విమానంలో ఖాళీ లేదని వదిలేశారు | Indian parvathi raju stranded in iraq | Sakshi
Sakshi News home page

విమానంలో ఖాళీ లేదని వదిలేశారు

Published Fri, Jul 11 2014 10:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

విమానంలో ఖాళీ లేదని వదిలేశారు

విమానంలో ఖాళీ లేదని వదిలేశారు

ఇరాక్ లో చిక్కుకుపోయిన పార్వతిరాజు

తణుకు: విమానంలో ఖాళీలేదని తనను ఇరాక్‌లోనే వదిలేశారంటూ త్యాజంపూడికి చెందిన గనసాల పార్వతిరాజు ఆవేదనగా చెప్పారు. ఇరాక్ నుంచి కొందరు యువకులు సొంతగడ్డకు చేరుకోగా తమ స్నేహితులు ఇంకా కొందరు అక్కడే ఉండిపోయారని చెప్పడంతో గురువారం రాత్రి విలేకరితో పార్వతిరాజు ఫోన్‌లో మాట్లాడారు. హాసన్ కంపెనీలో తనతోపాటు పనిచేసిన తెలుగువారంతా ఇండియా వచ్చేశారని, తనను మాత్రం పదిరోజుల నుంచి రేపు మాపు కాలం గడుపుతున్నారని వాపోయాడు.

 

తనతో పాటు చెన్నైకు చెందిన ముగ్గురు, కలకత్తావాసి ఒకరు, బీహార్‌వాసి ఒకరు ఇక్కడే ఉండిపోయారని, రోజు గడవడం కష్టంగా ఉందని కన్నీటిపర్యంతమయ్యా డు. తాను చూస్తుండగానే స్నేహితులు ఎక్కిన విమానం పైకి ఎగరడంతో బిగ్గరగా ఏడ్చానని తెలిపాడు.  ఒక పూటతిని ఒక పూట తినక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నానని, తనను కూడా ఇండియాకు తీసుకువెళ్లాలంటూ అభ్యర్థించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement