'పద్మశ్రీ' ఎక్కడా వాడొద్దు: సుప్రీం | do not use padmasri any where, supreme court orders mohan babu | Sakshi
Sakshi News home page

'పద్మశ్రీ' ఎక్కడా వాడొద్దు: సుప్రీం

Published Fri, Apr 11 2014 12:44 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

'పద్మశ్రీ' ఎక్కడా వాడొద్దు: సుప్రీం - Sakshi

'పద్మశ్రీ' ఎక్కడా వాడొద్దు: సుప్రీం

సీనియర్ నటుడు మోహన్ బాబు 'పద్మశ్రీ' వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పద్మశ్రీ అవార్డు పేరును ఇంటి ముందు గానీ, నెంబరు ప్లేటు మీద గానీ, సినిమాల్లో గానీ ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించగా, వివాదం తర్వాత మోహన్ బాబు ఎక్కడా అలా ఉపయోగించడంలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అదే అంశాన్ని అఫిడవిట్ రూపంలో కూడా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక మీదట ఎక్కడా ఇంటి ముందు గానీ, సినిమాల్లో గానీ, నెంబరు ప్లేటు మీద గానీ వాడకూదని తెలిపింది. కేసు విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement