
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై విషం కక్కుతూ తప్పుడు కథనాలు రాస్తున్న ఓ వర్గం మీడియా బండారం మరోసారి బట్టబయలైంది. మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటు పట్ల నౌకాదళ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయంటూ పత్రికల్లో(సాక్షి కాదు) అసత్య కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో తామెలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదంటూ తూర్పు నౌకాదళం శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని స్పష్టం చేసింది. అయినా.. తాము అభ్యంతరం వ్యక్తం చేశామంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాయడం తగదని పేర్కొంది. కాగా, ఈ కథనాలపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.