ముంబై : సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న సెన్సిబుల్ మూవీ ‘ఆక్టోబర్’.. ఇప్పటికే ఈ సినిమా ఫొటోలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. తన ట్రైనింగ్‌లో భాగంగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పనిచేసే హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా ఈ సినిమాలో వరుణ్ కనిపిస్తాడు. బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేస్తున్న బనిత సంధూ ఈ సినిమాలో వరుణ్ క్లాస్‌మేట్‌గా కనిపించనుంది.
కొన్ని అనుకోని దురదృష్టకరమైన పరిణామాల వల్ల ఆమె ఐసీయూలో చేరుతుంది. ఆ తర్వాత గతాన్ని మరిచిపోయి హీరోను, మిగతా స్నేహితులను కూడా గుర్తుపట్టని స్థితిలోకి వెళుతుంది. తన కోసం హీరో ఏం చేశాడన్నది సినిమా. ఇటీవల కన్నుమూసిన శ్రీదేవి ప్రఖ్యాత సినిమా వసంతకోకిల (హిందీలో సద్మా)ను గుర్తుచేసేలా ఈ సినిమా ట్రైలర్ ఉందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ చాలా సెన్సిబుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Published Mon, Mar 12 2018 4:41 PM | Last Updated on Mon, Mar 12 2018 4:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment