల్లో అర సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు హిమా యత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ఇన్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. వరదనీటి చేరికను బట్టి జలమండలి అధికారులు జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి నీటిని వదిలిపెడుతున్నారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. -
అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!
అక్టోబరు నెల వస్తే బ్యాంక్ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. ఈ ఏడాది పండుగలను పరిశీలిస్తే.. దసరా, దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజ వంటి అనేక ఇతర ముఖ్యమైన పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. ఈ సెలవులు నెలలో వచ్చే పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు వంటి రెగ్యులర్ హాలిడేస్ కూడా కలిపి ఎక్కువ రోజులే ఉన్నాయి. ఈ సారి అక్టోబర్ 3 నుంచి 7 రోజులు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ విషయాన్ని గమనించి కస్టమర్లు బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అక్టోబర్ 3 నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 సందర్భంగా బ్యాంకులు హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ సందర్భంగా పని చేయలేదు. ఇక ఈరోజ అక్టోబర్ 2న కూడా గాంధీ జయంతి ఉంది. అలాగే ఆదివారం కూడా. అక్టోబర్ 3న దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు పని చేయవు. అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో ఈ సెలవు వర్తిస్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయని గుర్తించుకోవాలి. అక్టోబర్ 4: దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/ శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 5: దుర్గాపూజ/దసరా (విజయదశమి) సందర్భంగా.. ఆ రోజు ఇంఫాల్ మినహా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 6: దుర్గా పూజ(దసైన్) సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు. అక్టోబర్ 7: గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ హాలిడే ఉంది. అక్టోబర్ 8: రెండో శనివారం సందర్బంగా బ్యాంకులు పని చేయవు. అలాగే ఆ రోజు మహమ్మద్ ప్రవక్త జయంతి కూడా ఉంది. భోపాల్, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరుపనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 9: ఆదివారం రెగ్యులర్ సెలవు. కాగా బ్యాంక్ సెలవులనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే కస్టమర్లలు బ్యాంక్ హాలిడేస్‌లో కూడా ఆన్లైన్ సేవలు.. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్! -
అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్: మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్ 🔸 ఐటీ, దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. 🔸 తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్ధ్యంతో మొదలుపెట్టి, క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలకు విస్తరించనున్నారు.#Infosys #CmYsJagan #BeachIT #VizagITHub pic.twitter.com/AYxUdnGb7e — Gudivada Amarnath (@gudivadaamar) September 27, 2022 -
ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు. వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్లో ఎన్బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు సీనియర్ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు. రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. -
Maharashtra: దసరా ర్యాలీ.. హైకోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు భారీ ఊరట..
సాక్షి, ముంబై: గత కొన్ని రోజులుగా తార స్థాయికి చేరిన దసరా ర్యాలీ(సదస్సు) వివాదంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కోర్టుకు వరకు వెళ్లిన ఈ పంచాయతీలో ఉద్దవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు వెలువడింది. శీవాజీ పార్క్ మైదానంలో అక్టోబర్ 2 నుంచి 6 మధ్యన దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతివ్వాంటూ శివసేన హైకోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దసరా ర్యాలీని నిర్వహించేందుకు కోర్టు ఉద్దవ్ ఠాక్రేకు అనుమతిని ఇచ్చింది. అయితే శాంతిభద్రతల నడుమ ర్యాలీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు ఆదేశాల అనంతరం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. ‘ఒకే పార్టీ నాయకుడు, ఒక శివసేన, ఒకే శివతీర్థం. ఒకే దసరా సమావేశం. అక్టోబర్ 5న పులి గర్జన వినబడనుంది.’ అని ట్వీట్ చేశారు. కాగా లాక్డౌన్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత శివాజీ పార్క్‌లో ఈ ఏడాది దసరా ర్యాలీ నిర్వహించనున్నారు. చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! వివాదం ఏంటి? అక్టోబర్ నెలలో దసరా ర్యాలీ కోసం శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వాలని గత నెలలోనే(ఆగస్టు 22) శివసేన దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత వారం రోజులకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం తరపున స్థానిక శివసేన ఎమ్మెల్యే సదా సర్వస్కర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు మైదానం అద్దెకిచ్చే విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్దవ్ వర్గం మరోసారి(ఆగస్టు26) దరఖాస్తు చేసుకున్నప్పటికీ బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బీఎంసీ నియమ నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతివ్వాలి. కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ వర్గానికి శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వకూడదని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అయితే నెలరోజులులైనా బీఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు సార్లు మినహా 55 ఏళ్లుగా.. దాదాపు 55 ఏళ్ల కిందట బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ సుదీర్ఘ కాలంలో నాలుగు సార్లు మినహా ఏటా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. 2012లో బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఈ పరంపరాను ఆయన తనయుడు ఉద్దవ్ ఠాక్రే కొనసాగిస్తున్నారు. దీంతో శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించే హక్కు ప్రథమంగా తమకే ఉందని ఉద్దవ్ వర్గం వాదిస్తోంది. చదవండి: సిగరెట్ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు -
స్పైస్‌జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్‌జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్‌బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్‌జెట్‌కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్‌జెట్‌కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
హీరో మోటోకార్ప్ ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్
న్యూఢిల్లీ: ద్విచక్రవాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే నెలలో విడా బ్రాండ్ కింద తొలి మోడల్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. రవాణా రంగంలో కొత్త శకాన్ని ఆవిష్కరించేలా అక్టోబర్ 7న రాజస్థాన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ( క్లిక్: మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ) తద్వారా పరోక్షంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎంట్రీని వెల్లడించింది. జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా డీలర్లు, ఇన్వెస్టర్లు, అంతర్జాతీయ పంపిణీదారులను ఆహ్వనించింది. జైపూర్‌లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఈ వాహనాన్ని రూపొందించినట్లు, విడా బ్రాండ్ కింద ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న ప్లాంటులో వీటి తయారీ చేపట్టవచ్చని పేర్కొన్నాయి. ఇదీ చదవండి: Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
5జీ సేవల్లో జియోకు గట్టి పోటీ...ఎయిర్టెల్ గుడ్‌న్యూస్, షేర్లు జూమ్
న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెల రోజుల్లోగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ నాటికి ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేస్తామని సంస్థ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. దీపావళికి రిలయన్స్ జియో 5జీ సేవలను లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఎయిర్టెల్ వేగం పెంచింది. శరవేంగంగా దేశంలో 5జీ సేవలను లాంచ్ చేయనుంది. ఈ వార్తలతో గురువారం ఇంట్రాడే ట్రేడ్‌లో ఎయిర్టెల్ షేరు రెండు శాతానికిపైగా లాభపడి రూ.770 స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలను 2023లోగా కవర్ చేస్తామన్నారు. 4జీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ వేగం 20-30 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఏ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నది వినియోగదార్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కూడా మిట్టల్ గుర్తు చేశారు. -
బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు
న్యూఢిల్లీ: ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని పాత ఐఫోన్లకు సపోర్ట్ చేయడం ఆపివేయనుంది. రానున్న అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్‌ల కోసం వాట్సాప్ పనిచేయదని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆపిల్ ఇటీవల ఇచ్చిన సపోర్ట్ అప్డేట్ ప్రకారం కొన్ని పాత iPhoneలలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ పని చేయదు. WABetaInfo ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నాటికి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు ఈ ఐవోఎస్‌లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోందట. అప్డేట్ చేసుకోవాలనేసమాచారాన్ని అందిస్తోంది. యూజర్లు తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ ఉపయోగించడం కొనసాగించాలంటే, వారి iPhoneలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకొమ్మని సూచిస్తోంది. ఐఫోన్ వినియోగదారులు iOS 12 లేదా తదుపరిది కలిగి ఉండాలని WhatsApp గతంలో దాని హెల్ప్ సెంటర్ పేజీలో కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సవరణ iPhone 5 , iPhone 5c అనే రెండు iPhone వెర్షన్లను మాత్రమే ప్రభావితం చేస్తుందట. iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కిందకు అక్టోబర్‌లో కొత్తగా 12.73 లక్షల మంది వచ్చి చేరారు. 2020లో ఇదే నెలలో గణాంకాలతో పోలిస్తే సభ్యుల చేరికలో 10.22 శాతం వృద్ధి నమోదైంది. 2020 అక్టోబర్‌లో కొత్త సభ్యుల సంఖ్య 11.55 లక్షలుగా ఉంది. కార్మిక శాఖ ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించింది. ‘‘అక్టోబర్‌లో కొత్త సభ్యులు 12.73 లక్షల మందిలో.. 7.57 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 కింద మొదటి సారి చేరారు. సుమారు 5.16 లక్షల మంది చేస్తున్న సంస్థల నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్త సంస్థల్లో చేరిన వారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 22–25 వయసులోని వారు 3.37 లక్షల మంది కాగా.. 18–21 సంవత్సరాల వయసులోని వారు 2.50 లక్షల మంది ఉన్నారు. అంటే కొత్త సభ్యుల్లో వీరే 46 శాతంగా ఉన్నారు. అదే విధంగా మొత్తం కొత్త సభ్యుల్లో 60.64 శాతం అంటే సుమారు 7.72 లక్షల మంది మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమోదయ్యారు’’ అని తెలిపింది. చదవండి:ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్? -
అక్టోబర్‌లో తగ్గిన వాహన అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్లు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిల్స్ హోల్‌సేల్ విక్రయాలు 2021 అక్టోబర్‌లో 17,99,750 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25 శాతం తగ్గుదల. మొత్తం ఉత్పత్తి 22 శాతం క్షీణించి 22,14,745 యూనిట్లుగా ఉంది. కార్ల అమ్మకాలు 27 శాతం తగ్గి 2,26,353 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 25 శాతం క్షీణించి 15,41,621 యూనిట్లుగా ఉంది. వీటిలో మోటార్‌సైకిల్స్ 26 శాతం తగ్గి 10,17,874 యూనిట్లు, స్కూటర్స్ 21 శాతం క్షీణించి 4,67,161 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత కారణంగా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.5,215 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఆక్టోబర్‌లో కాస్తంత నిదానించింది. నికరంగా రూ. 5,215 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ ఫండ్స్ ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.8,677 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్లు గరిష్టాల వద్ద కదలాడుతుండడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే నికర పెట్టుబడుల్లో క్షీణతకు కారణమని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్, అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ‘‘అధిక విలువలను చూసి చాలా మంది ఇన్వెస్టర్లు తటస్థంగా ఉండియారు. ఇందుకు నిదర్శనమే.. సెప్టెంబర్‌లో రూ.3 6,656 కోట్లను సమీకరించగా.. అక్టోబర్‌లో ఇది రూ. 28,671 కోట్లకు తగ్గడం’’ అని శ్రీవాస్తవ వివరించారు. ‘‘ఈక్విటీల్లో పెట్టుబడుల వాతావరణం కొనసాగింది. కానీ, అదే సమయంలో లాభాల స్వీకరణ కూడా కనిపించింది. మొత్తం మీద రూ. 23,500 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈ ఎనిమిది నెలల్లో రూ. 73,766 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. విభాగాల వారీగా.. - మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు (ఆస్తులు/ఏయూఎం) అక్టోబర్ చివరికి రూ.38.21లక్షల కోట్లకు పెరి గాయి. సెప్టెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 37.41 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. - వ్యాల్యూ, ఈఎల్ఎస్ఎస్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. సెక్టోరల్/థీమ్యాటిక్, ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, ఫోకస్డ్, లార్జ్‌అండ్‌మిడ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. - బ్రిడ్ విభాగంలోని పథకాల్లోకి నికరంగా రూ.10,437 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.3,587 కోట్లుగానే ఉంది. - డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ విభాగం సైతం రూ.11,219 కోట్లను ఆకర్షించింది. వ్యాల్యూషన్ల ఆధారంగా డెట్, ఈక్విటీ మధ్య పెట్టుబడులను ఈ విభాగంలోని పథకాలు మారుస్తుంటాయి. - ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి రూ.10,759 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - నెలవారీగా వచ్చే సిప్ పెట్టుబడులు అక్టోబర్‌లో 10,518 కోట్లకు పెరిగాయి. ఇది రికార్డు గరిష్ట స్థాయి. సెప్టెంబర్‌లో ఈ మొత్తం రూ.10,351 కోట్లుగా ఉంది. - డెట్ ఫండ్స్ నికరంగా రూ.12,984 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో డెట్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.63,910 కోట్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. - మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి (డెట్, ఈక్విటీ తదితర) అక్టోబర్‌లో రూ.38,275 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.47,257 కోట్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. చదవండి: ఒకే పథకం.. ఒకటికి మించి ప్రయోజనాలు -
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
-
భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. ఈ ఏడాదిలో వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ జీఎస్టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: ఇండియన్ బ్యాంకులో రూ.266 కోట్ల మోసం!) -
మదుపర్లకు భారీ షాక్.. ఒక్కరోజులోనే రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: స్టాక్ మార్కెట్లో బేర్ స్వైరవిహారంతో గురువారం సూచీలు కుప్పకూలాయి. కొన్నిరోజులుగా బుల్ ఆధిపత్యంతో స్తబ్ధుగా ఉన్న బేర్ ఒక్కసారిగా అదును చూసి పంజా విసిరింది. అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూలతల సంకేతాలు అందాయి. దేశీయ కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. తాజాగా మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసింది. ఈ అంశాలు దేశీయ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ మొదలు.., తుదిదాకా బేర్ సంపూర్ణ ఆధిపత్యం కనబరచడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ నెలకొంది. ఫలితంగా స్టాక్ సూచీలు గత ఆరునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,159 పాయింట్ల నష్టంతో 60వేల దిగువున 59,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18,000 వేల స్థాయిని కోల్పోయి 354 పాయింట్ల పతనంతో 17,857 వద్ద నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదితో తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలోని మొత్తం షేర్లలో కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముంగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,819 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.837 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో రూపాయి 11 పైసలు బలపడి 74.92 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు... ఆసియా మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ ఉదయం 62 పాయింట్ల లాభంతో 61,081 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 18,188 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల కౌంటర్లలో అమ్మేవాళ్లు తప్ప కొనేవాళ్లు లేకపోవడంతో సూచీలు మార్కెట్ ముగిసే వరకూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1365 పాయింట్లు నష్టపోయి 59,778 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు కోల్పోయి 17,799 ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఆరుశాతం నష్టపోయి రూ.225 వద్ద ముగిసింది. ► నష్టాల మార్కెట్లోనూ ఎల్అండ్టీ షేరు రాణించింది. 2% లాభంతో రూ.1814 వద్ద నిలిచింది. ► సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో టైటాన్ షేరు మూడు శాతం నష్టపోయి రూ.2,375 వద్ద స్థిరపడింది. పతనానికి ఐదు కారణాలు... ఎఫ్అండ్ఓ ముగింపు... అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్యేర్ ఆఫ్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. కార్పొరేట్ల మిశ్రమ ఆర్థిక ఫలితాలు.. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అంతర్జాతీయంగా ముడిసరుకు ధరల పెరుగదలతో ఆయా కంపెనీల లాభాలు పరిమితమయ్యాయి. చాలా కంపెనీలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూ పింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రస్ షేర్లు 5% నుంచి 2% నష్టపోయాయి. ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ.... విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీ ఎత్తున అమ్మకాలు చేపట్టడం ప్రస్తుత కరెక్షన్కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐలు రూ.13 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూలతలు... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక రికవరీ అందోళనలతో ఆసియా మార్కెట్లు 1.5%నష్టంతో ముగిశాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) ద్రవ్యపాలసీ, యూఎస్ మూడో క్వార్టర్ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రేటింగ్ డౌన్‌గ్రేడ్... అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతుందనే కారణంతో నోమురా, యూఎస్బీ రేటింగ్ భారత స్టాక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. తాజాగా మోర్గాన్‌స్టాన్లీ మన మార్కెట్ రేటింగ్ ‘అధిక వెయిటేజీ’ నుంచి ‘సమాన వెయిటేజీ(ఈక్వల్ వెయిటేజీ)’ రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థల డౌన్‌గ్రేడ్ రేటింగ్ కేటాయింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ సూచీలు దాదాపు రెండుశాతం మేర కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.4.82 లక్షల కోట్లు నషపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘‘వ్యవస్థలో అధిక లిక్విడిటీ, రిటైల్ ఇన్వెస్టర్ల రూపంలో కొత్త తరం(యువత) పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు 25% ర్యాలీ చేశాయి. ఇప్పటికే అధిక విలువలతో ట్రేడ్ అవుతున్న షేర్లలో ఎఫ్అండ్ఓ ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బుల్ సుదీర్ఘ ర్యాలీ నేపథ్యంలో 10–20 శాతం వరకూ కరెక్షన్కు అవకాశం ఉంది. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పట్ల అప్రమత్తత అవసరం’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. -
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యం
ముంబై: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడమే లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. తద్వారా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో– ప్రస్తుతం 4 శాతం)ను యథాతథంగా కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు అక్టోబర్ ద్వైమాసిక పాలసీ సమీక్ష నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన సెంట్రల్ బ్యాంక్ ద్వైమాసిక సమావేశాల మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. దీని ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం పూర్తి అదుపులోనికి వస్తుందన్న ఆర్బీఐ అంచనాలతో రెపో యథాతథం కొనసాగింపునకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఆమోదముద్ర వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటు 5.7 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలను తాజాగా 5.3 శాతానికి కుదించింది. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధరణకు దోహదపడుతుంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధికి ఢోకా ఉండబోదన్నది ఆర్బీఐ అంచనావేసింది. తొలి 10.5 శాతం అంచనాలను జూన్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ 9.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2021–22 మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదుకాగా, రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 7.9 శా తం, 6.8 శాతం, 6.1 శాతం వృద్ధి నమోదవుతుం దని ఆర్బీఐ అంచనావేసింది. 2022–23 మొదటి త్రైమాసికంలో ఈ అంచనా 17.2 శాతంగా ఉంది. -
పండగ పూట షాక్ ! పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్ : చమురు కంపెనీలు సామాన్యులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి. ఈ నెలలో మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. తాజాగా సవరించిన ధరలతో లీటరు పెట్రోలుపై 34 పైసలు, లీటరు డీజిల్‌పై 37 పైసల వంతున ధరలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోలు ధర ఏకంగా రూ. 108.96 లకు చేరుకోగా డీజిల్ ధర రూ.102లుగా నమోదు అవుతోంది. ఈ నెలంతా బాదుడే మే నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ ధరల పేరుతో చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలు పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర వంద దాటేయగా డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 2 వరకు పెట్రోలు ధరలు పెరగలేదు. గత పది రోజులుగా పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ క్రాస్ చేయగా పెట్రోలు ధర రూ. 110 కి చేరుకుంది. -
యువరాణి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
టోక్యో: జపాన్ యువరాణి మాకో తన చిరకాల ప్రేమికుడు కీయ్ కౌమురోను పెళ్లి చేసుకోబోతోంది. తన ప్రేమ కోసం తన వారసత్వ సంపదగా వచ్చే పెద్ద మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడి వార్తల్లో నిలిచిన మాకో ఎట్టకేలకు తన ప్రియుడిని మనువాడేందుకు సిద్ధమైంది. మాజీ కాలేజీ క్లాస్‌మేట్‌ను అక్టోబర్ 26 న వివాహం చేసుకోనుంది. పలు విమర్శలు, నిశిత పరిశీలన తర్వాత జపాన్ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే యువరాణి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతోందని, దాన్నుంచి కోలుకునేందుకు ఇంత సమయం పట్టిందని కూడా ప్రకటించింది. సంప్రదాయ వివాహం అనంతరం ఆమె రాజ కుటుంబాన్ని విడిచిపెడుతుందనీ, సాధారణ రాజ వివాహానికి సంబంధించిన వేడుకలేవీ జరగవని స్పష్టం చేసింది. జపనీస్ రాయల్ వెడ్డింగ్‌తో పాటు జరిగే అన్ని ఆచారాలకు విరుద్ధంగా ఈ వివాహం ఉంటుందని తెలిపింది. చక్రవర్తి అఖిహిటో ముని మనవరాలు, నరుహిటో మేనకోడలైన మాకో, కౌమురో ఎంగేజ్మెంట్ 2017లోనే జరిగింది. కానీ కౌమురో తల్లికి, ఆమె మాజీ ప్రియుడి మధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా 2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. వీరి ప్రేమ వార్త జపాన్ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చకుదారి తీసింది. ఈ జంట తమ వివాహాన్ని స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేసుకుంటారని యువరాణి 110 మిలియన్ జపనీస్ యెన్స్ లేదా 1.4 మిలియన్ డాలర్లను వదులుకుందని అధికారిక ప్రకటన తెలిపినట్టు స్థానికమీడియా నివేదించింది. యువరాణి.. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వారికి రాయల్టీ కింద కొంత సొమ్మును ముట్టజెబుతారు. కానీ ప్రిన్సెస్ మాకో 1.4 మిలియన్ డాలర్లను రిజెక్ట్ చేసి మరీ పెళ్లి సిద్ధంగావడం విశేషంగా నిలిచింది. అలాగే కౌమురోతో పెళ్లి అనంతరం జపాన్ రాజకుటుంబ వారసత్వాన్ని కూడా ప్రిన్సెస్ మాకో కోల్పోనుంది. కియో కౌమురో పోనీటైల్‌తో దర్శనమిచ్చి మీడియాను ఆకర్షించాడు. కౌమురో ఈ సంవత్సరం ఫోర్డ్హామ్ లా స్కూల్లో చదువు పూర్తి చేయడంతోపాటు, లా ప్రాక్టీస్ కోసం బార్ ఎగ్జామ్ పూర్తి చేశాడు. తాజా మీడియా నివేదికల ప్రకారం, అతను అమెరికాలో ఒక లా ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ నేపథ్యంలో తన ప్రియుడు కౌమురోను పెళ్లి చేసుకొని అమెరికాకు షిఫ్ట్ కానుంది మాకో. కాగా డైలీ మైనీచి ఇటీవల నిర్వహించిన పోల్‌లో 38 శాతం మంది వీరి వివాహానికి మద్దతునివ్వగా, 35 శాతం మంది వ్యతిరేకించారు. 26 శాతం తటస్థంగా ఉండిపోయారు. -
తెలంగాణలో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. చదవండి: సివిల్స్-2020 ఫలితాలు విడుదల పరీక్షల షెడ్యూల్ ► అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్ ►అక్టోబర్ 26న: ఇంగ్లీష్ పేపర్ 1 ►అక్టోబర్ 27న: మాథ్స్ పేపర్1a,బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ 1 ►అక్టోబర్ 28న: మాథ్స్ పేపవర్ 1బీ, జూవాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 ►అక్టోబర్ 29న: ఫిజిక్స్ పేపర్1, ఎకనమిక్స్ పేపర్1 ►అక్టోబర్ 30 న: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ► నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ►2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది విద్యాశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. నేరుగా సెకండ్ ఇయర్‌కు విద్యార్థులను ప్రమోట్ చేసింది. అయితే ప్రమోట్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. కరోనా పరిస్థితులు మళ్ళీ తలెత్తితే సెకండ్ ఇయర్లో మార్కులు కేటాయించడంపై ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
ఓలా స్కూటర్ అమ్మకాలు షురూ.. అడ్వాన్స్ పేమెంట్‌కి రెడీనా?
Ola Electric Scooter Sales: ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని దేశమంతటా ఆసక్తి నెలకొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి, ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రీ బుకింగ్ చేసుకున్నవారు ఓలా సైట్ ద్వారా తమకు కావాల్సిన స్కూటర్ని ఎంపిక చేసుకుంటున్నారు. సేల్ మొదలైంది ఓలా స్కూటర్ని సొంతం చేసుకునేందుకు లక్ష మందికి పైగా ప్రీ బుకింగ్ చేసుకున్నారు. వీరిలో స్కూటర్ కొనేందుకు ఆసక్తి ఉన్న వారు ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి మోడల్, కలర్ ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలి. ఆ తర్వాత స్కూటర్ కొనుగోలుకు సంబంధించిన పేమెంట్ ఆప్షన్స్ ఈఎంఐలో కొంటున్నారా ? లేదా నేరుగా కొంటున్నారా అనే ఆప్షన్లను ఎంచుకోవాలి. ఓలా స్కూటర్‌కి ఫైనాన్స్ చేసేందుకు అనేక సంస్థలు, బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఎస్ 1 మోడల్‌కి కనీస డౌన్ పేమెంట్ రూ. 2,999 ఉండగా ఎస్ ప్రో మోడల్‌కి రూ. 3,199లు గా ఉంది. ఓన్లీ అడ్వాన్స్ పేమెంట్ ఓలా స్కూటర్లను నేరుగా హోం డెలివరీ ద్వారానే కస్టమర్లకు అందిస్తున్నారు. కొనుగోలు సెప్టెంబరు 15న ప్రారంభమైన స్కూటర్ డెలివరీ అక్టోబరులో ఉంటుందని ఓలా చెబుతోంది. ఈఎంఐ ఆప్షన్ కాకుండా నేరుగా కొనుగోలు చేసేవారు సైతం పుల్ పేమెంట్ చేయక్కర్లేదని ఓలా తెలిపింది. ఎస్ 1 (ధర రూ.99,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్‌గా రూ. 20,000 ఎస్ 1 ప్రో (ధర రూ.1,29,999) మోడల్‌కి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్‌గా రూ. 25,000 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన డబ్బలును డెలివరీకి ముందు చెల్లించే వెసులుబాటు ఓలా అందిస్తోంది. ప్రీ బుకింగ్ చేయకపోతే ? జులైలో ప్రీ బుకింగ్ చేయని వాళ్లు సైతం ఓలా వెబ్సైట్ ద్వారా స్కూటర్‌ను కొనుగోలుకు ప్రయత్నించవచ్చు. ఓలా వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రీ బుకింగ్ టోకెన్ అమౌంట్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగులకు సంబంధించిన ఇతర ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓలా ప్రీ బుకింగ్, అడ్వాన్స్‌పేమెంట్‌కి సంబంధించిన మొత్తం రీఫండబుల్, ఎప్పుడైనా ప్రీ బుకింగ్ లేదా కొనుగోలు రద్దు చేసుకుంటే డబ్బు వాపస్ ఇస్తారు. ఇబ్బందులు అధిగమించి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ప్రీ బుకింగ్స్ జులైలో ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి స్కూటర్ రాకముందే లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 8న ఈ స్కూటర్ అమ్మకాలు ఆన్లైన్లో ప్రారంభించారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో వారం రోజుల పాటు అమ్మకాలు వాయిదా వేశారు. తాజాగా సెప్టెంబరు 15న ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ వేదికగా అమ్మకాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఓలా చీఫ్ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. Bring the revolution home! Ola S1 purchase is rolling out now!l We’re opening it in the order of reservation. Look for your invitation email or check the Ola app to know when it’s live for you! #JoinTheRevolution pic.twitter.com/FQlVDxJ6Ki — Bhavish Aggarwal (@bhash) September 15, 2021 చదవండి: ఈవీ ఛార్జింగ్ సమస్యలను సులభంగా చెక్ పెట్టొచ్చు: ఓలా సీఈఓ -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు షురూ.. డెలివరీ ఎప్పుడంటే ?
Ola Electric Scooter Sales: యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలని అనుకునేవారి కోసం ఈఎంఐ ఆప్షన్ని పలు బ్యాంకులు అందిస్తున్నాయి. సెప్టెంబరు 8 నుంచి ఓలా స్కూటర్‌కి ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ ముగిశాయి. 2021 సెప్టెంబరు 8 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్రీ బుకింగ్ చేసుకున్న వారు సెప్టెంబరు 8 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి బైక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం సొమ్ము చెల్లించి లేదా ఈఎంఐ పద్దతిలో స్కూటర్ని కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, జన స్మాల్ ఫైనాన్స్, వంటి పలు బ్యాంకింగ్ , ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ. 2,999గా నిర్ణయించారు. అక్టోబరులో డెలివరీ సెప్టెంబరు 8 నుంచి ఓలా వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి అక్టోబరులో డెలివరీ ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెటింగ్ చీఫ్ వరుణ్ దుబే తెలిపారు. షోరూం వ్యవస్థ లేనందున నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తాయంటూ చెప్పారు. స్పష్టత ఇస్తాం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించింది. మరోవైపు ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్‌ల కొరత వేధిస్తోంది. దీంతో బైక్‌ను కొనుగోలు చేసే సమయంలోనే డెలివరీ ఎప్పుడిస్తామనే వివరాలు కస్టమర్‌కి వెల్లడిస్తామని ఓలా ప్రతినిధులు తెలిపారు. ఓలా సంస్థకు తమిళనాడులో భారీ స్కూటర్ తయారీ ఫ్యాక్టరీ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎస్ 1, ఎస్ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్ మోటార్, 3.97 కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది. అంతటా ఆసక్తి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జులైలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రీఫండబుల్ అమౌంట్‌గా రూ. 499 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవాలని ఓలా కోరగా.. రికార్డు స్థాయిలో లక్షకు పైగా ప్రీబుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు 15న ఓలా స్కూటర్ ఫీచర్స్, ధరను ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. అప్పటి నుంచి ఈ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి ! -
అక్టోబర్‌లో బీటెక్ ప్రత్యక్ష తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలను వీలైనంత త్వరగా తెరిచే వీలుంది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల తరగతులను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇది వీలుకాకపోతే అక్టోబర్ నుంచైనా ప్రత్యక్ష బోధన చేపట్టే వీలుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరగా ముగించి, అక్టోబర్ మొదటి వారంలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సీఎం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఏఐసీటీఈ డెడ్‌లైన్.. అక్టోబర్ 15లోగా ఇంజనీరింగ్ కాలేజీల్లో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) రాష్ట్రాలను ఆదేశించింది. సామాజిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి సెక్షన్‌లోనూ గరిష్టంగా 60 మంది విద్యార్థులు ఉంటారు. చాలా కాలేజీల్లో బెంచ్‌కు ఇద్దరు చొప్పున కూర్చుంటున్నారు. ఇకపై ఒక్కరినే కూర్చోబెట్టడం సాధ్యమేనా అనే దిశగా పరిశీలన చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా చేయాల్సి వస్తే సెక్షన్లు పెంచాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయగల సామర్థ్యం ఎన్ని కాలేజీలకు ఉందనే వివరాలను ప్రభుత్వం ముందుంచారు. అక్టోబర్ 15లోపే ఫస్టియర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టే వారికి అక్టోబర్ 15లోగా ప్రత్యక్ష బోధన చేపట్టాలని ఏఐసీటీఈ సూచించింది. ఎంసెట్ ఫలితాలను ఈ నెల 25న వెల్లడిస్తారు. 30 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియభహ మొదలుపెడుతున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 11 మధ్య ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఇదే నెల 4 నుంచి 13 తేదీల మధ్య వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 15న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. జీఈఈ ఫలితాల తర్వాత తదుపరి కౌన్సెలింగ్ చేపడతారు. మొత్తమ్మీద సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 4 నాటికి సీట్ల కేటాయింపు జరపాలని, అక్టోబర్ మొదటి వారంలో కాలేజీల్లో విద్యా బోధన నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
అక్టోబర్ 18 నుంచి షర్మిల పాదయాత్ర!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే పాదయాత్రకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అక్టోబర్ 18 నుంచి చేపట్టే పాదయాత్రను ఆమె చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటికే రెండుసార్లు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన షర్మిల ఇప్పుడు మూడో పర్యాయం నిర్వహించతలపెట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన షర్మిల అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా, మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్?
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 థర్డ్ వేవ్ అక్టోబర్‌లో వస్తుందని, అయితే సెకండ్ వేవ్ కంటే సమర్థంగా మన దేశం ఎదుర్కొంటుందని రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్య రంగ నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఎపిడమాలజిస్టులు, ప్రొఫెసర్లు... ఇలా కరోనాపై పని చేస్తున్న నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మొదటి రెండు వేవ్‌లు ఎలా మొదలై, ఎలా కేసులు పెరిగి, తిరిగి ఎలా తగ్గాయో తెలిపే డేటాను సేకరించింది. అన్నింటినీ క్రోడీకరించి కొన్ని అంచనాలు తయారు చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో థర్డ్ వేవ్ ఖాయంగా వస్తుందని చెప్పిన రాయిటర్స్ కేంద్రంలో మోదీ సర్కార్ సెకండ్ వేవ్ కంటే దీనిని సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపింది. మరో ఏడాది పాటు కరోనా ప్రజారోగ్యానికి సవాల్‌గానే ఉంటుందని పేర్కొంది. జూన్ 3–17 మధ్య 40 మంది నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 85% మందికి పైగా అక్టోబర్‌లో థర్డ్ వేవ్ వస్తుందని చెప్పారు. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆగస్టులో వస్తుందని లెక్కలు వేస్తే, 12 మంది సెప్టెంబర్‌లో వస్తుందన్నారు. ఇక మిగిలిన వారు నవంబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కోవిడ్ మళ్లీ పంజా విసురుతుందని వివరించారు. 70% మంది నిపుణులు భారత్ మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని చెప్పారు ‘‘థర్డ్ వేవ్‌ని మరింత సమర్థంగా ఎదుర్కోగలం. ఎందుకంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాం. అంతే కాకుండా సెకండ్ వేవ్‌లో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో ఎంతో కొంత హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడే ఉంటుంది’’అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా చెప్పారు. పిల్లలకి ముప్పు ఉండే ఛాన్స్ ఈసారి పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై 40 మంది నిపుణుల్లో 26 మంది ముప్పు పొంచి ఉందని చెబితే, 14 మంది అలాంటిదేమీ ఉండదన్నారు. మరో ఏడాది పాటు కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి ఉంటుందని రాయిటర్స్ సంస్థ నివేదిక తెలిపింది. -
జియోకు ఎయిర్టెల్ షాక్
సాక్షి, ముంబై: వరుసగా మూడవ నెలలో కూడా టెలికాం సంస్థ ఎయిర్టెల్ జియోకు షాకిచ్చింది. కొత వైర్లెస్ చందాదారులకు సంబంధించి జియోను అధిగమించిన ఎయిర్టెల్ 36.7 లక్షలు కొత్త యూజర్లను సాధించింది. అయితే దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొనసాగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎయిర్టెల్ అక్టోబర్‌లో 3.67 మిలియన్లకు పైగా కొత్త వైర్లెస్ చందాదారులను సాధించి రిలయన్స్ జియోను అధిగమించింది. జియో 2.22 మిలియన్ల చందాదారులతో పోలిస్తే ఎయిర్టెల్ 1.45 మిలియన్ల ఎక్కువ మందిని తన ఖాతాలో వేసుకుంది. ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లో 96.74 శాతం క్రియాశీల చందాదారులు ఉన్నారు. (విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు) అక్టోబరులో కొత్తగా ఎయిర్టెల్ 36.7 లక్షలు, జియో 22.2 లక్షల మంది మొబైల్ కస్టమర్లను దక్కించుకున్నాయి. వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ నూతన మొబైల్ కస్టమర్లను పొందలేకపోవడం గమనార్హం. వోడాఫోన్ ఐడియా (వి) 2.7 మిలియన్ల చందారులను కోల్పోయింది. సెప్టెంబరులో కూడా అత్యధికంగా కొత్త కస్టమర్లను ఎయిర్టెల్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఎయిర్టెల్ 3.8 మిలియన్ల చందాదారులను పొందగా, జియో 1.5 మిలియన్ల వినియోగదారులను చేర్చుకోగా, వోడాఫోన్ ఐడియా 4.6 మిలియన్ల మందిని కోల్పోయింది. అక్టోబర్ నాటికి అధికారిక సమాచారం ప్రకారం జియో ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 406.36 మిలియన్లుగా ఉండగా, వొడాఫోన్ ఐడియాకు 292.84 మిలియన్ల చందాదారులున్నారు. అటు దేశంలో టెలికం చందాదారుల సంఖ్య అక్టోబరు చివరినాటికి 117.18 కోట్లకు చేరింది. సెప్టెంబరులో ఈ సంఖ్య 116.86 కోట్లు. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 114.85 కోట్ల నుంచి 115.18 కోట్లకు ఎగసింది. వైర్‌లైన్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 2 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 1.99 కోట్లకు వచ్చి చేరింది. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు 1.17 శాతం పెరిగి 73.48 కోట్లుగా ఉన్నారు. మొబైల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్స్ 1.15 శాతం ఎగసి 71.26 కోట్లకు చేరారు. -
అక్టోబర్‌లో 11.55 లక్షల కొత్త ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నెలలో 11.55 లక్షల మంది కొత్తగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్)లో సభ్యులుగా నమోదయ్యారు. గతేడాది అక్టోబర్‌లో 7.39 లక్షల మంది నూతన చేరికతో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదైంది. వ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాల తీరును ఈపీఎఫ్‌వో గణాంకాల రూపంలో కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈపీఎఫ్‌వోలో 14.19 లక్షల మంది చేరికతో పోలిస్తే అక్టోబర్‌లో తగ్గినట్టు తెలుస్తోంది. కరోనా తర్వాత దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,79,685 మంది సభ్యులు ఈపీఎఫ్‌వో నుంచి తగ్గిపోయినట్టు గతంలో ప్రకటించిన గణాంకాలను.. తాజాగా 1,49,248గా సవరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈపీఎఫ్‌వోలో 39.33 లక్షల మంది కొత్త సభ్యులుగా చేరినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణాలో ఎక్కువ వృద్ధి కనిపించింది. వచ్చే మూడు నెలల్లో.. బ్యాంకుల రూ.25,000 కోట్ల సమీకరణ! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు వచ్చే మూడు నెలల్లో ఈక్విటీ, టెట్ మార్కెట్ల ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించుకోనున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి దేబాశిష్ పాండా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయని తెలిపారు. గడచిన కొద్ది నెలల్లో బ్యాంకింగ్ రూ.40,000 కోట్లు సమీకరించుకున్నట్లు వివరించారు. ఈ నెల ప్రారంభంలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ద్వారా కెనరాబ్యాంక్ రూ.2,000 కోట్లు సమీకరించుకుంటే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎ న్బీ) రూ.3,788 కోట్లు సమీకరించుకుంది. -
వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్: అక్టోబరు నాటికి..
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చేస్తున్న తరుణంలో మరోసారి సీరం కరోనా మహమ్మారి నివారణకు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించింది. ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని సీరం సీఈఓ అదార్ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, వచ్చే నెలలోగా భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. (వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత) అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల అనుమతి, ఆ తరువాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభమవుతుందన్నారు. అలాగే 2021, అక్టోబర్ నాటికి చాలామందికి టీకాలు వేయడం పూర్తవు తుందని, దీంతో మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ఆ తర్వాత ప్రజలంతా సాధారణ జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పూనవాలా ఈ వ్యాఖ్యలు చేశారు. తొలి దశలో దేశ జనాభాలో 20-30 శాతం మందికి టీకాలు వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందన్నారు. 20 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత ప్రజల్లో విశ్వాసం పుంజు కుంటుందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాననీ, దీంతో సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా అభిప్రాయపడ్డారు. (వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం) జూలై 2021నాటికి 300-400 మిలియన్ మోతాదులను సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లకు కూడా టీకాల తయారీకి తాము సన్నద్ధమవుతున్నా మని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నాటికి సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా నమ్ముతుండగా, రోజుకు 100 కరోనా వైరస్ షాట్లను మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను కల్పించనున్నాయి. అలాగే షాట్ పొందిన ప్రతి వ్యక్తిని 30 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. కాగా కరోనావైరస్ వ్యాక్సిన్ల తయారీకి సీరం నోవావాక్స్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నోవావాక్స్ కోసం ఫేజ్ 3 క్లినికల్ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఢిల్లీలో అత్యంత శీతల అక్టోబర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులు గత 58 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత శీతల పరిస్థితులను ఈ అక్టోబర్ నెలలో చవిచూశారు. 1962 అక్టోబర్ నెల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీల సెల్సియస్ కాగా దాదాపు 62 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్‌లో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా ఉంటుంది. ఢిల్లీలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 12.5 డిగ్రీలు కాగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత, 1994 తర్వాత ఇంత తక్కువగా నమోదైందని ఐఎండీ పేర్కొంది. గాలి వేగం మందగించడం, ఆకాశం మేఘావృతమై ఉండటమే ఈ పరిస్థితికి కారణమని ఐఎండీకి చెందిన కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఏటా సాధారణంగా ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 15–16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ఆల్‌టైం కనిష్ట ఉష్ణోగ్రత 1937 అక్టోబర్ 31వ తేదీన 9.4 డిగ్రీలుగా నమోదు అయ్యింది. -
అక్టోబరు నెలలో బ్యాంకు సెలవులు
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 2020 అక్టోబర్ నెలలో 14 రోజులు పనిచేయవు. ఈ సెలవుల్లో రెండు, నాలుగు శనివారాలు ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకం ప్రకారం, అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకుల సెలవు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం, అక్టోబర్ సెలవుల జాబితాలో గాంధీ జయంతి, మహాసప్తమి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. అలాగే అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో శని, ఆదివారాల్లో నవమి, దసరా (అక్టోబరు 25) పండుగ లొచ్చాయి. అక్టోబర్ 2020 : ప్రధాన సెలవులు అక్టోబర్ 2 (శుక్రవారం) - మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు) అక్టోబర్ 8 (గురువారం) - చెల్లం (ప్రాంతీయ) అక్టోబర్ 23 (శుక్రవారం) - మహాసప్తమి (చాలా రాష్ట్రాలు) అక్టోబర్ 26 (సోమవారం) - విజయ దశమి (చాలా రాష్ట్రాలు) అక్టోబర్ 29 (గురువారం) - మిలాద్ ఉన్ నబీ (ప్రాంతీయ) అక్టోబర్ 31 (శనివారం) - మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి (ప్రాంతీయ) -
ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఐఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నతరుణంలో మార్కెట్లో అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎపుడెపుడా అని ఊరిస్తున్నయాపిల్ ఐఫోన్12 ఆవిష్కారానికి రంగం సిద్ధమవుతోంది. యాపిల్ తన రాబోయే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12 త్వరలోనే లాంచ్ చేయనుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాపిల్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 13 న నిర్వహించనుందని, ఈ సందర్భంగానే దీన్ని ఆవిష్కరించనుందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో భారతీయ వినియోగదారులకు ఐఫోన్ సిరీస్ లో భాగంగా కొత్త ఐఫోన్12 మినీ, ఐఫోన్12 రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. (యాపిల్ ఆన్లైన్ స్టోర్ : బంపర్ ఆఫర్లు) ప్రస్తుతానికి కొత్త ఐఫోన్ కోసం ప్రణాళికలను యాపిల్ ధృవీకరించలేదు. సాధారణంగా యాపిల్ తన ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తుంది. అయితే కోవిడ్-19, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇటీవల వర్చువల్ గా నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ లో యాపిల్ వాచ్ సిరీస్, ఐపాడ్ లాంటి ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 12 పై ఒక ప్రకటన ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఐఫోన్ లాంచ్ గురించి యూట్యూబర్ జోన్ తాజా సమాచారం ఐఫోన్ 12 లాంచ్ కార్యక్రమం అక్టోబర్‌లో జరగనుంది. మూడు రెగ్యులర్ వేరియంట్లలో తీసుకురానుంది. అంతేకాదు అక్టోబర్ 16 నుండి ప్రీ ఆర్డర్లను ప్రారంభించవచ్చట. 6.1 అంగుళాల స్క్రీన్ 256వరకు స్టోరేజ్ , 5.4 అంగుళాలు 64జీబీ స్టోరేజ్ తో రానుంది. 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్ తో రూపొందిస్తున్న ఐఫోన్ 12 ప్రో, ప్రో మాక్స్ స్క్రీన్ పరిమాణాలు వరుసగా 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలుగా ఉండవచ్చని మరో అంచనా. -
అక్టోబర్‌లో పీజీఈసెట్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 21నుండి 24 వరకు జరిగిన టీఎస్‌పీజీఈసెట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినట్లు టీఎస్‌పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మ్-డి (పోస్ట్)లో రెగ్యులర్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్పీజీసెట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే అభ్యర్థులు 28 సెప్టెంబర్ 2020 ప్రాథమిక కీతో మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే 28 సెప్టెంబర్ 2020 నుండి 30 సెప్టెంబర్ 2020 వరకు http://pgecet.tsche.ac.in/ అభ్యర్థులు వెబ్సైట్లో సమర్పించవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఫలితాలు http://pgecet.tsche.ac.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కుమార్ మొలుగారం పేర్కొన్నారు. -
అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు
సీనియర్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌత్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మూడు రోజుల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ చివరి వారంలో విడుదల కానున్న ఈ సినిమా వివాదంలో పడింది. ‘‘ఈ సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. కాగా, ఈ చిత్రానికి ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చినట్లు, అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మరి.. ఫైనల్‌గా ఈ సినిమాని ఎవరు రిలీజ్ చేస్తారో చూడాలి. -
భాయ్ బరిలో దిగుతున్నారు
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆమిర్ ఖాన్ లొకేషన్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. షారుక్ ఖాన్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరి సల్మాన్ ఖాన్? సల్మాన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని సల్మాన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటివారం నుంచి భాయ్ బరిలో దిగనున్నారని తెలిసింది. అక్టోబర్ 1 నుంచి ‘బిగ్‌బాస్’ షో చిత్రీకరణలో పాల్గొంటారు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే’ చిత్రానికి సంబంధించిన మిగిలిన చిత్రీకరణ పూర్తి చేస్తారట. పదిరోజులు పాటు సాగే ఈ షెడ్యూల్లో ఓ పాట కూడా చిత్రీకరించనున్నారు. చిత్రీకరణ ప్రారంభమయ్యేలోగా ప్రభుదేవా ముంబై చేరుకొని కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంటారట. ‘రాధే’ చిత్రాన్ని ఈ క్రిస్మస్ లేదా వచ్చే గణతంత్ర దినోత్సవానికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఉన్నతంగా మారుద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో కూడా అప్రెంటిస్‌షిప్ ఉంటుందని, ఈ నాలుగేళ్లలోనే 20 అదనపు క్రెడిట్స్ సాధించిన వారికి బీటెక్ ఆనర్స్ డిగ్రీ వస్తుందని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థి అదే విభాగంలో ఈ క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ అడ్వాన్స్డ్ అని వ్యవహరిస్తారు. వేరే విభాగంలో క్రెడిట్స్ సాధిస్తే ఆనర్స్ మైనర్ అని పేర్కొంటారు. యూనివర్సిటీల్లో 1,100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ప్రకటించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సెప్టెంబర్‌లో సెట్ల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యా రంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో కూడా నాడు–నేడు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 32.4 నుంచి 90 శాతానికి పెరగాలి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ద్వారా ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నందున కచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలి. దీన్ని ఇప్పుడున్న 32.4 శాతం నుంచి 90 శాతానికి తీసుకెళ్లాలి. అడ్మిషన్ల సమయంలోనే ఐచ్ఛికం మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చాం. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుంది. ఇవి నేర్చుకుంటేనే డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తాం. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ కావాలా? ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటాం. బీటెక్‌లో కూడా.. బీటెక్ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. అదనంగా 20 క్రెడిట్స్ సాధించిన వారికి ఆనర్స్ డిగ్రీ వస్తుంది వైద్య కళాశాలలకు రూ.6 వేల కోట్లు పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి నాడు– నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం విద్యా రంగం మీద దృష్టి పెట్టింది కాబట్టి వీటి గురించి ఆలోచిస్తోంది. ఆ దుస్థితికి కారణం... ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలుకలు కొరికి శిశువు చనిపోయే దుస్థితి ఎందుకు దాపురించింది? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగు, సంస్కత అకాడమీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ తెలుగు, సంస్కృత అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులో ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. కచ్చితమైన నిధుల కేటాయింపుతో మూడు నాలుగేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వర్సిటీల్లో 1,100 పోస్టుల భర్తీకి ఆమోదం ► యూనివర్సిటీల్లో దాదాపు 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి. 10 నెలల నిరీక్షణకు తెరపడనుంది. అక్టోబర్ మొదటివారంలో దాదాపు 4,200 మంది అభ్యర్థులకు శిక్షణ మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీటీసీ/డీటీసీల్లో కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్డ్(ఏఆర్) అభ్యర్థులకు అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు పాసింగ్ ఔట్ పరేడ్(పీవోపీ) జరగనుంది. ఆ వెంటనే టీఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పదినెలలుగా మానసిక వేదన అనుభవిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఫలితాలు వచ్చిన ఇన్నాళ్లకు.. వాస్తవానికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 17,156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2019 సెప్టెంబర్‌లో సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా అక్టోబర్‌లోనే ఫలితాలు వచ్చాయి. అయితే, 12 వేల మందికిపైగా సివిల్, ఏఆర్ కేడెట్లకు 2020 జనవరిలో శిక్షణ ప్రారంభమైనా స్థలాభావంతో సుమారు 4,200 మంది టీఎస్ఎస్పీ అభ్యర్థులకు ఇంకా శిక్షణ మొదలుకాలేదు. ఈ మధ్యకాలంలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్య ర్థులు అనేక కష్టాలు అనుభవించారు. ఇద్దరు అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాదాపు ఆరుగురు అభ్యర్థులు వివిధ ప్రమాదాల్లో గాయపడ్డారు. కొందరు కరోనా బారినపడ్డారు. మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు జాబులకు రాజీనామా చేశారు. శిక్షణకు పిలుపు రాకపోవడంతో చాలామంది కూలీ పనులకు వెళ్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్త.. అక్టోబర్‌లో శిక్షణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఫిట్నెస్ను కాపాడుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని, జ్వరాలు, అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలంటున్నారు. శిక్షణ ప్రారంభానికి ముందు అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే, వారిని క్వారంటైన్‌కు పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
అక్టోబర్‌లో పూర్తి కానున్న దుర్గం చేరువు కేబుల్ బ్రిడ్జి
-
ప్యారిజాతం
తారాగణం: వరుణ్ ధావన్, బన్నితా సాందు, గీతాంజలి రావ్ తదితరులు రచన: జూహీ చతుర్వేది, కెమెరా: అవిక్ ముఖోపాధ్యాయ, సంగీతం: శాంతను మొయిత్రా, నిర్మాతలు: రోనీ లహరి, షీల్ కుమార్ సినిమా చూడటానికి వెళ్లి కావ్యాన్ని దర్శించి వచ్చాను. ఈ మధ్యలో చూసిన లవ్ స్టోరీస్‌లో నాకు బాగా నచ్చిన లవ్ స్టోరీ ‘అక్టోబర్’.థియేటర్లో కూర్చున్నాను కానీ... తెరలో భాగమయిపోయాను. ఈ కావ్యంలో ఒక్క పాట కూడా లేదు.. అంతా కావ్యమే. చాలా వరకు... మౌనంగా సాగిన గేయమే. ఏదో నా వాళ్లకు అయిన గాయంలా అనిపించి కళ్లు మాటిమాటికి చెమర్చాయి. ప్రేమ అన్న మాటలేదు... ప్రేమ అన్న ప్రతిమ లేదు..ప్రేమ అన్న ఊసు లేదు..కానీ అంతా ప్రేమే!కెమెరా ఊరికే కదలదు..పాత్రలు అలజడిగా కదలవు...కథ తొందరపడి కదలదు. కదలిక లేకుండా మనస్సును కదిలించే ఎనర్జీ ఏదో మనలను ఆవహిస్తుంది...అందరూ సహజంగా అనిపిస్తారు..అసహజంగా మన మీద పట్టు బిగిస్తారు..సూజిత్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా... మీ జీవితంలో కూడా ఒక చిన్న చోటు సంపాదించాలని అనుకుంటూ... ఆశిస్తూ.. ఇదిగో సినిమా కథ..ఇరవై ఏళ్ల వరుణ్ ధావన్ (డ్యాన్) బన్నితా సాందు (శియిలి) ఇద్దరూ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ట్రెయినీస్గా పని చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో గొప్ప రిలేషన్షిప్ ఏమీ ఉండదు. ఎదురు పడితే మాట్లాడటం తప్ప. కానీ డ్యాన్ అమాయకత్వంలో ఉండే చంచలత్వం ఎవరూ తప్పించుకోలేరు... శియిలీ కూడా! డిసెంబర్ చివరి రోజున డ్యాన్ తన తల్లిదండ్రుల మ్యారేజ్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీకి ఊరెళతాడు. ఆ రోజు హోటల్లో పనులన్నీ పూర్తి చేసుకుని స్టాఫ్ అంతా హోటల్ మిద్దె మీద న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటారు. ఎందుకో శియిలీకి డ్యాన్ గుర్తుకొస్తాడు... ‘తనెక్కడా?!’ అని అడుగుతూ పిట్టగోడ మీద కూర్చోబోతున్న శియిలీ జారి కిందపడిపోతుంది. డ్యాన్ వచ్చేటప్పటికి శియిలీ కోమాలో హాస్పిటల్లో ఉంటుంది. అందరు స్నేహితులలాగే డ్యాన్ కూడా శియిలీని చూడటానికి వెళతాడు. అక్కడ తనకు తెలుస్తుంది, చివరిగా ‘డ్యాన్ ఎక్కడున్నాడు?’ అని శియిలీ అడిగిందని. తను నన్నే ఎందుకడిగింది.. అవే కదా తన చివరి మాటలు... అని తెగ ఆలోచిస్తాడు డ్యాన్. ఇక అప్పటినుంచి హాస్పిటల్‌కి రోజూ వెళ్లి కోమాలో ఉన్న శియిలీతో ప్రేమ పెంచుకుంటాడు. స్నేహితులందరూ చెబుతారు శియిలీకి తన పట్ల అలాంటి ఫీలింగ్స్ ఏవీ లేవని... కానీ డ్యాన్ నమ్మడు... ఏదో తెలియని బంధం తనని శియిలీకి చాలా దగ్గర చేసేస్తుంది... శియిలీ కుటుంబం కూడా డ్యాన్ని చాలా ఇష్టపడతారు... హాస్పిటల్ క్యారిడార్లో... కుర్చీలలో... ఎక్కడ పడితే అక్కడ డ్యాన్ తన ప్రేమకోసం అలసి కూలబడుతూ ఉంటాడు. ఇలా హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ట్రెయినీగా పని చేస్తున్న వాళ్లు డ్యూటీ సరిగా చెయ్యకపోతే డిగ్రీ రాకపోవడమే కాకుండా మూడు లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. డ్యాన్ వాళ్ల అమ్మ వచ్చి అడుగుతుంది ‘‘ఆ అమ్మాయి నీ గాళ్ ఫ్రెండా’’అని. మౌనంగా ఉండిపోతాడు డ్యాన్. శియిలి అంటే బెంగాలీలో పారిజాతపు పువ్వు. శియిలి కేరళ నుంచి వచ్చినా.. చిన్నప్పటినుంచి ఢిల్లీలో తన తాతతో రాత్రి రాలి పడే పారిజాత పుష్పాలను ఒక దుప్పటిలో పట్టుకోవడం.. వాటి సువాసనను చాలా ఇష్టపడడం గమనించి తన పేరు శియిలీగా మారుస్తారు. ఒకరోజు డ్యాన్ పారిజాతం పూలను తెచ్చి శియిలీ ఉన్న గదిలో పెడతాడు. ఎన్నో నెలలుగా కోమాలో ఉన్న శియిలి మొదటిసారి ఆ పూల సువాసనకు స్పందిస్తుంది... అప్పటినుంచి కళ్లతో కొంచెం కొంచెం మాట్లాడుతుంది. శియిలి తల్లిగారు (గీతాంజలి రావ్), డ్యాన్ని వెళ్లి తన కెరీర్‌ను కాపాడుకోమని మృదువుగా మందలించి పంపించేస్తుంది. డ్యాన్ కులు మనాలిలో ఒక రిసార్ట్‌లో పని చేస్తుంటాడు. విచిత్రంగా డ్యాన్ లేని సమయంలో శియిలి ఆరోగ్యం క్షీణిస్తుంది. డ్యాన్ కెరీర్ వదులుకుని వెనక్కి వచ్చేస్తాడు. కొద్దిరోజుల్లోనే శియిలి హఠాత్తుగా చని పోతుంది. ‘పారిజాతం పువ్వు లాగే తొందరగా రాలిపోయింది..!’ అని డ్యాన్ గీతాంజలికి చెబుతాడు. డ్యాన్ మళ్లీ తన కెరీర్ వైపు మళ్లుతాడు. గీతాంజలి కేరళకి వెళ్లిపోతూ పారిజాతం చెట్టును డ్యాన్‌కి ఇస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. కొద్దిరోజుల్లో అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మీ టీవీలోకే వచ్చేస్తుంది. ∙ప్రియదర్శిని రామ్ -
శ్రీదేవి సినిమాను గుర్తుచేసిన ట్రైలర్..!
ముంబై : సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న సెన్సిబుల్ మూవీ ‘ఆక్టోబర్’.. ఇప్పటికే ఈ సినిమా ఫొటోలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. తన ట్రైనింగ్‌లో భాగంగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పనిచేసే హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిగా ఈ సినిమాలో వరుణ్ కనిపిస్తాడు. బాలీవుడ్లో ఆరంగేట్రం చేస్తున్న బనిత సంధూ ఈ సినిమాలో వరుణ్ క్లాస్మేట్గా కనిపించనుంది. కొన్ని అనుకోని దురదృష్టకరమైన పరిణామాల వల్ల ఆమె ఐసీయూలో చేరుతుంది. ఆ తర్వాత గతాన్ని మరిచిపోయి హీరోను, మిగతా స్నేహితులను కూడా గుర్తుపట్టని స్థితిలోకి వెళుతుంది. తన కోసం హీరో ఏం చేశాడన్నది సినిమా. ఇటీవల కన్నుమూసిన శ్రీదేవి ప్రఖ్యాత సినిమా వసంతకోకిల (హిందీలో సద్మా)ను గుర్తుచేసేలా ఈ సినిమా ట్రైలర్ ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చాలా సెన్సిబుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
శ్రీదేవి సినిమాను గుర్తుచేసిన ట్రైలర్..!
-
మార్చి తర్వాత అక్టోబర్
... అదేంటి మార్చి తర్వాత ఏప్రిల్ రావాలి కదా. మరి మార్చి తర్వాత అక్టోబర్ రావడమేంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం మా క్యాలెండర్ ఇలానే ఉంది అంటున్నారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. ‘విక్కీ డోనార్, పీకు’ ఫేమ్ సూజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, బనితా సంధూ జంటగా రూపొందిన చిత్రం ‘అక్టోబర్’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు వరుణ్ ధావన్. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ తర్వాత ఏప్రిల్ బదులుగా అక్టోబర్‌ను చూపిస్తుంది క్యాలెండర్. ఏప్రిల్ 13న ‘అక్టోబర్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అందుకే మార్చి తర్వాత అక్టోబర్ అని వినూత్న రీతిలో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ‘‘అక్టోబర్ సినిమా నాకు చాలా స్పెషల్. నటుడిగానే కాదు హ్యూమన్ బియింగ్గా కూడా ఈ సినిమా నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. నేచర్‌తో లవ్‌లో పడిపోయా’’ అని పేర్కొన్నారు వరుణ్ ధావన్. ఈ సినిమా కేవలం 38 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. రైజింగ్ సన్ బ్యానర్ పై రోన్నీ లహరీ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. -
అదరగొట్టిన ఆల్టో.. మళ్లీ టాప్ గేర్‌లో
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఆల్టో మరోసారి అదరగొట్టింది. అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ఆల్టో మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్ఐఏఎం) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబరు నెలలో మారుతికే చెందిన డిజైర్‌ను వెనక్కి నెట్టి టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది. గత ఆగస్టు, సెప్టెంబరు మాస అమ్మకాల్లో ఆల్టోను వెనక్కి నెట్టి.. మారుతి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) లెక్కల ప్రకారం అక్టోబర్ లో 19,447 యూనిట్లు అమ్ముడుపోయాయి కాగా డిజైర్ 17,447 యూనిట్లకు పరిమితం కావడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆల్టో రికార్డును డిజైర్ బద్దలు కొట్టింది. ఆల్టో మోడల్ 21,521 యూనిట్లు విక్రయమవ్వగా, డిజైర్ ఏకంగా 26,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ మోడల్ గ్రాండ్ ఐ 10 అమ్మకాలు 14,417 యూనిట్లుగా నమోదయ్యాయి. 2016 అక్టోబర్‌లో ఇది 14,530 యూనిట్లు విక్రయించింది. అలాగే అక్టోబరులో నమోదైన అమ్మకాల్లో టాప్ 10 కార్లలో మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ)కు చెందినవి ఏడు మోడల్స్ ఉన్నాయి. మిగిలిన మూడు హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాలు. ఇక బాలెనో 14,532 యూనిట్లతో మూడో స్థానంలో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 14,417 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలవగా, వ్యాగన్ ఆర్ 13,043 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెలెరియో(12,203), సిఫ్ట్(12,057), వితారా బ్రెజా(11,684), హ్యుందాయ్ ఇలైట్ ఐ20(11,012), ఎస్యూవీ క్రెటా(9,248)లు ఉన్నాయి. -
6 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్టానికి చేరుకొంది. 2017 అక్టోబరునెలకు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 3.59 శాతంగా నమోదైంది. గత నెలలో ఇది 2.60 శాతంగా ఉంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ద్రవ్యోల్బణం అక్టోబరులో 3.59 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ సంవత్సరంతో సెప్టెంబర్ నెలలో 2.60 శాతం నుంచి 3.59 శాతానికి పెరిగింది. -
తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్
కోల్కత్తా: ప్రయివేటు విమానయాన సంస్థ గో ఎయిర్ విదేశాలు వెళ్లాలనుకునే విమాన ప్రయణికులకు ఊరటనందిస్తోంది. త్వరలోనే తక్కువ ఖర్చుతో నడిచే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని ప్రకటించింది. తమ విదేశీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభిస్తామని గో ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ హెహ్ వాడియా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి తమ విదేశీ గో ఎయిర్ విమానాలను ప్రారింభిచనున్నామని ఆయన అన్నారు. ప్రారంభంలో ఆసియా రీజన్ తమ సేవలను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 24-బలమైన విమానాలకు తోడు నియో ఎ320 143 ఎయిర్ బస్‌లకు ఆర్డర్చేసినట్టు పేర్కొన్నారు. వీటిలో అయిదింటిని ఇప్పటికే తమకు అందాయని, ఇంజీన్ లోపాల కారణంగా డెలివరీ ఆలస్యమవుతున్నట్టు వాడియా వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వాటాల కొనుగోలుపై మరో వైమానిక సంస్థ ఇండిగోకు పోటీగా రానుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీలేదని స్పష్టం చేశారు. అలాగే సంస్థ ఐపీఓకు వచ్చే అంచనాలను కూడా ఆయన కొట్టి పారేశారు. -
అక్టోబర్‌లో ఏడడుగులు?
-
అక్టోబర్‌లో ఏడడుగులు?
పెళ్లెప్పుడు? అనడిగితే... ఇటు నాగచైతన్య, అటు సమంత ఏం సమాధానం చెప్పడం లేదు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థమైన తర్వాత ఎవరి సినిమాలతో వారు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇద్దరూ చెరో రెండు సినిమాలు చేస్తున్నారు. పెళ్లి ఊసు వచ్చేసరికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం ప్రకారం... ఈ అక్టోబర్‌లో చై–సామ్‌లు ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అంతకు ముందు అక్కినేని ఫ్యామిలీ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మొగ్గు చూపుతుందని వార్తలొచ్చాయి. వాటిల్లో నిజం లేదట. హైదరాబాద్‌లోనే పెళ్లి జరగనుందని టాక్. ప్రస్తుతం చైతన్య, సమంత చేస్తున్న సినిమాల షూటింగులు అక్టోబర్‌కి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లికి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారు. -
అక్టోబర్‌కల్లా యాదాద్రి ఆలయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. అసెంబ్లీలో గురువారం ఈ అంశంపై సభ్యులు గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఏడు గోపురాల నిర్మాణం, లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్, వ్రత మండపం, మాడవీధి, బ్రహ్మోత్సవ ప్రాంతం, ముఖ మండపం, ప్రాకారాల పనులు పురోగతిలో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. వైటీడీఏ పరిధిలోకి యాదగిర్పల్లి, సైదాపూర్, రాయ్‌గిరి, మళ్లాపూర్, దాతర్పల్లి, గుండ్లపల్లి, బశ్వపుర గ్రామాలను తెస్తున్నట్లు తెలిపారు. యాదాద్రిలో రోప్‌వే ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్లు వివరించారు. ‘అన్నపూర్ణ’గా రూ. 5 భోజన కేంద్రాలు రూ. 5 భోజన కేంద్రాలకు ‘అన్నపూర్ణ’గా పేరు ఖరారు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 109 భోజన కేంద్రాలు నడుస్తున్నాయని, వాటిని 150కి విస్తరిస్తామన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఐదారు భోజన కేంద్రాలు పెడతామని హామీ ఇచ్చారు. -
టారో : 6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) కొత్త అవకాశాలు కలిసొస్తాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. విందు వినోదాల్లో గడుపుతారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. అద్భుతమైన ఆర్థిక విజయాలను అవలీలగా సొంతం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో విఫలమవుతారు. సన్నిహితుల తీరు పట్ల నిరాశ చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇంటా బయటా తీరిక లేనంతగా పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి వృథా శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చికిత్స కోసం వైద్యులను సంప్రదించాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహారాలు నిరాశ కలిగించే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి మరింత సమయం కేటాయించి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 - జూన్ 20) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. మిమ్మల్ని విజయపథంలో ముందుకు నడిపే భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. గొప్ప అవకాశాలు దొరుకుతాయి. తీరిక దొరకడమే గగనంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. లక్కీ కలర్: లేత నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అవరోధాలను అధిగమిస్తూ విజయపథంలో దూసుకుపోతారు. మీ దూకుడును ఏ శక్తీ కట్టడి చేయలేదు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. సంకల్పబలమే కాక, సానుకూలమైన గ్రహబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. లక్కీ కలర్: ముదురు నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ప్రేమానుబంధాలకు సంబంధించి తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అనుకోని అవరోధాలు ఎదురైనా, నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనికి అమిత ప్రాధాన్యమిస్తారు. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ చూపాల్సి వస్తుంది. కలలను సాకారం చేసుకునేందుకు అహరహం ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దుకుంటారు. అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు. చిరకాలంగా కొనసాగిస్తున్న పనులను అనుకున్న రీతిలో ముగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటి వరకు ఎదురవుతూ వచ్చిన చికాకులన్నీ తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో రాజీమార్గాన్ని అవలంబించి బంధాన్ని నిలబెట్టుకుంటారు. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: నేరేడు రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కాలమంతా హడావుడిగా గడిచిపోతుంది. పని ఒత్తిడి ఊపిరి సలపనివ్వదు. అనూహ్యమైన సమాచారం మిమ్మల్ని కలవరపెడుతుంది. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని గ్రహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కళా సాధన ద్వారా లేదా మనసుకు నచ్చిన పనిలో నిమగ్నం కావడం ద్వారా సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కొత్త పనులకు నాంది పలుకుతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లతో కూడిన బాధ్యతలను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు. పని పట్ల నిబద్ధతను చాటుకుంటారు. మందకొడిగా ఉన్న వ్యాపారాలను విజయవంతంగా లాభాల బాట పట్టిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నాయి. భావసారూప్యత గల వ్యక్తుల నుంచి కీలకమైన సాయం అందుతుంది. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) జీవితంలో అలముకున్న చీకట్లు తొలగిపోతాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంతవరకు వెన్నాడిన కష్టాలకు గల కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. మానసిక సై్థర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ప్రేమానుబంధాల బలోపేతానికి సమయం వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. తీర్థయాత్రలు చేస్తారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటారు. బంధాలను బలోపేతం చేసుకోవడానికి చిత్తశుద్ధితో మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పాత పద్ధతులను విడనాడి అన్ని అంశాల్లోనూ మార్పులకు నాంది పలుకుతారు. చిరకాలం నాటి ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆత్మీయుల నుంచి కానుకలను అందుకుంటారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు. తీరికగా, కాసింత బద్ధకంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చిన పనులతో సేదదీరుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను మరింత ఏకాగ్రతతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తేలికగా సమసిపోతాయి. లక్కీ కలర్: తెలుపు -
టాప్ గేర్ లో హ్యుందాయ్...
చెన్నై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ అక్టోబర్‌లో టాప్ రేంజ్ లో దూసుకుపోయింది. ఒకవైపు ప్రధాన ప్రత్యర్థి మారుతి అమ్మకాల్లో క్షీణతను నమోదుచేయగా హ్యుందాయ్ గరిష్ట అమ్మకాలను నమోదు చేసింది. 64,372 యూనిట్లు విక్రయంతో రికార్డ్ స్థాయి అమ్మకాలను నమోదు చేసినట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా 50,016 వాహనాలు అమ్మగా, 14,356 వాహనాలను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 61,701 యూనిట్ల (దేశీయ 47,105 యూనిట్లు, ఎగుమతులు 14,686 యూనిట్లు) విక్రయించింది. 15 నెలల్లో దేశీయంగా అత్యధిక , వేగవంతమైన అమ్మకాలు సాధించినట్టు హ్యుందాయ్ ఎండీ, సీఈవో వైకే కూ ప్రకటించారు. 50,000 యూనిట్ల గరిష్ట అమ్మకాలతో, గత 40 వేల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. మరోవైపు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడల్ గా ఉన్న మారుతి సుజుకి అక్టోబర్ అమ్మకాలు క్షీణించాయి. గడచిన అక్టోబరులో ఆల్టో అమ్మకాలు 9.8 శాతం తగ్గాయి. గత సంవత్సరం పండగ సీజనులో 37,595 ఆల్టో యూనిట్లు విక్రయం కాగా, ఈ సంవత్సరం 33,929 యూనిట్లు అమ్ముడయ్యాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
విక్రయాల్లో పడిపోయిన మారుతి
పండుగ సీజన్లో కార్ల విక్రయాలు జోరు కొనసాగుతుండగా.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మాత్రం ఈ అక్టోబర్ నెల విక్రయాల్లో స్వల్పంగా పడిపోయింది. గతేడాది 1,34,209 యూనిట్లగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది 1,33,793 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా విక్రయాలు మందగించినప్పటికీ, దేశీయ అమ్మకాల్లో మారుతి మెరుగైన పెరుగుదలనే నమోదుచేసింది. దేశీయంగా 2.2 శాతం అమ్మకాలు పెంచుకుని 1,23,764 యూనిట్లగా నమోదుచేసినట్టు ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 అక్టోబర్‌లో ఈ విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఉత్పత్తులకు డిమాండ్‌గా బలంగానే ఉందని కంపెనీ పేర్కొంది. సియాజ్, ఎస్ క్రాస్, ఎర్టిగా, బ్రిజా, బాలెనో రిటైల్ విక్రయాలు అత్యధికంగా నమోదైనట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కాల్సి తెలిపారు. నెలవారీ కంపెనీ విక్రయాలు, పనిదినాలు, స్టాక్ ప్లాన్ వంటి స్వల్పకాలిక కారకాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఫెస్టివ్ సీజన్లో డిమాండ్‌పై ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. ఆల్టో, వాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్లు విక్రయాలు 9.8 శాతం క్షీణించి, 37,595యూనిట్లగా నమోదైనట్టు ఎంఎస్ఐ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలు సిప్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో విక్రయాలు 1.8 శాతం పడిపోయినట్టు మారుతి వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ విక్రయాలు పడిపోయి, 27.4 శాతం కిందకి దిగజారాయి. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు 2,481 యూనిట్లగా నమోదయ్యాయి. కాగ, మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 8 శాతం ఎగిసి, 6,360 యూనిట్లగా రికార్డయ్యాయి. -
టారో : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఆనందభరితంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. యోగ్యతకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఒంటరిగా ఉన్నవారికి తగిన జోడీ లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో అనిశ్చితిని విడనాడితే పురోగతి సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్నా, ఆశించిన ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు తమ స్థితిగతులపై పునరాలోచనలో పడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మార్పు అనివార్యమయ్యే సూచనలు ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతిభా పాటవాలతో రాణిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పుంజుకుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇప్పటికే మీలో పాతుకుపోయిన అపోహలను వదులుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులపై మీ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ముందు గొయ్యి వెనుక నుయ్యి వంటి పరిస్థితులను తెలివిగా తప్పించుకుంటారు. సృజనాత్మక ఆలోచనలతో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. విహార యాత్రలతో ఉల్లాసంగా గడుపుతారు. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) కొత్త పనులకు సంబంధించిన ప్రణాళికలను కార్యాచరణలో పెడతారు. ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చిన శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. విజయపథంలో ముందుకు సాగుతారు. పరిస్థితుల్లో సానుకూల మార్పులను చవిచూస్తారు. మీ అభివృద్ధి పట్ల ఇతరులు అసూయ చెందుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) పోరాట పటిమను ప్రదర్శిస్తారు. అదే సమయంలో ప్రశాంతతను కోల్పోకుండా ఉంటారు. పరస్పర విరుద్ధమైన అంశాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆస్తులు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతారు. లక్కీ కలర్: ముదురు బూడిద రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) కొత్త ఆశలు చిగురిస్తాయి. పరిపూర్ణత కోసం తపిస్తారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చేపట్టిన పనుల్లో పరిపూర్ణత సాధిస్తారు. వ్యాపారంలో కొత్తగా ఒక భాగస్వామిని చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. విజయాలు సాధించినా వినయంగా ఉండే మీ సహజ లక్షణమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇంట్లో జరిగే కుటుంబ వేడుకలు సంతోషాన్నిస్తాయి. లక్కీ కలర్: ఇటుక రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) అదృష్టం అన్ని విధాలా కలిసొస్తుంది. పూర్వీకుల ఆస్తి దక్కే సూచనలు ఉన్నాయి. సుస్థిరమైన ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. అమోఘమైన తెలివితేటలతో, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ప్రణాళికలు రచిస్తారు. లక్కీ కలర్: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) విందు వినోదాల్లో మునిగి తేలుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళతారు. మీ సమక్షాన్ని కోరుకునే బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త మిత్రులు తారసపడతారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఇదివరకటి పెట్టుబడుల ద్వారా అనూహ్యమైన ఆర్థిక లాభాలను అందుకుంటారు. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) తాత్విక చింతనలో పడతారు. జ్ఞానతృష్ణను తీర్చుకునేందుకు నిర్విరామంగా అధ్యయనం కొనసాగిస్తారు. ఆర్థిక పురోగతిలో వేగం పుంజుకుంటుంది. ధనార్జన కోసం విదేశ యాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. మరింతగా ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా కొత్త ఆలోచనలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. లక్కీ కలర్: లేత గోధుమరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితంలోని అన్ని అంశాల్లోనూ సరైన మార్గంలో ప్రయాణిస్తారు. నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు. వాగ్దానాలను నిలుపుకొంటారు. పరపతి గల ఒక మహిళ మీకు ఆసరాగా నిలుస్తారు. నిబద్ధతను నిరూపించుకోవడం ద్వారా ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. పని ఒత్తిడి మితిమీరి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. లక్కీ కలర్: నారింజ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) త్వరలోనే సంపద కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. ధైర్య సాహసాలతో పరిస్థితులకు ఎదురు నిలుస్తారు. జీవితాన్ని ధీమాగా గడుపుతారు. పనితీరుతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇతరుల అసూయ కారణంగా ఇబ్బందులు ఎదురైనా వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. కొత్తగా తారసపడిన వ్యక్తితో అనూహ్యంగా ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) బహుముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. అయితే, ధారాళంగా ఖర్చు చేయాలనే ఉబలాటాన్ని కాస్త అదుపు చేసుకుంటేనే మంచిది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సత్ఫలితాలను పొందడానికి కాస్త ఓర్పు చూపాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురాకుపచ్చ -
టారో : 23 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) అడుగడుగునా గందరగోళాలు, అపార్థాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. వాక్చాతుర్యంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభిస్తారు. విజయపథంలోకి అడుగుపెడతారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాల కారణంగా మనస్తాపానికి లోనవుతారు. లక్కీ కలర్: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరతను సాధిస్తారు. ప్రతిభా పాటవాలతో మరిన్ని అధికారాలను, ఉన్నత పదవులను దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. చిరకాలంగా కొనసాగుతున్న ఆస్తి తగాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆత్మవిమర్శలో పడతారు. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా మార్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంట్లోను, కార్యాలయంలోను కొత్త అలంకరణలు, హంగులు ఏర్పాటు చేసుకుంటారు. ఊహాలోకంలో తేలియాడతారు. మార్మిక జగత్తును అర్థం చేసుకోవడానికి ఉన్నత దృక్పథం అవసరమని గ్రహిస్తారు. అదృష్టం వెన్నంటి ఉండటంతో సమస్యలను సునాయాసంగా అధిగమిస్తారు. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు. లక్కీ కలర్: ఎరుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ వెన్నంటి ఉంటే దైవశక్తి ప్రభావంతో కుటుంబ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాలను అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆహ్లాదభరితంగా సాగుతాయి. ఒక వినూత్న అనుభవం మీలో పరివర్తనకు దారితీస్తుంది. కీలకమైన బాధ్యతలతో పని ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఆర్థిక లావాదేవీలు, అధికారిక వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో గందరగోళానికి లోనవుతారు. ‘ఆలస్యం అమృతం విషం’. అందువల్ల తటపటాయింపులు, తర్జనభర్జనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. విధి నిర్వహణ పట్ల స్పష్టతతో ఉంటారు. ఇతరుల సలహాల పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం. లక్కీ కలర్: పసుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లోని పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. అనూహ్యంగా ప్రత్యర్థి సంస్థ నుంచి లభించే ఉద్యోగావకాశం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాల్సి వస్తుంది. లక్కీ కలర్: ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) పరిస్థితులపై పోరాటం చేయాల్సి వస్తుంది. ఆగ్రహంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తారు. కాలం పెట్టే పరీక్షలను అత్యంత సహనంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మిత్రులతో వాగ్వాదాలు మనస్తాపం కలిగిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం లేదా క్రీడలపై దృష్టి పెడతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆలోచన లేని చర్యలతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. తలపెట్టిన కొత్తపనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలనుకుంటారు. జాప్యం ఎదురవడంతో సహనం కోల్పోతారు. ఒక ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. సన్నిహితులతో కలసి వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్తదనం కోసం పాకులాడుతారు. సుదూర విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: నేరేడు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఏ దిశలో పయనించాలనే దానిపై మీకు తిరుగులేని స్పష్టత ఉంటుంది. వ్యాపారంలో సవాలుగా నిలిచే అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చొరవతో పూనుకొని ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. భావోద్వేగాలను అదుపు చేసుకుని, సంయమనంతో గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. లక్కీ కలర్: తుప్పు రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆచితూచి అడుగు ముందుకేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. నిరంతర అప్రమత్తతే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇదివరకటి కంటే జీవితంలో వేగం కాస్త తగ్గుతుంది. పనిభారం తగ్గి కాస్త తీరిక దొరుకుతుంది. అధ్యయన కాంక్షతో పుస్తక పఠనం కొనసాగిస్తారు. ఇంటిని అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: వెండి రంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి. కొత్త ఆలోచనలను ఆచరణలోకి తెస్తారు. మీ కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో సందడి సందడిగా గడుపుతారు. ఒక శుభవార్త అమితానందం కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం బలపడుతుంది. ఇతరులు ఇచ్చే సలహాల పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మీ చుట్టూ జనాలు చేరుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభను చాటుకుంటారు. ఇదివరకటి పనులకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి అద్భుతమైన సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతారు. లక్కీ కలర్: ముదురు పసుపు -
టారో : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇదివరకటి ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాగిస్తున్న వారు ఆర్థిక వైఫల్యాల నుంచి తేరుకుని లాభాలబాట పడతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. నాయకత్వం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) గొప్ప అవకాశాలు ఊరిస్తుంటే, వాటిని అందిపుచ్చుకోకుండా సందిగ్ధావస్థలో కాలయాపన చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిరకాల స్వప్నం ఒకటి నెరవేరే సూచనలు దగ్గర్లోనే ఉన్నాయి. లక్కీ కలర్: బూడిదరంగు మిథునం (మే 21 - జూన్ 20) ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. చిత్తశుద్ధితో, ఆత్మబలంతో పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మార్పుల ఫలితంగా కొత్త అవకాశాలు కలసి వస్తాయి. పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం ధ్యానంపై దృష్టి సారిస్తారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ పురోగతిలో ఒక దశ ముగిసి, మరో దశ ప్రారంభమవుతుంది. ఇదివరకటి ప్రయత్నా లకు, శ్రమకు తగిన ఫలితాలు క్రమంగా అందివస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో తిరుగులేని కార్యదక్షతను నిరూపించుకుని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో వేగం పుంజుకుంటాయి. నచ్చిన వ్యక్తి మీతో ప్రేమలో పడతారు. లక్కీ కలర్: వెండిరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటి నవీకరణ వంటి పనులు తలపెడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సత్తాను చాటుకునే అవకాశాలు అందివస్తాయి. పని ఒత్తిడి పెరిగి సహనం కోల్పోయే సందర్భాలు ఎదురవుతాయి. పనులు శరవేగంగా పూర్తి కావాలని కోరుకుంటారు. అయితే, నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని గుర్తెరిగి మసలుకుంటే మంచిది. పెట్టుబడులు కలసివస్తాయి. లక్కీ కలర్: నీలం కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఇంటా బయటా మార్పులు చోటు చేసుకుం టాయి. చేసిన పనులకు బాధ్యత వహిస్తారు. మనో స్థైర్యంతో సమస్యల నుంచి సునాయా సంగా బయటపడతారు. భావసారూప్యత గల వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలపెట్టిన కార్యక్రమాలపై స్పష్టతను ఏర్పరచుకుంటారు. భావి విజయాలకు పునాదులను పదిలం చేసుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందుతారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకుని ప్రేమను పండించుకుంటారు. వృత్తి జీవితంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పాత బకాయిలను చెల్లిస్తారు. చిరకాలంగా నానుతున్న కోర్టు వ్యవహారాలను సానుకూలంగా పరిష్కరించుకో గలుగుతారు. ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకు లకు లోనవుతారు. సహోద్యోగులతో స్పర్థలు. లక్కీ కలర్: నేరేడు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) సవాళ్లతో కూడుకున్న అవకాశాలను సర్వ సన్నద్ధతతో అందిపుచ్చుకుంటారు. పోరాట స్ఫూర్తితో విజయపథంలో దూసుకుపోతారు. అత్యుత్సాహాన్ని అదుపు చేసుకుని సంయమనం పాటిస్తే మరింతగా సత్ఫలితాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రతికూల శక్తుల నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు. వాగ్వాదాలు, ఘర్షణలు అనివార్యం కావచ్చు. లక్కీ కలర్: మట్టి రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) అడగనిదే అమ్మయినా పెట్టదనే వాస్తవాన్ని గ్రహించి మసలుకుంటారు. కోరుకున్న ఫలితాలను అడిగి మరీ సాధించుకుంటారు. ఒత్తిడి లేని జీవితం ఈ వారంలో దాదాపు దుస్సాధ్యంగానే ఉంటుంది. పని ఒత్తిడితో అలసట చెందుతారు. మనశ్శాంతి కోసం తీవ్రంగా ఆరాటపడతారు. ధ్యానం ద్వారా కొంత ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలు ఊరిస్తాయి. భవిష్యత్తుపై లేనిపోని ఆశలు పెంచుకుంటారు. ఆశలన్నీ భ్రమలుగా తేలిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అనివార్య మయ్యే సూచనలు ఉన్నాయి. సమస్యలు సతమతం చేస్తున్నా, హాస్యస్ఫూర్తిని కోల్పో కుండా ఉంటారు. పనికి కొద్దిపాటి విరామం ఇచ్చి విశ్రాంతి కోసం దూరప్రయాణాలకు వెళతారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) కొత్తగా ప్రేమలో పడతారు. ప్రేమ మాధుర్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తారు. ప్రేమలో ఉన్నవారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. సమ్మోహన శక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రులు మీ సమక్షాన్ని కోరుకుంటారు. కొత్త ప్రాజెక్టులు తలపెడతారు. ఉద్యోగ జీవితంలో కార్యసాధకులుగా మన్ననలు పొందుతారు. రచనా రంగంలో ఉన్న వారికి చివరి నిమిషంలో ఒత్తిడి తప్పకపోవచ్చు. లక్కీ కలర్: నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వ్యాపారరంగంలో ఘన విజయాలను సాధిస్తారు. ఈ వారం మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా సాగుతుంది. డబ్బు పుష్కలంగా అందుతుంది. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారు గొప్ప తపనతో కొత్త పనులు తలపెడతారు. ఒడిదుడుకుల్లో పడిన ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి. లక్కీ కలర్: ముదురు నారింజ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
బీరు ప్రియులకు పండగొచ్చింది
హైదరాబాద్‌లో బీరు ప్రియులకు పండగొచ్చింది. సిటీలోని పబ్స్, రెస్టారెంట్స్ ‘అక్టోబర్ ఫెస్ట్’ పేరిట బీర్ ఫెస్టివల్స్‌తో సందడి చేస్తున్నాయి. బీరుకు కాంబినేషన్‌గా నప్పే వంటకాలతో పాటు ప్రత్యేకమైన థీమ్ ఈవెంట్స్‌ని నిర్వహిస్తున్నాయి. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి జర్మనీలోని రాయల్ వెడ్డింగ్‌ను సాధారణ ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం దగ్గర్నుంచి ఆ ఈవెంట్ మరిన్ని ఆకర్షణలు అద్దుకుంటూ ప్రపంచమంతా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచపు అతిపెద్ద వోక్స్ఫెస్ట్గా జర్మనీలోని మ్యునిచ్, బవేరియా నగరంలో దీన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమై అక్టోబర్ తొలి వారం వరకు 16 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్ బవేరియన్ కల్చర్‌లో అత్యంత ప్రధాన భాగం. దాదాపు 60 లక్షల మంది ఈ ఈవెంట్‌కు హాజరవుతారని అంచనా. సిటీకి చీర్స్... నగరంలోనూ బీరు ప్రియుల సంఖ్య ఎక్కువేనని తెలిసిందే. పైగా ఇటీవలే నగరంలో మైక్రోబ్రూవరీస్ సైతం ప్రారంభమయ్యాయి. అక్కడికక్కడే బీరు తయారు చేసి ఇచ్చే ఈ తరహా బ్రూవరీలు ఉన్న పబ్స్, రెస్టారెంట్స్ ఈ అక్టోబర్ ఫెస్ట్‌కు మరింత సందడి చేయనున్నాయి. స్పెషల్ ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో సహా... దాదాపు ఈ నెలంతా ఈ ఫెస్ట్‌కు అనుబంధ కార్యక్రమాలు కొనసాగుతాయి. మ్యూజిక్‌తో అనుసంధానం చేస్తూ లైట్ డ్రింకింగ్‌ను ఆస్వాదించే నగర యువత ఈ టైమ్‌లో అందివచ్చే ఆఫర్ల కోసం ఏడాది మొత్తం వేచి చూస్తుందంటే అతిశయోక్తి కాదు. బీర్ ప్రియులకు రైట్ టైమ్ ఈ నెలలో విభిన్న రకాల బ్రాండెడ్ బీర్లు సర్వ్ చేస్తాం. అదే క్రమంలో ఈవెంట్స్ కూడా ఈ సందడికి హైప్ తెస్తాయి. మా అవుట్ స్వింగర్ పబ్‌లో ఈ నెల 14న ముంబై డీజే షెరిల్ ఆల్ నైట్ పార్టీ, 15న ప్రాజెక్ట్ తాండవ్ పేరుతో కోల్‌కతా డీజేలు టిష్యా, నవనీత్లు, 16న అవుట్స్ దట్ పేరుతో ఇండియా న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లైవ్‌లను ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రత్యేక మెనూతో అందిస్తున్నాం. – అఖిలేష్, అవుట్ స్వింగర్ పబ్ -
టారో: 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఉద్విగ్నంగా ఉంటారు. సాహస విన్యాసాల్లో పాల్గొంటారు. విజయసాధన కోసం కృతనిశ్చయంతో ముందుకు సాగుతారు. సంకల్పబలంతో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. భయాలను విడనాడి ధైర్యంగా అవరోధాలను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సానుకూల దృక్పథంతో అనుకోని చిక్కుల నుంచి సురక్షితంగా బయటపడతారు. లక్కీ కలర్: సాగరనీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అకుంఠిత కార్యదీక్షకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా పేరుప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులు మీ సలహాలు కోరుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో స్పర్థలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నాచురంగు మిథునం (మే 21 - జూన్ 20) ఆరోగ్యంపై, అందచందాలపై శ్రద్ధపెడతారు. అలంకరణలపై ఆసక్తి చూపుతారు. బాహ్యాలంకరణలపై ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నా, మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. ప్రేమజంటలు పెళ్లితో ఒక్కటయ్యే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. పనిలో గందరగోళానికి గురవుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు సందిగ్ధంలో పడతారు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) దొరికిన కొద్దిపాటి తీరిక వేళల్లో ఆత్మశోధనలో గడుపుతారు. చిన్నారుల స్వచ్ఛత నుంచి స్ఫూర్తి పొందుతారు. స్థల కాలాలను మరచి ఆలోచనల్లో నిమగ్నమైపోతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురైనా, ప్రతిభా పాటవాలతో నెట్టుకొస్తారు. చిరకాల ప్రేమానుబంధం పెళ్లికి దారితీసే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన జంట తారసపడే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఇక ఎలాంటి మార్పునైనా స్వీకరించలేని స్థితిలో ఉంటారు. అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. పారలౌకిక చింతనను పెంచుకుంటారు. సిద్ధపురుషుల ఆశీస్సులను అందుకుంటారు. డబ్బు లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సన్నిహితులకు అండగా ఉంటారు. లక్కీ కలర్: ఊదా కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఊపిరి సలపనివ్వనంతగా పని ఒత్తిడిలో కూరుకుపోతారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదన ఒకటి మీలో ఆశలు రేపుతుంది. అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మొండి వైఖరి వల్ల చిక్కులు కొనితెచ్చుకుంటారు. ప్రతికూలతల నుంచి బయటపడటానికి గట్టి పోరాటమే చేస్తారు. లక్కీ కలర్: తుప్పు రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) లక్ష్యాల పట్ల స్పష్టతను ఏర్పరచుకుంటారు. ధన కనక వస్తు వాహనాది లౌకిక లాభాలపై లోభాన్ని వదులుకుంటారు. కోపాన్ని, అహంకారాన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోగలుగుతారు. ఉన్నత స్థానాలను అధిరోహించే లక్ష్యంతో బాధ్యతలను ఇతరులతో పంచుకుంటారు. గొప్ప ప్రతిభాసంపద గల వ్యక్తి ఒకరు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. లక్కీ కలర్: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఇంతవరకు వేధిస్తూ వచ్చిన తెలియని భయాలన్నీ పటాపంచలైపోతాయి. జీవితంలో కోరుకున్న మార్పు అనాయాసంగా సంభవిస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. జ్ఞాన ధైర్యాలతో కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు ఎదురైనా, తేలికగా అధిగమిస్తారు. మీ సానుకూల దృక్పథమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు. లక్కీ కలర్: వెండిరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సాదాసీదాగా సాగుతున్న జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. అనూహ్యమైన ఆకస్మిక లాభాలతో జీవన శైలిలో గణనీయమైన మార్పు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రేమికులతో ఉల్లాసభరితంగా గడుపుతారు. లక్కీ కలర్: నేరేడు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) కష్టాల కడలిని విజయవంతంగా అధిగమించి, ఆనంద సాగరానికి చేరుకుంటారు. కష్టసాధ్యమైన విజయాలను అవలీలగా సాధించడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు పొందుతారు. ప్రేమానుబంధాల్లో పొరపొచ్చాలను సామరస్యంగా చక్కదిద్దుకుంటారు. లక్కీ కలర్: బంగారురంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విలాసవంతంగా గడుపుతారు. సన్నిహితులకు ఖరీదైన కానుకలను బహూకరిస్తారు. నిర్విరామమైన పని ఒత్తిడికి దూరంగా కొంత విరామం తీసుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. కొత్త జీవితానికి నాంది పలుకుతారు. లౌకిక వ్యవహారాలపై దృక్పథాన్ని మార్చుకుంటారు. ఆహార విహారాల్లో చాపల్యాలను నియంత్రించుకోలేకపోతే ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: మీగడ రంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీ ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు తగిన అవకాశాలు అందివస్తాయి. సత్తా చాటుకోవడానికి వెనుకంజ వేయకుండా విజయాల బాటలో ముందుకు సాగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఎవరికీ తెలియని విషయాలను కనుగొనేందుకు పరిశోధనలు సాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆనంద డోలికల్లో మునిగి తేలుతారు. ప్రాధాన్యాలను ఎరిగి అద్భుత విజయాలను సాధిస్తారు. లక్కీ కలర్: లేతనీలం - ఇన్సియా, టారో అనలిస్ట్ -
ఈ నెల.. చాలా ప్రత్యేకం
ఈ ఏడాది అక్టోబర్ మాసానికి చాలా ప్రత్యేకత ఉందండోయ్... అదేమంటారా? అయితే మీరే చూడండి.... ఈ అక్టోబర్‌లో ఐదేసి చొప్పున శని, ఆది, సోమవారాలు వస్తాయి. అంతేకాదండోయ్! ఈ నెలలో వచ్చే పౌర్ణమి (16), అమావాస్య(30) రెండూ ఆదివారమే కావడం విశేషం. ఇక ఈ మాసమంటరా... పిల్లలకు బోల్డన్ని సెలవులను మోసుకొస్తోంది. పండుగలతో ఉత్సాహాన్ని నింపబోతోంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే... ఇలాంటి నెల 803 సంవత్సరాల కిందట అంటే 1153లో మాత్రమే వచ్చినట్లు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కొడేకండ్ల నాగభూషణరావు అంటున్నారు. ఔను కదా! అక్టోబర్–16 అంటే నిజంగా సమ్‌థింగ్ స్పెషలే మరీ... -
చరిత్రలో అరుదైన ‘అక్టోబరు’
ఈ నెలలోనే ఐదేసి ఆది, సోమ, శనివారాలు ఒకే నెలలో ఆదివారం రోజునే అమావాస్య, పౌర్ణమి కూడా రాయవరం : కాలం తనతో పాటు ఎన్నో వింతలు, విశేషాలను కూడా తీసుకు వస్తుంది. కాలం చేసే వింతలు, విశేషాలు చరిత్రలో గుర్తులుగా మిగిలి పోతుంటాయి. అలాగే 2016 అక్టోబరు నెల తనతో పాటు కొన్ని విశేషాలను తనతోపాటు తీసుకుని వస్తుంది. సాధారణంగా ఒక నెలలో నాలుగేసి వారాలు రావడం సహజం. కాని వచ్చే అక్టోబరు నెలలో ఆది, సోమ, శనివారాలు ఐదేసి రావడం విశేషం. 2, 9, 16, 23, 30 తేదీలు ఆదివారాలుగా వస్తే, 3, 10, 17, 24, 31 తేదీలు సోమవారాలుగా, 1, 8, 15, 22, 29 తేదీలు శనివారాలుగా వచ్చాయి. కాగా ఒకే క్యాలండర్ నెలలో పౌర్ణమి, అమావాస్య రావడం అరుదుగా జరుగుతుంది. ఈ నెలలో 16న ఆదివారం పౌర్ణమి వస్తే, 30న ఆదివారం అమావాస్య రావడం మరొక విశేషంగా చెప్పవచ్చు. అదే నెలలోనే 11న దసరా, 12న మొహర్రం, 30న దీపావళి పర్వదినాలు వచ్చాయి. ఇటువంటి నెల 863 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
అక్టోబర్ నుంచి ప్రయోగాలు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడులు లెక్కించడానికి ప్రణాళిక, వ్యవసాయశాఖ అధికారులు పంట కోత ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ మొదటి వారం నుంచి ఎంపిక చేసిన గ్రామాలు, పొలాల్లో దిగుబడులు అంచనా వేయనున్నారు. వేరుశనగలో 756, కందిలో అత్యధికంగా 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించనున్నారు. అయితే వేరుశనగ పంటకు ఈ సారి కూడా వాతావరణ బీమా పథకం అమలు చేస్తుండటంతో దిగుబడులు దారుణంగా వచ్చినా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు వేరుశనగ పంటపై రూ.75 కోట్ల వరకు ప్రీమియం చెల్లించారు. పంట కోత దిగుబడుల లెక్కలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ ఏడాది వేరుశనగ రైతులకు భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆగస్టు పూర్తిగానూ, ప్రస్తుత సెప్టెంబర్‌లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన వేరుశనగ పంటకు 80 నుంచి 90 శాతం మేర నష్టం జరిగినట్లేనని చెబుతున్నారు. పంట దెబ్బతిన్నా సాధారణం కన్నా జూన్‌లో 47 శాతం, జూలైలో 52 శాతం అధికంగా వర్షాలు పడటంతో వర్షపాత లోటు పెద్దగా కనిపించడం లేదు. ఈ లెక్కలు వాతావరణ బీమా పథకం నిబంధనలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణ బీమా పథకం వల్ల మరోసారి అన్యాయం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడుల లెక్కల ఆధారంగా బీమా పథకం అమలు చేస్తే ఈ ఏడాది భారీ ఎత్తున పరిహారం వచ్చే అవకాశం ఉంది. ఇక గ్రామం యూనిట్‌గా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా అమలు చేస్తున్న కంది పంటలో 1,514 పంట కోత ప్రయోగాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. కంది, ఇతర పంటలకు సంబంధించి 600 నుంచి 700 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు వరిలో 51, పొద్దుతిరుగుడులో 36, జొన్న పంటలో 36 ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా జిల్లాలో 8 పంటలకు అమలు చేస్తున్నా 10 శాతం కన్నా తక్కువ మంది రైతులకు కూడా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. -
‘ఓపెన్ ’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అక్టోబర్ 1నుంచి 14 వరకు నిర్వహణ సమీక్షలో ఏజేసీ శివశ్రీనివాస్ ఖమ్మం జెడ్పీసెంటర్: అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, విద్యుత్,పోలీస్ ,పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 వతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌కు 1848 మంది విద్యార్థులు, 10వ∙తరగతికి 2037 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరంలో రిక్కాబజార్, నయాబజార్, మామిళ్లగూడెం, ఎన్ఎస్ కెనాల్, రాజేంద్రనగర్, శాంతి నగర్లలో బాలికోన్నతపాఠశాల, జ్యోతి బాలమందిర్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రాజేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త మురళీకృష్ణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శివకుమార్, డివిజనల్ మేనేజర్ రామమూర్తి, సబ్ఇన్స్పెక్టర్ ఓంకార్, పోస్టల్ సూపరింటెండెంట్ రంగారావు, విద్యుత్ శాఖడీఈ డీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ఓపెన్ ’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అక్టోబర్ 1నుంచి 14 వరకు నిర్వహణ సమీక్షలో ఏజేసీ శివశ్రీనివాస్ ఖమ్మం జెడ్పీసెంటర్: అక్టోబర్ 1 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శివశ్రీనివాస్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై విద్య, వైద్య, విద్యుత్,పోలీస్ ,పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 వతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌కు 1848 మంది విద్యార్థులు, 10వ∙తరగతికి 2037 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఖమ్మం నగరంలో రిక్కాబజార్, నయాబజార్, మామిళ్లగూడెం, ఎన్ఎస్ కెనాల్, రాజేంద్రనగర్, శాంతి నగర్లలో బాలికోన్నతపాఠశాల, జ్యోతి బాలమందిర్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రాజేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసరావు, ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త మురళీకృష్ణ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శివకుమార్, డివిజనల్ మేనేజర్ రామమూర్తి, సబ్ఇన్స్పెక్టర్ ఓంకార్, పోస్టల్ సూపరింటెండెంట్ రంగారావు, విద్యుత్ శాఖడీఈ డీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో వచ్చే నెలలో బార్ల వేలం
హైదరాబాద్: ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అక్టోబరులో నూతన బార్లకు నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ విధానంలోనే అప్పగించేందుకు ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. జనాభా ప్రాతిపదికన మూడు శ్లాబుల్లో నూతన బార్లకు లైసెన్సు ఫీజు చెల్లించాలని అబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది జూలై నుంచి నెల నెలా బార్ల లెసైన్సుల రెన్యువల్తోనే ఎక్సైజ్ శాఖ నెట్టుకొస్తుంది. రాష్ట్రంలో 771 బార్లకు కొత్త పాలసీ ప్రకటించేందుకు గతేడాది జూలైలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పాలసీలో పలు లోపాలు వెలుగు చూడటంతో పాటు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండటంతో కొందరు మద్యం వ్యాపారులు కోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన టీడీపీ ముఖ్యనేత తనయుడు రెండు నియోజకవర్గాల్లో కొత్త బార్లకు దరఖాస్తు చేసుకునేవారంతా తనకు ముడుపులు చెల్లించాలని ఒత్తిళ్లు చేయడం, మాట వినని మద్యం వ్యాపారులపై మున్సిపాలిటీ అధికారులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టటంతో వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రభుత్వ పాలసీని తప్పు పట్టింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో పాలసీ రూపొందించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎక్సైజ్ శాఖ సవరణ జీవోలు జారీ చేసింది. తాజాగా బార్ల పాలసీకి బూజు దులిపి కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలందడంతో లాటరీ విధానమైతేనే మేలని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. -
అక్టోబర్ నాటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వచ్చే అక్టోబర్ నెలాఖరులోగా రెండు లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇచ్చి నూరుశాతం పూర్తి చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం దీపం పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి 11 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 9 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు అందించామని, రెండు లక్షలు అక్టోబరు నెలాఖరులోగా అందిస్తామన్నారు. సమావేశంలో డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
డీఏ పెంపు అమల్లోకి..
అక్టోబర్ ఒకటిన ఇచ్చే జీతంతో చెల్లింపులు ►జనవరి నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ ►3.144 శాతం పెరిగి 18.340 శాతానికి చేరిన డీఏ ►4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. దీంతో దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనుండగా.. ఖజానాపై ఏటా రూ.300 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. ప్రస్తుతం పెంచిన 3.144 శాతం కలిపి మొత్తంగా డీఏ 18.340 శాతానికి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం జీవో నం.103 జారీ చేశారు. సెప్టెంబర్ నెల వేతనం నుంచి అంటే అక్టోబర్ ఒకటిన చేతికందే జీతంతోపాటు పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు 90 శాతం బకాయిలను నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే.. వారి డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ ఖాతాలో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి అక్టోబర్ 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇక పెన్షనర్లకు కరువు భృతి పెంపు ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశముంది. -
అక్టోబర్‌లోపు వ్యవసాయ రుణాలు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): రైతులకు అక్టోబరు నెలాఖరులోగా వ్వవసాయ రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు బ్యాంకర్లకు సూచించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ రుణ లక్ష్యాల ప్రణాళికలు రూపొందించుకుంటేనే పక్కాగా మంజూరు చేయడం సాధ్యమవుతుందన్నారు. సీజన్ దాటిన తరువాత రుణాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అర్హత ఉన్న రైతుల జాబితాలను తయారు చేసుకుని రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రుణాలు మంజూరు సమయంలో లేని నిబంధనలను రుణమాఫీలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. పనిచేసిన మూడు రోజుల్లోగా ఉపాధి కూలీల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. డ్వాక్రా రుణాల బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, బ్యాంకుల వారీగా రికవరీల జాబితాలను అందజేయాలని కోరారు. డీఆర్డీఏ సమావేశంలో రికవరీలపై చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి చిన్న,మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలని కోరారు.ఈ సమావేశంలో ఎల్డీఎం వెంకటరావు, సిండికేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి, నాబార్డు ప్రతినిధి రమేష్‌కుమార్, ఆర్బీఐ ఏజీఎం సెల్వపాండియ, డీఆర్డీఏ, డ్వామా పీడీలు లావణ్యవేణి, హరిత, తదితరులు పాల్గొన్నారు. 16 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలోని రైతులకు మద్దతు ధర కల్పించేందుకు 16 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ, మార్కెటింగ్, ఎన్డీసీసీబీ, బీఎల్ఎంసీ, సివిల్సప్లై విజిలెన్స్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పీపీసీల ద్వారా రెండు రోజుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. ధాన్యం దిగుబడుల వివరాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ జేడీ నుంచి తీసుకుని మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఎంకేఎస్వైను పటిష్టంగా అమలు చేయాలి ప్రధాన మంత్రి కృషి సించాయన యోజన (పీఎంకేఎస్‌వై) పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్గదర్శాలకు అనుగుణంగా ప«థకాన్ని అమలు చేయాలన్నారు. డీఆర్డీఏ, ఆత్మ, వ్యవసాయం, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయా శాఖల పరిధిలో నిర్వహించే పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను కమిటీల అనుమతితో పూర్తి చేయాలన్నారు. కన్సల్టెంట్ ఇంజనీర్ పీకే ప్రశ్న పీఎంకేఎస్‌వై ప«థకంలో పొందుపరిచిన నీటి సంరక్షణ, పొదుపు, సాగునీరు, మంచినీరు నిర్వహణ, తదితర వాటì ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆత్మ పీడీ దొరసానమ్మ, వ్యవసాయ శాఖ జేడీఏ హేమమహేశ్వరరావు, డ్వామా పీడీ హరిత, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు బాలకార్మికులతో పనులు చేయించే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలు జరిపి బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలకు నిర్దేశించిన కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్‌లో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు!
రెండు రోజుల్లో తేదీలను ప్రకటించనున్న పీఆర్బీ సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ప్రిలిమినరీ, దేహ దారుఢ్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో... ఉన్నతాధికారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అక్టోబర్ చివరి వారంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై), కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్షలు నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ) నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల్లోనే తేదీలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తొలుత కానిస్టేబుల్ పరీక్షను, తర్వాత ఎస్సై పోస్టుల పరీక్షలను నిర్వహించనుంది. అయితే, తుది పరీక్షల్లో ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు దాదాపు 9 మంది పోటీపడనున్నారు. వివిధ విభాగాల్లో కలిపి మొత్తంగా 9,613 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. దేహ దారుఢ్య పరీక్షల అనంతరం తుది రాతపరీక్షకు 81 వేల మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. కాగా, వివిధ విభాగాల్లోని 539 ఎస్సై పోస్టులను భర్తీ చేయనుండగా... దేహ దారుఢ్య పరీక్షల అనంతరం 32,457 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 60 మంది పోటీ పడుతున్నారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్‌లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్‌గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్‌స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్‌స్పాట్‌కు వంద మీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్‌లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్‌గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్‌స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్‌స్పాట్‌కు వంద మీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
అక్టోబర్ నుంచి ఫైబర్ నెట్ సేవలు
* 90 శాతం సాంకేతిక పనులు పూర్తి * విద్యుత్ సబ్ స్టేషన్ల నుంచే ఫైబర్ నెట్ సిగ్నల్ * రూ.149 కే కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో అతి తక్కువ ఖర్చుతో కేబుల్ టీవీ ప్రసారాలు, ఫోన్, ఇంటర్ నెట్ సౌకర్యం మరో నెలరోజుల్లోనే రానుంది. ప్రస్తుతం సగటు వినియోగదారుడు కేబుల్‌టీవీకి రూ.200, ఇంటర్నెట్ కమ్ ఫోన్‌కు రూ.800 కలిపి మొత్తం రూ.1000 ఖర్చు అవుతుండగా,ఈ సేవలన్నీ కలిపి కేవలం రూ.149కే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఫైబర్‌నెట్ వర్క్ సేవలు అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. అంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ విద్యుత్ డిస్కంలు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ పనులు ప్రారంభించారు. దీని కోసం విద్యుత్‌శాఖకు సంబంధించిన స్తంభాల మీదుగా ఆప్టికల్ ఫైబర్ వైరు ఏర్పాటు చేయడంతో పాటు సబ్స్టేషన్లలో సిగ్నల్ బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఒక మాస్టర్ నోడ్ (కంట్రోల్ రూం), నాలుగు జోనల్ నోడ్లు, 52 మండలనోడ్లు,155 సిగ్నల్ స్టేషన్ (ఎస్ఎస్) నోడ్లు మొత్తం 211 విద్యుత్ సబ్స్టేషన్లలో ఇప్పటికే సిగ్నల్ సర్వర్ నోడ్ ఏర్పాటు చేశారు. వీటిని కలుపుతూ నెట్వర్కింగ్ సిగ్నల్ కోసం 24 కోర్ సామర్ధ్యం ఉన్న ఆప్టికల్ ఫైబర్ వైరు 2073 కి.మీ ఏర్పాటు చేశారు. స్టేట్ రింగ్ నుంచి తీసుకున్న సిగ్నల్ గుంటూరు నగరంలో ఏర్పాటుచేసిన మాస్టర్ నోడ్కి, తెనాలి, బాపట్ల, పిడుగురాళ్ళ, నరసరావుపేట సబ్‌స్టేషన్‌లోని జోనల్ నోడ్కి వెళుతుంది. జోనల్ నోడ్ నుంచి వచ్చిన సిగ్నల్ మండల నోడ్ల ద్వారా ఎస్ఎస్ నోడ్లకు చేరుతుంది. ఇక్కడి నుంచే ఏపీఎస్ఎఫ్ఎల్ తో అగ్రిమెంట్ చేసుకున్న కేబుల్ ఆపరేటర్లు ద్వారా ఇళ్లకు కనెక్షన్లు అందిస్తారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో 100 కి.మీ మినహా 90 శాతం ఆప్టికల్ఫైబర్ పనులు పూర్తయ్యాయి. బేసిక్ ప్యాకేజీ నెలకు రూ.149.. ఫైబర్ నెట్ వర్క్ ద్వారా బేసిక్ ప్యాకేజీ కింద నెలకు రూ. 149కే కేబుల్‌టీవీ, ఫోన్, నెట్ సౌకర్యం రానుంది. టీవీలో 100 ఫ్రీ చానల్స్‌తో పాటు, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 5 జీబీ ఇంటర్నెట్ డేటా, రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ద్వారా ఫోన్ సౌకర్యం ఉన్న వారితో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇంట్లోకి వచ్చిన ఆప్టికల్ ఫైబర్ వైరుకు ఐపీటీవీ బాక్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా టీవీ, ఫోను, ఇంటర్నెట్ కోసం వైఫై సౌకర్యం పొందవచ్చు. పే చానల్స్ కోసం, ఎక్కువ డేటా, ఇతర ఫోన్లకు మాట్లాడుకోవడానికి త్వరలో ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ఫైబర్ నెట్ ద్వారా వచ్చే ఫోన్‌కు ప్రారంభంలో 797 నంబరును కేటాయించారు. ప్రభుత్వకార్యాలయాలకు, వాణిజ్య అవసరాల కోసం 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ వర్క్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 1350 ఎంఎస్‌వోలు (కేబుల్ ఆపరేటర్లు) సిగ్నల్ కోసం ఏపీఎస్ఎఫ్ఎల్కు దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో పది రోజుల్లో జిల్లా కార్యాలయం ప్రారంభం కానుంది. -
అక్టోబర్‌లో గాయత్రి మహాయాగం
జోగిపేట: జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేది నుంచి 5 రోజుల పాటు గాయత్రి మహాయాగాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్యోషి రఘురాం చారి తెలిపారు. అందోల్‌లోని రామాలయంలో సోమవారం బ్రాహ్మణ సంఘం జిల్లా, తాలుకా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధన కోసం ఈ మహాయాగం చేస్తున్నామన్నారు. ఈమేరకు జిల్లాకు చెందిన బ్రాహ్మణ సంఘాల నాయకులతో తీర్మానం చేశామని చెప్పారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం జిల్లా, నాయకులు చంద్రశేఖర్, కృష్ణారావు, దత్తాత్రేయ శర్మ, హనుమంతాచార్య, ప్రవీణ్‌శర్మ, భాస్కర్‌శర్మ, మృత్యుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు. గాయత్రి మహాయాగం, అక్టోబర్, బ్రాహ్మణ సంఘం -
‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అక్టోబరులో ప్రారంభిస్తోంది. కోర్సు కాల వ్యవధి 18 నెలలు. ఇందులో భాగంగా అభ్యర్థులకు నెల రోజులపాటు యూరప్‌లోనూ బోధన ఉంటుంది. మొత్తంగా 15 వారాలు మాత్రమే తరగతులకు హాజరైతే చాలు. విద్యనభ్యసించే వారికి, వారు పనిచేస్తున్న కంపెనీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ విధంగా కోర్సును డిజైన్ చేశారు. సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన, వ్యాపార అవకాశాలు, ఆచరణీయ వ్యూహరచన, వాస్తవ పరిష్కారాలపై బోధన ఉంటుందని ఆస్కి సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. -
వారఫలాలు: 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త వ్యక్తుల పరిచయం. గతంలో నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయట పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నీలం, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులకు ఉత్సాహవంతం. తెలుపు, కాఫీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ప్రముఖులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. ద్వేషించిన వ్యక్తులే ప్రశంసిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పసుపు, ముదురు ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంటు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని వ్యవహారాలు కొంత నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనుల్లో విజయం. ఇంటా బయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. గోధుమ, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
అక్టోబర్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నవ్‌జోత్ సింగ్ సిద్ధు (మాజీ క్రికెటర్) వీరేందర్ సెహ్వాగ్ (క్రికెటర్) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన తేదీ 20. అంటే 2. ఈ రెండూ కూడా చంద్రునికి సంబంధించినవే కావడం వల్ల వీరు ఈ సంవత్సరం చంద్రుని ప్రభావం వల్ల ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. పూర్వికుల ఆస్తులు అందిపుచ్చుకుంటారు. ధనానికి లోటుండదు. అయితే ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. చంద్రప్రభావితమైన జాతకం కాబట్టి వీరి ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది. దీనివల్ల రాజకీయంగా ఎదుగుతారు లేదా మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, జ్యోతిష్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంచి పేరు, ఆదాయం లభిస్తాయి. లివర్‌కు, మనసుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లక్కీనంబర్స్: 1,2,5,6,8; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, శాండిల్, క్రీమ్ లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: ప్రార్థనలు పెట్టించడం, ఖురాన్ పఠనం చేయడం, మదరసాలు, వేదపాఠశాలలు, క్రైస్తవ మిషినరీలకు సహాయం చేయడం, చంద్రుని వెన్నెలలో గడపడం, అనాథలకు బెల్లం పాయసం తినిపించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
వారఫలాలు: 18 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనుల్లో ఆటంకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక విషయాలు ఆశాజనకం. రుణ ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. చాక్లెట్, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇతరులకు సాయ పడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళా రంగం వారికి సన్మానాలు, సత్కారాలు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4,స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించు కుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. సంఘంలో పేరుప్రతిష్టలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా పదవులు దక్కవచ్చు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు -
వారఫలాలు: 11 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభను చాటుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గుతాయి. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు. పసుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. పెండింగ్ వ్యవహారం ఒకటి అనుకూలించే అవకాశం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) శ్రమపడ్డా ఫలితం అంతగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆచి తూచి వ్యవహరించండి. అభాండాలు వేసేవారు అధికమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. ఎరుపు, నేరేడురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో పనులు చకచకా సాగినా క్రమేపీ మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణదాతల నుంచి ఒత్తిడులు. బంధువర్గంతో కలహాలు. మీపై విమర్శలు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ చూపండి. భూముల కొనుగోలు విషయంలో అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. తెలుపు, బంగారు రంగులు , ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులలో అవరోధాలు నెలకొంటాయి. ఇంటా బయటా సమస్యలు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. మొత్తం మీద మౌనం అన్ని విధాలా మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా మధ్యలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా మారవచ్చు. కళారంగం వారికి నిరుత్సాహం. ఎరుపు, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పట్టింది బంగారమే. ఆర్థికంగా బలపడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా ప్రోత్సాహకరం. ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా పరిష్కరించు కుంటారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి విషయంలో ఎంతోకాలంగా నలుగుతున్న వివాదం పరిష్కారవుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. గులాబీ, లేత ఆక్కుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. గులాబి, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఇతరులకు సైతం సాయపడి ప్రశంసలు అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాల విస్తరణలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విలువైన వస్తుసామగ్రిని భద్రంగా చూసుకోండి. బంధువర్గంతో లేనిపోని వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చికాకులు. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్య సూచనలు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత గందరగోళం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. కళారంగం వారు పర్యటనలు వాయిదా వేసుకుంటారు. చాక్లెట్, పసుపురంగులు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు -
అక్టోబర్‌లో కరీంనగర్ రెండో విడత యాత్ర
-
టాలీవుడ్లో అక్టోబర్ వార్
-
రాష్ట్రానికి ‘ఝజ్జర్’ కాంతులు
వచ్చే నెల నుంచి 222 మెగావాట్లు ఊహించని విధంగా కేంద్రం విద్యుత్ కేటాయింపులు అక్టోబర్ నుంచి 374 మెగావాట్లకు పెంపు సెప్టెంబర్ వరకు ఏపీకీ 304 మెగావాట్లు ఢిల్లీ వదులుకున్న వాటాను పంచిన కేంద్ర సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ‘ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు’(ఐజీఎస్టీపీఎస్) నుంచి ఉత్పత్తవుతున్న 693 మెగావాట్లను గతంలో కేంద్రం ఢిల్లీకి కేటాయించగా.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరెంటును కేంద్రానికి తిరిగిచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పునఃకేటాయింపుల్లో భాగంగా.. ఈ విద్యుత్ నుంచి 304 మెగావాట్లను ఆంధ్రప్రదేశ్‌కు, 222 మెగావాట్లను తెలంగాణకు, 167 మెగావాట్లను కేరళకు కేటాయించింది. మూడు రాష్ట్రాలకు వచ్చే నెల(ఏప్రిల్) 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ విద్యుత్ పంపిణీ జరగనుంది. తర్వాత అక్టోబర్ నుంచి తెలంగాణకు ఝజ్జర్ నుంచి వచ్చే కోటా 374 మెగావాట్లకు పెరగనుంది. ఈ మేరకు 2015 అక్టోబర్ 1 - 2016 మార్చి 31 మధ్య కాలంలో ఝజ్జర్ విద్యుత్ పంపిణీలో భాగంగా మరో కోటాను కేంద్రం నిర్ణయించింది. మొత్తం 693 మెగావాట్లలో తెలంగాణకు 374 మెగావాట్లు, కేరళకు 319 మెగావాట్లు కేటాయించింది. ఈ మేరకు జరిపిన పునః కేటాయింపులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.గుహ ఈ నెల 19న లేఖ రాశారు. -
అమ్మో అక్టోబర్ !
ప్రస్తుతం ‘హుదూద్’ ముప్పు జిల్లాకు భారీ వర్ష సూచన ఆందోళనలో తీరప్రాంత వాసులు వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ చల్లపల్లి : 2011 అక్టోబర్ 6న ‘జల్’.. 2012 అక్టోబర్ 31న ‘ నీలం’.. 2013 అక్టోబర్ 10న పైలీన్.. ఇలా మూడేళ్లు వరుసగా అక్టోబర్‌లో తుపాన్లు సంభవించాయి. జిల్లాకు తీవ్ర నష్టం కలిగించాయి. హుదూద్ తుపాను కూడా ఇదే నెలలో రావడంతో తీర ప్రాంతవాసులు అక్టోబర్ అంటేనే వణికిపోతున్నారు. అల్లకల్లోలంగా సముద్రం హుదూద్ పెను తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని తీర ప్రాంతాల్లో శనివారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణం కన్నా మూడు నుంచి ఐదడుగుల మేర ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. కోడూరు మండలంలోని సాగరసంగమం వద్ద ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు రానున్న ఉపద్రవానికి సంకేతాలని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన హుదూద్ తీరం దాటే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో గంటకు 150 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చేస్తున్న హెచ్చరికలు తీరప్రాంత వాసులను కలవర పెడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు మూడు రోజుల క్రితమే వేటను నిలిపివేశారు. వేటకు ఉపయోగించే పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే కోడూరు, నాగాయలంక, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఇప్పటికే ఆయా మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను తీవ్రతను బట్టి కోడూరు మండలంలోని తీరప్రాంత గ్రామాలైన పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, బసవానిపాలెం, చింతకోళ్ల, నాగాయలంక మండలంలోని గుల్లలమోద, ఎదురుమొండి దీవులు, ఈలచెట్లదిబ్బ, సొర్లగొంది, సంగమేశ్వరం ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. తుపాను వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. -
ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేని ఏటా అక్టోబర్ ఒకటవ తేదీన నిర్వహిస్తున్నాం. స్వరూప క్రిష్ణన్, డాక్టర్ జె.జి జోలీల చొరవతో 1975లో మొదలైన ఈ పద్ధతి నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలకు రక్తదానం ఆవశ్యకత తెలియచేస్తూ రక్తదానం చేయడానికి చైతన్యం కలిగించడం ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్లకు సమయానికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్ల వంటి అవసరాలకు తగినంత రక్తం నిల్వలు ఉండేలా నిధిని ఏర్పాటు చేయడం రక్తదాతల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి రక్తదానం చేయడం పట్ల ఆసక్తిని పెంచడం ఆరోగ్యకరమైన రక్తాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో సేకరించి ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు నిల్వ చేయడం... నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్డే ప్రధాన ఉద్దేశాలు. మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, వెస్ట్‌బెంగాల్ రాష్ట్రాల్లో రక్తదాతలు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 93 శాతం ప్రజలు రక్తదానం చేయడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఎక్కువసార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమే. ఈ లక్ష్యంతో ముందుకు రావడానికి ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చే ఆ సందర్భంలో మరింత సమాచారం కోసం కింది వెబ్సైట్లను చూడవచ్చు. indianblooddonors.com; bharatbloodbank.com bloodbankindia.net; friends2support; indianredcross society -
9 గంటల విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో కసరత్తు : రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
తిరుపతి : అక్టోబర్ 2 నుంచి నిరంతరాయంగా గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూరల్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు గ్రూపులుగా విడదీసి గ్రామీణ ప్రాంతాలకు కనీసం సింగిల్ ఫేజ్ కరెంట్‌ను 24 గంటలూ సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ కనె క్షన్లకు హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్(హెచ్‌వీడీఎస్) సిస్టంను అభివృద్ధి చేసేందుకు రూ.15 వేల కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపారు. ప్రభుత్వం నిరే్దశించిన ప్రకారం పల్లెప్రాంతాలకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలంటే సబ్స్టేషన్లను పటిష్టపరచాల్సి ఉంది. రూరల్ కరెంట్‌ను వ్యవసాయం నుంచి విడదీసి రెండు మూడు వ్యవసాయ కనె క్షన్లకు నేరుగా హెచ్‌వీడీఎస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. డిస్కం పరిధిలోని 11 జిల్లాల్లో హెచ్‌వీడీఎస్ పనులు 80 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంత చేసినా వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటలు కరెంట్ ఇవ్వడం కుదరదని అయితే రెండు విడతలుగా ఇస్తామంటున్నారు. అనంతపురం, గుంటూరులో సోలార్ పవర్ కరెంట్ కొరత నివారణ చర్యల్లో భాగంగా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు డిస్కం చైర ్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర చెప్పారు. ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాలకు కరెంట్ కొరత లేదన్నారు. అనంతపురం జిల్లాలోని గాలిమరల విద్యుత్ ఉత్పత్తి కేం ద్రం నుంచి 550 మెగావాట్ల విద్యుత్ అందుతోందని, కృష్ణపట్నం నుంచి 3వ తేదీ 270 మెగావాట్ల విద్యుత్ డిస్కం కోటాగా అందిందని దొర తెలిపారు. ఆప్పర్ సీలేరు నుంచి అంతరాయం లేకుండా 200 మెగావాట్ల విద్యుత్ అందుతోందన్నారు. -
అక్టోబర్‌లో గుర్రం ఎక్కుతాడు
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. తన కెరీర్లో ఇప్పటివరకూ పోషించనటువంటి ఓ కొత్త డైమన్షన్ ఉన్న పాత్రను ఆయన ‘గోపాల గోపాల’ చిత్రంలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపైనే ప్రస్తుతం పవర్‌స్టార్ దృష్టి అంతా. ఆహార్యం, వాచకం, హావభావాలు... ఇలా అన్నీ కృష్ణునికి తగ్గట్టు పెక్యులర్‌గా ఉండేలా చూసుకుంటున్నారాయన. అందుకే... ఓ రెండు నెలల పాటు మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితిలో పవన్‌కల్యాణ్ లేరు. అయితే... మరి ‘గబ్బర్‌సింగ్-2’ పరిస్థితేంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమా అటకెక్కినట్టే అని కొన్ని రూమర్లు కూడా వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే... వాటన్నింటినీ చెక్ పెడుతూ... అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్-2’ను సెట్స్‌కి తీసుకురానున్నారు పవన్‌కల్యాణ్. ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించిన తన వర్క్ త్వరితగతిన పూర్తి చేసి, అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్’ అవతారం ఎత్తనున్నారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పవన్‌కల్యాణే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారమ్. అంటే... రానున్న రోజుల్లో పవర్‌స్టార్‌ని రెండు భిన్నమైన కోణాల్లో అభిమానులు చూడబోతున్నారన్నమాట. -
అక్టోబర్ నుంచి పింఛన్ పెంపు
కలెక్టర్ రఘునందన్‌రావు విజయవాడ సిటీ : అక్టోబర్ నుంచి ఫించన్ సొమ్ము పెరుగుతున్నందున సామాజిక భద్రతా పింఛన్ డేటాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానంపై బుధవారం ఆయన నగరంలోని సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పింఛన్‌దారుల వివరాలను ఆధార్ వివరాలతో అనుసంధానాన్ని నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛను కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఎంపీడీవోలు తక్షణమే స్పందించాలని సూచించారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.200 నుంచి రూ. 1000, వికలాంగులకు రూ. 1000నుంచి రూ. 1500 వరకు పెరిగిందన్నారు. జిల్లాలో 3,13,026 మంది పింఛను దారులున్నారని వీరిలో ఇప్పటి వరకు 2,10,424 మంది పింఛనుదారులు ఆధార్ అనుసంధానం చేయించుకోగా, 25,264 మంది ఎన్రోల్మెంట్ అనుసంధానం చేశారని చెప్పారు. మిగిలిన 77,340 మంది ఫించనుదారుల ఆధార్ అనుసంధాన ప్రక్రియను ఈ మాసాంతానికి పూర్తిచేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి... ఆధిక వర్షాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టుషాపులను అరికట్టాలన్నారు. జేసీ జె. ముర ళీ డీఆర్డీఏ పీడీ జనీకాంతారావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సృజన పాల్గొన్నారు. -
జిల్లా...వదలా...
జేసీ కుర్చీ కుస్తీ =జిల్లా వీడేందుకు ఉషాకుమారి బెట్టు =మురళీ పట్టు =వారం రోజులపాటు శెలవుపై జేసీ =ఆఖరి ప్రయత్నాలకేనంటూ ప్రచారం సాక్షి, మచిలీపట్నం : ఈ ఏడాది అక్టోబర్‌లో ఒకేసారి ఇద్దరు కీలక అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారిలను ఏకకాలంలో బదిలీ చేయడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తుపానుల సమయంలో జిల్లాపై అవగాహన ఉన్న ఇద్దరు కీలక అధికారులను ఒకేసారి జిల్లా నుంచి పంపించడం సరికాదన్న కారణాన్ని చూపి జేసీ బదిలీకి అప్పట్లో మంత్రి అడ్డుచక్రం వేశారు. కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి అక్టోబర్ 14న ఇక్కడ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జేసీ ఉషాకుమారి మాత్రం ఇక్కడ కొనసాగుతుండటంతో ఆమె బదిలీ నిలిచిపోయినట్టేనని అందరూ భావించారు. దీంతో జేసీకి అనుకూలంగా, వ్యతిరేకంగా అధికార పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని సీఎం పేషీ నుంచి జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీ అయిన జె.మురళి జిల్లాకు వచ్చి విధుల్లో చేరేందుకు ఒత్తిడి పెంచినట్టు సమాచారం. ఈ విషయమై హైదరాబాద్ నుంచి ఉన్నతస్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఇప్పించినట్టు చెబుతున్నారు. ఈ నెల 28న ఆయన జేసీగా ఇక్కడ విధులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో జేసీ ఉషాకుమారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ రిలీవ్ అయ్యి తనకు కేటాయించిన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సి ఉంది. ఆఖరి ప్రయత్నంగా... జిల్లాను విడిచి వేళ్లేందుకు ఇష్టపడని జేసీ ఉషాకుమారి ఇక్కడే కొంతకాలం ఉండేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ విధుల్లో చేరేందుకు మురళి ఒత్తిడి పెంచడంతో ఆమె తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తనను కొంతకాలం ఇక్కడే కొనసాగించేలా కలెక్టర్ ఎం.రఘునందనరావు నుంచి కూడా సమ్మతి లేఖ తీసుకుని వెళ్లినట్టు సమాచారం. రాజధాని స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఈ నెల 19 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు ఆమె సెలవుపై వెళ్లారు. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటం ఎందుకని ఎవరికైనా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని వచ్చిన ప్రతిపాదనను కూడా ఆమె తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బెట్టు చేస్తున్న జేసీ ఉషాకుమారి పట్టు సాధిస్తారో.. పట్టుబడుతున్న మురళి బందరు గట్టుకు చేరుకుంటారో చూద్దాం. -
పురానా ఖిలాకు ‘కళ’!
న్యూఢిల్లీ: చరిత్రాత్మక పురానా ఖిల్లాలో తిరిగి సందడి నెలకొననుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ అక్టోబర్ రెండో తేదీ నుంచి ఆరో తేదీవరకు అనన్య వార్షిక నృత్యోత్సవాలను నిర్వహించనున్నారు. దేశంలో పేరొందిన వివిధ సంప్రదాయ నృత్య రీతులను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దూరదర్శన్‌తో కలసి కళ, సాంస్కృతిక భాషల విభాగం, సాహిత్య కళా పరిషత్, సెహర్లు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. ఈ ఏడాది మలబిక మిత్రా బృందం( కోల్‌కతా) కథక్ నృత్యం ప్రదర్శిస్తుండగా, కేరళకు చెందిన పల్లవీ కృష్ణన్ బృందం మోహినీహట్టాన్ని, భోపాల్‌కు చెందిన బిందు జునేజా బృందం ఒడిస్సీ, ఢిల్లీకి చెందిన మైత్రేయీ పహారీ బృందం కథక్, మయూర్భంజ్ చౌ నృత్యరీతులను ప్రదర్శించనున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన కిరణ్ సుబ్రమణ్యం, సంధ్రా కిరణ్ బృందం భరతనాట్యం చేయనున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో భారతీయ సంప్రదాయ నృత్య రీతుల్లో ఆసక్తిని పెంపొందించడానికే ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను మన సంప్రదాయాలను కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని తాము ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకుల్లో ఒకరైన సెహర్ తెలిపారు. ప్రదర్శనలతో పాటు అక్టోబర్ 3,4 తేదీల్లో వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు పగటి పూట కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలోనే నృత్య కళాకారులను కలసి మాట్లాడవచ్చని తెలిపారు. సంగీతం, నృత్యం, నటన, కళ తదితర సంబంధిత విద్యార్థులు భవిష్యత్తులో వాటిని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ఎంచుకునేందుకు తగిన విధంగా వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో నృత్య కళాకారులు, ప్రేక్షకుల మధ్య ‘ప్రతిబింబ్’ పేరిట సుహృద్భావ సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ఇందులో యువ నృత్యకళాకారులు, స్కాలర్స్, విద్యార్థులు, నృత్య ఔత్సాహికులు పాల్గొనేలా చూసి, వారిలో నూతనత్వాన్ని గుర్తించడం ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా అనన్యా నృత్యోత్సవం ముఖ్య ప్రతినిధి మన్జాట్ చావ్లా మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రత్యేక చొరవతో అనన్య నృత్యోత్సవాలు 2002 నుంచి నగరంలో జరుగుతున్న అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోందని కొనియాడారు. ‘ప్రతి యేడాది వందలాదిమంది సంప్రదాయ నృత్య ఔత్సాహిక కళాకారులు చారిత్రక పురానా ఖిల్లాలో తమ కళను ప్రదర్శిస్తూ ఎంతో గుర్తింపు పొందుతున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలల విద్యార్థులు అనన్య వర్క్‌షాపులను వినియోగించుకుంటున్నారు..’ అని చావ్లా తెలిపారు. ఇదిలా ఉండగా అనన్య వార్షిక నృత్యోత్సవాల్లో పురాతన కథావచన్కు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనువదించిన కథక్ నృత్య ప్రదర్శనను మలబికా మిత్రా ప్రదర్శించనున్నారు. హిందీ కృతి అయిన కింగ్ స్వాతి తిరునాళ్‌పై పల్లవి ఏక కళాకారిణిగా నృత్య ప్రదర్శన ఇస్తారు. బిందు జునేజా తన ఇద్దరు విద్యార్థులతో కలసి ఒడిస్సీ నృత్యాన్ని చేస్తారు. శరత్ పూర్ణిమ నాడు ఢిల్లీవాసులైన మైత్రేయి పహరీ బృందం ‘మహరాస్’ను ప్రదర్శించనుంది. బెంగళూరుకు చెందిన కిరణ్ సుబ్రమణ్యం, సంధ్యా కిరణ్ బృందం చేసే భరతనాట్య ప్రదర్శనతో ఈ నృత్యోత్సవం ముగుస్తుంది.