ramakrishna
-
వెండితెరకు డొక్కా సీతమ్మ జీవితం
అన్నపూర్ణగా, అన్నదాతగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ జీవితం వెండితెరకు రానుంది. ‘డొక్కా సీతమ్మ’ పేరుతో ఈ సినిమాని రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాని మరొకరు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వివాదం గురించి రామకృష్ణ, ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2016లోనే ‘డొక్కా సీతమ్మ’ సినిమా స్క్రిప్ట్‌ని హైదరాబాద్‌లోని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాం. మా రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ వారు డొక్కా సీతమ్మపై సినిమా తీయడానికి పూనుకోవడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. కాపీ రైట్ యాక్ట్ మాకు ఉన్నప్పటికీ కోర్టులో వివాదం ఉండటంతో మేం ముందుకెళ్లలేదు. వేరొక సంస్థ ఈ సినిమాను తీసేందుకు సన్నాహాలు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది’’ అన్నారు. ‘డొక్కా సీతమ్మ’ చరిత్ర తొలి రచయిత వంశీయులు మిర్తిపాటి రామచయనులు, దర్శకుడు సాయికృష్ణ, కెమేరామేన్ వాసువర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు -
KSR Live Show: మోదీ మీటింగ్ మీద ఉన్న శ్రద్ధ.. భక్తులపై ఉంటే ఇంత ఘోరం జరిగేదా !
-
సౌర విద్యుత్ కొనుగోలు పిల్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై స్పందించిన సీపీఐ రామకృష్ణ
-
వైయస్ఆర్సీపీ కురుబ సామాజికవర్గం అధ్యక్షుడిగా గడ్డం రామకృష్ణ
-
చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి మాట తప్పారు: CPI రామకృష్ణ
-
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వాలి: రామకృష్ణ
సాక్షి,హైదరాబాద్: వెంకటేశ్వర స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం తగదని, స్వామి వద్దకు అందరూ వెళ్లొచ్చని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ విషయమై రామకృష్ణ శుక్రవారం(సెప్టెంబర్27)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు. తిరుమలకు జగన్ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వైఎస్ జగన్ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశం. అప్పుడు ఏమీ మాట్లాడకుండా నేడు సాధారణ భక్తునిలా వైఎస్ జగన్ తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్ అడగడమేంటి’అని రామకృష్ణ ప్రశ్నించారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు..అబద్ధాలు బట్టబయలు -
బ్యారేజ్‌లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్‌లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్‌ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్‌ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
తరగతి గదిలో బాలికపై లైంగిక దాడి!
తిరుపతి క్రైమ్: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భయమేస్తోందంటే మేం ఒప్పుకోం సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందే
-
టీడీపీ వేధింపులకు జనసేన నేత బలి
-
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
-
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
అవినీతి వెలగపండు
భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్ పడింది. ► ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేపై కేసులు ► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు. -
బాబు, పవన్ డబుల్‌గేమ్‌పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్‌ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్‌నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్‌నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
బ్రేక్ అప్ చెప్పిన చంద్రబాబు..RK హార్ట్ బ్రేక్
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
-
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఇది చరిత్రాత్మకమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలిసారి జరుగుతోందని తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి పూర్తి హక్కు కల్పిస్తూ, వారికి ఒక ఆస్తిగా దాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయడం తమ శాఖకు చాలెంజింగ్ వంటిదని, అత్యంత క్లిష్టమైన ఈ పనిని అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షలాది మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు, వారి ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, హద్దులు, రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజి్రస్టార్లుగా గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వడం, ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేసే 15 వేల మంది వీఆర్వోలకు లాగిన్లు ఇవ్వడం పూర్తి చేసినట్టు చెప్పారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఈ డేటా మొత్తాన్ని మ్యాపింగ్ చేశామన్నారు. ఈ పని చేయడమే అత్యంత క్లిష్టమని, దాన్ని పూర్తి చేయడంతో రిజిస్ట్రేషన్లు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరందరి ఆధార్ ఈ–సిగ్నేచర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని చెప్పారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చిందని రామకృష్ణ తెలిపారు. సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5 వేల ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్టు తెలిపారు. రోజుకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రభుత్వం లక్ష్యానికనుగుణంగా అన్ని రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకారమైందని తెలిపారు. మొన్నటివరకు భూముల రీ సర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేవారని, ఇప్పుడు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తిస్థాయిలో చేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ–సిగ్నేచర్ యూజర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. 6.5 లక్షల రిజిస్ట్రేషన్ల కోసం 20 లక్షల ఈ–సిగ్నేచర్లు తీసుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వల్ల వారు పొందిన స్థలాలపై పేదలకు హక్కులు ఏర్పడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులుండవన్నారు. రెవెన్యూ ఎన్వోసీ లేకుండానే పదేళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరమని రామకృష్ణ వివరించారు. -
Fact Check: ఈనాడు కథనానికి ఇంజనీరు బలి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ను అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ‘ఈనాడు’ పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ (కాంట్రాక్ట్ ఉద్యోగి) వి.రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను వైఎస్సార్సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈనెల 30వతేదీన ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈనెల 29న ఉదయం రేగిడి మండల జేఈ (కాంట్రాక్టు) వి.రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు, వినియోగంపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్.శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈనెల 25న ‘ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి?’ శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్నా ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
పోస్టాఫీసులో కోటిన్నర స్వాహా
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని సబ్ పోస్టాఫీస్‌లో ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్ పోస్టుమాస్టర్ స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. ఖాతాదారులు, పోస్టల్ డిపార్టుమెంట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ సీఐ బీసన్న బుధవారం తపాలా కార్యాలయానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఖాతాదారులు, డిపాజిటర్లు వారి పాసుబుక్‌లతో పెద్ద సంఖ్యలో వచ్చారు. సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ పోస్టాఫీసు ఖాతాదారులకు డూప్లికేట్ పాసుపుస్తకాలు ఇచ్చి ఖాతాలో వేసిన నగదును ఆ పాసుపుస్తకంలోనే రాసి ఇస్తూ నగదును తన సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఖాతాదారుల ఫోన్ నంబర్లు కూడా మార్చి వేరే నంబర్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఖాతాదారుల అకౌంట్లలోని నగదును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు డిపాజిట్‌దారుల సొమ్మును విత్‌డ్రా చేసినట్లు తేలింది. ఖాతా నంబర్లకు లింకయిన ఫోన్ నంబర్లను ముందస్తుగానే మార్చడంతో నగదు విత్‌డ్రా చేసినప్పుడు వేరేవారికి సమాచారం వెళ్లలేదని విచారణలో తేలింది. పసిగట్టని అధికారులు లక్షల రూపాయలు విత్‌డ్రా అవుతుంటే సంబంధిత ఉన్నతాధికారులు పసిగట్టలేకపోయారు. గతంలో ఒక ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నా.. ఫోన్ చేసి మీరు మీ నగదును విత్‌డ్రా చేసుకున్నారా అని అడిగే వారని, ఇంత నగదు అతి తక్కవ కాలంలో విత్‌డ్రా అవుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే నగదు లెక్కల్లో తేడా వచ్చినట్లు గమనించి 17వ తేదీన రామకృష్ణను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే విచారణ చేసిన పోస్టల్ అధికారులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామకృష్ణ డబ్బులతో పరారవుతుంటే పోస్టల్, పోలీస్ శాఖలు ఏం చేసినట్లని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అనుముల మండలం హజారుగూడెంకు చెందిన సదరు సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ శనివారం నిడమనూరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
మతిమరుపు...
కవలలు హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖా నిరోషా హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తికమక తాండ’. తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై, హిట్టవ్వాలన్నారు. ‘‘తికమక తాండ అనే ఊర్లోని ప్రజలకు మతిమరుపు అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు వెంకట్. ‘‘మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు తిరుపతి శ్రీనివాసరావు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్‌కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు
-
ఎవరో కాదు... నా తండ్రే నా పరువు తీశాడు
-
సినిమా అంటే నాకు చాలా ఇష్టం కానీ.. నన్ను దూరం చేశారు
-
నాకు అంత అదృష్టం లేదు...!
-
నేను అంటే చచ్చే అంత ప్రేమ తనకి..!
-
సీపీఐ, జనసేనపై మల్లాది విష్ణు సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్‌కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్‌కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి! -
ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... రుణమాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థికశాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయన్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కారమార్గాలు కనుగొన్నారు. ఆధార్ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది. ఎన్పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు. మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌సెల్ రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. కొత్త రుణాలు మంజూరు చేయాలి రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్ పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. -
15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని.. 15 నాటికి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామన్నారు. దీనిపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్ 1.0 (సీఏఆర్డీ–కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) వెర్షన్‌ను 1999లో రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ సేవలను వేగంగా, నాణ్యంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి కార్డ్ 2.0 వెర్షన్‌ను రూపొందించి అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్డ్ 2.0లో దస్తావేజులను ఆన్లైన్లో తయారుచేసుకుని, ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చన్నారు. లేనిపక్షంలో తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్ కాపీని అప్లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు. 20 నిమిషాల్లోనే దస్తావేజుల జారీ.. ప్రస్తుత విధానంలో యజమానులు తాము తయారుచేసుకున్న దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని రామకృష్ణ గుర్తు చేశారు. కొత్త విధానంలో ప్రజలకు సమయం ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా దస్తావేజులోని వివరాలు వారే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల దస్తావేజులు తప్పులు లేకుండా ఉంటాయని చెప్పారు. చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలను వారే సొంతంగా లెక్కించుకోవచ్చని, ఆ చార్జీలను సులువుగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం తమకు కుదిరే టైమ్ స్లాట్ బుక్ చేసుకొని కేవలం 20 నిమిషాల్లోనే సాఫీగా పని పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. దస్తావేజుల స్కానింగ్ ప్రక్రియ కూడా ఉండదని.. రిజిస్ట్రేషన్ తర్వాత 20 నిమిషాల్లోనే దస్తావేజులు కూడా జారీ చేస్తారన్నారు. ఆధార్ లింక్ చేయడం వల్ల తప్పుడు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రమాదం కూడా ఉండదన్నారు. దస్తావేజుల తయారీదారులు, లేఖరులు, న్యాయ నిపుణులకు కొత్త విధానం వల్ల పని సులువు అవుతుందని వెల్లడించారు. వారి ఉపాధి పోతుందనేది అపోహ మాత్రమేనన్నారు. ఈ విధానంలో వినియోగదారులు.. మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ రిజిస్ట్రేషన్‌ను తామే సులువుగా పూర్తిచేసుకోవచ్చన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వెంటనే ఆటోమ్యుటేషన్.. కొత్త విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన విక్రయ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహశీల్దార్ కార్యాలయాన్ని మ్యుటేషన్ కోసం సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్ మ్యుటేషన్ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఈ విధానాన్ని రూపొందించామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం దస్తావేజులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా అధికారులకు సమర్పించే అవకాశం ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలంటే http://registration.ap.gov.in లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. -
చంద్రబాబు వల్లే రాష్ట్రం దివాలా: మంత్రి రాజా
తుని రూరల్: చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా తుని మండలం గెడ్లబీడు వద్ద శుక్రవారం జరిగిన జేసీఎస్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ధ్వజమెత్తారు. తనపై యనమల రామకృష్ణుడు తప్పుడు ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటనందూరు మండలంలో తాను 150 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమిని ఆయనకే రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్, అగర్బత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను టీటీడీ చైర్మన్ అందజేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు సీజే శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు. తిరుచానూరులో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ఠాకూర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
హీరోయిన్గా...
బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఆని కథానాయికగా పరిచయమవుతున్న చిత్రం ‘తికమక తాండ’. రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా బాలవెంకట్ దర్శకత్వంలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘‘1990లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ సమస్య వల్ల ఒక గ్రామ ప్రజలు మతిమరుపుతో బాధపడుతుంటారు. దాన్నుంచి ఎలా బయటపడ్డారనే అంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
నాకు అవకాశాలు రాకుండా చేశారు.. |
-
నేను పాడకపోతే వాళ్ళు యాక్ట్ చేసేవారు కాదు
-
ఇప్పటికే ఏడుగురు.. ఇప్పుడు మరో ముగ్గురు.. మొత్తం 10 మంది పిల్లలు
భద్రాచలం అర్బన్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ఆదివాసీ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇది సాధారణ కాన్పు కావడం విశేషం. కాగా ఆమెకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బట్టిగూడెంకు చెందిన పుజ్జ అనే మహిళకు ఈనెల 2వ తేదీన పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పుజ్జ మొదట ఇద్దరు మగ శిశువులకు జన్మనివ్వగా వైద్యులు కవల పిల్లలనే అనుకున్నారు. ఇంతలోనే పుజ్జ మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, పుజ్జ వయసు 29 ఏళ్లు మాత్రమే కాగా, ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు అని చెప్పారు. ఇప్పటికే ఆమెకు నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు అబ్బాయిలు ఉండగా, ఇప్పుడు పుట్టిన ముగ్గురితో కలిపి ఆమెకు మొత్తం పది మంది సంతానం అయ్యారు. పుజ్జకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాక డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పుజ్జకు సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేసిన హెడ్‌నర్సు విజయశ్రీ, ఇతర సిబ్బందిని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ అభినందించారు. -
సుపారీ ఇచ్చి.. హత్య చేయించి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య (70) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్ ఆయ నను అపహరించి, హత్య చేసిందని.. క్వారీ నీటి గుంటలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయిందని గుర్తించారు. భూముల వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, జనగామ జెడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి భర్త అంజయ్య ఈ హత్య కు సూత్రధారి అని తేల్చారు. ఈ మేరకు బచ్చన్నపేట, టా స్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడు గిరబోయిన అంజయ్య, సుపారీ ముఠా సభ్యులు డోలకొండ శ్రీకాంత్, శివ రాత్రి బాషా అలియాస్ భాస్కర్లను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఓసారి చంపేందుకు యత్నించి..: అంజయ్య కు సంబంధించి సర్వే నంబర్ 174లోని భూములపై వివా దాలు ఉన్నాయి. దీనిపై రామకృష్ణయ్య గతంలో అధికారు లకు ఫిర్యాదు చేశారు. దీనిపై కక్షగట్టిన అంజయ్య.. రామకృష్ణయ్యను హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. 2022 జూలైలో జలంధర్ అనే వ్యక్తితో కలసి కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశాడు. ఇటీవల తనకు పరిచయమున్న దండుగు ల తిరుపతి అనే వ్యక్తితో రూ.8 లక్షలు సుపారీ ఇస్తానని, రా మకృష్ణయ్యను చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీ నికి అంగీకరించిన తిరుపతి.. తనకు సమీప బంధువులైన డోలకొండ శ్రీకాంత్, శివరాత్రి బాషా, దండుగుల రాజులతో కలసి రామకృష్ణయ్య హత్యకు ప్లాన్ చేశాడు. పోచన్నపేట శివారులో కిడ్నాప్ చేసి..: తిరుపతి, శ్రీకాంత్, బాషా, దండుగుల రాజు నలుగురూ కలసి ఈ నెల 15న సాయంత్రం ఒక కారు అద్దెకు తీసుకుని పోచన్నపేట శివారులో మాటు వేశారు. బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తున్న రామకృష్ణయ్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని, చిన్నరామన్చర్ల శివారుకు తీసుకువెళ్లారు. సుమారు 6.30 గంటల సమయంలో టవల్ మెడకు బిగించి రామకృష్ణయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని.. ఓబూల్ కేశ్వాపూర్, పెద్దపహాడ్ల మీదుగా చంపక్ హిల్స్ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ఓ క్వారీ నీటిగుంటలో పడవేశారు. హత్య జరిగే నాటికి అంజయ్య ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.2 లక్షల వరకు నిందితులకు ముట్టజెప్పాడు. ఒకటి కాదు రెండు హత్యలు!: రామకృష్ణయ్య హత్యకేసులో విచారణ జరుపుతున్న క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చిందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అంజయ్య మరో భూవివాదంలో రూ. 2.5 లక్షల సుపారీ ఇచ్చి తన బావమరిది మల్లేశం భార్య సుభద్రను హత్య చేయించినట్టు వెల్లడైందని వివరించారు. 2022 అక్టోబర్ 20న ఆ హత్య జరిగిందని, ఆ ఘటనలోనూ తిరుపతి, రాజు హస్తం ఉన్నట్టు గుర్తించామన్నారు. 2012లో సుభద్ర భర్త మల్లేశం చనిపోయాడని.. తనకు రెండెకరాల భూమి రావాలని సుభద్ర నిలదీయడంతో అంజయ్య సుపా రి గ్యాంగ్‌తో హత్య చేయించాడని సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్ భూవివాదాలు, హత్య కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్య తొలి నుంచి బీఆర్ఎస్ కార్యకర్త కాదని, నాలుగేళ్ల కింద వేరే పార్టీ నుంచి వచ్చాడని పేర్కొన్నారు. -
విశాఖ తూర్పులో దొంగ ఓట్ల రగడ
మహారాణిపేట: విశాఖ తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు రగడ సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఇళ్లలో వాస్తవంగా ముగ్గురు, నలుగురు ఉంటే.. 10 నుంచి 15 వరకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉండడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ ఓట్లను తొలగించారు. వాటిని తిరిగి చేర్చాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేర్పించిన దొంగ ఓట్లని, వాటిని తిరిగి జాబితాలో చేర్చవద్దని వైఎస్సార్సీపీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వారే అక్రమంగా జాబితాలో చేర్పించారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వివాదాలు చెలరేగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలుపు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికలకు ముందు వెలగపూడి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల ఆరోపించారు. ఈమేరకు ఆమె కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దొంగ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చవద్దని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వెలగపూడి స్థానికేతరుడు కావడం వల్ల విజయవాడ, గుంటూరు, గన్నవరం తదితర ప్రాంతాల ప్రజలు, గీతం కాలేజీ విద్యార్థులను ఓటర్ల కింద నమోదు చేశారని ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్‌పై 20 ఓట్లు ఉంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనవరి నుంచి మార్చి వరకు కనీసం 40,000 ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం నిజమైన విజయం కాదన్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇష్టానుసారం తొలగించేశారు: వెలగపూడి మరోపక్క టీడీపీ ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అక్రమంగా 40,000 ఓట్లు తొలగించారని వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకు 30,000 నుంచి 40,000 ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. తొలగించిన ఓట్లన్నీ తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. -
పండగ ఏదైనా.. పచ్చనికానుక.. ఇప్పుడిదే ట్రెండ్
రామకృష్ణ రిటైర్డ్ బ్యాంకు అధికారి. కుమార్తెకు వివాహం కుదిరింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అతిథులకు, వియ్యాలవారికి రిటర్న్ గిఫ్ట్ కొత్తగా ఏదైనా ఇవ్వాలని ఆయన ఆలోచన. రోజూ సాయంత్రం వాకింగ్‌లో కలిసే మిత్రుడిని సలహా అడిగారు. ఆకర్షణీయమైన మొక్కలను ఇద్దామని సూచించారు. అది రామకృష్ణకు నచ్చింది. వెంటనే కడియపులంక నుంచి తెప్పించి, వాటినే బహూకరించారు. (రాజమహేంద్రవరం డెస్క్) : రామకృష్ణ ఒక్కరే కాదు. ఇటీవల కాలంలో చాలామంది పర్యావరణ హితం కోరుతూ బహుమతుల జాబితాలో మొక్కలను చేరుస్తున్నారు. జీవం ఉన్న బుల్లి మొక్కలను బహుమతిగా ఇస్తూ ప్రకృతిపై ప్రేమను చాటుకుంటున్నారు. పూలదండలు, పుష్పగుచ్ఛాల స్థానాన్ని క్రమంగా ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ ప్లాంట్స్ ఆక్రమిస్తున్నాయి. పెద్ద నాయకులు పర్యటనకు వచ్చినా, ఓ ఉద్యోగి రిటైరైనా శాలువా, మెమెంటోలతో పాటు గిఫ్ట్ ప్లాంట్లు కూడా తప్పనిసరి అయ్యాయి. కాన్వెంట్లో విద్యార్థి పుట్టిన రోజు నాడు క్లాస్ టీచర్లకు తల్లిదండ్రులు మొక్కలనే పిల్లలతో గిఫ్ట్‌గా ఇప్పిస్తున్నారు. అదొక్కటే కాదు పచ్చదనాన్ని ఇష్టపడే ఏ ఇంటి హాల్లో టీపాయ్‌పైన చూసినా ఒకటో, రెండో గిఫ్ట్ ప్లాంట్స్ కనిపిస్తాయి. మొక్కలు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయని, ఎయిర్ ప్యూరిఫయర్‌గా ఉపయోగపడతాయని ఇలా చేస్తున్నారు. ఇదో పెద్ద పరిశ్రమ గిఫ్ట్ ప్లాంట్స్ ..ఇప్పుడో పెద్ద పరిశ్రమ. దీనికి కేరాఫ్ రాష్ట్రంలోనే అతి పెద్ద హోల్‌సేల్ మార్కెట్ కడియం, కడియపులంక. 15 ఏళ్ల క్రితం గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మొదలయ్యాయి. స్వల్పకాలంలోనే నర్సరీ రంగంలో ఓ ప్రత్యేక విభాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయి . ప్రస్తుతం వాటి టర్నోవర్ రూ.కోట్లలోకి చేరుకుంది. జామియా కులకస్, పొట్టి రకానికి చెందిన స్నేక్, రంగురంగుల అగ్లోనిమాలు, మెరంటా, సింగోనియం, సక్కలెన్స్ వంటి మొక్కలు గిఫ్ట్ ప్లాంట్స్‌గా ఆదరణ పొందాయి. పీస్ లిల్లీ, ఆంథూరియం, కలించీ, ఆర్చిడ్స్ వంటివి పూలతో కూడి న గిఫ్ట్ ప్లాంట్స్. వాటిలో ఆక్సిజన్ ప్లాంట్‌గా పిలిచే జామియా కులకస్ ఎక్కువగా అమ్ముడయ్యే గిఫ్ట్ప్లాంట్. వీటిని పూణె, బెంగళూరుల నుంచే గాకుండా థాయ్‌లాండ్, చైనా వంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ నర్సరీల యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. గిఫ్ట్ప్లాంట్స్ చిన్నవి, సున్నితమైనవి కావడంతో ఎండవానల నుంచి రక్షణకు పాలీహౌస్‌లలో విక్రయానికి ఉంచుతారు. వాటి కోసం పెద్దపెద్ద నర్సరీల యాజమానులు రూ.లక్షలు ఖర్చు చేసి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కడియపులంక ప్రాంతంలో 40 వరకూ పాలీహౌస్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, అమలాపురం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు వంటి నగరాలకు సరఫరా అవుతుంటాయి. ఒక్కోగిఫ్ట్ ప్లాంట్ రకాన్ని బట్టి ఇంచుమించు రూ.250 నుంచి రూ.1000 వరకూ రేటు పలుకుతోంది. వెలెన్షియాలు.. సాధారణంగా 4, 5, 6 అంగుళాల సాధారణ కుండీల్లో గిఫ్ట్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి. మట్టికి బదులు పోషకాలు ఎక్కువగా ఉండే పాట్ మిక్స్ వాడుతుంటారు. మొక్కలతో కూడిన ఆ కుండీలను అంతకంటే అర అంగుళం ఎక్కువ సైజులో వివిధ రంగుల్లో, ఆకర్షణీయంగా ఉండే మరో కుండీలో ఉంచుతారు. దానిని వ్యవహారికంగా అవుటర్ పాట్ అంటారు. అసలు పేరు వెలెన్షియా.ప్లాస్టిక్ కుండీలు, గార్డెన్ ఉపకరణాలు తయారు చేసే పెద్దపెద్ద కంపెనీలే వివిధ రూపాల్లో, డిజైన్లలో ఆకట్టుకునేలా ఈ వెలెన్షియాలను తయారు చేస్తున్నాయి. వీటి అవుట్లెట్లు కడియపులంక ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో కీలకం నూతన సంవత్సర వేడుకలకు ఆతీ్మయులకు గిఫ్ట్ ప్లాంట్స్‌ను బహుమతిగా ఇవ్వడం ఇప్పటి ట్రెండ్. కడియం,కడియపులంకల్లో ఏడాది పొడవునా సాగే విక్రయాయి ఒక ఎత్తయితే, న్యూ ఇయర్ పేరుతో జరిగే గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు మరో ఎత్తు. ఈ క్రమంలో డిసెంబర్ మూడో వారం నుంచి కడియం, కడియపులంకలలోని ప్రధాన నర్సరీల యజమానులు ఏటా సరికొత్త రకాల గిఫ్ట్ ప్లాంట్స్‌ను దిగుమతి చేసుకుంటారు. డిసెంబర్ కావడంతో వాటిలో వివిధ రకాల స్వదేశీ, విదేశీ రకాల పూలమొక్కలు కూడా ఉంటాయి. డిసెంబర్ ఆఖరి వారంలోనే రూ.కోట్లలో గిఫ్ట్ ప్లాంట్స్ విక్రయాలు జరుగుతాయి. గిఫ్ట్ ప్లాంట్‌తో స్వాగతం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో సందర్శనకు తరచూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారికి గతంలో పుష్పగుచ్ఛా లను ఇచ్చి స్వాగతం పలికేవారం. వాటికి బదులు కొంతకాలంగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇచ్చి ఆహా్వనిస్తున్నాం. పుష్పగుచ్ఛాలు రెండు రోజులకే వాడిపోతాయి. గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ కాల ఉంటా యి. ఆక్సిజన్‌ను ఇస్తాయి. పర్యావరణ రక్షణకు మేం కూడా ఎంతో కొంత మేలు చేసినట్టూ ఉంటుంది. – వీఎస్ఎల్ రావు, ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, రాజమహేంద్రవరం డిపో 12 ఏళ్లుగా విక్రయిస్తున్నాం కడియపులంకలో 12 ఏళ్లుగా గార్డెన్ ఉపకరణాలు విక్రయిస్తున్నాం. ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు వెలెన్షియాల విక్రయాలు బాగా పెరిగాయి. అన్ని సైజుల్లో, రంగుల్లో మా వద్ద అందుబాటులో ఉంటాయి. వివిధ నగరాలు, పట్టణాల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతుంటారు. – రాజ్‌కుమార్ పాండే, మేనేజర్, హర్ష్ దీప్, గార్డెన్ ఉపకరణాల అవుట్లెట్, కడియపులంక సబ్సిడీపై పాట్ మిక్స్ ఇవ్వాలి రాష్ట్రంలోనే అతిపెద్ద గిఫ్ట్ ప్లాంట్ మార్కెట్‌గా కడియం, కడియపు ఎదిగాయి. గిఫ్ట్ఫ్లాంట్స్ ఆక్సిజన్‌ను ఇవ్వడమే కాదు, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ కూడా. వాటిని విక్రయించే నర్సరీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం. ప్రధానంగా ఉద్యాన శాఖ ద్వారా మట్టికి బదులుగా గిఫ్ట్ ప్లాంట్‌కు వినియోగించే పాట్ మిక్స్‌ను రాయితీపై ఇచ్చి ప్రోత్సహించాలి. – మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ అధినేత, కడియపులంక -
బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీలో ఆధిపత్య పోరు
-
జనసేన నాయకుడి మోసానికి కిరాణా వ్యాపారి బలి
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు చేసిన మోసానికి ఓ కిరాణా వ్యాపారి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన బుడ్డెపు రామకృష్ణ (43) తమ గ్రామంలోనే కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన ఇద్దరు పిల్లలకు 2020లో సైనిక్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తానని జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు నమ్మించాడు. ఇందుకోసం అసిరినాయుడుకు రామకృష్ణ రూ.16లక్షలు ఇచ్చాడు. అయితే రామకృష్ణ పిల్లలకు సైనిక్ స్కూల్లో సీట్లు రాలేదు. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో అప్పు చేసి రూ.16లక్షలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగివ్వాలని అనేకసార్లు రామకృష్ణ అడిగినా... అసిరినాయుడు పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 31న మరోసారి అసిరినాయుడు ఇంటికి రామకృష్ణ తన భార్యతో కలిసి వచ్చి అప్పులు పెరిగిపోయాయని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ‘నీకు నచ్చినట్లు చేసుకో...’ అని అసిరినాయుడు రెచ్చిపోయాడు. దీంతో రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మూడు రోజులకే రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు రామకృష్ణను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పొందూరు పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు! జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని కంచరాం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడని, అతనికి ఉద్యోగం రాకపోవడంతో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఇదే తరహాలో కొత్తూరుకు చెందిన వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో దేహశుద్ధి కూడా చేశారని గ్రామస్తులు చెప్పారు. -
ఉద్యోగాల పేరుతో యువతకు ఎర
సాక్షి, అమరావతి: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ అకడమిక్ సర్వీసెస్‌లో 78 ఉద్యోగాలు.. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లో 156 ఉద్యోగాలు.. ఇదీ ఇటీవల వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ప్రకటనలు. ఏకంగా ఓ వెబ్సైట్ రూపొందించి మరీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, సంస్కృత అకాడమీలో ఉద్యోగాల కల్పన పేరిట యువతను మోసగించేందుకు ఓ ముఠా వేసిన ఎత్తుగడ ఇది. సామాజికమాధ్యమాల్లో ఓ నకిలీ వెబ్సైట్ (https:// teluguacademy.org.recruitment), ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించిన అకాడమీ వెంటనే అప్రమత్తౖమెంది. తాము ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని అకాడమీ డైరెక్టర్ వి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సదరు నకిలీ నోటిఫికేషన్‌ను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఆ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయడంగానీ ఫీజుల రూపంలో నగదు చెల్లించడంగానీ చెయ్యొద్దని కూడా ఆయన తెలిపారు. తమ అకాడమీకి ఇప్పటివరకు ఎటువంటి వెబ్సైట్ లేదని స్పష్టంచేశారు. యువతకు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ఆంజనేయులు (ఫోన్ నంబర్: 9849616999)ను సంప్రదించాలని సూచించారు. ఇక రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో ఉద్యోగాల భర్తీకి నకిలీ నోటిఫికేషన్ ఇవ్వడంపై రామకృష్ణ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పరివర్తన బాటతో పదుగురికీ సేవ
పెద్దాపురం: జైలులో అలవర్చుకున్న ఆరోగ్య స్పృహను పదిమందికీ తెలియజేస్తున్నాడు మసిముక్కల రామకృష్ణ. అక్కడ నేర్చుకున్న యోగాను బయటకొచ్చి నేర్పుతూ గురువుగా ఎదిగాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉదయం పోషకవిలువతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నాడు. కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంకు చెందిన రామకృష్ణకు సుమారు 15 ఏళ్ల కిందట రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఓ హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష పడింది. అతను జైలుకు వెళ్లడంతో భార్య సుబ్బలక్ష్మి తన కుమారుడు, కుమార్తెను వెంటబెట్టుకుని పెద్దాపురం మండలం దివిలిలోని పుట్టింటికి చేరుకుంది. కుట్టు మిషన్ సాయంతో పిల్లలను పోషించింది. 2016 జనవరి 26న సత్పప్రవర్తన కేటరిగిలో రామకృష్ణ జైలునుంచి విడుదలయ్యాడు. స్వగ్రామం వెళ్లలేక అత్తావారింటికి కాపురం వచ్చేశాడు. ఇటు..యోగా అటు వైద్య సేవలు జైలు నుంచి వచ్చాక రామకృష్ణ తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా మంచి చేయాలని స్పంకల్పించాడు. జైలులో నేర్చుకున్న యోగాపై చుట్టుపక్కల ఉన్నవారికి అవగాహన కల్పించడం ప్రారంభించాడు. దీనిపై పులిమేరు పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నాడు. పులిమేరులో యోగాశ్రమాన్ని నెలకొల్పాడు. 12 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకూ సుమారు వంద మంది యోగా నేర్చుకుంటున్నారు. తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో రామకృష్ణ చిన్నపాటి రోగాలకు చికిత్స చేస్తున్నాడు. ఇటీవల పోషక విలువల ఆహారాన్ని తయారుచేసి విక్రయించడం ప్రారంభించాడు. సేంద్రీయ సాగు ఉత్పత్తులతో ఆహార పదార్ధాలను తయారుచేస్తున్నాడు. బ్లాక్ రైస్ ఇడ్లీ, నానబెట్టిన మొలకలు, కొర్రలు ఉప్మా, ఆయిల్‌లెస్ దోసె, చోడి అంబలిని కలిపి అల్పాహారంగా అమ్ముతున్నాడు. సాధారణ ధరకే విక్రయిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. పోషకాల టిఫిన్ రోజూ ఉదయం గతంలో ఇక్కడి హోటల్స్‌లో చాలామంది ఆయిల్‌తో చేసిన టిఫిన్లు తినేవారు. జనంలో ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయాన్నే ఇలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని గ్రహిస్తున్నారు. అలాంటి వారంతా పౌషకాహారంపై మొగ్గు చూపిస్తున్నారు. సేంద్రీయ పంటలతో చేసిన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేవారు తన లాంటి వారి వద్ద కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ చెప్పారు. ఆరోగ్యం గురించి తెలియజెప్పాలని.. జైలు నుంచి వచ్చాక పెట్రోల్ బంకులో పనిచేశాను. టైలరింగ్ వృత్తి చేశాను. బతుకు గడవడం మాటెలా ఉన్నా జైలులో నేర్చుకున్న ఆరోగ్య అంశాలను పదిమందికీ తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. జైలు జీవితం తెచ్చిన పరివర్తనను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది. ఇక్కడ నేర్చుకున్న యోగా గురించి చుట్టూ ఉన్నవారికి చెప్పాలని భావించాను. నెమ్మది నెమ్మదిగా ముందడుగు వేయగలిగాను. చాలామంది ప్రోత్సహించారు. ఏం చేసినా ప్రజల ఆరోగ్యం పెంచేదిగా ఉండాలని భావించి ఇప్పుడు పోషకాహారాన్ని కూడా విక్రయిస్తున్నాను. వ్యాపార దృక్పథంతో కాదు. ఆరోగ్య స్పృహ కలిగించాలనేదే నా ప్రయత్నం. – మసిముక్కల రామకృష్ణ, పులిమేరు -
కోర్టు ధిక్కరణ కేసు.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడండి: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు పాఠశాల విద్యాశాఖ గత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య గత కమిషనర్ వి.రామకృష్ణకు సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడం, వారు క్షమాపణలు కోరడంతో జైలుశిక్ష ఉత్తర్వులను సవరించి కోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలను ధర్మాసనం నిలుపుదల చేయడం చకచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా వీఈసీ జూనియర్ కాలేజీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్ధీకరించాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ 2020లో ఆదేశాలు జారీ చేయగా.. అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అప్పటి ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ అమలు చేయలేదు. దీంతో వారిద్దరిపైనా సాంబశివరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేశారని ప్రాథమికంగా తేల్చారు. శిక్ష విధించేందుకు వీలుగా వారిద్దరినీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ, రాజశేఖర్ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. వారు క్షమాపణలు తెలిపారు. ఈ క్షమాపణలు సదుద్దేశంతో చెప్పడం లేదంటూ.. ఇరువురికీ నెల రోజుల చొప్పున జైలుశిక్ష, చెరో రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. జైలు శిక్ష ఆదేశాల అమలును రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని అభ్యర్థించగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోర్టు హాలులోనే ఉన్న ఇరువురు అధికారులు మరోసారి బేషరతు క్షమాపణలు తెలపడంతో వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్ వారికి విధించిన జైలు శిక్షను సవరించారు. కోర్టు పనివేళలు ముగిసేంత వరకు కోర్టు హాలులో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానా మాత్రం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఇచ్చిన ఆదేశాలపై ఇరువురు అధికారులు ధర్మాసనం ముందు వేర్వేరుగా కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్) -
చిట్ ఫండ్ కంపెనీలకు కొంత గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది
-
పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని త్రీటౌన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్ ఎద్దుల రామకృష్ణ (35) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాలు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ 2011లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. సంజామల, ఆళ్లగడ్డ పోలీస్టేషన్‌ల్లో విధులు నిర్వహించి నంద్యాల త్రీటౌన్ పోలీస్టేషన్‌కు ఇటీవల బదిలీపై వచ్చాడు. విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ తోటి సిబ్బందితో సరదాగా ఉండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యథావిధిగా విధులకు హాజరయ్యాడు. స్టేషన్ భవనంపై ఉన్న రెస్ట్ రూమ్‌కు వెళ్లి తన సెల్ ఫోన్‌కు ఉన్న లాక్ నంబర్ రాసి పెట్టి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణ, డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ నరసింహులు స్టేషన్‌కు చేరుకుని రామకృష్ణ ఫోన్‌ను తనిఖీ చేశారు. అందులో ఎటువంటి సమాచారం లేదని డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
మోసాల మార్గదర్శి
-
రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కార్యాలయాల్లో సోదాలు చేశాం
-
ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు
సాక్షి, రాప్తాడురూరల్: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. అది లూటీ ఇండస్ట్రీస్ పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు. ఈ క్రమంలోనే కాంపౌండ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్ ఇండ స్ట్రీస్. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం. డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు. ఈ రోజు చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మాదాపూర్‌లో గన్‌తో హల్చల్పై కొనసాగుతున్న దర్యాప్తు
-
సురేష్ బాబుతో భూవివాదం.. గన్‌తో బెదిరిస్తూ రియల్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్‌తో హల్చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్‌బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది. అయితే, సురేష్ బాబు స్థలంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్స్ట్రక్షన్ సందర్భంగా సురేష్ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్ పీఎస్‌లో సురేష్ బాబు సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్ను సీజ్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
అక్టోబర్ 14 నుంచి విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నామని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు పాల్గొంటారని, 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్ట్ పారీ్టల నాయకులు సౌహార్ధ ప్రతినిధులుగా హాజరవుతారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం గురువారం ఢిల్లీ ఏపీ భవన్లో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జాతీయ మహా సభ అజెండాపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామన్నారు. జాతీయ మహాసభల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయన్నారు. 15న సభకు సీపీఐ నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంఎల్, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు హాజరవుతారని చెప్పారు. 16, 17 తేదీల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై సెమినార్ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సెక్యులర్ పారీ్టలు, ప్రజాతంత్ర పారీ్టల ముఖ్యమంత్రులు సెమినార్‌కు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తామన్నారు. దేశ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా తయారయ్యాయని, దేశంలో లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, పాదయాత్ర చేస్తున్న వాళ్లకు సీపీఐ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. -
మావోలకు గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, పాడేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతను పోలీసులు అరెస్టుచేశారు. అంతేకాక.. ఆ పార్టీలో పనిచేస్తున్న 60 మంది సభ్యులు, సానుభూతిపరులు మంగళవారం పాడేరులో విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్. హరికృష్ణ సమక్షంలో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే. ఇంజరికి వస్తుండగా ప్రభాకర్ అరెస్టు మావోయిçస్టు పార్టీలో కీలకంగా ఉన్న పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతాల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అలియాస్ గొడ్డలి రాయుడు కోండ్రుం నుంచి ఇంజరి గ్రామానికి వస్తున్న సమయంలో పెదబయలు పోలీసులు అరెస్టుచేసినట్లు డీఐజీ హరికృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆదివాసీ పీటీజీ కోందు కులానికి చెందిన వంతాల రామకృష్ణ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందినవాడు. మావోయిస్టు పార్టీ నేత భూపతి ప్రోద్బలంతో 2003లో మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి దళ సభ్యుడిగా, పార్టీ మెంబర్‌గా, ఏరియా కమిటీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగాడు. అరెస్టయిన రామకృష్ణ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని మల్కన్‌గిరి, కోరాపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రజాకోర్టులు పెట్టి అమాయక గిరిజనులను హత్యలు చేసేవాడని, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసేవాడని డీఐజీ తెలిపారు. ఆయనపై ఏఓబీ వ్యాప్తంగా సుమారు 124 కేసులున్నాయన్నారు. 14 హత్యలు, 13 ఎదురుకాల్పుల ఘటనలు, నాలుగు మందుపాతరలు పేల్చిన సంఘటనలు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు మరో ఆరు కేసులు ఆయనపై ఉన్నాయన్నారు. దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతోపాటు పలువురు గిరిజనుల హత్య కేసుల్లో వంతాల రామకృష్ణ నిందితుడు. అలాగే, అనేక ఎదురుకాల్పుల ఘటనలతో పాటు మందుపాతర్ల పేల్చివేతలు, పొక్లెయిన్లను తగులబెట్టిన సంఘటనలు, పలు కిడ్నాప్ కేసుల్లోను రామకృష్ణ ప్రముఖ పాత్ర వహించాడని డీఐజీ తెలిపారు. ఇక అరెస్టు అయిన రామకృష్ణ పేరుపై ప్రభుత్వం రూ.ఐదు లక్షల రివార్డును కూడా ప్రకటించిందని ఆయన తెలిపారు. రామకృష్ణ నుంచి రూ.39 లక్షల నగదు, ఐదు కిలోల మైన్, ఐదు డిటోనేటర్లు, 90 మీటర్ల పొడవు గల కరెంట్ వైరు, ఆరు బ్యాటరీలు, 9ఎంఎం పిస్టల్, ఎనిమిది 9ఎంఎం రౌండ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని.. ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. 60 మంది లొంగుబాటు మరోవైపు.. మావోయిస్టు పార్టీ పెదబయలు–కోరుకొండ ఏరియా కమిటీకి చెందిన 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 33 మందిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. వీరిలో ఇంజరి పంచాయతీ కోండ్రుం గ్రామానికి చెందిన కొర్రా చిన్నయ్య అలియాస్ శ్రీకాంత్ 95 నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఐజీ తెలిపారు. ఏఓబీ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందని, గత ఏడాది 135 మంది మావోయిస్టులు, సానుభూతిపరులు లొంగిపోగా.. ప్రస్తుతం 60 మంది ఒకేరోజు జనజీవన స్రవంతిలోకి రావడం శుభపరిణామమని డీఐజీ హరికృష్ణ తెలిపారు. వీరందరిపై అనేక కేసులున్నాయన్నారు. రూ.లక్ష రివార్డు ఉన్న సభ్యులకు ఆ నగదును వారికే అందజేయడంతో పాటు లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మావోయిస్టుల కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పోలీసు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం చేపడతామని.. ఇందుకు ఒడిశా పోలీసు యంత్రాంగం కూడా అన్నివిధాల సహకరిస్తోందని హరికృష్ణ వివరించారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపడుతూ గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుతో జీవనోపాధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. నిరుద్యోగ యువతకు ప్రేరణ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని డీఐజీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ అడ్మిన్ తుసీన్ సిన్హా, సీఆర్పీఎఫ్ 284 బెటాలియన్ కమాండెంట్ ఆశీష్ విశ్వకర్మ, అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావు, పాడేరు సీఐ సుధాకర్ పాల్గొన్నారు. -
సీఎం జగన్ తరహాలోనే నిరుద్యోగులకు మోదీ ఉపాధి కల్పించాలి: రామకృష్ణ
సాక్షి, అనకాపల్లి జిల్లా: రాష్ట్రంలో సీఎం జగన్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లుగానే.. మోదీ ప్రభుత్వం ఉపాధి కల్పించాలని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ సూచించారు. స్థానిక నెహ్రూచౌక్‌లో జిల్లా సీపీఐ మొదటి మహాసభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీజేపీ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి యువతను నట్టేట ముంచిందన్నారు. కేంద్రంలో సైనికుల దళాన్ని నిర్వీర్యం చేసేందుకు ‘అగ్నిపథ్’ పేరుతో పన్నాగాలు పన్నడంతో యువత కేంద్రంపై విరుచుకుపడుతోందన్నారు. చదవండి: (‘గడప గడప’పై పచ్చటి విషం) -
బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్
‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండూ..’, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’.. ఇటీవల బాగా ట్రెండ్ అయిన ఈ పాటలు యువతనే కాదు.. వృద్ధులను సైతం ఉర్రూతలూగించాయి. బుల్లెట్టు బండిపై ఉన్న క్రేజ్‌ను రచయితలు అలా తమ పాటలలో వినియోగించుకున్నారు. గతంలో రాయల్ ఎన్ఫీల్డ్æ ఇంటిముందు ఉంటే అదో స్టేటస్ సింబల్. దానిని నడిపే వారు రాజసంగా ఫీలయ్యేవారు. మరి అలాంటి బండికి సుస్తీ చేస్తే.. అదేనండి రిపేరు వస్తే! వాటి యజమానులకు ఠక్కున గుర్తుకొచ్చేది బెజవాడ రామకృష్ణ పేరే. ఆయన తర్వాతే మరే మెకానిక్ అయినా. ఒకటి కాదు, రెండు కాదు ఐదు దశాబ్దాలకు పైగా ‘బుల్లెట్ డాక్టర్’గా ఎన్నో బండ్లకు కొత్త ఊపిరి పోశారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బందరు లాకుల సెంటర్.. రోడ్డు పక్కన రెండు గదులుండే చిన్నపాటి రేకుల షెడ్డు.. దాని ముందు ఓ తాటాకుల పాక.. అందులో పదుల సంఖ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు. అదేదో బుల్లెట్ బండ్ల షోరూం కాదు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంతకన్నా కాదు. 63 ఏళ్ల పెద్దాయన నడిపే గ్యారేజి అది. 54 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటూ.. అనేకమందికి తర్ఫీదునిస్తూ బుల్లెట్ మరమ్మతులకు కేరాఫ్‌గా మారారు పి. రామకృష్ణ. రామకృష్ణ.. కేరాఫ్ కంకిపాడు కంకిపాడుకు చెందిన రామకృష్ణ 1968లో గవర్నర్‌పేట గోపాల్‌రెడ్డి రోడ్డులోని ఓ గ్యారేజిలో మెకానిక్‌గా జీవితం ప్రారంభించారు. 1977లో సొంతంగా తానే బందరు లాకుల వద్ద షెడ్డు నెలకొల్పారు. అప్పటి నుంచి నేటి వరకు అదే పాకలో పనిచేస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు మాత్రమే మరమ్మతులు, సర్వీసింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆ విధంగా రామకృష్ణ ‘బుల్లెట్ వైద్యుడు’గా పేరు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాడే వారికి రామకృష్ణ సుపరిచితులే. తమ బండికి ఆయన మరమ్మతు చేస్తే నిశ్చింతగా ఉండొచ్చని వాటి యజమానుల నమ్మకం. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వాహనాలను రామకృష్ణ వద్దకు పంపుతారు. ఈయన వద్ద వందలాది మంది బుల్లెట్ మెకానిజం నేర్చుకున్నారు. ఆయన వద్ద నలభై ఏళ్లకు పైగా పనిచేస్తున్న మెకానిక్‌లు ఉన్నారు. ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విని.. ‘ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విన్నాను. ప్రొద్దుటూరుకు చెందిన జంపారెడ్డి అనే ఉపాధ్యాయుడు కంకిపాడుకు బుల్లెట్‌పై వచ్చి కాఫీ తాగి, పేపర్ చదివి వెళ్లేవారు. ఆయన బుల్లెట్ స్టార్ట్ చేయడం, కిక్ కొట్టడం చూసి ఎంతో ముచ్చట పడేవాడిని. ఆ విధంగా బుల్లెట్ అంటే ప్రేమ పెరిగింది. బుల్లెట్ మెకానిక్ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగా’ అని రామకృష్ణ గతాన్ని నెమరు వేసుకున్నారు. ఏపీడబ్ల్యూ 6988 నంబర్‌తో 1964లో రిజిస్టర్ అయిన బుల్లెట్, ఏపీడబ్ల్యూ 9332 నంబర్‌తో 1968లో రిజిస్టరైన మరో బుల్లెట్ రామకృష్ణ సొంతం. ఆ రెండు బుల్లెట్లు ఇప్పటికీ కండిషన్లో ఉన్నాయి. 1971 నాటి మోడల్ కేబీఆర్ 99 కస్టమర్ బుల్లెట్‌కు ఇప్పటికీ ఆయనే సర్వీస్, మరమ్మతులు చేస్తున్నారు. ఇవికాక 1959 నాటి రాయల్ ఎన్ఫీల్డ్ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు రామకృష్ణ తెలిపారు. తాము చేసేది రిపేర్ కాదని, వాహనానికి ప్రాణం పోస్తామని రామకృష్ణ చెప్పారు. -
యాదాద్రి ఇన్చార్జి ఈవోగా రామకృష్ణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి ఆర్జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం. -
రామకృష్ణ హత్య కేసులో మరో ఏడుగురి రిమాండ్
భువనగిరి క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో మిగిలిన ఏడుగురు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో ప్రమేయంఉందని భావిస్తున్న మొత్తం 11మందిలో సోమవారం నలుగురిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న మిగతా ఏడుగురు ఏ1 పల్లెపాటి వెంకటేశం, ఏ2 దోర్నాల యాదగిరి(బీబీనగర్ పీఎస్‌లో హోంగార్డు), ఏ3 దంతూరి రాములు, ఏ8 మహ్మద్ సిద్దిఖీ, ఏ9 తోట్ల ధనలక్ష్మి, ఏ10 తోట్ల నరేందర్, ఏ11 తోట్ల భానుప్రకాశ్‌లను విచారించారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. -
రామకృష్ణ హత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
సాక్షి, భువనగిరి: మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. హత్య కేసుకు సంబంధించి భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామకృష్ణను మామ వెంకటేష్ హత్య చేయించారని తెలిపారు. లతీఫ్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రామకృష్ణను హత్య చేయించాడని పేర్కొన్నారు. రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. గుండాల మండలానికి రామకృష్ణను తీసుకెళ్లి చంపినట్లు నిందితులు తెలిపారని చెప్పారు. లతీఫ్ గ్యాంగ్‌తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్లను అరెస్ట్ చేశామని అన్నారు. భార్గవి తండ్రి వెంకటేష్ సుపారీ ఇచ్చి రామకృష్ణను చంపించారని వెల్లడించారు. రూ.10 లక్షల సుపారీ కోసమే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. హోం గార్డ్ యాదగిరి, రాములుకు పరిచయం అయ్యాడని, అనంతరం రాములు లతీఫ్ గ్యాంగ్‌ను పరిచయం చేశాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 11 మందిలో నలుగురు నిందితులను రీమాండ్‌కు పంపించామని అన్నారు. మిగిలిన ఏడుగురిని మళ్లీ రీమాండ్ చేస్తామని ఏపీపీ పేర్కొన్నారు. -
పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి..
భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి ) పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది. సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఐదు నెలల క్రితమే వ్యూహరచన రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్ లతీఫ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. (చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్చల్) పూడ్చిన గొయ్యి తవ్వి.. భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్ చేసింది. నా తండ్రే హత్య చేయించాడు నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు. – భార్గవి -
బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ బయటకొచ్చి పోరాడాలి
సాక్షి, అమరావతి/ఒంగోలు/మంగళగిరి: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాడాలని సీపీఎం, సీపీఐ సూచించాయి. బీజేపీతో దోస్తీ చేసిన ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడలేదని పేర్కొన్నాయి. మంగళవారం ఒంగోలులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలను జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్ పూడ్చేందుకు ఎలాంటి సాయం చేయని కేంద్రం.. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఐసీయూలో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇవ్వాలన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు వాటి కోసమే పాకులాడుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు విమర్శించారు. మంగళవారం గుంటూరు జిల్లా నిడమర్రులో ఆయన ‘అమరావతి ప్రజాబాట’ను ఆయన ప్రారంభించారు. -
అక్రమ లేఅవుట్లు రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు, డిస్మిస్‌కూ వెనుకాడం
సాక్షి, అమరావతి: అనధికారిక లే అవుట్లను రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతిచ్చిన లే అవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్టర్ చేయాలని తెలిపారు. అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయకూడదనే నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలులో ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. డీఐజీలు తమ జిల్లాల్లో లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతి నెలా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ లే అవుట్లను రిజిష్టర్ చేయడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల కొన్నిచోట్ల ఇలాంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భూముల రీసర్వేపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో సభ్యులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక లేఅవుట్లపై సీరియస్‌గా స్పందించారు. మున్సిపల్ శాఖాధికారులు ఈ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్.. డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. -
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన నందమూరి రామకృష్ణ
సాక్షి, అమరావతి: తన తండ్రి నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారు గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హర్షం ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా’నంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ) (NTR District: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి) -
రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించాం: ఏఎస్పీ రోహిత్ రాజ్
-
వనమా రాఘవపై 12 కేసులున్నాయి: ఏఎస్పీ
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్‌రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 8th January 2022
-
అతన్ని వదలొద్దు.. నాకు కడుపుకోత మిగిల్చాడు
-
వనమా రాఘవేంద్ర అరెస్ట్
-
‘నాలుగో సింహం’ బోనులో.. ‘వనమా’లు జనంలో
సాక్షి, హైదరాబాద్: అది శాంతిభద్రతలను రక్షించే కీలకమైన పోలీసు విభాగం.. కానీ మంచి పోస్టింగ్ కావాలంటే ‘సిఫార్సు’ కావాల్సిందే, లేదంటే లూప్లైన్లో కాలం వెళ్లదీయాల్సిందేనన్నది ఆ శాఖలో అనధికార నినాదం! కొన్ని జిల్లాల్లో ఎస్పీ స్థాయి నుంచి ఎస్సై దాకా నేతల సిఫార్సు లేనిదే పోస్టింగ్ దక్కలేని పరిస్థితి ఉందన్నది బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం! ఇలా మంచి పోస్టింగ్ కోసం రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్న కొందరు పోలీసు అధికారులు.. సంబంధిత నేతకుగానీ, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకుగానీ వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు ఘటనతో ఈ ‘సిఫార్సు’ల వ్యవహారం పోలీసుశాఖలో తీవ్ర కలవరం రేపుతోంది. వనమా రాఘవేంద్రరావుపై ఎన్నో ఏళ్లుగా ఫిర్యాదులున్నా పోలీసు అధికారులు పెద్దగా స్పందించకపోవడానికి కారణమూ ఇదేనన్న చర్చ జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటం పోలీసు ఉన్నతాధికారులను ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. చెప్పినట్టు వినాల్సిందే.. కొత్తగూడెం పాల్వంచలో జరిగిన వ్యవహారంలో పోలీసుశాఖ ముందే స్పందించి ఉంటే.. ఈ స్థాయిలో వ్యవహారాలు జరిగేవి కాదన్న వాదన వినిపిస్తోంది. 2017 నుంచే వనమా రాఘవేంద్రరావుపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులు ఉన్నా యి. 2018లో ఒక క్రిమినల్ కేసు, 2019లో మరొకటి, 2020లో ఇంకొకటి.. ఇలా నాలుగుకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే రామ కృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు మరికొన్ని కేసుల్లోనూ బాధితులు పోలీసులపైనా ఆరోపణలు చేస్తున్నారు. తాము స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీనికి కారణం రాఘవ తన తండ్రి సిఫార్సు లేఖలతో ఇప్పించిన పోస్టింగ్‌లే అనడంలో ఏమాత్రం సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది. రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడం వివాదాస్పదంగా మారిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం, సదరు సెల్ఫీ వీడియో సోషల్‌మీడియాలో సంచలనం కావడంతో.. ఇప్పుడు తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పోస్టింగ్కో రేటు పెట్టి.. రాష్ట్ర పోలీసుశాఖలో కొన్నిచోట్ల ఎస్పీ స్థాయి అధికారులకు పోస్టింగ్ దక్కాలంటే భారీ రేటు ఉందని.. డీఎస్పీ, ఇన్స్పెక్టర్, ఎస్సై పోస్టింగులకు ఒక్కో రేటు ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు పోస్టింగ్ సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. ఎస్సై పోస్టింగ్ సిఫార్సు కోసం రూ.5లక్షలు, సీఐ స్థాయిలో రూ.10 లక్షలదాకా.. డీఎస్పీ/ఏసీపీ పోస్టింగ్ కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు వసూలవుతున్నట్టు పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఎస్పీ బదిలీ వివాదాస్పదంగా మారుతోంది. ఏకంగా రూ.45 లక్షలు ఇచ్చి సంబంధిత అధికారి ఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా.. బెదిరింపులు, కబ్జాలు.. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే కుమారుడు ఇసుక రవాణాలో తమకు పూర్తిగా సహకరించే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకున్నట్టు ఆరోపణలున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే తరఫున ఆయన సోదరుడు పోలీసు అధికారులతో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే భార్య, ఇద్దరు అల్లుళ్ల పెత్తనం మరీ మితిమీరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. బెదిరింపులు, కబ్జాలు సహా సదరు నియోజకవర్గంలో వారు ఎలా చెప్తే పోలీసు అధికారులు అలా వినాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే కుమారుడు అన్నీ తానై డీఎస్పీ నుంచి ఎస్సై దాకా పోస్టింగ్‌లకు సిఫార్సులు చేయిస్తున్నట్టు చెప్తున్నారు. ►నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓ కీలక ఎమ్మెల్యే సోదరుడు నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ నడిపిస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తే.. సదరు బాధితులపైనే ఉల్టా కేసులు పెట్టించి హింసించారన్న ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు తన ఇసుక దందాకు అడ్డొస్తున్న వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయులపైనా భూకబ్జా, ఇసుక దందా ఆరోపణలున్నాయి. మరో ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ.. భూకబ్జాదారులతో చేతులు కలిపి విలువైన భూములను కాజేసినట్టు నిఘా విభాగం ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. ►ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుమారుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని ఫిర్యాదులున్నా పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే జిల్లాలో ఓ ఎమ్మెల్యేకన్నా ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ పెత్తనమన్న విమర్శలున్నాయి. వారు ఏకంగా రూ.2 వేల కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేశారని.. దానిపై ఫిర్యాదు చేసిన వారిపై అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ►ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తానే ఎమ్మెల్యే అయినట్టుగా వ్యవహరించడం, భూకబ్జా వ్యవహారాలు మానవ హక్కుల సంఘం దాకా వచ్చాయి. సదరు ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులు, అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ మూడు ఫిర్యాదులు అందాయి. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే భార్య పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తున్న కమిషన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఉల్టా వారిపైనే కేసులు నమోదుచేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ►ఖమ్మంలో వనమా రాఘవ వ్యవహారం ఇటీవలే బయటపడింది. మరో ఎమ్మెల్యే భర్త కూడా ప్రతీదందాలో తన వాటా అంటూ వసూలు చేస్తున్నారని.. ఇవ్వకపోతే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే విధంగా ఓ ఎమ్మెల్సీకి వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేస్తున్న పనులు ఎస్పీస్థాయి అధికారులకు కూడా చికాకు తెప్పించాయని, వారు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లిందని సమాచారం. ►వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ పోస్టింగ్‌లలో జోక్యం చేసుకుంటున్నారని.. పోలీసు, రెవెన్యూ అధికారుల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లలో వాటాలు వసూలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే చీకటి వ్యవహారాలకు పోలీసులు సెక్యూరిటీ కల్పించడం ఇటీవల వివాదాస్పదమైంది. ►మెదక్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు నమోదు చేయిస్తానంటూ కొందరిపై బెదిరింపులకు దిగినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సిఫార్సులతో చేతులు కట్టేస్తున్నారు! ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలుంటే తప్ప పోస్టింగులు ఇవ్వద్దొన్న మౌఖిక ఆదేశాలుండటంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులు కట్టేసుకోవాల్సి వస్తోందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పోస్టింగులు సిఫార్సు లేఖల ద్వారానే జరుగుతున్నాయని.. ప్రతిభ, అంకితభావ సేవలను దృష్టిలో పెట్టుకొని మిగతా వారికి అవకాశం కల్పిస్తున్నా నాలుగు రోజుల ముచ్చటగానే మిగిలిపోతోందని ఉన్నతాధికారవర్గాలు చెప్తున్నాయి. సమర్థవంతమైన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్న అధికారులపై ఎప్పటిప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలిస్తున్నా మార్పు రావడం లేదని వాపోతున్నాయి. వ్యవస్థలో మార్పు రాకపోతే మరింత విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిఫార్సు లేఖలతో కాకుండా.. సమర్థత ఆధారంగా పోస్టింగులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
వనమా రాఘవేంద్ర అరెస్ట్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. పరారీపై ప్రచారాల మధ్య.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితితో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు రాఘవ కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఈ నెల 6న వైరల్‌గా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచే రాఘవ పరారీలో ఉన్నారు. ఆయనను ఆరో తేదీనే కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని, శుక్రవారం రాత్రి వరకు రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోపాటు పాత కేసులకు సం బంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేసి రౌడీషీట్ తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ ప్రకటించా రు కూడా. ఇది జరిగిన మరుసటి రోజే రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించ డం గమనార్హం. అయితే శని, ఆదివారాలు కోర్టుకు సెలవులని.. రాఘవకు బెయిల్ రాకుండా ఉండేం దుకే శుక్రవారం రాత్రి అరెస్ట్ చూపారనే ప్రచారం జరుగుతోంది. రాఘవ వ్యవహారాలన్నింటినీ తిరగదోడిన పోలీసులు.. కేసుల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. పోలీసుల అదుపులో మరో నలుగురు రాఘవ అక్రమాల వివరాలు తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితమే ఆయన అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వస నీయంగా తెలిసింది. పాల్వంచకు చెందిన ఇద్దరు, లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. వారిలో ఇద్దరు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది. కొత్తగూడెం బంద్ రాఘవను వెంటనే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు శుక్రవా రం కొత్తగూడెం నియోజకవర్గ బంద్ నిర్వహించారు. ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కేసులో ఎమ్మెల్యే ఇంటిగోడకు నోటీసు పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్‌పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు గతేడాది జూలై 29న తన చావుకు రాఘవ, మరో 42 మంది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగాడు. విచారణలో ఉన్న ఆ కేసుకు సంబంధించి రాఘవ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. నోరువిప్పుతున్న రాఘవ బాధితులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం నెలకొన్న పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను చూసి రాఘవ బాధితులు ఒక్కరొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బాధిత మహిళలు కొందరు శుక్రవారం ‘సాక్షి’తో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో పాటు ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ఉంటే రాఘవ దాష్టీకాలకు అప్పుడే తెరపడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళితే డాక్యుమెంట్లు చింపేశారు.. నవభారత్ (పాల్వంచ)లో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని రాఘవ అనుచరులు 2020 ఏప్రి ల్లో కబ్జా చేశారు, న్యాయం కోసం వెళ్తే రాఘవ నా వద్ద ఉన్న స్థలం డాక్యుమెంట్లు చించివేశారు, తర్వాత నాతో పాటు నా అన్నపైనా ఆయన అనుచరులు దాడి చేశారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకోలేదు. నన్ను, నాన్న, అన్నను అకారణంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. చివరకు రెవెన్యూ అధికారులూ నా గోడును పట్టించుకోలేదు. దీంతో పురుగుల మందు తాగి ఎలాగో బయటపడ్డా. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు పచ్చని కుటుంబం బతికి ఉండేది. – జ్యోతి, పాల్వంచ వారసత్వ భూమిని కాజేశారు.. పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్ కాలనీలో మా మామ గారికి మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. అది నా భర్త జాన్రాంకుమార్కు వారసత్వ ఆస్తిగా వచ్చింది. 2020 మార్చిలో ఆ భూమిని చదును చేస్తుంటే రాఘవ.. అనుచరులు, పోలీసులతో అక్కడికి వచ్చాడు. ఆ భూమి తనదని బెదిరించాడు. పోలీసులు ఏ విషయం ఆరా తీయకుండా నన్ను, నా భర్తను జీపులో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు భూమి కాగితాలతో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన దుర్భాషలాడారు. ఆ స్థలం జోలికి వస్తే చంపుతానని బెదిరించారు. ఇప్పటికీ ఆ భూమి రాఘవ అధీనంలోనే ఉంది. – శ్రీదేవి, పాల్వంచ చదవండి: వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ -
వనమా రాఘవేంద్ర అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్రరావు చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వనమాకు సంబంధించి మరో కేసు వెలుగులోకి వచ్చింది. మనుగురు ఫైనాన్స్ వ్యాపారి మలిపెద్ది వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులో ఎఎస్పీ శబరిష్ ఎదుట విచారణకు హాజరవ్వాలని అధికారులు నోటీసులు జారీచేశారు. వనమాను శుక్రవారం మధ్యాహ్నంకల్లా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులపై మరోసారి విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి.. వనమాను వెతకడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిన్న (గురువారం)వనమాను అరెస్టు చేసినట్లు కొన్నివదంతులు వ్యాపించాయి. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే, వనమా.. రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని టీంలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వనమా వ్యవహరం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. గడువులోగా రాఘవేంద్ర అరెస్టా? లొంగుబాటా? అనేదానిపై సస్సెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే తనయుడితో పోరాడలేకే వెళ్లిపోతున్నాం -
వనమా రాఘవ ఎక్కడ?
-
వరద బాధితులపై కేంద్రానిది బాధ్యతారాహిత్యం
రాజంపేట: వైఎస్సార్ జిల్లా చెయ్యేరు వరద బాధితులపై కేంద్రప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. శుక్రవారం పులపుత్తూరు, మందపల్లెల్లో ఆయన పర్యటించారు. పులపుత్తూరులో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రమంత్రులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. బాధితులను ఆదుకోవాలని ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. తుపాను బాధితులకు సాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పునరావాసం, పరిహారం లాంటి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఇంత విపత్తు జరిగినా కేంద్ర మంత్రులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అనంతరం నేతలు అన్నమయ్య డ్యామ్‌ను పరిశీలించారు. వరద పీడిత ప్రాంతాల్లో సీపీఐ తరఫున బాధితులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కాగా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తమైంది. -
అభిమానిని వియ్యంకుడిని చేసుకున్న ‘సిరివెన్నెల’
Nanduri Ramakrishna Remembers His Relation With Sirivennela Seetharama Sastry: విశాఖకు చెందిన సాహితీవేత్త నండూరి రామకృష్ణతో సిరివెన్నెలకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహబంధాన్ని కుటుంబ బంధంగా మార్చుకున్నారు. తన కుమార్తె లలితా దేవిని నండూరి రామకృష్ణ తనయుడు వెంకట సాయిప్రసాద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 2001 మే 8న విశాఖలో ఈ వివాహం జరిగింది. ప్రస్తుతం అల్లుడు, కూతురు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. విశాఖ వెళ్లిన ప్రతిసారీ వియ్యంకుడు రామకృష్ణతో పాటు విశాఖలోని పలువురి స్నేహితులతో కాలక్షేపం చేసేవారు ‘సిరివెన్నెల’. అభిమాని నుంచి వియ్యంకుడిగా..‘సిరివెన్నెల’తో తన అనుబంధం గురించి నండూరి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘నాకు 1977 నుంచి సీతారామశాస్త్రితో సాన్నిహిత్యం ఉంది. ఆయన రచనలపై అభిమానంతో 1977లో ఆయన్ని తొలిసారి చెన్నైలో కలిశాను. ఆయన్ని కలిసేందుకు చెన్నై వచ్చానని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు. 1995లో ‘గాయం’ సినిమా రివ్యూ సమయంలో ఆయన ఏయూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సిరివెన్నెలతో పాటు వెన్నెలకంటి, వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు నాకు సాహిత్యంలో ప్రవేశం ఉండటంతో ఆ తరువాత అనేక సాహిత్య సమావేశాల్లో ఆయనతో స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం దక్కింది. 2001కి ముందు జరిగిన నా కుమారుడు నండూరి సాయిప్రసాద్ ఒడుగు ఫంక్షన్‌కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా మా కుమారుడుకి ఆయన కూతురు లలితా దేవితో వివాహం జరిగింది. దీంతో ఆయన అభిమాని అయిన నేను వియ్యంకుడయ్యాను. సీతారామశాస్త్రి విలువలు కలిగిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో ఏనాడూ చోటు లేదు. ఇలాంటి మనిషిని కోల్పోవడం మా కుటుంబానికే కాదు సమాజానికీ తీరని లోటు’’ అన్నారు. చదవండి: ఓకే గూగుల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్.. గూగుల్ నివాళి -
పవన్.. నువ్వు ఎటువైపు?
అల్లిపురం (విశాఖ దక్షిణం): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు మద్దతిస్తారా, లేదంటే బీజేపీకి మద్దతిస్తారో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని చూసి పార్టీ పెట్టా, పోరాడుతా అని చెప్పే పవన్ కళ్యాణ్.. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని, విశాఖలో జరుగుతున్న ఉక్కు పోరాటాన్ని పట్టించుకోకుండా బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి ఏ విధంగా మద్దతిస్తారో చెప్పాలన్నారు. బద్వేలులో జనసేన పోటీ చేయబోదని చెప్పి.. బీజేపీకి మద్దతివ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్‌లైన్‌లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్లైన్ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి.. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్ చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్ చేయించే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) చట్టం–1983లోని సెక్షన్ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది. అందరికీ అందుబాటులో సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్‌కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్లైన్ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. విద్యార్థుల మేలుకే ఆన్లైన్ సేవలు గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్‌టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్లైన్లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి టీసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టీడీపీ భజన మనకెందుకు?.. రామకృష్ణకు క్లాస్!
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని.. ఆయన ప్రభుత్వాన్ని మనం చీటికిమాటికి ఎందుకు విమర్శించాలి? మీరు అలా చేస్తుండడంవల్ల సీపీఐ వాళ్లేదో టీడీపీతో, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కైనట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇది మంచిది కాదు.. ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేం వినలేకుండా ఉన్నాం’.. అని ఆ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు క్లాస్ పీకారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత ఆదివారం విజయవాడలో తొలిసారి భౌతికంగా జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరిగింది. పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ కే నారాయణ సమక్షంలోనే రామకృష్ణపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపించారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా.. కార్పొరేట్లకు వంత పాడుతూ, బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు. జగన్ సర్కార్‌ను విమర్శించాల్సిన పనిలేదు ‘వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత ప్రజాదరణతో అధికారాన్ని చేపట్టింది. వస్తూనే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను తూచా తప్పకుండా అమలుచేస్తోంది. దీన్ని ప్రజలూ స్వాగతిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. అటువంటి వాటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరంలేదు. లోపాలు ఎత్తిచూపడం వేరు, జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరు’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు మండిపడ్డారు. దీంతో మరికొంతమంది నాయకులు కూడా ప్రజా మద్దతున్న ప్రభుత్వాన్నీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పనిలేదన్నారు. ఈ మేరకు కార్యదర్శి నివేదికలో పేర్కొన్న పలు అంశాలను మార్చాలని పట్టుబట్టి మార్పించారు. వైఎస్ జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని, ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితవు చెప్పారు. ఈ వ్యవహారంలో సీపీఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు దారుణాలను మర్చిపోవద్దు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బడుగువర్గాలపట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మరచిపోకూడదని కూడా ఆ నేతలు సలహా ఇచ్చారు. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవు. టీడీపీ, వైఎస్సార్సీపీతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందాం. సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిద్దాం. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషిచేద్దాం. పార్టీ రాష్ట్ర మహాసభలకు శ్రేణులను సిద్ధంచేసేలా కింది నుంచి పార్టీ శాఖలను నిర్మించుకుందాం. దానిపై దృష్టిసారించాలి’.. అని పార్టీ నేతలు రాష్ట్ర కార్యదర్శికి సూచించారు. దీనిపై రామకృష్ణ వివరణ ఇస్తూ.. పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని, జగన్ తనకేమీ శత్రువు కాదని చెప్పారు. పార్టీ నాయకత్వం సూచించిన తీరులో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తున్నట్లు సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఈ దశలో నారాయణ ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించినా రామకృష్ణపై విమర్శల దాడి ఆగలేదు. -
రామకృష్ణ బెయిల్ పిటిషన్ వాయిదా
సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి సంకు రామకృష్ణ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. ఒక దశలో ఈ పిటిషన్‌ను కొట్టేసేందుకు సిద్ధపడ్డ హైకోర్టు.. రామకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కొన్ని తీర్పులను కోర్టు ముందుంచేందుకు గడువు కోరడంతో విచారణను వాయిదా వేసింది. ఆయన మరికొన్ని రోజులు జైల్లో ఉండటమే మేలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న రామకృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడిగా, కంసుడిగా అభివర్ణిస్తూ తల నరకాలని పిలుపునిచ్చారు. సీఎంను అంతం చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో రామకృష్ణపై అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్ కోసం గత నెలలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు వాదనలు విన్నారు. రామకృష్ణ తరఫున దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై పెట్టిన రాజద్రోహం కేసు చెల్లదన్నారు. తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపిస్తూ.. న్యాయాధికారి అయిన రామకృష్ణ సస్పెన్షన్‌లో ఉన్నారన్నారు. ప్రభుత్వోద్యోగి అయి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇలా ఇప్పటికే పలుమార్లు చర్చల్లో పాల్గొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. న్యాయాధికారిగా ఉంటూ టీవీ చర్చల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ రామకృష్ణ మరిన్ని రోజులు జైల్లో ఉండటమే మేలని వ్యాఖ్యానించారు. -
Actor Sai Kiran: నేను భయపడుతుంటే, కూల్‌గా ఎలా ఉన్నారు?
శారదా నను చేరగా.. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు.. ఎదగడానికెందుకురా తొందరా... శివ శివ శంకర భక్తవశంకర... ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు.. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా... పాండురంగ నామం.. వినరా వినరా.. విలక్షణ గాత్రం.. వైవిధ్యమైన భావం... ఎన్నో పాటలకు తన గళంలో ప్రాణం పోశారు.. సినీ గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు వి. రామకృష్ణదాసు.. ‘ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలకు ఎంతో సహకరించారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు కుమారుడు సాయి కిరణ్... కళలకు పుట్టినిల్లయిన విజయనగరంలో పుట్టారు నాన్న. తండ్రి రంగసాయి, తల్లి రత్నం. పది మంది సంతానంలో నాన్న ఇంటి పెద్ద. ఇంట్లో నాన్నను దాసు అని పిలిచేవారు. అన్నదమ్ములను జాగ్రత్తగా చూసుకోవటం, చెల్లెళ్లకు జడలు వేయటం, ఇంటి పనుల్లో సహాయం చేయటం.. ప్రయోజకుడైన పెద్ద కొడుకులా ఉండేవారట. తాతగారి కంటె నాన్నను బాగా చూసేవారట. అన్ని విషయాల్లోనూ అమ్మకు సహాయంగా ఉండేవారట. అలా మొదలైంది... స్కూల్లో చదువుకునే రోజుల్లో బాగా పాడే వారట. ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణ రావు నాన్న పాటలు విని, ‘సినిమాల్లో పాడొచ్చుగా’ అన్నారట. నాన్న మాత్రం చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఎస్.సి వరకు చదువుకున్నారట. ప్రభుత్వం వారి కుటుంబ నియంత్రణ ప్రకటన కోసం పాడిన పాట విన్న అక్కినేని, నాన్న గురించి సమాచారం సేకరించారట. ‘విచిత్ర బంధం’లో పాడే అవకాశం వచ్చింది. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో ‘భక్త తుకారాం’ చిత్రంలో మంచి పాటలు పాడారు. హుందాగా ఉండేవారు.. నాన్నది ప్రేమ వివాహం. ఆయన మ్యూజిక్ షోస్‌కి వెళ్లేవారు. అప్పుడే అమ్మ జ్యోతి కూడా అదే ఆర్కెస్ట్రాలో పాడేవారు. వాళ్ల పెయిర్ బాగా హిట్ అయ్యింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది, వివాహం అయింది. రెండు కుటుంబాల అంగీకరిం చటానికి కొంత కాలం పట్టింది. నాన్నకు నేను, చెల్లాయి లేఖ ఇద్దరం పిల్లలం. ఎప్పుడూ తిట్టడం కూడా తెలియదు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గురించి చెప్పేవారు. మా చదువు విషయంలో నాన్న చాలా పర్టిక్యులర్‌గా ఉండేవారు. నేను పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజున ‘హీరో అవుతాను’ అంటే, బాగా కేకలేశారు. ఒకసారి పని మీద రజనీకాంత్ గారి దగ్గరకు వెళితే, ఆయన నాన్నతో, ‘మీ అబ్బాయి నటుడా’ అని అడిగారు. నాన్న మౌనంగా వచ్చేశారు. ‘నేను నటుడిని అవ్వాలనుకుంటుంటే, మీరే నన్ను ఎదగనివ్వట్లేదు’ అని కోపంగా అన్నాను. ‘నువ్వు డిగ్రీ పూర్తి చెయ్యి. తరవాత చూద్దాం’ అన్నారు నాన్న. హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసి, గోల్డ్ మెడల్ సాధించాను. చెల్లెలు బి.సి.ఏ. చేసి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. డిగ్రీ పూర్తి కాగానే మళ్లీ సినిమాల గురించి అడిగాను. వెంటనే నా ఫోటోలు అందరికీ ఇచ్చారు. మొట్ట మొదటగా ఒక చానెల్‌లోను, ఆ తరవాత వారి బ్యానర్లోను నటించే అవకాశం వచ్చింది. నన్ను తెర మీద చూడగానే నాన్న కళ్లలోని ఆనంద బాష్పాలు ఇప్పటికీ మనసులో పదిలంగా ఉన్నాయి. అందరూ ఎగతాళి చేశారు.. నేను సినిమాలలోకి రావటం చూసి, ‘పిల్లల్ని చెడగొడుతున్నావు’ అని అందరూ నాన్నను మందలిస్తుంటే, ‘నేను తప్పు చేస్తున్నానా’ అని నాన్న బాధపడేవారు. ‘ఒక ఏడాది ప్రయత్నిద్దాం, సక్సెస్ సాధించకపోతే ఉద్యోగంలోకి వెళ్లిపోవాలి’ అన్నారు. అప్పుడు చదువు విలువ తెలిసింది నాకు. జీవితమే అన్నీ నేర్పుతుందని అర్థమైంది. నాన్న చనిపోయాక తల్లిదండ్రుల విలువ తెలిసింది నాకు. లైఫ్ సైన్సెస్ నాన్న పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. పనివారైనా సరే వయసులో పెద్దవారైతే ‘మీరు’ అనాలనేరు. ‘దర్శకుడు వయస్సులో మన కంటె చిన్నవాడైనప్పటికీ, తండ్రి స్థానంలో చూడాలి, కాలి మీద కాలు వేసుకోకూడదు, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదు’ అంటూ చాలా విషయాలు చెప్పారు. రాముడితో పాటు రావణుడు కూడా గొప్పవాడని, కొన్ని చెడ్డ లక్షణాల వల్లే దుర్మార్గుడయ్యాడని చెబుతూంటే, ఆ టీనేజ్‌లో చాలా ఇరిటేటింగ్‌గా ఉండేది. ఇప్పుడు నాలో ఆధ్యాత్మిక ధనం బాగా పెరిగింది. పురాణాలు, కథలు అన్నీ తెలిసినందుకు సంతోషంగా ఉంటోంది. ఈ జీవిత ప్రయాణంలో నాన్న చెప్పిన విషయాలు మెదడులో చేరిపోయాయి. ఎప్పుడైనా తెలియక తప్పు చేస్తే, ‘సారీ చెప్పు’ అని లోపల నుంచి మనసు హెచ్చరిస్తుంది. నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారంటే అందుకు కారణం నాన్న నేర్పిన సత్ప్రవర్తన. నాన్న నన్ను అక్కినేని గారి దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు, ఆయన నాకు ‘అక్కినేని అఆలు’ పుస్తకం ఇస్తూ, ‘ఊబిలోకి దిగుతున్నావు, జాగ్రత్త!’ అని సూచించారు. ఆ తరవాత నాన్న కూడా ‘మానసికంగా బలంగా ఉండాల్సిన రంగంలోకి దిగుతున్నావు. నచ్చితే సింహాసనం మీద కూర్చోపెడతారు లేదంటే తోసేస్తారు’ అని చెప్పారు. సినిమా పరిశ్రమ అంటే ‘మెంటల్ రోలర్ కోస్టర్ మీద రైడ్’ అని అర్థమైంది. మంచి జ్ఞాపకం... బాపు గారు తీసిన ‘వెంకటేశ్వర వైభవం’ లో వెంకటేశ్వరస్వామి పాత్ర పోషించాను. ఒకరోజున బాపుగారిని కలిసినప్పుడు నాన్నతో, ‘పురాణ పాత్రలకు ప్రసిద్ధులైన ఎన్టిఆర్ లాంటి కుమారుడిని కని ఇచ్చావు, థాంక్స్ రామకృష్ణా’ అన్నారట. ‘ప్రేమించు’ సినిమాలో నటిస్తున్నప్పుడు బాలు గారు, నాన్నకు ఫోన్ చేసి, ‘నీ కొడుకు హీరోగా నటిస్తున్న సినిమాలో నేను పాడుతున్నాను’ అని చెప్పారట. ఈ రెండు సంఘటనలూ నాన్న ఎంతో ఆనందంగా నాకు చెప్పారు. నా అదృష్టం.. ‘శ్రీశ్రీశ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’ పాటల రికార్డింగ్‌కి వెళ్లాను. ఎన్టీఆర్ నన్ను చూస్తూనే, ‘దానవీరశూరకర్ణ సినిమా సమయంలో పుట్టినవాడేనా’ అన్నారు. ఆ సినిమా పాటల రికార్డింగ్ సమయంలో నాన్న చాలా టెన్షన్‌గా ఉన్నారట. ఇంతలో ‘అబ్బాయి పుట్టాడు’ అని ఫోన్ వచ్చిందట. వెంటనే ఎన్టిఆర్ అందరికీ స్వీట్స్ పంచారట. అలా ఆయన నా గురించి గుర్తు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ నటించిన రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, శివుడు.. పాత్రలు నేను కూడా చేయడం యాదృచ్ఛికం కావొచ్చు. ఎన్నటికీ మరచిపోలేను... ‘డార్లింగ్ డార్లింగ్’ సినిమా క్లైమాక్స్ సీన్ రాజమండ్రిలో వేసవి కాలంలో జరిగింది. నాతో పాటు నాన్నను తీసుకువెళ్లాను. షూటింగ్ అయిపోయాక మరో రెండు రోజులుండి, పడవ మీద నాన్నను లంక గ్రామాలలోకి తీసుకువెళ్లాను. గోదావరి స్నానం చేశాం. మరోసారి వీరబ్రహ్మంద్రస్వామి మఠానికి వెళ్లాం. ఆయన సమాధి అయిన చోట నమస్కరిస్తుండగా, నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను అక్కడకు తీసుకు వెళ్లినందుకు సంతోషించారు. ఒకసారి హైదరాబాద్ నుంచి వైజాగ్ ప్రయాణి స్తున్నాం. రాత్రి 10.30 ప్రాంతంలో ‘ఈరోజు మహాలయ అమావాస్య కదా, శివుడిని దర్శించుకోవాలి’ అన్నారు నాన్న. మహాలయ అమావాస్యనాడు శివుడు శ్మశానంలోనే ఉంటాడని అంటారు. ఆ దారిలో ముందుకి వెళితే శ్మశానం వస్తుంది. అక్కడ పెద్ద శివుడి విగ్రహం,వీర భద్రుడు, హరిశ్చంద్రు డి బొమ్మ ఉంటాయి. అక్కడకు రాగానే ‘ఇక్కడికి ఎందుకు’ అన్నారు. ‘నువ్వు గుడికి వెళ్తాను అన్నావు కదా’ అని కొబ్బరికాయ కొట్టించాను. నాన్న భక్తిపారవశ్యంతో ‘భక్త కన్నప్ప’ చిత్రంలోని, ‘జయ జయ మహాదేవ’ పద్యం గట్టిగా చదువుతుంటే, ప్రకృతి ప్రతిధ్వనించింది. అందరికీ శివుడిని చూసిన అనుభూతి కలిగి, ఒళ్లు పులకరించి, కళ్లలో నీళ్లు తిరిగాయి. పరవశించిపోయాం. ఈ సంఘటనలు నా జీవితంలో నేను మర్చిపోలేను. సరదాగా ఉండేవారు.. నాన్న చాలా సర దాగా ఉండేవారు. హోటల్లో బాగా తినేసి, కదలలేని స్థితిలో ‘ఏంట్రా అస్సలు తినలేకపోతున్నాం’ అనేవారు. ‘ఎదగడానికి ఎందుకురా తొందర..’ పాట నన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు పాడేవారు. దేవుడి దయవల్ల నా వృత్తిలో సక్సెస్ అయ్యాను. కోయిలమ్మ సీరియల్లో నటిస్తున్నప్పుడు ‘నాన్న బతికి ఉంటే బావుండేది. చూసి సంతోషపడేవారు’ అనుకున్నాను. నాన్న నేర్పిన జీవిత పాఠాలు నా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికీ నాన్న నా వెంట ఉండి నడిపిస్తున్నట్లే మనసులో భావించుకుంటాను. చాలా కూల్‌గా ఉంటారు.. ఒకసారి నాన్న, నేను కారులో రాయలసీమలో ప్రయాణిస్తుండగా, ఒక చోట ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. గన్ పేలుస్తున్నారు. నాకు భయం వేసింది. నాన్న మాత్రం చాలా ప్రశాంతంగా, కారు పక్క రోడ్డులోకి తిప్పు అన్నారు. ఆ రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఆ రోడ్డులోకి వెళ్లి చూస్తే, దూరం నుంచి వారి గొడవ కనిపించింది. ‘నేను భయపడుతుంటే, నువ్వు అంత కూల్‌గా ఎలా ఉన్నావు’ అని అడిగితే, ‘వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు, మన జోలికి రారు వాళ్లు, నువ్వు టెన్షన్ పడకు’ అన్నారు. ఏం జరుగుతున్నా దేనికీ భయపడరు, తొణకరుబెణకరు. - సంభాషణ: వైజయంతి పురాణపండ ఇక్కడ చదవండి: రేలంగి తన సంపాదనంతా ఆమెకే ఇచ్చేవారు..! 'జయప్రద నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంది' ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
రమణీయం తిరుమల రామకృష్ణ తీర్థం
-
తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించండి
తిరుపతి కల్చరల్: రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న బీజేపీకి త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల నడ్డి విరిచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై బీజేపీని ఓడించాలని కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 22 రాష్ట్రాల్లో 20 వేల కేంద్రాల్లో పోరాటం సాగుతోందన్నారు. 11 సార్లు రైతులను చర్చలకు పిలిచి కాలయాపన చేయడమే కాక ఏడాదిన్నరపాటు చట్టాలను అమలు చేయమంటూ చెప్పడం విడ్డూరమన్నారు. నాడు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన సమయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. నేడు అదే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. లౌకిక భావాలున్న పవన్ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ నుంచి తక్షణం వైదొలగి, రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలవాలన్నారు. -
బాబు, పవన్, రామకృష్ణ ఇళ్లను ముట్టడిస్తాం
తాడికొండ: అభివృద్ధి వికేంద్రీకరణ, పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, రాజధానిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోరుతూ 99 రోజులుగా పేదలు దీక్షలు చేస్తుంటే చంద్రబాబు అండ్ కో భూ కుంభకోణం నిందితులకు సహకరిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఇకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, చంద్రబాబుతో పాటు ఆయన తప్పుడు విధానాలకు వంతపాడుతున్న పవన్ కళ్యాణ్, సీపీఐ రామకృష్ణల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలలో బుధవారం పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఇండియన్ కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన కమిటీ (ఐసీఏపీఎస్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, ఇందుపల్లి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా పోలవరం పరిరక్షణ యాత్ర
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పోలవరం పరిరక్షణ పేరిట రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ఆదివారం సీపీఐ నేతలు చేపట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలోని హోటల్లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు శనివారం రాత్రి నోటీసులు అందించారు. ఈ యాత్రకు అనుమతి లేనందున గృహనిర్బంధం చేస్తున్నామని తెలిపారు. నిర్బంధంలో ఉన్న రామకృష్ణ ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం పరిరక్షణయాత్ర మొదలుపెడితే పోలీసులు గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం ప్రాజెక్టును సందర్శించి తీరతామన్నారు. రామకృష్ణకు మద్దతు తెలపడానికి అక్కడికి వచ్చిన టీడీపీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలవరానికి పట్టిన గ్రహణం అని, రాష్ట్రంలో శకుని పాత్ర పోషిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుకు పైరవీలు చేయడం తప్ప ప్రాజెక్టుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బుద్ధిలేదని, ఇప్పటికే రెండుసార్లు కోర్టు మెట్లు ఎక్కినా ఇంకా జ్ఞానం రాలేదని పేర్కొన్నారు. సీపీఐ నాయకులను విడుదల చేయాలి: చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీపీఐ నాయకుల నిర్బంధాలను ఖండిస్తున్నట్లు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషిద్ధ ప్రాంతమా, పోలవరం వద్దకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్త కృష్ణయ్యయాదవ్పైన, వీరాస్వామియాదవ్పైన కత్తులతో దాడిచేయడాన్ని ఖండిస్తున్నట్లు మరో ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబసభ్యులకు ఆయన ఆదివారం ఫోన్‌చేసి పరామర్శించారు. -
ఆర్థిక ప్యాకేజీ ఎవరికి లాభం..?
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన మూడో విడత ఆర్థిక ప్యాకేజి వల్ల సామాన్య మానవులకు ఎలాంటి ఉపయోగం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల ప్రయోజనం కోసమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని ఆరోపించారు. బీజేపీ ప్రకటనలు, ప్యాకేజీలు బీజేపీ పాలిత రాష్ట్ర లలో సామాన్య ప్రజలకు సైతం ఉపయోగపడవని అన్నారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారికి ఏమి ప్రయోజనం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు వ్యారాలను మోదీ సర్కార్ గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గ్రామీణ పేదలు, వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ఇవ్వాలని కోరారు. శనివారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రామకృష్ణ.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు..
ప్రకృతిలో అన్నీ మహా ప్రవాహాలే ఉండవు. మేరు పర్వతాలే ఉండవు. ఘన కీకారణ్యాలే ఉండవు. ఒక ఝరి కూడా ఉంటుంది. కొంతమందికి అది సౌందర్యాన్ని పంచుతూ ముందుకు వెళ్లిపోతుంది. ఒక పూలు నిండిన మట్టి కొండ ఉంటుంది. అది పరిమళాలు చింది గుర్తుండిపోతుంది. ఒక లేలేత కొమ్మల వనం ఉంటుంది. అది కొన్ని పాటలు పాడి పరవశింప చేస్తుంది. రామకృష్ణ ఝరి. మట్టికొండ. ఆకుపచ్చ వనం. ఆయన పాట మన జీవితాలలో ఒక నిరాడంబరమైన సున్నితమైన స్పర్శను ఇచ్చి వెళ్లింది. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లికూతురు రామకృష్ణ పాడితే ఘంటసాల పాడినట్టు ఉంటుంది. రామకృష్ణ పాడితే రామకృష్ణ పాడినట్టు కూడా ఉంటుంది. పోలిక ఉంది నిజమే కాని పాడే పద్ధతి వేరు. రామకృష్ణ పాటలో ఒక తొలకరి గుణం ఉంటుంది. అప్పుడే మీసకట్టు వచ్చిన ఒక కుర్రాడి ఉత్సాహం ఉంటుంది. చెంగునదూకే లేగదూడ గంతు ఉంటుంది. వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట... వి.రామకృష్ణ సౌందర్యవంతుడు. నిలువెత్తు అందగాడు. ఆయన మాట, పలుకు కూడా అంతే అందంగా ఉంటుంది. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కాలేజీలో మైక్ ముందు రామకృష్ణ పాడితేనే కార్యక్రమం మొదలయ్యేది. మరి పాట ఎలా వచ్చు? గాయని సుశీల ఆయన పినతల్లి. విజయనగరంలో బాల్యంలో ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. చెవిన వొరుసుకుని వెళ్లే స్వరాలు కంఠంలోకి వచ్చి చేరాయి. గొంతు విప్పితే ఎదుటివాళ్లకి ఒక ఆకర్షణ కలిగేది. ఆ ఆకర్షణే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ తెచ్చింది. నా పక్కన చోటున్నది ఒక్కరికి ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే... ఏదో డాక్యుమెంటరీ కోసం సినిమా వాళ్లను ఎఫర్డ్ చేయలేరు కాబట్టి కాలేజీ కుర్రవాడైన రామకృష్ణ చేత పాడించారు. సారథి స్టూడియోలో ఆ పాట విన్న అక్కినేని ఆశ్చర్యపోయారు. ఇదేమిటి.. అచ్చు ఘంటసాల లాగే ఉంది అని. నిజానికి సినిమా సంగీత ప్రపంచం అప్పుడు కొత్త గాయకుడి అన్వేషణలో ఉంది. అప్పటికే ఘంటసాల గారి ఆరోగ్యం నెమ్మదించడం వల్ల ఎక్కువ పాటలు పాడలేకపోతున్నారు. కొత్త గాయకుడు అవసరం. అలవాటైన ఘంటసాల ధోరణిలోనే పాడే రామకృష్ణ ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అక్కినేని పిలిచి ‘విచిత్ర కుటుంబం’ (1972)లో రెండు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాటలు హిట్. అదే సమయంలో దాసరి తొలి సినిమా ‘తాతా మనవడు’ (1972) కూడా సిద్ధమవుతూ ఉంది. చిన్న సినిమా కాబట్టి బడ్జెట్‌కు తగినట్టుగా కొత్త సింగర్ రామకృష్ణకు అవకాశం వచ్చింది. సి. నారాయణరెడ్డి రాసిన పాట రామకృష్ణ గొంతులో గొప్ప వైరాగ్యాన్ని పలికింది. అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఈ పాటలు పాడాక రామకృష్ణ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. అయితే తతిమా జీవితకాల భోజనం ఆయనకు చెన్నైలో రాసి పెట్టి ఉంటే ఆపేదెవరు. రామకృష్ణ పాడిన పాటలు శోభన్‌బాబు చెవిన పడ్డాయి. నాకు ఈ గాయకుడే పాడాలి పిలిపించండి అన్నారు. కె.విశ్వనాథ్ ‘శారద’ సినిమా కోసం రామకృష్ణ మళ్లీ చెన్నై రైలు ఎక్కారు. దాదాపు 30 సంవత్సరాలు గాయకుడిగా అక్కడే ఉండిపోయారు. ‘శారద’ పాట అలా రామకృష్ణను నిలబెట్టింది. శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేతబుగ్గా ఓ శారదా నీరదా శారదా... ఘంటసాల స్థానంలో ఆ వెలితి తీర్చే గాయకుడు వచ్చాడని అందరికీ అర్థమైపోయింది. అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీరందరికీ రామకృష్ణ ముఖ్యగాయకుడుగా నిలిచారు. అక్కినేనికి ‘భక్త తుకారాం’లో పాడిన ‘శ్యామసుందర ప్రేమమందిర’, ‘పాండురంగ నామం’ పాటలు ఊళ్లల్లో గుళ్ల దగ్గర మోగడం మొదలెట్టాయి. ‘అందాలరాముడు’లోని ‘ఎదగడానికెందుకురా తొందర’ పాట రేడియోలో పదేపదే వినిపించసాగింది. ‘పల్లెటూరి బావ’లోని ‘ఒసే వయ్యారి రంగి’ రిక్షా లాగేవాళ్ల ఫేవరెట్. ‘మహాకవి క్షేత్రయ్య’లో ‘జాబిల్లి చూసింది నిన్ను నన్ను’ రొమాంటిక్ హిట్. ఇటు ఈ పాటలు ఉంటే శోభన్‌బాబుకు వరుస హిట్స్ పడ్డాయి. ‘జీవితం’లో ‘ఇక్కడే కలుసుకున్నాము’, ‘ఇదాలోకం’లో ‘నీ మనసు నా మనసు ఏకమై’, ‘చక్రవాకం’లో ‘ఈ నదిలా నా హృదయం ఉరకలు వేస్తోంది’... ఇక వీటన్నింటికీ మకుటంగా ‘కన్నవారి కలలు’ సినిమాలో శోభన్‌బాబుకు రామకృష్ణ పాడిన ప్రతి పాటా హిట్టే. మధువొలకబోసే నీ చిలిపి కళ్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు కృష్ణంరాజుకు రామకృష్ణ విలువైన పాటలు పాడారు. ‘కృష్ణవేణి’లో ‘కృష్ణవేణి తెలుగింటి విరబోణి’, ‘అమర దీపం’లో ‘నా జీవన సంధ్యాసమయంలో’, ‘భక్త కన్నప్ప’లో ‘ఆకాశం దించాలా’, ‘శివశివ శంకర’, ‘ఎన్నియలో ఎన్నియలో చందామామా’.... ఇవన్నీ శ్రోతలకు ప్రీతికరమైన పాటలయ్యాయి. కృష్ణకు రామకృష్ణ దాదాపుగా పాడలేదు కాని ‘అల్లూరి సీతారామరాజు’లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమాలోని ‘తెలుగువీర లేవరా’ పాటను ఘంటసాల పాడారు. అయితే కొన్ని చరణాలు అనారోగ్య కారణాల రీత్యా పాడలేదు. ఆయనే రామకృష్ణ చేత పాడించుకోండి అని చెప్పారు. రామకృష్ణ పాడిన ఆ చరణాలు పాటలో అందంగా కలిసిపోయాయి. ఇప్పటికీ చాలామంది ఆ పాటను ఘంటసాల ఒక్కరే పాడారనుకుంటారు. 1980ల నాటికి తెలుగునాట బాలసుబ్రహ్మణ్యం ప్రభంజనం మొదలైపోయింది. కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడటానికే రామకృష్ణ పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఘంటసాల తర్వాత తెలుగు పద్యం రామకృష్ణ బాగా పాడతారనే పేరు తెచ్చుకున్నారు. ‘దానవీర శూరకర్ణ’లో పద్యాల కోసం అనేక మందిని ఎన్.టి.ఆర్ ప్రయత్నించి రామకృష్ణే ది బెస్ట్ అని నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మంగారి చరిత్ర’లో ఎన్.టి.ఆర్కు అన్ని పాటలు రామకృష్ణే పాడారు. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుపోదురా కాలజ్ఞానం కల్ల కాదురా... రామకృష్ణ సినిమాలలో కనిపించకపోయినా వేలాది కచ్చేరీల ద్వారా శ్రోతలకు చేరువయ్యారు. దేశ విదేశాలలో ఆయన అసంఖ్యాక కచ్చేరీలు చేశారు. ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక కూడా పాటను కొనసాగిస్తూనే వచ్చారు. ప్రకృతి ఎప్పుడూ ఏకరూపం కాదు. బహువిధమైన ఆస్వాదన ఉండాలి అనిపించినప్పుడు రామకృష్ణ పాట ఒక భిన్నమైన ఆస్వాదనను ఇస్తుంది. ఆయన పాట ఒకనాటితో మర్చిపోయేది కాదు. ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు – సాక్షి ఫ్యామిలీ -
‘ఒత్తిడి చేస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : స్టడీ మెటీరియల్స్, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ ఇంటర్ కాలేజీ యాజమాన్యాలపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు,లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మొయిల్ ద్వారా లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒత్తిడి చేసే కాలేజీలపై ourbiep@gmail.comకు ఈమెయిల్ ద్వారా, 9393282578 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది. -
మాజీ విప్ ‘కూన’పై కేసు నమోదు
పొందూరు/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని టీడీపీ నేత కూన రవికుమార్ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. స్పందించిన పోలీసులు రవికుమార్ కోసం ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళంలలో సోమవారం వెదుకులాట ప్రారంభించారు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కూన రవికుమార్‌తోపాటు అతని సోదరుడు కూన వెంకటసత్యారావు, అచ్చిపోలవలస మాజీ సర్పంచ్ గురుగుబెల్లి జగన్నాథం, కాంట్రాక్టర్ చంద్రారెడ్డి, కాంట్రాక్టర్ అసిస్టెంట్ల మీద ఐపీసీ సెక్షన్ 353, 506 కింద కేసు నమోదు చేసినట్టు జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. తక్షణం అరెస్టు చేయాలి: ఉద్యోగ సంఘాలు విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు రామకృష్ణను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీజ్ చేసిన పొక్లెయిన్లు, టిప్పర్లను తక్షణమే వదిలేయాలంటూ మాజీ విప్ కూడా అయిన రవికుమార్ బెదిరించడం దారుణమన్నారు. ‘కూన రవికుమార్ ఇలా బెదిరింపులకు దిగడం, అధికారులను దుర్భాషలాడటం కొత్తకాదు. ఆయన వ్యవహార శైలి అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది. అందువల్ల ఆయన గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని అరెస్టు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు పాల్పడకుండా కూన రవికుమార్‌పై పీడీ చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి, వి.గిరికుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కరోనా యోధుడు.. ఈ రాముడు
న్యూఢిల్లీ/లక్నో: కరోనా మహమ్మారిపై ఒక్కొక్కరు ఒక్కో రీతితో యుద్ధం చేస్తున్నారు.. రామకృష్ణ అనే యువకుడు కూడా అదే కోవలోకి చెందుతారు.. కరోనాపై పోరాడేందుకు రావాల్సిందిగా పిలుపు రాగానే వెంటనే అన్నీ వదిలేసి వెంటనే 1,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇందుకోసం హైదరాబాద్ వెళతానని తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన రామకృష్ణ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో ఆరు నెలల కిందే పీహెచ్డీ పూర్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయాల్సిందిగా తన డిపార్ట్ మెంట్ హెడ్ అమితా జైన్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తున్నారు. ఆ వెంటనే తన బ్యాగ్ సర్దుకుని లక్నోకు బయల్దేరారు. ఈ విషయం చెబితే తల్లిదండ్రులు భయపడతారేమోనని.. హైదరాబాద్ లోని తన స్నేహితుల రూంలో ఉండి థీసిస్ రాసుకుంటానని చెప్పాడు. అయితే కరోనా భయంతో హైదరాబాద్ కూడా వెళ్లేందుకు నిరాకరించారు. కానీ ఎలాగోలా వారిని ఒప్పించి మార్చి 21న బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున లక్నోకు వెళ్లాల్సిన అన్ని దారులు మూసుకుపోవడంతో మరుసటి రోజున ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అయితే పోలీసులు మార్గమధ్యలో ఆపి ప్రశ్నించగా.. ఈ విషయం చెప్పడంతో వారు కూడా ఆయనకు సహకరించారు. దీంతో విమానంలో లక్నోకు వెళ్లి కరోనా పాజిటివ్ కేసులను టెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కరోనాపై యుద్ధానికి రామకృష్ణ చేస్తున్న కృషి గురించి కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. -
‘టీడీపీ నుంచి వారికి డబ్బులు అందుతున్నాయి’
సాక్షి, విజయవాడ: కమ్యూనిస్టు పార్టీలంటే గతంలో గౌరవం ఉండేదని.. నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాకా ఆ పార్టీలపై గౌరవం పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదివే బదులు కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మైనార్టీల పక్షపార్టీ, సెక్యులర్ పార్టీ అని అందరికీ తెలుసు. అంజాద్ బాషా మాటకు కట్టుబడి ఉంటామని సీఎం జగన్ బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారని పేర్కొన్నారు. రామకృష్ణ లాంటి వారి మాటలు నమ్మొద్దని మైనార్టీలకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. నారాయణ, రామకృష్ణలకు టీడీపీ నుంచి డబ్బులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిరోజు రామకృష్ణ లోకేష్ బండి ఎక్కుతారని.. డబ్బులు తీసుకుంటారని టీడీపీయే ప్రచారం చేస్తోందన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి, బీజేపీకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూశారు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బీజేపీతో సంబంధాలు నడుపుతున్నది టీడీపీ కాదా..?’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. -
వివక్ష చూపలేదు
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ ముదిరాజ్ అనే యువకుడికి దివ్యాంగుల కోటాలో చాలినంత అర్హత లేనందునే టీఆర్టీకి ఎంపిక చేయలేదని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డి పల్లికి చెందిన రామకృష్ణ టీఆర్టీ–2017లో ఉత్తీర్ణత చెందినప్పటికీ ఉద్యోగావకాశం రాలేదంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, కమిషన్ కచ్చితంగా నియమ, నిబంధనలకు లోబడి వ్యవహరిస్తుందే తప్ప ఎవరి పట్ల వివక్ష చూపబోదని స్పష్టంచేశారు. సరోజినీ కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లో ఆయనకు వైకల్యం 30 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించిందని, కనీసం 40 శాతం ఉండాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు ఆయనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. రాత పరీక్షలో అతడికి 53.209 మార్కులు వచ్చినా కంటిచూపులో 40 శాతం కంటే తక్కువగా వైకల్యం (30 శాతమే ఉందని) ఉందని మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక మేరకు తిరస్కరించినట్లు వెల్లడించారు. అంతేతప్ప అర్హత ఉన్నా ఉద్యోగావకాశం కల్పించలేదన్న సదరు అభ్యర్థి ఆరోపణలో నిజం లేదన్నారు. ఈ విషయమై సదరు అభ్యర్థి కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించినపుడు కూడా అక్కడున్న సిబ్బంది అతనికి అన్ని వాస్తవాలను వివరించారని, తనకు టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించలేదని ఆ అభ్యర్థి పేర్కొనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు. -
చంద్రబాబుతో కలిసి తిరగడం ఏంటి?
సాక్షి, అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీరుపై ఆ పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. సాక్షాత్తూ పార్టీ కార్యదర్శివర్గ సభ్యులే ఆయన వైఖరిని తప్పుపడుతున్నారు. కార్యవర్గం చేసిన తీర్మానాలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటని ఆక్షేపించారు. వామపక్షాల ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమదూరం పాటించాలన్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఇటీవల జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో నేతలు తప్పుపట్టారు. రామకృష్ణ ఇటీవల చంద్రబాబుతో కలిసి జోలెపట్టి ఊరూరా తిరగడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడొకరు బాహాటంగానే విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు సై అంటూనే చంద్రబాబు పన్నిన ఉచ్చులో ఇరుక్కోవడం ఏమిటని నిలదీశారు. పార్టీపరంగా ఆందోళన చేయాలనుకుంటే మిగతా వామపక్షాలతో కలిసి వెళ్లాలేగానీ, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న టీడీపీతో కాదని తేల్చిచెప్పారు. పలు జిల్లాల కార్యవర్గాలు సైతం రామకృష్ణ తీరుపై మండిపడ్డాయి. రామకృష్ణ ఏ వర్గ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారో చెప్పాలని సీపీఐ నేతలు ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణతో తమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నాయకులు తెగేసి చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో జత కట్టి, ఎన్నో కొన్ని సీట్లు రాబట్టాలన్న తాపత్రయంతో తమ నాయకుడు రామకృష్ణ చంద్రబాబుతో సత్సంబంధాలు నెరుపుతున్నట్టు సీపీఐ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదన్న సాకుతో చంద్రబాబు గతంలో అఖిలపక్ష సమావేశానికి సీపీఐని ఆహ్వానించలేదని గుర్తుచేశారు. బాబుతో చెలిమి వల్ల తమ పార్టీకి వీసమెత్తు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రామకృష్ణ చొరవతో గతంలో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుని చేతులు కాల్చుకున్న వైనాన్ని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. రాజధాని వ్యవహారంలో చంద్రబాబుది కపట నాటకమని ఓ పక్క చెబుతూనే మళ్లీ ఆయనతో కలిసి ఉద్యమమేమిటని మిగతా వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. -
మా నాన్న తొలి కృష్ణుడు
ఈలపాట రఘురామయ్య అంటే తెలుగువారి మొదటి కృష్ణుడు. ఆయన అసలు పేరు కల్యాణం వెంకట సుబ్బయ్య. ఈలపాటలో ప్రావీణ్యం వల్ల ఈలపాట రఘురామయ్య అయ్యాడు. పద్యాలకు పాటలకు స్టార్డమ్ తెచ్చాడు. ఆయన పాడిన రామనీల మేఘశ్యామా కోదండ రామా గీతం నేటికీ తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తూనే ఉంది. రఘురామయ్యఐదుగురు సంతానంలో ఒకరైన కల్యాణం రామకృష్ణ తన తండ్రిని స్మరించుకున్నారు. నాన్నగారికి మేము మొత్తం ఐదుమంది సంతానం. పెద్దావిడ రూపాదేవి నటిగా మీకు తెలుసు (ఋతురాగాలు ఫేమ్). పెద్దన్నయ్య సంపత్ బిజినెస్ చేస్తున్నారు. నేను రెండో అబ్బాయిని. తమ్ముడు శ్రీధర్ ఆస్తులు చూసుకుంటాడు. చెల్లెలు ఆండాళ్ తల్లి ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు తన ఎనిమిదవ ఏటే రంగస్థలం మీద గళం విప్పి అందరిచేత మంచి నటుడు అనిపించుకున్నారు. అమ్మ ఆదోని లక్ష్మీదేవి కూడా నాటకాలు వేసేవారు. వారిద్దరూ వ్యత్తిరీత్యా దగ్గరయ్యారు. వివాహం చేసుకున్నారు. వి.వి.గిరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో అమ్మనాన్న కలిసి తులాభారం నాటకం ప్రదర్శించారు. రామా అంటే పలికేవాడిని.. నాన్నగారికి చిన్నప్పటి నుంచి రాముడు, కృష్ణుడు అంటే ఇష్టం. ఎప్పుడు గొంతు సవరించాలన్నా ‘రామా’ అనేవారు. నన్ను పిలిచారనుకుని పరుగెత్తుకు వచ్చేవాడిని. నన్ను ఎత్తుకుని ‘నిన్ను కాదురా... ఆ రాముడిని పిలిచాను’ అనేవారు. నాన్నగారికి నాటకాల మీద ఉండే ప్రీతి కారణంగాను, ప్రజల నుంచి ఆయనకు వచ్చిన ఆదరణ కారణంగాను, ఆయన కుటుంబంతో గడిపింది తక్కువే. ఆఖరిక్షణం వరకు నాటకాలు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితంలో వేలాది నాటకాలు ప్రదర్శించారు. పద్యాలతో పాటు ఈలపాట కూడా పాడేవారు. కాలం చేసే ముందు నాకు సంగీతం నేర్పించాలనుకుని మాస్టర్ని పెట్టారు. అంతలోనే అంటే 1975లో నాన్నగారు గతించారు. ఆరోగ్య యోగా... ఆయన ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ఏ షూటింగులూ లేనప్పుడు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు వ్యాయామం, యోగా, ఆసనాలు క్రమం తప్పకుండా చేసేవారు. ఏ రాగాన్నయినా రెండు నిమిషాల పాటు గిరికీలు కొట్టించే శక్తి కలగడానికి కారణం వ్యాయామమే అని చెప్పేవారు. వేదికల మీద నాటక ప్రదర్శన పూర్తయ్యాక ‘నా వయసు చెప్పండి’ అని అడిగేవారట. అందరూ 50 అంటూంటే అదే తనకి పెద్ద కిక్ అని చెప్పేవారు. అప్పటికి నాన్న 60లు దాటేశారు. చెన్నైలో ఒక ఆయుర్వేద వైద్యుడిచ్చిన లేహ్యం సేవించేవారు. ఒళ్లంతా నూనె పట్టించుకుని రోజుకి గంటసేపు స్నానం చేసేవారు. నటించాలనుకున్నాను కానీ... నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక బలంగా ఉండేది. నాన్నగారికి మాత్రం నన్ను పోలీసు ఆఫీసరుని చేయాలని ఉండేది.‘నేను ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మళ్లీ నా పిల్లలు పరిశ్రమలోకి ఎందుకు?’ అనుకున్నారు. అందుకే నన్ను ఈ రంగంలోకి రానివ్వలేదు. నాకు పాతికేళ్లు వచ్చేనాటికి హైదరాబాద్ దూరదర్శన్‌లో క్యాజువల్ అనౌన్సర్‌గా చేరాను. ఆ తరవాత న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. తెర మీద కనపడాలనే నా చిన్ననాటి కోరిక ఆలస్యంగా అయినా తీరినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం యాడ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. దేవుడిచ్చిన వరం... నాన్న పెద్దగా సంగీతం నేర్చుకోకపోయినా దేవుడు ఇచ్చిన వరం వల్ల గొప్ప కళాకారుడు కాగలిగారు. కొన్ని కారణాల వల్ల ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ చిత్రంలో ఆంజనేయుడి పాత్ర మరొకరిని వరించింది. ఆ చిత్రం కోసం నాన్న పాడిన పాటలు, పద్యాలు చిరస్మరణీయంగా నిలిచాయి. తెలుగు పాటలను, పద్యాలను హిందుస్థానీ బాణీలో పాడే ఏకైక తెలుగు వ్యక్తి నాన్నగారు. బాలగంధర్వ శతజయంతికి అన్ని రాష్ట్రాల నుంచి ఆ బాణీలో పాడుతున్నవారిని సత్కరించారట. నాన్నగారి కోసం మా ఇంటికీ వచ్చారు. నాన్న గతించారని తెలిసి, అమ్మలోనే నాన్నను దర్శించుకుని సత్కరించారని అమ్మ చెప్పింది. నాన్న గతించి 45 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకీ, నేను ఆయన కుమారుడినని తెలిస్తే చాలు, వయసులో పెద్దవారు సైతం నాకు పాదాభివందనం చేయబోతుంటారు. అంతటి యశో మూర్తి కడుపున పుట్టడం మా అదృష్టం. మాయాబజార్... మాయాబజార్ సినిమానాటì కే నాన్నగారు కృష్ణుడిగా స్థిరపడిపోయారు. అందువల్ల ఈ చిత్రంలో నాన్నగారి బదులు ఎన్‌టిఆర్‌ను తీసుకున్నారు. అప్పటి నుంచి రామారావు కృష్ణుడు, నాన్న నారదుడు అయ్యారు. ఆ తర్వాత నారదుడిగా కాంతారావుగారు ప్రవేశించడంతో నాన్న నెమ్మదిగా సినీ పరిశ్రమను విడిచిపెట్టారు. 1960లలో నాన్నకు శాంతినికేతన్ నుంచి ఆహ్వానం అందటంతో కలకత్తా వెళ్లారట. అక్కడ రవీంద్రనాథ్ టాగూర్ని కలిసినప్పుడు పద్యాలు, పాటలు, ఈలపాట పాడి వినిపించారట. ఆ విశ్వకవి ముచ్చటగా అన్నీ విని, ‘రోజూ కోయిల పాట వినిపించేది. రెండురోజులుగా అది రావట్లేదు. ఈ కోకిల వస్తోందని తెలిసి ఉంటుంది’ అంటూ నాన్నను ‘ఆంధ్ర నైటింగేల్’ అన్నారట. నెహ్రూ సమక్షంలో నాన్నగారు నోటిలో వేళ్లు పెట్టుకుని ఈలపాట పాడటం చూసి, ‘మీ చేతిలో ఏమీ లేదు కదా. ఎలా ఈల వేయగలిగారు?’ అని నెహ్రూ ఆశ్చర్యపోయారట. ఇందిరాగాంధీని కలిసినప్పుడు, ఆవిడ నాన్న వయసు అడిగారట. ‘గతంలో మీ నాన్నగారిని కలిశాను, ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. మీ అబ్బాయిని కూడా కలుస్తాను’ అని చమత్కరించారట. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: శివ మల్లాల ఈ పేరు ఇలా వచ్చింది... నాన్నగారి అసలు పేరు కల్యాణం వెంకట సుబ్బయ్య. ఆయన తన ఎనిమిదో ఏట స్టేజీ ఎక్కారు. చీరాలలో ఒక నాటకంలో రఘురాముడిగా నటిస్తున్నారట. ఆ నాటకానికి హాజరైన ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు స్టేజీమీదకు వెళ్లి నాన్నగారిని దగ్గరకు తీసుకుని, బంగారు గొలుసు మెడలో వేసి, జనసమక్షంలో ‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఈ పాత్రకు ప్రాణం పోశాడు. ఈ రోజు నుంచి ఈ అబ్బాయి సుబ్బయ్య కాదు రఘురామయ్య’ అన్నారట. ఆ రోజు నుంచి నాన్న రఘురామయ్యగా మారిపోయారు. ఒకసారి ఒక కార్యక్రమంలో ఘంటసాలగారిని పాడమని అడిగారట. ఆయన ‘నా పక్కన సముద్రంలాంటి రఘురామయ్యగారు ఉంటే నన్ను పాడమంటారేంటి’ అన్నారట. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో నాన్నపాడిన ‘నా హృది పయనించు శృంగార సమా’ పాట నాకు చాలా ఇష్టం. ఆయన పిల్లలుగా కొంతవరకైనా ఆయన ఋణం తీర్చుకోవాలనుకున్నాం. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో నాన్నగారి విగ్రహం పెట్టించాం. నాన్నగారి జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకొచ్చాను. – కల్యాణం రామకృష్ణ ఈలపాట రఘురామయ్య కుమారుడు -
‘హిందుమత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా’
సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. మతాల మధ్య అంతరం పెంచడానికి చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ గురువారం ధర్నాచౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ధర్నాలో రామకృష్ణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ హిందుమత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తన వైఖరి చూపుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్ఆర్సీ ద్వారా ప్రజల మధ్య విభజన తెచ్చేలా చేస్తున్నారని.. వెంటనే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలకు అండగా దేశవ్యాప్తంగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చటాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ రాజ్యాంగం మీద తలపెట్టిన దాడిని తిప్పి కొడతామని మధు అన్నారు. ఇది హిందు ముస్లింల సమస్య కాదని.. లౌకికవాద సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమిత్ షా ఎందుకు కరెక్టో పవన్ చెప్పాలి!
సాక్షి, విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, బీజేపీ నేతలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు పొగుతున్నారో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా ఎందుకు కరెక్ట్ అనేది పవన్ సమాధానం చెప్పాలని అన్నారు. రాజకీయ విలువలకు తూట్లు పోడిచినందుకు అమిత్ షా కరెక్టా? లేక ఎమ్మేల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కరెక్టా? అని ప్రశ్నించారు. అలాగే ప్రాంతీయ పార్టీల నేతలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అమిత్ షాను చూసి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. వెన్నుముక లేని వ్యక్తులుగా వారు వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పవన్ కల్యాణ్‌కు బీజేపీ నేతలు చెప్పారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడాల్సిందిపోయి పవన్ అమిత్ షాను పొగడటం ఏంటి? అని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న అమిత్ షా కరెక్ట్ అని వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని రామకృష్ణ అన్నారు. -
‘అలాంటి వ్యక్తిని హోంమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజలలో ఉద్రిక్తత, అభద్రతా భావం నెలకొని అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ నాయకులను నిర్భందంతో ఉంచి దేశ విభజన సమయంలో పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం సరికాదన్నారు. హత్య కేసులు ఉన్న అమిత్ షా లాంటి వ్యక్తులకు హోంమంత్రి కేటాయిస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్
సాక్షి, విజయవాడ : కార్మికుల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా పార్టీలు ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...కేశినేని నాని వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేశినేని రాజకీయాల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు గానీ ఎర్రజెండా పోరాటాలు మాత్రం ఉంటాయని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు తీర్చకుండా పార్టీల పేరుతో విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్విటర్లో కమ్యూనిస్టు పార్టీపై ఇలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పోరాడతారని పేర్కొన్నారు. అటువంటి పార్టీలపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. — Kesineni Nani (@kesineni_nani) July 27, 2019 -
‘అనంతపురం లోక్‌సభ ఫలితాలు ప్రకటించవద్దు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సీపీఐ నేత రామకృష్ణ శనివారం లేఖ రాశారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి తన కుమారుడు పవన్ పోటీ చేస్తే.. రూ.50 కోట్లు ఖర్చయింది, ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చామన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, ఈసీ, అనంతపురం, గుంటూరు జిల్లా కలెక్టర్లు ఇప్పటివరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ద్వివేది దృష్టికి తెచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితాలను ప్రకటించరాదని, జేసీ నుంచి సాక్షులకు భద్రత కల్పించాలని రామకృష్ణ తన లేఖలో కోరారు. చదవండి: ఓటుకు రూ. రెండు వేలు ఇచ్చాం : జేసీ కాగా ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేశామని జేసీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పార్టీలు ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈసీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా తాడిపత్రి రిటర్నింగ్ అధికారి.. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారించిన విషయం విదితమే. -
‘అప్పుడు బాంబులు.. ఇప్పుడు డబ్బులు’
సాక్షి, విజయవాడ : తన బాధ్యతను నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో జరగడం లేదని, డబ్బుతో ఎన్నికలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కనీస చర్యలు తీసుకున్న అభ్యర్థుల్లో భయం ఉండేదన్నారు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళి పక్కన పెట్టి క్షిఫణి ప్రయోగంపై మాట్లాడడం దారుణమన్నారు. అమరావతిలో అభివృద్ధి జరిగిందని చెప్పుకున్న చంద్రబాబు.. ఓటుకు డబ్బులు ఎందుకు పంచుతున్నారో చెప్పాలన్నారు. మార్పు కావాలంటే డబ్బు ఇచ్చిన వారికి ఓటెయ్యొద్దని ప్రజలకు సూచించారు. ఇంతకు ముందు ఎన్నికలు అంటే రాయలసీమ తనిఖీలలో బాంబులు దొరికేవని, ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బులు దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల నియమావళి చూడడానికి చాలా కఠినంగా ఉన్నా రాష్టంలో డబ్బు విచ్చల విడిగా పంచుతున్నారని ఆరోపించారు. -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును ఓడించండి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గత ఐదేళ్లు పరిపాలించిన టీడీపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. అవకాశవాదం, పార్టీ ఫిరాయింపులు, భూ పందేరాలు, అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం మారుపేరుగా నిలిచిందని ధ్వజమెత్తింది. ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనూ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటున్న తీరు ఏవగింపు కలిగిస్తోందని మండిపడ్డారు. కాగా సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరీ ఈనెల 25న విజయవాడ రానున్నారని రామకృష్ణ చెప్పారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విజయవాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. -
తినడానికి తిండి లేదు కానీ స్మార్ట్ ఫోనా?
సాక్షి, విజయవాడ : తినడానికి తిండి లేకున్నా.. వాడుకోవడానికి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడిపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరుగురి సభ్యులకు రాజ్యసభ పదవులు ఇచ్చారని, కానీ వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేరన్నారు. అందరూ అగ్రకులస్తులేనని తెలిపారు. కర్నూల్లో కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబును అర్థరాత్రి కలవడం.. అదేంటయ్యా అంటే భోజనానికి అని బుకాయిస్తూ, ప్రాజెక్టుల కోసమని చెబుతారని, కానీ కోట్ల అడిగిని ప్రాజెక్టులు.. రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటని అందరికి తెలుసన్నారు. జనసేన, వామపక్షాలు కలిసి ఎన్నికలకి వెళ్తాయని, సీట్ల సర్దుబాటును త్వరలోనే తేలుస్తామన్నారు. -
మోదీ పర్యటనను అడ్డుకుంటాం
-
పార్టీలన్నీ కలసి పోరాడాలి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలకోసం అన్ని పార్టీలు కలసిపోరాడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. జాతీయస్థాయిలో ఐక్యంగా పోరాడితేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమన్నారు. విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ఉండవల్లి మంగళవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు రావాల్సి ఉందని సూత్రప్రాయంగా లెక్కతేల్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసికట్టుగా పనిచేయాలన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయన్నారు. నాలుగున్నరేళ్లలో కేంద్రమేమీ ఇవ్వలేదన్నారు. నిధుల కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. విభజన హామీల సాధనకోసం సమష్టి పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, బీజేపీ తరఫున ఐవైఆర్ కృష్ణారావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించకుండా నాలుగున్నరేళ్ల విలువైన కాలాన్ని వృథా చేసి ప్రజలను మోసగించిన టీడీపీతో కలసి వేదిక పంచుకోమని చెబుతూ వైఎస్సార్సీపీ ఈ భేటీలో పాల్గొనేందుకు నిరాకరించింది. బీజేపీ పాల్గొంటున్నందుకు నిరసనగా సీపీఎం బహిష్కరించింది. కాగా, ఐవైఆర్ కృష్ణారావు విడిగా మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్లు రావాలని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులు చెప్పగా.. తాను వ్యతిరేకించానన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజెంటేషన్ ఇస్తామన్నారని, అలాగైతే తాము కూడా కేంద్రమిచ్చిన నిధులపై వివరాలిస్తామనడంతో వారు వెనక్కు తగ్గారన్నారు. -
మరోసారి హైదరాబాద్ నవాబులు
రామకృష్ణ (ఆర్కే) స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘హైదరాబాద్ నవాబ్స్ 2’. పదేళ్ల క్రితం వచ్చిన ‘హైదరాబాద్ నవాబ్స్’ చిత్రానికి సీక్వెల్ ఇది. రామకృష్ణ, అజీజ్ నాజన్, కెబి జానీ, సాజిద్ ఖాన్, అలీ రాజా, సూఫీ ఖాన్, ఫరా కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘2006లో వచ్చిన మా ‘హైదరాబాద్ నవాబ్స్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడీ సీక్వెల్ కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. వినోదానికి పెద్ద పీట వేశాం’’ అని రామకృష్ణ అన్నారు. ‘‘పూర్తి హాస్యభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అలీ, అజీజ్ పేర్కొన్నారు. -
‘మోదీ ప్రధానిగా ఉండటం మన దురదృష్టం’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ఉండటం దేశ ప్రజల దురదృష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిమంది రైతులే రుణాలు తీసుకుంటున్నారని మోదీ అనటం బాధాకరమన్నారు. దేశంలోని రైతులు అందరూ రుణాలు తీసుకుంటున్నారని తెలిపారు. రుణమాఫీ చేయకుండా ఉండటానికే మోదీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన, కేంద్ర వైఖరికి నిరసనగా రేపు, ఎల్లుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, మేధావులు విభజన హామీలు అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ కనీసం ఐదేళ్లు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు 15 వందల కోట్ల రూపాయలే ఇచ్చిందని తెలిపారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. రెవెన్యూ లోటు 16వేల కోట్లు ఉందంటే.. కేవలం మూడున్నర వేల కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. -
ఏదైనా సినిమానే
‘‘పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేదు. అన్ని సినిమాలకు ఒకేలా వర్క్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా సినిమానే. ఇప్పటి వరకు దాదాపు 18 సినిమాలకు వర్క్ చేశాం. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడ్డాం. కానీ, ‘రంగస్థలం’ చిత్రం తర్వాత మాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. సినీ నిపుణులు, సెలబ్రిటీలు, ఆడియన్స్ ఇచ్చే ప్రోత్సాహాన్నే నిజమైన అవార్డులుగా భావిస్తాం’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక. వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్యా త్రిపాఠి ముఖ్యతారలుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్’. జాగర్లమూడి క్రిష్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆర్ట్ డైరెక్టర్స్‌గా పనిచేసిన రామకృష్ణ, మోనికా చెప్పిన విశేషాలు... ∙‘అంతరిక్షం’లాంటి సినిమాలు సాంకేతిక నిపుణులకు చాలా చాలెంజింగ్‌గా ఉంటాయి. ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్‌కి తెలుగు డైరెక్టర్స్, నిర్మాతలు ముందుకు రావడం హ్యాపీగా ఉంది. ∙సైన్స్ బేస్డ్ సినిమా కాబట్టి తన వంతు పరిశోధనను పూర్తి చేసిన తర్వాత స్టోరీ బోర్డ్ గురించి సంకల్ప్ మాకు వివరించారు. ఆ తర్వాత మా పరిశోధన మొదలైంది. కానీ, ఫ్లోర్ మీద సెట్ వేసి వర్క్ చేయడానికి ఇది రెగ్యులర్ సినిమా కాదు. అందుకే మేం కూడా లోతుగా రీసెర్చ్ చేశాం. రీసెర్చ్ కోసం ఇస్రోకి అప్లై చేశాం. కుదర్లేదు. స్పేస్ షిప్, శాటిలైట్ లాంచింగ్ స్టేషన్... ఇలా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ∙‘అంతరిక్షం’ సినిమా సెట్ వేయడానికి 45 రోజులు పట్టింది. ఈ సెట్‌ను తొమ్మిది పార్టులుగా చేశాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు కాకుండా మిగిలిన మూడు పార్ట్స్‌ను మా సౌకార్యానికి అనుగుణంగా తీసి వేసేలా ప్రణాళిక వేసుకున్నాం. మూడు నెలలు చాలా కష్టపడ్డాం. మా కెరీర్లో ఈ సినిమా చేసినంత స్పీడ్‌గా వేరే ఏ సినిమా చేయలేదు. నిర్మాతలు బాగా సహకరించారు. మేం వేరే సినిమాల రిఫరెన్స్ తీసుకోం. రీసెర్చ్ చేస్తాం. సినిమాలో మా ఇద్దరి కష్టం సేమ్. ‘ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తున్న నా వైఫ్ మోనికా గ్రేట్’ అన్నారు రామకృష్ణ. ∙ప్రపంచంలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే ఇండియాలో ఉన్న స్పేస్ ఇండస్ట్రీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్స్‌కి తృప్తి అంటూ ఏదీ ఉండదు. ఫైనల్ వరకూ ఏదో ఒకటి చేయాలని తపనపడుతూనే ఉంటారు. కానీ, అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్లో మా పని పూర్తి చేశాం. అది సంతృప్తినిచ్చింది. ∙‘యన్.టి.ఆర్’ సినిమాలో ‘దాన వీర శూర కర్ణ’ సెట్ మేమే వేశాం. ఆ తర్వాత డైరెక్టర్ చేంజ్ అవ్వడం, మా కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయాం. ప్రస్తుతం ‘యాత్ర, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలు చేస్తున్నాం. సుకుమార్ నెక్ట్స్ చిత్రానికి, విజయ్ దేవరకొండ సినిమాకి, హిరణ్య అనే సినిమాలు కమిట్ అయ్యాం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, టైమ్ కుదరడం లేదు. -
చంద్రబాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు : రామకృష్ణ
సాక్షి, ప్రకాశం : బీజేపీ అధికారం చేపట్టిన తరువాత సంఘ్ పరివార్ శక్తులు దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. గోసరంక్షణ పేరుతో 30 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... మైనార్టీలను రెచ్చగొట్టేందుకే ఎన్నికల వేళ బీజేపీ రామజన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. శబరిమలలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుపరచరు గానీ మరిన్ని కొత్త హామీలు ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అలా చెప్పడం నిజంగా సిగ్గుచేటు.. రాష్ట్రంలో ఓ వైపు కరువు విలయతాండవం చేస్తోంటే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం.. ఏపీలో వ్యవసాయం ఆశాజనకంగా ఉందని అమెరికాలో చెప్పడం నిజంగా సిగ్గుచేటని రామకృష్ణ విమర్శించారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ, డబ్బు అనే అహంకార ధోరణితో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కూటమిలో జేడీ, జేపీ, చలసాని శ్రీనివాస్, పవన్, కమ్యూనిస్ట్ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, మేధావులు ఉంటారని పేర్కొన్నారు. ఇక.. మోదీ, కేసీఆర్‌ను గద్దె దించే లక్ష్యంతోనే తెలంగాణలోని కమ్యూనిస్టులు మహాకూటమి నేతలతో చేతులు కలిపారని రామకృష్ణ తెలిపారు. -
‘జనసేనతో కూటమిగా వెళ్తాం’
సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన పనికి మాలినపాలన అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని.. త్వరలో వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తాతో కలిసి ఫ్రంట్‌గా ఏర్పడి ప్రజల్లోకి వెళతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు. రెండు నెలల క్రితం కరువు మండలాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం తరువాత ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. -
‘మోదీ నిర్ణయంతో తీవ్రవాదం పెరిగింది’
సాక్షి, విజయవాడ : పెద్దనోట్ల రద్దు చేసి రెండేళ్లు గడిచినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ విమర్శించారు. 130 కోట్ల మంది భారతీయులను నడిరోడ్డుపై నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తీసుకున్న నోట్ల రద్దు విఫల ప్రయోగంగా వర్ణించారు. బ్లాక్ మనీ, తీవ్రవాదం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశామని మోదీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎలాంటి ఫలితాలు సాధించారో ప్రజలు తెలపాలని ఆయన డిమాండ్. నోట్ల రద్దు తరువాత కశ్మీర్లో తీవ్రవాదం మరింత పెరిందన్నారు. దేశంలో అనేక చోట్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన మండిపడ్డారు. -
జనసేనతో కలిసి వెళ్తాం: రామకృష్ణ
గుంటూరు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గుంటూరులో ఆదివారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఏపీ వ్యాప్తంగా యూనివర్సిటీలలో సభలు పెడతామని, హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అంతిమ పోరాటం చేస్తామని వెల్లడించారు. అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బాబు ఢిల్లీలో ధర్మపోరాటాలు చేయాలి చంద్రబాబు చేసే ధర్మపోరాటాలేవో ఢిల్లీలోనే చేయాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీనేతపై దాడి జరిగితే సీఎం కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. మోదీ కంటే సీనియర్ని అని చెప్పుకునే బాబు పద్ధతి ఇదేనా అని సూటిగా అడిగారు. ఉంటే మేము, లేదా మీరు అనే రాజకీయాలు ఇక నడవవు అని, కొత్త తరం రాజకీయాలు రావాలని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక కూటమిలో ఉంటామని తెలిపారు. ఏపీలో జనసేనతో కలిసి వెళ్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యవాదులు అంతా ఏపీలో మా కూటమికి మద్ధతు పలుకుతున్నారని చెప్పారు. -
‘చంద్రబాబు కనీసం పరామర్శించలేదు’
సాక్షి, కర్నూలు : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై దాడి జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు కరువు జిల్లాల్లో పర్యటించి సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబరు 3వ తేదీన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. -
‘చింతమనేని అరాచకాలు ఎక్కువయ్యాయ్!’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు ఎక్కువయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు! చింతమనేనిని చూసి ఎందుకు భయపడుతున్నారని, చింతమనేనికి చట్టాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చెయ్యాలని, లేకపోతే అమరావతిలో ఆందోళన చేస్తామన్నారు. వారం రోజులకుపైగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అడిగారు. ప్రభుత్వం కార్మికుల సమ్మెలను పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరువు వల్ల రైతులు అప్పులతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 29వ తేదీన అనంతపురంలో కరువుపై కవాతు నిర్వహిస్తామని తెలిపారు. తుఫాన్ వల్ల మరణించిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. నాలుగేళ్లు అయినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు. -
ఛత్తీస్‌ఘడ్‌కే.. ఆర్కే!
