చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు గ్రీన్‌కో ఎనర్జీ పవర్‌ప్లాంటు కార్మికులు చేస్తున్న ఆందోళనలకు యాజమాన్యం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. గురువారం జిల్లా లేబర్ అధికారి శంకరయ్య తన కార్యాలయంలో కార్మిక నాయకులకు, యాజమన్యంతో చర్చలు నిర్వహించారు.
ఈ మేరకు కార్మికులు ప్రభుత్వ చట్టం ప్రకారం వేతనాలను, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని చర్చల్లో ప్రధానాంశంగా పెట్టారు. నిబంధనల ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు యాజమాన్యం నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రస్తుతం ఎంత వేతనం ఇస్తున్నారు. ఇప్పడు ఎంత ఇవ్వాల్సి ఉందో ఖచ్చితంగా పేస్లిప్పులు సమగ్ర సమాచారం ఇవ్వాలని లేబర్ అధికారి యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. చర్చల్లో యాజమాన్యం నుంచి ప్రతినిధులు శేషగిరిరావు, సీతారామరాజు, హనుమంతరావు పాల్గొన్నారు.
పరిష్కారం అయ్యే వరకు దీక్షలు
కార్మికుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించాకే తాము విధుల్లోకి వెళతామని అప్పటి వరకు ఆమరణ దీక్షలు కొనసాగిస్తూనే ఉంటామని కార్మికులు, నాయకులు పొట్టిపాటి రాణాప్రతాప్‌రెడ్డి, పీసీసీ కిసాన్ సెల్ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బీఎంఎస్ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, రమణలు తెలిపారు.
కార్మిక నాయకులతో చర్చలు
Published Fri, Dec 13 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement