చిత్తూరు: ఎర్ర చందనం స్మగ్లర్లని చిత్తూరు జిల్లా పోలీసులు బుధవారం భారీ సంఖ్యలో అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ప్రధాన స్మగ్లర్లు కాగా 11 మంది వారి అనుచరులు, మరో 48 మంది కూలీలు ఉన్నారు. అరెస్టు చేసిన వారి నుంచి ఇన్నోవా, భారీ ట్రక్కు, స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, ఎస్టీమ్, ఏస్ వాహనాలతో పాటు రూ.2.50 లక్షల నగదు, 98 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్, ఓఎస్డీ రత్న వీటిని పరిశీలించారు. జిల్లాలోని చిత్తూరు, కల్లూరు, విజయపురం, పుత్తూరు, ఎస్‌ఆర్.పురం పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. తమిళనాడు నామక్కల్‌కు చెందిన బాలసుబ్రమణ్యం, కే.మణి, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పీ.ఉమర్ అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరి అనుచరులనూ అరెస్టు చేశారు.
చిత్తూరులో ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్
Published Thu, Apr 9 2015 2:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement