ఆంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్రాయల్ మండిపడ్డారు.
కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు
Published Sun, Aug 4 2013 6:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఆంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇజ్రాయల్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం స్థానిక పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ వద్ద వైద్య ఉద్యోగులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లిపోవాలని కేసీఆర్ చెప్పడం దుర్మార్గమని ఇజ్రాయల్ అన్నారు. రాజకీయ నాయకుల పదవీ కాంక్ష వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వానికి, పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఆచారి, ఉమాపతి, చిన్నంనాయుడు, డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజీనామా పంపించా.. కోలగట్ల
విజయనగరం ఫోర్ట్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఫ్యాక్స్ ద్వారా శాసనమండలి చైర్మన్‌కు పంపించినట్టు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అదే విధంగా ఆటోర్యాలీ కూడా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా‘ వద్దు వద్దు తెలంగాణ ఇవ్వద్దు’, ‘కేసీఆర్ ఖబడ్ధార్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కోలగట్ల మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు బొత్సప్రతిష్ఠను దెబ్బతీయాడానిక అనేక విమర్శలు చేస్తున్నారని చె ప్పారు. 2009లో కా్రంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వద ని తెలిసే టీఆర్‌ఎస్ టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ లు అభ్యంతరం చెప్పకపోవడం వల్లే తెలంగాణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
గందరగోళంగా ఆందోళన
కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న సమయంలోనే సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆందోళన చేపట్టడానికి టీడీపీ నాయకులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఆందోళన చేయకుండా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సమయంలో విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి.
Advertisement
Advertisement