తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులపైనే తమ బాధ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్‌లోని వైఎస్ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఇత్తడి పాత్రలకు రిపేర్లు చేసి, కళాయి పనులతో నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు ప్రకృతి, సాగునీటి వనరుల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన నేపథ్యంలో రాష్ట్ర విభజన అంత సులభం కాదని అన్నారు.
ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై విభిన్న ప్రకటనలు చేస్తూ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. 60 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా ప్రజలను మోసగించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మొండి వైఖరి వల్ల రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని కోట్లాది మంది విద్యార్థులు చేతివృత్తులు చేసుకుని బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దుస్థితి కలగకూడదనే ఏకైక లక్ష్యంతో తమ పార్టీ పోరాడుతోందని వెల్లడిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లే విభజన ప్రక్రియకు కాంగ్రెస్ పెద్దలు ధైర్యం చేశారని తెలిపారు.
జగన్ ఫోబియాతోనే సీఎం సమైక్య నినాదం
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ, అభిమానాన్ని చూసి సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్య నినాదం ఆలపిస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చేసిన రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు రాజీనామాను ప్రయోగించకుండా ప్రజ లను మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణలో రాజ కీయ పార్టీల విధానాలు తెలుసుకునేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఆదికేశవరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ చెలికం కుసుమ, మాజీ జెడ్పీటీసీ వెంకటమునిరెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, మబ్బు నాదమునిరెడ్డి, మెడికల్ అసోసియేషన్ నాయకులు బీ.రాజేంద్రరెడ్డి, నాగేంద్ర, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాల కోసమే తపన
Published Mon, Sep 30 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement