T20 match
-
సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఫ్యామిలీని చూశారా? (ఫోటోలు)
-
ఆధిక్యం కోసం ఆఖరి పోరు
ముంబై: ఇప్పటికే సిరీస్ భారత్ చేతికందింది. ఇక మిగిలిందల్లా ఆధిక్యం పెంచుకోవడమే! మూడు వన్డేల సిరీస్‌కు ముందు ఈ చివరి మ్యాచ్ గెలిచి... 4–1తో ఆధిక్యం, ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ పరిస్థితి దీనికి భిన్నం. చేజారిన సిరీస్‌తో ఒత్తిడిలో ఉన్న బట్లర్ బృందం ఇప్పుడు భారత్ ఆధిపత్యానికి గండి కొట్టాలని... ఈ పొట్టి సిరీస్‌లో ఆతిథ్య జట్టు శుభారంభమివ్వగా... విజయంతో ముగింపు తమది కావాలని ఇంగ్లండ్ జట్టు గట్టిగా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరులో పైచేయి సాధించేందుకు పర్యాటక జట్టు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మొత్తంమీద ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరుకు నేడు వాంఖెడే స్టేడియం వేదిక కానుంది.సంజూ... మెరిపించు! ఈ సిరీస్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడాడు. తిలక్ వర్మ గెలిపించే ‘షో’ చేశాడు. హార్దిక్ పాండ్యా అసలైన ఆటను గత మ్యాచ్‌లో బయటికి తెచ్చాడు. అక్షర్ పటేల్ బంతితో లేదంటే బ్యాటింగ్‌తో జట్టుకు అక్కరకొస్తున్నాడు. అంతెందుకు అరకొరగా... అంటే శివమ్ దూబే ‘కన్కషన్’తో తుది జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా కూడా మ్యాచ్ గెలిపించే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. కానీ టాప్–4లో ఓపెనర్ సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్లతోనే జట్టు మేనేజ్మెంట్ కలవరపడుతోంది. తర్వాతి ప్రపంచకప్ వేటకు కోచ్ గంభీర్ కోర్ గ్రూపులోని ఆటగాళ్లు ఇలా వరుసగా విఫలమవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. బౌలింగ్‌లో అర్ష్ దీప్, పాండ్యాలు వెన్నుదన్నుగా నిలుస్తుంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నపళంగా మ్యాచ్‌ను మలుపుతిప్పే మాయాజాలంతో ఆకట్టుకుంటున్నాడు. రవి బిష్ణోయ్ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. 2–3 లక్ష్యంతో ఇంగ్లండ్ సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌కు ఇప్పుడు ఆఖరి పంచ్ మాత్రమే మిగిలుంది. ఇందులో తమ పవర్ చాటుకొని తదుపరి వన్డే సిరీస్‌ను తాజాగా ప్రారంభించాలని బట్లర్ జట్టు అనుకుంటుంది. సాల్ట్ గత మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చినా కొద్దిసేపే క్రీజులో ఉన్నాడు. ఇప్పుడు లయను అందుకుంటే బెన్ డకెట్‌తో ఓపెనింగ్ వికెట్‌కు భారీ ఆరంభం ఇవ్వగలడు. ఇదే జరిగితే... తదుపరి పరుగుల ప్రవాహాన్ని బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్‌లు తీసుకెళ్తారు. ఆర్చర్, సకిబ్ మహమూద్ పేస్‌తో ఆకట్టుకుంటుండగా, స్పిన్‌తో ఆదిల్ రషీద్ నిలకడను ప్రదర్శిస్తున్నాడు. సిరీస్ చేజారినా... సమరంలో పట్టు కోల్పోరాదని ఐదో టి20లో నిరూపించుకోవాలని ఇంగ్లండ్ బృందం చూస్తోంది. పిచ్, వాతావరణం వాంఖెడే బ్యాటింగ్‌కు అచ్చొచ్చే పిచ్. చాలా మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి టి20ల్లో చేజింగ్ జట్లకు విజయ అవకాశాలిచ్చింది. అలాగని బౌలింగ్ తేలిపోదు. స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు. వాన ముప్పు లేదు.5 వాంఖెడే మైదానంలో ఇప్పటి వరకు భారత జట్టు ఐదు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టే నెగ్గింది. -
పాండ్యా, దూబే మెరుపులు.. 3–1తో సిరీస్ టీమిండియా వశం (ఫొటోలు)
-
T20 WC 2025: వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఆసీస్ చిత్తు
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఈవెంట్లో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణఈ క్రమంలో శుక్రవారం ఉదయం సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా(South Africa Women U19 vs Australia Women U19) మధ్య తొలి సెమీ ఫైనల్(Semi Final-1) మ్యాచ్ జరిగింది. కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు కంగారు జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.ఓపెనర్లలో ఇనెస్ మెకియోన్ డకౌట్ కాగా.. గ్రేస్ లియాన్స్ 2 పరుగులే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ లూసీ హామిల్టన్() 18 పరుగులు చేయగా.. మిగతా వాళ్లలో ఎలియనోర్ లారోసా(7), హస్రత్ గిల్(1), చ్లోయే ఐన్స్‌వర్త్(1), లిలీ బాసింగ్వైట్(2), టెగాన్ విలియమ్సన్(3*) పూర్తిగా విఫలమయ్యారు.105 పరుగులేఅయితే, మిడిలార్డర్ బ్యాటర్ కాయిమే బ్రే 36 పరుగులతో రాణించగా.. ఎల్లా బ్రిస్కో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఆష్లే వాన్ విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంతబిసెంగ్ నిని, కెప్టెన్ కైలా రెయ్నెకె, షేష్నీ నాయుడు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ జెమ్మా బోతా(24 బంతుల్లో 37 రన్స్) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సిమోనే లౌరెన్స్(5) మాత్రం నిరాశపరిచింది.రాణించిన కెప్టెన్వన్డౌన్ బ్యాటర్ ఫే కౌలింగ్(7) కూడా విఫలం కాగా.. కైలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడింది. 26 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మేసో(19) కాసేపు క్రీజులో నిలబడగా.. మికే వాన్వూస్ట్ 8, షేష్నీ నాయుడు 2 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.1 ఓవర్లలో 106 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మహిళ అండర్-19 టీ20 వరల్డ్‌కప్ సెకండ్ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ ఆష్లే వాన్ విక్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో బెర్తు కోసంఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాతో ట్రోఫీ కోసం తలపడుతుంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక తాజా ఎడిషన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా స్థాయికి తగ్గట్లు రాణించి సెమీ ఫైనల్ వరకు వచ్చింది. మరోసారి చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది.చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం -
సొంతమా... సమమా!
పుణే: ఓ జట్టుది సిరీస్ గెలిచే ఆరాటం... మరో జట్టుది సిరీస్‌లో నిలిచే పోరాటం... వేదికేమో పరుగుపెట్టే పుణే స్టేడియం... ఈ నేపథ్యంలో భారత్(India), ఇంగ్లండ్(England) జట్ల మధ్య శుక్రవారం జరిగే నాలుగో టి20(T20) అసలైన మెరుపుల మజాను పంచనుంది. ఆశించినట్లు రాత్రి ఇదే జరిగితే నిజమైన చుక్కలతో పాటు బంతి కూడా పదేపదే చుక్కల్లోకెక్కడం ఖాయం! ఈ పరుగుల విందులో పైచేయి సాధిస్తే భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది. కానీ గత మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ పట్టుబిగిస్తే మాత్రం సిరీస్ 2–2తో సమమవుతుంది. అప్పుడు ఇరుజట్లు ద్వైపాక్షిక సిరీస్ కోసం ‘ఫైనల్స్’ ఆడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగో టి20 ఈ సిరీస్‌లోనే ఆసక్తికర సమరంగా జరగనుంది. దీంతో ప్రేక్షకులకు గత మూడు మ్యాచ్‌లుగా కరువైన టి20 విందు ఈ పోరుతో తీరుతుంది. సామ్సన్‌కు ఏమైంది... భారత స్టార్లు రోహిత్, కోహ్లిలు టి20లకు బైబై చెప్పడంతో తదుపరి టి20 ప్రపంచకప్‌కు కోచ్ గంభీర్ సన్నద్ధం చేసే జట్టులో ఓపెనర్ సంజూ సామ్సన్ కీలకం. కోచ్ గౌతీ వచ్చాక ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్లో అతనికి విరివిగా ఆవకాశాలిస్తున్నాడు. అతనూ గత సిరీస్‌లలో వరుస సెంచరీలు, లేదంటే ఓపెనింగ్ మెరుపులతో అలరించాడు.కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. ఇది ఇన్నింగ్స్‌పై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. దీనికి కెప్టెన్ సూర్యకుమార్ వైఫల్యం అదనం! దీనివల్ల టీమిండియా రెండు మ్యాచ్‌లైతే గెలిచింది కానీ... టి20లకు తగిన ఆటతీరును మాత్రం టి20 ప్రపంచ చాంపియన్ ఇంకా ఆడలేదన్నది వాస్తవం. బౌలింగ్ విభాగంలో షమీని కొనసాగించి, విశ్రాంతినిచి్చన అర్‡్షదీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటే... గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను పక్కనబెట్టే అవకాశముంది. పుంజుకున్న బట్లర్ బృందం మూడో టి20లో మెరిపించి తర్వాత కుదుపులకు గురైనా కూడా కోలుకున్న తీరు, పుంజుకున్న వైనం ఇంగ్లండ్ జట్టులో సిరీస్ ఆశల్ని రేపింది. ఇదే సమరోత్సాహంతో ఇప్పుడు వరుసగా రెండో విజయంపై కన్నేసిన బట్లర్ సేన సిరీస్‌ను 2–2తో సమం చేయడానికి సర్వసన్నద్ధమై ఉంది. సాల్ట్ ఓపెనింగ్‌లో దంచేస్తే ఇంగ్లండ్ జోరుకు అదనపు బలం ఖాయం. ఆర్చర్, వుడ్, కార్స్లతో పాటు స్పిన్‌తో కట్టిపడేస్తున్న అదిల్ రషీద్ ఉన్న బౌలింగ్ విభాగం భారత్‌కు సవాల్ విసిరేందుకు సై అంటోంది. 4 పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో ఇప్పటి వరకు భారత జట్టు నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ జట్టుతో 2012 ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మిగతా మూడు టి20 మ్యాచ్‌లు శ్రీలంక జట్టుతో జరిగాయి. పిచ్, వాతావరణం పుణే పిచ్ బ్యాటింగ్‌కు, ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్ మెరుపులకు అనువైంది. రెండేళ్ల క్రితం శ్రీలంక 200 పైచిలుకు స్కోరు చేస్తే... ఛేదనలో భారత్ 190 వరకు వచ్చి కేవలం 15 పరుగుల తేడాతోనే ఓడింది. ఈ నేపథ్యంలో బౌలర్లకు సవాల్ తప్పదు. వాతావరణంతో ఏ సమస్యా లేదు. వానముప్పూ లేదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), సామ్సన్, అభి షేక్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యా, సుందర్, అక్షర్, జురేల్, షమీ, రవిబిష్ణోయ్/అర్ష్ దీప్, వరుణ్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. -
నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20
-
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
వడోదరలో జరిగిన పోరులో అదరగొట్టిన భారత మహిళల జట్టు
-
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
SMAT 2024: రికీ భుయ్ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. గ్రూప్ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్ జట్టును ఓడించింది.కెప్టెన్ రికీ భుయ్ విధ్వంసంటాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. మరోవైపు.. ప్రసాద్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్ బౌలర్లలో పూనమ్ పూనియా, మోహిత్ రాఠి, వినీత్ ధన్కడ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.అగ్రస్థానంలోకెప్టెన్ మోహిత్ అహ్లావత్ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వినీత్ ధన్కడ్ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. స్కోరు వివరాలు ఆంధ్ర ఇన్నింగ్స్: కోన శ్రీకర్ భరత్ (సి) అరుణ్ (బి) పూనమ్ పూనియా 63; అశ్విన్ హెబర్ (సి) అరుణ్ (బి) విశాల్ 1; షేక్ రషీద్ (సి) అరుణ్ (బి) పుల్కిత్ నారంగ్ 21; రికీ భుయ్ (సి) వినీత్ (బి) విశాల్ 84; పైలా అవినాశ్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 5; ప్రసాద్ (సి) విశాల్ (బి) పూనమ్ పూనియా 28; శశికాంత్ (సి) పూనమ్ పూనియా (బి) వినీత్ 0; వినయ్ కుమార్ (నాటౌట్) 7; సత్యనారాయణ రాజు (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. బౌలింగ్: పూనమ్ పూనియా 4–0–37–2; గౌరవ్ శర్మ 3–0–43–0; విశాల్ గౌర్ 4–0–50–2; మోహిత్ రాఠి 4–0–35–0; పుల్కిత్ 1.5–0–17–1; వినీత్ ధన్కడ్ 2.1–0–24–2; నితిన్ తన్వర్ 1–0–16–0. సర్వీసెస్ ఇన్నింగ్స్: కున్వర్ పాఠక్ (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 2; రజత్ (సి) భరత్ (బి) శశికాంత్ 33; నితిన్ తన్వర్ (ఎల్బీ) రాజు 1; వినీత్ (సి) వినయ్ (బి) శశికాంత్ 51; మోహిత్ అహ్లావత్ (సి) రికీ భుయ్ (బి) రాజు 74; అరుణ్ (బి) శశికాంత్ 0; మోహిత్ రాఠి (సి) అవినాశ్ (బి) స్టీఫెన్ 5; గౌరవ్ శర్మ (రనౌట్/స్టీఫెన్) 3; పూనమ్ పూనియా (సి) ప్రసాద్ (బి) స్టీఫెన్ 17; విశాల్ గౌర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. బౌలింగ్: స్టీఫెన్ 4–0–26–3; శశికాంత్ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్ కుమార్ 4–0–35–0; యశ్వంత్ 4–0–43–0. -
సఫారీలకు చుక్కలు చూపించిన టీమిండియా.. రికార్డులు బ్రేక్ (ఫొటోలు)
-
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
#INDvsSA : తొలి టి20లో భారత్ ఘన విజయం...సెంచరీతో చెలరేగిన సామ్సన్ (ఫొటోలు)
-
Asia T20 Cup: సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. ఫైనల్లో ఎంట్రీ
వర్దమాన టీ20 క్రికెట్ జట్ల ఆసియా కప్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అల్ అమెరత్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక-‘ఎ’ జట్టు పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ అర్ధ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు.Omair Yousuf sits back and brings out the reverse sweep 6️⃣@TheRealPCB#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/PTyFhDF7OJ— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024దుషాన్ హేమంత తిప్పేశాడుఅయితే, యూసఫ్నకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. లంక బౌలర్లను ఎదుర్కోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వన్‌డౌన్ బ్యాటర్ కెప్టెన్ మహ్మద్ హ్యారిస్(6) పూర్తిగా విఫలం కాగా.. తర్వాతి స్థానాల్లో వచ్చిన కాసిం అక్రం(0), హైదర్ అలీ(14), అరాఫత్ మిన్హాస్(10), అబ్దుల్ సమద్(0), అబ్బాస్ ఆఫ్రిది(9), మహ్మద్ ఇమ్రాన్(13), సూఫియాన్ ముఖీం(4 నాటౌట్), షానవాజ్ దహానీ(0- నాటౌట్) చేతులెత్తేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ దుషాన్ హేమంత అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్లు నిపుణ్ రన్సిక, ఇషాన్ మలింగ రెండేసి వికెట్లు కూల్చారు.అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశోద లంక (11- అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్) తక్కువ స్కోరుకే వెనుదిరగాల్సి వచ్చినా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదర 20 బంతుల్లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ అహాన్ విక్రమసింఘే సూపర్ హాఫ్ సెంచరీతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ నువానిడు ఫెర్నాండో(9) విఫలం కాగా.. సహాన్ అరాచ్చిగె(16 బంతుల్లో 17)ఫోర్ బాది లంకను విజయతీరాలకు చేర్చాడు.ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోఈ క్రమంలో 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక రెండో సెమీ ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత-‘ఎ’ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టుతో శ్రీలంక టైటిల్ కోసం ఆదివారం(అక్టోబరు 27) తలపడుతుంది.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్
గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఇంగ్లండ్ మహిళల జట్టు బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును ఓడించి ఈ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.ఫలితంగా గ్రూప్ ‘బి’లో తమ అగ్రస్థానాన్ని ఇంగ్లండ్ పటిష్టపర్చుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సోఫీ ఎకెల్‌స్టోన్ (2/15)తో పాటు ఇతర బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు సాధించి గెలిచింది. నాట్ సివర్ బ్రంట్ (36 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు), డానీ వ్యాట్ (43 బంతుల్లో 43; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 64 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రాణించిన కెప్టెన్దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ వోల్వార్ట్ మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. తొలి వికెట్‌కు వోల్వార్ట్, తజ్మీన్ బ్రిట్స్ (19 బంతుల్లో 13; 1 ఫోర్)తో కలిసి 31 బంతుల్లో 31 పరుగులు జోడించడంతో జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. ఆ తర్వాత అనేక్ బాష్ (26 బంతుల్లో 18; 1 ఫోర్) కూడా కొద్దిసేపు కెప్టెన్‌కు అండగా నిలిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ స్కోరు 54 పరుగులకు చేరింది. ఈ దశలో ఇంగ్లండ్ స్పిన్నర్లు ప్రత్యరి్థని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో ఉన్నవోల్వార్ట్ను ఎకెల్‌స్టోన్(Sophie Ecclestone) చక్కటి బంతితో బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కెప్టెన్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన 26 బంతుల్లో దక్షిణాఫ్రికా 36 పరుగులు చేసింది. మరిజాన్ కాప్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు), ఇన్నింగ్స్ చివర్లో డెర్క్సెన్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన దక్షిణాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరును అందించాయి.కీలక భాగస్వామ్యం... షార్జా మైదానంలో గత నాలుగు మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైన స్కోరును దక్షిణాఫ్రికా నమోదు చేయగా... దానిని ఛేదించే లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఆరంభంలోనే మయా బౌచర్ (20 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరిగినా... వ్యాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. అలైస్ క్యాప్సీ (16 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో వ్యాట్, బ్రంట్ భాగ స్వామ్యం జట్టును గెలుపు దిశగా నడిపించింది.ఈ ఇద్దరు సీనియర్ల జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. 11–15 ఓవర్ల మధ్యలో 39 పరుగులు చేసిన ఇంగ్లండ్ చివరి 5 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివర్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఇంగ్లండ్ గెలుపు గీత దాటింది. విజయానికి 11 పరుగుల దూరంలో వ్యాట్ వెనుదిరగ్గా... బ్రంట్ మిగిలిన పనిని పూర్తి చేసింది. సఫారీ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. మంగళవారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో న్యూజిలాండ్ తలపడుతుంది. ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువేదిక- షార్జాటాస్- సౌతాఫ్రికా.. బ్యాటింగ్సౌతాఫ్రికా స్కోరు: 124/6 (20)ఇంగ్లండ్ స్కోరు: 125/3 (19.2)ఫలితం: సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం.చదవండి: IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది -
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్‌లు అందుకున్నారు. వైజాగ్‌కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్లో తన ఎక్స్‌ప్రెస్ బౌలింగ్‌తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
లివింగ్ స్టోన్ ఊచకోత.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘన విజయం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఆసీస్ బ్యాటర్లలో యువ ఆటగాడు ఫ్రెజర్ మెక్‌గర్క్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోష్ ఇంగ్లిష్(42), హెడ్(31), మాథ్యూ షార్ట్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుర్రాన్, రషీద్ చెరో వికెట్ సాధించారు.లివింగ్ స్టోన్ ఊచకోత..అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లడ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు.అతడితో పాటు జాకబ్ బితల్(24 బంతుల్లో 44), కెప్టెన్ సాల్ట్(23 బంతుల్లో 39) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ మాథ్యూ షార్ట్ 5 వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. అతడితో పాటు అబాట్ రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన లైమ్ లివింగ్ స్టోన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 15న జరగనుంది.చదవండి: టీమిండియా ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్: గంభీర్, దాదాకు దక్కని చోటు -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్‌రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్‌కు ఫోర్‌తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్‌పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
‘క్లీన్‌స్వీప్’పై భారత్ గురి
బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్‌కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్... ఈ సిరీస్ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్‌లే ఉండటంతో పొట్టి ఫార్మాట్లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్‌ను బాగా సది్వనియోగం చేసుకోవాలి. కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం, బౌలింగ్ పదునెక్కడంతో భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్ దృష్ట్యా అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్‌రౌండ్ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది. దూబేను ఆపతరమా... ఈ సిరీస్‌లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్లో భర్తీ చేయదగ్గ బ్యాటర్లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్‌కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్‌కు బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్‌తో అర్‡్షదీప్, ముకేశ్ కుమార్... స్పిన్‌తో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
'సూర్య' ప్రతాపం.. టీ20 కింగ్ (ఫోటోలు)
-
INDvsSA : మూడో T20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
India vs South Africa 2nd T20: వరుణుడు కరుణిస్తేనే...
పోర్ట్ట్ ఎలిజబెత్: వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న ఈ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లతో జట్టును సిద్ధం చేసుకోవాలని ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాలు చూస్తుంటే ప్రతికూల వాతావరణం పెను సమస్యగా మారింది. తొలి మ్యాచ్ వర్షంలో కోట్టుకుపోగా... ఇప్పుడు రెండో టి20కి కూడా వానముప్పు ఉండటం ఇరుజట్లకు ఇబ్బందిగా మారింది. జట్లకే కాదు... మ్యాచ్‌ల్ని అస్వాదించాలనుకున్న అభిమానులకు, రూ.కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ)కు కూడా ఈ వాతావరణ పరిస్థితులు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి ఆలస్యంగా మొదలవనున్న రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ జరిగినా మెరుపుల టి20ని చూడొచ్చని ఆశిస్తున్నారు. టాస్ పడితే... డర్బన్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే జట్లు టాస్ పడి ఆటకు బాట పడాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఆసీస్‌తో సొంతగడ్డపై యువభారత్‌ను నడిపించిన సూర్యకుమార్‌కు ఈ సిరీస్‌లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పలువురు అనుభవజు్ఞలు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్‌లు జతవడంతో టీమిండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఆ్రస్టేలియాపై అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్‌లు కూడా తమ ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కొత్త ముఖాలు మాథ్యూ బ్రీట్జ్కె, బర్గర్లను పరీక్షించాలనుకుంటే కుదరడం లేదు. దీంతో బవుమా లేని జట్టులో మార్క్రమ్ తన మార్క్ చూపించేందుకు అవకాశం చిక్కడం లేదు. మ్యాచ్ రోజు వానపడినా... మ్యాచ్ సమయానికల్లా తెరిపినిస్తే బాగుంటుంది. ఇదే జరిగితే ఇరుజట్లలోని యువ ఆటగాళ్లంతా కొండంత ఊరట పొంది ఆటపై దృష్టిపెడతారు. తమ సత్తా చాటుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. -
సమరానికి సై...
ముంబై: భారత పురుషుల జట్టు ఇటీవల పొట్టి ఫార్మాట్లో ఆ్రస్టేలియాపై అదరగొట్టింది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా అలాంటి ప్రదర్శనే ఇచ్చేందుకు ఇంగ్లండ్‌తో టి20 సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి వాంఖెడె స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ ఏడాది హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ప్రత్యేకించి టి20 ఫార్మాట్లో రాణించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సహా... బంగ్లాదేశ్ గడ్డపై 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సఫారీ గడ్డపై జరిగిన ముక్కోణపు టి20 సిరీస్‌లోనూ భారత మహిళల జట్టు మెరుగ్గా రాణించి ఫైనల్లో రన్నరప్‌గా సంతృప్తి పడింది. అక్కడే జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరాయి. కానీ ప్రత్యర్థుల చేతిలో ఇరు జట్లు ఓటమి చవిచూశాయి. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్‌తో పేలవమైన గత రికార్డును మరిచేలా చక్కని ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఐసీసీ టి20 ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొమ్మిది టి20 మ్యాచ్‌లాడితే కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. మరోవైపు రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ జట్టు 1–2తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ అనుకూలతలను వినియోగించుకొని ఫామ్‌లో ఉన్న హర్మన్ బృందం ఈ సిరీస్‌లో గట్టి సవాల్ విసిరేందుకు సన్నద్ధమైంది. పురుషులతో పోల్చితే పరిమిత సంఖ్యలో జరిగే మ్యాచ్‌లతో అమ్మాయిల జట్టు... వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌కు మేటి జట్టుగా బరిలోకి దిగాలని ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన, టాపార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్లో హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. పిచ్, వాతావరణం వాంఖెడె వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. తూర్పు తీరాన్ని తుఫాను వణికిస్తున్నా... ముంబైలో ఆ బెడద లేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచితంగా మైదానంలోకి అనుమతి ఇస్తున్నారు. 27 ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 27 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 7 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. భారత్‌లో ఈ రెండు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో టీమిండియా, 7 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. -
విజయంతో ముగించేందుకు
బెంగళూరు: భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్ ఆఖరి మజిలీకి చేరింది. మరో గెలుపుతో సిరీస్ ఆధిక్యాన్ని 4–1కు చేర్చుకోవాలిన టీమిండియా చూస్తుంటే... సిరీస్ ఎలాగూ చేజారింది కాబట్టి విజయంతోనైనా ముగింపు పలికి తిరుగుముఖం పట్టాలని కంగారూ సేన భావిస్తోంది. అయితే జట్ల బలాబలాల విషయానికొస్తే మాత్రం సూర్యకుమార్ సేనే పటిష్టంగా కనిపిస్తోంది. సిరీస్ ఇదివరకే సాధించడం, బౌలర్లు ఫామ్‌లోకి రావడం ఆతిథ్య భారత్‌ను దుర్బేధ్యంగా మార్చింది. వన్డే ప్రపంచకప్ సాధించిన ఆసీస్ జట్టు సభ్యుల్లో ఒక్క ట్రవిస్ హెడ్ తప్ప మిగిలిన 10 మంది ఆటగాళ్లంతా కొత్తవారే కావడం, నిలకడ లోపించడం కంగారూను మరింత కలవరపెడుతోన్న అంశం. బౌలింగ్ బలగం గత నాలుగు మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే భారత్ బ్యాటింగ్ జోరుతో తొలి మూడు టి20ల్లో అవలీలగా 200 పైచిలుకు పరుగులు చేసింది. యశస్వి, రుతురాజ్, కెపె్టన్ సూర్యకుమార్, రింకూ సింగ్ ఇలా వీరంతా మెరిపించినవారే! కానీ బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోరు చేశాక కూడా మూడో టి20లో భారత్ ఓడింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మాత్రం గత మ్యాచ్‌లకు భిన్నంగా తక్కువ స్కోరు చేసినా టీమిండియా సిరీస్ విజయాన్ని అందుకుంది. దీనికి బౌలింగ్ పదును పెరగడమే కారణం. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌ల స్పిన్, దీపక్ చహర్ పేస్‌లతో భారత్ బౌలింగ్ బలం పెరిగింది. ఇప్పుడు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏమాత్రం ఒత్తిడి లేని ఆఖరి మ్యాచ్‌లో గెలవడం కష్టం కానేకాదు. గత మ్యాచ్‌లో హిట్టర్ జితేశ్ శర్మ కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల కోసం వచ్చిన శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించే పనిలో పడితే మాత్రం భారత్ మరో 200 పరుగుల్ని చేయడం ఇంకాస్త సులువవుతుంది. ఒత్తిడిలో ఆసీస్ నాలుగో టి20లో టాస్ నెగ్గినప్పటికీ ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ ఆర్డర్‌పై నమ్మకంతో చేజింగ్ ఎంచుకొని భంగపడింది. దీంతోనే సిరీస్‌నూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియాపైనే సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలనన్న ఒత్తిడి భారంగా మారింది. హెడ్ మెరిపిస్తున్నా... ఫిలిప్, హార్డీ, టిమ్ డేవిడ్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడం బ్యాటింగ్ ఆర్డర్‌ను ఆందోళన పరుస్తోంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వన్డే జట్టు విజయంతో ఇంటికెళ్లినట్లే... టి20 జట్టు సిరీస్‌తో కాకపోయినా... ఆఖరి ఫలితంతో సంతృప్తిగా స్వదేశం వెళ్లాలంటే ఆటగాళ్లంతా మరింత బాధ్యత కనబరచాల్సి వుంటుంది. పిచ్–వాతావరణం ఇక్కడి చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు బాగా కలిసొచ్చే గ్రౌండ్. ప్రతీసారి కూడా బౌండరీలు, సిక్సర్ల మజాను పంచుతోంది. కాబట్టి టాస్ గెలిస్తే ఏ జట్టయినా ఛేదనకే మొగ్గు చూపుతుంది. ఆటకు వాన ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, ముకేశ్. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్ (కెపె్టన్), ఫిలిప్, హెడ్, మెక్‌డెర్మాట్, అరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, షార్ట్, డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, బెహ్రెన్‌డార్‌్ఫ, తనీ్వర్ సంఘా/నాథన్ ఎలిస్. -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
హాట్‌కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్–ఆస్ట్రేలియా టీ20 తొలి మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఏసీఏ ఆధ్వర్యంలో పేటీఎం ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ముగించగా శుక్రవారం ఐదు వేల టికెట్లను ఆరు డినామినేషన్లలో కౌంటర్ల ద్వారా విక్రయించారు. వైఎస్సార్ స్టేడియంతో పాటు టౌన్ కొత్తరోడ్, గాజువాకల్లోని మున్సిపల్ స్టేడియాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించారు. కనీస ధర రూ.600 నుంచి గరిష్ట ధర రూ.6000లో పాటు రూ.1500, రూ.2000,రూ.3000,రూ.3500లు టికెట్లను మూడు ప్రాంతాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయాన్ని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్టేడియంలో ప్రవేశానికి ఫిజికల్ టికెట్లుగా మార్చుకునేందుకు ఆయా సెంటర్లలోనే 22వ తేదీవరకు అవకాశం కల్పించగా మ్యాచ్ జరిగే రోజు ఈనెల23న స్టేడియంలోనూ టికెట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో శనివారం సైతం ఆరు డినామినేషన్లలో టికెట్లను ఆయా కౌంటర్ల ద్వారా విక్రయించనున్నామని తెలిపారు. -
ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్..ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం
-
IND vs WI: భారత్‌పై వెస్టిండీస్ విజయం.. సిరీస్ కైవసం
భారత్, వెస్టిండీస్ మద్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపొందింది. దీంతో టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత జట్టు 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని విండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు.. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్ ముందు మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. గత మ్యాచ్‌లో చెలరేగిన శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ సింగిల్ డిజిట్ పరుగులకే వెనుదిరిగారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. అది కూడా మహిళల టి20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్ 20 పరుగులు చేసింది. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో అలియా రియాజ్ 29 పరుగులు, నిదా దార్ 27 పరుగులు, బిస్మా మరుఫ్ 26 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్, కరీష్మా, షమీలా కనెల్లు తలా ఒక వికెట్ తీశారు. పాక్ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఆ ఓవర్లో ఒక వికెట్‌తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్ చినెల్లే కూడా సూపర్‌గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్ ఔట్ కావడంతో మ్యాచ్ విండీస్ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం' -
వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నిలకడగా ఆడుతున్న టీమిండియా ► సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30 పరుగులు), రిచా ఘోష్(22 పరుగులు) ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 22 పరుగులు కావాల్సి ఉంది. 8 ఓవర్లలో టీమిండియా స్కోరు 44/3 ► 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ 8 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక్క పరుగుకే వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే షఫాలీ వర్మ(28 పరుగులు) మూడో వికెట్‌గా వెనుదిరిగింది. టీమిండియా వుమెన్స్ టార్గెట్ 119 పరుగులు ► టీమిండియా వుమెన్స్‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత క్యాంప్బెల్లె(30 పరుగులు), స్టెఫానీ టేలర్(42 పరుగులు).. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం విండీస్ కష్టాలు పెంచింది. ఆ తర్వాత భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేకపోయింది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్ ► చినెలి హెన్రీ(2) రనౌట్ కావడంతో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం విండీస్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ► ఒక్క ఓవర్లోనే వెస్టిండీస్ రెండు వికెట్లను కోల్పోయింది. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తొలుత 30 పరుగులు చేసిన క్యాంప్బెల్లె స్మృతి మంధాన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఓవర్ చివరి బంతికి 42 పరుగులు చేసిన టేలర్ ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో వెస్టిండీస్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లలో వెస్టిండీస్ 53/1 ► తొలి వికెట్ ఆరంభంలోనే కోల్పోయినప్పటికి వెస్టిండీస్ తన ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. స్టెఫాని టేలర్ 28, క్యాంప్బెల్లె 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో విండీస్ స్కోరు 15/1 ► 4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 15 పరుగులు చేసిది. టేలర్ 3, క్యాంప్‌బెల్లే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ► వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో పూజా వస్త్రాకర్ టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ హేలీ మాథ్యూస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. విండీస్ జట్టు ప్రస్తుతం వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న వెస్టిండీస్ వుమెన్స్ ► మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్-బిలో ఇవాళ ఇండియా వుమెన్స్, వెస్టిండీస్ వుమెన్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళల జట్టు బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది. భారత మహిళల తుదిజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ వెస్టిండీస్ మహిళల తుదిజట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), స్టాఫానీ టేలర్, షెమైన్ కాంప్బెల్లె, షబికా గజ్నాబి, చినెల్లే హెన్రీ, చెడియన్ నేషన్, అఫీ ఫ్లెచర్, షామిలియా కన్నెల్, రషదా విలియమ్స్ (వికెట్ కీపర్), కరిష్మా రామ్‌హారక్, షకేరా సెల్మాన్ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్.. వెస్టీండీస్తో మ్యాచ్‌లో అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ వుమెన్స్‌తో మ్యాచ్‌లో విండీస్ ఓటమిపాలైంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు వేలిగాయంతో దూరమైన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు తిరిగిరావడం బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. -
ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్.. దుమ్మురేపిన ఇండియా అమ్మాయిలు ( ఫొటోలు)
-
నీ పని నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు
టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘క్రికెట్ నిబంధనలు తెలియకుండానే ‘స్టార్ బౌలర్’గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు చూసుకోకుండా పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లండ్‌కు మద్దతుగా నిలవాలనుకుంటే అలాగే చేయొచ్చు.. కానీ అందుకు దీప్తి పేరు ప్రస్తావించాల్సి అవసరం లేదని మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బ్రిటిష్ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో దీప్తి శర్మకు మద్దతు కూడా లభించింది. నిబంధనలకు అనుగుణంగానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆమె రనౌట్ చేసిందని పలువురు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి టీ20 మ్యాచ్ సందర్భంగా మిచెల్ స్టార్క్‌కు.. జోస్ బట్లర్‌ను రనౌట్ చేసే అవకాశం లభించింది. కానీ అతడు.. ఇంగ్లండ్ సారథికి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ‘‘నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇక ఈ విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదాని స్పందిస్తూ.. ‘‘స్టార్క్ నువ్వింకా ఎదగాలి! నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆటలో భాగంగా దీప్తి చేసిన పని నిబంధనలకు అనుగుణంగానే ఉంది. నువ్వు ఒకవేళ నాన్‌స్ట్రైకర్‌ను హెచ్చరించాలని భావిస్తే అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేగానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్ స్టార్క్‌ను విమర్శించాడు. ఈ మేరకు బదాని చేసిన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును.. నువ్వు దీప్తిశర్మవు కావు. కాలేవు. ఎందుకంటే నీకు రూల్స్ ఫాలో అయ్యే ధైర్యం లేదు కదా! అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్‌ను ఏకిపారేస్తున్నారు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ Grow up Starc. That’s really poor from you. What Deepti did was well within the rules of the game. If you only want to warn the non striker and not get him out that’s fine and your decision to make but you bringing Deepti into this isn’t what the cricket world expects of you https://t.co/vb0EyblHB8 — Hemang Badani (@hemangkbadani) October 15, 2022 -
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
రూ.850 టికెట్ ను రూ.11వేలకు విక్రయిస్తుండగా పట్టివేత
-
భారత్ , ఆసీస్ టీ-20 మ్యాచ్ పై భారీగా బెట్టింగులు
-
ఇవాళ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ చివరి టీ20
-
Ind Vs Aus: ఉప్పల్‌లో నాడు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్! 50 బంతుల్లోనే ఏకంగా..
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్‌కు హైదారాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 12 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపై ఆదివారం(సెప్టెంబరు 25) మరో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు, పిచ్ స్వభావం, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలు తెలుసుకుందాం! మొదటి మ్యాచ్ ఎవరితో అంటే! ►2005లో నవంబర్ 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఈ వేదికపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ►2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ►2017లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు షెడ్యూల్ ఖారారైనా ఆ మ్యాచ్ రద్దైంది. ►ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఏకైక టీ–20 మ్యాచ్ జరిగింది. ►ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ►ఇక ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 55 వేలు ఎవరిది పైచేయి..? ఉప్పల్ వేదికగా జరిగిన 5 టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అదే విధంగా.. ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో... నాడు చెలరేగిన కోహ్లి! ఏకంగా.. వెస్టిండీస్‌తో జరిగిన టీ–20 మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఇక కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్పల్ స్టేడియంలో టీ20 ఫార్మాట్(ఇంటర్నేషనల్)లో నమోదైన స్కోర్లు: ►అత్యధిక స్కోరు: 209/4- భారత్ ►అత్యల్ప స్కోరు: 207/5- వెస్టిండీస్ ►అత్యధిక పరుగులు సాధించింది(అత్యధిక వ్యక్తిగత స్కోరు): 94- నాటౌట్- విరాట్ కోహ్లి ►అత్యధిక సిక్సర్లు: కోహ్లి- 6 ►అత్యధిక వికెట్లు: యజువేంద్ర చహల్(భారత్), ఖరీ పియర్(వెస్టిండీస్)- చెరో రెండు వికెట్లు ►బౌలింగ్ అత్యుత్తమ గణాంకాలు: యుజువేంద్ర చహల్(4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు) ►అత్యధిక భాగస్వామ్యం: కోహ్లి- కేఎల్ రాహుల్(100 పరుగులు) పిచ్ స్వభావం పాతబడే కొద్ది నెమ్మదిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. గతంలో ఇక్కడ టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి. మ్యాచ్ సమయం, లైవ్ స్ట్రీమింగ్ ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- ఆసీస్ మ్యాచ్ ఆరంభం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం. మ్యాజిక్ రిపీట్ చేయాలి! ఇక ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని కింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆసీస్ విజయం సాధించగా.. నాగ్‌పూర్‌లో రోహిత్ సేన గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. చదవండి: హైదరాబాద్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్; స్టేడియానికి ఇలా వెళితే బెటర్! Ind Vs Aus 2nd T20: పాక్ రికార్డును సమం చేసిన రోహిత్ సేన! ఇక విరాట్ వికెట్ విషయంలో.. -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
Asia Cup: ఇంకో 10 పరుగులు చేసినా బాగుండు.. ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి
Asia Cup 2022 Bangladesh vs Afghanistan: ఆసియా కప్-2022 టోర్నీలో అఫ్గనిస్తాన్ అదరగొడుతోంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన నబీ బృందం... మంగళవారం(ఆగష్టు 30) బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. షార్జా వేదికగా సాగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తద్వారా గ్రూప్- బి టాపర్‌గా నిలిచి సూపర్ 4కు అర్హత సాధించింది. మరోవైపు.. బంగ్లాదేశ్.. శ్రీలంకతో మ్యాచ్‌లో గెలిస్తే తప్ప రేసులో నిలవలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్ మాట్లాడుతూ.. తమ జట్టు కనీసం 140 పరుగులు నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘోర ఓటమి కారణంగా తదుపరి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోక తప్పని స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు హొసేన్ మాట్లాడుతూ.. ‘‘టీ20 మ్యాచ్‌లలో ఆరంభంలోనే అంటే పవర్ ప్లేలో రెండు, మూడు వికెట్లు కోల్పోయామంటే పరిస్థితులు కఠినంగా మారతాయి. ఒకవేళ మేము 140 పరుగులైనా చేసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారింది. తదుపరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మా బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే బాగుండేది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా సెప్టెంబరు 1న శ్రీలంకతో బంగ్లాదేశ్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఇక బంగ్లాదేశ ఇటీవలి కాలంలో వెస్టిండీస్, జింబాబ్వేతో వరుసగా టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఐర్లాండ్‌కు టీ20 సిరీస్ కోల్పోయి.. ఆ వెంటనే యూఏఈకి చేరుకున్న అఫ్గనిస్తాన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో వరుస విజయాలు నమోదు చేయడం విశేషం. మ్యాచ్ ఇలా సాగింది( Afghanistan Beat Sri Lanka By 7 Wickets) అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అఫ్గన్ బౌలర్లు ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇద్దరూ కలిసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో షకీబ్ అల్ హసన్ బృందం.. ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆల్‌రౌండర్ ముసాదిక్ హొసేన్(31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఇక ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి అఫ్గన్‌ను గెలిపించాడు. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన ముజీబ్ వుర్ రహ్మాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Asia Cup 2022 IND Vs HK: హాంకాంగ్‌తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ د بریا شېبې 😍 ----- لحظات پیروزی 🥰 ----- Winning Moments 🤩#AfghanAtalan | #AsiaCup2022 pic.twitter.com/RsBlL0Cpbb — Afghanistan Cricket Board (@ACBofficials) August 30, 2022 -
Asia Cup 2022: ఆ జట్టు అస్సలు గెలవదు: టీమిండియా మాజీ క్రికెటర్
Asia Cup 2022- Bangladesh vs Afghanistan Winner Prediction: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మంగళవారం(ఆగష్టు 30) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్- బిలో ఉన్న షకీబ్ అల్ హసన్ బృందం.. అదే గ్రూప్‌లో ఉన్న అఫ్గనిస్తాన్‌తో షార్జా వేదికగా తలపడనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీ పడిన అఫ్గన్.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలో పరాభవాల తర్వాత ఈ టీ20 టోర్నీలో ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మంగళవారం నాటి మ్యాచ్‌లో విజేత ఎవరో తేల్చేశాడు. ఈ జట్టు అస్సలు గెలవదు! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ బలాబలాలు, విజయావకాశాలపై అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘బంగ్లాదేశ్ అస్సలు గెలిచే ఛాన్సే లేదు. సికందర్ రజా(జింబాబ్వే బ్యాటర్) వాళ్ల బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డేల్లో పర్లేదు గానీ.. టీ20లలో వాళ్ల పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదు. ఒకవేళ షార్జా పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే.. ఎక్కువ పరుగులు రాబట్టే అవకాశం లేకపోతే.. బంగ్లాదేశ్ విజయావకాశాలు కాస్త మెరుగుపడతాయి. అయితే, బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గట్టి పోటీనివ్వగలరు. ఇక మహ్మదుల్లా, సబ్బీర్ రెహమాన్, ముష్ఫికర్, షకీబ్ అల్ హసన్, మెహెదీ హసన్, మెహెదీ హసన్ మిరాజ్‌లు ఉన్నారు. కాబట్టి మరీ ఈ జట్టును చెత్త అని తీసిపారేలేము గానీ.. స్థాయికి తగ్గట్లు మాత్రం కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తారు! ఇక అఫ్గనిస్తాన్ జట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టు బాగుంది. వాళ్లు ఎక్కువగా సిక్సర్లు బాదటానికి ప్రయత్నిస్తారు. రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్.. ఈ పిచ్‌పై రాణించగలరు. మరీ ఎక్కువ బౌన్సీ వికెట్ కాదు కాబట్టి వాళ్లు విజృంభించగలరు’’ అని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. బౌలర్లు సైతం మెరుగ్గా రాణించగలరని, శ్రీలంకను కట్టడి చేసిన తీరును గుర్తుచేశాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అఫ్గన్ బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. లంకను 105 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫజల్హక్ ఫారూఖీ 3.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి లంక జట్టు పతనాన్ని శాసించాడు. ఇక బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగి ఏకంగా 40 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక శ్రీలంకపై విజయంతో అఫ్గనిస్తాన్ ప్రస్తుతం గ్రూప్-బి టాపర్‌గా ఉంది. బంగ్లాతో మ్యాచ్ గెలిస్తే సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో మరింత మెరుగైన స్థితికి చేరుకుంటుంది. ఇక బంగ్లా- అఫ్గన్ల మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం కానుంది. చదవండి: IND vs PAK: రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? Shubman Gill: ‘సారా’తో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి.. -
కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్..
నెదర్లాండ్స్ టూర్‌ను న్యూజిలాండ్ విజయంతో ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టి20లో కివీస్ 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం అందుకుంది. రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మార్టిన్ గప్టిల్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జేమ్స్ నీషమ్ 32 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. బాస్ డీ లీడి (53 బంతుల్లో 66, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంతవరకు నెదర్లాండ్స్ విజయంపై ఆశలు పెంచుకుంది. ఒక సందర్భంలో ఈ డచ్ బ్యాటర్ న్యూజిలాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అయితే లీడీతో పాటు స్కాట్ ఎడ్వర్డ్స్(20 పరుగులు) ఔటైన తర్వాత డచ్ ఓటమి ఖరారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4, బెన్ సీయర్స్ 3, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ చెరొక వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇవాళ(ఆగస్టు 8) జరగనుంది. చదవండి: Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
తొలి టి20లో దక్షిణాఫ్రికా గెలుపు
బ్రిస్టల్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రీజా హెన్డ్రిక్స్ (53 బంతుల్లో 74; 10 ఫోర్లు, 1 సిక్స్), ఎయిడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. లార్కన్ టకర్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జార్జ్ డాక్రెల్ (28 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లతో కలిసి గ్రూప్ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మరి భారత్- పాక్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం! భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్: ►తేది: జూలై 31, 2022 ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్, ఇంగ్లండ్ ►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్ కీపర్), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగెస్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా. స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ పాకిస్తాన్ జట్టు: బిస్మా మరూఫ్(కెప్టెన్), ముబీనా అలీ(వికెట్ కీపర్), ఆనమ్ అమిన్, ఐమన్ అన్వర్, డయానా బేగ్, నిదా దర్, గుల్ ఫిరోజా(వికెట్ కీపర్), తుబా హసన్, కైనట్ ఇంతియాజ్, సాదియా ఇక్బాల్, ఈరమ్ జావేద్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది. చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్ కెప్టెన్ Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని -
T20 WC: ఈసారి టీమిండియాను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు: అక్తర్
T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభమేమీ కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఈసారి భారత జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. కాబట్టి బాబర్ ఆజం బృందానికి గెలుపు అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ అనూహ్య రీతిలో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి ఐసీసీ టోర్నీలో భారత్‌పై తొలి గెలుపు నమోదు చేసింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అక్టోబరు 16న మెగా టోర్నీ మొదలు కానుంది. ఇందులో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్లు అక్టోబరు 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తలపడనున్నాయి. ఈసారి అంత వీజీ కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘ఈసారి టీమిండియా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లో భారత్‌ను ఓడించడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. ఇప్పుడే విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, మెల్బోర్న్ పిచ్ పాతబడే కొద్ది బౌన్సీగా తయారవుతుంది. ఫాస్ట్ బౌలర్లకు అనూకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిస్తే పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేయకూడదు’’ అని సూచించాడు. మొదట బ్యాటింగ్ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దాదాపు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు మెల్బోర్న్ గ్రౌండ్‌కు వచ్చే అవకాశం ఉందని అక్తర్ అంచనా వేశాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... T20 World Cup 2022: జెయింట్ రిషబ్ పంత్.. గాడ్జిల్లాలా ఎంట్రీ.. ! Welcome to The Big Time, Rishabh Pant 🚁 🚁#T20WorldCup pic.twitter.com/ZUSK63ssFZ — T20 World Cup (@T20WorldCup) July 10, 2022 -
నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్ల ముందున్న రికార్డులివే..!
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపు (జూన్ 17) జరుగబోయే నాలుగో టీ20కి ముందు టీమిండియా ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. రేపటి మ్యాచ్‌లో రిషబ్ పంత్ మరో సిక్సర్ బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్లో చేరతాడు. టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. భువనేశ్వర్ కుమార్ మరో 4 వికెట్లు తీస్తే బుమ్రా (67వికెట్లు)ను అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి అక్షర్ పటేల్ ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, 5 మ్యాచ్‌ల ప్రస్తుత టీ20 సిరీస్‌లో టీమిండియా 1-2తో వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా గెలుపొందగా, వైజాగ్‌లో జరిగిన మూడో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
విశాఖ వేదికగా భారత్- సౌతాఫ్రికా టి20 మ్యాచ్.. ఈ చిత్రాలు చూడాల్సిందే (ఫొటోలు)
-
విశాఖ వేదికగా భారత్- సౌతాఫ్రికా మూడో టి20.. సైడ్‌లైట్స్
బ్యాటర్లు బాధ్యతగా ఆడారు. సీమర్లు నిప్పులు చెరిగారు. స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పేశారు. కీలకమైన మ్యాచ్‌లో కుమ్మేసిన కుర్రాళ్లు.. అచ్చొచ్చిన స్టేడియంలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించారు. విశాఖలోనే సిరీస్ గెలిచేద్దామనుకున్న దక్షిణాఫ్రికా ఆశలు నెరవేర్చకుండా.. సిరీస్‌పై పట్టు సాధించారు. చాలా రోజుల విరామం తర్వాత విశాఖ.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో.. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పరిసర ప్రాంతాలు క్రికెట్ అభిమానులతో కిక్కిరిశాయి. యువత మన జట్టు టీ షర్టులు ధరించి తరలివచ్చారు. దీంతో స్టేడియానికి వెళ్లే దారుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా అభిమానుల కేరింతలతో కోలాహలం కనిపించింది. జాతీయ జెండా రెపరెపలు దర్శనమిచ్చాయి. భారత్– దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. సైడ్‌లైట్స్ ►మధ్యాహ్నం రెండు గంటల నుంచి క్రీడాభిమానులు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియానికి తరలివచ్చారు. ►ఎక్కడ చూసినా క్రీడా సందడి, పండగ వాతావరణం కనిపించింది. ►క్రీడాభిమానుల చేతుల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. ►సాయంత్రం 5 గంటలకే స్టేడియం నిండిపోయింది. 27,251 సీట్లు ఫుల్ అయిపోయాయి. ►స్టేడియం అంతా రెట్టించిన వెలుగులు. అవన్నీ అభిమానుల సెల్‌ఫోన్ లైట్లు. ►మ్యాచ్ ప్రారంభం అయిన గంటన్నర తర్వాత వరకు కూడా క్రీడాభిమానులను అదుపు చేయడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. ►రాత్రి 8.30 గంటల సమయంలో సీపీ శ్రీకాంత్ వచ్చి పరిస్థితి సమీక్షించారు. ►సచిన్ వీరాభిమాని సుధీర్‌కుమార్, ధోని వీరాభిమాని రాంబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ►ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ నమోదైంది. ►ఇక్కడ జరిగిన గత టీ–20ల్లో 127 పరుగులే అత్యధికం. ►ఇక్కడ టాస్ గెలిచి ఛేజింగ్ చేసిన జట్టుదే విజయం. ఆ సెంటిమెంట్ కంటే అచ్చివచ్చిన స్టేడియం సెంటిమెంటే పైచేయి సాధించింది. ►విజయం అనంతరం ఓ అభిమాని స్టేడియంలోకి చొచ్చుకెళ్లాడు. ►రిషబ్ పంత్ కాలు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ►కీలకమైన మ్యాచ్ గెలుపుతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. –విశాఖ స్పోర్ట్స్/ మధురవాడ/ పీఎంపాలెం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే
చేతిలో 8 వికెట్లు.. విజయానికి కావాల్సింది 38 బంతుల్లో 29 పరుగులు.. క్రీజులో అప్పటికే పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్లు. దీన్నిబట్టి చూస్తే సదరు జట్టు కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శని తమ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లు.. చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న ఆ జట్టు కేవలం 23 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు చేజార్చుకొని నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం రాత్రి ససెక్స్, గ్లూస్టర్షైర్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లూస్టర్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 66, టేలర్ 46 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ జట్టు ఆరంభంలోనే టిమ్ సీఫెర్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగులు చేసిన రవి బొపారా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన టామ్ అల్సోప్(82 పరుగులు).. ఫిన్ హడ్సన్(18 పరుగులు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ససెక్స్ కోలుకుంది. 13 ఓవర్ వరకు రెండు వికెట్ల నష్టానికి 11 8 పరుగులు చేసింది. 38 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో ఫిన్ హడ్సన్ స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి టామ్ అల్సోప్ కూడా స్టంప్ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కేవలం 23 పరుగుల తేడా వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన ససెక్స్ 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై కేవలం నాలుగు పరుగులతో ఓటమి చవిచూసింది. ససెక్స్ ఆట తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నెత్తిన శని తాండవం చేస్తుంటే ఇలాగే జరుగుతుంది.. ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! -
PAK Vs AUS: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం
PAK Vs AUS Only T20- Australia Beat Pakistan By 3 Wickets: పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆరోన్ ఫించ్ అద్భుత అర్థ శతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఇక మంగళవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఆసీస్ గెలుపొందింది. లాహోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు రిజ్వాన్(23), బాబర్ ఆజం(66) అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే, మిగతా బ్యాటర్లలో ఖుష్దిల్(24) మినహా మిగతా వాళ్లెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఆసీస్ బౌలర్ నాథన్ ఎలిస్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ట్రవిస్ హెడ్(26), కెప్టెన్ ఆరోన్ ఫించ్(55) గట్టి పునాది వేశారు. వన్‌డౌన్‌లో వచ్చిన జోష్ ఇంగ్లిస్(24), మార్కస్ స్టొయినిస్(23) తమ వంతు పాత్ర పోషించారు. ఇక వరుస విరామాల్లో వికెట్లు పడటంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు కొనసాగింది. ఈ క్రమంలో బెన్ మెక్‌డెర్మాట్(19 బంతుల్లో 22 పరుగులు నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో 19.1 ఓవర్లలో ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. హాఫ్ సెంచరీతో రాణించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఏకైక టీ20 మ్యాచ్ స్కోర్లు: పాకిస్తాన్- 162/8 (20) ఆస్ట్రేలియా- 163/7 (19.1) The guests won the game tonight and our hearts forever 🙌🏼 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/rEOVPRcOOY — Pakistan Cricket (@TheRealPCB) April 5, 2022 చదవండి: IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్! ఆర్సీబీ సంచలన విజయం -
ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. రెండో టీ20 అప్డేట్స్
-
పరాజయంతో ప్రారంభం
క్వీన్స్టౌన్: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను పరాజయంతో మొదలుపెట్టింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (36; 2 ఫోర్లు), కెప్టెన్ సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పూజ, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఆంధ్రపదేశ్‌కు చెందిన సబ్బినేని మేఘన (30 బంతుల్లో 37; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12) నిరాశపరిచింది. క్వారంటైన్ లో ఉండటంతో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 12న జరిగే తొలి వన్డేలోనూ స్మృతి బరిలో దిగే అవకాశం కనిపించడంలేదు. -
మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్
ఒక జట్టుకేమో విజయానికి ఒక వికెట్ కావాలి.. అదే సమయంలో అవతలి జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలెండర్. ఈ సమయంలో ఒత్తిడికి లోనయ్యి వికెట్ ఇచ్చుకోవడమో లేక పరుగులు చేయకపోవడమో జరుగుతుంది. అయితే న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్ మాత్రం ఒత్తిడిని తట్టుకొని ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు. సూపర్ స్మాష్ టి20 న్యూజిలాండ్ టోర్నీలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చదవండి: MS Dhoni: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు కాంట్బర్రీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తన్బ్రేవ్స్ ఒక వికెట్‌తో తేడాతో సంచలన విజయం సాధించింది. నార్తన్బ్రేవ్ విధించిన 108 పరుగుల లక్ష్యాన్ని కాంట్బెర్రీ 20వ ఓవర్ ఆఖరి బంతికి చేధించింది. అప్పటికే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఔటవ్వడంతో ఆఖరి వికెట్‌గా బౌల్ట్ వచ్చాడు. రెండు బంతులు మాత్రమే మిగిలిఉన్నాయి. ఆఖరి ఓవర్ ఐదో బంతి బౌల్ట్ తలపై నుంచి వెళ్లింది. ఇక చివరి బంతి మంచి టైమింగ్‌తో రావడంతో బౌల్ట్ లాంగాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. దీంతో నార్తన్ బ్రేవ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు కాంట్బెర్రీ 17.2 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. చదవండి: వివాదాలకు బ్యాట్‌తోనే కోహ్లి సమాధానం చెబుతాడు.. ఇప్పుడూ అంతే! TRENT BOULT!! Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf — Spark Sport (@sparknzsport) December 23, 2021 -
న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడో టీ20లో ఘనవిజయం
న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడో టీ20లో ఘనవిజయం ఈడెన్ గార్డెన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20ల్లో టీమిండియా 73పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 185 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బ్యాటర్లో గప్టిల్(51) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, చాహర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కిషన్(29), శ్రేయాప్ అయ్యర్(25),దీపక్ చాహర్(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్.. నీషమ్(3) ఔట్ 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టి కీవిస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. న్యూజిలాండ్ బ్యాటర్లో గప్టిల్(51) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. 16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 6వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 3 ఓవర్లో తొలి బంతికే మిచెల్(5), హర్షల్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగగా, ఐదో బంతికి చాప్మాన్ స్టంప్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గప్టిల్(24), ఫిలిప్స్(0) పరుగులతో ఉన్నారు. చేలరేగిన భారత్.. కివీస్ టార్గెట్ 185 పరుగులు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చేలరేగి ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్ధ సెంచరీ తో మెరిసాడు. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటుతుందని అంతా భావించనా.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 184 పరుగులు మాత్రమే సాధించింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కిషన్(29), శ్రేయాప్ అయ్యర్(25),దీపక్ చాహర్(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్ సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. వెంకటేశ్ అయ్యర్(20)ఔట్ 139 పరగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో చాప్మాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 140 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(25) అక్షర్ పటేల్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (56)ఔట్ 103 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ రూపంలో బిగ్ వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న రోహిత్, సోధి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా 108 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(13), వెంకటేశ్ అయ్యర్(3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. ధాటిగా ఆడుతున్న టీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ వేసిన 7వ ఓవర్లో రెండో బంతికి కిషన్(29) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, చివరి బంతికి సూర్యకూమార్ యాదవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి టీమిండియా 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ42, పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కిషన్ ఫోర్లు, సిక్స్రలతో కీవిస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ23, కిషన్15 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోల్‌కతా: న్యూజిలాండ్-భారత్ మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగుతుంది. రాహుల్ స్ధానంలో ఇషాన్ కిషన్ రాగా, అశ్విన్ స్ధానంలో చాహల్‌కు చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌కు సౌథీ దూరం కావడంతో మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రెండు టీ20లు గెలిచిన భారత జట్టు.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు కనీసం అఖరి మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ అనుకుంటున్నది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చహర్, చాహల్, భువనేశ్వర్, హర్షల్ పటేల్ న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్(కెప్టెన్) మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్,లాకీ ఫెర్గూసన్ చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. వచ్చే ఐపీఎల్ ఎక్కడంటే.. -
సిక్స్ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్?
Shaheen Shah Afridi Hurts Hofif Hossain With Ball.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టి20లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది కంట్రోల్ తప్పాడు. తన బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడని సహించని షాహిన్.. బంతితో కసితీరా ప్రత్యర్థి బ్యాటర్‌పైకి విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ హఠాత్పరిణామానికి అంపైర్లు కూడా షాక్ అయ్యారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో రెండో బంతిని ఆఫిఫ్ హొస్సెన్ లెగ్‌స్టంప్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన షాహిన్ అఫ్రిది తర్వాతి బంతిని కోపంతో విసిరాడు. అయితే అఫిఫ్ డిఫెన్స్ ఆడడంతో పరుగు రాలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న షాహిన్ బంతిని అందుకొని కసితీరా హొస్సెన్ కాళ్లవైపు విసిరాడు. బంతి బలంగా తాకడంతో హొస్సెన్ కిందపడి నొప్పితో విలవిల్లాలాడాడు. ఈ చర్యతో నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్‌తో పాటు అంపైర్లు, పాక్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత షాహిన్ హొస్సెన్ దగ్గరకు వచ్చి అతన్ని పైకి లేపి సారీ అని చెప్పాడు. అయితే బంగ్లా ఆటగాళ్లు దీనిపై ఫిర్యాదు చేస్తే షాహిన్‌పై చర్యలు ఉండే అవకాశం ఉంది. చదవండి: BAN vs PAK: హసన్ అలీ కవ్వింపు చర్యలు.. బంగ్లాకు షాకిచ్చిన ఐసీసీ అయితే షాహిన్ తీరుపై సోషల్ మీడియాలో మాత్రం క్రికెట్ అభిమానులు ఏకిపారేశారు. ''కసితీరా కొట్టావు.. సారీ ఎందుకు షాహిన్.. మీకింకా టి20 ప్రపంచకప్ 2021 కప్ గెలవలేదనే మత్తు దిగనట్టుంది.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు సారీ'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. షాంటో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పాక్ బౌలర్ల దాటికి మిగతవారు పెద్దగా రాణించలేకపోయారు. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే? Gets hit for a 6 and Shaheen Shah loses his control next ball! I get the aggression but this was unnecessary. It was good however that he went straight to apologize after this.#BANvPAK pic.twitter.com/PM5K9LZBiu — Israr Ahmed Hashmi (@IamIsrarHashmi) November 20, 2021 -
హసన్ అలీ కవ్వింపు చర్యలు.. బంగ్లాకు షాకిచ్చిన ఐసీసీ
Hasan Ali Reprimanded For Breaching ICC Code Of Conduct.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని ఐసీసీ మందలించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కవ్వింపు చర్యలకు గాను హసన్ అలీని హెచ్చరించింది. విషయంలోకి వెళితే.. బంగ్లా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హసన్ అలీ.. బంగ్లా బ్యాటర్ నురుల్ హసన్‌ను క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే పెవిలియన్ వెళ్తున్న నురుల్ హసన్‌ను టార్గెట్ చేస్తూ హసన్ అలీ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ విషయంపై సీరియస్ అయిన ఐసీసీ.. ఆర్టికల్ 2.5 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవల్ 1 నిబంధన ఉల్లఘించిన హసన్ అలీని హెచ్చరికతో సరిపెట్టింది. దీంతోపాటు హసన్ అలీకి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో బంగ్లాకు షాక్ తగిలింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లాదేశ్ జట్టు మొత్తం సహా సపోర్ట్ స్టాఫ్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది -
కోహ్లి రికార్డు బద్దలు .. టి20 చరిత్రలో తొలి బ్యాటర్‌గా గప్టిల్
Martin Guptill Breaks Kohli Record Most Runs In T20Is.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ టి20 క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ అగ్రస్థానంలో నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన ఔటైన గప్టిల్ ఇప్పటివరకు కివీస్ తరపున 111 మ్యాచ్‌ల్లో 3246 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌లో ఉన్న కోహ్లిని దాటి మార్టిన్ తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 118 మ్యాచ్‌ల్లో 3086 పరుగులతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియా నుంచి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 83 మ్యాచ్‌ల్లో 2608 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర -
30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర
Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరపున హర్షల్ పటేల్ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్ అరవింద్( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్ ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హర్షల్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది Really nice to see Ajit Agarkar giving the debut cap for Harshal Patel, leading wicket taker in IPL 2021, one of the stars and making the debut for India tonight.pic.twitter.com/ct9QN5I3n0 — Johns. (@CricCrazyJohns) November 19, 2021 -
IND Vs NZ: రెండో టి20లో విజయం.. టీమిండియాదే సిరీస్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్(55), రాహుల్(65)లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. దీంతో టీమిండియా లక్ష్యాన్ని సులువుగానే చేధించింది. ఆఖర్లో వీరిద్దరు ఔటైనప్పటికి పంత్(12 పరుగులు) వరుసగా రెండు సిక్సర్లతో టీమిండియాను గెలిపించాడు. వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. వరుస బంతుల్లో రెండు వికెట్లు డౌన్.. 17 ఓవర్లలో 140/3 టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రోహిత్ శర్మ(55),సూర్యకుమార్ యాదవ్(1) వెనుదిరిగారు. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఫిఫ్టీ.. టీమిండియా 11 ఓవర్లలో 92/0 టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో మెరిశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో టి20 కెరీర్లో 16వ అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా 31 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. 10 ఓవర్లలో టీమిండియా 79/0 టీమిండియా ఓపెనర్లు రాహుల్(44), రోహిత్ శర్మ(31)లు నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 3 ఓవర్లలో టీమిండియా 18/0 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 16, రోహిత్ శర్మ 1 పరుగుతో ఆడుతున్నారు. ►టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులతో పటిష్టంగానే కనిపించిన న్యూజిలాండ్ .. టీమిండియా స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అశ్విన్, అక్షర్ పటేల్‌లు కలిసి 8 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బ్యాటింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గప్టిల్ 31, డారిల్ మిచెల్ 31 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 2, అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, దీపక్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. 18 ఓవర్లలో న్యూజిలాండ్ 140/6 18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సాంట్నర్ 3, మిల్నే 0 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు భువనేశ్వర్ బౌలింగ్‌లో 3 పరుగులు చేసిన నీషమ్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన కివీస్.. గ్లెన్ ఫిలిప్స్(3) ఔట్ డారిల్ మిచెల్(31) రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ఫిలిప్స్(3), సీఫెర్ట్ 0 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. 9 ఓవర్లలో 80/2 21 పరుగులు చేసిన మార్క్ చాప్మన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. గప్టిల్(31) ఔట్.. 5 ఓవర్లలో న్యూజిలాండ్ 56/1 మార్టిన్ గప్టిల్(31) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చహర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. మిచెల్ 19, చాప్మన్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో న్యూజిలాండ్ దాటిగా ఆడుతోంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. గప్టిల్ 25, మిచెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టి20లో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు సిరీస్ సొంత చేసుకోవడంపై దృష్టి పెట్టింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా చెంత చేరుతుంది. మరోవైపు టి20 ప్రపంచకప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఇప్పుడు ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, రిషభ్ పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చహర్, అశ్విన్, భువనేశ్వర్, హర్షల్ పటేల్ న్యూజిలాండ్: సౌతీ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ -
ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది
Pakistan Beat Bangladesh By 4 Wickets 1st T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. అయితే ఒక దశలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఫఖర్ జమాన్(34), కుష్దిల్ షా(34) మంచి ఇన్నింగ్స్ ఆడడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. కాగా స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో మరోసారి ఉత్కంఠ పెరిగింది. చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని అయితే షాదాబ్ ఖాన్(21 నాటౌట్), మహ్మద్ నవాజ్(18 నాటౌట్)లు బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ హసన్ అలీ దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అసిఫ్ హొస్సేన్(36), మెహదీ హసన్(30 నాటౌట్), నురుల్ హసన్(28) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 3, మహ్మద్ వసీమ్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా -
నా వీక్నెస్ బౌల్ట్‌కు బాగా తెలుసు.. ట్రాప్‌లో పడిపోయా
Trent Boult Traps Rohit Sharma With Short Ball.. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో సూర్యకుమార్ టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టీమిండియా విజయం దిశగా సాగుతున్న వేళ బౌల్ట్ బౌలింగ్‌లో షార్ట్‌బాల్ ఆడడంలో విఫలమయ్యి ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ పోస్ట్ ప్రెజంటేషన్లో మాట్లాడాడు. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు! ''బౌల్ట్‌కు నా వీక్నెస్ బాగా తెలుసు. కానీ అతని బలం ఏంటనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. ముంబై ఇండియన్స్ తరపున నేను కెప్టెన్‌గా అతనికి అన్ని షార్ట్బంతులు విసరమని సలహా ఇచ్చాను. చాలాసార్లు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు బౌల్ట్ అవే షార్ట్‌బాల్స్‌ను నాపై ప్రయోగించాడు.'' అంటూ తెలిపాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో మూడు బంతులు షార్ట్ బంతులు వేశాడు.. కానీ రోహిత్ శర్మ 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బౌల్ట్ వేసిన మరో ఓవర్లో తొలి బంతిని భారీ సిక్స్‌గా మలిచాడు. అదే తరహాలో మరో షార్ట్బంతి వేయగా.. ఈసారి మాత్రం రోహిత్ మిస్ చేయడంతో షార్ట్‌ఫైన్ లెగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి.. -
INDvsNZ: తొలి టి20లో భారత్ విజయం
-
గప్టిల్ సీరియస్ లుక్.. దీపక్ చహర్ స్టన్నింగ్ రియాక్షన్
Martin Guptill Vs Deepak Chahar Stunning Looks.. టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మార్టిన్ గప్టిల్, బౌలర్ దీపక్ చహర్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో చహర్ వేసిన తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అప్పుడు గప్టిల్ దీపక్ చహర్‌ను చూస్తూ సీరియస్‌గా లుక్ ఇచ్చాడు. అయితే తర్వాతి బంతిని కూడా గప్టిల్ సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో గప్టిల్ కథ ముగిసింది. ఈసారి దీపక్ చహర్ వంతు వచ్చింది. పెవిలియన్ వెళ్తున్న గప్టిల్వైపు దీపక్ సీరియస్ లుక్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Deepak chahar is known for this 👀pic.twitter.com/TyZMPrD9pY — VIVO IPL 2022 | Wear a Mask 😷 (@IPL2022_) November 17, 2021 -
భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్: తొలి మ్యాచ్ కష్టమేనా?
Pollution threat Looms Large on 1st T20 Against IND VS NZ: టీ20 ప్రపంచకప్-2021 ఫైనల్లో ఆసీస్ చేతి అనుహ్యంగా ఓటమి చెందిన న్యూజిలాండ్.. తదుపరి భారత పర్యటనకు సిద్దమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా నవంబర్17న తొలి టీ20 మ్యాచ్‌లో జైపూర్ వేదికగా భారత్‌తో తలపపడనుంది. అయితే జైపూర్‌లో గత వారం రోజులుగా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే శీతాకాలంలో పొగమంచు కూడా ప్రభావం కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది అని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత కలుషితంగా ఉందని, జైపూర్ సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఈ ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు జైపూర్ చెరుకోగా, కీవిస్ ఆటగాళ్లు సోమవారం(నవంబర్ 15)న చేరుకోనున్నారు. కాగా అంతక ముందు 2017లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా పొగమంచు కారణంగా శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడారు. అప్పుడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316 గా నమోదైంది. చదవండి: ఆ అవార్డు వార్నర్‌కు ఎలా ఇస్తారు..? మా వాడు ఉన్నాడుగా: షోయబ్ అక్తర్ -
స్పెషల్ డిబేట్ ఆన్ ఇండియా VS పాకిస్తాన్ T20 మ్యాచ్
-
శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
Shika Pandey Stunning Delivery.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ శిఖా పాండే అద్బుత బంతితో మెరిసింది. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్ రెండో బంతిని శిఖా పాండే ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. అయితే బంతి అనూహ్యంగా లెగ్‌స్టంప్ దిశగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాకైన ఆసీస్ ఓపెనర్ అలీసా హేలీ నిరాశగా పెవిలియన్ చేరింది. ఈ నేపథ్యంలోనే శిఖాపాండేను పులువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్స్ ప్రశంసించారు.'' శిఖా పాండే ఒక అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీ'' అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: INDw Vs AUSw: రెండో టి20లో టీమిండియా వుమెన్స్ ఓటమి ఇక ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆసీస్ వుమెన్స్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టీమిండియా వుమెన్స్ బ్యాటర్స్‌లో పూజా వస్త్రాకర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 పరుగులు చేసింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల షేన్ వార్న్‌ను ఎలా మరిచిపోగలం.. ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ప్రస్తుతం శిఖా పాండే అద్భుత బంతి గురించి మాట్లాడుకుంటున్నాం గానీ.. బాల్ ఆఫ్ ది సెంచరీ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. 1993లో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్‌ను వార్న్ అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వార్న్ బంతిని లెగ్‌సైడ్ అవతల విసిరాడు. అయితే గాటింగ్ ఊహించని విధంగా అతని వెనుక నుంచి అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. అసలు తాను ఔట్ అని తెలియక గాటింగ్ కాసేపు క్రీజులోనే ఉండడం విశేషం. వార్న్ విసిరిన అద్భుత బంతికి అప్పటి ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. మెన్స్ క్రికెట్ చరిత్రలో అప్పటికి.. ఇప్పటికి వార్న్ వేసిన బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా మిగిలిపోయింది. Unreeeeeeal! 😱 How far did that ball move? #AUSvIND pic.twitter.com/D3g7jqRXWK — cricket.com.au (@cricketcomau) October 9, 2021 Ball of the century, women's cricket edition! Take a bow Shikha Pandey🙌🏻 #AUSvIND pic.twitter.com/WjaixlkjIp — Wasim Jaffer (@WasimJaffer14) October 9, 2021 #OnThisDay in 1993, the ball of the century from Shane Warne 💪pic.twitter.com/yhZS2FBWqE — 7Cricket (@7Cricket) June 4, 2020 -
ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి
గోల్డ్‌కోస్ట్: చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో విజయానికి చేరువగా వచ్చినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తహ్లియా మెక్‌గ్రాత్ (33 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) జోరుతో చివరకు భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. మెక్‌గ్రాత్ ఫోర్లతో విరుచుకుపడటంతో కష్టమనుకున్న విజయాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆ్రస్టేలియా అందుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టుపై ఆ్రస్టేలియా మహిళల టీమ్ 4 వికెట్లతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధ్యింలో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. పూజా వస్త్రకర్ (26 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. వర్షంతో రద్దయిన తొలి టి20లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్... ఇక్కడ మాత్రం తేలిపోయింది. స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిగ్స్ (7) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 5 ఫోర్లు) దూకుడుగా ఆడినా అనవసరపు షాట్‌కు ప్రయతి్నంచి స్టంపౌట్‌గా వెనుదిరిగింది. చివర్లో పూజ జోరుతో భారత్ 100 మార్కును అందుకుంది. ఆ రెండు ఓవర్లు... స్వల్ప ఛేదనలో ఆ్రస్టేలియా కూడా మొదట్లో తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... అలీసా హీలీ (4), కెపె్టన్ మెగ్ లానింగ్ (15), గార్డ్నెర్ (1), ఎలైస్ పెర్రీ (2) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్... బెత్ మూనీ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు)తో కలిసి జట్టును ఆదుకుంది. రాజేశ్వరీ గైక్వాడ్ తన వరుస ఓవర్లలో మూనీని, క్యారీ (7)లను అవుట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దాంతో ఆసీస్ విజయం కోసం చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేయాలి. శిఖా పాండే వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు... రేణుక సింగ్ వేసిన 19వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 13 పరుగులను ఆసీస్ రాబట్టింది. 20వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన మెక్‌గ్రాత్ ఆసీస్‌కు గెలుపును ఖాయం చేసింది. నేడు ఇక్కడే చివరి టి20 జరగనుంది. చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు..
India Women vs Australia Women 1st T20I: భారత్, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్ 15.2 ఓవర్లలో 134/4 గా ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలింగా నిలిపివేశారు. తరువాత దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఎప్పటికీ ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ(17), స్మృతి మంధన(18) శుభారంభాన్ని ఇచ్చారు. జెమిమా రోడ్రిగ్స్ 49 పరుగులచేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహామ్ చెరో వికెట్ సాధించారు. దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. చదవండి: CSK Vs PBKS: ధోని (12) మరోసారి విఫలం.. చెన్నై 61/5 -
త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది
Avishka Fernando Run Out: శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో అవిష్క ఫెర్నాండో రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్ట్జే మెరుపు వేగంతో వేసిన త్రో దాటికి స్టంప్ బయటికి రావడంతో పాటు స్టంప్ మైక్ కూడా ఊడి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్‌ను రబడ వేశాడు. ఓవర్ ఐదో బంతిని అవిష్క ఫెర్నాండో మిడాన్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న నోర్ట్జే మెరుపువేగంతో బంతిని నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అంతే బులెట్ వేగంతో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను బయటపడేలా చేసింది. దీంతో పాటు మైక్ స్టంప్ కూడా ఊడి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు Dinesh Chandimal's 66* | 1st T20I #SLvSA @chandi_17 Full Highlights➡️ https://t.co/vt7jmJz8AZ pic.twitter.com/ypTwToUaP5 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2021 -
చెలరేగిన లాథమ్ ..చివరి టీ20లో కివీస్ గెలుపు
ఢాకా: ఢాకా వేదికగా జరిగిన ఐదో టీ20లోబంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 27 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు సాధించింది. కివిస్‌లో టామ్ లాథమ్(50) ఆర్ధసెంచరీతో చెలరేగగా, ఓపెనర్ ఫిన్ ఆలిన్ (41) రాణించాడు. అనంతరం 162 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లో 8వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. బంగ్లాదేశ్‌లో ఆరిఫ్ హూస్సేన్(49) తప్ప బంగ్లా బ్యాట్సమన్లు ఎవరూ కివీస్ బౌలర్ల ధాటికి నిలదొక్కలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లో ఎజాజ్ పటేల్,కుగ్గలిన్ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, కోల్ మెక్ కొన్చి, రచిన్ రవింద్ర ,బెన్ సీర్స్ చెరో వికెట్ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో బంగ్లా జట్టు కైవసం చేసుకుంది. చదవండి: SL Vs SA: ఓపెనర్‌గా వచ్చి నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు -
జిడ్డు ఆట.. టీ 20 చరిత్రలోనే పరమ చెత్త రికార్డు
ముర్షియా: టీ 20 మ్యాచ్ అంటేనే మెరుపులకు పెట్టింది పేరు. ఫోర్లు, సిక్పర్ల వర్షంతో బ్యాట్స్‌మన్ పండగ చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఒక టీ20 మ్యాచ్‌ను టెస్టు మ్యాచ్‌గా మార్చిన ఘనత జర్మనీ వుమెన్స్ సొంతం చేసుకుంది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన జర్మనీ వుమెన్స్ 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. విశేమేమిటంటే ఈ మ్యాచ్‌లో జర్మనీ జట్టు ఓడిపోయినప్పటికి వికెట్లు సమర్పించుకోకుండా జిడ్డుగా ఆడుతూ టెస్టు మ్యాచ్‌ను రుచి చూపించారు. చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు ఈ మ్యాచ్ జరిగి మూడు రోజులు కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ వేదికగా ఐసీసీ వుమెన్స్ టీ20 క్వాలిఫయర్స్ మ్యాచ్ జరుగుతున్నాయి. టోర్నీలో భాగంగా జర్మనీ వుమెన్స్, ఐర్లాండ్ వుమెన్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ వుమెన్ 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ (60 బంతుల్లో 105 పరుగులు; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), మరో ఓపెనర్ రెబెక్కా స్టోకెల్ 44 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జర్మనీ వుమెన్స్ జట్టు 20 ఓవర్లపాటు ఆడి 3 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్టినా గఫ్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీంతో టీ20 చరిత్రలోనే జర్మనీ వుమెన్స్ పరమ చెత్త రికార్డును మూటగట్టుకుంది. చదవండి: IPL 2021 UAE: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్ ఇక ఈ మ్యాచ్‌లో జర్మనీ వుమెన్స్ జిడ్డు ఆటతీరుపై అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. జర్మనీ వుమెన్స్ బ్యాటింగ్‌ను గావస్కర్ బ్యాటింగ్‌తో పోల్చారు.'' టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా మార్చేశారు. నాకు తెలిసి వాళ్లకు గావస్కర్.. పుజారా లాంటి టెస్టు బ్యాట్స్‌మన్ గుర్తుకు వచ్చి ఉంటారు..'' అంటూ కామెంట్స్ చేశారు. -
థ్రిల్లర్‌ను తలపించిన టీ20; 3 పరుగులతో జింబాబ్వే విజయం
డుబ్లిన్: జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 3 పరుగులతో విజయాన్ని అందుకుంది. లోస్కోరింగ్గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసిది. వికెట్ కీపర్ చకాబ్వా 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 17 పరుగులు, మసకద్జ 19* పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలింగ్‌లో క్రెయిగ్ యంగ్, సిమీ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. బారీ మెక్‌కార్తీ, గెట్‌కటే తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. చదవండి: ENG Vs IND: స్పిన్ బౌలింగ్.. అయినా క్యాప్స్ ధరించలేదు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 25, కెవిన్ ఒబ్రియాన్ 25 పరుగులతో శుభారంభం అందించినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. అయితే చివర్లో సిమీ సింగ్ 28 పరుగులతో నాటౌట్ నిలిచి ఐర్లాండ్ విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికి గరవ వేసిన ఆఖరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిమీ సింగ్‌కు బ్యాటింగ్ రాకుండా చేయడంలో జింబాబ్వే సఫలమయింది. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను ఒత్తిడికి గురిచేసింది. ఆఖరి బంతికి నాలుగు పరుగుల అవసరమైన దశలో సిమీ సింగ్ ఒక పరుగు మాత్రమే చేయడంతో ఐర్లాండ్ మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే బౌలర్లలో రియాన్ బర్ల్ 3, మసకద్జ 2, లూక్ జోంగ్వే 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ విజయంతో జింబాబ్వే ఐదు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు -
క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్స్.. కొడితే కనుచూపు మేరలో కనపడలేదు
Liam Livingstone Six: ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20లో క్రికెట్ చరిత్రలోనే అతి భారీ సిక్స్ నమోదైంది. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. ఈ సిక్సర్ ఏకంగా మైదానాన్ని దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16 వ ఓవర్లో పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా గట్టిగా బాదడంతో అది కనుచూపు మేరలో కనబడలేదు. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్ అని వ్యాఖ్యాతలతోపాటు నెటిజన్లు అంటున్నారు. అయితే, ఈ సిక్స్ యొక్క అధికారిక పొడవును కొలవడం మాత్రం సాధ్యపడలేదు. కాగా, ఇలాంటి సిక్స్‌ను తాము ఇంతవరకు చూడలేదని స్కై స్పోర్ట్స్ కామెంట్రేటర్లుగా ఉన్న ఇయాన్ వార్డ్, కుమార సంగక్కర మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ అధికారిక ట్విట్టర్లో ఈ సిక్సర్ వీడియోని షేర్ చేసి 'ఇదేనా అతి భారీ సిక్స్?' అంటూ ప్రశ్నించింది. కాగా, ఈ మ్యాచ్‌లో బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్‌స్టోన్ (38) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ బౌలింగ్‌తో పాకిస్తాన్ కట్టడి చేశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లోనూ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లోనే శతకొట్టడం విశేషం. Biggest six ever?! 😱 @LeedsRhinos, can we have our ball back? 😉 Scorecard/clips: https://t.co/QjGshV4LMM 🏴 #ENGvPAK 🇵🇰 pic.twitter.com/bGnjL8DxCx — England Cricket (@englandcricket) July 18, 2021 -
Chris Gayle: ఐసీసీ వద్దంది, ఇప్పుడు నేను యూనివర్స్ బాస్ కాదు..
Chris Gayle Universe Boss: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుస్తుంటారు. ఈ ట్యాగ్ అతనికెవరూ ఇవ్వకపోయినా తనతంట తానే అలా ఫిక్స్ అయిపోయాడు. అతని బ్యాట్ మీద కూడా యూనివర్స్ బాస్ అనే స్టిక్కర్ ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ బ్యాట్‌పై యూనివర్స్ బాస్‌కు బదులు 'ది బాస్' అని రాసుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో గేల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. Chris Gayle's got some fresh stickers after a short conversation with the ICC! 😅 #WIvAUS pic.twitter.com/99nxhrBrGP — cricket.com.au (@cricketcomau) July 13, 2021 తాను యూనివర్స్ బాస్‌గా చెలామణి కావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి ఇష్టం లేదని, ఐసీసీ అభ్యంతరం తెలపడంతోనే యూనివర్స్ బాస్‌ను ది బాస్‌గా మార్చుకున్నానని మ్యాచ్ అనంతరం తెలిపాడు. యూనివర్స్ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్ ఉన్నాయని, దానిపై నేను ముందే కాపీరైట్స్ పొందాల్సి ఉండిందని పేర్కొన్నాడు. సాంకేతికంగా క్రికెట్లో ఐసీసీయే బాస్. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్. అంటూ మ్యాచ్ అనంతరం గేల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో గేల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే విండీస్ 3-0తో కైవసం చేసుకుంది. ఇక ఇదే మ్యాచ్‌లోనే గేల్ టీ20ల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గేల్ ఇప్పటివరకు 431 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ 10836 పరుగులు, షోయబ్ మాలిక్ 10741, వార్నర్10017, విరాట్ కోహ్లీ 9235లు ఉన్నారు. -
టీ20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ
న్యూఢిల్లీ: టీ 20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర సృష్టించాడు. 20 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ వచ్చిన సుబోధ్ అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు,17 సిక్సర్లు ఉండడం గమనార్హం. తొలి 100 పరుగులను ఈ రంజీ ఆటగాడు కేవలం 17 బంతుల్లో సాధించడం విశేషం. దీంతో ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. అంతకు ముందు టీ 20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు క్రిస్‌గేల్ పేరున ఉంది. యునివర్సల్ బాస్ 2013 ఐపిఎల్‌లో పూణే వారియర్స్ పైన 66 బంతుల్లో 175 సాధించాడు. తరువాత ట్రై-సిరీస్‌లో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక సుబోధ్ భాటి కెరీర్ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ల్లో ఢిల్లీకు ప్రాతినిధ్యం వహించాడు. -
గ్రౌండ్లో కుప్పకూలిన క్రికెటర్లు.. షాక్‌లో ఆటగాళ్లు
అంటిగ్వా: పాకిస్తాన్ వుమెన్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్లు గ్రౌండ్‌లోనే కుప్పకూలడం ఆందోళన కలిగించింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆటగాళ్లు అప్రమత్తమై సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫిజియో వచ్చి వారిని పరీక్షించి స్ట్రెచర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ''ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారని.. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడిని తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యారని వైద్యులు తెలిపారు. ఇప్పడు వారిద్దరు బాగానే ఉన్నారని'' వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వుమెన్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కైసియా నైట్ 30 నాటౌట్, చెడియన్ నేషన్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వుమెన్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. దీంతో వర్షం అంతరాయం కలిగించే సమయానికి పాక్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 103 పరుగులతో ఆడుతోంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. Match between Pakistan and West Indies women cricketers continues ... Suddenly West Indies women cricketer fainted and collapsed . She was shifted to a nearby hospital. Hopefully she will recover soon. VC: @windiescricket#WIWvPAKW #WIWvsPAKW pic.twitter.com/OjhJmWioeO — Qadir Khawaja (@iamqadirkhawaja) July 2, 2021 -
చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్; అద్భుత విజయం
లీడ్స్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్ ఆఖరిఓవర్లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్‌షైర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్‌కు చివరిఓవర్లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను ఫెర్గూసన్ వేశాడు. అయితే ఫెర్గూసన్ వేసిన రెండో బంతి నోబాల్ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్ జోన్స్ ఫోర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి సింగిల్ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికి వెల్స్ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్ ఐదో బంతికి లూక్ వుడ్‌ను అద్బుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్ బంతిని విసిరాడు. టామ్ హార్ట్లీ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో లిత్ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్‌షైర్ బ్యాటింగ్‌లో హారీ బ్రూక్(50 బంతుల్లో 91నాటౌట్ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్ కెప్టెన్ లిత్ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్ హ్యాట్రిక్‌తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్ జోన్స్ 64 నాటౌట్, కీటన్ జెన్నింగ్స్ 37 పరుగులతో రాణించారు. LOCKIE FERGUSON HATTRICK 🔥 Look at those scenes 😍#Blast21 pic.twitter.com/QaFAp25KAZ — Vitality Blast (@VitalityBlast) July 2, 2021 -
వికెట్ తీశాడు.. చిత్రమైన సెలబ్రేషన్‌తో మెరిశాడు
హరారే: క్రికెట్లో బౌలర్ వికెట్ తీసినప్పుడు.. బ్యాట్స్‌మన్ సెంచరీ చేసినప్పుడు.. ఒక జట్టు మ్యాచ్ గెలిచినప్పుడు రకరకాలుగా తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అందునా కొందరు క్రికెటర్లు మాత్రం తమ సెలబ్రేషన్స్‌తో ఎప్పటికీ మదిలో నిలిచిపోతుంటారు. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కువగా మనం విండీస్ క్రికెటర్లలో చూస్తుంటాం. వీరంతా డ్యాన్స్.. సెల్యూట్ ఇలా రకరకాల వేరియేషన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటే.. దక్షిణాఫ్రికా క్రికెటర్ తబ్రేజ్ షంసీ వికెట్ తీసినప్పుడల్లా తన కాలికున్న షూను తీసి చెవి దగ్గరు పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా చేస్తూ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకుంటాడు. అచ్చం అతని తరహాలోనే జింబాబ్వే క్రికెటర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ సమయంలో జింబాబ్వే బౌలర్ ల్యూక్ జోంగ్వే ఇన్ఫాం బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో పెద్ద వికెట్ తీశానన్న ఆనందంలో జోంగ్వే తన కాలికున్న షూ తీసి చెవి దగ్గరు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ స్పందించాడు..'' కూల్ బ్రదర్.. ఇంత మంచి గేమ్‌లో నీ సెలబ్రేషన్ సూపర్.. నన్ను మరిపించేలా నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావ్..'' అంటూ కామెంట్ చేశాడు. షంసీ కామెంట్స్‌పై ల్యూకో జోంగ్వే తనదైన రీతిలో స్పందించారు. ''దీనికి ఆద్యుడు నువ్వే.. ఒక బ్రదర్‌గా నేను బోర్డర్ నుంచి నిన్ను ఇమిటేట్ చేశా'' అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 99 పరుగులకే కుప్పకూలింది. ల్యూకో జోంగ్వే 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం అయింది. ఇరు జట్లకు కీలకమైన మూడో టీ20 రేపు (ఏప్రిల్ 25న) జరగనుంది. చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్ సెపరేట్ అయ్యింది..! Shamsi's brother spotted in Zimbabwe ❤️@shamsi90 #PakvZim #ZimvPak #Cricket #BabarAzam pic.twitter.com/YQ6T80qjZ4 — Noman Views (@Noman2294) April 23, 2021 -
డక్‌వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా
నేపియర్: క్రికెట్ ప్రేమికులు అంపైర్స్ కాల్ కన్ఫ్యూజన్ నుంచి తేరుకోక ముందే మరో అర్ధం కాని సమస్య తెరముందుకొచ్చింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి, సరికొత్త కన్ఫ్యూజన్కు దారి తీసింది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడుతున్న బంగ్లా జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిపై సరైన అవగాహన లేక, తప్పుడు టార్గెట్‌ను నిర్ధేశించుకొని బరిలోకి దిగింది. ఆతరువాత మ్యాచ్ రిఫరీ సైతం సరికొత్త రూల్స్ విషయంలో తికమకపడి లక్ష్యాన్ని రెండోసార్లు మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం కన్ఫ్యూజన్కు మారిన ఐసీసీ రూల్సే కారణమని అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే మారిన డక్‌వర్త్ లూయిస్ పద్ధతిపై సరైన అవగాహన లేని బంగ్లా జట్టు, తాము ఛేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. ఈ క్రమంలో 1.3 ఓవర్ల తర్వాత గంధరగోళానికి లోనై మ్యాచ్ రిఫరీని సంప్రదించగా, ఆయన మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. 10 నిమిషాల చర్చల అనంతరం తిరిగి ప్రారంభంమైన మ్యాచ్‌లో తొలుత బంగ్లాకు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన మ్యాచ్ రిఫరీ.. ఆతరువాత దాన్ని 16 ఓవర్లలో 171 పరుగులుగా మార్చాడు. దీంతో మ్యాచ్ మధ్యలో పెద్ద హైడ్రామానే నెలకొంది. డక్‌వర్త్ లూయిస్ కొత్త రూల్స్ విషయంలో బంగ్లా జట్టు కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఒక అర్ధముంది, ఏకంగా మ్యాచ్ రిఫరీనే కన్ఫ్యూజ్ అయ్యాడంటే రూల్స్ ఎంత తికమక పెడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు క్రికెట్ అభిమానులు. కాగా, 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా జట్టు 16 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిధ్య జట్టు 2-0తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: హార్ధిక్ తన బ్యాటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకున్నాడు.. -
విజయాల్లో ధోనితో సమానంగా నిలిచాడు
అబుదాబి: అఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అతని నాయకత్వంలో ఆప్ఘన్ జట్టు 41 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అస్గర్ అఫ్గాన్ 51 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా టీమిండియా తరపున ఎంఎస్ ధోని.. తన కెరీర్లో 72 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. విజయాల శాతం పరంగా చూసుకుంటే.. ధోనీ 59.28 శాతం విజయాల్ని సొంతం చేసుకోగా.. అస్గర్ అఫ్గాన్ ఏకంగా 81.37 శాతం విజయాల్ని నమోదు చేయడం గమనార్హం.యూఏఈ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ టీమ్.. 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ని కైవసం చేసుకుంది. అబుదాబి వేదికగా తాజాగా జరిగిన రెండో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన జింబాబ్వే 17.1 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది. చదవండి: సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు రోహిత్ అత్యాశపరుడు.. ధోని షాకింగ్ వీడియో..! -
అందరి చర్చా.. ‘సాఫ్ట్’ సిగ్నల్ పైనే!
‘స్పష్టత లేదు’... లెక్క లేనన్ని సార్లు రీప్లేలు చూసిన తర్వాత మూడో అంపైర్ వీరేందర్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. నాలుగో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్‌ను మలాన్ ఎలా పట్టాడో అందరికీ స్పష్టంగా కనిపించింది. బంతి గ్రౌండ్‌కు తాకిన విషయం టీవీల ముందు కూర్చున్న లక్షలాది మందికి, మైదానంలో ఉన్న ఆటగాళ్లకూ తెలుస్తోంది. కానీ అంపైర్‌కు మాత్రం అది నాటౌట్ అనిపించలేదు. అందుకే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సూర్యను అంపైర్ పెవిలియన్‌కు పంపించాడు. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అలా ఎలా ఇచ్చాడు అనేది సగటు అభిమానికి అర్థం కాలేదు. అందుకు కారణం ‘సాఫ్ట్ సిగ్నల్’. ఇప్పుడు ఇదే ‘సాఫ్ట్’ నిర్ణయం క్రికెట్లో కొత్త చర్చకు దారి తీసింది. -సాక్షి క్రీడా విభాగం నాలుగో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ఉంటే ఎలా ఉండేది? సహజంగానే సూర్యకుమార్ అవుట్‌పై మరింత రచ్చ జరిగేది. ఓటమికి అంపైర్ తప్పుడు నిర్ణయమే కారణమని అన్ని వైపుల నుంచి మాజీలు, విశ్లేషకులు విరుచుకు పడేవారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ మ్యాచ్ కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. తనకు కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో నిబంధనలు మార్చాలంటూ సహజంగానే డిమాండ్లు ముందుకు వచ్చాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి... సూర్యకుమార్ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఒకవైపు థర్డ్ అంపైర్‌కు నివేదిస్తూనే మరోవైపు తన వైపుగా ‘అవుట్’ అంటూ వేలెత్తి చూపించేశాడు. ఇదే ‘సాఫ్ట్ సిగ్నల్’. అంటే తనకు ఎలా అనిపించిందనే విషయాన్ని అతను స్పష్టంగా చెప్పేశాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసిన తర్వాత ‘ఇన్‌కన్‌క్లూజివ్’ అంటూ స్పష్టంగా కనిపించడం లేదని తేల్చేశాడు. కాబట్టి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే సరైందని ప్రకటించడంతో అది అవుట్‌గా తేలింది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ అంపైర్లూ తమ పరిధిలో సరిగ్గానే విధులు నిర్వర్తించారు. అయితే రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో థర్డ్ అంపైర్‌ను తప్పు పట్టలేం. కానీ సూర్య విషయంలో అంతా స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అలా తేల్చడమే వివాదం ముదరడానికి కారణమైంది. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ ఎందుకు స్పందించాలి, రనౌట్ల తరహాలో నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయవచ్చు కదా అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయం తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. దీనినే ఇప్పుడు తొలగించాలని అందరూ చెబుతున్నారు. ‘సాఫ్ట్’ వెనుక కారణమిదీ... సాంకేతికత ఎంత గొప్పగా ఉన్నా దానిని ఆపరేట్ చేసేది మానవమాత్రులే కాబట్టి 100 శాతం దానిపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా సరిగ్గా ఇదే కారణంతోనే. బాల్ ట్రాకింగ్ ఎలా చూపించినా అంపైర్ దృష్టిలో బంతి ఎలా స్పందిస్తుంది అనేదానిపైనే ఆధారపడి నిర్ణయాలు ప్రకటిస్తాడు. సూర్యకుమార్‌లాంటి క్యాచ్‌ల విషయంలో కొన్నిసార్లు ఫీల్డర్ స్పందన, ముఖకవళికలు కూడా అంపైర్లను ప్రభావితం చేస్తాయనేది వాస్తవం. ఇలాంటి సందర్భాల్లో మహా నటుల్లా కనిపించే ఆటగాళ్లను పూర్తిగా నమ్మడం కూడా సరైంది కాదు. అయితే సగటు అభిమానికి అర్థంకాని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ‘ఒక మ్యాచ్‌కు కనీసం 10 కెమెరాలు వాడితే అందులో 2 సూపర్ స్లో మోషన్ కెమెరాలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా స్పష్టతనివ్వలేవు. ఇప్పుడు వాడుతున్న కెమెరాలు 2డి మాత్రమే. అన్ని స్పష్టంగా కనిపించాలంటే 3డి కెమెరాలు వాడాలి. పైగా పెద్ద జట్లు మినహా అన్ని సిరీస్‌లకు ఇలాంటివి వాడటంలేదు. అబుదాబిలో జరుగుతున్న అఫ్గానిస్తాన్, జింబాబ్వే సిరీస్‌లో అసలు అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) లేదు. కాబట్టి అందరికీ ఒకే రూల్ అనే నిబంధన పని చేయదు’ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏదో ఒక దశలో అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే కాబట్టి ఆ అవకాశం ఫీల్డ్ అంపైర్‌కే ఇస్తున్నట్లు లెక్క. కీలక మ్యాచ్‌లలో ఇలాం టివి తుది ఫలితాన్ని మార్చేయవచ్చు. అసలు అంపైర్ అవుట్గానీ నాటౌట్కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా. అందరికీ అర్థమయ్యే తరహాలో ఒకే రకమైన నిబంధనలు రూపొందించాలి. –కోహ్లి, భారత కెప్టెన్ -
సూపర్ ఓవర్ అనుకున్నారు.. కానీ థ్రిల్లింగ్ విక్టరీ
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. విండీస్ విజయానికి ఒక్క పరుగు దూరంలో బ్రియాన్ లారా వికెట్ కోల్పోవడం.. ఆ తర్వాత టినో బెస్ట్ సూపర్ ఓవర్‌కు అవకాశం ఇవ్వకుండా సింగిల్ తీయడంతో విండీస్ లెజెండ్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ మస్టర్డ్ 57, కెవిన్ పీటర్సన్ 37 పరుగులతో శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఒవైసీ షా (30 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్‌కు ఓపెనర్ డ్వేన్ స్మిత్ శుభారంభం అందించాడు. 31 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నర్సింగ్ డియోనారైన్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 34 పరుగులు చేసిన కిర్క్ ఎడ్వర్డ్స్ 19వ ఓవర్లో వెనుదిరగడంతో ఆఖర్లో హై డ్రామా నెలకొంది. ఆ తర్వాత వచ్చిన లారా కూడా 20వ ఓవర్ ఐదో బంతికి 3 పరుగులు చేసి స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో సూపర్ ఓవర్ ఖాయం అనుకున్న దశలో ఇన్నింగ్స్ చివరి బంతికి బెస్ట్ సింగిల్ తీసి వెస్టిండీస్ లెజెండ్స్‌ను సెమీస్‌కు చేర్చాడు. కాగా నేడు సెమీస్‌లో ఇండియా లెజెండ్స్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్ శ్రీలంక లెజెండ్స్, దక్షిణాఫ్రికా లెజెండ్స్ మధ్య జరగనుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(మార్చి 21న) జరగనుంది. చదవండి: పంత్ తొందరపడ్డావు.. రెండు రన్స్‌తో ఆగిపోవాల్సింది దుమ్మురేపిన బ్రావో.. విండీస్‌దే సిరీస్ -
టీమిండియాకు జరిమానా.. కోవిడ్ తర్వాత మూడోసారి
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాము చేసిన తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి తెలిపాడు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్‌కు జరిమానా పడడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌కు రెండుసార్లు ఫైన్ పడింది. కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మార్చి 16న ఇదే వేదికగా జరుగనుంది. -
యువీని ఉతికారేసిన కెవిన్ పీటర్సన్
రాయ్‌పూర్: రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్, ఇంగ్లండ్ లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెవిన్ పీటర్సన్ యువీ బౌలింగ్‌ను ఉతికారేశాడు. యువీ బౌలింగ్‌లో వరుస బంతుల్లో సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే పఠాన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెవిన్ పీటర్సన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా యువరాజ్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది 18 బంతుల్లోనే పీటర్సన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాడీ 29 పరుగులతో పీటర్సన్‌కు సహకరించాడు. ఇండియా లెజెండ్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ 3, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇండియా లెజెండ్స్ విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గత మ్యాచ్ విన్నర్లు సెహ్వాగ్, సచిన్‌లు విఫలం కాగా.. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61*పరుగులు) ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసిన అతను ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు.యువరాజ్ 22 పరుగులు చేయగా.. మిగతావారు విఫలమయ్యారు. కాగా ఇంగ్లండ్ లెజెండ్స్ బౌలింగ్‌లో పనేసర్ 3, జేమ్స్ ట్రెడ్‌వెల్ 2, హోగార్డ్, సైడ్ బాటమ్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: టీమిండియాలో స్థానం కోసం దూసుకొస్తున్న ఆర్సీబీ ఓపెనర్ 'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో' -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
మ్యాక్సీ సిక్సర్ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రత్యర్థి బౌలర్లపై శివాలెత్తాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్ నీషమ్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్సీ పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్లో వరుసగా 4 6 4 4 4 6 బాది 28 రన్స్‌ను పిండుకున్నాడు. ఈ క్రమంలో మ్యాక్సీ సిక్సర్ల ధాటికి స్టాండ్స్‌లో ఉన్న ఓ సీటు తునాతునకలైంది. సౌథీ వేసిన 18వ ఓవర్లోని నాలుగో బంతి జెట్ వేగంతో స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న ఓ సీటును బలంగా తాకింది. బంతి వేగానికి ఆ సీటుకు పెద్ద రంధ్రమే పడింది. స్టాండ్స్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది. మ్యాక్సీ ధాటికి తునాతునకలైన ఆ సీటును ఓ స్వచ్ఛంద సంస్థ కోసం వేలానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం మాక్సీ ఆ సీటుపై సంతకం కూడా చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ధాటికి ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 5 టీ20ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్ మూడో టీ20ని కోల్పోవడంతో ఆధిక్యాన్ని 2-1కి తగ్గించుకుంది. 💥 70 runs from 31 balls 💥 Eight fours and five sixes An action-packed knock from Glenn Maxwell 🔥#NZvAUS | https://t.co/SauGpoGf1Fpic.twitter.com/yGseEwdnHd — ICC (@ICC) March 3, 2021 -
ఇంగ్లండ్ మహిళలకు నాలుగో విజయం
డెర్బీ: ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు విజయం దూరంలో ఉంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన నాలుగో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 44 పరుగుల ఆధిక్యంతో గెలిచి సిరీస్‌లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు సాధించింది. అమీ జోన్స్ (37 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హీథర్‌నైట్ (30 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అలెన్ రెండు వికెట్లు తీసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసి ఓడిపోయింది. షెడిన్ నేషన్ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేథరిన్ బ్రంట్, సారా గ్లెన్ రెండేసి వికెట్లు తీశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
ఇంగ్లండ్ మహిళలదే తొలి టి20
డెర్బీ: ఆరు నెలల తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టి20 సిరీస్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్ పునః ప్రారంభమైంది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 47 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. టామ్సిన్ బ్యూమోంట్ (49 బంతుల్లో 62; 9 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. విండీస్ బౌలర్లలో షకీరా కసాండ్రా మూడు వికెట్లు తీయగా... హేలీ మాథ్యూస్, స్టెఫానీ టేలర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 116 పరుగులు చేసి ఓడిపోయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డీండ్రా డాటిన్ (59 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేరకపోవడం గమనార్హం. -
ఆసీస్ అనూహ్య పరాజయం
సౌతాంప్టన్: విజయానికి 35 బంతుల్లో 39 పరుగులు చేయాలి... చేతిలో 9 వికెట్లున్నాయి... టి20ల్లో ఏ జట్టుకైనా ఇది సులువైన లక్ష్యం. అదీ ఆస్ట్రేలియాలాంటి అగ్రశ్రేణి జట్టయితే ఆడుతూ పాడుతూ పని పూర్తి చేయాలి. కానీ ఇంగ్లండ్‌తో ఇక్కడి రోజ్‌బౌల్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆసీస్ మాత్రం ఇలాంటి స్థితి నుంచి కూడా మ్యాచ్‌ను చేజార్చుకుంది. 14 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. చివరకు ఆస్ట్రేలియా 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మలాన్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, జాస్ బట్లర్ (29 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (47 బంతుల్లో 58; 4 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, సిక్స్)ల జోరు చూస్తే సునాయాస విజయం ఖాయమనిపించింది. వీరిద్దరు 11 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఒక దశలో ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 124 పరుగుల వద్ద నిలిచింది. అయితే 9 పరుగుల వ్యవధిలో స్మిత్ (18), మ్యాక్స్‌వెల్ (1), వార్నర్, క్యారీ (1) అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టిపడేయడంతో 5.4 ఓవర్ల పాటు ఆ జట్టు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. టామ్ కరన్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... ఆరు బంతులూ ఆడిన స్టొయినిస్ ఒక సిక్సర్ సహా 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను నిర్వహిస్తుండటంతో బ్యాట్స్‌మెన్ కొట్టిన సిక్స్‌లకు బంతి గ్యాలరీల్లోకి పడితే ఆటగాళ్లే బంతిని వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. -
భారత మహిళల జట్టు ఓటమి
కాన్బెర్రా: ముక్కోణపు టి20 మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి (35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ (28; 4 ఫోర్లు) రాణించారు. ఎలీస్ పెర్రీ (4/13) భారత్‌ను కట్టడి చేసింది. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. పెర్రీ (49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
భారత్‌కు ఎదురుందా!
మౌంట్‌మాంగనీ: గతంలో రెండు సార్లు న్యూజిలాండ్‌కు వచ్చినా... పొట్టి సిరీస్ నెగ్గని భారత జట్టు ఇప్పుడు ఏకంగా క్లీస్‌స్వీప్ చేసేందుకు రెడీగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై వరుస ఓటమిలతో సిరీస్‌ను కోల్పోయిన కివీస్ పరువు కోసం పాకులాడుతోంది. నేడు ఇరు జట్ల మధ్య ఆఖరి టి20 పోరు జరగనుంది. ఈ ఫలితంతో వచ్చే నష్టమేమీ లేకపోవడంతో భారత కెప్టెన్ కోహ్లి, రాహుల్‌లకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. దీంతో పొట్టి ప్రపంచకప్ ఏడాది సత్తాచాటుకునేందుకు రిజర్వ్ బెంచ్‌కు ఇది సదావకాశం. ఆఖరి పోరుకు ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, పంత్‌కు తొలిసారిగా ఇక్కడ గ్లౌవ్స్ తొడుక్కునే అవకాశం వచ్చింది. గత మ్యాచ్‌లో విఫలమైన సంజూ సామ్సన్ ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే అయ్యర్, దూబేలు కూడా స్థిరమైన ప్రదర్శనపై దృష్టిపెట్టాలి. పాండేపై ఎవ రికీ ఎలాంటి అనుమానం లేదు. ఇక బౌలింగ్‌లో భారత్ చాలా మెరుగ్గా కనిపిస్తుంది. రెండు ‘టై’ మ్యాచ్‌ల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌలర్ల గురించే. షమీ తర్వాత శార్దుల్ కూడా నాణ్యమైన డెత్ బౌలర్‌గా నిరూపించుకున్నాడు. ఎలా గెలవాలబ్బా! ఆతిథ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. గెలుపు గడపదాకా రెండు సార్లు వచ్చినా... నెగ్గలేకపోవడం జట్టును నిరాశలో ముంచింది. ఇది చాలదన్నట్లు విలియమ్సన్ గాయం జట్టుకు మరింత ప్రతికూలంగా మారింది. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ గెలిపించాల్సిన స్థితిలో బాధ్యతని నిర్వర్తించలేకపోతున్నాడు. ఇది న్యూజిలాండ్ జట్టును కలవరపెడుతోంది. అందరూ సమష్టిగా రాణించి భారత జోరుకు బ్రేక్‌వేసి కనీసం పరువు అయినా కాపాడుకోవాలని న్యూజిలాండ్ జట్టు ఆశిస్తోంది. -
భారత మహిళల శుభారంభం
కాన్బెర్రా: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు విజయంతో బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ హీతర్ నైట్ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, ట్యామీ బీమాంట్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ షఫాలీ వర్మ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు నిలిచి గెలిపించింది. ఆఖరి 4 బంతుల్లో విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా భారీ సిక్సర్‌తో హర్మన్ మ్యాచ్ ముగించింది. -
‘సూపర్’ సీక్వెల్
మనం ఇన్నాళ్లు సీక్వెల్ సినిమాలెన్నో చూశాం. కానీ ఇప్పుడే సీక్వెల్‌గా ఉత్కం‘టై’న మ్యాచ్‌లు చూస్తున్నాం. మొన్న షమీ చెలరేగితే... రోహిత్ అదరగొట్టేశాడు. కానీ ఆ ‘టైబ్రేక్’లో వీళ్లిద్దరు సీనియర్లు. ఇప్పుడైతే శార్దుల్‌కు అంతగా అనుభవమే లేదు. పైగా భారత్‌కు మ్యాచ్‌పై పట్టులేదు. ఎవరికీ గెలుపుపై ఆశే లేదు. ఇలాంటి సమయంలో సంచలన బౌలింగ్‌తో శార్దుల్ కివీస్‌ను కట్టడి చేయడంతో స్కోర్లు సమమైంది. అంతే ఆట సూపర్కెళ్లింది. భారత్ చితగ్గొట్టింది. అలా రెండో సీక్వెల్ ‘టైబ్రేక్’లోనూ టీమిండియానే పైచేయి సాధించింది. క్లీన్‌స్వీప్ దారిలో నాలుగో అడుగు పడింది. ఇక మిగిలిందొక్కటే! న్యూజిలాండ్‌పై 20వ ఓవర్‌ను చూస్తే... వారెవ్వా శార్దుల్ అనే అంటాం. చివరకు ‘సూపర్’ ఫలితాన్ని చూస్తే మాత్రం ఏ కాస్త కనికరమున్నా... అయ్యో పాపం కివీస్ అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఆఖరిదాకా వచ్చి ఓడిపోయిందని జాలనిపిస్తుంది. ఇలా సూపర్ ఓవర్లో పదేపదే ఓడితే మాత్రం కచ్చితంగా ఎవరైన పాపమనే అంటారు. గత పదేళ్లుగా ఆరు మ్యాచ్‌ల్లో (ఒక వన్డే కలుపుకొని) సూపర్దాకా వెళ్లిన న్యూజిలాండ్ గెలుపును మాత్రం సాకారం చేసుకోలేకపోయింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా...ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 6 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. వెల్లింగ్టన్: గత మ్యాచ్ టై... ఈ మ్యాచ్ టై... అప్పుడు సూపర్, ఇప్పుడు సూపర్... అయినా విన్నర్ మారలేదు. కివీస్ తలరాత కూడా మారలేదు. మూడో మ్యాచ్‌లో ఆఖరి బంతులు భారత్‌కు అనూహ్య గెలుపునివ్వగా... ఈ మ్యాచ్‌లో శార్దుల్ అద్బుత బౌలింగ్ ప్రదర్శన భారత్ గెలిచేందుకు ఊపిరి పోసింది. శుక్రవారం కూడా ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నాడు. సోధి 3, బెన్నెట్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మన్రో (47 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సీఫెర్ట్ (39 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆదుకున్న పాండే మనీశ్ పాండే షాట్ మళ్లీ టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్ రాహుల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. అతనితో ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ సామ్సన్ (8) సహా కెప్టెన్ కోహ్లి (11), శ్రేయస్ అయ్యర్ (1), శివమ్ దూబే (12) అంతా విఫలం కాగా... టీమిండియా 12 ఓవర్లు ముగియక ముందే 88 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మనీశ్ పాండే చేసిన ఫిఫ్టీనే ‘శతక’మంత సాయం చేసింది. టెయిలెండర్లు శార్దుల్ (15 బంతుల్లో 20; 2ఫోర్లు), సైనీ (11 నాటౌట్) అండతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మన్రో, సీఫెర్ట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఏమంత కష్టం కానీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ ‘పవర్ ప్లే’లో గప్టిల్ (4) వికెట్ కోల్పోయింది. మన్రో, సీఫెర్ట్‌ల రెండో వికెట్ భాగస్వామ్యం 74 పరుగులకు చేరడం, జట్టు స్కోరు వందకు సమీపించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఎట్టకేలకు రనౌట్ రూపంలో మన్రో, పరుగు వ్యవధిలో బ్రూస్ (0) ఔట్ కావడంతో చిగురించిన ఆశలపై సీఫెర్ట్, టేలర్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు) నీళ్లుచల్లారు. 19 ఓవర్లలో కివీస్ స్కోరు 159/3. అప్పటికే సీఫెర్ట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. టేలర్ ఔట్ – సీఫెర్ట్ రనౌట్ ఇంకా చేతిలో 7 వికెట్లుండటం... 6 బంతుల్లో విజయానికి 7 పరుగులు అవసరముండటంతో కివీస్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ చివరి ఓవర్ తొలి బంతి నుంచే గెలుపు మలుపు తీసుకుంది. శార్దుల్ వేసిన ఫుల్లెంత్ డెలివరీని లాఫ్టెడ్ షాట్ ఆడగా అది మిడ్ వికెట్లో అయ్యర్ చేతికి చిక్కింది. క్రీజ్‌లోకి వచ్చిన మిచెల్ వస్తూనే బౌండరీ కొట్టాడు. ఇక మిగిలింది 3 పరుగులైతే 4 బంతులున్నాయి. మూడో బంతి మిచెల్‌ను బీట్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లగా పరుగందుకున్న సీఫెర్ట్ వచ్చే లోపే రాహుల్ వికెట్లకు గిరాటేయడంతో అతను రనౌటయ్యాడు. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. నాలుగో బంతికి ఓ పరుగుతీశాడు. ఐదో బంతిని మిచెల్ (4) గాల్లోకి లేపాడు. మిడాఫ్‌లో ఉన్న దూబే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి వుండగా సాన్‌ట్నర్ ఒక పరుగు మాత్రమే పూర్తి చేశాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించగా డీప్ పాయింట్లో ఉన్న సామ్సన్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని కీపర్‌కు అందించాడు. రెప్పపాటు వ్యవధిలోనే రాహుల్ వికెట్లను కూల్చేయడంతో సాన్‌ట్నర్ (2) రనౌట్. మ్యాచ్ టై అయ్యింది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతినిచ్చి సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, సైనిలకు అవకాశమిచ్చింది. కానీ ఈ ముగ్గుర్లో ఎవరూ రాణించలేదు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ‘ప్రత్యర్థి ఎంత బాగా ఆడుతున్నా చివరి వరకు ప్రశాంతంగా ఉండి పోరాడాలని ఈ రెండు మ్యాచ్‌లు నాకు నేర్పించాయి. ఇంతకంటే అద్భుతమైన మ్యాచ్‌లను ఆశించలేం. గతంలో ఎప్పుడూ సూపర్ ఓవర్ ఆడని మేం ఇప్పుడు వరుసగా రెండు గెలిచాం. సూపర్ ఓవర్లో సామ్సన్తో ఓపెనింగ్ చేయించాలనుకున్నా నా అనుభవం పనికొస్తుందని రాహుల్ చెప్పడంతో నేనే బ్యాటింగ్‌కు వచ్చాను. మా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా’ –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి)సాన్‌ట్నర్ (బి) సోధి 39; సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్లీన్ 8; కోహ్లి (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 11; అయ్యర్ (సి) సీఫెర్ట్ (బి) సోధి 1; దూబే (సి) బ్రూస్ (బి) సోధి 12; పాండే నాటౌట్ 50; సుందర్ (బి) సాన్‌ట్నర్ 0; శార్దుల్ (సి) సౌతీ (బి) బెన్నెట్ 20; చహల్ (సి) íసీఫెర్ట్ (బి) సౌతీ 1; సైనీ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–14, 2–48, 3–52, 4–75, 5–84, 6–88, 7–131, 8–143. బౌలింగ్: సౌతీ 4–0–28–1, కుగ్లీన్ 4–0–39–1, సాన్‌ట్నర్ 4–0–26–1, బెన్నెట్ 4–0–41–2, సోధి 4–0–26–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 4; మన్రో రనౌట్ 64; íసీఫెర్ట్ రనౌట్ 57; బ్రూస్ (బి) చహల్ 0; టేలర్ (సి) అయ్యర్ (బి) ఠాకూర్ 24; మిచెల్ (సి) దూబే (బి) ఠాకూర్ 4; సాన్‌ట్నర్ రనౌట్ 2; కుగ్లీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–22, 2–96, 3–97, 4–159, 5–163, 6–164, 7–165. బౌలింగ్: శార్దుల్ 4–0–33–2, సైనీ 4–0–29–0, బుమ్రా 4–0–20–1, చహల్ 4–0–38–1, సుందర్ 2–0–24–0, దూబే 2–0–14–0. -
ప్రయోగాలు చేస్తారా!
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఖాతాలో ఇప్పటికే టి20 సిరీస్ చేరింది. గత మ్యాచ్‌లో దక్కిన అనూహ్య విజయం తర్వాత టీమిండియా శిబిరంలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అయినా సరే, క్లీన్‌స్వీప్ కోసం ప్రయత్నిస్తామని కెప్టెన్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడా ఉదాసీనత కనబర్చరాదని జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో అవకాశం దక్కని సభ్యులను ఆడిస్తారా లేదా అనేది ప్రస్తుతం భారత జట్టు కూర్పుకు సంబంధించి ఆసక్తి కలిగించే అంశం. మరోవైపు గెలుపు అంచుల వరకు వెళ్లి కూడా దురదృష్టం వెంటాడిన న్యూజిలాండ్ తాజా పరాజయం నుంచి కోలుకొని నాలుగో మ్యాచ్‌లో ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. వెల్లింగ్టన్: అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్ అదే ఊపును కొనసాగించి ఆధిక్యాన్ని మరింత పెంచుకునేందుకు సన్నద్ధమైంది. నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. తాజా ఫామ్ ప్రకారం చూస్తే మన జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థికి దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్ చెలగాటం...మరోవైపు న్యూజిలాండ్‌కు ప్రాణసంకటంగా తయారైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. తమ అత్యుత్తమ ప్రదర్శన తర్వాత కూడా గెలుపు గీత దాటలేకపోవడం జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో కివీస్ బృందం ఉంది. తుది జట్టులోకి ఎవరు? రిషభ్ పంత్, సంజు సామ్సన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్... ఈ పర్యటనలో ఇంకా అవకాశం దక్కని ఐదుగురు భారత క్రికెటర్లు. వీరిలో కనీసం ఇద్దరికైనా నేటి మ్యాచ్ తుది జట్టులో స్థానం లభించవచ్చని అంచనా. ముఖ్యంగా గత ఏడాది కాలంగా భారత బౌలర్లలో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేసిన షమీకి విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అతని స్థానంలో నవదీప్ సైనీని ఎంచుకోవచ్చు. టి20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో సైనీ కూడా భాగంగా ఉన్నాడు కాబట్టి అతనిని ఆడించాలని కెప్టెన్ భావిస్తున్నాడు. చహల్ స్థానంలో కుల్దీప్, జడేజాకు బదులుగా సుందర్‌లను ఎంచుకోవచ్చనేది కూడా అంచనా. వీరిలో ఎవరు వచ్చినా భారత జట్టు స్వరూపం ఒక్కసారిగా మారిపోదు కాబట్టి జట్టు బలమేమీ తగ్గదు. బ్యాటింగ్ విభాగంలో కూడా ఎవరినీ తప్పించే అవకాశం లేదు కాబట్టి పంత్, సామ్సన్ తమ అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే. రాహుల్ ఇటీవలి ప్రదర్శన తర్వాత మరో కీపర్ గురించి జట్టు ఆలోచించడం లేదు. అదే విధంగా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న నేపథ్యంలో మార్పు కష్టమే. మరో రెగ్యులర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే పేరుకు తుది జట్టులో ఉన్నా అతను చివర్లో వస్తుండటంతో ఎక్కువ బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుగా పంపించే అవకాశం ఉంది. దూబే కూడా మళ్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగవచ్చు. ఎలా ఆడాలో? అత్యంత అనుభవజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్, టి20 మ్యాచ్‌లో 4 బంతుల్లో విజయానికి 2 పరుగులు కావాలి... కానీ ఇలాంటి స్థితిలో కూడా కివీస్ మ్యాచ్ చేజార్చుకుందంటే అది పెద్ద వైఫల్యం కిందే లెక్క! ఇలాంటి విషాదం నుంచి కోలుకొని న్యూజిలాండ్ మళ్లీ సత్తా చాటాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే మూడో టి20లో నిజానికి న్యూజిలాండ్ మెరుగ్గా ఆడింది. ఇప్పుడు దాదాపు అదే జట్టుతో మరోసారి కివీస్ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. గ్రాండ్‌హోమ్ స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ డరైన్ మిషెల్ రావడం మాత్రం ఖాయమైంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు టేలర్ బ్యాటింగ్‌పై జట్టు ఆధారపడుతోంది. మూడో మ్యాచ్‌లో విలియమ్సన్ మెరుపు ఇన్నింగ్స్ అతని స్థాయి ఏమిటో చూపించింది. ఈ సారైనా అతని ప్రదర్శన గెలుపునందించాలని కివీస్ కోరుకుంటోంది. బౌలింగ్ విభాగం ఎప్పటిలాగే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. సౌతీ అనుభవం పెద్దగా అక్కరకు రాలేదు. ఇప్పటి వరకు సిరీస్‌లో విఫలమైన సాన్‌ట్నర్ తనకు అచ్చొచ్చిన ఇక్కడి మైదానంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, అయ్యర్, పాండే, దూబే, సుందర్, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, సైనీ. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్లీన్, టిమ్ సౌతీ, సోధి, బెన్నెట్. పిచ్, వాతావరణం వెస్ట్‌పాక్ స్టేడియంలోని పిచ్ కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణంతో సమస్య లేదు. 2014 నుంచి ఇక్కడ ఆడిన వరుస ఆరు మ్యాచ్‌లలో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. -
భారీ షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
-
షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు) -
6,6,6,6,6,6
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ దేశవాళీ టి20 టోర్నీ ‘సూపర్ స్మాష్’లో భాగంగా ఆదివారం క్యాంటర్బరీ కింగ్స్, నార్తర్న్ నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. క్యాంటర్బరీ కింగ్స్ బ్యాట్స్‌మన్ లియో కార్టర్ ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడు. క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. నార్తర్న్ నైట్స్ జట్టు స్పిన్నర్ ఆంటోన్ డెవ్రిచ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కార్టర్ ‘ఆరే’శాడు. కార్టర్ విధ్వంసంతో (29 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో క్యాంటర్బరీ కింగ్స్ జట్టు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. అన్ని ఫార్మాట్లలో ఒకే ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కార్టర్ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ (భారత్), వైట్లీ (ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) ఈ ఘనత సాధించారు. –సోబర్స్ (కౌంటీ క్రికెట్లో), రవిశాస్త్రి (రంజీ ట్రోఫీ) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో... గిబ్స్ అంతర్జాతీయ వన్డే (2007 వరల్డ్ కప్) మ్యాచ్‌లో, యువరాజ్ (2007 వరల్డ్ కప్) అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో... వైట్లీ (నాట్‌వెస్ట్ ట్రోఫీ), హజ్రతుల్లా (అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్), కార్టర్ (సూపర్ స్మాష్ టోర్నీ) దేశవాళీ టి20 క్రికెట్లో ఈ ఘనత నమోదు చేశారు. -
పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని!
సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్, వెస్టిండీస్ జట్లు ఆఖరి సమరానికి సిద్ధమయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, ఫీల్డర్ల వైఫల్యం టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... ఐపీఎల్ అనుభవంతో నిర్ణాయక మ్యాచ్ ఫలితాన్ని శాసించాలని పొలార్డ్ బృందం పట్టుదలతో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ సొంత మైదానంలో ‘హిట్’ కావాలని, జట్టుకు సిరీస్ అందించాలని ఉత్సాహంతో ఉన్నాడు. ముంబై: భారత్, వెస్టిండీస్‌ల మధ్య ‘పొట్టి’పోరు ఆఖరి అంకానికి చేరింది. కోహ్లి సేన లోపాలను సరిదిద్దుకొని సమరానికి సన్నద్ధం కాగా... వాంఖెడే స్టేడియం పొలార్డ్‌ను ఊరిస్తోంది. ఐపీఎల్‌తో సొంత మైదానమైన చోట మ్యాచ్‌ను, సిరీస్‌ను చేజిక్కించుకోవాలని విండీస్ కెపె్టన్ పట్టుదలతో ఉన్నాడు. పూర్తిగా యువకులతో కూడిన వెస్టిండీస్ గత మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు సవాల్ విసిరింది. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌తో ఈ పోరులో భారత్ ఆదమరిస్తే... మూల్యంగా మ్యాచ్‌నే కాదు, సిరీస్‌నే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అనుభవజ్ఞులు, కుర్రాళ్ల కలయికతో ఉన్న టీమిండియా సత్తా చాటాల్సిన సమయమిదే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి 1–1తో సమంగా ఉన్న నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో టి20 మ్యాచ్ నిర్ణాయకం కానుంది. రోహిత్‌పై ఆశలు... రోహిత్, కోచ్ రవిశాస్త్రి తన సొంతగడ్డపై రోహిత్ శర్మ మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం సులువవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అతను నిరాశపరిచాడు. 8, 15 పరుగులే చేసిన ‘హిట్‌మ్యాచ్’ ఈ పోరులో బ్యాట్ ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం. తొలి మ్యాచ్‌లో కోహ్లితో పాటు చెలరేగిన రాహుల్ ఈ మ్యాచ్‌లో తన ప్రభావం చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఛేజింగ్‌లో ఓపెనర్లిద్దరు శుభారంభమిస్తే కోహ్లి సేన ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలుగుతుంది. సిరీస్‌ను తేల్చే కీలకమైన ఈ మ్యాచ్‌కు తుదిజట్టులో మార్పులు చేయకపోవచ్చు. పైగా కెపె్టన్ కోహ్లి... వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై నమ్మకముంచడంతో సంజూ సామ్సన్‌కు ఈ సిరీస్‌లోనూ తుది జట్టులో ఆడే చాన్స్ లేకపోయింది. బంగ్లాదేశ్‌తో కూడా అతన్ని ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. టాపార్డర్‌లో ప్రమోషన్ పొందిన శివమ్ దూబే ఈ మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, పంత్‌లు కూడా పరుగుల ప్రవాహానికి జతకలిస్తే భారత్ భారీ స్కోరు చేయగలుగుతుంది. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లపై భారత బ్యాట్స్‌మెన్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. క్యాచ్‌లు పడితేనే... ఈ సిరీస్‌లో భారత ఫీల్డింగ్ వైఫల్యం జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ విలువైన క్యాచ్‌లు జారవిడువడం సమస్యగా మారింది. తొలి టి20లో ఈ వైఫల్యాన్ని అనుకూలంగా మలుచుకున్న విండీస్ 200 పైచిలుకు పరుగులు చేసింది. కోహ్లి ఆఖరిదాకా చెలరేగడంతో గెలుపు దక్కింది. కానీ రెండో వన్డేలో క్యాచ్‌లు చేజార్చి భారత్ మూల్యం చెల్లించుకుంది. లేదంటే ఈపాటికే సిరీస్‌ను గెలిచేది. నెట్స్‌లోనూ భారత్ ప్రధానంగా ఈ లోపాలపైనే కసరత్తు చేసింది. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా మెరుగుపడాలి. పునరాగమనం చేసిన భువనేశ్వర్ పరుగుల్ని కట్టడి చేయలేకపోయాడు. బంగ్లాదేశ్‌పై నిప్పులు చెరిగిన దీపక్ చాహర్ ఈ సిరీస్‌లో లయ కోల్పోయాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. వీళ్లంతా రాణిస్తేనే కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగిస్తుంది. పొలార్డ్‌కు కలిసొచ్చే ముంబై... ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌గా వాంఖెడేలో విండీస్ సారథి పొలార్డ్‌కు ఎంతో అనుభవముంది. పిచ్, గ్రౌండ్‌పై అతనికి రోహిత్ శర్మకు ఉన్నంత అవగాహన ఉండటం ఈ మ్యాచ్‌లో విండీస్‌కు కలిసిరావొచ్చు. టాపార్డర్‌లో సిమన్స్, లూయిస్ ఫామ్‌లో ఉన్నారు. హిట్టర్లు హెట్‌మైర్, నికోలస్ పూరన్ అందుబాటులో ఉండటం కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పటిష్టం చేసింది. జట్టు మొత్తం యువకులే. పొట్టి ఫార్మాట్‌కు తగిన దూకుడు కుర్రాళ్లలోనే ఉంటుంది. బ్రాండన్ కింగ్ భారీషాట్లు ఆడగల సమర్థుడు. గత మ్యాచ్‌లో బౌలర్లు విలియమ్స్, కాట్రెల్ భారత జోరుకు కళ్లెం వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా కట్టడి చేశారు. అనుభవజ్ఞుడైన పేసర్ హోల్డర్, లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ టీమిండియాపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది. ►ముంబైలోని వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు మూడు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచి (శ్రీలంకపై 5 వికెట్లతో; డిసెంబర్ 24న, 2017)... రెండింటిలో (ఇంగ్లండ్ చేతిలో 6 వికెట్లతో; డిసెంబర్ 22న, 2012... విండీస్ చేతిలో 7 వికెట్లతో; మార్చి 31న, 2016) ఓడిపోయింది. వాంఖెడేలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. మేం ఎప్పుడో జరిగే పొట్టి ప్రపంచకప్‌పై ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్‌తో సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడైతే మా లోపాలను సవరించుకునే పనిలో ఉన్నాం. లక్ష్యాన్ని ఛేదించడమే భారత్‌కు సులువు. ఈ సిరీస్‌లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం పటిష్టమైన జట్టును ఎదుర్కొంటున్నాం. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాలి. అనంతరం న్యూజిలాండ్‌కు వెళ్లాలి. పది నెలల తర్వాత జరిగే మెగా ఈవెంట్‌కు ముందు మేం ఎన్నో టి20లు ఆడాల్సి ఉంటుంది. –భారత ఓపెనర్ రోహిత్ క్యాచ్‌లు చేజార్చుతుంటే మ్యాచ్‌ల్ని నెగ్గలేం. ఫీల్డర్లు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఫ్లడ్‌లైట్ల వల్ల కనబడలేదనో, మరే ఇతర కారణాల్ని సాకులుగా చెప్పడానికి వీల్లేదు. అవసరమైతే ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించైనా పట్టు సాధించాలి. కెపె్టన్ పొలార్డ్‌కు ఈ వేదికపై విశేషంగా ఆడిన అనుభవముంది. ఇది మా జట్టుకు పనికొస్తుంది. ఇక్కడ 200 చేసినా ఛేదించవచ్చు. మొదట బ్యాటింగ్ కంటే చేజింగే సులువు. –వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ పిచ్, వాతావరణం వాంఖెడేలో లక్ష్యఛేదన సులువు. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంటుంది. మంచుకురిసే రాత్రి వేళ బౌలర్లకు పట్టుదొరకడం కష్టం కావొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్ శర్మ, రాహుల్, పంత్, శ్రేయస్, శివమ్ దూబే, జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, చహల్. వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెపె్టన్), లెండిల్ సిమన్స్, లూయిస్, కింగ్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, పియరీ, విలియమ్స్, కాట్రెల్, హేడెన్ వాల్ష్ -
ఆటలో మమ్మల్ని పట్టుకోండి చూద్దాం...
సాక్షి, హైదరాబాద్: భారత ఆటగాళ్లలో ఒక బృందం వరుసగా నిలబడింది... వాళ్లంతా తమ షార్ట్స్‌లో ఒక ఎరుపు రంగు కర్చీఫ్ పెట్టుకున్నారు... వారందరి వెనక మరో ఆటగాడు పసుపు రంగు కర్చీఫ్ తో నిలబడి ఉన్నాడు. ట్రైనర్ విజిల్ వేయడమే తరువాయి...అంతా పరుగు మొదలు పెట్టేశారు. తమ ముందు నిలబడ్డ ఆటగాడిని అందుకోవడమే వెనక ఉన్నవారి పని అయితే అందకుండా ఎంత వేగంగా పరుగెత్తగలరో ముందున్న ఆటగాళ్ల సవాల్! ఇలా ఒకరి తర్వాత మరొకరు వంతులుగా ఈ ఛేదనలో పాల్గొన్నారు. ఒకసారి ముందు వరుసలో నిలబడిన ఆటగాళ్లు మరోసారి వెనకకు వెళ్లిపోయి తమ పరుగు సత్తాను పరీక్షించుకున్నారు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కనిపించిన దృశ్యమిది. దీనికి టీమిండియా పెట్టుకున్న పేరు ‘ఛేజ్ డ్రిల్’. గతంలో పలు సందర్భాల్లో విభిన్న తరహా విధానాలతో సాధన చేసిన కోహ్లి బృందంలో ఇప్పుడు ఈ పద్ధతి కొత్తగా వచ్చి చేరింది. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ ఆలోచన ఇది. దీని వల్ల ఆటగాళ్ల పరుగు వేగాన్ని పెంచవచ్చని అతను చెబుతున్నాడు. సహచరుల మధ్య పోటీ తత్వం పెంచడంతో పాటు ఒత్తిడిని తట్టుకునేందుకు కూడా ఇది ఒక సాధనంగా పనికొస్తుందని నిక్ అన్నాడు. రెగ్యులర్‌గా ఆడే ఫుట్‌బాల్‌తో పాటు ‘ఛేజ్ డ్రిల్’ తర్వాత మన ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లారు. విరాట్ ‘స్విచ్ బ్యాటింగ్’ బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ భారత జట్టులో చేరిన కెపె్టన్ విరాట్ కోహ్లి తొలి రోజు ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సుదీర్ఘ సమయం పాటు అతను సాధన చేశాడు. నెట్స్‌లోనే ముందుకొచ్చి కొన్ని భారీ షాట్లు ఆడిన అతను స్విచ్ హిట్‌ను కూడా ప్రయత్నించాడు. ఆ తర్వాత పూర్తిగా స్టాన్స్ మార్చి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తరహాలో కొన్ని బంతులు ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడపగా...యువ ఆటగాడు శివమ్ దూబే చూడచక్కటి షాట్లు ఆడాడు. విరామం తర్వాత పునరాగమనం చేస్తున్న భువనేశ్వర్ కుమార్‌కు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పలు సూచనలివ్వడం కనిపించింది. వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా తీవ్రంగా శ్రమించారు. మళ్లీ నంబర్‌వన్‌గా కోహ్లి దుబాయ్: భారత కెపె్టన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ (923 రేటింగ్ పాయింట్లు)ను వెనక్కి నెట్టి కోహ్లి (928) అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టులో కోహ్లి సెంచరీతో కదం తొక్కగా... ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్ అడిలైడ్‌తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 36 పరుగులే చేసి పాయింట్లు కోల్పోయాడు. టాప్–10లో భారత్‌నుంచి చతేశ్వర్ పుజారా (4వ స్థానం), అజింక్య రహానే (6వ స్థానం)లో ఉన్నారు. పాక్‌పై అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 5వ స్థానానికి చేరుకోవడం విశేషం. మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబూషేన్ ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. ఐదో స్థానంలో బుమ్రా... బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ (900) నంబర్‌వన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్–10 బౌలర్ల జాబితాలో భారత్‌నుంచి జస్ప్రీత్ బుమ్రా (5వ స్థానం), ఆర్. అశి్వన్ (9వ స్థానం), మొహమ్మద్ షమీ (10వ స్థానం) ఉన్నారు. విండీస్ బ్యాటింగ్ కోచ్‌గా మాంటీ సాక్షి, హైదరాబాద్: భారత్‌తో జరిగే టి20, వన్డే సిరీస్‌లకు ముందు వెస్టిండీస్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించింది. మాంటీ దేశాయ్‌ను రెండేళ్ల కాలానికి బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. పుష్కర కాలపు కెరీర్లో మాంటీ అఫ్గానిస్తాన్, నేపాల్ జాతీయ జట్లకు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్ల కోచింగ్ బృందాల్లో పని చేశారు. మాంటీ ఇప్పటికే హైదరాబాద్‌లో జట్టుతో చేరాడు. తొలి టి20 మ్యాచ్... క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూశారు. కానీ ఈ మైదానంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నా... అంతకు ముందునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పటి వరకు 6 వన్డేలు, 5 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది. -
‘అజహర్ స్టాండ్’
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒకదానికి అజహర్ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్ పెవిలియన్ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్.దయానంద్ పేరు పెట్టనున్నారు. గరిష్ట విలువ రూ. 12,500/– టి20 మ్యాచ్ కోసం నేటినుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్ ప్రకటించారు. క్రికెట్ పరిపాలకుడిగా ఇది తనకు తొలి మ్యాచ్ అని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టికెట్లను ఆన్లైన్లో ఠీఠీఠీ. ్ఛఠ్ఛిn్టటnౌఠీ. ఛిౌఝలో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు. -
50 చేసినా... మనమే గెలిచాం
ప్రావిడెన్స్ (గయానా): విండీస్ గడ్డపై భారత్ మహిళల జట్టు విజయగర్జన కొనసాగుతోంది. ఇప్పటికే ఎదురులేని విజయాలతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ నాలుగో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టును కంగుతినిపించింది. చిత్రంగా కేవలం 50 పరుగులే చేసినా... ప్రపంచ చాంపియన్ జట్టుపై టీమిండియా గెలుపొందడం విశేషం. వర్షంతో ఈ 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 9 ఓవర్లలో 7 వికెట్లకు 50 పరుగులు చేసింది. పూజ పది పరుగులే టాప్ స్కోర్! హేలీ మాథ్యూస్ 3, అఫీ, షెనెటా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన విండీస్ 5 పరుగుల దూరంలో నిలిచింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 45 పరుగులే చేయగలిగింది. హేలీ 11, హెన్రీ 11, మెక్లీన్ 10 పరుగులు చేశారు. విండీస్ గెలిచేందుకు చివరి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా... అనూజ వేసిన ఆఖరి ఓవర్లో విండీస్ 7 పరుగులే చేసి 2 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అనూజ పాటిల్ (2/8) రెండు వికెట్లు తీయగా... దీప్తి శర్మ (1/8), రాధా యాదవ్(1/8)లకు ఒక్కో వికెట్ దక్కింది ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 4–0తో ఆధిక్యంలో ఉన్న భారత్... గురువారం ఆఖరి మ్యాచ్‌ను ఇదే వేదికపై ఆడనుంది. -
ఈ సారి ఇంగ్లండ్‌దే ‘సూపర్’
ఆక్లాండ్: సుమారు నాలుగు నెలల క్రితం ఇంగ్లండ్–న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందిగా! సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సమంగా నిలవడంతో బౌండరీల లెక్కతో ఫలితం తేలింది. ఇప్పుడు ఇరు జట్లు తలపడిన మరో మ్యాచ్ దాదాపు అదే తరహాలో నాటకీయంగా సాగింది. ఫార్మాట్ టి20కి మారగా... ఈ సారి మాత్రం ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఇంగ్లండ్ స్పష్టమైన విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్ ‘సూపర్ ఓవర్’లో 9 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ముందుగా న్యూజిలాండ్ 5 వికెట్లకు 146 పరుగులు చేయగా, ఇంగ్లండ్ కూడా 11 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 146 పరుగులే చేసింది. కివీస్ తరఫున మారి్టన్ గప్టిల్ (20 బంతుల్లో 50; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మున్రో (21 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 31 బంతుల్లోనే 84 పరుగులు జోడించగా, సీఫెర్ట్ (16 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్సర్లు) కూడా అదే తరహాలో దూకుడు ప్రదర్శించాడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెయిర్‌స్టో (18 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ సహకరించారు. అనంతరం సూపర్ ఓవర్లో ముందుగా ఇంగ్లండ్ 17 పరుగులు చేయగా, కివీస్ 8 పరుగులకే పరిమితమైంది. పరుగుల వరద... 11 ఓవర్ల ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు కూడా చెలరేగిపోయాయి. ఓవర్‌కు 13.27 రన్‌రేట్‌తో పరుగులు సాధించాయి. కివీస్ తమ 3 ఓవర్ల పవర్‌ప్లేలో 17, 20, 18 చొప్పున మొత్తం 55 పరుగులు చేసింది. తర్వాతి 8 ఓవర్లలో ఆ జట్టు వరుసగా 15, 13, 5, 7, 15, 10, 16, 10 పరుగులు చేసింది. జట్టు ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ జట్టు పవర్‌ప్లేలో 9, 13, 17 చొప్పున మొత్తం 39 పరుగులు సాధించింది. తర్వాతి 7 ఓవర్లలో మోర్గాన్ సేన వరుసగా 9, 20, 22, 10, 11, 10, 10 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. నీషమ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. అయితే తర్వాతి మూడు బంతులను జోర్డాన్ 6, 2, 4 బాది స్కోరు సమం చేశాడు. దాంతో ఫలితం సూపర్ ఓవర్‌కు చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. -
మెరిసిన షఫాలీ, స్మృతి
కెరీర్లో ఐదో టి20 మ్యాచ్ ఆడిన హరియాణా అమ్మాయి షఫాలీ వర్మ ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించింది. 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందింది. షఫాలీ 15 ఏళ్ల 285 రోజుల వయసులో ఈ ఘనత సాధించి... 30 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకట్టింది. 1989లో సచిన్ 16 ఏళ్ల 214 రోజుల ప్రాయంలో పాకిస్తాన్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో 59 పరుగులు సాధించి కెరీర్లో తొలి అర్ధ సెంచరీ చేశాడు. గ్రాస్ ఐలెట్: వన్డే సిరీస్‌లో కనబరిచిన జోరును టి20 ఫార్మాట్లోనూ భారత మహిళల జట్టు కొనసాగించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 84 పరుగుల ఆధిక్యంతో భారీ విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 184 పరుగులు సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్మృతి మంధాన (46 బంతుల్లో 67; 11 ఫోర్లు) వీరవిహారం చేశారు. తొలి వికెట్‌కు 15.3 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. టి20 ఫార్మాట్లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అత్యుత్త మ భాగస్వామ్యం కావడం విశేషం. 2013లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరుష్ కామిని, పూనమ్ రౌత్ నమోదు చేసిన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును షఫాలీ, స్మృతి బద్దలు కొట్టారు. షఫాలీ, స్మృతి ఐదు బంతుల వ్యవధిలో అవుటవ్వడంతో విండీస్ ఊపిరి పీల్చుకుంది. వీరిద్దరు అవుటయ్యాక కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 101 పరుగుల చేసి ఓడిపోయింది. షెమైన్ క్యాంప్‌బెల్ (33; 2 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శిఖా పాండే (2/22), రాధా యాదవ్ (2/10), పూనమ్ యాదవ్ (2/24) రాణించారు. -
సిరీస్ ఎవరి సొంతం?
బంగ్లాదేశ్‌తో టి20 పోరు అంటే భారత జట్టుకు ఏకపక్ష విజయం అని సిరీస్‌కు ముందు అంతా భావించారు. అయితే అనూహ్యంగా తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురు కావడంతో టీమిండియా వ్యూహం మార్చాల్సి వచ్చింది. తర్వాతి సమరంలో కసితీరా ప్రత్యర్థిపై చెలరేగిన రోహిత్ సేన ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరో అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి టి20 స్ఫూర్తితో ఇంకో విజయం సాధిస్తే బంగ్లా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ వేదికగా జరిగే మూడో టి20తో సిరీస్ ఫలితం తేలనుంది. నాగ్‌పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతను తేల్చే పోరుకు రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల పోరులో రెండు జట్లు 1–1తో సమంగా నిలవగా, నేడు జామ్తా మైదానంలో చివరి మ్యాచ్ జరుగుతుంది. గత మ్యాచ్ ఫలితాన్ని బట్టి చూస్తే టీమిండియా ప్రత్యర్థికంటే బలంగా కనిపిస్తుండగా, తప్పులు సరిదిద్దుకొని మరో అద్భుత విజయం సాధించాలనే లక్ష్యం బంగ్లా జట్టులో కనిపిస్తోంది. శార్దుల్‌కు చాన్స్! రాజ్‌కోట్ మ్యాచ్‌లో భారత్ అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంతోపాటు ఆ తర్వాత రోహిత్ మెరుపులతో 26 బంతుల ముందే మ్యాచ్ గెలుచుకుంది. రోహిత్ ఒక్కసారి లయను అందుకుంటే అతడిని ఆపడం ఎవరి వల్లా కాదని మరోసారి రుజువైంది. ధావన్ కూడా కొన్ని పరుగులు చేసినా తొలి టి20లాగే తగినంత ధాటి అతని బ్యాటింగ్‌లో కనిపించడం లేదు. రాహుల్‌ను కాదని ఓపెనర్‌గా అవకాశం ఇస్తుండటం వల్ల ఈసారి ధావన్ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నిలవడం ఖాయం. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గొప్పగా ఆడకపోయినా యువ ఆటగాడు శివమ్ దూబేను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తన విలువేమిటో చహల్ మరోసారి నిరూపించాడు. అతడి బౌలింగ్‌లో బంగ్లాకు మళ్లీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల తర్వాత చూస్తే లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది. 8 ఓవర్లలో అతను ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తే మాత్రం విజయానికి ఢోకా ఉండదు. అదనపు స్పిన్నర్‌తో... బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ విజయంలో ముష్ఫికర్ రహీమ్‌దే కీలక పాత్ర. అతను గత మ్యాచ్‌లో విఫలం కాగా, కెప్టెన్ మహ్ముదుల్లా ఫర్వాలేదనిపించాడు. సీనియర్లయిన వీరిద్దరు మరోసారి రాణించడంపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఓపెనర్ నయీమ్ రెండు మ్యాచ్‌లలోనూ చెప్పకోదగ్గ స్కోర్లు చేసినా 105 స్ట్రయిక్‌రేట్ మాత్రమే ఉండటం అతని బలహీనతను చూపిస్తోంది. సౌమ్య సర్కార్, లిటన్ దాస్‌లు కూడా దూకుడుగా ఆడితేనే ఆ జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మిగతా వారంతా తలా ఒక చేయి వేసేవారే తప్ప ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించలేరు. మడమ గాయంతో బాధపడుతున్న ముస్తఫిజుర్ తన స్థాయికి తగినట్లుగా బౌలింగ్ చేయలేకపోవడం బంగ్లాకు సమస్యగా మారింది. అమీనుల్, అల్ అమీన్లకు పెద్దగా అనుభవం లేదు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన పేసర్ షఫీయుల్ స్థానంలో స్పిన్నర్ తైజుల్‌కు చాన్స్ దక్కవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, దూబే, కృనాల్, సుందర్, చహల్, చహర్, శార్దుల్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), సర్కార్, దాస్, నయీమ్, ముష్ఫికర్, అఫీఫ్, మొసద్దిక్, అమీనుల్, ముస్తఫిజుర్, అల్ అమీన్, తైజుల్. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్. దేశంలోని పెద్ద గ్రౌండ్లలో ఒకటి. భారీ స్కోర్లకు అవకాశం తక్కువ. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే అనుకూలం. స్పిన్నర్లు కూడా మంచి ప్రభావం చూపిస్తారు. వాతావరణం చాలా బాగుంది. ఆటకు ఎలాంటి ఇబ్బందీ లేదు. -
మలాన్ మెరుపులు
నేపియర్: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు రికార్డుల మోత మోగించింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. టి20ల్లో ఇంగ్లండ్‌కిదే అత్యధిక స్కోరు. డేవిడ్ మలాన్ (51 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (41 బంతుల్లో 91; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 74 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ సౌతీ (15 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కొలిన్ మున్రో (21 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మాట్ పార్కిన్సన్కు 4 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో సిరీస్‌లో ఇరు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. చివరి టి20 ఆదివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది. -
ఎక్కడైనా...ఎప్పుడైనా...
భారత్ ముందు బంగ్లా బేబీనే! మూడు ఫార్మాట్లలోనూ టీమిండియానే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వన్డేల్లో అప్పుడొకటి... ఇప్పుడొకటి అన్నట్లు వేళ్లమీద లెక్కపెట్టే విజయాలు సాధించిందేమో కానీ... టెస్టులు, టి20ల్లో అయితే టీమిండియాకు ఎదురేలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతీ విభాగంలోనూ ప్రత్యర్థి కంటే భారతే బలంగా ఉండటంతో పొట్టి ఫార్మాట్లో ఎక్కడైనా... ఎప్పుడైనా... ఇంటాబయటా బంగ్లాపై టీమిండియానే గెలుస్తూ వచ్చింది. సాక్షి క్రీడావిభాగం: క్రికెట్ ప్రపంచంలో ఏ రకంగా చూసినా బంగ్లాదేశ్ కంటే భారతే మెరుగైన జట్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, అనుభవజ్ఞులైన పేస్ దళం, నాణ్యమైన స్పిన్నర్లు ఇలా తుది 11 మందిదాకా భారత్ ప్రత్యర్థి కంటే ఎంతో దుర్బేధ్యమైంది. ప్రస్తుత జట్టులో విశ్రాంతి వల్ల రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడే అందుబాటులో లేడు. కానీ అతడి వెన్నంటే నిలిచిన యావత్ జట్టంతా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సమరానికి సై అంటోంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ విజయవంతమైన కెప్టెన్‌గా ‘హిట్‌మ్యాన్’ ఘనతకెక్కాడు. పైగా ఇప్పుడు జరగబోయేది టి20 పోరే కాబట్టి అతని సారథ్య బాధ్యతలకు, ఓపెనింగ్‌కు ఇది తెలిసొచ్చిన పనే తప్ప అదనపు భారం కానేకాదు. సమస్యల్లో బంగ్లా... మేటి జట్టు భారత్‌తో సిరీస్‌కు సమాయత్తం అవుతుండగానే బంగ్లా క్రికెట్లో ముసలం రేగింది. పర్యటనకు కొన్ని రోజుల వ్యవధే ఉండగా ఆటగాళ్లంతా ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. తమ కాంట్రాక్టు ఫీజులు పెంచకపోతే ఏ రకమైన క్రికెట్ అడేది లేదని బోర్డు (బీసీబీ)తో తెగేసి చెప్పారు. చివరకు ఒప్పించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగా... మేటి ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేటు వేసింది. బుకీలు అతన్ని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెప్పలేదని రెండేళ్ల నిషేధం విధించింది. ఎంతో అనుభవజ్ఞుడైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కీలకమైన సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. షకీబ్ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అసాధారణంగా రాణించాడు. అలాంటి ఆటగాడు లేని జట్టు భారత్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సమరోత్సాహంతో రోహిత్ సేన... సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో టి20 మెరుపులు మెరిపించేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. అనుభవజ్ఞులైన రోహిత్–శిఖర్ ఓపెనింగ్ జోడీకి సత్తాగల కుర్రాళ్లు శ్రేయస్, మనీశ్, రిషభ్, సంజూ సామ్సన్, కృనాల్ పాండ్యాలు జతయ్యారు. వీళ్లంతా తమ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. సీనియర్ సీమర్లు లేకపోయినా శార్దుల్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్‌లు అందివచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. తిప్పేసేందుకు మణికట్టు స్పిన్నర్ చహల్ ఉన్నాడు. దీంతో భారత్ పేస్, స్పిన్ అటాక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలదు. ఆడినవన్నీ భారతే గెలిచింది... ఇరు జట్ల మధ్య ఈ పదేళ్లలో 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్ మొదలు ఆసియా కప్, గతేడాది నిదహాస్ ట్రోఫీ దాకా బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా ఏ దేశమైనా ... ఎప్పుడైనా భారత్‌దే విజయం. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలిచింది. దీంతో ఈ ఫార్మాట్లో భారత్ ప్రత్యర్థిపై ఎదురులేని రికార్డును కలిగి ఉంది. -
ఆడుతూ... పాడుతూ...
బ్రిస్బేన్: తొలి టి20 మ్యాచ్‌లో పరుగుల పరంగా తమ ఖాతాలో అతి పెద్ద విజయం నమోదు చేసుకున్న ఆ్రస్టేలియా... శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ పెరీరా (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), గుణతిలక (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) కాస్త నయమనిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టాన్లేక్ (2/23), కమిన్స్ (2/29), అగర్ (2/27), ఆడమ్ జంపా (2/20) రెండేసి వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. 118 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోయి అధిగమించింది. కెపె్టన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే మలింగ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే వార్నర్ (41 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), స్మిత్ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడారు. రెండో వికెట్‌కు అజేయంగా 117 పరుగులు జోడించారు. వానిందు హసరంగ వేసిన ఐదో ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదాడు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టి20 మ్యాచ్ శుక్రవారం మెల్బోర్న్లో జరుగుతుంది. -
వార్నర్ మెరుపు సెంచరీ
అడిలైడ్: సొంతగడ్డపై కొత్త సీజన్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) అంతర్జాతీయ టి20ల్లో తొలి శతకం సాధించడంతో... తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా టి20ల్లో కంగారూలకు ఇదే అతి పెద్ద విజయం. వార్నర్‌కు తోడు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (36 బంతుల్లో 64; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆసీస్ 2 వికెట్లకు 233 పరుగులు సాధించింది. ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో టాప్–3 ఆటగాళ్లు ముగ్గురూ కనీసం అర్ధ సెంచరీ సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అనంతరం లంక కనీసం వార్నర్ స్కోరును కూడా చేరలేక చతికిలపడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. షనక (17)దే టాప్ స్కోరు. జంపా 3 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు. రెండో టి20 బుధవారం బ్రిస్బేన్‌లో జరుగుతుంది. తన సోదరుడి వివాహం కారణంగా ఈ మ్యాచ్‌లో స్టార్క్పాల్గొనడంలేదు. 75 శ్రీలంక పేసర్ కసున్ రజిత 4 ఓవర్లలో ఇచ్చిన పరుగులు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రజిత కొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో టర్కీ బౌలర్ తునాహన్ తురాన్ (చెక్ రిపబ్లిక్‌పై) ఇచ్చిన 70 పరుగుల రికార్డు బద్దలైంది. -
మూడో టి20 రద్దు
సూరత్: భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఇక్కడి మైదానం తడిసి ముద్దయింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. 7.30 గంటలకు పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేల్చారు. సిరీస్‌లో వరుసగా రద్దయిన రెండో మ్యాచ్ ఇది. గురువారం రెండో టి20 మ్యాచ్ కూడా వర్షం వల్ల జరగలేదు. ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో తొలి టి20 గెలిచిన భారత మహిళల జట్టు 1–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ కూడా ఇక్కడే మంగళవారం జరుగుతుంది. -
బోణీ కొట్టేనా!
తొలి టి20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఇప్పుడు మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కోల్పోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై టీమిండియా తమ అనుకూలతను వాడుకొని విజయం సాధించండంపై దృష్టి పెట్టగా, పర్యాటక జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది. కోహ్లి నాయకత్వంలో భారత ఆటగాళ్లంతా అమితోత్సాహంతో కనిపిస్తుండగా, కొత్త కెపె్టన్ డి కాక్ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. వాతావరణం బాగుండటం అభిమానులు ఆనందించాల్సిన విషయం. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై బోణీ చేస్తుంది. మొహాలి: భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే టి20 మ్యాచ్‌లలో మొహాలీ స్టేడియంలో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్ పోరు ఒకటి. ఆ్రస్టేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి అత్యద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఇటీవల అతను దీని గురించే ఫొటోతో సహా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టేడియం వేదికపై భారత్ మళ్లీ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా నేటి టి20 మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఒకరిద్దరు మినహా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లతోనే ఆడనున్న దక్షిణాఫ్రికా ఎలాంటి పోటీనివ్వగలదో చూడాలి. స్పిన్నర్లపై దృష్టి... దాదాపు నెలన్నర క్రితం కోహ్లి సేన తమ చివరి టి20 మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడింది. మ్యాచ్ గెలవడంతో పాటు 3–0తో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. నాటి మ్యాచ్‌తో పోలిస్తే సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్ స్థానంలో హార్దిక్ పాండ్యా, విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తుది జట్టులో ఖాయంగా ఉంటారు. రోహిత్ కోసం రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. కోహ్లి తనదైన శైలిలో చెలరేగేందు సిద్ధంగా ఉండగా, మనీశ్ పాండే మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. టెస్టుల్లో ఇప్పటికే చోటు కోల్పోయిన ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తన స్థాయి ప్రదర్శించేందుకు ఇది సరైన అవకాశం. ఇద్దరు పేసర్లుగా నవదీప్ సైనీ, దీపక్ చహర్ ఆడటం ఖాయం. అయితే అన్నింటికి మించి ఇద్దరు స్పిన్నర్లపై ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు సాధ్యమైనన్ని ప్రత్యామ్నాయాలు పరీక్షించేందుకు సిద్ధమవుతున్న టీమిండియా ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్‌లను తీర్చి దిద్దే పనిలో పడింది. రెండేళ్లుగా భారత విజయాల్లో కీలకంగా మారిన చహల్, కుల్దీప్లను పక్కన పెట్టి మరీ వీరిద్దరిని ఎంపిక చేశారు. కాబట్టి వారితో పోలికలు రావడం కూడా ఖాయం. ఆల్‌రౌండర్ జడేజా జట్టుకు అదనపు బలం. గెలిపించేదెవరు? స్టార్ ఆటగాళ్లతో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకే భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శక్తికి మించి పని. అలాంటిది ఏమాత్రం అనుభవం లేని ఆటగాళ్లతో ఆ జట్టు పొట్టి ఫార్మాట్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఐపీఎల్ అనుభవం ఉన్న రబడ, మిల్లర్లతో పాటు కెపె్టన్ డి కాక్ ఆటపై సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా రబడ తన స్పెల్‌తో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీయగలిగితే పైచేయి సాధించగలమని ఆ జట్టు భావిస్తోంది. వాన్ డర్ డసెన్ ఇటీవల కీలక ఆటగాడిగా ఎదిగినా... భారత్‌లో ఎప్పుడూ ఆడలేదు. బవుమా, జూనియర్ డాలా, నోర్టే తదితరుల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో జరిగిన వన్డేలో ఆసీస్ బ్యాట్స్‌మన్ టర్నర్ తరహాలో ఎవరైనా అనూహ్య ఇన్నింగ్స్ ఆడితే తప్ప సఫారీలకు విజయం సులువు కాబోదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెపె్టన్), రోహిత్, ధావన్, పంత్, పాండే, హార్దిక్, జడేజా, కృనాల్, సుందర్/రాహుల్ చహర్, దీపక్ చహర్, సైనీ. దక్షిణాఫ్రికా: డి కాక్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, బవుమా, వాన్ డర్ డసెన్, మిల్లర్, జోర్న్ ఫార్చూన్, ఫెలుక్వాయో, రబడ, షమ్సీ, ప్రిటోరియస్, డాలా/నోర్టే. పిచ్, వాతావరణం టి20లకు సరిపోయే విధంగా మంచి బ్యాటింగ్ వికెట్. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. -
బంగ్లాదేశ్ అద్భుత విజయం
ఢాకా: జింబాబ్వేతో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయలక్ష్యం 18 ఓవర్లలో 145 పరుగులు... 60 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అయితే అఫీఫ్ హుస్సేన్ (26 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్‌కు తోడు మొసద్దిక్ హుస్సేన్ (24 బంతుల్లో 30 నాటౌట్; 2 సిక్సర్లు) అండగా నిలవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17.4 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి మ్యాచ్ గెలుచుకున్న బంగ్లా ముక్కోణపు టి20 టోరీ్నలో శుభారంభం చేసింది. అంతకు ముందు జింబాబ్వే నిరీ్ణత 18 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ (32 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్ మసకద్జా (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బంగ్లా కెపె్టన్ షకీబ్ అల్ హసన్ వేసిన ఓవర్లో బర్ల్ వరుసగా 6, 4, 4, 6, 4, 6 బాది మొత్తం 30 పరుగులు సాధించడం విశేషం! -
ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్
గయానా: అంతర్జాతీయ టి20ల్లో చాలా కాలంగా ఎంఎస్ ధోని పేరిట ఉన్న రికార్డును యువ ఆటగాడు రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టి20లో టీమిండియా కీపర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇప్పటివరకు ఇదే. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 42 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే టి20ల్లో పంత్ గత అత్యధిక వ్యక్తిగత స్కోరు 58. గతేడాది చెన్నెలో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు. కీపర్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా పంత్ బరిలోకి దిగడంతో ధోని రికార్డు ఇప్పటివరకు ఉంది. భారత్ వికెట్ కీపర్లు టి20ల్లో సాధించిన టాప్-5 స్కోర్లలో నాలుగు ధోని పేరిట ఉండటం విశేషం. (చదవండి: విజయం పరిపూర్ణం) -
రోహిత్ శర్మ కొట్టేస్తాడా?
ఫ్లోరిడా: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు సిక్సర్లు బాదితే వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు రోహిత్ సొంతమవుతుంది. 105 సిక్సర్లతో గేల్ టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్న రోహిత్ ఖాతాలో 102 సిక్సర్లు ఉన్నాయి. శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే తొలి టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 94 మ్యాచ్‌ల్లో 86 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 2,331 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ 58 మ్యాచ్‌ల్లోనే 105 సిక్సర్లు కొట్టడం విశేషం. -
మళ్లీ ఓడిన మహిళల జట్టు
గువాహటి: తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవ్వడంతో... ఇంగ్లండ్ మహిళల జట్టుతో స్థానిక బర్సపర స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ ఫార్మాట్లో భారత మహిళల జట్టుకిది వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం. గత నెలలో న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన మూడు టి20ల్లోనూ ఓడిన భారత జట్టు... గత సంవత్సరం వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధానకు తొలిసారి జాతీయ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టాస్ గెలిచిన స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు వ్యాట్ (34 బంతుల్లో 35; 5 ఫోర్లు), టామీ బీమోంట్ (57 బంతుల్లో 62; 9 ఫోర్లు) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గట్టి పునాది వేశారు. వ్యాట్‌ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని శిఖా పాండే విడగొట్టింది. ఆ తర్వాత సివెర్ తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... కెప్టెన్ హీథెర్ నైట్ (20 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి బీమోంట్ ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో బీమోంట్ ఔటైనా అప్పటికే ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ రెండు వికెట్లు తీయగా... శిఖా పాండే, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ లభించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి వికెట్‌కు హర్లీన్ డియోల్, స్మృతి మంధాన 21 పరుగులు జోడించి నిలదొక్కుకున్నట్లు అనిపించిన దశలో ఇంగ్లండ్ బౌలర్లు బ్రంట్, లిన్సీ స్మిత్ విజృంభించారు. ఏడు బంతుల తేడాలో హర్లీన్, స్మృతి, జెమీమాలను పెవిలియన్‌కు పంపించి భారత్‌ను దెబ్బ తీశారు. మిథాలీ రాజ్ మళ్లీ నిరాశపర్చగా... పునరాగమనం చేసిన వేద కృష్ణమూర్తి కూడా వెంటనే ఔటైంది. దాంతో భారత్ 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. దీప్తి శర్మ (22 నాటౌట్), శిఖా పాండే (21 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) ఏడో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా ఫలితం లేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 గురువారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో స్మృతి మంధాన (22 ఏళ్ల 229 రోజులు) టి20 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు సురేశ్ రైనా (23 ఏళ్ల 197 రోజులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (23 ఏళ్ల 237 రోజులు) పేరిట ఉండేది. -
కోహ్లి చితక్కొట్టుడు..
బెంగళూరు: కెప్టెన్ విరాట్ కోహ్లి చితక్కొట్టుడికి ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాకు 191 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 4 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద రాహుల్ అవుటయ్యాడు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ధావన్(14), రిషబ్ పంత్(1) వెంట వెంటనే అవుట్‌కావడంతో భారత్ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. అయితే కోహ్లి, ధోని చెలరేగడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది. కోహ్లి 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో 20వ అర్ధ శతకం సాధించాడు. విశాఖ మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడి విమర్శలు ఎదుర్కొన్న ధోని ఈరోజు హిట్టింగ్ ఆడాడు. చివరి ఓవర్లో అతడు అవుటయ్యాడు. ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. -
రోహిత్ శర్మ అవుట్, ధావన్ ఇన్
బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. టీమిండియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, మార్కండే, ఉమేశ్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధావన్, విజయ శంకర్, సిద్ధార్థ కౌల్ తుది జట్టులో స్థానం సంపాదించారు. విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో చేజార్చుకున్న కోహ్లి సేన ఈరోజు మ్యాచ్‌లో గెలిసి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆసీస్ భావిస్తోంది. (విజయమే సమంజసం) -
పాపం.. ధావన్!
ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్నంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలవడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, పేసర్ ఉమేశ్ యాదవ్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కూడా వదల్లేదు. విశాఖ మ్యాచ్‌లో అతడు ఆడనందుకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మ్యాచ్ ముందు రోజు ట్విటర్లో ‘గబ్బర్’ పోస్ట్ చేసిన ఫొటోపై జోకులు పేల్చారు. ‘రేపటి మ్యాచ్‌కు సన్నద్ధం’ అంటూ ధావన్ పెట్టిన కామెంట్‌నూ వదల్లేదు. తర్వాత రోజు చూస్తే తొలి20లో అతడికి స్థానం దక్కలేదు. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతేకాదు మ్యాచ్ మధ్యలో సహచరులకు బ్యాట్లు అందజేస్తూ ఫొటోలకు చిక్కాడు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. (ధావన్‌కు విశ్రాంతి.. మార్కండే అరంగేట్రం) ముందురోజు ఇలా, తర్వాతి రోజు ఇలా అంటూ ధావన్ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. విశాఖ మ్యాచ్‌లో తనను తీసుకోనందుకు ధావన్ సంతోషపడివుంటాడని ఒకరు కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చివరి బంతికి కోహ్లి సేన పరాజయం పాలైంది. భారత్ ఓడిపోతుందని ముందే తెలిసి జట్టులోకి రాలేదా అంటూ మరొకరు వేళాకోళం ఆడారు. ఈరోజు జరిగిన దాంట్లో ధావన్ తప్పేంలేదని ఓ అభిమాని వెనకేసుకొచ్చారు. పాపం ధావన్ అంటూ మరికొందరు జాలి చూపించారు. (గెలుపు గోవిందా) -
విజయంతో ముగించిన పాక్
సెంచూరియన్: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డే, టి20 సిరీస్‌లను కోల్పోయిన పాకిస్తాన్‌కు చివరి మ్యాచ్‌లో ఊరట విజయం లభించింది. బుధవారం జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో పాక్ 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన సఫారీలు 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినా... రిజ్వాన్ (26), ఆసిఫ్ అలీ (25), షాదాబ్ ఖాన్ (22 నాటౌట్) తలా ఓ చేయి వేశారు. బ్యూరాన్ హెం డ్రిక్స్ (4/14) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. క్రిస్ మోరిస్ (29 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, వాన్ డర్ డసెన్ (35 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌లో చివరి ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదడంతో పాటు 2 కీలక వికెట్లు తీసిన షాదాబ్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా, డేవిడ్ మిల్లర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. -
బంగ్లాదేశ్ భారీ స్కోరు..
మిర్పూర్: వెస్టిండీస్‌కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. విండీస్‌తో జరిగిన రెండో టీ20లో బంగ్లా భారీ విజయం సాధించింది. కరేబియన్లను 36 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించిన షకీబ్ బ్యాట్‌తోనూ రాణించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్(60) అర్ధ సెంచరీకి.. షకీబ్ (42; 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్), మహ్మదుల్లా(43; 21 బంతుల్లో 7 ఫోర్లు) మెరుపులు తోడవడంతో బంగ్లా భారీ స్కోరు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. షకీబ్ దెబ్బకు 19.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోవ్‌మన్ పావెల్ (50) అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. షకీబ్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. షకీబ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. -
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియా రెండో టీ20 రద్దు
-
బ్రిస్బేన్: తొలి టీ20లో భారత్ ఓటమి
-
ఆసీస్ కంటే ఎక్కువ స్కోరు చేసినా.. ఓడిన భారత్!
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ అర్ధ సెంచరీతో రాణించినా భారత్ పరాజయం చవిచూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(4), ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచారు. దినేశ్ కార్తీక్ (30), రిషభ్ పంత్ (20) పరుగులు చేశారు. టెన్షన్ రేపిన చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిరాగా భారత్ 8 పరుగులు చేసి 2 వికెట్లు చేజార్చుకుంది. కీలక సమయంలో రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ అవుట్ కావడంతో టీమిండియా ఓడిపోయింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, స్టోయినిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్లేక్ తలో వికెట్ తీశారు. లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లి వికెట్లు పడగొట్టిన ఆడమ్ జంపా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. డీఎల్ఎస్ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ చెలరేగడంతో ఆసీస్ చాలెజింగ్ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్ సిక్సర్లతో చెలరేగాడు. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 46 పరుగులు బాదాడు. స్టోయినిస్ 19 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఫించ్(27), క్రిస్ లిన్ (37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ఖలీల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ కంటే ఎక్కువ స్కోరు చేసినా.. సాంకేతిక అంశాలను పక్కడపెడితే 17 ఓవర్లలో ఆస్ట్రేలియా కంటే భారత్ ఎక్కువ స్కోరు చేసింది. 17 ఆసీస్ 158 పరుగులు చేస్తే, టీమిండియా 169 పరుగులు సాధించింది. అయితే డీఎల్ఎస్ విధానంలో లెక్కగట్టి భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడంతో గణాంకాలు మారాయి. ఫలితం మాట ఎలావున్నా రెండు జట్లు హోరాహోరీ తలపడటంతో క్రికెట్ ప్రేమికులు ఆటను ఆస్వాదించారు. టీమిండియా అభిమానులకు మాత్రం నిరాశ కలిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆసీస్ స్కోరు 158.. భారత్ టార్గెట్ 174
బ్రిస్బేన్: తొలి టీ20లో భారత్‌కు ఆస్ట్రేలియా 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. డీఎల్ఎస్ ప్రకారం టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు చేసిన ఆసీస్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ చెలరేగడంతో ఆసీస్ చాలెంజింగ్ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్ సిక్సర్లతో చెలరేగాడు. 24 బంతుల్లో 4 సిక్సర్లతో 46 పరుగులు బాదాడు. స్టోయినిస్ 19 బంతుల్లో 3 ఫోర్లు సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఫించ్(27), క్రిస్ లిన్ (37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ఖలీల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా 16.1 ఓవర్లలో వర్షం రావడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు అంపైర్లు కుదించారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 153/3. ఆట తిరిగి మొదలైన తర్వాత తొలి బంతికే మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు. చివరి ఐదు బంతులకు ఆసీస్ కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించింది. -
తొలి టీ20లో భారత్ విజయం
-
చివరి ఓవర్లో అద్భుతం
అబుదాబి: ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసి జోరు మీదున్న పాకిస్తాన్ మరోసారి అద్భుతం చేసింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. హఫీజ్, హసన్ పోరాట పటిమతో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒత్తిడికిలోనై గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది కివీస్. 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. (ఆసీస్‌ను వైట్‌వాష్ చేశారు..) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. ఆసిఫ్ అలీ(24), మహ్మద్ హఫీజ్(45), సర్ఫరాజ్ అహ్మద్(34) సమయోచిత బ్యాటింగ్‌తో పాక్ కోలుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. 79/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్.. పాక్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మున్రో (58), టేలర్ (42) రాణించినా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో కివీస్ ఓటమి పాలైంది. పాక్ బౌలర్ హసన్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ టెన్షన్! కివీస్ విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు చేయాలి. ఈ దశలో 18 ఏళ్ల షహీన్ ఆఫ్రిదికి హఫీజ్ బంతి ఇచ్చాడు. మొదటి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చాడు. రెండో బంతిని సౌతీ బౌండరికీ పంపాడు. తర్వాతి బంతికి సింగిల్.. నాలుగు, ఐదో బాల్స్‌కు రెండేసి పరుగులు వచ్చాయి. చివరి బంతికి సిక్సర్ కొడితే మ్యాచ్ టై అవుతుంది. అందరిలోనూ ఒక్కటే టెన్షన్. ఏదైనా అద్బుతం జరిగితే తప్పా కివీస్ గెలిచే ఛాన్స్ లేదు. కానీ బ్యాటింగ్ చేస్తున్నది సీనియర్ బ్యాట్స్‌మన్ టేలర్ కావడంతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా వీక్షించారు. అయితే చివరి బాల్‌కు ఫోర్ రావడంతో పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. రెండు పరుగుల తేడాతో సత్తా చాటింది. తనపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని షహీన్ వమ్ముచేయకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హఫీజ్ ‘మ్యాన్ ది మ్యాచ్’ అందుకున్నాడు. -
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!
కొలంబో: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిన ఒక ఘటన జరిగింది. ఇదే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్ పీహెచ్డీ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్ స్పిన్ వేసిన అతను, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఆఫ్ స్పిన్ బంతులు విసిరాడు. అతను లెఫ్టార్మ్‌తో వేసిన తొలి బంతికి జేసన్ రాయ్ సింగిల్ తీశాడు. వెంటనే మెండిస్ తన బౌలింగ్‌ను మారుస్తున్నట్లు అంపైర్‌కు చెప్పాడు. ఈసారి అతని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నాడు. మూడు ఓవర్లలో కామిందు వరుసగా 3, 15, 9 పరుగులు ఇచ్చాడు. అతని మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండటంతో మెండిస్‌కు బౌలింగ్ మార్చాల్సిన అవసరం లేకపోయింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయి క్రికెట్లో ఒక బౌలర్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్లో అక్షయ్ కర్నేవర్ (భారత్), జెమా బార్స్బై (ఆస్ట్రేలియా)లాంటి కొందరు ఉన్నా జాతీయ జట్టు తరఫున ఇలాంటి బౌలింగ్ శైలి (ఆంబిడెక్స్ట్రస్) ఎవరికీ లేదు. గతంలో హనీఫ్ మొహమ్మద్, గ్రాహం గూచ్, హసన్ తిలకరత్నే ఇలాంటి ఫీట్‌ను ప్రదర్శించినా అదంతా సరదాకు మాత్రమే! సీరియస్‌గా బౌలింగ్ చేసే ఒక రెగ్యులర్ బౌలర్‌కు ఇలా రెండు చేతులతో బంతులు వేయగల సత్తా ఉండటం మాత్రం కచ్చితంగా విశేషమే. బ్యాట్స్‌మెన్‌కు అనుగుణంగా ఒకే ఓవర్లో బౌలింగ్ మార్చుకోగలడం జట్టుకు అదనపు బలం కూడా కాగలదు. శ్రీలంక అండర్–19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్ బ్యాటింగ్‌లో మాత్రమే ఎడంచేతి వాటమే. Kamindu Mendis, Sri Lanka's captain during January's U19 @CricketWorldCup, has been called up to his country's T20I squad for the first time. Here's a clip of him in action - and no, that's not a mirror, he really does bowl both right-arm and left-arm spin! pic.twitter.com/rhjJP4wku1 — ICC (@ICC) 23 October 2018 -
ఏకైక టి20లో శ్రీలంక విజయం
కొలంబో: దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంక పర్యటనను పరాజయంతో ముగించింది. ఏకైక టి20 మ్యాచ్‌లో లంక 3 వికెట్ల తేడాతో సఫారీని ఓడించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ డికాక్ (11 బంతుల్లో 20; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా... హెండ్రిక్స్ 19, క్లాసెన్ 18 పరుగులు చేశారు. ఆతిథ్య బౌలర్లు సమష్టిగా దక్షిణాఫ్రికా భరతం పట్టారు. దీంతో ఏ ఒక్కరు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. రెండో ఓవర్లోనే ఆమ్లా డకౌట్‌తో ప్రారంభమైన దక్షిణాఫ్రికా పతనం 16.4 ఓవర్లలో షమ్సీ డకౌట్‌తో ముగిసింది. లంక బౌలర్లలో సందకన్ 3 వికెట్లు పడగొట్టగా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ చెరో 2 వికెట్లు తీశారు. లక్ష్యం సునాయాసంగానే కనిపించినా... పిచ్ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక చెమటోడ్చింది. తొలి ఓవర్లోనే కుశాల్ పెరీరా (3), మెండిస్ (1) నిష్క్రమించడంతో ఆతిథ్య జట్టు కష్టాలు మొదలయ్యాయి. అయితే చండిమాల్ (33 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1సిక్స్), ధనంజయ డిసిల్వా (26 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, షమ్సీ, డాలా తలా రెండు వికెట్లు తీశారు. ధనంజయ డిసిల్వాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీ20ల్లో టీమిండియా అరుదైన రికార్డులు
డబ్లిన్: అప్రతిహత విజయాలతో దూసుకువెళ్తున్న టీమిండియా పసికూన ఐర్లాండ్‌ను వదల్లేదు. చిన్న జట్టని తక్కువ అంచనా వేయకుండా పెద్ద విజయం సాధించింది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ షోతో ఆదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐరిష్ జట్టుపై రికార్డుల మోత మోగించారు. *టీ20లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం(143 పరుగుల భారీ తేడాతో). గతంలో శ్రీలంకపై 93 పరుగుల విజయమే అత్యుతమం.. కాగా ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసింది. *ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20లో పరుగుల పరంగా టీమిండియా సాధించినది రెండో అతిపెద్ద విజయం. ఈ జాబితాలో తొలి స్థానంలో శ్రీలంక ఉంది. 2007లో కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. *ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా రెచ్చిపోయారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఐరీష్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 70 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రత్యర్థి జట్టును ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడం టీమిండియాకిదే తొలిసారి. గతంలో ఇంగ్లండ్‌ను 80 పరుగులకు ఆలౌట్ చేసిన రికార్డే ఇప్పటివరకు అత్యుత్తమం. -
అదిరే ఆరంభం
డబ్లిన్: భారత క్రికెట్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ‘ఇంగ్లిష్’ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, శిఖర్ ధావన్ (45 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 96 బంతుల్లో 160 పరుగులు జోడించడం విశేషం. ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ ఛేజ్ 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. జేమ్స్ షెనాన్ (35 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడం మినహా మిగతావారంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (4/21) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టి20 ఈనెల 29న (శుక్రవారం) జరుగుతుంది. భారత ఇన్నింగ్స్ మొత్తంలో తొలి ఓవర్, ఆఖరి ఓవర్ మాత్రమే ఐర్లాండ్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మిగిలిన 18 ఓవర్లలో టీమిండియా విధ్వంసం కొనసాగించింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ తమదైన శైలిలో చెలరేగి 16 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. చిన్న మైదానాన్ని సమర్థంగా వాడుకున్న వీరిద్దరు భారీ షాట్లతో చకచకా పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ధావన్ 2 ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో మొదలైన దూకుడు చివరి వరకు సాగింది. ఇదే జోరులో ధావన్ 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరోవైపు రోహిత్ కూడా 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం ధాటిని పెంచాడు. వీరిద్దరే మొత్తం ఇన్నింగ్స్ ఆడగలరనిపిస్తున్న దశలో ఎట్టకేలకు ధావన్‌ను అవుట్ చేసి థాంప్సన్ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. తర్వాత వచ్చిన రైనా (10) ఎక్కువ సేపు నిలవలేదు. ఐర్లాండ్ పేసర్ ఛేజ్ 20వ ఓవర్‌ను 3 వికెట్లతో సంచలనాత్మకంగా ముగించాడు. మూడు బంతుల వ్యవధిలో అతను రోహిత్, ధోని (11), కోహ్లి (0)లను ఔట్ చేయడం విశేషం. భారీ ఛేదనలో భారత స్పిన్నర్ల ముందు ఐర్లాండ్ చతికిలపడింది. షెనాన్ కొన్ని మెరుపు షాట్లు ఆడటం మినహా జట్టు ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఛేజ్ 97; ధావన్ (సి) థాంప్సన్ (బి) ఓబ్రైన్ 74; రైనా (సి) ఓబ్రైన్ (బి) ఛేజ్ 10; ధోని (సి) థాంప్సన్ (బి) ఛేజ్ 11; పాండ్యా (నాటౌట్) 6; కోహ్లి (సి) థాంప్సన్ (బి) ఛేజ్ 0; పాండే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–160; 2–186; 3–202; 4–202; 5–202. బౌలింగ్: రాన్‌కిన్ 4–0–34–0; ఛేజ్ 4–0–35–4; థాంప్సన్ 2–0–31–0; కెవిన్ ఓబ్రైన్ 3–0–36–1; డాక్రెల్ 4–0–40–0; సిమి సింగ్ 1–0–12–0; స్టిర్లింగ్ 2–0–16–0. ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) కుల్దీప్ (బి) బుమ్రా 1; షెనాన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 60; బల్బిర్నీ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 11; సిమి సింగ్ (సి) కోహ్లి (బి) కుల్దీప్ 7; విల్సన్ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 5; కెవిన్ ఓబ్రైన్ (సి) ధావన్ (బి) చహల్ 10; థాంప్సన్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 12; పాయింటర్ (బి) కుల్దీప్ 7; డాక్రెల్ (బి) బుమ్రా 9; రాన్‌కిన్ (నాటౌట్) 5; ఛేజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–4; 2–45; 3–72; 4–85; 5–96; 6–96; 7–114; 8–123; 9–126. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4–0–16–0; బుమ్రా 4–1–19–2; హార్దిక్ పాండ్యా 4–0–36–0; చహల్ 4–0–38–3; కుల్దీప్ యాదవ్ 4–1–21–4. -
దంచికొట్టిన భారత ఓపెనర్లు.. ఐర్లాండ్‌కు భారీ లక్ష్యం.!
డబ్లిన్ : ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దంచికొట్టారు. దీంతో పసికూన ఐర్లాండ్‌కు కొండంత లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఐర్లాండ్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (97 ), శిఖర్ ధావన్ (74)లు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మంచి శుభారంభాన్ని అందించారు. దీంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. తొలి వికెట్‌కు ఈ ధ్వయం ఏకంగా 160 పరుగులు జోడించిననంతరం ధావన్ 74( 45 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(10), దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ధోని సాయంతో రోహిత్ దాటిగా ఆడటంతో భారత్ 200 పరుగులు దాటింది. ఇదే తరహాలో ఆడే ప్రయత్నం చేసిన మహేంద్ర సింగ్ ధోని(10), సెంచరీకి చేరువగా వచ్చిన రోహిత్ శర్మ97(61 బంతులు, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు ఒకే ఓవర్లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్‌గా నిష్క్రమించాడు. చివరి బంతిని ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా సిక్స్ బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ చేస్ ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. కెవిన్ ఓ వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్ భారత్‌కు 100వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం.INd -
అరుదైన రికార్డు వేటలో కోహ్లి..
టీమిండియా సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో నేడు జరిగే తొలి టీ20లో ఆ రికార్డును అందుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ టీ20లో 53 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 1,983 పరుగులు చేశాడు. మరో 17 పరుగులు చేస్తే.. టీ20లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు అందుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్టిల్, బ్రెండన్ మెకలమ్లు ఈ ఘనతను సాధించారు. అంతేకాక ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకుంటే.. అత్యంత వేగంగా 2వేల పరుగులు చేసిన రికార్డును కోహ్లి నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం టీ20 పరుగుల జాబితాలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ 73 మ్యాచ్‌లో 2,271 పరుగులు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత బ్రెండన్ మెకలమ్ (70 మ్యాచ్‌లో) 2,140 పరుగులతో, పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (91 మ్యాచ్‌లు)1,989 పరుగులతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లి వాళ్ల కంటే ముందుగానే ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. -
నా జీవితంలో ఓ అద్భుతమైన రాత్రి..
సాక్షి, స్పోర్ట్స్ : నరాలు తెగెంత ఉత్కంఠకర మ్యాచ్‌లో చివరి బంతిని సిక్సుకు తరలించి భారత్‌కు విజయాన్నందించిన టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన జీవితంలో ఈ రాత్రిని ఓ అద్భుతమైన రాత్రిగా అభివర్ణించాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కార్తీక్‌పై అటు క్రికెట్ దిగ్గజాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి ఇటు సామాన్య అభిమాని వరకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో కార్తీక్ సైతం ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘బహుషా నా జీవితంలో ఇది ఓ గొప్ప రాత్రి. ఇలాంటి అవకాశం మరోసారి రాకపోవచ్చు’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Probably one of the best nights of my life. Nothing comes close to crossing the finish line for… https://t.co/lmy5k4DrMi — DK (@DineshKarthik) 19 March 2018 ఇక ధోని వల్లె తనకు ఈ శక్తి వచ్చిందని, ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా టెన్షన్ లేకుండా, కూల్‌గా ఉండగలగడం ఒక్క ధోనీకే సాధ్యమని, మ్యాచ్‌ను విజయవంతంగా ఫినిష్ చెయ్యడం ధోనీ నుంచే నేర్చుకున్నానని మ్యాచ్ అనంతరం కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ ముందు సీనియర్ వికెట్ కీపర్ ధోనికి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు అవకాశమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ కెప్టెన్ రోహిత్ కార్తీక్‌పై ఉన్న నమ్మకంతో తొలి రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరి ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. తర్వాత పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడటంతో రాహుల్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్తీక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. -
మన హైదరాబాదీ వచ్చేశాడు!
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్ స్థానంలోకి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు అవకాశం లభించింది. ఇక బంగ్లాదేశ్ జట్టులో టస్కిన్ స్థానంలో అబూ హైదర్‌ను తీసుకున్నారు. ఈ సిరీస్‌లో రోహిత్ సేనకు ఇది చివరి మ్యాచ్ కాగా ముష్ఫికర్ బృందం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లంకపై సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే రన్‌రేట్ వంటి సాంకేతికాంశాల అవసరం లేకుండా నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా ప్రస్తుతానికి రన్‌రేట్ మెరుగ్గా (+0.21) ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాదు. అయితే... శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం కోసం కొంత ఎదురుచూడాల్సి రావచ్చు. తుదిజట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, అబు హైదర్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం. -
టీమిండియాకు ఎదురుదెబ్బ
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మూడో టీ20లో డకౌటైంది. గత రెండు టీ20 మ్యాచ్‌లలో అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చిన మిథాలీ నేటి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టింది. తొలి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ మరిజాన్నే కాప్ ఇన్నింగ్స్ ఐదో బంతికి షాట్ ఆడగా ఫీల్డర్ లీ క్యాచ్ పట్టడంతో మిథాలీ నిరాశగా వెనుదిరిగింది. అంతకుముందు భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడో టీ20లో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మరోవైపు ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సేన నేటి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ నెగ్గాలని భావిస్తోంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. రెండు జట్లలో చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత జట్టులో రాధా యాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి వచ్చింది. కాగా, ప్రొటీస్ జట్టులో ఖాకా స్థానంలో క్లాస్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు సఫారీ టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. వాండరర్స్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ మొదలవనుండటం విశేషం. -
గెలిస్తే... సిరీస్ మనదే
-
గెలిస్తే... సిరీస్ మనదే
జొహన్నెస్‌బర్గ్: ఓవైపు పురుషుల జట్టు వన్డేల్లో సఫారీలను చితగ్గొట్టి సిరీస్ కొల్లగొడితే, మరోవైపు మహిళల జట్టూ అదే పని చేసింది. ఈసారి పురుషుల జట్టు టి20లు ఆడబోయే సమయానికి మహిళలు పొట్టి ఫార్మాట్లో సిరీస్ విజయానికి చేరువగా వచ్చారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు గెలిచి ఊపు మీదున్న హర్మన్‌ప్రీత్ బృందం... ఆదివారం మూడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. దీంట్లోనూ గెలుపొందితే దక్షిణాఫ్రికాలో వన్డే, టి20 సిరీస్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్రలో నిలుస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు వాండరర్స్ మైదానంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల జట్టు మ్యాచ్ మొదలవనుండటం విశేషం. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, మిథాలీ అద్భుత ఫామ్, బౌలింగ్‌లో స్పిన్నర్లు అనూజ, పూనమ్ రాణిస్తుండటంతో మన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాయంతో సిరీస్ నుంచి వైదొలగిన జులన్ గోస్వామి స్థానంలో రుమేలీ ధర్‌ను ఎంపిక చేశారు. -
మన ఆటకు ఎదురుందా!
కదనోత్సాహం... ఇప్పుడు ఉన్న జోరులో ప్రపంచంలో ఏ శక్తి తమను ఆపలేదన్నంతగా అంబరాన్ని తాకుతున్న ఆత్మవిశ్వాసం... అర్ధరాత్రి మైదానంలోకి పంపినా ప్రత్యర్థిని మళ్లీ చిత్తుగా ఓడించగలమన్న ధీమా. విరాట్ కోహ్లి సేన ప్రస్తుత మానసిక స్థితి ఇది. వన్డే సిరీస్‌లో ఘన విజయంతో ఊపు మీదున్న టీమిండియా పొట్టి ఫార్మాట్లో కూడా తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో తమ విజయయాత్ర ప్రారంభమైన వేదికపై మరో కొత్త చరిత్రను సృష్టించేందుకు ‘సై’ అంటోంది. మరోవైపు టి20ల్లోనైనా పరువు నిలబెట్టుకోవడం దక్షిణాఫ్రికా తక్షణ కర్తవ్యం. అయితే ఆసీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో డివిలియర్స్ మినహా ప్రధాన ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చిన ఆ జట్టు కూడా ఈ ఫార్మాట్లోనూ పెద్దగా ఆశలు పెట్టుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. జొహన్నెస్‌బర్గ్: టెస్టుల్లో అద్భుత ఆటతీరు కనబర్చినా దురదృష్టవశాత్తూ సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో మాత్రం ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20ల్లోనూ తమ స్థాయికి తగినట్లుగా సత్తా చాటితే సఫారీ టూర్ చిరస్మరణీయంగా నిలిచిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. రైనా వచ్చాడు... వన్డే సిరీస్ గెలిచిన జట్టునే దాదాపుగా ఇక్కడా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే టి20 సిరీస్ కోసమే ముగ్గురు ఆటగాళ్లు సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, జైదేవ్ ఉనాద్కట్ దక్షిణాఫ్రికాకు వచ్చారు. వీరిలో రైనాకు మాత్రం చోటు ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత అతను భారత్ తరఫున మ్యాచ్ ఆడబోతున్నాడు. రోహిత్, ధావన్, కోహ్లిలతో టాపార్డర్ తిరుగులేని విధంగా ఉంది. వన్డేల్లో పెవిలియన్‌కే పరిమితమైన మనీశ్ పాండేకు ఈ సారైనా అవకాశం లభిస్తుందా చూడాలి. ధోని టి20 మెరుపులు చూపించి చాలా కాలమైంది. వన్డేల్లో పెద్దగా అవకాశం లభించని అతను ఫినిషర్‌గా తనకున్న గుర్తింపును మళ్లీ ప్రదర్శించాలంటే ఈ ఫార్మాట్ సరైన వేదిక. పాండ్యా కూడా బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ పరంగా టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో సఫారీల పని పట్టిన నలుగురు మళ్లీ అదే తరహాలో ప్రత్యర్థిని చుట్టేయగల సమర్థులు. పేస్‌లో భువనేశ్వర్, బుమ్రా... స్పిన్‌లో చహల్, కుల్దీప్ల మంత్రం మళ్లీ పని చేస్తే ఈ సిరీస్ కూడా మన ఖాతాలో చేరుతుంది. ‘ఏబీ’పైనే భారం... వన్డేల్లో కుదేలైన దక్షిణాఫ్రికా మరో పెను సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. భారత్‌తో పోలిస్తే పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువ మందితోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. సఫారీ విజయావకాశాలన్నీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పైనే ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు వన్డేల్లో తన స్థాయిలో ఆడలేకపోయిన ఏబీ ఇప్పుడైనా చెలరేగడం అవసరం. కెప్టెన్ డుమిని, మిల్లర్లు సీనియర్లే అయినా వన్డేల్లో వైఫల్యం, స్పిన్నర్లను ఎదుర్కోలేని బలహీనత చూస్తే వీరిద్దరి నుంచి కూడా పెద్దగా ఆశించడానికి లేదు. మిగతా ఆటగాళ్లంతా దాదాపుగా కొత్తవారి కిందే లెక్క. తొలి టి20లో ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. ఆ జట్టు ఓపెనర్లలో హెన్డ్రిక్స్ 9 మ్యాచ్‌లే ఆడగా, స్మట్స్‌కు 6 మ్యాచ్‌ల అనుభవం మాతమ్రే ఉంది. ఈ సమీకరణాల నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో సఫారీలు ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, మనీశ్ పాండే/ దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్), హెన్డ్రిక్స్, జాన్ స్మట్స్, డివిలియర్స్, మిల్లర్/ బెహర్దీన్, క్లాసెన్, మోరిస్/జోంకర్, ఫెలుక్వాయో, జూనియర్ డాలా, డేన్ ప్యాటర్సన్, ఫాంగిసో. పిచ్, వాతావరణం వాండరర్స్ మైదానంలో మూడో టెస్టు గెలిచిన భారత్, వర్షం బారిన పడిన నాలుగో వన్డేలో ఓడింది. అయితే తాజా పిచ్ కూడా వన్డే మ్యాచ్ తరహాలోనే ఉంది. బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్, వేగవంత మైన అవుట్ ఫీల్డ్ కూడా కావడంతో పరుగుల వరద పారవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన ఉన్నా అడ్డంకి కాబోదు. ► 6 టి20ల్లో దక్షిణాఫ్రికాపై 6 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2 మాత్రమే ఓడింది. ► రెండు వేల పరుగుల మైలురాయికి కోహ్లి చేయాల్సిన పరుగులు 43 ► వాండరర్స్‌లోనే 2006లో తమ తొలి టి20 మ్యాచ్ ఆడి నెగ్గిన భారత్... ఏడాది తర్వాత ఇక్కడే ఫైనల్ గెలిచి తొలి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ► సా. గం. 6 నుంచి సోనీ టెన్–1లో ప్రత్యక్ష ప్రసారం -
క్యాచ్ పట్టి..జాక్‌పాట్ కొట్టాడు
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన హోరాహోరి టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురవగా.. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన ఓ అభిమానికి కాసుల వర్షం కురిసింది. ఇరు జట్లు 500పైగా పరుగులు నమోదు చేసి అభిమానులను హోరెత్తించగా.. రాస్ టేలర్ సిక్సర్ ఓ అభిమానికి ఏకంగా జాక్‌పాట్ తగిలేలా చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్లో టేలర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ బంతిని స్టాండ్స్‌లో నిల్చోన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్ అనే 20 ఏళ్ల యువకుడు ఒంటిచేత్తో పట్టేశాడు. ఈ క్యాచ్‌కు ముగ్ధులైన స్థానిక శీతల పానియాల కంపెనీ ఈ అభిమానికి రూ.24 లక్షలు( 50 వేల న్యూజిలాండ్ డాలర్లను) బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా స్టాండ్స్‌లోకి ఆటగాళ్లు కొట్టిన బంతుల్ని క్యాచులు అందుకోవటం అభిమానులకు ఎంతో సరదా. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ రకమైన వినోదం చూస్తూనే ఉంటాం. ఇలా తన సరదా కోసం ప్రయత్నిస్తే వెతుకొంటూ బహుమానం రావడంతో మిచెల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ‘నేను లెఫ్ట్ హ్యాండ్ కానప్పటికి ప్రయత్నించా. అనుకోకుండా బంతి నాకు చిక్కింది. అనంతరం అందరు నాపై పడ్డారు.’ అని విద్యార్థి అయిన మిచెల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిచినప్పటికి మిచెల్‌కు బహుమానం రావడంతో కివీస్ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ క్యాచ్‌పై రాస్ టేలర్ సైతం అతన్ని ప్రశంసిస్తూ గ్లోవ్స్, మ్యాచ్ బంతిని బహుమానంగా ప్రకటించాడు. Congratulations Mitch on a great catch and 50k 💰 Enjoy my gloves and the match ball… https://t.co/2F4G9sJaXz — Ross Taylor (@RossLTaylor) 16 February 2018 -
క్యాచ్ పట్టాడు.. జాక్‌పాట్ కొట్టాడు
-
తొలి టి20లో భారత్ ఘన విజయం
పోట్చెఫ్స్ట్రూమ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది. 48 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32, డు ప్రీజ్ 31 రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ 2 వికెట్లు తీసింది. శిఖా పాండే, వస్త్రకార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఆఫ్రిది డకౌట్.. అయినా భారీ విజయం
సెయింట్ మోర్టిజ్: ఐస్ క్రికెట్ టోర్నీలో వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించినా అతడి జట్టు ఓడిపోయింది. షాహిద్ ఆఫ్రిది డకౌటైనప్పటికీ అతడి టీమ్ గెలిచింది. సెయింట్ మోర్టిజ్ ఐస్ క్రికెట్ 2018లో భాగంగా గురువారం జరిగిన టి20 మ్యాచ్‌లో రాయల్స్ ఎలెవన్ చేతిలో ప్యాలెస్ డైమండ్స్ ఎలెవన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓపీ షా సునామీ ఇన్నింగ్స్‌తో 165 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ సునాయాసంగా ఛేదించింది. షా 34 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. 15.2 ఓవర్లలో రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కల్లిస్ 36, స్మిత్ 23 పరుగులు సాధించారు. డైమండ్స్ బౌలర్లలో రమేశ్ పొవార్ 2 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్, మలింగ చెరో వికెట్ తీశారు. సెహ్వాగ్ నాయకత్వంలోని డైమండ్స్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు సాధించింది. సెహ్వాగ్ చెలరేగి ఆడి అర్ధసెంచరీ బాదాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సిర్లతో 62 పరుగులు చేశాడు. సైమండ్స్ 40 పరుగులు పిండుకున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. రాయల్స్ బౌలర్లలో అబ్దుల్ రజాక్ 4, షోయబ్ అక్తర్ 2 వికెట్లు కూల్చారు. ఆఫ్రిది, మెక్కల్లమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
సెహ్వాగ్ చితకొట్టాడు
సెయింట్ మోర్టిజ్: రిటైర్ అయినా వీరూ పవర్ తగ్గలేదు. మామూలు మైదానంలో కాదు ఐస్ స్టేడియంలోనూ సెహ్వాగ్ చెలరేగుతున్నాడు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోర్టిజ్‌లో జరుగుతున్న ఐస్ టి20 టోర్ని ఆరంభ మ్యాచ్‌లో వీరూ సత్తా చాటాడు. షాహిద్ ఆఫ్రిది నాయకత్వంలోని రాయల్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ప్యాలెస్ డైమండ్స్ ఎలెవన్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సెహ్వాగ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు బాదాడు. సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. సైమండ్స్ 40 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన డైమండ్స్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 200 స్ట్రైక్ రేటుతో సెహ్వాగ్ విజృంభించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అతడి ఫొటోలు షేర్ చేసి, కామెంట్లు పెట్టారు. -
అందువల్లే భారత్ నెగ్గింది: రవిశాస్త్రి
సాక్షి, తిరువనంతపురం : భారీ వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన చివరి టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా సిరీస్‌నూ కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని టీమిండియా తాను కోచ్ అయ్యాక 2-1తో సిరీస్ సాధించడంపై రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హీరో బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడంటూ ప్రశంసల జల్లులు కురిపించారు. ప్రత్యర్థి జట్టుకు ఏ అవకాశాన్ని బుమ్రా ఇవ్వలేదన్నాడు. ’భారత్ ఇన్నింగ్స్ ముగిశాక.. ఆ స్కోరు కాపాడుకోగలమని భావించాం. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధ్యమైంది. ఒత్తిడి లేకుండా ఆడామని ఎవరైనా అంటే అది కచ్చితంగా అబద్ధం చెప్పినట్లే. ఇంత తక్కువ ఓవర్ల మ్యాచ్‌లలో 2-3 బంతుల్లోనే పరిస్థితులు మారిపోయే ఛాన్స్ ఉంది. వెనువెంటనే ఓపెనర్లు ఔటవ్వగా 65 పరుగులు చేస్తే చాలనుకున్నాం. ఆరంభంలో వేగంగా పరుగులు చేస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతంగా క్యాచ్‌లు పట్టడంతో పాటు పరుగులు నియంత్రించడంలో టీమిండియా సక్సెస్ కావడంతో ఒత్తిడిలోనూ కోహ్లి సేననే విజయం వరించింది. తొలిసారి కివీస్ పై టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందని ’ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. -
హీరోలా రిటైరయ్యాడు