ఆయన మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు.. రెండేళ్ల క్రితం రామగుడ ఎన్కౌంటర్ అనంతరం ఆయన ఆచూకీపై ఆందోళన వ్యక్తమైంది.. పోలీసులపై అనుమానాలు వెల్లువెత్తాయి.. చివరికి ఆయన సేఫ్ జోన్లో సురక్షితంగా ఉన్నారని స్పష్టమైంది.గత నెలలో జరిగిన లివిటిపుట్టు హత్యాకాండ.. తదనంతరం ఏవోబీ కటాఫ్ ఏరియాలో మావోల భారీ బహిరంగ సభ, తాజాగా ఒడిశాలోని పొట్టంగి సమీప అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తదితర వరుస ఘటనలు మళ్లీ ఆ మోస్ట్ వాంటెడ్ ఉనికిపై చర్చకు తెరలేపాయి. అతనే మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే..రామగుడ ఎన్కౌంటర్ తర్వాత రెండేళ్లు సేఫ్జోన్లో స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన ఆర్కే.. వాస్తవానికి చాప కింద నీరులా దెబ్బతిన్న మావోయిస్టు క్యాడర్‌ను పునరుజ్జీవింపజేశారని అంటున్నారు. దాని ఫలితమే గత 20 రోజుల్లో జరిగిన దారుణాలు..తెరవెనుక వ్యూహాలు రచిస్తూ.. క్యాడర్‌ను ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి బహిరంగ సభ, పొట్టంగి ఎన్కౌంటర్ స్థలంలో ఆయన ఉన్నారని పోలీసులు ప్రకటిస్తున్నారు. కాల్పుల నుంచి తప్పించుకున్న ఆర్కే సహా కీలక నేతలు తిరిగి ఛత్తీస్‌ఘడ్‌లోకి వెళ్లిపోయారని అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సహా కీలక నేతలే టార్గెట్‌గా ఏపీ, ఒడిశా పోలీసులు ఏవోబీలో జల్లెడపడుతున్నారు. రెండేళ్ల కితం రామ్‌గూడ ఘటనలో ఆర్కే లక్ష్యంగానే పోలీసులు దాడులు చేయగా.. సరిగ్గా ఇప్పుడు కూడా ఆయనే టార్గెట్‌గా ఖాకీలు వేట మొదలుపెట్టారు. వాస్తవానికి రామ్‌గుడ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే ఆచూకీపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో ఆయన కుమారుడు మున్నా సహా 32 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చి చం పారు. ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయంపై చాలా కాలం సందిగ్ధత నెలకొంది. అప్పట్లో భార్యతో సహా కుటుంబసభ్యులు ఆర్కే ఆచూకీని పోలీసులు బయటపెట్టాలంటూ హైకో ర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆర్కే క్షేమంగా సేఫ్జోన్లో ఉన్నారంటూ కుటుం బసభ్యులు, మావోలు ప్రకటించినా... జాడ మాత్రం తెలియరాలేదు. ఏవోబీ దాటి ఛత్తీస్‌గఢ్‌లో ఆయన తలదాచుకున్నారేమోనన్న వాదనలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. పోలీసులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. గత నెల 23వ తేదీన ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మహిళా మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపడం, ఆ తర్వాత ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో వేలాదిమందితో మావోలు బహిరంగసభ నిర్వహించడం, తాజాగా ఆదివారం కోరా పుట్ జిల్లా సుంకి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం కావడం.. తదితర పరిణామాలన్నీ పోలీసులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతోనే మావోలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, స్వయంగా ఆయన ఏవోబీలోనే మకాం వేసి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని పోలీసు అధికారులు నిర్థారణకు వచ్చారు. సుంకి సమీపంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే ఉన్నట్టు అనుమానిస్తున్నామని అక్కడ ఎస్పీ వెల్లడించగా, ఏవోబీలోనే మకాం వేసిన ఆర్కే, ఇతర కీలక నేతలే టార్గెట్‌గా మన పోలీసులు జల్లెడ పడుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. వ్యూహరచనలకే ఆర్కే పరిమితం? ఏవోబీతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో నిదండకారుణ్య ప్రాంతంలో ఆర్కే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మావోల హింసాత్మక సంఘటనలకు వ్యూహ రచన బాధ్యతలు నిర్వహించ డం మినహా నేరుగా ఆపరేషన్లలో ఆయన పాల్గొనడం లేదని సమాచారం. రామ్‌గుడ ఎన్కౌంటర్లో తన కుమారుడు మున్నా, ఆయన గన్మెన్లు సహా 32 మంది మావోలను పోగొట్టుకున్న తర్వాత ఏవోబీలో మావోయిస్టుల ఉద్యమ బాధ్యతను తనపై వేసుకున్న ఆర్కే రెండేళ్లలోనే భారీ రిక్రూట్మెంట్తో పార్టీకి పునరుత్తేజం తీసుకువచ్చిన ట్టు చెబుతున్నారు.మావోల ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో అనునిత్యం శ్రమిస్తున్న ఆర్కే నేరుగా మావోయిస్టుల దళాలు, ఏరియా కమిటీలతో కలిసి తిరగడం లేదని అంటున్నారు. ఏవో బీలోనే సురక్షిత ప్రాంతంలో తలదాచుకుని వ్యూ హాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. గత ఆగస్టు నెలలో కటాఫ్ ఏరియాలో జరిగినఅమరవీరుల వారోత్సవాల్లో పాల్గొన్నారని, ఆయన ఆదేశాలతోనే చలపతి, అరుణ ల ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తోందని అంటున్నారు. ఛత్తీస్‌ఘఢ్ వైపు ఆర్కే ఆదివారం కోరాపుట్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆర్కే సహా మావోయిస్టు నేతలు త్రుటిలో తప్పిం చుకున్నారని భావిస్తున్న పోలీసులు ఇప్పుడు వారు ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏవోబీ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మల్కన్‌గిరి మీదుగా వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒడిశా కటాఫ్ ఏరియాలో కూంబింగ్‌ను ఉధృతం చేశారు. గ్రేహౌండ్స్ బలగాలతోపాటు ఒడిశా వైపు నుంచి బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ను చేపట్టాయి. డిసెంబర్ వరకుమావోయిస్టులకు అనుకూలం తూర్పుకనుమల్లో భాగంగా ఉన్న అటవీ ప్రాంతం డిసెంబర్ వరకు ఆకులు, తుప్పలతో దట్టంగా ఉంటుంది. దీంతో ఎంతమంది పోలీసులు కూంబింగ్ చేపట్టినా మావోయిస్టుల కదలికలను పసిగట్టడం అంత తేలిక కాదు. డిసెంబర్ తరువాత అడవిలో ఆకులు రాల్చే చెట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఆ కా>లం మావోయిస్టులకు ప్రతికూలంగా ఉంటుందని.. పోలీసులకు అనుకూలంగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
టెక్నాలజీని అద్దెకిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, కార్ల లాగే టెక్నాలజీనీ అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఆన్‌గో ఫ్రేమ్ వర్క్‌లో! మన దేశంతో పాటూ దుబాయ్, మధ్య ప్రాచ్య వంటి దేశాల్లోని కంపెనీలూ కస్టమర్లుగా ఉన్నాయి. జస్ట్, 30 నిమిషాల్లోనే డిజిటల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటమే ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ ప్రత్యేకత! అందుబాటు ధరల్లో ఎంటర్ప్రైజ్లకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలకు టెక్నాలజీలను అద్దెకిస్తున్న ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ రామకృష్ణ కుప్పా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. మాది హైదరాబాద్. ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్ పూర్తయ్యాక.. బెంగళూరులో ఒకట్రెండు స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అక్కడి నుంచి మైండ్‌ట్రీ టెక్నాలజీ డెవలప్మెంట్ బృందంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరా. తర్వాత మోటరోలాలో సీనియర్ ఇంజనీర్‌గా చేరా. 2009లో ఎస్ఎంఈలకు మొబిలిటీ సొల్యూషన్స్ అందించే క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ కన్సల్టింగ్ అనే ఐటీ కంపెనీని ప్రారంభించాం. ఈ సమయంలో తెలిసిన విషయమేంటంటే.. టెక్నాలజీ అభివృద్ధి కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నందువల్లే పె ద్ద కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లటం లేదని! అభివృద్ధి వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా సమయాన్ని, నిర్వహణ ఖర్చును తగ్గిస్తే సరిపోతుందని తెలిసి.. రకరకాల టెక్నాలజీలను అద్దెకు ఇస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాం. అలా 2015లో నా భార్య అను అఖిలతో కలిసి రూ.1.2 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌గో ఫ్రేమ్ వర్క్ కంపెనీని ప్రారంభించాం. ఏపీ, తెలంగాణ నుంచి 400 కంపెనీలు.. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, కాగ్నెటివ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఈఆర్పీ, వాలెట్ ప్రోగ్రామింగ్ వంటి అన్ని రకాల టెక్నాలజీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక, వ్యవసాయ, రియల్ ఎస్టేట్, బీమా, వైద్యం, ఫుడ్ టెక్ రంగాల్లో ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఈ రెండు విభాగాల్లో కలిపి 900 కంపెనీలు మా టెక్నాలజీని అద్దెకు తీసుకున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 400 కంపెనీలుంటాయి. దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సుమారు 20 కంపెనీలు కూడా ఉన్నాయి. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ, నిర్మాణ కంపెనీలు వీటిల్లో కొన్ని. ఇక, లోకల్ కంపెనీల్లో ఈ–సహాయ్, పేవైస్, లోహిత, బెల్ రైస్ వంటివి ఉన్నాయి. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్.. ప్రస్తుతం నెలకు 10 ఎంటర్ప్రైజ్లకు, 300 ఎస్ఎంఈలకు ఫ్రేమ్ వర్క్ ఫీచర్స్, ప్రొడక్ట్ ఫీచర్స్, మొబైల్ యాప్, వెబ్ యాప్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్సాఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ మొబిలిటీ సేవలందిస్తున్నాం. టెక్నాలజీని బట్టి నెల అద్దె రూ.2 వేల నుంచి రూ.7 లక్షల వరకున్నాయి. గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.7 కోట్లకు చేరుకుంటాం. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 10 వేల ఎస్ఎంఈ కస్టమర్లను చేరుకోవాలన్నది టార్గెట్. త్వరలోనే అమెరికాలోని పలు టెలికం కంపెనీలతో టెక్నాలజీ సేవల ఒప్పందం చేసుకోనున్నాం. త్వరలోనే రూ.35 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 94 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 160కి చేర్చనున్నాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ సూస్ డైరెక్టర్ పారస్ పరేఖ్, విర్టుసా ఐటీ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిషీ చౌహాన్ వంటి ఐదారుగురు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరో రూ.35 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ముంబైకి చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో చ ర్చలు జరుగుతున్నాయి. ‘‘ మా టెక్నాలజీ మీద శిక్షణ, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాలపై అ వగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌కు చెం దిన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హాకీస్టిక్ మీడి యా అనే స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. ఎస్ఎంఈ కంపెనీలతో పనిచేసే మరో స్టార్టప్‌ను కొనుగోలు కు ఆసక్తిగా ఉన్నామని’’ రామకృష్ణ వివరించారు. -
నారావారిపల్లె సీఎం జాగీరా?
చిత్తూరు, మదనపల్లె: ‘నారావారిపల్లె సీఎం జాగీరా...? ముఖ్యమంత్రి మా ఊర్లకు రావచ్చు కానీ మేం వాళ్ల ఊరికి వెళ్లకూడదా...? రాష్ట్రంలో చంద్రబాబు పోలీసులతో పరిపాలన చేయాలనుకుంటే ఎంత మాత్రం సహించేది లేదు’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు చేపట్టిన బస్సు జాత మంగళవారం సాయంత్రం మదనపల్లెకు చేరుకుంది. రామకృష్ణ మాట్లాడుతూ నారావారిపల్లె ఆస్పత్రిలో వైద్యులు లేరన్న విషయమై పరిశీలించేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డు చెప్పడం దారుణమన్నారు. ప్రధాని మోదీ నోట్ల రద్దు, జీఎస్టీతో 2,64,000 పరిశ్రమలు మూతపడేలా చేసి 96 లక్షల మందిని నిరుద్యోగులు చేశారన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించకపోగా భారం మోపుతున్నారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు మద్యం, ఇసుక, మైనింగ్, రియల్ ఎస్టేట్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిరోజూ టీవీలో కనిపించడం తప్ప ఏరోజైనా మదనపల్లెలో కరువు, టమాట రైతుల సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఆమ్ఆద్మీ, సారూప్యత కలిగిన పార్టీలతో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు శ్రీని వాసరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రం లో చంద్రబాబు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి, సీపీఐ రాష్ట్ర మహిళా సమాఖ్య కార్యదర్శి జయలక్ష్మి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి, లెనిన్, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రామానాయుడు, చల్లా వెంకటయ్య పాల్గొన్నారు. -
‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’
సాక్షి, తిరుపతి : అధికారుల అవినీతి కారణంగానే కర్నూలు క్వారీ ఘటనలో పదిమంది మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలన అవినీతి మయంగా మారిందని మండిపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. -
ఏపీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా?
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..బంద్‌కు సహకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండగా..మధ్యలో పోలీసుల జోక్యం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో ఏమైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధాలు, పోలీసు కేసులను ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి సానుకూలంగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అహంకార ధోరణితో మాట్లాడారని ఆరోపించారు. అమరావతిలో రైల్వే డబుల్ లైన్‌కు గతంతో రూ.2679 కోట్లు కేటాయించి..ఇప్పుడు దానిని రూ.1732 కోట్లకు కుదించారని చెప్పారు. కేంద్రం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. -
విజయవాడలో ముజ్రా సంస్కృతికి తెరదీసిన టీడీపీ నేతలు
-
రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: పలు కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారి ఎస్.రామకృష్ణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు తనపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో హైకోర్టుకు బదిలీ చేసే విషయంలో రామకృష్ణ తరఫు న్యాయవాది తమను ఒప్పించలేకపోయారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామకృష్ణపై హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియమితులైన నేపథ్యంలో, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంపై స్వయంగా విచారణ జరపాలని సీజేను కోరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రామకృష్ణను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో రామకృష్ణ, మీడియా సమావేశం పెట్టి హైకోర్టును, న్యాయమూర్తులను సవాలు చేయడంతో పాటు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. ఆయన మాటలను కొన్ని చానళ్లు సైతం ప్రసారం చేశాయి. మీడియా సమావేశ నిర్వాహకులు రామకృష్ణ వ్యాఖ్యలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. రామకృష్ణ మాట్లాడిన మాటలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని భావించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అప్పటి అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)కి లేఖ రాశారు. ఏసీజే ఈ లేఖను పరిశీలించి, దానిని సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించారు. ఈ ధిక్కార పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రామకృష్ణ నిర్వహించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన మీడియా సమావేశ వివరాలను, అందుకు సంబంధించిన సీడీని ఆయన ధర్మాసనం ముందుంచారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడమేనన్న ధర్మాసనం... మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడిన మాటల వివరాలను తెలుసుకున్న ధర్మాసనం, అవి న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఎందుకు కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరించాలంటూ రామకృష్ణకు నోటీసులు జారీ చేసింది. అంతేకాక తదుపరి ఆయన గానీ, అతని అనుచరులు గానీ కోర్టు విచారణలో ఉన్న అంశాలకు సంబంధించి ఎటువంటి పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. అలాగే సోషల్ మీడియా ద్వారా కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి చర్చించడానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తాను మాట్లాడిన మాటలను హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తుండటంతో తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై హైకోర్టులో ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు విచారణల అనంతరం ఈ పిటిషన్ గత వారం జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రామకృష్ణ తరఫు న్యాయవాది మరో వాయిదా కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. అనంతరం వాదనలు విన్న ధర్మాసనం, ఉమ్మడి హైకోర్టు చేపట్టిన కోర్టు ధిక్కార చర్యల విషయంలో జోక్యానికి నిరాకరించింది. మరో హైకోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరిస్తూ రామకృష్ణ అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి నియమితులైన నేపథ్యంలో ఆయననే స్వయంగా రామకృష్ణపై ఉన్న కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని విచారించాలని కోరింది. రామకృష్ణకు చీవాట్లు... తనపై దాడి చేశారంటూ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డిపై రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఉమ్మడి హైకోర్టు గత ఏడాది తేల్చింది. జస్టిస్ నాగార్జునరెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడమే కాకుండా అవి నిజమైనవేనని నమ్మించేందుకు రామకృష్ణ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తప్పుడు డాక్యుమెంట్లనీ స్పష్టం చేసింది. రామకృష్ణ అబద్ధాలనే పునాది మీద అవాస్తవాలు.. అభూత కల్పనలు.. తప్పుడు డాక్యుమెంట్లు.. స్థిరత్వం లేని.. పరస్పర విరుద్ధమైన వాదనలను ఇటుకలుగా పేర్చి ఈ కేసును నిర్మించారంటూ అతనిపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. -
మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేత: సీపీఐ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి రీకౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం సరికాదని, మొత్తం ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ రద్దు చేసి రీకౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 550 ప్రకారం, స్లయిడింగ్ విధానం అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాల్నారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వర్సిటీ వీసీతో చర్చించామన్నారు. త్వరలో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. -
బాబు పరిపాలన చేతకాని అసమర్ధుడు
-
పాలనపై చంద్రబాబుకు పట్టు లేదు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు కోల్పోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇస్తున్నారని, దాంతో అధికారులు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం ఇక్కడి మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో, అంతకు ముందు విలేకర్ల సమావేశంలో పార్టీ విధానాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతామని, పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర సామాజిక శక్తులను కలుపుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తాయన్నారు. తమ పార్టీలు మూడు అంశాల్లో భావసారూప్యత కలిగి ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం అమలు కాకపోవడం, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోవడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. నెల్లూరులో ఒక అటెండర్‌ను ఏసీబీ వాళ్లు పట్టుకుంటే రూ.100 కోట్లు, విజయవాడలో ఒక టీపీఓని పట్టుకుంటే రూ.500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయంటే అవినీతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా వెనుకబాటుపై 22న ఒంగోలులో భారీ సదస్సు ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. సదస్సు తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, చేతివృత్తిదారుల సమస్యలపై ఏలూరులో, దళితుల సమస్యలపై రాజమండ్రిలో, అర్బన్ సమస్యలపై విజయవాడలో, రైతుల సమస్యలపై గుంటూరులో, విద్యార్ధి – యువజన సమస్యలపై తిరుపతిలో, మహిళల సమస్యలపై అనంతపురంలో, మైనార్టీల సమస్యలపై కర్నూలులో, వ్యవసాయ కార్మికుల సమస్యలపై నెల్లూరులో, వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలపై శ్రీకాకుళంలో, వెనుకబడిన రాయలసీమ సమస్యలపై కడపలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. 90 లక్షల మంది రోడ్డుపాలు కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ 2.64 లక్షల కంపెనీలు మూసివేయించి 90 లక్షల మందిని రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంటే దానిని ఇంతవరకు బయటకు తేలేదన్నారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో ఉందని, మిగిలిన 27 శాతాన్ని కూడా వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు పీజే చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకుడు ఆర్.వెంకట్రావు పాల్గొన్నారు. -
థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే..
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్లు అన్నీ సురేష్‌బాబు, అల్లు అరవింద్, దిల్‌రాజ్, సునీల్ చేతిల్లోనే ఉన్నాయని తెలంగాణ ఫిలిమ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ నలుగురు రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను తమచేతుల్లో పెట్టుకుని చిన్న సినిమాలు విడుదల కాకుండా చేస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి దీటుగా చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు త్వరలోనే డిజిటల్ చానల్ ప్రారంభిస్తున్నామని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి 20శాతం పన్ను కడుతూ.. చిన్న, పెద్ద సినిమాలను రిలీజ్ చేసేం దుకు ముందుకు వెళ్తుమన్నారు. థియేటర్లు అవస రం లేకుండానే మా డిజిటల్ ద్వారానే అన్ని టీవీ ల్లో సినిమాలను విడుదల చేస్తామని అన్నారు. ఇం డియాలో ఎక్కడ లేని విధంగా ‘మా’ డిజిటల్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ‘మా’ డిజిటల్ ద్వారా సుమారు 1000 చిన్న సినిమాలను రిలీజ్ చేస్తామన్నారు. ఇది విజయవంతం కావాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సోగ్గాడే శోభన్ కృష్ణ సినిమా హీరో రాయగిరి ఉమాపతిగౌడ్, డైరెక్టర్ జింక హరీష్‌బాబు, సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ ఉన్నారు. -
‘ఆయన మాటలు బీజేపీకి వినిపించడం లేదా’
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదేమో కానీ, అప్పులమయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 94 వేల కోట్లు ఉన్న అప్పును రెండు లక్షలకు తీసుకెళ్లడం అభివృద్దా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వామపక్షాలు పోరాడితే అరెస్టులు చేయించారని, కానీ ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 29న కడప బంద్‌కు పిలుపునిచ్చామని.. అందరు సహకరించాలన్నారు. విశాఖలో భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు ఎప్పటివరకు చేస్తారన్నారు. ఈ కుంభకోణాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనే బయపెట్టడం లేదా అని ప్రశ్నించారు. వారం రోజులు గడువిస్తున్నామని.. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్మికుల, గిరిజన, విద్యార్ది ఉద్యోగల సమస్యపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవుతున్నాయన్నారు. అన్ని వర్గాలతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూలై 8 విశాఖలో కార్మికులు సమస్యలపై సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది.. ఇసుక మాఫియా పెరిగిపోయింది.. అధికార పార్టీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా జూలై 2న నీలం రాజశేఖర్ రెడ్డి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతపురంలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజలను కేంద్రప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఫ్యుజుబులిటీ ఉన్నా రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో పరిశీలించమని ఉందనడం దారుణమన్నారు. కడప ఉక్క పరిశ్రమ వస్తుందని బీజేపీ మాటలాడుతోందని.. పీయూష్ గోయల్ అన్నమాటలు బీజేపీ వాళ్లకి వినిపించడం లేదా ప్రశ్నించారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
సాక్షి, విజయవాడ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. నగరంలోని పాతబస్టాండ్‌లో వామపక్ష శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి.. సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నేతలు మధు, రామకృష్ణలతోపాటు పార్టీ శ్రేణులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన.. గుంటూరు : పెట్రోలు ధరలు తగ్గించాలంటూ కమ్యూనిస్టులు గుంటూరులో ఆందోళన నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు : పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్ లా: మార్కాపురం కోర్టు సెంటర్ వద్ద వామపక్షాలు, ఇతర పార్టీల రాస్తారోకో, ఒంగోలు పట్టణంలో వామపక్షాల ఆందోళన కర్నూలు : పట్టణంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆందోళన. పశ్చిమ గోదావరి : వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద రాస్తారాకో.. పాల్గొన్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు. విజయనగరం : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలోని మయూరి జంక్షన్లో వామపక్షాల రాస్తారోకో -
పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళను వేదిస్తున్న టీడీపీ నేత
-
పల్లెటూరి నేపథ్యంలో...
హాస్యనటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో రామకృష్ణ, అవంతికా జంటగా నటించిన చిత్రం ‘ఆనందం అంబరమైతే’. ఈరంకి సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ బుద్దాల సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈరంకి సుబ్బు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అనుకున్నది సాధించినప్పుడు ఆనందం అంబరాన్ని తాకడం సహజం. ఈ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. గోదావరి తీరంలో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. శ్రీకృష్ణ సంగీతం సినిమాకు హైలెట్’’ అన్నారు బుద్దాల సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: చైతన్య వనపల్లె, సహనిర్మాత: బుద్దాల హైమావతి. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నిక
కడప వైఎస్సార్ సర్కిల్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మహసభల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. అలాగే ప్రజా సమస్యలపై కూడా పలు తీర్మానాలు చేశారు. రామకృష్ణ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ నేతలతో పాటు పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు. -
తీర్మానం చర్చకు స్వీకరించకపోవడం దారుణం
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడితే చర్చకు స్వీకరించక పోవడం దారుణమని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన నియంతృత్వ పోకడలతో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ప్రతిపక్షానికి ఉన్న ప్రజాస్వామిక హక్కులను కేంద్రం నీరుగార్చుతోందని ధ్వజమెత్తారు. ఈ నెల 11న విజయవాడలో అంతిమ పోరాటంకు అఖిలపక్షం సిద్దమవుతోందని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, ఎదురుదాడికి దిగుతోందన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాల్సిందేనని, విభజన సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రేపు జనసేన, వామపక్షాలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ సర్వతోముఖాభివృద్దికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం వెయ్యికి పైగా పోరాటాలు చేస్తామని, 16 రాజకీయ పక్షాలు, 42 ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిస్తే వెళ్లామని, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్ నేతలను కూడా కలిశామని వివరించారు.జనసేన అధినేతను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తుమన్నారు. ఈ నెల 11న అఖిలపక్షం కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్ జగన్ కూడా ఉమ్మడి పోరాటానికి కలిసి వస్తామని చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో చేపట్టే దీక్షలకు ప్రత్యేక హోదా సాధన సమితి పూర్తి మద్దతు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఒకమెట్టు దిగి వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ మంత్రులు కలిసి అఖిలపక్షానికి ఆహ్వానించాలని ఈ సందర్భంగా చలసాని కోరారు. సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. బీజేపీ అబద్దాల ఫ్యాక్టరీ సృష్టించిందని విమర్శించారు.అసత్యాలు ప్రచారం చేయడమే వారి లక్ష్యమని, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏం చేసుకుంటారో.. చేసుకోండని బరితెగించి చెబుతోందని వ్యాఖ్యానించారు. ఏపీపై కోపంతో.. కుట్రతో వ్యవహరిస్తోందని అన్నారు. -
ప్రజలు అప్పులు ఇవ్వాలనడం సిగ్గుచేటు
తిరుపతి కల్చరల్: అమరావతి నిర్మాణానికి కేంద్రమే నిధులు మంజూరు చేయాలని చట్టంలో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్ర ప్రజలు అప్పులు ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. ద్రోహాన్ని ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేరన్నారు. రాష్ట్రం లోటు రూ.97 కోట్లు ఉంటే దానిని, రూ.2 లక్షలా 50 వేల కోట్లు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఒక్క అమరావతిలోనే 7 మెడికల్ కళాశాలలు పెట్టడం సరైంది కాదన్నారు. ఈనెల 6 నుంచి 9 వరకు కడపలో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ప్రత్నామ్నయ రాజకీయ వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా కోసం నేడు, రేపు మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ చివరి రోజైన 5న బ్లాక్‌డే పాటిస్తామని తెలిపారు. -
హోదాపై ఉప్పెనలా మలిదశ ఉద్యమం: సీపీఐ
సాక్షి, అమరావతి: ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమ సెగ ఢిల్లీని తాకిందని, మలిదశ ఉద్యమం ఉప్పెన ఉంటుందని సీపీఐ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ, తెలుగుదేశం పార్టీల వైఖరిని ఎండగడుతూ చేపట్టిన ఉద్యమం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సీపీఐ నాయకుడు కె.రామాంజనేయులు అధ్యక్షతన మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఈడ్పుగంటి నాగేశ్వరరావు, కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణను చర్చించిన అనంతరం ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఈనెల 22న చేపట్టే జాతీయ రహదారుల దిగ్బంధానికి అన్ని వర్గాలు సహకరించాలన్నారు. హోదా ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.. -
ఎన్డీయే నుంచి కూడా వైదొలగాలి
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని ప్రకటించి.. మరోవైపు ఎన్డీయేలో కొనసాగుతామని సంకేతాలు ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారని, అప్పుడే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి మంత్రులను తప్పించడమే కాకుండా, ఎన్డీఏ నుంచి కూడా బాబు వైదొలగాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పక్షాలను కలుపుకొని ఉద్యమం చేయాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలని సూచించారు. -
తెలంగాణ శతపత్రం
సందర్భం శర్మ 1947 ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటిక్యాలపాడు, తక్కశిల, ఉండవల్లి మొదలైన చోట్ల జాతీయ పతాకం ఎగురవేశారు. అదేకాలంలో ఆయన సంఘ సంస్కరణోద్యమం చేపట్టారు. అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధ మూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్లు. బాల్యం తప్ప, మిగిలిన 80 ఏళ్లు స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సదృశ నాయల కత్వం వారిది. సాంస్కృతిక అభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ. 1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో ఆయన జన్మించారు. బాల్యంలోనే తెలంగాణలో ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. తెలుగు మీద విశేషమైన అభిమా నాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, ప్రబంధాలు అధ్యయనం చేశారు. ‘శ్రీపార్వతి వరపుత్రా/నీ పాదములంటి కొలుతు నిపుణత తోడన్/నా పాపము పోకార్పుము/ ఓపికతో నన్ను కావు ఓ కరి వదనా’ అంటూ 16 ఏళ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. పద్యపఠనానికి తగిన గొంతు ఆయనకు వాగ్దేవి వరం. వేలూరి శివరామశాస్త్రి ప్రాపకం లభించి గడియారం అనే బంగారం మెరుగుపెట్టుకొంది. 20 ఏళ్ల వయసులో ఆలంపురీ క్షేత్రాన్ని తమ కార్యక్షేత్రం చేసుకున్నారు శర్మగారు. అప్పుడే సురభి వారు అక్కడ ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం ప్రదర్శించారు. బాగా తాగి వచ్చిన పోలీసు మొహరీల్ నాటకాన్ని ఆపించి గజళ్లు పాడమని రభస చేస్తే శర్మగారు తమ మిత్రులతో కలసి అడ్డుకు న్నారు. ఆ విధంగా ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే నిర్వహకునిగా, దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సంఘటన తర్వాత గడియారం వారిని దుంపల్లి రామిరెడ్డి ఆంధ్ర మహాసభకు పరిచయం చేశారు. మహా సభ తాలూకా కమిటీ కార్యదర్శి అయ్యారు. 1942 మే నెలలో వరంగల్లు సమీ పంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మే నెలలో హైదరాబాద్ రెడ్డి హాస్టలులో దశమాంధ్ర మహాసభలు జరిగాయి. అప్ప టికే ఆంధ్ర మహాసభలు రాజకీయ అంశాలకు ప్రాధాన్య మిస్తూ సాంస్కృతిక వికాసాన్ని విస్మరించినట్లు నాయ కులు భావించారు. దశ మాంధ్ర మహాసభరోజే అంటే 1943 మే 26న రెడ్డి హాస్టల్లోనే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ‘తెలంగాణ సారస్వత పరిషత్తు’గా మారింది. గడియారం స్టేట్ కాంగ్రెస్ సభ్యునిగా నిజాం వ్యతిరేక పోరాటంలోనూ, దేశ స్వాతంత్య్రోద్యమంలోనూ ఏకకాలంలో పాల్గొన్నారు. స్టేట్ కాంగ్రెస్ కార్యాచరణ సమితి ఆదేశాల ప్రకారం నిజాం ప్రభుత్వానికి వ్యతిరే కంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్ రేడియోను’ ప్రారంభించారు. అప్పుడు నిజాం ప్రభు త్వం దక్కన్ రేడియో నిర్వహించేది. శర్మ 1947 ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటిక్యాలపాడు, తక్క శిల, ఉండవల్లి మొదలైన చోట్ల జాతీయ పతాకం ఎగుర వేశారు. అదేకాలంలో ఆయన సంఘసంస్కరణోద్యమం చేపట్టారు. కొన్ని వితంతు పునర్వివాహాలు చేయించ డమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకు న్నారు. కుల బహిష్కార దండనను ధైర్యంగా ఎదుర్కొని నిలిచారు. 1953 సంవత్సరంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. 30 వేల మంది పాల్గొనడం ఒక రికార్డు. ఆనాటి అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు, కార్యదర్శి రామకృష్ణశర్మ. ముఖ్యఅతిథి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కూడా తప్పనిసరై పాల్గొనవలసి వచ్చింది. శ్రీ శ్రీ సహా దిగ్దంతులెందరో పాల్గొన్నారు. కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరిం చారు. విశ్వనాథ స్నాతకోపన్యాసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి గారి సహకారంతో పి.ఎన్. శర్మ ప్రారం భించిన ‘సుజాత’ పత్రిక మూడేండ్లు నడిచి ఆగిపోయింది. 1953లో గడి యారం దాన్ని తిరిగి ప్రారంభించి మూడేళ్లపాటు నడిపారు. ఆరవ తర గతిలో చదువుకు స్వస్తి చెప్పిన శర్మ శాసన శాస్త్రానికి సంబంధించిన ఆంగ్ల గ్రంథాలను పఠిం చడం కోసం ఆంగ్లం నేర్చుకున్నారు. ఆలంపురంలోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి ‘తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహించారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యునిగా పనిచేశారు. ఆయన 1954 నుండి 30 సంవత్సరాల పాటు ఆలంపూరు దేవస్థాన ధర్మకర్తల సంఘానికి అధ్యక్షుడు. అప్పటి పురావస్తుశాఖ డైరెక్టర్ పుట్టపర్తి శ్రీనివాసా చార్యుల సహకారంతో ఆలంపురంలో ఒక మ్యూజియం ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీ వనం కోసం యావజ్జీవితం పాటుపడిన రామకృష్ణ శర్మ 99వ జయంతి సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు మంగళవారం సభ నిర్వహిస్తున్నది. (రామకృష్ణ శర్మ శతజయంత్యుత్సవాల సందర్భంగా) వ్యాసకర్త సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం పీఆర్వో డా.జె.చెన్నయ్య -
‘ఏపీ కోలుకోవటానికి 30 ఏళ్లు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీరును పలు పార్టీల కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న విధంగా నిధుల కేటాయింపు జరిగిందా లేదా చెప్పాలని టీడీపీ నేతలను పార్థసారధి డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో బాబు కేవలం ఆయన స్వార్ధం కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు. బాబుకు మంచి వైద్యం చేయించాలి: సీపీఐ నేత రామకృష్ణ ‘రాష్ట్రానికి ఏం సాధించాలి, ఏవి కావాలన్న విషయం మీద ఒక్క చంద్రబాబుకి తప్ప, ఏపీ నేతలతో పాటు ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజితో సమానమని చెప్పారు. ఇప్పుడు అది నిజం కాదనే ధోరణిలో వ్యవహరిస్తూ పక్కా గందరగోళంలో ఉన్నారు. చంద్రబాబు సందిగ్ధత నుంచి ముందు బయటకు రావా. లేదా ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలంటూ’ అన్ని పార్టీల నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది: సీపీఎం నేత మధు ‘రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సంప్రదింపులకే బీజేపీ నేతలకు నాలుగేళ్లు పట్టిందా. 11 జాతీయ విద్యా సంస్థలకు, మరో 9 సంస్థలుకు అనుమతులు ఇచ్చారు. రూ. 9000 కోట్ల నిధులకు కేవలం రూ. 420 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది. ఇక ముసుగులో గుద్దులాటలు ఉండవు. మార్చి 5, 6 కల్లా అంతా తేలిపోతుంది. ఇన్నేళ్లలో అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమంటే చేయనేలేదు. సీఎం దుర్మార్గంగా, ఏ బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రానిది ఒక నాటకం.. రాష్టానిది ఒక నాటకం. మార్చి 6వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన: కొణతాల రాష్ర్ట విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక విశాఖపట్నం బీచ్ లో మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శన నిర్వహించనుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
ఆదివాసీలంటే ఇంత చిన్న చూపా?
నేడు రాష్ట్రంలో, దేశంలో ఆదివాసీలు అస్తిత్వం కోసం అల్లాడిపోతుంటే, తమ హక్కుల కోసం గొంతెత్తి విల్లం బులు ఎక్కుపెట్టి, రాజ్య హింసలో రాలిపోతుంటే ఆది వాసీల వైపు నిలబడాల్సిన కళాలు, గళాలు ఎందుకు మూగబోతున్నాయి? ఎందుకు భయపడుతున్నాయి? 5వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాలలో గిరిజనేతర ఆధిప త్యాన్ని ఎదిరించి సవాల్ చేస్తున్న ఆదివాసీలకు అండగా నిలబడాల్సిన ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యావంతులు, రచయితలు, కవులు, కళా కారులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తలు నోరు మెదపడం లేదెందుకు? వారి ప్రయాణం ఎటువైపు..? తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు తమ రిజర్వేషన్లు కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించటం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదివాసీ విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు మిలిటెంట్ ఉద్యమాలు చేస్తుంటే, ఆదివాసీల ప్రజాస్వామిక డిమాండ్‌ను ఎందుకు ఆమో దించట్లేదు. తెలంగాణలో లంబాడీలకూ – ఆదివాసీ లకూ మధ్య తీవ్రమైన వైరుధ్యం, సంఘర్షణ నెలకొంటే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఎందుకు నోరు విప్పటం లేదో సమాధానం చెప్పాలి. ఏజెన్సీలో నెల రోజులుగా 144 సెక్షన్ విధించి ఆదివాసీల గొంతు నొక్కుతుంటే ఈ నాగరిక సమాజం, మేధావి వర్గం ఆదివాసీల పట్ల ఎందుకు సవితి తల్లి ప్రేమను చూపిస్తోంది? ఆదివాసీ ఉద్యమ వార్తలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కవర్ చేయొద్దు, ఎలాంటి వార్తలు రాయద్దు అని పాలక వర్గాలు నిరంకుశత్వపు శాసనాలు జారీ చేస్తుంటే.. ఆదివాసీల వైపు కళాన్ని, గళాన్ని వినిపించాల్సిన ప్రజాసంఘాలు, రచయితలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎటువైపు ఉన్నారు? ఎందుకు ఆదివాసీలంటే అంత చిన్నచూపు. ఆది వాసీలు ఈ దేశ పౌరులు కాదా? వాళ్లు మనుషులు కారా? ఈ దేశ మూల వాసులు కాదా? ఈ దేశ చట్టాలు, సంస్కృతి, పాలక వర్గాల సంక్షేమ పథకాలు ఇక్కడి ఆదివాసులకు చెందవా? ఆదివాసీలపై ఎందుకంత నిర్లక్ష్యం? పవిత్రమైన ఆదివాసీ ఉద్యమాలపైన ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి? ఆదివాసీ ఉద్యమానికి మావో యిస్టు ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం. మావోయిస్టు ముద్ర వేసి ఆదివాసీల గొంతు నొక్కాలని చూస్తున్నా కూడా మేధావులు, కవులు, కళాకారులు ఎందుకు స్పందించరు? నేడు భారతదేశంలో 5వ, 6వ షెడ్యూల్ ఆదివాసీ భూభాగంలో ఉన్న గిరిజనేతరుల గురించి, గిరిజనే తరుల దోపిడీ గురించి మాట్లాడటం వృథా అవుతుంది. ఒకే బోనులో పులి, జింక ఎలా జీవిస్తాయో, ఒకే బోనులో, ఒకే కలుగులో ఎలుక, పిల్లి ఎలా జీవిస్తాయో కూడా నేడు గిరిజనేతర పార్టీలు సమాధానం చెప్పాలి. - వూకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం మొబైల్ : 98660 73866 -
సౌండ్ పొల్యూషన్...
రామకృష్ణ, అంకిత జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఉందా..లేదా..?’. అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ని నిర్మాత మాల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘సౌండ్ పొల్యూషన్ వల్ల ప్రజలకు జరిగే అనర్థాలు, సమస్యల్ని చూపించబోతున్నాం’’ అన్నారు వెంకట శివప్రసాద్. ‘‘ఇప్పటి వరకూ రాని కొత్త కథతో తీసిన చిత్రమిది’’ అన్నారు ఎస్.కమల్. నటులు జీవా, దర్శకుడు శివప్రసాద్, రామ్ జగన్, అంకిత పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అల్లం సుబ్రమణ్యం, అల్లం నాగిశెట్టి. -
సీపీఐ రామకృష్ణకు తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జిల్లాలోని బొమ్ములూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా దెబ్బతినగా.. రామకృష్ణ సురక్షితంగా బయటపడ్డారు. -
‘చంద్రబాబు ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుని..’
సాక్షి, అనంతపురం : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అదే ప్రధాని మోదీ అమరావతికి వస్తే విమర్శించడంలో అంతర్యం ఏంటని సీపీఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ చంద్రబాబు నాయుడు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతి డిజైన్లలో టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సూచనలు పాటిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్‌కే పరిమితమవుతున్నారని, అయితే ఆ ఊహా ప్రపంచాన్ని విడనాడాలని ఏపీ సీఎంకు నారాయణ సూచించారు. మన దేశంలో అత్యున్నత స్థాయి నిపుణులున్నా చంద్రబాబు సింగపూర్ ఎందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ లొంగిపోయారని నారాయణ ఆరోపించారు. గరగపర్రు దళితులను పరామర్శించే తీరిక ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ విమర్శించారు. 50 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య చంద్రబాబుకు ఎందుకు పట్టదని ఆయన ప్రశ్నించారు. -
రైలుకిందపడి వృద్ధుడి ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి(రామగిరి): కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా ఎగువపల్లికి చెందిన వడ్ల రామకృష్ణ(75) శనివారం చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం (ఎన్ఎస్) గేట్ వద్ద శనివారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఈయన జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించామన్నారు. -
'మతచాందసవాదులు రెచ్చిపోతున్నారు'
కడప: దేశంలో మతచాందసవాదులు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణహత్యకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో బిల్బప్ సర్కిల్లో ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దేశంలో మతచాందసవాదుల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నెలరోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. -
‘జై లవకుశ’ ఆడియో లాంచ్
-
నాన్నగారి లవకుశలా సూపర్ హిట్టవ్వాలి
– హరికృష్ణ ‘నాన్నగారు (సీనియర్ ఎన్టీఆర్) పిల్లలకు ఇచ్చిన ఆస్తి మీ (ప్రేక్షకుల) అభిమానమే. మీ వల్లే నందమూరి వంశం ముందుకెళ్తోంది. ఈ సినిమా పేరు చూస్తుంటే... నాన్నగారు నటించిన ‘లవకుశ’ గుర్తొస్తోంది. ఆ సినిమాలా ఇదీ సూపర్ హిట్టవ్వాలి. అన్నదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. ఇక్కడ విచిత్రం ఏంటంటే... అన్న నిర్మాత, తమ్ముడు హీరో. రామకృష్ణ స్డూడియోస్‌లో బాలయ్య హీరోగా నేను సినిమాలు నిర్మించిన రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు హరికృష్ణ. ఆయన చిన్న కుమారుడు ఎన్టీఆర్ హీరోగా పెద్ద కుమారుడు కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమా ‘జై లవకుశ’. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఆదివారం హైదరాబాద్‌లో పాటల సీడీలను హరికృష్ణ విడుదల చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మనసుకు నచ్చింది చేయాలా? ట్రెండ్ ఫాలో కావాలా? ‘జనతా గ్యారేజ్’ తర్వాత కన్ఫ్యూజన్లో పడ్డా. బాబీ కథ చెప్పగానే... మనసుకు నచ్చిందే చేయాలనుకున్నా. అంత ఎమోషన్ ఉందీ సినిమాలో. మా పెద్దన్నయ్య జానకిరామ్‌గారు కూడా ఈ వేదికపై ఉండుంటే... ‘జై లవకుశ’ పేరుకి సార్థకం అయ్యుండేదేమో. భౌతికంగా ఆయన మా మధ్య లేకున్నా అన్నయ్య ఆత్మ ఎప్పుడూ మాతోనే ఉంటుంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలనే కంటే... నాన్నగారికి 60వ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. ఈ నెల 2న ఆయన బర్త్‌డే. రెండు అయితే ఏముంది? 21 అయితే ఏముంది? అన్నదమ్ములుగా మేం చేసిన చిత్రమిది. మా నాన్నను, అమ్మలను కూర్చొబెట్టి మేం సాధించిన విజయం ఇదని ఈ సినిమాతో చెప్పాలని మా కోరిక. తప్పకుండా వాళ్లు గర్వపడేలా చేశామని నమ్ముతున్నా. పెదనాన్న, బాబాయ్ కలసి చేసిన చిత్రమని మా పిల్లల్లు చెప్పుకోవాలి. నా కెరీర్లో మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా కుటుంబ వేడుక ఇది. తారక్ (ఎన్టీఆర్) గురించి చాలా మాట్లాడాలి. ఈ నెల 10న జరగబోయే ప్రీ–రిలీజ్ వేడుకలో మాట్లాడతా. ఈ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు కల్యాణ్‌రామ్. ‘‘నాకు దర్శకుడిగా మూడో చిత్రమిది. ఎన్టీఆర్ హీరోగా మూడు పాత్రలతో చేశా. ఆయన కథకు న్యాయం చేశారు. అసిస్టెంట్, కో–రైటర్‌గా ఉన్నప్పట్నుంచి కల్యాణ్‌రామ్‌గారితో పరిచయముంది. ఆయన సంస్థలో సినిమా చేయడం హ్యాపీ. దేవిశ్రీ మంచి పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు బాబీ. ‘‘జై, లవ, కుశ.. ముగ్గురిలా ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ల తర్వాత తారక్‌తో మూడో చిత్రమిది. ఓ హీరోకి వరుసగా మూడు సినిమాలు చేయడం నా కెరీర్లో ఇదే తొలిసారి’’ అన్నారు దేవిశ్రీ. నటుడు బ్రహ్మజీ, రచయిత కోనవెంకట్, పాటల రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి
సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ అనంతపురం న్యూసిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ మోసగిస్తోందన్నారు. హద్దూపద్దు లేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అన్ని రంగాల్లో అసంతృప్తి పరిచిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేయడమే కాక, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన వాగ్దా నాలను అమలు చేయలేదన్నారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయన్నారు. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలన్నారు. -
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
-
'ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే'
విజయవాడ: పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 21మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, అయితే వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించకపోగా నలుగురికి సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు కూడా ఇచ్చారన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ ఫిరాయిస్తే చంద్రబాబు తీవ్రస్థాయిలో ఎండగట్టారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు. సాక్షాత్తూ సీఎం హోదాలో ఉన్నా చంద్రబాబు మాత్రం ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించారని, అయితే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంస్కృతికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై వైఎస్సార్సీపీ నిర్ణయాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పార్టీ ఫిరాయింపుదారులను రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సూచించారు. దీనివల్ల రాజకీయాలు భ్రష్టుపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శిల్పాచక్రపాణిరెడ్డి నైతికతకు కట్టుబడి వ్యవహరించారని పేర్కొన్నారు. రాజకీయపక్షాలు ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని మధు హితవు పలికారు. -
లోకేష్ కమ్యూనిస్టుల చరిత్ర ఏంటో తెలుసుకో
అమరావతి: కమ్యూనిస్టుల చరిత్రేంటో లోకేష్ తెలుసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విజయవాడ అభివృద్ధికి పాటుపడిందే కమ్యూనిస్టులని, విజయవాడకు తొలి మేయర్ కూడా కమ్యూనిస్టేనన్న విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలన్నారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని రామకృష్ణ అమరావతిలో కలిశారు. రాష్టంలో వర్షాభావ ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. పంటల భీమా ప్రీమియం చెల్లింపు ఆగస్ట్ 20 వరకూ పొడిగించాలని, గరగపర్రు, చాపరాయి ప్రజలను ఆదుకోవాలని కూడా కోరినట్లు చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో సినిమా, రాజకీయ ప్రముఖులున్నా కఠినంగా శిక్షించాలని, సినీ నటి ఛార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో వర్మ పోల్చడం దురదృష్టకరమన్నారు. -
లుక్.. నయా లుక్
నారా రోహిత్ ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ అయ్యారు. అలా కావడం కోసం సన్నబడ్డారు. ఈ మధ్య నారా రోహిత్ కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సన్నబడిపోతానని ప్రూవ్ చేసుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో సన్నబడిన రోహిత్‌ను చూడొచ్చు. ఈరోజు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పొడవాటి జుత్తు, మెలి తిరిగిన మీసాలు.. సిక్స్‌ప్యాక్ బాడీతో నారా రోహిత్ డిఫరెంట్‌గా కనిపిస్తున్న లుక్ ఇది. ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ డి.యోగానంద్. -
రైతు సమస్యలపై రాజీలేని పోరాటం
అనంతపురం అగ్రికల్చర్: రైతు సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు మూడు రోజుల జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం నగరంలోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన శాఖ ఎదుట నిర్వహించిన ధర్నాలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు, కూలీల వలసలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రకృతి కన్నెర్ర చేస్తుండగా మరోవైపు పాలక ప్రభుత్వాలు రైతులను కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు నివారిస్తామని, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామని, రూ.లక్ష కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పి మూడు సంవత్సరాల క్రితం ఆధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మరోవైపు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత అభివృద్ధిని సీఎం పూర్తిగా విస్మరించారన్నారు. ఇన్పుట్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ పథకాల రాయితీలు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరుబాట కొనసాగుతుందన్నారు. అనంతరం పోలీసులు రామకృష్ణతో పాటు మరికొందరు నేతలను అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
చాంపియన్ రామకృష్ణ
ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్) సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్లలో 9.5 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో గేమ్‌లో రామకృష్ణ, అజయ్ (ఏపీ)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో 8 పాయింట్లతో తరుణ్, జె. మల్లేశ్వర రావు (ఏపీ), కేఎన్ గోపాల్ (ఆంధ్రాబ్యాంక్) సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తరుణ్, మల్లేశ్వర రావు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. -
రాజమౌళికి తప్పుడు సమాచారమిచ్చారు!
తమిళసినిమా: దర్శకుడు రాజమౌళికెవరో తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పేర్కొన్నారు. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ భామ తాజా చిత్రం మామ్‌తో 300 చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్‌లో శివగామి పాత్రకు మొదట ఈమెను నటింపజేయాలని దర్శకుడు భావించారట. శ్రీదేవి నిరాకరించడంతో ఆ లక్కీచాన్స్ నటి రమ్యకృష్ణను వరించింది. ఆ పాత్రతో రమ్యకృష్ణ పేరు ఎక్కడో వెళ్లి పోయిందది. దీంతో శివగామి పాత్రను ఎందుకు మిస్ అయ్యారంటూ శ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. అటు దర్శకుడు రాజమౌళికి ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆయన శ్రీదేవి గురించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. దానికి శ్రీదేవి వెంటనే స్పందించారు. ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను బాహుబలి చిత్రంలో నటించడానికి పలు నిబంధనలను విధించానని రాజమౌళి చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. తాని ప్పటికి 300 చిత్రాల్లో నటించానని, అలాంటి నిబంధనలు విధిస్తే తననెప్పుడో సినిమా నుంచి పంపించేసే వారని అన్నారు. తానూ ఒక నిర్మాత భార్యానేనని, తనకూ నిర్మాతల సాధకబాధకాలు తెలుసునని అన్నారు. తన గురించి రాజమౌళికెవరో తప్పుడు సమాచారం అందించారని శ్రీదేవి పేర్కొన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.