నాగార్జునసాగర్‌న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల నుంచి బుధవారం కృష్ణమ్మదిగువకు ఉరకలేసింది. సాగర్ జలాశయం గేట్లు ఎత్తే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 585.40 అడుగుల నీరుంది. శ్రీశైలం నుంచి 4,48,550 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 6 గేట్లను పైకి ఎత్తారు. సాయంత్రం 4 గంటలకు 18 గేట్ల ద్వారా 1,41,264 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6.30 గంటలకు 20 గేట్ల ద్వారా, 8 గంటల సమయానికి 24 గేట్ల ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు నుంచి 1,91,413 క్యూసెక్కుల నీటిని బయటకు పంపిస్తున్నారు. కుడికాల్వకు 8007 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 8000 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 36642, ఎస్‌ఎల్‌బీసీ 1200, వరదకాల్వకు 305 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.