రాష్ట్రం ముక్కలు కావడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శల్య సారధ్యం వహించారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
సాక్షి, తిరుపతి: రాష్ట్రం ముక్కలు కావడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శల్య సారధ్యం వహించారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. విభజనకు ప్రధాన పాత్రను పోషించిన కపట నాటక సూత్రధారి బాబేనని ఆరోపించారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలను చూసిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాజీనామా నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రెండు ప్రాంతాలవారికి సమాన న్యాయం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సూచనను సోనియా తుంగలోతొక్కారన్నారు. రాష్ట్రాన్ని చీల్చడం వల్ల జగన్‌మోహన్ రెడ్డి ప్రాబల్యం తగ్గించాలని తాపత్రయ పడుతున్నారని అయితే ఈ విషయాన్ని ప్రజలు సహించరని పేర్కొన్నారు.