
సాక్షి, కడప : గత ప్రభుత్వాల హయాంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైయ్యాయని సీపీఎం నాయకులు రాఘవులు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన గత టీడీపీ ప్రభుత్వం వారికీ సహకరించిందని విమర్శించారు. దీన్ని ప్రశ్నించిన స్థానికులపై టీడీపీ నాయకులు కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు, డికెటి భూములు, దళితులకు పంపిణీ చేసిన భూములు ఆక్రమణకు గురయ్యాయని దుయ్యబట్టారు. జిల్లాలో జరిగిన భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భూములు దోపిడీకి గురైన ప్రాంతాల్లో పర్యటించామని, దీనిపై ఓ నివేదిక తయారు చేసి సీఎంకు అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment